Vizag Steel
-
ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాక్
సాక్షి,విశాఖ : ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాకిచ్చారు. మరో మూడు నెలల పాటు జీతాల విషయంలో కార్మికులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. గురువారం ఉక్కు హౌస్‌లో కార్మిక సంఘాలతో కుమార స్వామి సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు గంటపాటు సాగింది. అయితే, ఈ సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. మరో మూడు నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుంది. కార్మికులు సహకరించాలి.. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీంతో ఆరు నెలలుగా జీతాలు అందక ఆందోళన బాట పట్టిన కార్మికులు కుమార స్వామి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిరసన సెగస్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు.ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. -
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
వైజాగ్ స్టీల్‌కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్‌లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
సాక్షి,విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేసేందుకు విశాఖ స్టీల్ యాజమాన్యం సిద్ధమైంది. తొలగించే కాంట్రాక్టు ఉద్యోగుల్లో సగం మంది నిర్వాసితులే ఉన్నారు. రేపటి నుంచి ఆన్ లైన్ పంచ్ స్టీల్ యాజమాన్యం నిలిపివేయనుంది.ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులు తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ నిల బెట్టుకోవాలి. నాయకులు చెప్పే మాటలకు స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు’’ అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
ప్రైవేటీకరణకు ‘కూటమి’ కుట్ర!
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఇతోధిక సహకారం అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రూ.2 వేల కోట్ల విలువైన ఐరన్ కొనుగోలుకు చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తోంది. కొనుగోలు చేసిన ఐరన్‌ను పేదల ఇళ్ల నిర్మాణాలకు వినియోగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం మేరకు ఆ నిధులు సమకూరితే.. స్టీల్ ప్లాంట్‌లో మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ను ప్రారంభించి నిరంతరాయంగా ఉక్కు ఉత్పిత్తి చేసే అవకాశం కలుగుతుందని కార్మిక, ఉద్యోగ సంఘాలు భావించాయి. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అమలు చేయాలని కోరుతూ విశాఖ ప్రజాప్రతినిధులకు సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ విజ్ఞప్తులను చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో కీలక నిర్ణయం ఉక్కు పరిశ్రమ విస్తరణ కోసం చేసిన అప్పుల కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన స్టీల్‌ప్లాంట్‌కు రూ.12,500 కోట్ల మూలధనం అవసరముంది. అంత స్థాయిలో కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈ క్రమంలో ప్లాంట్ నిర్వహణ మరింత భారంగా మారింది. దీనిపై కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్లకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి చేసే ఐరన్ వినియోగించాలని, దీనికోసం ముందుగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. వెంటనే అప్పటి ఎంపీ ఎంవీవీ ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన అప్పటి సీఎం జగన్ పేదల కోసం పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో వాటికి విశాఖ స్టీల్‌ను వినియోగించాలని నిర్ణయించారు. దీనిపై పరిశ్రమల శాఖ అధికారులతో కమిటీని నియమించారు. సదరు కమిటీ 2023 ఆగస్టులో స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి ఉన్నతాధికారులతో చర్చించింది. అనంతరం ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్లు ఇచ్చేలా అధికారుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 6 నెలల తరువాత నుంచి ఐరన్ తీసుకునే విధంగా ఆ నివేదిక ప్రభుత్వానికి సమరి్పంచింది. ఇంతలో ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. పట్టించుకోని కూటమి ప్రభుత్వంగత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తే స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అంశంపై ఇప్పటికే ఉక్కు పరిరక్షణ కమిటీ, కారి్మక, ఉద్యోగ సంఘాల నాయకులు గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమే‹Ùబాబుకు వినతిపత్రాలు అందించారు. పేదల ఇళ్లతోపాటు అమరావతి, పోలవరం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు విశాఖ ఉక్కును వినియోగించాలని, అందుకు అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు ప్లాంట్‌కు ఇవ్వాలని కోరినా ఫలితం లేదు. కార్మిక సంఘాల నేతలు నెల రోజులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకపోయింది.కాగా.. స్టీల్‌ప్లాంట్‌లో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేసినా, పరిశ్రమల ఆస్తులను వేలం ద్వారా విక్రయించడానికి సిద్ధపడినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ.. మోదీపై కనీసం ఒత్తిడి తీసుకురాకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. కేంద్రంతో లాలూచీ పడి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా
సాక్షి, విశాఖ : విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉదృతమవుతుంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మికులు. ఎన్నికల ముందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్లాంట్‌ను కాపాడుకునేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖలి పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రంవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇదీ చదవండి : వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న మోదీ -
మూసివేత దిశగా స్టీల్ ప్లాంట్.
-
గద్దర్ ప్రధాన పాత్రలో వస్తోన్న 'ఉక్కు సత్యాగ్రహం'
సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జనం ఎంటర్టైన్మెంట్పై రూపొందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. (ఇది చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ..'విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధన కోసం గతంలో జరిగిన పోరాటం, ప్రస్తుతం పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించాం. వాస్తవానికి దగ్గరగా యువతరాన్ని ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. త్వరలో వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఉక్కు సత్యాగ్రహం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం.' అని అన్నారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి శ్రీ కోటి సంగీతమందించారు. (ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!) -
యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్‌మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది. -
వైజాగ్ స్టీల్ వినూత్న ప్రతిపాదన..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్ – వైజాగ్ స్టీల్) నిధుల సమీకరణ కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమకు నిర్వహణ మూలధనం లేదా ముడి సరుకును సమకూర్చే కంపెనీలకు ప్రతిగా ఫినిష్డ్ ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసే వినూత్న ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చింది. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దీనికి సుముఖంగా ఉన్న ఉక్కు, ఉక్కు సంబంధ ముడి వస్తువుల వ్యాపారం చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాలని ఆహ్వానించింది. కోకింగ్ కోల్, ఇనుప ఖనిజం మొదలైన వాటిని సరఫరా చేయడం లేదా నిర్వహణ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చని ఒక నోటీసులో ఆర్ఐఎన్ఎల్ తెలిపింది. దానికి బదులుగా పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను పొందవచ్చని వివరించింది. ఈవోఐల దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. -
వైజాగ్ స్టీల్ విలువ నిర్ధారణకు సై
న్యూఢిల్లీ: ప్రైవేటైజేషన్ బాటలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్) విలువ నిర్ధారణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఐబీబీఐలో రిజిస్టరైన సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్) ఆస్తుల విలువ మదింపునకు తెరతీసింది. ఈ ఏడాది జనవరి 27న వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందస్తు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వెరసి అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీలలో వాటాలు సహా వైజాగ్ స్టీల్ అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీఎస్‌యూ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీలను నిర్వహించే దీపమ్.. ఈ నెల 11న ప్రతిపాదనల ఆహ్వానాన్ని(ఆర్ఎఫ్పీ) ప్రకటించింది. తద్వారా దివాలా, రుణ ఎగవేతల దేశీ బోర్డు(ఐబీబీఐ)లో రిజిస్టరైన కంపెనీల నుంచి బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. బిడ్స్ దాఖలుకు ఏప్రిల్ 4 వరకూ గడువిచ్చింది. వేల్యుయర్‌గా ఎంపికయ్యే సంస్థ ఆర్ఐఎన్ఎల్ విలువ మదింపుతోపాటు కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయంలోనూ ప్రభుత్వానికి సహకరించవలసి ఉంటుంది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థలలో వాటాల విలువసహా.. ప్లాంటు, మెషీనరీ, భూములు, భవనాలు, ఫర్నీచర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలను మదింపు చేయవలసి ఉంటుంది. -
స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 17,980 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరాలను ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నుల నుంచి 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
వైజాగ్ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్)పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్ఎస్ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్ఎస్ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్ఎస్ గురువారం ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఇటీవల తెలిపారు. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. -
వైజాగ్ స్టీల్ ’అడ్వైజర్ల’ బిడ్డింగ్‌కు గడువు పొడిగింపు
ఉక్కునగరం (గాజువాక): వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన లావాదేవీ సలహాదారుల (అడ్వైజర్లు) బిడ్డింగ్‌కు గడువును ఆగస్టు 26 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి జూలై 28కి గడువు ముగియాల్సి ఉండగా దాన్ని తర్వాత ఆగస్టు 17కి, అటుపైన తాజాగా ఆగస్టు 26కి పొడిగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాల విక్రయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లావాదేవీ సలహాదారుల నియామకం కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) జూలై 7న బిడ్లు (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. -
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన : అవంతి శ్రీనివాస్
-
స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలి : విజయసాయిరెడ్డి
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు
విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21లో రూ.18 వేల కోట్లు టర్నోవర్ సాధించింది. స్టీల్‌ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం. గురువారం స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్ గత ఏడాది ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. 2020 డిసెంబర్ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్–19 సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.కె.ఘోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) కె.వి.ఎన్. రెడ్డి పాల్గొన్నారు. -
వైజాగ్ స్టీల్‌తో పోస్కో జట్టు!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్టీల్ దిగ్గజం పోస్కో మరోసారి భారత్ మార్కెట్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలను మమ్మరం చేసింది. ప్రభుత్వరంగంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్/వైజాగ్ స్టీల్)తో జాయింట్ వెంచర్ కోసం సుముఖంగా ఉంది. గత వారం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతో పోస్కో అధికారి ఒకరు భేటీ అయి జాయింట్ వెంచర్ ప్రణాళికలపై చర్చించడం కూడా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వైజాగ్ స్టీల్‌ను సందర్శించినట్టు సమాచారం. విలువ ఆధారిత స్పెషల్ గ్రేడ్ స్టీల్ ఉత్పత్తుల కోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలసి సంయుక్తంగా విశాఖలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నది పోస్కో ఆలోచన. గతంలో ఒడిశాలోని జగత్సింగ్పూర్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేసింది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. -
వైజాగ్ స్టీల్ ఆదాయ లక్ష్యం రూ.18,000కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో సెయిల్ తర్వాత రెండో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.18,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆదివారంనాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ సీఎండీ పి.మధుసూదన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ స్టీల్ రూ.16,625 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇక, గడిచిన ఆర్థిక సంవత్సరంలో విక్రయించతగిన స్టీల్ ఉత్పత్తి 4.5 మిలియన్ టన్నులుగా ఉండగా, దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.7 మిలియన్ టన్నుల స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్టు మధుసూదన్ తెలిపారు. -
క్యూ4లో అదరగొడతాం..
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్–ఆర్ఐఎన్ఎల్) గత ఏడాది ఏప్రిల్– డిసెంబర్ కాలానికి టర్నోవర్‌తో సహా పలు అంశాల్లో మంచి వృద్ధిని సాధించింది. ఈ కాలంలో రూ.11,405 కోట్ల టర్నోవర్ సాధించామని, అంతకు ముందటేడాది ఇదే కాలంలో సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే ఇది 30 శాతం అధికమని ఆర్ఐఎన్ఎల్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికం) రికార్డ్ స్థాయి పనితీరు సాధించనున్నామని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.మధుసూదన్ చెప్పారు. 16 శాతం పెరిగిన శ్రామిక ఉత్పాదకత...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో హాట్ మెటల్ ఉత్పత్తి 13 శాతం వృద్ధితో 3.65 మిలియన్ టన్నులకు, లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 15 శాతం వృద్ధితో 3.54 మిలియన్ టన్నులకు పెరిగాయని మధుసూదన్ తెలియజేశారు. విక్రయించదగ్గ ఉక్కు ఉత్పత్తి 15 శాతం వృద్ధితో 3.19 మిలియన్ టన్నులకు పెరిగిందని, శ్రామిక ఉత్పాదకత 16 శాతం వృద్ధి చెందిందని వివరించారు. గత ఏడాదిలో విస్తరణ, ఆధునికీకరణ పూర్తయ్యాయని, ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు పెంచామని పేర్కొన్నారు. ఆదాయం మెరుగుపరచుకోవడానికి అమ్మకాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. మరింత మార్కెట్ కోసం ప్రత్యేక వ్యూహాలు...: స్థూల మార్జిన్‌ను సాధించామని, గత రెండు నెలల్లో ఎలాంటి రుణాలు చేయలేదని, ఫలితంగా ఈ క్యూ4లో మంచి పనితీరు కనబరచనున్నామన్న ధీమాను మధుసూదన్ వ్యక్తం చేశారు. విలువ జోడించే ఉక్కు ఉత్పత్తులకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోందని, ఉత్పత్తిలో కొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రత్యేక ఉక్కు ఉత్పత్తుల సెగ్మెంట్లో మార్కెట్ వాటా పెంచుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేశామని తెలిపారు. -
‘ఉక్కు’లో ఉద్యోగ సంక్షోభం
►విస్తరణతో ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా పెంపు ►అందుకు తగినట్లు ఉద్యోగ నియామకాలు లేవు ►ప్రారంభంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యే ఇప్పటికీ కొనసాగింపు ►మరోవైపు సీనియర్లు, నిపుణుల పదవీ విరమణ ఉన్న సిబ్బందికి పెరుగుతున్న పనిభారం రాష్ట్రంలోనే అతి పెద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్. అయితే ఏం లాభం.. పేరుకు పెద్దే గానీ.. ఇప్పటికీ సొంత గనులు సమ కూర్చుకోలేని దుస్థితి.. మరోవైపు విస్తరణ ప్రాజెక్టులతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతున్నా, అందుకు తగినట్లు శాశ్వత ఉద్యోగులను నియమించకపోవడంతో నిపుణులు, అనుభవజ్ఞుల కొరత.. ఈ పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన రేపుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకు పైగా పెరిగినా.. ప్రారంభంలో ఉన్న సిబ్బంది సంఖ్యే దాదాపు ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు సీనియర్లు పదవీ విరమణ చేస్తుండటం, మరణిస్తుండటంతో నిపుణుల కొరత ఎదురవుతోంది. ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సిబ్బంది కొరత నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. విస్తరణతో ఉత్పత్తి సామర్ద్యం రెండింతలు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న సిబ్బందికి పని భారం పెరిగింది. ఫలితంగా కొత్త విభా గాలను పూర్తిస్ధాయిలో నిర్వహించలేకపోతున్నారు. 1992లో స్టీల్‌ప్లాంట్‌ను అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 2000–01లో పూర్తి ఉత్పత్తి సామర్థ్యం(మూడు మిలియన్ టన్నులు) సాధించే నాటికి ప్లాంట్‌లో 17,454 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. వారిలో సీనియర్ అధికారులు 2,832 మంది, జూనియర్ అధికారులు 1,195 మంది కాగా కార్మికులు 13,104 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెరిగినా.. ఉద్యోగుల సంఖ్య మాత్రం దాదాపు అంతే ఉంది, ఉత్పత్తి పెంపుపైనే శ్రద్ధ ప్రారంభంలో మూడు మిలియన్ టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచడానికి 2005లో అనుమతి లభించింది. అదే సమయంలో మూడువేల మంది కొత్త ఉత్యోగులను పెంచడానికే కేంద్రం అనుమతినిచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అనంతరం చేపట్టిన ఆధునికీకరణ పనులతో ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం ప్రారంభంలో ఉన్న 17,454 నుంచి 17,875కు మాత్రమే పెరిగింది. అంటే పెరిగిన ఉద్యోగుల సంఖ్య 744 మాత్రమే. ఉద్యోగులు పెరగకపోవడంతో పాత యూనిట్ల నుంచి కొత్త యూనిట్లకు ఉద్యోగులను బదిలీ చేశారు. ఫలితంగా యూనిట్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. స్పెషల్ బార్ మిల్, స్ట్రక్చరల్ మిల్, వైర్ రాడ్ మిల్–2 వంటి విభాగాల్లో అరకొరగా సిబ్బంది ఉండటంతో మూడు షిఫ్ట్‌లలో పని చేయించలేకపోతున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. పదవీ విరమణలతో మరింత కొరత పెరిగిన ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా 20 వేల మంది శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించినప్పటికి యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట ్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి నెలా కనీసం 20 మంది పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు 10 మంది మరణిస్తున్నారు. వీటన్నిం టి వల్ల సీనియర్ ఉద్యోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది. కాగా 2022 నాటికి సుమారు 4,600 మంది మొదటితరం ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ప్లాంట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్
వైజాగ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలంపిక్ రజత పతక విజేత పీవీ సింధు మరో ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్ సంస్థ , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైంది. బేస్‌లైన్ వెంచర్స్, డైరెక్టర్ , మరియు సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ ఈ ఒప్పంద వివరాలు వెల్లడించారు. దీంతో వైజాగ్ స్టీల్ అథ్లెట్ రంగంలో ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు. దీని ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరియు దేశీయ పోటీలలో సింధు ఆడే సమయంలో ఆమె జెర్సీ మీద కంపెనీ బ్రాండ్ లోగో ఉండనుందని తెలిపారు. సింధు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 ర్యాంక్ ఆటగాళ్ళ మధ్య రియో ఒక ఒలింపిక్ రజత పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది తనకు అత్యంత ముఖ్యమైన ఎండార్స్మెంట్ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ క్యాలెండర్ లో నెలకు కనీసం మూడు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్స్ కు విస్తరించిన నేపథ్యంలో ర్యాంకింగ్స్ మెరుగుకు ఆర్ఐఎన్ఎల్ విశ్వసనీయ బ్రాండ్ అనిసంతోసం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తన ఆట మీద దృష్టికి సహాయపడుతుందిని పేర్కొంది. సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులు అని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి మధుసూదన్ చెప్పారు . తాజా బాండ్ వారికి, దేశానికి గర్వకారణమన్నారు. -
పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్
-
అన్నదాత.. విజేత
ఆగిన నీటి తరలింపు నిర్ణయం రైతులు, వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితం ఇది తాండవ రైతుల విజయం.. వైఎస్సార్ సీపీ నేత ఉమాశంకర్ గణేశ్ రిలే దీక్షల నిర్ణయం విరమణ నాతవరం: తాండవ రిజర్వాయర్ నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ మేరకు తాండవ నీటిని ఏలేరు కాలువలోకి తరలించడానికి లక్ష్మీపురం వద్ద తీసిన కాలువలను అధికారులు తిరిగి కప్పేశారు. కాలువలు కప్పేసిన ప్రాంతాన్ని ైవైఎస్సార్సీపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేశ్, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జెమీలు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, నీటి తరలింపుకోసం తీసిన కాలువలు తిరిగి కప్పేశారంటే ప్రభుత్వం నీటి తరలింపును విరమించుకున్నట్టేనని.. ఇది తాండవ రైతుల విజయమని చెప్పారు. ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల రైతులు వైఎస్సార్సీపీ నాయకుల వద్దకు వచ్చి కృతజ‘తలు తెలిపారు. మొదట్లో అధికారుల హడావుడి చూసి ప్రభుత్వం తాండవ నీటిని విశాఖకు తరలించుకుపోతుందని ఆందోళన చెందామన్నారు. కేవలం వైఎస్సార్సీపీ రైతులు పక్షాన నిలిచిపోరాటం చేయడం వల్లే నీటి తరలింపును విరమించుకున్నారన్నారు. అనంతరం గణేశ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తాండవ నీటిని విశాఖకు తరలిస్తామని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఈనెల 12న విశాఖలో ప్రకటన చేసిన మరునాడే ఈ ప్రాంతాన్ని పరీశీలించి ఒక చుక్క తాండవ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించినా అడ్డుకుంటామని హెచ్చరించామని గుర్తుచేశారు. త ర్వాత రైతులతో కలిసి ఈనెల 13 నుంచి వివిధ రకాల ఆందోళనలు చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చామన్నారు. తాండవ నీరు రానున్న కాలంలో రైతుల సాగుకు తప్ప ఏ ఇతర అవసరాలకు తరలించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయరాదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే స్వప్రయోజనాలు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. జెమీలు మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసే తాండవ నీటి తరలింపు ఆలోచన జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరమే ఇక్కడి అధికారులు కాలువ పనులు చేపట్టారని, ఇలాంటి నీచ రాజకీయాలు మంచిదికాదని సూచించారు. రిలే నిరాహార దీక్షలు విర మణ తాండవ నీటి తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23 నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో కలిసి చేయ తలపెట్టిన రిలే నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్టు గణేశ్ తెలిపారు. ఇక్కడ తీసిన కాలువలు మూసేయడంతో తాండవ నీటి తరలింపును ప్రభుత్వం విరమించుకున్నట్టేనన్నారు. వైఎస్సార్సీపీ 10 రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచిన రైతులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు పైల సునీల్, చిటికిల వెంకటరమణ, శెట్టి నూకరాజు, పైత పోతురాజు, నర్సీపట్నం మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్ లాలం లోవ తదితరులు పాల్గొన్నారు. తరలింపు ఆగినట్టే.. డీఈ ఈ విషయంపై తాండవ జలాశయం డీఈ చిన్నంనాయుడును ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా నీటి తరలింపు ఆగినట్టేనని స్పష్టంచేశారు. రైతుల ఆందోళన, నీరు ఇవ్వరాదని తాండవ జలాశయం కమిటీ సభ్యుల తీర్మానం నివేదికను జిల్లా కలెక్టర్, ఇరిగే షన్ ఎస్ఈకి నివేదించామన్నారు. తాండవ నీరు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలులేదంటా రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్వయంగా చెప్పారని తె లిపారు. కాగా, తాండవ నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆందోళన తీవ్రతరం చేయడం, నిరశన దీక్షలకు పూనుకోవడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిసింది.