'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల | Erracheera Movie Song Out Now | Sakshi
Sakshi News home page

'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

Published Sat, Nov 23 2024 7:04 PM | Last Updated on Sat, Nov 23 2024 7:04 PM

Erracheera Movie Song Out Now

'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్‌  రిలీజ్ చేశారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాకు మరింత బజ్‌ను క్రియేట్‌ చేయనుంది.

ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్  మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండటంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న 'ఎర్రచీర - ది బిగినింగ్' చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement