
సాక్షి, విశాఖ : ఉక్కు పోరాట కమిటీ నేతలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ప్లాంట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పోరాట కమిటీ నేత అయోధ్యరామ్‌కు నోటీసులు అందించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.