న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో సెయిల్ తర్వాత రెండో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.18,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆదివారంనాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ సీఎండీ పి.మధుసూదన్ తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ స్టీల్ రూ.16,625 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఇక, గడిచిన ఆర్థిక సంవత్సరంలో విక్రయించతగిన స్టీల్ ఉత్పత్తి 4.5 మిలియన్ టన్నులుగా ఉండగా, దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.7 మిలియన్ టన్నుల స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్టు మధుసూదన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment