కోలీవుడ్ సోషల్‌మీడియాలో రచిత మహాలక్ష్మి పేరు భారీగా వైరల్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ సీరియల్స్‌లో బాగా గుర్తింపు ఉన్న ఆమె తాజాగా 'ఫైర్' అనే కోలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అయితే, ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా మళ్లీ అదే పాటను వీడియో వర్షన్‌లో ప్రోమో విడుదల చేశారు. ఇందులో కన్నడ బ్యూటీ రచిత మరింత గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మితిమీరిన గ్లామర్ సన్నివేశాల్లో ఆమె నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఫైర్ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పూర్తి సాంగ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని కామెంట్లు చేస్తున్నారు.
సీరియల్ బ్యూటీస్.. సినిమాల్లోకి రావడం కొత్తేం కాదు. తెలుగు లేదంటే తమిళం ఇలా ఏ భాషలో తీసుకున్నా సరే మూవీస్‌లో వీళ్లకు సహాయ పాత్రలు మాత్రమే దక్కుతుంటాయి. కానీ ప్రధాన పాత్రల్లో నటించే ఛాన్సులు దక్కేది చాలా తక్కువ. అలా ఇప్పుడు సీరియల్ కమ్ తమిళ్ బిగ్‌బాస్ బ్యూటీ.. సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. తమిళ్‌లో 'శరవణన్ మీనాక్షి' సీరియల్ ద్వారా నటి రచిత మహాలక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో రచిత
తెలుగులో 2013-2016 సమయంలో టెలికాస్ట్ అయిన స్వాతి చినుకులు సీరియల్‌లో నీలా పాత్రలో ఆమె నటించింది. 2020లో చిట్టితల్లి అనే సిరీయల్లో శకుంతల పాత్రలో మెప్పించింది. అయితే, ఆమె నటించిన కొత్త సినిమా తెలుగులో జనవరి 24న విడుదలైంది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు.
భర్తతో దూరం
పిరివం సంతిప్పమ్ అనే తమిళ సీరియల్‌లో దినేశ్ కార్తీక్, రచిత మహాలక్ష్మి జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లు ఆఫ్ స్క్రీన్‌లోనూ ప్రేమలో పడ్డారు. దీంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే నటుడు దినేశ్ మాత్రం ఎప్పటికైనా గొడవలు సద్దుమణిగి కలిసుంటామని ఆశిస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి వారిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment