
కోలీవుడ్‌లో సెన్సేషనల్ చిత్రంగా నిలిచిన సినిమా 'ఫైర్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో రచిత మహాలక్ష్మి గ్లామర్ డోస్ పెంచడంతో ఈ చిత్రం పేరు నెట్టింట వైరల్ అయింది. 'ఫైర్' చిత్రంలోని ఒక పాటలో ఆమె మితిమీరిన రొమాన్స్ సీన్లతో అదరగొట్టేసింది. ఇంకేముంది ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేశాయి. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమెకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో రచిత నటించిన తాజా చిత్రం 'ఫైర్' ఫిబ్రవరి 14న విడుదల అయింది.

'ఫైర్' చిత్రంలో బాలాజీ మురుగదాస్, చాందిని తమిళరసన్, రచిత మహాలక్ష్మి, సాక్షి అగర్వాల్ నటించారు. జెఎస్‌కే సతీష్ కుమార్ దర్శకత్వం వహించారు. క్రైమ్,థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కాస్త ఫర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. మార్చి 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. అయితే, తమిళ్‌లో పాపులర్ అయిన టెంట్‌కొట్టా (Tentkotta)లో స్ట్రీమింగ్ కానుంది. రచిత మహాలక్ష్మి ఇచ్చిన గ్లామర్ ట్రీట్‌కు భారీ ధరను చెల్లించి ఫైర్ చిత్రాన్ని ఆ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో టెంట్‌కొట్టా ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కూడా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

తెలుగులో రచిత
తెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్‌లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment