సాక్షి, విశాఖ : విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉదృతమవుతుంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మికులు. ఎన్నికల ముందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్లాంట్‌ను కాపాడుకునేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖలి పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు.
ఇదీ చదవండి : వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న మోదీ
Comments
Please login to add a commentAdd a comment