సాక్షి,విశాఖ : ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాకిచ్చారు. మరో మూడు నెలల పాటు జీతాల విషయంలో కార్మికులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.
గురువారం ఉక్కు హౌస్‌లో కార్మిక సంఘాలతో కుమార స్వామి సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు గంటపాటు సాగింది. అయితే, ఈ సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. మరో మూడు నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుంది. కార్మికులు సహకరించాలి.. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీంతో ఆరు నెలలుగా జీతాలు అందక ఆందోళన బాట పట్టిన కార్మికులు కుమార స్వామి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరసన సెగ
స్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు.
ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment