privatization
-
‘ప్రైవేట్’ నోట.. ‘డీమ్డ్’ పాట!
సాక్షి, అమరావతి: ప్రతిభ ఆధారంగా నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు దక్కే ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ, ఎండీఎస్ సీట్లకు గండికొడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) బాట పట్టడానికి పోటీపడుతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలకు అనుకూలమైన పార్టీ టీడీపీ అధికారంలో ఉండటంతో ఇదే అనువైన సమయంగా భావించిన యాజమాన్యాలు స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు సీఎం అయ్యాక యూజీసీ నుంచి డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తుల తాకిడి పెరిగింది. అపోలో, కిమ్స్, జీఎస్ఎల్, జెమ్స్, మరికొన్ని వైద్య కళాశాలల యజమానులు ఎన్ఓసీ కోరినట్లు తెలుస్తోంది. విశాఖలోని హోమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ పీజీ సీట్లున్నాయి. ఈ సంస్థ సైతం ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నుంచి బయటపడి, వేరే రాష్ట్రంలోని మాతృ సంస్థ అఫిలియేషన్ కింద పనిచేయడానికి ఎన్ఓసీ కోరింది.ఎంబీబీఎస్, పీజీ కోర్సుల ఫీజుల్లో వ్యత్యాసం ఇలా..ప్రస్తుతం ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు కన్వీనర్ 16,500బీ కేటగిరి 13,20,000ప్రస్తుతం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ ఫీజులుకన్వీనర్4,96,800బీ కేటగిరి 9,93,600ఎన్ఓసీ ఇవ్వాలంటే చట్ట సవరణ చేయాల్సిందేడీమ్డ్ బాట పట్టేందుకు కళాశాలలు పెట్టుకున్న ఎన్ఓసీ దరఖాస్తులపై సీఎం చంద్రబాబు స్థాయిలో కొద్ది రోజుల క్రితం చర్చలు నడిచినట్టు తెలిసింది. ఎన్ఓసీ ఇవ్వడానికి సా«ధ్యాసాధ్యాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చట్టం 1986లోని సెక్షన్6 ప్రకారం రాష్ట్రంలోని వైద్య కళాశాలలు ఇతర యూనివర్సిటీల కింద పనిచేయడానికి వీల్లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలన్నీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టం చెబుతోంది. ఎన్ఓసీ మంజూరు అంశంపై ప్రభుత్వం న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరగా.. ఏ ఒక్కరికి ఎన్ఓసీ ఇవ్వాలన్నా వర్సిటీ చట్టానికి సవరణ తప్పనిసరని సూచించినట్టు తెలిసింది. కాగా, 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడైన విశాఖ ఎంపీ భరత్ కుటుంబానికి చెందిన ‘గీతం’ సంస్థ డీమ్డ్ హోదా దక్కించుకుంది. అధికారం అండతో అడ్డదారుల్లో వైద్య కళాశాలలకు డీమ్డ్ హోదా సాధించుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అదే తరహాలోనే ఇప్పుడు కూడా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దల అస్మదీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.చెప్పిందే ఫీజు.. పెట్టిందే నిబంధనరాష్ట్రంలోని గీతం మినహా మిగిలిన ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ హెల్త్ వర్సిటీ చట్టం ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్, 35 శాతం బీ కేటగిరీ, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. సీట్లన్నింటినీ ఆరోగ్య విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తోంది. మొత్తం సీట్లలో 50 శాతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే అవకాశం ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కళాశాలల్లో ఫీజులు ఉంటున్నాయి. అడ్మిషన్లతో పాటు, పరీక్షలను వర్సిటీయే నిర్వహిస్తోంది. అదే డీమ్డ్ హోదా వస్తే ఆయా కళాశాలలపై హెల్త్ వర్సిటీ అజమాయిషీ ఉండదు. వారు చెప్పిందే ఫీజు, పెట్టిందే నిబంధనగా మారిపోతుంది. ఎంబీబీఎస్, పీజీ సీట్లన్నీ యాజమాన్య కోటాగా మారిపోతాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలన్నింటినీ జాతీయ ర్యాంకుల ఆధారంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డీజీహెచ్ఎస్, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తాయి. స్థానిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి రిజర్వేషన్లు ఉండవు. దీంతో మన విద్యార్థులు పెద్దఎత్తున సీట్లను నష్టపోతారు. మన విద్యార్థులకు తీరని నష్టం..నిజానికి.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయంతో డాక్టర్ కావాలన్న మన విద్యార్థుల కలలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 17 కళాశాలల్లో ఐదింటిని 2023–24 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. మిగిలిన కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలన్న పక్కా వ్యూహంతో రెండు, మూడు దశల్లోని పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కళాశాలల నిర్మాణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. వాస్తవానికి.. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా ప్రభుత్వం వద్దని లేఖ రాసి విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. ఇలా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికితోడు.. ప్రస్తుతమున్న ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్డ్ హోదా సాధించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
నమ్మొద్దు బాబో... నంగనాచి కూటమిని!
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కూటమి (డబల్ ఇంజన్) మాటలకు, చేతలకు మధ్య ఏమీ సంబంధ ముండదు. పార్లమెంటులో, అసెంబ్లీల్లో ఒకటి మాటాడతారు, ఇంకొకటి చట్టం చేస్తారు. ఒకో నాయకుడు ఒకో వ్యాఖ్యానం చేస్తాడు. ఒకరు ఎవరి మీదనో ఏదో ఆరోపణ చేస్తారు. మరొకరు ఆ ఆరోపణను సంశయించేట్టు మాటాడతారు. వీరే ఇలా ఉంటే వీరి తెర వెనక దర్శకులు వేరే ఏదో మాటాడతారు. గందరగోళం శృష్టించడం, జనాలను అయోమయంలో పడేయడంలో కూట మిలో జాతీయ, రాష్ట్రీయ గురువులే కాక విశ్వ గురువులూ ఉన్నారు. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల కోట్లు సహాయం అంటుంది కేంద్రం. డబల్ ఇంజన్లో భాగంగా రాష్ట్ర పాలకులు ‘మాది ఉక్కు సంకల్పం’ అంటా వంత పాట ఎత్తుకున్నారు. ‘కూటమి ఘన చర్య ఇది’ ఆనంటూ పాత పాలకుల వలననే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల పాలయిందని రాజ కీయ రాగం తీస్తున్నారు. నిజానికి ఇపుడు ప్రక టించిన ఈ ఆర్థిక సహాయం విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ఒడ్డెక్కించే సహాయమేనా? సొంత గనులు లేకపోవడం, ఉత్పత్తికి తగిన మార్కెట్ సదుపాయం లేకపోవడం, పెట్టుబడుల లోపం వంటి ప్రధాన అంశాలు కారణాలు. వీటిని సమకూర్చని పాలకులే ప్రస్తుత పరిస్థితికి అసలు కారకులు. ఏమాత్రం విచక్షణతో ఆలోచించినా ఈ కారణాలు తెలుస్తాయి. ఒకవేళ ఆలోచ నకు అందకపోయినా... ఆ కర్మాగార కార్మికులు వందలాది రోజులుగా ఉద్యమం చేస్తూ, విగ్యా పన పత్రాలిస్తూ, కడుపు కాల్చుకొని దీక్షలు చేస్తూ ఘోషిస్తున్నారు. ఆ ఘోష వింటే అర్థమౌతుంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ తప్పనిసరి పరిస్థితుల్లో... ఆర్థిక పెనుభారం నుండి కాపాడ టానికి తీసుకున్న చర్యగా సమర్థించుకోడానికీ, మునుముందు డబల్ ఇంజన్ మోత మోగించ డానికీ వేసిన వేటగాడి నూకలు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు. దీనితో ఉక్కు కర్మా గారం ఒడ్డున పడదు. బ్యాంకుల్లో అప్పులే పన్నెండు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల బకాయిలు ఉన్నాయి. మరికొన్ని తక్షణ బకాయిలకు ఈ కోట్లు ఖర్చవుతాయి. దానితో మళ్ళీ అప్పుల్లో, నష్టాల్లో మునిగే స్థితి కొద్దినాళ్ల లోనే వస్తుంది. అప్పుడు డబల్ ఇంజన్ ... ‘చూశారా? నష్టాలను తప్ప లాభాలను ఉత్పత్తి చేయలేని కర్మాగారాన్ని సెంటిమెంట్‌తో ఎన్నాళ్ళు మోస్తాం? ప్రభుత్వ ధనం ఎన్నాళ్లు వృధా చేస్తాం? ప్రైవేటీకరించడమే పరిష్కారం’ అని చెబుతుంది. ఈ సమర్థన కోసం చేసిన సాయం మాత్రమే ఇది. వందలాది రోజులుగా ఐక్యంగా కార్మికులు చేసే పోరాటాన్ని నిర్బంధాలతో, బలప్రయోగాలతో అణచివేయడం ఇప్పట్లో సముచితం కాదని డబల్ ఇంజన్ భావించడమే ఈ సహాయానికి కారణం. నిజంగా ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలంటే సొంత గనులు ఏర్పాటు చేయాలి. విద్యుత్ ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదంటున్న బాబు... కర్మాగారం తాలూకా ధర్మల్ విద్యుత్ విభాగాన్ని పునరుద్ధరిస్తే... తిరిగి కర్మాగారమే తమ అవస రాలు తీర్చుకొని, మిగిలిన దాన్ని రాష్ట్రానికిస్తుంది. అలాగే బ్యాంక్ రుణాలకు కొన్నాళ్లు గడువు ఇప్పించడం... లేదా ఆ రుణాన్ని ప్రభుత్వాల వాటాగా మార్చడం, ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (సెయిల్)లో విలీనం చేయడం వంటి చర్యలు మాత్రమే విశాఖ ఉక్కు కర్మాగార పరిస్థితిని చక్క దిద్దుతుంది. అపుడే అది లాభాల బాటలో నడు స్తుంది, దేశానికి సంపద సృష్టిస్తుంది. ఈ దిశగా చర్యలు ఉండాలని, ముందుగా ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించం’ అని డబల్ ఇంజన్ ఒక అధికార ప్రకటన ఇవ్వాలని ఉక్కు కార్మికులే కాదు, తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు. అంతదాకా కార్మికులారా... ‘నమ్మొద్దు బాబో కూటమి నాటకాలను’ అంటున్నారు. అట్టాడ అప్పల్నాయుడు వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు -
ఉక్కు గొంతుపై ప్రైవేటీకరణ కత్తి తుక్కు సంకల్పం.. చంద్రబాబు చిల్లర పబ్లిసిటీ
-
YSRCP ప్రభుత్వ చర్యల వల్లే ఆగిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
-
వైఎస్ జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగింది - కేంద్రమంత్రి కుమార స్వామి
-
3 డిమాండ్లపైనా మౌనమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్‌ను కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.భారీగా బకాయిలు..విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్‌లు అవసరం. నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్‌ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్పం..విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.తాత్కాలిక ఉపశనమం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ సొంత గనులు కేటాయిస్తేనే..ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ అంతా బూటకం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్‌కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
నాటి జగన్ సర్కార్ ఒత్తిడితోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది: కుమారస్వామి
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిన సంగతి తెలిసిందే.. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు.పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు కరోనా సమయంలో రూ.930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తుచేశారు.నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం... పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారంప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం -
ప్రయివేటీకరణకే బాబు!
ప్రైవేటీకరణ విధానాలు, ప్రభుత్వ సంస్థల విక్రయాలు అమలు జరపటంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న నైపుణ్యం దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లేదు. చంద్రబాబు చెప్పే మాటలకు రెండు అర్థాలు ఉంటాయి. ఆయన నోటి నుండి ఫలానా పని చేస్తానని వచ్చిందంటే, ఆచరణలో చేయనని చెప్ప టమే. గత ఎన్నికల ప్రణాళికలో రైతు భరోసా ముందస్తు పెట్టుబడిని 13,500 నుంచి 20 వేలకు పెంచుతాననీ, కరెంట్ చార్జీలు పెంచననీ చెప్పారు. రైతు భరోసా డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచారు. అమ్మకు వందనం కింద ప్రతి పిల్ల, పిల్లవాడికి 15 వేలు ఇస్తాననీ, నిరుద్యోగ భృతి నెలకు 3 వేలు ఇస్తాననీ, వాలంటీర్లను కొనసాగించి వారి గౌరవ వేతనం 10 వేలకు పెంచి ఇస్తాననీ చెప్పారు. వాటిల్లో ఏదీ అమలు చేయక పోగా, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రైవేటీకరణ: ఏపీ ఆయిల్ ఫెడ్ 1980లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటయ్యింది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019–23 మధ్య రికార్డు స్థాయిలో లక్షా 25 వేల టన్నుల పామాయిల్‌ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌జీ (తాజా గెలలు) ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు 3,500 రూపాయల లాభం ఆర్జిస్తోంది. నేడు 168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.50 లక్షల మంది ఆయిల్ పామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఆయిల్ ఫెడ్ ఆధునీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయా ల్సిన పని లేదు. జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయకుండా పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడ, ఏలూరు జిల్లాల్లో ఆయిల్ పామ్ రైతులు మండల, గ్రామ స్థాయి సమావేశాలు జరిపి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటీకరణ: పులివెందులలో ఉన్న ఏపీ స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ నిర్వహణ భారంగా ఉందన్న పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్ పాలు, పాల ఉత్పత్తులలో విషపూరిత రసాయనాలను, ఆహార పదార్థాలు, మంచి నీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తుంది. ఇది ఏర్పాటు కాకముందు వీటి శాంపిల్స్‌ను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబులకు పంపేవారు. ఒక్కోశాంపిల్కు 2,500 నుంచి 30 వేల వరకు ఖర్చయ్యేది. ఆ సొమ్మంతా ఈ ల్యాబ్ వల్ల ఆదా అయ్యింది. ఈ ల్యాబ్‌ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు ప్రయోజనాలు ఇమిడి ఉండగా, 2.5 లక్షల మంది రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. పోర్టుల ప్రైవేటీకరణ: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయ డంలో నిష్ణాతుడైన చంద్రబాబు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు ప్రధాన పోర్టులను ప్రైవేట్ పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. పనులు జరుగుతూ 50 శాతం పైగా పూర్తయిన రామాయ ణపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవటం చర్చనీయాంశంగా మారింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ: తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు అనుమతి ఇస్తామంటే ఏపీ ప్రభుత్వం వద్దంటోంది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతిస్తూ 50 మెడికల్ సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేటాయించింది. కళాశాల నిర్వహణ తమ వల్ల కాదంటూ అనుమతి వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాయటం జరిగింది. ఒక్క మెడి కల్ కాలేజీ నిర్వహణే చేతగాని కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పాలనను ఎలా చేయగలుగుతుంది? పేద కుటుంబాల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల వైద్య విద్యకు దూరమయ్యారు. ప్రభుత్వమే వైద్య విద్యను అందించటం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అందుకే గుజరాత్ తరహాలో పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు వైద్య కళాశాలను కట్టబెడుతున్నారు. పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కాలేజీలను 2024లో ప్రారంభించాల్సి ఉంది. ఈ కాలేజీల తనిఖీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వస్తుందని తెలిసినా, అందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చలేదు. వసతులు సమకూర్చి ఉంటే, ప్రతి కళాశాలకు 150 సీట్ల చొప్పున అనుమతులు వచ్చేవి. తాను అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పిన చంద్రబాబు సీట్లు కాదు,ఏకంగా మెడికల్ కాలేజీలనే అమ్మివేస్తున్నాడు. ప్రైవేట్ చేతుల్లోకి ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చి 25 లక్షల వరకు వైద్యం అందేలా మార్పులు చేశారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పారు. కానీ ఈ సేవల కింద డాక్టర్లకు 3 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించక పోవటంతో వైద్య సేవలు ఆపివేస్తున్నట్లు డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలను బీమా కంపెనీలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందుగానే ప్రీమియం డబ్బులు చెల్లిస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు పేదలు వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీలకు 2.5 లక్షల వరకే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. నేడు ప్రమాదకరమైన జబ్బులకు ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలకు పైగానే ఖర్చవుతోంది. దీనివల్ల పేదలకు వైద్యం సమస్యగా మారుతుంది. చంద్రబాబు మొదటి నుంచీ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా, ప్రైవేట్ రంగానికి అనుకూలంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనలో ప్రైవేటీకరణ వేగంగా సాగింది. అది రెండు దశల్లో ఉంది. 1999–2002 వరకు మొదటి దశ. ఈ దశలో 19 సంస్థలను ప్రైవేటీకరణకు లక్ష్యంగా పెట్టుకుని వాటిలో 18 సంస్థలను ప్రైవేటు పరం చేశారు. 2002 –2004 మార్చి వరకు సాగిన రెండవ దశలో 68 సంస్థలను టార్గెట్‌గా పెట్టుకుని, వాటిల్లో 30 సంస్థలను ప్రైవేట్ పరం చేయటం జరిగింది. మూసి వేసిన సంస్థలు 22 కాగా, పెట్టుబడులు ఉపసంహరించినవి 9. ప్రైవేట్ పరమైన వాటిల్లో ఉమ్మడి రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, ఏపీ జౌళి అభివృద్ధి సంస్థ, ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, నెల్లూరు కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఏపీ ఫిషరీస్ డెవలఫ్‌మెంట్ కార్పోరేషన్, ఏపీ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొ రేషన్, కరీంనగర్ కో– ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు, షుగర్ మిల్లులు, పేపర్ మిల్లులు ఉన్నాయి. చంద్రబాబు మోసపూరిత మాటలను, ప్రైవేటీకరణ విధానా లను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు -
ప్రైవేటీకరణ మళ్లీ మొదలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పండగే. ప్రభుత్వమంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు. నిరంతరం ప్రైవేటు సేవలో తరించడమే ఆయన ప్రభుత్వ ప్రత్యేకత. ప్రభుత్వ రంగంలో మంచి స్థితిలో ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల సాకులతో అనుకున్న వారికి కట్టబెట్టేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజిన ఆంధ్రప్రదేశ్‌కు గతంలో సీఎంగా ఉండగా కూడా చంద్రబాబు చేసిందిదే. ఇప్పుడూ అదే పనిలో నిమగ్నమయ్యారు. లాభాల్లో నడుస్తున్న ఏపీ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ ఆయిల్‌ఫెడ్)ను, దేశంలోనే అతి పెద్దదైన పులివెందులలో స్టేట్ సెంట్రల్ లేబోరేటరీని ప్రైవేటీకరణ పేరుతో తాబేదార్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండూ రాష్ట్రంలో రైతులు, పాడి పరిశ్రమకు సేవలందిస్తున్నవే కావడం గమనార్హం. పొరుగున ఉన్న తెలంగాణలో రెండు ఆయిల్‌ఫెడ్ యూనిట్ల ఉండగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క యూనిట్‌ను ప్రైవేటుపరం చేస్తోంది. ఏదైనా ప్రభుత్వ సంస్థను ఎంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, వాటి విస్తరణ ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదని రైతులు, పాడి పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి.నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్రఏపీ ఆయిల్‌ఫెడ్ 1980లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019–23 మధ్య రికార్డు స్థాయిలో 1.25 లక్షల టన్నుల పామాయిల్‌ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌బీ (తాజా గెలల) ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు రూ.3,500 చొప్పున లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం రూ.168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.50 లక్షల మంది ఆయిల్‌పామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో రూ.230 కోట్లతో అత్యాధునిక ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆయిల్‌ఫెడ్‌పై ప్రైవేటు సంస్థల కన్ను పడింది. ఈ ప్లాంట్‌ను చేజిక్కించుకుందుకు త్రిబుల్ ఎఫ్, గోద్రెజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తుండగా.. టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనిట్ ఆధునికీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ఆధునికీకరణ, కొత్త యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, దీనికి జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పద్ధతిలో ఈ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పేయడంతో రైతులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయిల్‌ఫెడ్ పరిధిలోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఆయిల్‌పామ్ రైతులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేటుపరం చేస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిర్వహణ భారం పేరుతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటీకరణ!పులివెందులలోని ప్రతిష్టాత్మకమైన ఏపీ స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ నిర్వహణ భారమైందన్న పేరుతో (పీ–4) మోడ్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్‌లో పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచి నీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తారు. గతంలో వీటి పరీక్షలకు శాంపిల్స్‌ను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపాల్సి వచ్చేది. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక లేబొరేటరీని నిర్మించాలని సంకల్పించింది. పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల్) ప్రాంగణంలో రూ.11 కోట్లతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీని నిర్మించింది. గతేడాది నవంబర్‌లో దీనిని ప్రారంభించారు.రూ.8 కోట్లతో అత్యాధునిక పరికరాలుదేశ, విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలను ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనలైజర్, ఎఫ్టీఐఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్యాడ్రపుల్ మాస్ డిటెక్టర్‌తో ఎస్‌సీఎంఎస్, ఎఫ్ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిప్యూజ్, కల్తీ పరీక్షల కిట్ వంటి అత్యాధునిక పరికరాలున్నాయి. వీటి కోసమే రూ.8 కోట్లు ఖర్చు చేశారు. వీటి ద్వారా వందకుపైగా పరీక్షలు చేసేందుకు నిష్ణాతులైన 15 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ ఎనలిస్ట్‌లు ఉన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఎబీఎల్) ధృవీకరణ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఇంత అత్యాధునిక లేబొరేటరీని ప్రైవేటు సంస్థల పరం చేయడం పట్ల పాడి పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ల్యాబ్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే శాంపిల్స్ పరీక్షలకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారని, ఇది తమకు భారంగా మారుతుందని పాడి రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.ఆయిల్‌ఫెడ్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాంఆయిల్ఫెడ్ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఆయిల్‌పామ్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఓఈఆర్ ధరలో రైతులకు న్యాయం జరగదు. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటాం. సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆయిల్‌ఫెడ్‌ను ప్రైవేటీకరించాలన్న ఆలోచన విరమించుకొని, బలోపేతం చేయాలి. – అనుమోలు గాంధీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ కిసాన్ సంఘ్అమ్మేసుకోవడం సరికాదుఆయిల్ఫెడ్ను ప్రైవేటీకరిస్తే 2.5 లక్షల మంది రైతులు భవిష్యత్తు అంధకారమవుతుంది. లాభాల్లో ఉన్న ఈ యూనిట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలి. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఉన్న యూనిట్‌ను అమ్మేసుకోవడం సరికాదు. – కె.క్రాంత్కుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
మన్మోహన్ చేసిన వంద రోజుల మ్యాజిక్..
రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100. గ్యాస్ ధర రూ.2,657కి చేరుకుందనే వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ స్థాయిలో కాకపోయినా భారత్‌కూ ఇదే తరహా పరిస్థితి దాపురించేదే. కానీ 30 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్‌ను ఒడ్డున పడేశాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు జూన్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారకద్రవ్యం విలువ ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. అప్పుడు రావ్ – సింగ్‌ల జోడీ బరిలో దిగింది. కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుందిపరపతి పెంచారు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే ఎన్నారైలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలరుతో రూపాయి మారకం విలువను 9.5 శాతం తగ్గించారు. దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్నారైల సంపదకు బ్రేకులు పడ్డాయి. దీన్ని శుభసూచకంగా భావించిన మన్మోహన్.. రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12 శాతం తగ్గించారు. ఒక్కసారిగా రూపాయి విలువ 20 శాతానికి పైగా పడిపోవడంతో ఎన్నారైలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారకద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది.పరువు కాపాడారు రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చేలేక స్విస్ బ్యాంకులో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి 240 మిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్‌తో చర్చలు జరిపింది. కానీ పీవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి, దాన్ని గ్యారెంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 600 మిలియన్ డాలర్లు అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు. లైసెన్స్ రాజ్‌ని బద్దలు కొట్టారు ఆర్థికమంత్రి హోదాలో 1991 జూలై 25న మన్మోహన్సింగ్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తి వేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్‌బై చెప్పి, ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్‌మనీకి చాలా వరకు అడ్డుకట్ట పడింది. నగదు వచ్చేలా.. బ్యాంకుల జాతీయీకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటికీ చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్సింగ్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలకరంగాల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతం వరకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాళ్లపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి దౌడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. ‘సెంచరీ’ ఫలితాలు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అవక ముందు 1990 అక్టోబర్‌లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ, ఇండ్రస్టియల్ వర్కర్స్) డబుల్ డిజిట్ క్రాస్ చేసింది. 1991 జూలైలో మన్మోహన్సింగ్ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, రూపాయి విలువ తగ్గించి, లైసైన్స్ రాజ్‌కు చెక్ పెట్టారు. వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది. ఫలితంగా 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవల్ 10కి దిగువకు పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. -
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందే
సీతంపేట (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాలివైఎస్సార్సీపీ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. ప్లాంట్ ఉద్యోగుల జీతాల తగ్గింపుతో గాజువాకలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయన్నారు. రూ.200 కోట్ల టర్నోవర్ తగ్గిపోయిందన్నారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జనసేన పార్టీ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, సీపీఎ (ఎంల్) నేత గణేష్ పాండా, ఏఐటీయూసీ నేత కె.శంకరరావు, ఎస్‌యూసీఐ నేత సీహెచ్ ప్రమీల, ఆప్ నేత శీతల్, బీఎస్పీ నేత శివప్రసాద్, ఆర్పీఐ నేత బొడ్డు కల్యాణరావు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంట్ రచ్చ.. మండలిలో గందరగోళం
-
విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి
సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశం పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు రకరకాల కుట్రలు చేస్తోందని, ప్రైవేటీకరణను ఆపుతామని ప్రకటించిన తెలుగుదేశం, జనసేన నేతల్లో చిత్తశుద్ధి లోపించిందని తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవటంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని నేతలు మండిపడ్డారు. యురేనియం తవ్వకాలూ నిలిపివేయాలి.. ఇక కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ప్రాంత గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, ఆ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటించాలని కూడా వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో కృష్ణానది, బుడమేరు, గోదావరి తదితర నదుల వరదలతో నష్టపోయిన బాధితులందరికీ ఇంకా పూర్తిగా సహాయం అందలేదని, ప్రభుత్వ హామీ ప్రకారం ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, సీహెచ్ బాబురావు (సీపీఎం), కె.రామకృష్ణ, జల్లి విల్సన్ (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కుపై బాబు అండ్ కో యూటర్న్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు. నిర్భీతిగా మాట మార్చేస్తున్నారు. ‘ప్రైవేటీకరణను నిలవరించలేని జగన్.. రాజీనామా చెయ్యి’ అంటూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని ఎన్నికలకు ముందు ప్రజాగళం సభలో శపథం చేశారు. వాజపేయి హయాంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోతే తానే అడ్డుకున్నానని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం రాబట్టి ఫ్యాక్టరీని ఆదుకున్నామని.. ఇప్పుడూ కాపాడుకుంటామని గద్దె నెక్కిన కొత్తలో సెలవిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం యూనియన్ నాయకులకూ మొన్న ఆగస్టులో అదే హామీ ఇచ్చారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానివ్వం. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. నాతో కలిసి రండి, ఢిల్లీకి తీసుకువెళ్తా. ఇక్కడ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో మన వాణి బలంగా వినిపిద్దాం..’ అని ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బల్లగుద్ది చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతానని హామీ ఇచ్చారు. ఇన్ని మాటలు మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చేశారు. పవన్ మౌన వ్రతం పాటిస్తుండగా.. చంద్రబాబు తన ఒక్కడి చేతుల్లో లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై ఢిల్లీ వెళదామని నేను పిలిస్తే స్పందించారా? ప్రైవేటు ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల బాటలో నడుస్తుంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా భ్రష్టు పట్టడానికి కారణమేంటో యాజమాన్యం, సిబ్బంది ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు గత నెల 17న మీడియాతో రివర్స్‌లో మాట్లాడారు. అప్పుడు మొత్తం పిక్చర్ తెలీదట!‘‘విశాఖ స్టీలు ప్లాంటును ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి? ఏ విధంగా ట్రాక్‌లో పెట్టాలి.. ఏ విధంగా చేస్తే ముందుకు వెళుతుంది.. అనే అంశాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. సెయిల్‌లో విలీనం చేయాలనేది ఒక ప్రత్యామ్నాయం. అందుకు సెయిల్, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అదొక సమస్య. ఎన్ఎండీసీకి భూమి ఇస్తే.. వారు డబ్బులిచ్చినా అది తాత్కాలికం. ఆ డబ్బులు చాలవు. రూ.వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లతో రివైవ్ కాదు. దీనికి ఒక పూర్తి ప్యాకేజీ ఇవ్వాలి. ముడి సరుకు కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేం ఆలోచిస్తున్నాం. మొత్తం మీద ఫెయిర్‌గా డిస్కస్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. ఎవరో ఒకరు.. కేంద్రమో, రాష్ట్ర ప్రభుత్వమో, బ్యాంకులో ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి. మేనిఫెస్టోలో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేస్తాం అని చెప్పాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మొత్తం పిక్చర్ ఉండదు. వెరీ క్లియర్. అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని తాజాగా అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో హామీ లిచ్చామని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దాటవేసే ప్రయత్నం చేశారు. పైగా సెయిల్‌లో విలీనానికి సెయిల్, కేంద్రం ఒప్పుకోవాలని.. ఇది తమ చేతుల్లో లేదనే రీతిలో వ్యాఖ్యానించారు. తద్వారా విశాఖ స్టీలు ప్లాంటుపై ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కొద్ది రోజులు మాట్లాడిన మాటలు అంతా హంబక్ అని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.అసెంబ్లీ తీర్మానంతో వైఎస్సార్సీపీ అడ్డుకునే యత్నం » స్టీల్ ప్లాంట్‌ను దివాలా పరిశ్రమగా చూపించే కుట్ర జరుగుతోంది. 2021లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. వెంటనే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్లాంట్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి లేఖలు రాశారు. » అంతటితో ఆగకుండా అసెంబ్లీలో సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విశాఖలో భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలో కూడా వేదికపై లక్షల మంది ప్రజల సమక్షంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. » రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశీల్‌మెట్ట జంక్ష¯న్ నుంచి కూర్మన్నపాలెం జంక్ష¯Œన్ వరకు అప్పటి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో భారీ పాదయాత్ర చేపట్టారు. స్టీలు ప్లాంట్ ఉద్యమానికి వైఎస్సార్సీపీ నుంచి లభించిన మద్దతు కార్మికుల్లో ధైర్యాన్ని పెంచింది. ఫలితంగా కేంద్రం దూకుడుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు వెళ్లింది.» ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు స్టీలు ప్లాంటులో ఇంత జరుగుతున్నా... ఏ ఒక్క రోజూ నోరు విప్పి మాట్లాడేందుకు సాహసించ లేదు. పైగా జనసేన నేతలు నెపమంతా కార్మికులపై నెట్టేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో మాట్లాడతామని, ఇప్పుడు అంత సులువుకాదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. రుణం పేరుతో నిబంధనలు, బెనిఫిట్స్‌లో కోత » స్టీల్ ప్లాంట్ కోసం రూ.12 వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, కేంద్రం రూ.2 వేల కోట్ల రుణాన్ని (ఎస్బీఐ ద్వారా) అందిస్తున్నట్టు పైకి నటిస్తూ.. ఈ నిధులను జీఎస్టీ, పీఎఫ్ బకాయిలు, ప్రభుత్వ లెవీ, వెండర్స్‌కు చెల్లింపులు చేయాలని నిబంధనలు విధించింది. ఇతరత్రా అంశాలకు ఖర్చు చేస్తే.. ఆ నిధుల్ని ఫ్రీజ్ చెయ్యాలంటూ ఆదేశించింది. » వాస్తవానికి స్టీలు ప్లాంటు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 7.9 మిలియన్ టన్నులు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు 30 వేల మంది కార్మికులు ఉండాలి. ఒకవైపు సెయిల్‌లో 19 మిలియ¯Œన్ టన్నుల సామర్థ్యానికి లక్ష మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న 14 వేల మందిలోనే 4 వేల మందిని తొలగించేందుకు ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా ప్రతిఘటించాయి.» దీంతో రానున్న రోజుల్లో విడతలు విడతలుగా కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌లోనూ భారీగా కోతలకు యాజమాన్యం దిగింది. గత ఆరు నెలలుగా ఉద్యోగులు జీతం ఒకేసారి అందుకున్న దాఖలాలు లేవు. సగం జీతం కూడా నెలాఖరున చెల్లిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించ లేక డీఫాల్టర్లుగా మారుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించడం లేదు. టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు, పీఆర్పీ, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ తాత్కాలికంగా నిలుపుదల వంటి అనేక చర్యలకు దిగింది. వీటన్నింటిపై ఏ ఒక్క రోజు కూడా కూటమి నేతలు కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడిన దాఖలాలు లేవు.జగన్ చెప్పిందే నిజమవుతోంది.. వాస్తవానికి ఎన్నికల ముందు గాజువాకలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంటు సీట్లల్లో టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు ఓటు వేయడమేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చి గెలుపొందారు. ఆ తర్వాత స్టీలు ప్లాంట్ ఉన్న నియోజకవర్గంలో తమకు వచ్చిన భారీ మెజార్టీ ధైర్యంతోనే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయని అర్థమవుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో కార్మికులు, ఉద్యోగులు పోరుబాట పడుతున్నప్పటికీ కూటమి నేతలెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.పరిస్థితి తారుమారు» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి తారుమారైందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్డీయే సర్కారు వరుస నిర్ణయాలతో స్టీల్ ప్లాంట్‌ను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఇందుకు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ముందుగా మూల ధనం సమీకరణ పేరుతో ఆస్తుల వేలానికి సిద్ధమైంది. » ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్ యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లుగా లెక్కగట్టింది. ఆ వెంటనే ఉత్పిత్తిని తగ్గించే కుట్రలో భాగంగా రెండు నెలల క్రితం బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసివేసింది. » స్టీల్ ప్లాంట్‌కు ఏటా 73 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ సంస్థ నిర్వీర్యం చేయడానికి బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసేసిన కూటమి ప్రభుత్వం.. గత నెలలో బొగ్గు కొరతను కారణంగా చూపిస్తూ... బ్లాస్ట్ ఫర్నేస్–3ని బ్లోడౌ¯న్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్–2 ద్వారా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. సాధారణంగా ఒక్కో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి రోజుకు 7 వేల టన్నుల ఉత్పత్తికి అవకాశమున్నప్పటికీ.. బీఎస్–2 ద్వారా కేవలం 4 నుంచి 5 వేల టన్నులు స్టీల్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.» మరో వైపు సుమారు 4 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించడానికి రూ.1,261 కోట్లు కేటాయించింది. రాత్రికి రాత్రి రేపటి నుంచి ఉద్యోగాల్లోకి రావద్దంటూ కార్మికులకు కబురు పంపింది. అయితే, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా స్టీలు ప్లాంటు యాజమాన్యం వెనక్కు తగ్గింది. మరోవైపు 500 మంది ప్లాంట్ అధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై పంపాలని తీర్మానించారు. వీరితో పాటు 25 శాతం మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించారు. » మరోవైపు జనసేన నేత బొలిశెట్టి సత్య నోటి దురుసుతో అసలు ప్రైవేటీకరణకు కారణం కార్మికులే అని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ఖండించలేదు. పైగా పవన్ కళ్యాణ్ మౌనం కాస్తా ఇదే తమ పార్టీ స్టాండ్ అనే రీతిలో ప్రజలకు అర్థమవుతోంది. -
ప్రైవేటీకరణ ఆపకుంటే.. కూటమి నుంచి వైదొలగాలి..
సీతమ్మధార: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఆపాలని.. లేకుంటే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తమ మద్దతును ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు ఉద్యమించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రసంగించారు. ఆనాడు తమనంపల్లి అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలను నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలిచి్చ.. కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబదీ్ధకరించాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర తీర్మానాలను రమణమూర్తి సభలో చదివి వినిపించారు. తరలి వచ్చిన జనవాహిని అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ జన సంద్రమైంది. మార్గంమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలువురు వ్యాపారులు మద్దతు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే అక్కడ ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్ధరిల్లింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దాస్, భారత నాస్తిక సమాజం జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి వై.నూకరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేఎస్ చలం, మురికివాడల సంక్షేమ సంఘం తరఫున కె.రవికుమార్, ఇసరపు లక్ష్మి, హెచ్ఆర్ఎఫ్ నుంచి శరత్, ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున కె.అన్నపూర్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి లడ్డూపై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్‌పై లేదుసీతమ్మధార: రాష్ట్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూతో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై లేదని అఖిలపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి0ది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన నాయకులు నేడు బీజేపీ చర్యల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక, ప్రజ సంఘాల పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చెర్మన్ నాగభూషణం, మన్మథరావులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టే విధానాలు అవలంభిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, సీఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ఎ.కనకారావు, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె.శంకరావు, ఏపీఎఫ్‌టీయూ కె.దేవా, మల్లన్న, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది. ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు. అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833 -
ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్.. ఉక్కు కార్మికుల నిరసన
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు నిరసనకు దిగారు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్లలో భారీ నిరసనలు చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.మరోవైపు, అనుబంధ పరిశ్రమల విక్రయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటుకు అప్పగించిన ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌ను విక్రయించారు. మరో రెండేళ్ల పాటు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా అమ్మేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: లాభాల్లో ఉన్నా అమ్మేశారుకేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారంటూ ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రశ్నిస్తోంది. ఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలాచేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్.. బాబు యూటర్న్
-
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు: ఎస్ఎఫ్ఐ
తిరుపతి సిటీ/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ముందు ‘వైద్య విద్యను గాడిలో పెడతాం..ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఎన్నో మాటలు చెప్పారని, తీరా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే విధంగా అడుగులు వేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీ కి రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107,108 జీవోలను రద్దు చేసి వైద్య విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసే ప్రయత్నాలు చేయడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు కొనసాగించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని ఎన్ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 700 సీట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లికి వందనం ఎప్పుడు...?తిరుపతి అర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినప్పటికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం విద్యార్థి సంఘం నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నిసరన వ్యక్తం చేసి ఏవో ఝాన్సీలక్ష్మికి వినతిపత్రమిచ్చారు. సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలి చెప్పారు. -
స్టీల్ ప్లాంట్ పై కూటమి సర్కారు కుట్ర
-
మా కలలు చిదిమేసిన ప్రభుత్వం
మా కలలను ప్రభుత్వం చిదిమేసింది. మా ఆశలను అడియాశలు చేసింది. గత ఏడాది కటాఫ్ కన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయన్న ఆనందాన్ని ఆవిరి చేసింది. రిజర్వేషన్ కోటాలో అయినా సీటు వస్తుందని ఎదురు చూసినా నిరాశనే మిగిల్చింది. మా భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం మాకు పెనుశాపంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు పెంచుకుంటూ వెళుతుంటే... ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే మంజూరు చేసిన కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లను సైతం వద్దని ప్రభుత్వమే అడ్డుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి... అని పలువురు నీట్ ర్యాంకర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయి తమ పిల్లల భవిష్యత్ తలకిందులైందని పలువురు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చంద్రబాబు, లోకేశ్ హామీ ఇస్తే నమ్మామని... అధికారంలోకి వచ్చాక ఆ జీవోలు రద్దు చేయకపోగా... ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ... అంటూ అసలు రూపం బయటపెట్టారు. నమ్మించిగొంతు కోశారు... అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది గత ఏడాది రెండు మార్కుల తేడాతో కన్వినర్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోల్పోయాను. మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి నీట్ యూజీ–2024లో 610 స్కోర్ చేశా. ఈ ర్యాంక్‌కు గత ఏడాది గుంటూరు మెడికల్ కాలేజీలో ఓసీకి చివరి సీట్ వచ్చింది. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో 750 సీట్లు పెరిగాయి. ఈసారి కూడా మరో 750 సీట్లు పెరుగుతాయన్నారు. వాటికితోడు కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని టీడీపీ చెప్పింది. ఇలా కూడా మరికొన్ని సీట్లు కలిసి వస్తాయని అనుకున్నా. మంచి స్కోర్ చేశాను. సీట్లు కూడా పెరిగితే తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ వచ్చేస్తుందని కుటుంబం అంతా ఆశపెట్టుకున్నాం. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త కళాశాలలు ప్రారంభం కాలేదు. సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం రద్దు చేయలేదు. దీంతో సీట్లు పెరగలేదు. ఏయూ రీజియన్‌లో ఓసీ విభాగంలో 615 స్కోర్‌కు ఆఖరి సీట్ దక్కింది. రెండు, మూడు కౌన్సెలింగ్‌లలో సీట్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో నా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. – యశ్వంత్‌రెడ్డి, నీట్ ర్యాంకర్, విశాఖపట్నం కొత్త కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డా బీసీ–డీ సామాజికవర్గానికి చెందిన నేను నీట్లో 541 మార్కులు తెచ్చుకున్నాను. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు కావడంతో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాను. కొత్త కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఉంటే మాలాంటి పేద విద్యార్థులకు అవకాశం లభించేది. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరు కాగా, రద్దు చేయాలని ప్రభుత్వం కోరడం వల్ల మాలాంటి బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక డబ్బులు కట్టి పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడం కష్టమే. – దేవేశ్, నీట్ విద్యార్థి, రాజంపేట, అన్నమయ్య జిల్లా లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్నా.. నేను మూడేళ్లగా నీట్ కోసం లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుంటున్నా. ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించాను. ఈ ఏడాది కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో బీసీ–ఈ కోటాలో ఎలాగైనా ఎంబీబీఎస్ సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. కానీ కొత్త మెడికల్ కాలేజీలు రాకపోవటం, పులివెందులకు కేటాయించిన సీట్లను ప్రభుత్వం వద్దనడంతో ఈ ఏడాది కూడా సీటు వస్తోందో.. రాదో అని భయంగా ఉంది. మా తల్లిదండ్రులు పేదలు అయినా నన్ను డాక్టర్‌గా చూడాలని లాంగ్‌టర్మ్‌లో చేర్పించారు. ఇప్పుడు సీటు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. – షేక్ తజి్మన్, దువ్వూరు, వైఎస్సార్ జిల్లా రిజర్వేషన్ ఉన్నా మా అబ్బాయికి సీటు రాలేదు గత ఏడాది బీసీ–డీలో 497 స్కోర్ వరకు కన్వినర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మా అబ్బాయి 541 స్కోర్ చేశాడు. 83 మార్కుల మేర స్కోర్ పెరిగింది. ఈ క్రమంలో తొలి రౌండ్లో కన్వినర్ కోటా సీటు వస్తుందని ఆశపడ్డాం. కానీ, తొలి రౌండ్లో ఎస్వీయూ రీజియన్‌లో బీసీ–డీలో 560 వరకు సీటు వచ్చింది. మా అబ్బాయికి సీటు రాలేదు. గత ఏడాది నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 519 స్కోర్‌కు సీట్ వచ్చింది. ఆ ఏడాది పోటీకి తగ్గట్టుగా ప్రభుత్వ కళాశాలలు పెరిగి సీట్లు పెరగడంతో 519 ర్యాంక్‌కు ప్రభుత్వ కాలేజీలో సీటు వచ్చింది. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా వద్దని లేఖ రాశారు. సీట్లు పెంచకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడి మాలాంటి వాళ్లకు ద్రోహం తలపెట్టింది. వేరే దేశానికి వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి వచ్చిన జీతంలో తిని తినక దాచిపెట్టి నా కొడుక్కు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించా. మంచి స్కోరు, రిజర్వేషన్ ఉన్నా ప్రభుత్వ కోటాలో సీటు రాలేదు. ఇక మాలాంటి వాళ్లు ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు ఎలా చదువుతారు. – పెంచలయ్య, నీట్ ర్యాంకర్ తండ్రి, అన్నమయ్య జిల్లా నా కల చెదిరింది వైద్య విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనుకునే నా కల చెదిరింది. కటాఫ్ పెంచి నా భవితను చిదిమేశారు. ఓసీ వర్గానికి చెందిన నేను 540 మార్కులు సాధించినా సీటు రాలేదు. గత ప్రభుత్వంలో వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యత కొరవడటంతో నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం వైద్య విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. – గరికిన సత్య సంతోష్, గొడారిగుంట,కాకినాడ ఇక మెడిసిన్ కలగానే... విజయవాడలోని ఓ కోచింగ్ సెంటర్లో సంవత్సరం నుంచి నీట్ శిక్షణ తీసుకుంటున్నా. ఇంటర్లో గురుకుల పాఠశాలలో చదువుకున్నా. గత ఏడాది మొదటి సారి నీట్ రాస్తే 388 మార్కులు వచ్చాయి. ఈ సారైనా మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివా. 720 మార్కులకు 524 మార్కులు వచ్చాయి. ప్రభుత్వం నూతనంగా ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ఉంటే 750 సీట్లు అదనంగా వచ్చేవి. దీంతో నాకు సీటు వచ్చే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో నా లాంటి ఎంతో మంది పేద విద్యార్థుల డాక్టర్ కల కలగానే మిగిలిపోనుంది. బీసీ–బీ కురుబ అయినా నాకు సీటు రాలేదు. – ముత్తుకూరు సరిత, సంతేకుడ్లూరు గ్రామం, ఆదోని మండలం తీవ్ర నిరాశకు గురయ్యా నాన్న డాక్టర్ బి.సురేష్, రేడియాలజిస్టు. అమ్మ డాక్టర్ ఉమాదేవి గైనకాలజిస్టు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని వారు ఎంతో ఆశగా చదివించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా నేను కూడా ఎంతో కష్టపడి చదువుతున్నాను. మాది బీసీ–బీ కేటగిరీ. నీట్లో 527 మార్కులు తెచ్చుకున్నా సీటు రాలేదు. కటాఫ్ 556 దగ్గర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మన రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉంటే నాకు సీటు వచ్చి ఉండేదని లెక్చరర్లు చెబుతున్నారు. నాకు సీటు రాకపోవడంతో మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడ్డారు. – బి.ప్రణవ్, కర్నూలు సీట్లు పెరిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు మాది వ్యవసాయ కుటుంబం. మాది బీసీ–ఏ కేటగిరీ. నన్ను ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ వరలక్ష్మి , నాన్న వెంకటేశ్వర్లు చాలా కష్టపడి చదివిస్తున్నారు. నేను కూడా కష్టపడి చదివి మా అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని ప్రయతి్నస్తున్నాను. నీట్లో 528 మార్కులు సాధించినా సీటు రాలేదు. కటాఫ్ 561 వద్దే ఆగిపోయింది. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గత సంవత్సరం ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా మరికొన్ని కాలేజీలు వస్తాయని, మరో 500 నుంచి 700 వరకు సీట్లు పెరుగుతాయని భావించాను. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాలాంటి విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగిలింది. – బి.జాహ్నవి, కర్నూలు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు ఎంబీబీఎస్‌లో కన్వినర్ కోటా కింద మొదటి కౌన్సిలింగ్లో సీట్లు కేటాయింపు పూర్తయింది. నాకు 597 మార్కులు వచ్చినా సీటు రాలేదు. పులివెందులలో మెడికల్ కళాశాల ఉండి ఉంటే ఈజీగా నాకు సీటు వచ్చి ఉండేది. నాకు సీటు రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. నీట్ రాసి 597 మార్కులు సాధించినప్పటికీ సీటు రాకపోవడం కలచివేస్తోంది. ప్రభుత్వ తీరు వల్లే నాకు అన్యాయం జరిగింది. – సాయి విఘ్నేశ్వరరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా సీట్లు వదులుకోవడం సరికాదు బీసీ–ఈ కేటగిరీకి చెందిన నేను నీట్లో 545 మార్కులు సాధించాను. అయినా సీటు రాలేదు. బీసీ–ఈ కటాఫ్ 553 వద్ద ఆగిపోయింది. గత సంవత్సరం బీసీ–ఈ కేటగిరీ కటాఫ్ 496 మార్కులు. అందువల్ల ఈ ఏడాది నాకు 545 మార్కులు రావడంతో తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశపడ్డాను. దీనికి తోడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెరుగుతాయన్న ఆశ కూడా ఉండేది. కానీ మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. సీట్లు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను కొనసాగించలేదు. ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లు కూడా వదులుకుంది. ఫలితంగా మాలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. విలువైన మెడికల్ సీట్లు వదులుకోవడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్‌సీట్లు సాధించాలి. – హెచ్ఎం ఫర్హా అన్జుమ్, కర్నూలు 570 వచ్చినా సీటు లేదు... నాకు నీట్ యూజీలో 570 మార్కులు వచ్చాయి. నేను ఓసీ కేటగిరీ. గత ఏడాది మా రీజియన్‌లో ఓసీ కేటగిరీ కటాఫ్ 542 వద్ద ఆగిపోయింది. ఓసీ కేటగిరీలో పోటీ తీవ్రంగా ఉంటుందని తెలుసు. అందుకే మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుతున్నాను. నీట్లో 570 మార్కులు సాధించినా ఫలితం లేకపోయింది. కటాఫ్ 601 వద్దే ఆగిపోయింది. గత సంవత్సరం కటాఫ్ 542 వద్ద ఆగిపోవడంతో ఈ సంవత్సరం నాకు వచ్చిన మార్కులకు తప్పకుండా సీటు వస్తుందని ఎంతో ఆశతో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, ఎన్ఎంసీ ద్వారా సీట్లు సాధించి ఉంటే మాలాంటి వారికి తప్పకుండా సీట్లు వచ్చేవి. ప్రభుత్వ చర్యల వల్ల ఈ ఏడాది మాలాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. – వి.సాయిసృజన, కర్నూలు ఆంధ్రాలో పుట్టడమే నేరమా? నా కుమార్తెకు బీసీ–ఏ కేటగిరీలో 565 మార్కులు వచ్చినా మెడికల్ సీటు రాలేదు. పేదవాళ్లం అయినప్పటికీ మా కుమార్తెను డాక్టర్‌గా చూడాలని సుమారు రూ.4లక్షలు ఖర్చు చేసి లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పించాం. ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఆశపడ్డాం. చివరకు కన్నీరే మిగిలింది. గత ఏడాది 501 మార్కులకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ, ఈ ఏడాది 565 మార్కులు వచ్చినా నా బిడ్డకు సీటు రాలేదు. మాలాంటి వాళ్లని ఎంతోమందిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కొత్త కాలేజీలు వస్తే మాలాంటి వారి జీవితాలు బాగుపడతాయని ఎదురు చూశాం. తీరా ఇప్పుడు సీట్లు తగ్గించారు. ఆంధ్రాలో పుట్టడమే నేరమా.. అన్నట్లు ఉంది. – కె.నవీన్, విద్యార్థిని తండ్రి, టెక్కలిపేద పిల్లలకు శరాఘాతం ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో సీట్లు తగ్గాయి. నా లాంటి విద్యార్థులకు నష్టం కలిగింది. ఎంబీబీఎస్ పూర్తిచేయాలన్న ఆశతో కష్టపడి చదివాను. సీటు వచ్చే అవకాశం లేదు. మళ్లీ లాంగ్‌టెర్మ్ కోచింగ్‌లో చేరాను. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం వంటిది. మెడికల్ కాలేజీలకు ప్రైవేట్‌కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు శాపం. – కె.మానస, కిండం అగ్రహారం గ్రామం, బొండపల్లి మండలం మా భవిత ప్రశ్నార్థకం నేను బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని. కటాఫ్ మార్కులు పెరగడంతో నీట్ సీటు చేజారింది. మాది పేద కుటుంబం. డాక్టర్ కావాలన్నది నా ఆశయం. వైద్య కళాశాలలు పెరగడంతో కచ్చితంగా సీటు వస్తుందని భావించాను. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని ఊహించాను. అయితే ప్రభుత్వం కొత్త కాలేజీలు తీసుకురాకపోవడంతో మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వమే ఇలా చేయడమే సరికాదు. – ఎండీ ఖాసీం, జె.రామారావుపేట, కాకినాడప్రభుత్వం వల్ల ఎంతో నష్టం నాకు నీట్లో 568 మార్కులు వచ్చాయి. గతేడాది ఎస్వీయూ రీజియన్‌లో ఓసీ కేటగిరీకి 542 మార్కులకు కూడా సీటొచ్చింది. ఈ ఏడాది కొత్తగా 5 కాలేజీలు వస్తున్నాయని.. 550కి ఓసీ కేటగిరిలో సీటు వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో నేను ఎంతో నష్టపోతున్నా. ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. ధైర్యం చేసి లాంగ్‌టర్మ్‌కు వెళదామన్నా.. వచ్చే ఏడాది సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదు. – లతిక, నీట్ విద్యార్థి, ఎస్వీయూ రీజియన్ -
బొలిశెట్టి వ్యాఖ్యలపై దుమారం
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులను అవమానిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 1,314 రోజులుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలవలేదని, వారిని చాచిపెట్టి కొట్టాల’న్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్టాండా? అని ప్రశ్నిస్తున్నారు. అదే వారి విధానమైతే తాము స్టీల్‌ప్లాంట్ కోసమే కాకుండా.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.ఆ వ్యాఖ్యలు పట్టించుకోంకార్మిక సంఘాల ఉద్యమాల వల్లే ప్రైవేటీకరణ ఇంతకాలం ఆగిందని బహిరంగ సభలో పవన్చెప్పారు. బొలిశెట్టి జనసేనలో ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. – డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీక్షమాపణ చెప్పాలిఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇది. ఏనాడూ బొలిశెట్టి కార్మికుల ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే టెంట్ వద్దకు వచ్చి ఆ మాట చెప్పాలి. – రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్టీయూసీసంఘాల వల్లే ప్రైవేటీకరణ ఆగిందికార్మిక సంఘాలు ఉండబట్టే ఇప్పటివరకు ప్రైవేటీకరణ ఆగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఐటీయూ పోరాటాల వల్ల ఆగింది తప్ప.. పవన్‌కళ్యాణ్ వల్ల కాదు. ఈ విషయాలేవీ బొలిశెట్టికి తెలియదేమో. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూవిమర్శలు అర్థరహితంస్టీల్ప్లాంట్ కార్మిక సంఘాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన విమర్శలు అర్థరహితం. జనసేన అధికారంలోకి వచ్చాకే కార్మిక సంఘాలు మంచివి కావని ఆయనకు తెలిసిందా. – వై.మస్తానప్ప, ప్రధాన కార్యదర్శి, స్టీల్ వైఎస్సార్టీయూసీ -
ఉక్కు కార్మికుల ఎదురుతెన్నులు
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డు కుంటామనీ, అన్ని యూనియన్ల లీడర్లను తీసుకెళ్లి ప్రధానితో సమావేం ఏర్పాటు చేస్తామనీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ‘ఎటువంటి త్యాగాల కోసమైనా సిద్ధం’ అన్నారు పవన్ కల్యాణ్. రాజీనామా పేరుతో ప్రగ ల్భాలు పలికారు గంటా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణ వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ‘పొరపాటున జగన్ అనే వ్యక్తి ఓడిపోతే ప్రైవేటీకరణ తప్పద’ని జగన్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో దాదాపు 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. అటువంటి ప్లాంట్ 18 వేల మందికి ప్రత్య క్షంగానూ, 23 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. సాగర తీరాన నెలవై ఉన్న విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాకుండా ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం లభించింది. ఇటువంటి కామధేనువు లాంటి ప్లాంట్ మూసి వేత దిశగా అడుగులు వేస్తోంది. అదీ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థం వల్ల! ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో రెండు అన్నపూర్ణ, కృష్ణ పర్నేసులను ఆపేశారు. ప్రస్తుతం ఒకే ఒక్క ఫర్నేస్‌తో అతి తక్కువ ఉక్కును ఉత్పత్తి చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల్లేవు.రెండు నెలలుగా పర్మినెంట్ ఉద్యోగులకూ వేతనాల్లేవ్. పీఎఫ్ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికులకు అందించాల్సిన సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారు. కార్మి కులు దాదాపు 1300 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది ఎన్డీయే కూటమే.అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా కూడా బాబు, పవన్‌లు కార్మికులను కలిసిన దాఖలాలు లేవు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీనివాస వర్మ చాలా నిర్మొహమాటంగా పెట్టుబడుల ఉపసంహ రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలను వెనక్కు తీసుకుంటోందన్నారు. ఇక రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జాడ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించారు. సీఎంగా తనకు కేంద్రం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. 2021లోనే కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాస్తూ ఈ ప్లాంటు ఆవశ్యకతను చాలా స్పష్టంగా వివరించారు. దీనిని ఎటువంటి పరిస్థి తుల్లోనూ అమ్మివేయద్దని కోరారు. ఇటువంటి లేఖనే టీడీపీ, జనసేన ఎందుకు రాయలేక పోతోంది? మోదీ, షా అంటే ఆ పార్టీల అధినేతలకు భయం అన్నది అర్థమ వుతోంది. కానీ, జగన్ నిర్మొహమాటంగా కేంద్రానికి చెప్పడమే కాకుండా విశాఖలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తుందని చెప్పారు. ఆయన చెప్పింది ఇప్పుడు నిజమనే భావన కనిపిస్తోంది. ప్లాంట్ నష్టపోకుండా లాభాల్లో నడవాలంటే బొగ్గు గనులు, ఉక్కు గనులు కేటాయించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంటు ఏర్పాటైన తొలినాళ్లలో దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు. దీనికి సొంతంగా ఉక్కు, బొగ్గు గనులు లేవు. వీటిని ప్రైవేటు సంస్థల నుండి, వేరే రాష్ట్రాల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఈ పరిస్థితుల్లో అనాలోచితంగా దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నులకు పెంచారు. దీంతో అప్పుల ఊబిలోకి ఇది కూరుకుపోయింది. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చేసిన రుణాలు కూడా పెద్ద భారంగా మారాయి. దీనిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించే ప్రయత్నం చేయ బోతోంది.ప్రైవేటైజేషన్‌లో భూమి ఎక్కువగా ఉంటే కొనేందుకు సంస్థలు ముందుకొస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే దాదాపు 20 వేల ఎకరాల భూమి ఉంది. ప్లాంటు పరిధిలో 11 వేలు, టౌన్ షిప్ పరిధిలో 500 ఎకరాలు, రిజర్వాయర్ పరిధిలో 500 ఎక రాలు, నిరుపయోగంగా మరో 7 వేల ఎక రాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉంది కాబట్టి అనేక ప్రైవేటు సంస్థలు ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గద్దల్లాగా వాలు తున్నాయి. ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టి ఆ సాకుతో ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమవుతోందన్న విమర్శ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కార్మికుల కడుపు కాలకముందే కేంద్ర పెద్దలు ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలతో ప్లాంట్‌కు పున ర్జీవం పోయాలని ప్రజలు కోరుతున్నారు. పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్..
-
బెడిసికొట్టిన టీడీపీ రాజీనామా డ్రామాలు
-
డోంట్ కేర్..ఆ మూడు కోసమే ముగ్గురం కలిశాం..
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి మా పార్టీ దేనికైనా సిద్ధం
-
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా
సాక్షి, విశాఖ : విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉదృతమవుతుంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మికులు. ఎన్నికల ముందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్లాంట్‌ను కాపాడుకునేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖలి పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రంవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇదీ చదవండి : వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న మోదీ -
చంద్రబాబు.. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం: విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3 ఆపివేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఇది టీడీపీ నాయకత్వ అసమర్థతకు నిదర్శనమంటూ కామెంట్స్ చేశారు.👉స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘భయపడినట్టే జరిగింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపివేయడం అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు.👉‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సాగిన 32 మంది ప్రాణత్యాగం ఉద్యమాల ఫలితమే వైజాగ్ స్టీల్. ఇప్పుడు రక్షించేవారు లేక అనాథ అయిపోయింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్‌లో ఎగిసిపడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు.👉టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏ మాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలి. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్‌ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు ఎలుగెత్తి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గాని, ఎన్ఎండీసీలో గాని విలీనం చేసి, ఇనుప ఖనిజపు గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహం లేదు.👉వైజాగ్ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాంతీయ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ పదవుల్లో కొనసాగే నైతిక హక్కులేదు. తక్షణం రాజీనామా చేసి స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరూ పెదవి విప్పడం లేదంటే కేంద్రంతో స్వార్థ ప్రయోజనాలకోసం లాలూచీ పడ్డారని తెలిసిపోతోంది. ఉత్తరాంధ్ర తలను తీసివేయడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి వారికి బుద్ధి చెప్పాలి👉చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి వైజాగ్ స్టీల్‌ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. మనం కళ్లు మూసుకుంటే ఇది వైజాగ్ స్టీల్‌తోనే ఆగదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఫిషింగ్ హార్బర్లు, విద్యాసంస్థలు, విద్యుత్ కేంద్రాలను, మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెడుతాడు చంద్రబాబు.👉టీడీపీ మొదటి నుంచి వైజాగ్ సంపదను వ్యక్తిగతంగా కొల్లగొట్టుకునే బంగారు గనిలా భావిస్తోంది. అక్కడి ప్రజల పట్ల ఎటువంటి నిబద్ధత, అనుబంధం ఆ పార్టీకి లేవు. తన ప్రయోజనాలను కాపాడుకోవడమే చంద్రబాబు లక్ష్యం. ఇది ఒక్క వైజాగ్‌కు జరిగే నష్టం కాదు. మిగతా అన్ని నగరాలు, పట్టణాలకు ఇదే గతి పడుతుంది. ప్రజలు మేల్కొని తమ చరిత్రను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. (1/7) భయపడినంతా అయింది. చంద్రబాబు@ncbn గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2024 👉వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. చంద్రబాబు భావజాలం ప్రకారం అయినంత వరకు అమ్ముకుంటూ పోతే చివరకు ఏవీ మిగలవు. అప్పట్లో 32 మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. ఇప్పుడు దొంగ చాటుగా అమ్మకానికి పెడితే అమరులు త్యాగాలు వృథాగా పోయినట్టే. కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు పోరాడితే తప్ప వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగై పోతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ -
బాబుకు అమరావతి పై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్ పై లేదు..
-
కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసేలా ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. కేబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి వివరించారు. ఫేజ్–1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో (150 సీట్లు) నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలకు గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందన్నారు. ఫేజ్–2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెల్లో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తొలి ఏడాది ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించేందుకు మంత్రి మండలి అంగీకరించిందని చెప్పారు. మంత్రి పార్థసారథి వెల్లడించిన మేరకు మంత్రి మండలి నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు ⇒ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు అర్బన్ లోకల్ బాడీస్‌తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. సంతానోత్పత్తి రేటు, పని చేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం తగదని భావిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. ⇒ 2014–19తో పోలిస్తే ప్రస్తుత మద్యం పాలసీ లోపభూయిష్టంగా, పారదర్శకత లోపించింది. భవిష్యత్తులో మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానంలోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. సెపె్టంబర్ 5 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి, అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తాం. ఇకపై మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు ప్రవేశ పెడతాం. ⇒ గత ప్రభుత్వంలో రూ.22.95 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, క్యూ ఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిచేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి 22ఏ నిషేధిత జాబితా భూములపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో గ్రామ సభలు నిర్వహిస్తాం. అప్పటి వరకు 22ఏ నుంచి మినహాయిస్తూ భూములకు ఎటువంటి రిజి్రస్టేషన్లు నిర్వహించం. ⇒ మత్స్యకారుల హక్కులకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం జారీ చేసిన 144, 217 జీవోలను రద్దు చేస్తున్నాం. చేప పిల్లల పెంపకం నుంచి మార్కెటింగ్ వరకు దళారీ వ్యవస్థ లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. ⇒ నంద్యాల జిల్లా సున్నిపెంట (శ్రీశైలం ప్రాజెక్టు) గ్రామ పంచాయతీకి 208.74 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం 2023 మే 11న జారీ చేసిన జీవో 40ని రద్దు చేసి, ఆ భూమిని నీటి పారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని పర్యాటకాభివృద్ధి కోసం బదలాయించి టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.⇒వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ప్రభుత్వ కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు), రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంస్థలపై మరో ఏడాది నిషేధాన్ని పొడిగించాం. పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యమే లక్ష్యం గత ప్రభుత్వంలో ఆ దిశగా వైఎస్ జగన్ చర్యలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచడమే లక్ష్యంగా 17 కొత్త వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. రోజు రోజుకు వైద్య విద్యకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా ఉండింది. ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక, తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేర్పించే వారు. మధ్య తరగతి కుటుంబాల వారైతే అప్పులు చేసి రష్యా, ఫిలిపైన్స్ వంటి దేశాలకు పిల్లలను పంపేవారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేలా కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేగంగా నిర్మాణాలు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం రెండో దశ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా కావాలనే నిర్లక్ష్యం చేసింది. దీనికితోడు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలోనే నడిపి, విద్యార్థులకు జాతీయ ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు, పేదలకు ఉచితంగా> సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడం జగన్ విధానం. ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కళాశాలలను, బోధనాస్పత్రులను పెడితే పేదలకు ఉచిత వైద్య సేవలు కరువయ్యే అవకాశం ఉంది. అవసరమైన మేరకు ఉద్యోగుల బదిలీలుసాక్షి, అమరావతి: వీలైనంత లో ప్రొఫైల్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు దగ్గరకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన వారితో కొద్దిసేపు రాజకీయ అంశాలపై మాట్లాడారు. తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ చెబుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. వాళ్లు చేసినట్లు చేయకూడదని పదేపదే చెబుతున్నా, కొందరు వినడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాగే చేస్తే ఇబ్బందులు వస్తాయని అన్నట్లు తెలిసింది. ‘ఉద్యోగుల బదిలీలను అవసరమైన మేరకు చేసుకోవాలి. నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఏపీ ఎన్నికల్లో వచ్చింది నిశ్శబ్ద విప్లవమైతే.. బంగ్లాదేశ్‌లో వైలెంట్ విప్లవం చూశాం. నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా జల హారతుల కార్యక్రమాలు నిర్వహిస్తాం. రీ సర్వే వివాదాలు మూడు నెలల్లో పరిష్కరించేందుకు గ్రామ సభలు నిర్వహిద్దాం. రీ సర్వేకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాటిని కూడా అధ్యయనం చేయాలి. సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మలు తుడిచేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగిద్దాం’ అని సీఎం చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబే: సీపీఎం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబేనని..నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేట్ వ్యక్తులు ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించింది సీపీఎం.. గనులు కేటాయించకపోవడం వల్లే స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలంటూ సీపీఎం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులపైన కన్నేసి ప్రైవేటీకరణ వైపు వెళుతున్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. మీడియా పై దాడులతో సమస్యలు పరిష్కారం కావని వెంకట్ హితవు పలికారు.కాగా, విశాఖలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం పర్యటించారు. స్టీల్‌ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరిస్తుందని కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణపై చంద్రబాబు స్పందించకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ నోరు విప్పడం లేదు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకుందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు జరగవన్న మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోవలసింది ప్రధానేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ చేస్తున్నారుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోదీతో చెప్పించాలని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అప్పటి సీఎం జగన్.. ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖ రాశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. -
ఇది ఫిక్స్.. విశాఖ స్టీల్ అమ్మేద్దాం !
-
‘విశాఖ స్టీల్’ అమ్మేద్దాం! ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’గా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఐదేళ్ల పాటు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న వైఎస్సార్సీపీ పోరాటం వృథా అవుతోంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూటర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న ఆ పార్టీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యమంటూ ఆంగ్ల మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. తొలుత ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్.. విశాఖ ఉక్కు విక్రయానికి టీడీపీ అనుకూలమని.. ఈ మేరకు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయంటూ కథనాన్ని ప్రచురించింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ సైతం ఇదే తరహాలో మరో కథనాన్ని అచ్చేసింది. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. మూడు రోజుల క్రితం విశాఖలో స్థానిక టీడీపీ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ తాము గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండటంతో చాలా ఇబ్బందులున్నాయని అసలు విషయాన్ని చెప్పేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆయన సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఇబ్బందులు అంటూ రాగాలు తీయడంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను రూ.12,100 కోట్లకు టాటా గ్రూపు కొనుగోలు చేసి విస్తరణ చేపట్టింది. అదేవిధంగా విశాఖ స్టీల్‌ను భారీగా విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థకు కేంద్రం విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తాజాగా విశాఖ స్టీల్‌ను సందర్శించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఒక భారీ ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి లభిస్తుందంటూ టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.రంగం సిద్ధం..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు 10 శాతం, 20 శాతం షేర్లు డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మక అమ్మకం (స్ట్రాటజిక్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆరాటపడుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మడుగులొత్తుతోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కేంద్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. రూ.2,859 కోట్ల నష్టాల సాకుతో కేంద్రం స్టీల్‌ప్లాంట్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించడానికి, దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రైవేటీకరణ చేస్తే తమకెలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ‘ప్రైవేట్ చేతికిస్తే పెట్టుబడులు పెరుగుతాయి కదా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ నగరాల్లో ఆస్తుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) టెండర్లను కూడా ఆహ్వానించడం గమనార్హం.గనుల కేటాయింపులో వివక్ష వల్లే.. దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్షత చూపుతూ వస్తోంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయమవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సివస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలను చవి చూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ గత ముప్పై ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యంఇటీవల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న శ్రీనివాసవర్మ అయితే ప్రైవేటీకరణ అనివార్యమని మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు భారీ నష్టాల్లో ఉందని, ప్రజాధనం వృథా కావడాన్ని తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. 7 మిలియన్ టన్నుల కంటే అత్యల్ప స్థాయిలో ఉత్పత్తి చేస్తూ గతేడాది రూ.2,859 కోట్ల నష్టాలను మూటకట్టుకుందన్నారు. 2011–12లో రూ.13,659 కోట్ల మూలధనం కలిగిన విశాఖ స్టీల్ ఇప్పుడు రూ.391 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో ప్రైవేటీకరణ తప్ప మరే మార్గం లేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మంత్రుల పరిధిలో లేదని.. ప్రధాని నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడారు. సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వాటిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌లో పరిస్థితులపై అవగాహన కోసమే కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖ వచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రులిద్దరూ గురువారం స్టీల్ ప్లాంట్‌లోని పలు ఉత్పత్తి విభాగాలను సందర్శిస్తారు. అనంతరం ప్లాంట్ యాజమాన్యంతో సమావేశమవుతారు.పవన్ మౌనమేలా?ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నేతలు ప్రైవేటీకరణకు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు జారీ చేస్తున్నా మౌనంగా ఉండటంపై విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ ఉన్నా ప్రైవేటీకరణను అడ్డుకునేవాడినని పవన్ గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీకి పవన్‌తో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా మాట్లాడకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జనసేన ఎంపీలు ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయాలని 2021లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాలతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ఇవ్వడం ద్వారా ప్రైవేటీకరణను అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో టీడీపీ ఉన్నప్పటికీ ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. -
విశాఖ స్టీల్‌పై కూటమి వైఖరి చెప్పాలి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎండాడలో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి (కార్మిక సంఘం) నాయకులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్యలపై నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కార్మికుల తరఫున మొట్టమొదట గళమెత్తిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అదే విధంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ తాను స్వయంగా ప్రధానికి లేఖ రాశాను’.. అని గుర్తుచేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీది రాజీలేని ధోరణి అని జగన్ స్పష్టంచేశారు. ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడంవల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని ఆయన కార్మికులకు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయాలు ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు ఈ విషయంపై తమ నిర్ణయాన్ని స్పష్టంచేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీ స్టీల్‌ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోరాట కమిటీ నాయకులు సీహెచ్. నర్సింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వై. మస్తానప్ప ఉన్నారు. -
ఏటేటా.. ఉద్యోగులకు టాటా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మిక, ఉద్యోగ భాగస్వామ్యం ఏటేటా భారీగా తగ్గుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా కొత్తగా గనులు ఏర్పడక క్రమేపి ప్రైవేటీకరణ పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికులసంఖ్య 39 వేలకు చేరింది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో కాంట్రాక్టు వ్యవస్థ పెరిగిపోయింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకం కింద, విధుల్లో నిర్లక్ష్యం పేరిట 1997 నుంచి 2014 వరకు వందలాది కార్మికులను తొలగించారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతమంది కార్మికులు ఉంటారనే చర్చ మొదలైంది. కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ప్రక్రియ మొదలై వచ్చే నెల 5న ఓటర్ల జాబితా వెలువడితే పూర్తిస్థాయిలో సంఖ్య తేలనుంది. కార్మిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే 1998లో 1,08,212 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 39 వేలకు చేరింది. వీటితోపాటు రెండు వేల వరకు ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగులు ఉంటారు. గత 25 ఏళ్లలో 68 వేల మంది కార్మికులు తగ్గారు. కంపెనీలో ఇప్పటివరకు ఆరుసార్లు కార్మిక ఎన్నికలు జరిగాయి. నాటికీ, నేటికీ ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. గత ఆరేళ్లలోనే 13 వేలకుపైగా కార్మికులు తగ్గారు. -
కాకినాడ పోర్టు బకాయిలపై గట్టిగా నిలదీసిన వై.ఎస్.ఆర్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదు : కేంద్రం
-
యధాతథంగానే విశాఖ ఉక్కు డిజిన్వెస్ట్‌మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ యథాతథంగా కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పురోగతిలోనే ఉందని తెలిపింది. పనితీరును మెరుగుపర్చుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) 2021 జనవరి 27న ఆమోదముద్ర వేసింది. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని పేర్కొంది. RINL ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదు. RINL పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రం వెల్లడించింది. -
విశాఖ ఉక్కు: ‘ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లం’.. సాయంత్రానికి ఉల్టా పల్టా!
దొండపర్తి (విశాఖ దక్షిణ)/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే స్పష్టం చేశారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపై దృష్టి సారించామని తెలిపారు. గనుల సమస్యనూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆపడం నా చేతుల్లో లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే కొద్ది గంటల వ్యవధిలోనే మాట మార్చారు. గురువారం సాయంత్రం ఆయన నోవోటెల్లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సి.హెచ్.నరసింగరావులు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చామన్నారు. సింగరేణిలో ఆంధ్ర వాటా తేల్చండి బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ అన్నారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్ఎస్కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇవ్వాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బొగ్గు గనులను కేటాయించాలని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తామని, గనుల కేటాయింపు విషయం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తామని మంత్రి చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణపై కేంద్రం కాస్తా వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోందని చెప్పారు. ప్లాంట్ లాభాల కోసం మాట్లాడుతుండటం శుభపరిణామమన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరా చేస్తామని ముందుకు వస్తే ప్లాంట్ కొనటానికి వచ్చినట్లు ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. బీజేపీతో గొడవ ఉంటే వారితో నేరుగా తేల్చుకోవాలని, స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు. -
అంబేడ్కర్ ఆశయాల అమల్లో కేసీఆర్
సనత్‌నగర్: దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లతో కలసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఆయన ఆశయాల అమల్లో భాగంగానే దళితబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామికవేత్తలుగా వారు ఎదుగుతున్నారన్నారు. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట దళితబంధు తరహా పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అలాగే నూతన సచివాలయ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టారని తెలిపారు. దళిత, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే టీ–ప్రైడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్ వివరించారు. కాగా, ఈ వేదికపై టీ–ప్రైడ్ కింద 8 వేల మంది ఔత్సాహికులకు రూ. 523 కోట్లను కేటీఆర్ మంజూరు చేశారు. అలాగే టీ–ప్రైడ్ కింద సబ్సిడీ పొంది విజయవంతంగా దూసుకెళ్తున్న 17 మందికి బెస్ట్ టీ–ప్రైడ్ అవార్డులను ప్రదానం చేశారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ)కి 2 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షధ్వానాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రేఖానాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ‘డిక్కీ’ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత, గిరిజనులకు స్వర్ణయుగం: సత్యవతి దళిత, గిరిజనులు కూడా అందరితో సమానంగా వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దళిత, గిరిజనులకు ఇది స్వర్ణయుగం లాంటిదన్నారు. తెలంగాణ రాక ముందు 263 గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి చేరిందన్నారు. నూతన ఆవిష్కరణలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, విజన్ ఉన్న సీఎంతోనే ఇది సాధ్యమవుతోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీ–ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు యువ పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వస్తున్నారన్నారు. కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను విరమించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా డిమాండ్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొంటామని కేసీఆర్ ప్రకటించడం వల్లే కేంద్రం దిగొచ్చి తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకున్నట్లు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ వివరించారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయట పెట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్రం నామమాత్ర ప్రకటన చేసిందని కేటీఆర్ అంతకుముందు ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆగేంత వరకు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ ఒత్తిడి కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్ పెట్టామన్నారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
చంద్రబాబు హయాంలో మూతపడ్డ 64 ప్రభుత్వ సంస్థలు
-
బిడ్డింగ్ పై పాలిటిక్స్
-
‘స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని సీఎం జగన్ కోరారు’
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకమని, అయినా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది ప్రజలు సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు.. వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని పేర్కొన్నారాయన. కేంద్రం నడపలేని స్టీల్ ప్లాంట్‌ని ఓ రాష్ట్రం నిర్వహించగలదా? అని ప్రశ్నించారాయన. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. అసలు కొనడం అనే మాటే ఉత్పన్నం కాదు. బీజేపీ, బీఆర్ఎస్లు రాజకీయంలో భాగంగా వాళ్లు చేసేది చేస్తున్నారు. తెలంగాణ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే చెప్తోంది అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనేది స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకమా? అనుకూలమా? అనేది స్పష్టం చేయాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒకవేళ వ్యతిరేకమైతే.. బీఆర్ఎస్ బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటోందన్నారాయన. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక మొమోరాండం ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అధికారులు లేదంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది మా స్టాండ్. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాన మంత్రి మోదీకి ఇదే చెప్పారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు..ఇదే మా నినాదం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలోని సంస్థ ఆధారంగా.. మా మీద(వైఎస్సార్సీపీ ప్రభుత్వం) దుష్ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలు అమ్మితే ఏం చేసింది అని ఈనాడు తీరును ఎండగట్టారాయన. -
సింగరేణి ఏరియాలో బీజేపీ నేతలను తిరగనివ్వం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఓ వైపు చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసి పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని కేంద్రం చూస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించేలా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో సింగరేణి ఏరియాలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ బీజేపీ నేతల హస్తం ఉందని, అందులో తెలంగాణ బీజేపీ నాయకులు కేవలం పాత్రధారులేనని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విజయోత్సవ ర్యాలీలా? ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు తీస్తుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎస్సెస్సీ హిందీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దోషి కాదని, ఆయన తప్పు చేసినందునే పోలీసులకు తన ఫోన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని బ్రోకర్, జుమ్లా, పేపర్ లీక్ పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధభేరి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న ‘మహాధర్నా’నిర్వహించాలని అధికార బీఆర్ఎస్ నిర్ణయించింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో ఈ మహధర్నాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాధర్నాకు సంబంధించి సింగరేణి పరిధిలోని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రకటించిన ప్రధాని మోదీ మాట తప్పారు. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని అటు కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరినా పట్టించుకోవట్లేదు. తాజాగా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కుట్రలపై జంగ్ సైరన్ ‘తెలంగాణను దెబ్బకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కూడా గనులు కేటాయించకుండా కేంద్రం దివాలా తీయించింది. అదే విషప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతాం. గుజరాత్ ఖానిజాభివృద్ధి సంస్థకు నామినేషన్ పద్ధతిలో లిగ్నైట్ గనులను కేటాయించిన రీతిలోనే సింగరేణికి గనులు కేటాయించాలి. సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం 6 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరుగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణతో తెలంగాణలో అంధకారంతోపాటు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల బోనస్‌లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జంగ్ సైరన్ పూరించాం’అని కేటీఆర్ తెలిపారు. 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. స్టీల్ ప్లాంటును కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందంటూ ఈ నెల 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ నెల 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రజా గర్జన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉక్కు ప్రజాగర్జనకు పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగర్జన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. విశాఖ గర్జన సభలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొననున్నారు. -
భారతీయ రైల్వే ప్రైవేటీకరణ..?
-
ఐడీబీఐ బ్యాంక్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా బిడ్స్ దాఖలు గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. కొనుగోలుదారులు 2023 జనవరి 7వరకూ ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు నోటీసు ద్వారా దీపమ్ పేర్కొంది. బ్యాంకులో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం సంయ్తుంగా విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) లేదా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు తొలుత 2022 డిసెంబర్ 16వరకూ గడువును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ నిర్వహిస్తున్న సలహాదారు సంస్థలకు గడువును పెంచవలసిందిగా అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కాగా.. ఈవోఐ ఫిజికల్ కాపీల దాఖలుకు గడువును సైతం 2022 డిసెంబర్ 23 నుంచి 2023 జనవరి 14వరకూ పొడిగిస్తున్నట్లు నోటీసులో దీపమ్ వెల్లడించింది. వాటాల వివరాలిలా.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ(49.24 శాతం), ప్రభుత్వం(45.48 శాతం) సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆఫర్లో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. దీంతో బ్యాంకును దక్కించుకున్న బిడ్డర్.. పబ్లిక్ నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. కొనుగోలుదారు సంస్థ కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు నికర లాభాలు ఆర్జించి ఉండాలి. ఒక కన్సార్షియంలో భాగంగా నాలుగు సంస్థలను మాత్రమే అనుమతిస్తారు. బ్యాంకును సొంతం చేసుకున్నాక కనీసం 40 శాతం ఈక్విటీ పెట్టుబడులను ఐదేళ్లపాటు తప్పనిసరిగా లాకిన్ చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.4% నీరసించి రూ. 57.3 వద్ద ముగిసింది. -
సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవం..
సాక్షి.హైదరాబాద్: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ పూర్తిగా అవాస్తవమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలంపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ వద్దంటున్న రాష్ట్ర సర్కారు.. జెన్కోకు కేటాయించిన తాడిచర్ల గనిని ఏఎంఆర్‌కు ఎందుకు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, కాసం వెంకటేశ్వర్లు, డా.ఎస్.ప్రకాష్‌రెడ్డిలతో కలిసి కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కల్వకుంట్ల అధికారిక ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఏర్పాటు, కార్మి కుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి హామీల అమలును గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి అభద్రతా భావంతో కేంద్రాన్ని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్ది ధ్వజమెత్తారు. ‘గుజరాత్‌కు ఒక నీతి.. మాకో నీతా’అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ‘మీ సిద్దిపేటకు ఒక నీతి, దుబ్బాకకు ఒక నీతా? సిరిసిల్లకు ఒకనీతి, కల్వకుర్తికి ఒక నీతా? గజ్వేల్‌కు ఒక నీతి, హుజూరాబాద్‌కు ఒక నీతా?’అని ప్రశ్నించారు. బొగ్గు కొరతతో పాటు విద్యుత్ కోతలను అధిగమించేందుకు బొగ్గుగనులను ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్‌కు బహిరంగ వేలంలోనే కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ‘2015లో తెలంగాణకు మూడు కోల్ బ్లాకులను కేటాయిస్తే.. అందులో పెలగడప్ప, న్యూ పట్రపార కోల్బ్లాకును సింగరేణి సంస్థనే వెనక్కి ఇచ్చేసింది. నైని గనిలో తవ్వకాల అనుమతులకు కేంద్రం సాయం చేసింది. తాడిచర్ల బ్లాక్ 1ను సింగరేణి, జెన్కోలకు ఇస్తే.. సింగరేణితో తప్పుడు రిపోర్టులిచ్చి, ఆ బ్లాక్‌ను ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే కట్టబెట్టింది. అందులోని ఒక కంపెనీలో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉంది. దీనిపై విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు. -
బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర ఎంపీలు బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయా లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కే బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. లోక్‌సభలో సింగరేణి అంశాన్ని ‘అత్యవసర’ అంశంగా లేవనెత్తిన ఉత్తమ్.. కల్యాణ ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్– 3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వరంగ బొగ్గు గనుల సంస్థ ఎస్సీసీఎల్కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలసి ఉన్నాయన్నారు. మోదీ ప్రైవేటీక రణ చేయబోమని హామీ ఇచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకే ముందుకు వెళుతోందన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తోంది సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి నామా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణనే తీసుకుంటుందని నామా అన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ.. విధానపరమైన నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకుంటోందన్నారు. కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభు త్వానికే కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు. ఆరోపణలు నిరాధారం: కేంద్ర మంత్రి జోషి సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీల ఆరోపణలు నిరాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీల ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉండగా, 49% వాటా కలిగిన కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే గనుల వేలం విష యంలో కేంద్రం.. ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం –1957 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో కళ్యాణఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి గనుల వేలం ప్రక్రియలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, వాటిని ఎస్సీసీఎల్కు కేటాయించాలని తెలంగాణ అభ్యర్థించినా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి అన్ని కోల్ బ్లాకులను వేలం పద్ధ తిలోకి తెచ్చామన్నారు. గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళుతుందని, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని మంత్రి విమర్శించారు. -
ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్‌లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
ఒక ప్రాంతం.. అనేక కరెంటు కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ ప్రైవేటీకరణదిశగా కేంద్రం దూకుడు పెంచింది. యావత్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాల మొత్తం ప్రాంతం పరిధిని విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంతం(మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా పరిగణిస్తూ కొత్త విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కం)లకు లైసెన్సులు జారీచేయాలని ఆదేశించింది. లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన మరేతర చిన్న ప్రాంతాన్ని కూడా మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లైగా పరిగణిస్తూ కొత్త డిస్కంలకు లైసెన్సులు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ రూల్స్(రెండో సవరణ)–2022ను ప్రకటిస్తూ ఈ నెల 28న కేంద్ర విద్యుత్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత సెప్టెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తెచ్చిన సవరణలకు మరింత స్పష్టతనిస్తూ తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ప్రభుత్వాలు నిర్దేశించనున్న ఎంత చిన్న ప్రాంతంలోనైనా ఒకటికి మించిన సంఖ్యలో సమాంతర విద్యుత్ కంపెనీల ఏర్పాటుకు కొత్త సవరణలు వీలు కల్పించనున్నాయి. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ విద్యుత్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయాలని పాత నిబంధనలు పేర్కొంటున్నాయి. విద్యుత్ బిల్లు అమలు కోసమే.. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా, రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని, ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టసవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. తమ సొంత పంపిణీ వ్యవస్థ ద్వారానే వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను సైతం తొలిగిస్తున్నట్టు విద్యుత్ బిల్లులో కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించాలని ఇంకో కీలక ప్రతిపాదన చేసింది. తాజాగా విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంత పరిధిపై పరిమితులను ఎత్తివేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తేవడంతో భవిష్యత్తులో విద్యుత్‌బిల్లు అమలుకు మార్గం సుగమమైంది. విద్యుత్ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచినట్టు కానుంది. -
లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో కొనసాగుతున్నప్పుడు దాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. నిర్వాసితులకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల కల్పనపై దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సువర్ణరాజు అనే వ్యక్తి కూడా పిల్ దాఖలు చేశారు. అలాగే ఈ అంశంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ధనలక్ష్మి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఎంత మేర నష్టాల్లో ఉంది? ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకెళుతూనే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు?.. ఆ సంస్థ నష్టాల్లో ఉందా? అంటూ ప్రశ్నించింది. సొంత అవసరాల నిమిత్తం క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడంతో ఆ సంస్థ నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. దీనిని సాకుగా చూపి ఆ సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ప్రైవేటీకరణకు కారణాలు ఏమిటో కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గత ఐదేళ్ల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎంత మేర నష్టాలు వచ్చాయని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం నోరుమెదపడం లేదని ఆదినారాయణరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల వ్యాపారాలు మందకొడిగా సాగినా, ఒక్క ఉక్కు వ్యాపారం మాత్రం భారీ ఎత్తున సాగిందని తెలిపింది. ఆ సమయంలో చైనా ఉక్కును సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో అది మన ఉక్కు పరిశ్రమలకు కలిసొచ్చిందని గుర్తు చేసింది. స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తోంది.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో నడుస్తోందని చెప్పారు. వందల కోట్ల రూపాయల మేర లాభాలు ఆర్జించిందన్నారు. ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. లాభాల్లో ఉంటే ప్రైవేటీకరణ ఎందుకని ప్రశ్నించింది. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. నిరంతర నష్టాల వల్లే ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సమయంలో ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ.. ప్రపంచంలో ధనవంతులుగా చలామణి అవుతున్న కొంతమంది ఈ సంస్థను నడపగలరని కేంద్రం భావిస్తోందని, ఆ వ్యక్తులెవరో అందరికీ తెలుసన్నారు. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. -
Bharat Jodo Yatra: ప్రైవేటీకరణకు అడ్డుకట్ట: రాహుల్
సాక్షి, బళ్లారి: ప్రభుత్వ రంగ సంస్థల విచ్చలవిడి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనికి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఆయన భారత్ జోడో పాదయాత్ర బుధవారం కర్ణాటకలో కొనసాగింది. చిత్రదుర్గం జిల్లాలో అవయవ దానం చేసిన వారి పిల్లలు, కుటుంబీకులతో రాహుల్ కలిసి నడిచారు. గొప్ప దాతల సంబంధీకులతో కలిసి నడవడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ అనంతరం ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్‌కుమార్, ఇటీవల మరణించిన ఆయన కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానం లక్షలాది మంది కన్నడిగులకు ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు. అంతకుముందు గిరియమ్మనహళ్లి వద్ద రాహుల్ నిరుద్యోగ యువతతో, రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పథకం తీసుకొస్తామన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. యువత సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేసే వ్యవస్థను తెస్తామని చెప్పారు. -
అదే సంకల్పం...ఆగని సమరం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులు పూర్తి కానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను శతశాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజలు ధర్నాలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు దిగ్భందించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించి 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు నగరానికి మహా ప్రదర్శన ఉద్యమం 500వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంట్ నుంచి నగరానికి మహా ర్యాలీ నిర్వహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసింది. 10వేల మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, యువకులు, మాజీ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గోనున్నారు. ఈ నెల 27న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. మహా ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్‌లో, ఉక్కునగరంలో, నిర్వాసిత కాలనీల్లో విస్తృత ప్రచారం చేసింది. మహా ప్రదర్శన రూట్‌మ్యాప్ ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఉదయం ఉక్కునగరం నుంచి దేశపాత్రునిపాలెం, శనివాడ, అగనంపూడి, కూర్మన్నపాలెం, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌లపై నగరంలో డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని.. అక్కడ నుంచి కాలినడకన జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 2021 2న కేంద్ర నిర్ణయం బయటకు పొక్కింది. 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. 7న ఉక్కు కార్మిక సంఘాలు, అధికార సంఘం, వివిధ అసోసియేషన్లతో పోరాట కమిటీ ఏర్పాటైంది. 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం 12న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సీపీఐ నారాయణ, నాటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 17న విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం 18న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీలతో భారీ బహిరంగ సభ 20న జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలి వరకు 25 కిలోమీటర్ల మేర ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతల పాదయాత్ర 26న జాతీయ రహదారిపై రాస్తారోకో 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ రహదారి దిగ్భందం మార్చి 2021 9న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి 14న కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు పాదయాత్ర 15న ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీలకు వినతిపత్రాల సమర్పణ 20న వేలాది మందితో ఉక్కు త్రిష్ణా మైదానంలో కార్మిక గర్జన 26న రైతు చట్టాలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భారత్ బంద్ 31న నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఏప్రిల్ 2021 4న ఆర్.కె బీచ్‌లో నిరసన ప్రదర్శన 8న అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకు 10 వేల మందితో 10 కిలో మీటర్ల మానవహారం 18న రైతాంగ పోరాట నాయకుడు రాకేష్ సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక గర్జన మే 2021 22న దీక్ష శిబిరం వద్ద 100 జెండాలు, 100 మీటర్ల బ్యానర్‌తో వంద మంది దీక్ష 22న ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జూన్ 2021 స్టీల్‌ప్లాంట్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జూలై 2021 8న ఉక్కు గేట్ల వద్ద ధర్నా 9న సీపీఐ కార్యదర్శి నారాయణ దీక్ష స్థలి సందర్శన 10న నగరంలోని మహాధర్నాకు బైక్ ర్యాలీ 15న కోక్‌ఓవెన్స్ నుంచి మెయిన్ గేటు వరకు పాదయాత్ర 27న చలో అడ్మిన్ కార్యక్రమం (చదవండి: ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం) -
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం వాటి మంచి కోసమేనట!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) కేంద్రం వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) అనేది ఆయా సంస్థలను మరింత సమర్థమంతంగా మార్చేందుకు ఉద్దేశించినదే తప్ప వాటి మూసివేతకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 1994–2004 మధ్య కాలంలో ప్రైవేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుతం ప్రొఫెనల్స్ సారథ్యంలో విజయవంతంగా నడుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. దీపం సదస్సులో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. మరింత పెట్టుబడులు పెట్టి, ఉత్పత్తిని పెంచగలిగి, సమర్థంగా నడిపించగలిగే వారి చేతికి అప్పగించాలనేదే సంస్థల ప్రైవేటీకరణ వెనుక ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా వాటాల విక్రయం కోసం ఐడీబీఐ బ్యాంక్ షిప్పింగ్ కార్పొరేషన్, వైజాగ్ స్టీల్, ఎన్ఎండీసీ తదితర అరడజను సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఎయిరిండియాలో వాటాల విక్రయం సహా ప్రైవేటీకరణ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 13,500 కోట్లు సమీకరించింది. చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
భారత్ పెట్రోలియం అమ్మకానికి బ్రేక్!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. డిజిన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకున్న అన్ని చర్యలకూ ప్రభుత్వం మంగళంపాడినట్లు బీపీసీఎల్ తాజాగా వెల్లడించింది. కంపెనీలోగల 53 శాతం వాటా విక్రయానికి చేపట్టిన ప్రస్తుత టెండర్‌ను ఈ నెల 3న ప్రభుత్వం రద్దు చేసినట్లు స్టాక్ ఎక్సే్ంజీలకు తెలియజేసింది. దీంతో డేటా రూమ్ వివరాలుసహా డిజిన్వెస్ట్‌మెంట్ సంబంధ అన్ని సన్నాహాలనూ నిలిపివేసిందని వివరించింది. కారణం ప్రధానంగా కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం(ఈవోఐ) చేసిన మూడు బిడ్డర్లలో రెండు సంస్థలు వెనక్కి తగ్గడం ప్రభావం చూపింది. అర్హత సాధించిన సంస్థల కోసం గతేడాది ఏప్రిల్‌లో కంపెనీకి సంబంధించిన ఆర్థిక సమాచార వేదిక వర్చువల్ డేటా రూమ్‌కు బీపీసీఎల్ తెరతీసిన విషయం విదితమే. సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి వాటా కొనుగోలు ఒప్పందానికి సంసిద్ధతను వ్యక్తం చేయవలసి ఉంటుంది. ఆపై ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానిస్తుంది. అయితే ఈ దశవరకూ ప్రక్రియ వెళ్లకపోవడంతో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను విరమించుకుంది. చదవండి: వినియోగదారులకు షాక్:హెచ్డీఎఫ్సీ రెండో ‘వడ్డింపు’ -
ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
పెనమలూరు: ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరుగుతోన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర 10వ మహాసభల ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. దేశంలో జరుగుతోన్న ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ నియామకం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీని నియమించారు. అధ్యక్ష కార్యదర్శులుగా పి.మంగరాజు, ఎస్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా గుర్రం రమణ, సుభాషిణి, సహాయ కార్యదర్శులుగా షేక్.కాశిం, ఐ.వెంకటేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు మరో 38 మంది కార్యవర్గ సభ్యులూ ఉన్నారు. -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్‌కు బ్రేక్! ముగ్గురిలో ఇద్దరు వెనక్కి
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
Rajya Sabha: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం
సాక్షి, ఢిల్లీ: ప్రైవేటీకరణకు పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్‌కి వెయ్యి కోట్ల లాభాలు వచ్చాయి. లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను ప్రైవేటీకరణ చేయవద్దు. సొంత గనులను కేటాయించకపోవడం, హక్కులను పునర్వ్యవస్థీకరించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని’’ ఎంపీ అన్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఎలాంటి సంస్కరణలు చేయలేక పోవడం శోచనీయం. హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తగ్గించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 20,928 కోట్ల నుంచి 26,264 కోట్ల రూపాయలకు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 20,928 కోట్ల రూపాయలతో చేపట్టే విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు జూలై 2016లో హెచ్పీసీఎస్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్ట్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్ పనులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 26,785 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ దిగుమతులు ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 వరకు 26,785 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎం) ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకున్నట్లు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 31,137 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో (ఆన్‌షోర్‌లో) 2016-17 నుంచి 2020-21 వరకు 4,647 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2017-18లో 32 వేల మెట్రిక్ టన్నుల సీఎన్జీ అమ్మకాలు జరగ్గా 2020-21లో అది 13 వేల మెట్రిక్ టన్నులకు తగ్గాయని చెప్పారు. కోవిడ్ కారణంగా సీఎన్జీ అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. 2021-22లో సీఎన్జీ అమ్మకాలు పుంజుకుని 14 వేల మెట్రిక్ టన్నులకు చేరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, విజయవాడ, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, కోలార్, వెల్లూరు జిల్లాల్లో కలిపి మొత్తం 111 సీఎన్జీ స్టేషన్లు ఉన్నట్లు మంత్రి వివరించారు. -
‘బ్లాకుల’ ప్రైవేటీకరణ అసాధ్యం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అసాధ్యం. సింగరేణి సంస్థకు చెందిన గనులన్నీ ఆ సంస్థకే చెందాలని నిజాం పాలనలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో సింగరేణి సంస్థ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పం దం కుదుర్చుకున్నాయి. సింగరేణిలో రాష్ట్ర ప్రభు త్వం 51, కేంద్రం 49% వాటాలు కలిగి ఉన్నాయి. దీంతో ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానిదే తుదినిర్ణయంగా ఉంటుంది’అని సింగరేణి పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్(పీఏడబ్ల్యూ) డైరెక్టర్ ఎన్.బలరాం స్పష్టం చేశారు. సింగరేణికి పేలుడు పదర్థాల సరఫరాపై ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం, గనుల్లో వరుస ప్రమాదాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, డిస్మిస్ కార్మికుల సమస్యల గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. టెండర్లు పిలిచినా ముందుకు రాలేదు 2015 జనవరిలో అమల్లోకి వచ్చిన మినరల్స్, మైన్స్డెవలప్మెంట్ రెగ్యులరైజేషన్(ఎంఎండీఆర్) చట్టానికనుగుణంగా తెలంగాణ లోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ–3, శ్రావణపల్లి ఓసీ, కేకే–6 బ్లాకు లను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలకు బ్లాకులు అప్పగిస్తే సమయం ఆదాతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుంటాయని కేంద్రం భావించింది. త్రైపాక్షిక ఒప్పందానికి కేంద్ర నిర్ణయం విరుద్ధంగా ఉండటం, దాన్ని కార్మికసంఘాలు వ్యతిరేకించడంతో బ్లాకుల ప్రైవేటీకరణ సాధ్యం కాని పని. బ్లాకుల నిర్వహణకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్టే. ఎక్స్‌ప్లోజివ్స్ కోసం ప్రత్యామ్నాయ చర్యలు ఉక్రెయిన్– రష్యా యుద్ధం నేపథ్యంలో సింగరేణికి ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా(అమ్మోనియం నైట్రేడ్) పూర్తిగా నిలిచిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ (పుణే–70%ఎక్స్‌ప్లోజివ్స్), స్టార్ క్యామ్ సంస్థ(30%) ద్వారా ఒక టన్ను ఎక్స్‌ప్లోజివ్స్‌కు రూ.65 వేలకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసుకుంటోంది. వచ్చే నెల రెండోవారం వర కు ఆయా సంస్థలతో ఒప్పందం ఉంది. యుద్ధం కొనసాగినా ఆ పరిస్థితిని అధిగమించేలా సింగరేణి ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. రోజూ ఓపెన్ కాస్టుల్లో ఓవర్ బర్డెన్కు 560 టన్నులు, భూ గర్భ గనులకు 50 టన్నులు మొత్తం 610 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్ అవసరమవుతాయి. స్థానికతకు పెద్దపీట రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సింగరేణి నియామకా ల్లో స్థానికతకు పెద్దపీట వేస్తున్నాం. ఇకపై సంస్థలో కార్మిక విభాగంలో 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తాం. ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో గతంలో ఉన్న 60(స్థానిక), 40(స్థానికేతర) శాతాన్ని మార్పు చేశాం. 80% ఉద్యోగాలు స్థానికులకు, 20% స్థానికేతరులకు ఇవ్వనున్నాం. ఇటీవల సింగరేణి భూగర్భ గనుల్లో ప్రమాదాలు పెరగడం బాధాకరం. డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పర్యవేక్షించి ఆదేశిస్తేనే కార్మికులు గనుల్లో పని చేస్తుంటారు. గతం తో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయి. మరో అవకాశం సింగరేణిలో ఆరు వేలమంది డిస్మిస్ కార్మికులున్నా రు. అనారోగ్యం, గనుల్లో పని చేయడం ఇష్టం లేక, వ్యవసాయం, ఇతర ఉద్యోగాలపై ఆసక్తితో కార్మికులు సింగరేణి వంద మస్టర్ల నిబంధనను పాటించడం లేదు. దీంతో వారిని డిస్మిస్ చేయాల్సి వస్తుంది. వీరి కోసం బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం మరో అవకాశం ఇవ్వాలని సింగరేణి భావిస్తోంది. -
ప్రైవేటీకరణ ఎలా చేద్దాం? విదేశీ ఇన్వెస్టర్లతో ప్రధాని కీలక సమావేశం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసెట్ మానిటైజేషన్ వ్యూహాలు, దేశ వృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాల గురించి చర్చించేందుకు ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ 2022 మార్చి 9న సమావేశం కానున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆ్రస్టేలియా తదితర ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, మౌలిక రంగం .. రియల్ ఎస్టేట్ వర్గాలు , లీగల్ నిపుణులు మొదలైన వారు ఈ భేటీలో పాల్గోనున్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం), నీతి ఆయోగ్ కలిసి నిర్వహిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వెబినార్‌లో 22 శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. ‘ప్రైవేటీకరణ వ్యూహాల అమలు విషయంలో ఆయా రంగాల నిపుణులు, ఇన్వెస్టర్లు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నది ఈ వెబినార్ లక్ష్యం‘ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకున్నప్పటికీ ఆ తర్వాత రూ. 78,000 కోట్లకు సవరించింది. కానీ ఇప్పటి వరకూ రూ. 12,400 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. చదవండి: మోదీ సర్కార్ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! -
Sakshi Cartoon: పబ్లిక్ రంగసంస్థలన్నీ ఎప్పుడో ప్రయివేటీకరించాం.ఇంకా పబ్లిక్ ఏంటి సార్!
పబ్లిక్ రంగ సంస్థలన్నీ ఎప్పుడో ప్రయివేటీకరించాం.ఇంకా పబ్లిక్ ఏంటి సార్! -
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి
అగనంపూడి (గాజువాక): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం కూర్మన్నపాలెం కూడలి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ .. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ఉద్యమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం తగదన్నారు. ఇప్పటికే విద్య, వైద్య, రక్షణ, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరించిన కేంద్రం కొరియన్ సంస్థ పోస్కోకు విశాఖ స్టీల్‌ను అమ్మేస్తే భవిష్యత్‌లో తెలుగు ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మృగ్యం అవుతాయన్నారు. విశాఖ జోలికి రావద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్కో యాజమాన్య ప్రతినిధులకు చెప్పారని, అవసరమైతే కడప స్టీల్‌ప్లాంట్ అప్పగిస్తామని చెప్పినా అవసరం లేదని వారు తేల్చి చెప్పేశారన్నారు. కేవలం విశాఖ ఉక్కు భూములు, ఇక్కడ సహజ నౌకాశ్రయం ద్వారా దేశ సంపదను తరలించిపోడానికి పన్నిన పన్నాగమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి మేల్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు సీహెచ్.నరసింగరావు, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, వై.మస్తానప్ప, డి.ఆదినారాయణ పాల్గొన్నారు. 239 మంది కార్మికుల అరెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో గాజువాకలో 239 మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద, తగరపువలసలో కూడా జైల్‌భరో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలువురు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. -
స్టీల్‌ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ పార్లమెంట్లో గళమెత్తారు. లోక్‌సభలో సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని చెప్పారు. ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరిట అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాలతో 1982లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు 64 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఆభరణం వంటిదన్నారు. 35 వేల మంది ఉద్యోగుల, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు ఈ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. దేశంలో ముడిసరుకు కోసం అధిక మొత్తం వెచ్చి స్తున్న స్టీల్‌ప్లాంట్‌గా, సొంతగనులు లేని ప్లాంట్‌గా ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మించాలని సదస్సు పిలుపునిచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో విస్తృతంగా సంతకాలు సేకరించి బడ్జెట్ సమావేశాల నాటికి పార్లమెంటుకు కోటి సంతకాలు పంపాలని సదస్సు తీర్మానించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా కోటి సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్త సదస్సులు, భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కె.ఎం. శ్రీనివాస్, ఆదినారాయణ మాట్లాడారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.పోలారి (ఇఫ్టూ), నరహరశెట్టి నరసింహారావు, పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.వి.సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు. -
నీలాచల్ ఇస్పాత్ రేసులో ఎంఈఐఎల్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రయివేటైజేషన్‌కు ఆసక్తిగల కంపెనీల నుంచి స్పందన లభించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. పీఎస్యూలో వ్యూహాత్మక వాటా కొనుగోలుకి ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు వెల్లడించారు. దీంతో కంపెనీ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో ఎన్ఐఎన్ఎల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి వీలుగా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా కంపెనీలను దీపమ్ ఆహ్వానించింది. దరఖాస్తుకు మార్చి 29 తుది గడువుకాగా.. పలు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) దరఖాస్తులు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. మెటల్ రంగ ప్రయివేట్ దిగ్గజాలు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సీŠట్ల్, జేఎస్‌పీఎల్‌సహా.. ఇన్ఫ్రా రంగ హైదరాబాద్ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్) సైతం తాజాగా ఫైనాన్షియల్ బిడ్స్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మేం స్వతంత్రంగా వ్యవహరించలేం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరే తమ వైఖరి అని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గురువారం హైకోర్టుకు నివేదించింది. తమది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినందువల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్టీల్ ప్లాంట్ తరఫు న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగాకానీ, వ్యతిరేకంగాకానీ తమ వైఖరిని చెప్పలేమన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌నే తాము అన్వయింప చేసుకుంటున్నామని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణపై ఫిబ్రవరి 2న తుది విచారణ మొదలు పెడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు ప్రైవేటీకరణ విషయంలో ఏవైనా కీలక పరిణామాలు ఉంటే వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ముందస్తు విచారణ కోరవచ్చునంటూ పిటిషనర్లకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు మరొకరు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫు న్యాయవాది స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా పలు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం సూచించగా.. వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ వ్యాజ్యాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. -
బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం!
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు ‘బెయిల్ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్ అవుట్) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యునైటెడ్ వెస్ట్రన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్బీఎఫ్సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ బెయిల్ అవుట్‌కు ఎస్బీఐ, ఎల్ఐసీలను వినియోగించుకోవడం జరిగింది. ► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం. ► ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం. -
విద్యార్థుల ‘ఉక్కు’ పిడికిలి
డాబా గార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం తొక్కారు. స్టూడెంట్స్ మార్చ్ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. 1966 నవంబర్ 1న వన్‌టౌన్ ప్రాంతంలో విశాఖ ఉక్కు సాధన కోసం జరిగిన ప్రదర్శనపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మంది నగర విద్యార్థులను పొట్టన పెట్టుకున్న రోజును పురస్కరించుకుని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఏవీఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త రోడ్డు మీదుగా పాత పోస్టాఫీస్ వరకు సాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఫ్ బిశ్వాస్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పూనుకుందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కి మహేషరీ మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు.. ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.నరసింగరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు మంత్రి రాజశేఖర్, ఎం.జగ్గునాయుడు, కమిటీ ప్రతినిధి డాక్టర్ కొల్లా రాజమోహన్, ఆదినారాయణ, ప్రసన్నకుమార్, హరీష్‌కుమార్, జాన్సన్, రామ్మోహనరావు, కుసుమ, చిన్నారి, పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో పవన్ కళ్యాణ్ స్పందన
-
కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు
అగనంపూడి (గాజువాక): ప్రజాభీష్టాన్ని కాదని ముందుకు వెళ్లే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సారథ్యంలో చేపట్టిన రిలే దీక్షలు 250వ రోజుకు చేరిన సందర్భంగా మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో నిరసన గళం విప్పామన్నారు. ఇకపై జరగబోయే ఏ సమావేశాల్లోనైనా ఆంధ్రుల అభీ ష్టాన్ని తెలియజేస్తూ నిరసన తెలుపుతామని చెప్పారు. ఉద్యమానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆంధ్రులకు ఉన్న ఏకైక అతిపెద్ద కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూ రావు, కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. అయినా కేంద్రం ముందుకు వెళ్తే భవి ష్యత్‌లో జరగబోయే పరిణామాలకు బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రుల మనోభావాలతో ఆడుకోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అలాకాదని మొండిగా వెళ్తే బీజేపీ పాలకులు రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు. పోరాట కమిటీ నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వేలమంది నిర్వాసితుల త్యాగం వల్ల ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే నిర్వాసితులు, ఉద్యోగుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఏయూ మాజీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు, ఉక్కు మాజీ డైరెక్టర్ కె.కె.రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు జె.వి.సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నగర ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడారు. -
ఎయిరిండియా ఇంధన బకాయిలు బదిలీ
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్‌నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్పీవీకి బదిలీ చేయనుంది. డిసెంబర్‌లోగా బ్యాలెన్స్ షీట్... ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్‌షీట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ కానున్నాయి. సంస్కరణలకు సంకేతం ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్‌ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు. -
సొంతగూటికి ఎయిరిండియా!!
పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సుదీర్ఘ నిరీక్షణకు, ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కథకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. తొమ్మిది దశాబ్దాల క్రితం తాము నెలకొలి్పన విమానయాన దిగ్గజం ఎయిరిండియాను దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ తిరిగి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో పోటీ సంస్థ స్పైస్‌జెట్‌ను పక్కకు నెట్టి, రూ. 18,000 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. దీనిపై టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆనందం వ్యక్తం చేయగా, ప్రభుత్వ .. పరిశ్రమ వర్గాలు అభినందనలు తెలియజేశాయి. తిరిగి టాటా గ్రూప్ గూటికి చేరడంపై ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీ: పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో, ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ దక్కించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఎయిరిండియాకు సంబంధించి రూ. 15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేసినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. డిసెంబర్ ఆఖరు నాటికి లావాదేవీ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. 2020 డిసెంబర్ నాటికి ఏడు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) వచ్చాయని, కానీ రెండే అర్హత పొందాయని పాండే తెలిపారు. హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని నిర్దిష్ట ఎయిరిండియా ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఐఎస్ఏఎం) అక్టోబర్ 4నే టాటా గ్రూప్ బిడ్‌కు ఆమోద ముద్ర వేసిందని ఆయన చెప్పారు. అయితే, దీన్ని అప్పుడే ప్రకటించకపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. ‘‘డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లావాదేవీ పూర్తి కావచ్చని భావిస్తున్నాం’’ అని పాండే పేర్కొన్నారు. ఇక తర్వాత దశలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేయడం, వాటాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయడం మొదలైనవి ఉంటాయని ఆయన తెలిపారు. ఎయిరిండియాకు రిజర్వ్ ధర రూ. 12,906 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా .. ప్రైవేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సారథ్యంలోని కన్సార్షియం రూ. 15,100 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. మరోవైపు, ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్‌నకు చేరడంతో కంపెనీకి కొత్త శకం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్లో వ్యాఖ్యానించారు. కొత్త మేనేజ్మెంట్కు అభినందనలు తెలిపారు. రెండో పెద్ద ఎయిర్‌లైన్స్ గ్రూప్‌గా టాటా.. బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ విజేతగా నిలి్చన వార్త వచి్చన కాస్సేపటికి, కంపెనీ మాజీ చైర్మన్ జేఆర్డీ టాటా గతంలో ఎయిరిండియా విమానం నుంచి దిగుతున్న పాత చిత్రాన్ని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ట్వీట్ చేశారు. నిర్దిష్ట రంగాల్లో ప్రైవేట్ సంస్థలకు చోటు కలి్పంచడం హర్షణీయమని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాజా పరిణామంతో 1953లో జాతీయం చేశాక, దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా సొంత గూటికి చేరినట్లయింది. ఎయిరిండియాను దక్కించుకోవడంతో టాటా గ్రూప్‌లో మూడో ఎయిర్‌లైన్ బ్రాండ్ చేరినట్లవుతుంది. టాటా గ్రూప్ ఇప్పటికే ఎయిర్ఏషియా, విస్తార (సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి) విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. ఎయిరిండియా, విస్తార, ఎయిర్‌ఏíÙయాలకు మొత్తం 26.9 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. ఈ మూడు సంస్థల కన్సాలిడేషన్ ప్రక్రియ గానీ పూర్తయితే దేశీయంగా ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా టాటా గ్రూప్ ఆవిర్భవించనుంది. డీల్ స్వరూపం ఇలా.. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా దాని అనుబంధ కంపెనీల మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో టాటా గ్రూప్ రూ. 15,300 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. మిగతా రూ. 46,262 కోట్లు స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్)కు బదలాయిస్తారు. ఎయిరిండియాకు చెందిన స్థలాలు, భవంతులు వంటి ప్రధానయేతర అసెట్స్ ఈ డీల్‌లో భాగంగా ఉండవు. వీటిని ఏఐఏహెచ్‌ఎల్‌కు కేంద్రం బదలాయిస్తుంది. వీటి విలువ సుమారు రూ. 14,718 కోట్లు. ఎయిరిండియా బ్రాండ్ లేదా లోగోను అయిదేళ్ల దాకా టాటా గ్రూప్ మరెవరికీ బదలాయించడానికి వీల్లేదు. ఆ తర్వాత ఒకవేళ బదలాయించినా భారతీయ సంస్థకే ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిరిండియాకు 4,400 పైచిలుకు దేశీయ, 1,800 అంతర్జాతీయ విమాన సరీ్వసుల ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 స్లాట్లు ఉన్నాయి. ఇవి ఇక టాటా గ్రూప్‌నకు దక్కుతాయి. ఎయిరిండియాకు చెందిన 117 విమానాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24 విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఏడాది దాకా ఉద్యోగులను తీసేయొద్దు.. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం లావాదేవీ పూర్తయిన నాటి నుంచి ఏడాది పాటు ఎయిరిండియా ఉద్యోగులందరినీ టాటా గ్రూప్ కొనసాగించాలని విమానయాన శాఖ కార్య దర్శి రాజీవ్ బన్సల్ తెలిపారు. రెండో ఏడాదిలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ చేయవచ్చు. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు (8,084 మంది పర్మనెంట్, 4,001 మంది కాంట్రాక్ట్) ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,434 మంది సిబ్బంది ఉన్నారు. వెల్కం బ్యాక్ ఎయిరిండియా.. ‘ఎయిరిండియాకు పునఃస్వాగతం. ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకుందన్న వార్త అద్భుతం. ఎయిరిండియాను పునర్నిర్మించడానికి గణనీయంగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే, ఏవియేషన్ మార్కెట్లో టాటా గ్రూప్ మరింత పటిష్టంగా ఎదిగేందుకు దోహదపడగలదు. జేఆర్డీ టాటా సారథ్యంలో అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఎయిరిండియా వెలుగొందింది. జేఆర్డీ నేడు మన మధ్యలో ఉంటే ఎంతగానో ఆనందించేవారు‘ – రతన్ టాటా, గౌరవ చైర్మన్, టాటా సన్స్ టాటా గ్రూప్‌నకు అభినందనలు ఎయిరిండియా బిడ్డింగ్‌లో గెలుపొందిన టాటా గ్రూప్‌నకు అభినందనలు. ఎయిరిండియాకు టాటా గ్రూప్ పూర్వ వైభవం తీసుకురాగలదు. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వానికి కూడా అభినందనలు‘ – అజయ్ సింగ్, సీఎండీ, స్పైస్‌జెట్ జేఆర్డీ టాటా మానసపుత్రిక.. ఇంత భారీ మొత్తం వెచ్చించి ఎయిరిండియాను టాటా గ్రూప్ దక్కించుకోవడానికి ఆ సంస్థతో గల బలమైన అనుబంధమే కారణం. అప్పట్లో గ్రూప్ చైర్మన్ జేఆర్డీ టాటా దీన్ని నెలకొల్పారు. ఆయనకు దీనిపై ఎంతో మమకారం ఉండేది. 1932 అక్టోబర్‌లో కరాచీ నుంచి బాంబేకు తొలి ఎయిర్‌మెయిల్ సరీ్వస్ విమానాన్ని ఆయనే స్వయంగా నడిపారు. 1953లో ఎయిరిండియాను జాతీయం చేయడాన్ని జేఆర్డీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయన మాట నెగ్గలేదు. అయితే, ఎయిరిండియా జాతీయం అయిన తర్వాత కూడా 25 ఏళ్ల పాటు దానికి జేఆర్‌డీనే చైర్మన్‌గా ప్రభుత్వం కొనసాగించింది. ఇటు టాటా గ్రూప్‌ను అటు ఎయిరిండియాకు సారథ్యం వహించినప్పుడూ ఆయన టాటా గ్రూప్కన్నా ఎయిరిండియా గురించే ఎక్కువగా ఆలోచించేవారం టూ పేరుండేది. అయితే, ఎయిరిండియా బాధ్యతలను ఆయన కష్టంగా కాకుండా ఎంతో ఇష్టంగా నిర్వర్తించేవారు. జేఆర్డీ టాటా -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విధానపరమైన నిర్ణయం: జీవీఎల్
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వ్యతిరేకిస్తూ మహా పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కాకతీయ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రారంభించిన ఈ పాదయాత్రలో గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమరి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. (చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం) ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో నడుస్తోందన్నారు. పార్టీలకతీతంగా స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడు నెలలుగా రోడ్లపైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వ్యతిరేకిస్తున్న కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం... విభజన హామీలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. చదవండి: ఒంగోలులో స్ట్రీట్ ఫైట్: వీడియో వైరల్ -
బీపీసీఎల్ చైర్మన్‌గా అరుణ్‌కుమార్ సింగ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో ఈ ఏడాది మేనెల్లో సింగ్ నియామకం జరిగింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ జరిగి, కొత్త యాజమాన్యం వచి్చన తర్వాతే చైర్మన్ నియామకం జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొలుత వర్తా లు వచ్చాయి. రాజ్‌కుమార్ గత ఏడాది పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కే పద్మాకర్ (మానవ వనరుల విభాగం డైరెక్టర్) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీపీసీఎల్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ సింగ్‌ను చైర్మన్‌గా ఎంపికచేస్తూ మే 10న ప్రభుత్వ రంగ సంస్థల నియామక వ్యవహారాల బోర్డ్ నిర్ణ యం తీసుకుంది. ఈవారం మొదట్లో ఆయన ని యామకానికి కేబినెట్ కమిటీ (నియామకాలు) ఆ మోదముద్ర వేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమ లో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఫైనాన్స్ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్ కంపెనీ కొత్త డైరెక్టర్ (ఫైనాన్స్)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్ సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్. విజయగోపాల్ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అనిల్ అగర్వాల్‌సహా మూడు గ్రూప్‌లు కొనుగోలుకు ‘‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్’’ దాఖలు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే వాటా అమ్మకాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, కరోనా వల్ల ఈ ప్రయత్నాలు ఆలస్యం అయ్యాయి. -
ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి యత్నం
ఉక్కు నగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి కార్మికులు యత్నించారు. భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సలహాదారుల నియామకానికి టెండర్లు వేయడానికి ఎవరైనా విశాఖ వస్తే తరుముతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజా సంపదను తన తాబేదార్లకు కట్టబెట్టడంలో భాగంగా విశాఖ ఉక్కును నూరు శాతం అమ్మాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇక్కడి ప్రజా పోరాటాన్ని చూసి గుత్తేదారులు ఎవరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ప్రక్రియను కొనసాగించాలని చూస్తే సహించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మెజార్టీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ప్రధానికి లేఖ రాసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. అయినప్పటికి తమ ఉద్యమం ఆగబోదన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్.నర్సింగరావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావు, వై.మస్తానప్ప, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, విళ్లా రామ్మోహన్కుమార్, డి.సురేష్‌బాబు, వరసాల శ్రీనివాస్, డేవిడ్, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, మాటూరి శ్రీనివాసరావు, నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి, ముత్యాలు, ఎం.శంకరనారాయణ, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. -
వైజాగ్ స్టీల్ ’అడ్వైజర్ల’ బిడ్డింగ్‌కు గడువు పొడిగింపు
ఉక్కునగరం (గాజువాక): వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన లావాదేవీ సలహాదారుల (అడ్వైజర్లు) బిడ్డింగ్‌కు గడువును ఆగస్టు 26 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు పొడిగించడం ఇది రెండోసారి. వాస్తవానికి జూలై 28కి గడువు ముగియాల్సి ఉండగా దాన్ని తర్వాత ఆగస్టు 17కి, అటుపైన తాజాగా ఆగస్టు 26కి పొడిగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాల విక్రయానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి లావాదేవీ సలహాదారుల నియామకం కోసం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) జూలై 7న బిడ్లు (ఆర్ఎఫ్పీ) ఆహ్వానించింది. -
ఈ ఏడాది ఎయిరిండియా సహా 10 సంస్థల అమ్మకం
కోవిడ్‌పరమైన అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది. మార్చి ఆఖరు నాటికి పలు సంస్థలను ప్రైవేటీకరించడం పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే సీఐఐ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, బీఈఎంఎల్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర 10 సంస్థల విక్రయం ఈ ఏడాది పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం, నియంత్రణ చేతులు మారిన పక్షంలో ఆయా సంస్థలకు మెరుగైన వేల్యుయేషన్లు లభించడానికి పాండే వివరించారు. ఎయిరిండియా తదితర సంస్థల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మదింపు, ఆర్థిక బిడ్లను ఆహ్వానించే దశలో ఉందని పేర్కొన్నారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల విలువ చేసే మౌలిక సదుపాయాల ఆస్తుల మానిటైజేషన్ (విక్రయం లేదా లీజుకివ్వడం వంటివి) ప్రణాళికను ఖరారు చేయడంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పాండే తెలిపారు. -
కేంద్రమంత్రి నిర్మలకు ‘ఉక్కు’ నిరసన సెగ
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ తీవ్ర ప్రయత్నం చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీతారామన్‌ను అడ్డుకోవాలని విశాఖ కార్మిక సంఘాలు పలుమార్లు విఫలయత్నం చేశాయి. ఆదివారం ఉదయం మంత్రి కేడీపేట వెళ్తున్నారని తెలుసుకున్న పరిరక్షణ కమిటీ నాయకులు కూర్మన్నపాలెం కూడలిలో అడ్డుకోవాలని భావించారు. పసిగట్టిన పోలీసులు ఆమెను సింహాచలం మీదుగా పంపించారు. దీంతో పరిరక్షణ కమిటీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, కె.సత్యనారాయణరావు, అయోధ్య, సుబ్బయ్య, రామకృష్ణ, కోరాడ వెంకటరావు పాల్గొన్నారు. -
జోరువానలోనూ ఉక్కు సంకల్పం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదాలతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్ధరిల్లింది. బ్యారికేడ్లు, పోలీస్ ఆంక్షలను ఛేదించుకుని ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జంతర్ మంతర్ సాక్షిగా ఎలుగెత్తి చాటారు. కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకున్న కార్మికులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. విశాఖ నుంచి రైలు ద్వారా ఢిల్లీ చేరుకున్న కార్మికులను తిరిగి వెళ్లాలని ఒత్తిడి చేశారు. వారు బస చేసిన హోటళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ ధర్నా సమయానికి జంతర్‌మంతర్ చేరుకున్న కార్మికులు జోరువానలోనూ నిరసన గళాన్ని వినిపించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎం, íసీపీఐ, ఎల్జేడీ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూయూ, ఐద్వా సంఘీభావం తెలిపాయి. పోరాడి అడ్డుకుంటాం.. ప్రజల త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా పార్లమెంట్లో పోరాడుతామని సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మోదీ సర్కార్ వేగవంతం చేసిందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించకుండా దేశ సంపదను ప్రైవేట్‌పరం చేయడంపైనే కేంద్రం మొగ్గు చూపుతోందన్నారు. ప్రజా ఉద్యమంతో తిరుగుబాటు కచ్చితంగా జరుగుతుందని, స్టీల్‌ప్లాంట్ ఉద్యమంతో ఇది ప్రారంభమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పోరాటం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేని పార్టీలు సైతం విశాఖ ఉక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నాయని, ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందించిన సహకారం మరిచిపోలేనిదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. కార్మికుల ఉద్యమానికి రైతులు అండగా ఉంటారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మాదిరిగానే దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు విక్రయించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడిందని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మూర్ఖత్వంతో వ్యవహరిస్తోందని, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు విశాఖ ఉక్కు నాణ్యమైనదంటూ ప్రకటించి మరోవైపు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. కలసికట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ సూచించారు. వైఎస్సార్సీపీ సంఘీభావం ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటంచేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా జరిపే పోరాటంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లుగా తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ విశాఖలో ప్రత్యామ్నాయ మార్గాలపై కార్మిక సంఘాల నేతలతో గత ఫిబ్రవరిలో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారన్నారు. కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయించాలని.. అలాగే, రూ.22 వేల కోట్ల రుణ భారానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘం నేతలు -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్న కేంద్రం
సాక్షి, న్యూ ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. -
విశాఖ ఉక్కు కార్మికుల ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు పోరాట కమిటీ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ ఎంపీ ధర్నాలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఢిల్లీని తాకింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కార్మికుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కార్మికుల నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జంతర్‌మంతర్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదాలతో ఢిల్లీ దద్దరిల్లుతోంది. -
ప్రైవేటీకరణ దిశగా కేంద్రం జోరు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానానికి కొత్త క్లాజ్‌ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్లో పేర్కొంది. విదేశీ కంపెనీల ఆసక్తి.. బీపీసీఎల్‌లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్‌లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకూ 49 శాతమే! 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా! ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. చిన్న విమానాశ్రయాలు షురూ..! దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో అంతిమ విజయం కార్మికులదే అని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం రిలే దీక్షా శిబిరం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్, కణితి, వడ్లపూడి ప్రధాన రహదారుల మీదుగా రిలే దీక్షా శిబిరం వరకు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారనుందని చెప్పారు. ఢిల్లీ పెద్దలను కదిలించే స్థాయిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్రను జాతీయస్థాయిలోని బీజేపీయేతర పార్టీల పార్లమెంటరీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
‘కేంద్ర’ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించండి
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ‘విద్యుత్ పంపిణీ పునరుద్ధరణ పథకాన్ని’ తిరస్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ అంశాన్ని కేంద్రం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటీకరించి, ఫ్రాంచైజీల పేరుతో దళారులను ప్రవేశపెట్టడం ఈ పథకం లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించే చర్యలను ఆపాలని మధు డిమాండ్ చేశారు. అలాగే చట్టవిరుద్ధంగా పౌరులు, ప్రజాప్రతినిధులపై నిఘా పెడుతున్న ఇజ్రాయల్ స్పై సాఫ్ట్వేర్ ‘పెగాసెస్’ను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పౌరులపై నిఘా ఏ రూపంలో ఉన్నా వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్‌కు వాటాలున్నాయి. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్‌లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్‌లో బీపీసీఎల్‌కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి. దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్‌కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్‌యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది. -
పీఎస్‌యూ రిఫైనరీల్లో 100% ఎఫ్‌డీఐ
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వరంగ రిఫైనరీ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగానే అమలవుతోంది. తాజా నిర్ణయంతో బీపీసీఎల్‌కు విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు బిడ్లు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. బీపీసీఎల్‌లో కేంద్ర సర్కారుకు 52.98 శాతం వాటా ఉండగా.. ఇందుకోసం రెండు విదేశీ కంపెనీలు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేశాయి. ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసిన సంస్థ.. అదనంగా 26 శాతం వాటా కొనుగోలుకు వీలుగా ప్రస్తుత వాటాదారులకు ఆఫర్‌ను ఇవ్వాల్సి వస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోణంలోనే ఎఫ్‌డీఐ పరిమితి పెంచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ మినహా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక్కటే నేరుగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. హెచ్‌పీసీఎల్‌ను మరో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బీపీసీఎల్ కోసం వేదాంత, అమెరికాకు చెందిన పీఈ సంస్థ అపోలో గ్లోబల్, ఐ స్కేర్డ్ క్యాపిటల్‌కు చెందిన థింక్ గ్యాస్ ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేశాయి. వృద్ధికి ఊతం... ప్రభుత్వ నిర్ణయం దేశీయంగా తయారీ కేంద్రాల ఏర్పాటుకు, పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి, టెక్నాలజీలకు మద్దతునిస్తుందని పరిశ్రమల మండళ్లు అభిప్రాయపడ్డాయి. లిస్టెడ్ స్పెషాలిటీ స్టీల్ కంపెనీలకు భారీ అవకాశాలకు వీలు కల్పిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్‌కు దారి చూపుతుందని పీహెచ్‌డీసీసీఐ చైర్మన్ (మినరల్స్, మెటల్స్ కమిటీ) అనిల్కుమార్చౌదరి అభిప్రాయపడ్డారు. స్పెషాలిటీ స్టీల్‌కు మద్దతు ఆత్మ నిర్భర్ భారత్, భారత్‌లో తయారీ లక్ష్యాలతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద స్పెషాలిటీ స్టీల్ రంగాన్ని కూడా చేరుస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ స్టీల్‌ను తయారు చేసే కంపెనీలకు ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.6,322 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల 5.25 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం దేశీయంగా తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. కోటెడ్, ప్లేటెడ్ స్టీల్ ఉత్పత్తులు, హై స్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రేల్స్, అలాయ్ స్టీల్, స్టీల్వైర్స్, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తులు పీఎల్ఐ పథకం కిందకు వస్తాయి. ఈ స్టీల్ ఉత్పత్తులను ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆయిల్, గ్యాస్ రవాణా పైపులు, రక్షణ రంగ ఉత్పత్తులు, అధిక వేగంతో కూడిన రైల్వే మార్గాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో వినియోగిస్తారు. ఒక కంపెనీకి గరిష్ట రాయితీల పరిమితిని రూ.200 కోట్లుగా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ రంగంలోకి రూ.40,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, అదనంగా 25 మిలియన్ టన్నుల తయారీ సామర్థ్యం పెరుగుతుందంటూ కేంద్ర ఉక్కు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ప్రైవేటీకరణను ఆపాల్సిందే..
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు. భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్ఈఎల్, సిమెంట్ కార్పొరేషన్, స్కూటర్స్ ఇండియా, హెచ్ఎంటీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు చేపట్టిన రిలే దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ఉద్యమానికి కొండంత బలం ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని, విశాఖ ఉక్కు ఉద్యమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉందని రాజశేఖర్ అన్నారు. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ ‘పరిషత్ ఎన్నికల తీర్పుపై డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం’ -
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే శరణ్యమా?
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ముఖ్యంగా యుద్ధంలో వినాశకరమైన ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి, వారి అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడానికి, వారి ఆర్థిక వ్యవస్థలను మహా మాంద్యం నుండి కాపాడటానికి ప్రభుత్వ రంగ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు ఉనికిలోకి వచ్చాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి సుదీర్ఘకాలం బ్రిటిష్ సామ్రాజ్య బానిసత్వంలో ఉండటం, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో అసమతుల్యత, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చాలా వెనుకబడి ఉండటం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి విషయాలలో చాలా వెనుకబాటుతనం భారతదేశ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ఈ సమయంలో, ప్రభుత్వ రంగం స్వావలంబన, స్థిరమైన ఆర్థిక వృద్ధికి అభివృద్ధి సాధనంగా భావించారు. అందువల్ల, దేశం ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి విధానాన్ని అనుసరించింది, దీనిలో పీఎస్‌యూలకు పెద్ద పాత్ర ఉంది. ఆర్థికంగా లాభం పొందలేనటువంటి రంగాలలోనూ, వివిధ ప్రాంతాలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి సంతులిత అభివృద్ధే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. క్రమక్రమంగా ప్రజల ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలలో పెరుగుదల కారణంగా, ప్రజల ఆకాంక్షలు కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ శాతం ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి కేంద్ర బిందువుగా పనిచేశాయి. సంక్షేమ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడంతో సంస్థ లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు చూపించడం జరిగింది. 1990లో అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో వచ్చిన లోటు కారణంగా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోరడం జరిగింది. ఆ సంస్థ నిబంధనల ప్రకారం దేశంలో ప్రైవేటీకరణను వేగవంతం చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. సరళీకరణ ప్రభావంతో ప్రభుత్వ రంగ సంస్థలకు దేశీయంగా, అంతర్జాతీయ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిరావడంతో, అవి ఒత్తిడికి లోనై నష్టాల బారిన పడ్డాయి. ఇకపోతే 1991 సరళీకృత విధానంతో ప్రజలకు చేరవేసే పథకాల అమలులో కూడా సరికొత్త విధానాలకి గీటురాయి ఏర్పడింది. 2019 ఫారూచ్యన్ 500 కంపెనీలలో 7 పీఎస్‌యూలు స్థానం సంపాదించుకున్నప్పటికీ, 70 ఇతర పీఎస్‌యూలు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకస్వామ్యం ఉన్న టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో సహా అనేక రంగాలను క్రమంగా ప్రైవేటీకరణకు దశలవారీగా తెరిచేశారు. ఇటీవల, రక్షణ వంటి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు అనుమతించారు. అంతేకాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, గెయిల్, ఎన్టీపీసీలతో సహా పలు ’మహారత్న’.. ’నవరత్న’ కంపెనీలు ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గడంతో ప్రైవేట్ కంపెనీలుగా మారే అవకాశం ఉంది. ఇటీవల రాజ్యసభలో మంత్రి ప్రకాష్ జవదేకర్ వీటిలో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో నష్టపోతున్న మొదటి మూడు పీఎస్‌యూలలో ప్రభుత్వ క్యారియర్ ఎయిర్ ఇండియా, టెలికాం కంపెనీలు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహా నగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎమ్టీఎన్ఎల్), ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో బీఎస్ఎన్ఎల్ రూ. 14,904 కోట్లు కోల్పోయింది; ఎయిర్ ఇండియా నష్టాలు రూ. 8,474 కోట్లు, ఎంటీఎన్ఎల్ నష్టాలు రూ. 3,390 కోట్లు ఉన్నట్లుగా కూడా తెలిపారు. భారతదేశంలో, 31 మార్చి 2019 నాటికి 70 ప్రభుత్వ రంగ యూనిట్లు (పీఎస్‌యూ) నష్టాల్లో ఉన్నాయి. వీటి మొత్తం భారం రూ. 31,000 కోట్లకు పైగా ఉంది. ఈ పీఎస్‌యూలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజల సంక్షేమం కోసం ఈ రంగాలను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ భాగస్వామ్యంతో పునరుద్ధరించినట్లయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల సంస్థల్లో జవాబుదారీతనాన్ని కూడా తీసుకో వచ్చినట్లయితే ఈ సంస్థలు ఉద్యోగ కల్పనతో పాటు, దేశ అవసరాలకు సరిపోయే విధంగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ మారం శ్రీకాంత్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఐఆర్డీ, హైదరాబాద్ -
ప్రైవేటీకరించే అధికారం మీకెక్కడిది?
సీతంపేట (విశాఖ ఉత్తర): కేవలం 30 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్లకు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే అధికారం ఎక్కడిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, ఎల్ఐసీని ఎలా అమ్మేస్తారని నిలదీశారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఉండవల్లి ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన ఏడు వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి న్యాయం చేయకుండా వేరే వారికి ప్లాంటును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ రోజు సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కేంద్రంపై వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేయగలరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. దేశ బడ్జెట్‌తో సమానమైన సొమ్ము కేవలం 63 మంది వద్ద ఉందంటే.. ఇది సోషలిస్టు దేశమా లేక క్యాపిటలిస్టు దేశమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ పాల్గొన్నారు. -
ఎయిరిండియాకు... త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు సంబంధించిన నూతన కాల వ్యవధిని పరిశీలిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. రానున్న రోజుల్లో ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల విక్రయానికి ఆర్థిక బిడ్లకు ఆహ్వానం పలకనున్నట్టు చెప్పారు. బిడ్డర్లు పరిశీలించేందుకు వీలుగా డేటా రూమ్‌ను అందుబాటులో ఉంచామని.. ఆర్థిక బిడ్లకు 64 రోజల వ్యవధి ఉందని చెప్పారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఎయిరిండియాను ప్రైవేటు సంస్థకు అప్పగించడమేనన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ అంశంపై మాట్లాడారు. కాగా, తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నూరు శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎయిర్ఇండియాను ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం మినహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అవకాశం లేదన్నారు. అజయ్‌సింగ్ దూకుడు... స్పైస్‌జెట్ ప్రమోటర్ అయిన అజయ్‌సింగ్ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఎయిరిండియా లో నూరు శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్ గ్రూపు ప్రమోటర్ అంకుర్ భాటియాతో జతకట్టారు. సింగ్, భాటియా ఇరువురూ తమ వ్యక్తిగత హోదాలో ఎయిరిండియా కోసం బిడ్లు దాఖలు చేశారని సంబంధిత ఉన్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాటా గ్రూపు సైతం ఎయిరిండియా కోసం పోటీపడుతోంది. చదవండి: రూ.999 కే విమాన టికెట్: ఏయే రూట్లలో? -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీల వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సభలో ప్రసంగించాక ఆ పార్టీ ఎంపీలు కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పనిచేస్తాయని.. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. ప్రైవేట్‌రంగ సంస్థలు కొంత మేర ఉపాధి కల్పించినా లాభార్జనే ఏకైక ధ్యేయంగా కంపెనీలను నడుపుతాయని తెలిపారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో స్టీల్ ప్లాంట్ నవరత్న సంస్థగా భాసిల్లుతోందన్నారు. దీన్ని ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని తమ పార్టీ ఎంతమాత్రం సమర్థించబోదని తేల్చిచెప్పారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థ. ఈ సంస్థ నష్టాలకు క్యాప్టివ్‌మైన్ లేకపోవడం, అత్యధిక వడ్డీతో రుణభారాన్ని మోయాల్సి రావడం కారణాలుగా ఉన్నాయి. అలాగే 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే ప్లాంట్ నిలబడుతుంది. క్యాప్టివ్‌మైన్ కేటాయించి.. రుణభారాన్ని ఈక్విటీ రూపంలోకి మారిస్తే ప్రైవేటీకరించాల్సిన అవసరం ఉండదు’ అని ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్రం విఫలం ‘రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా విభజన చట్టంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక రైల్వే జోన్ హామీ కార్యరూపం దాల్చలేదు. కేంద్రం విఫలమైంది కాబట్టి రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తే.. తదనంతరం ఆ జోన్‌ను రైల్వేకు బదిలీ చేసే అధికారం రాష్ట్రానికి ఇస్తారా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కోకింగ్ కోల్ కొరత ఉంది దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? అని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. బృందం ఏర్పాటైంది: కేంద్ర ఆర్థిక శాఖ మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు విధానాలు రూపొందించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
‘ఉక్కు’ను కాపాడుకుంటాం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, 64 కళలు.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్‌ను, ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా కళాకారులు ప్రదర్శించిన పెయింటింగ్స్, కార్టూన్స్ ఎగ్జిబిషన్‌ను నారాయణమూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు అనే స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి రాసిన లేఖ కలకలం రేపింది. 5:47 నిమిషాలకు ఉక్కు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లాగ్‌బుక్‌లో రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయారు. అతని టేబుల్ వద్ద ఐడీ కార్డు, పర్సు, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అతనికోసం పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే శ్రీనివాసరావు ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడని, సూసైడ్ నోట్లో రాసినట్టుగా అతను ప్లాంట్ ఫర్నేస్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశమే లేదని విశాఖ నగర సౌత్ ఏసీపీ సీహెచ్ పెంటారావు చెప్పారు. లాగ్‌బుక్‌లో సూసైడ్ నోట్.. స్టీల్‌ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి చెందిన సోర్నపూడి శ్రీనివాసరావు(50) వైర్ రాడ్ మిల్–1లో విధులు నిర్వహిస్తున్నారు. యధావిధిగా శుక్రవారం రాత్రి విధులకు హాజరయ్యారు. శనివారం ఉ.5 గంటల ప్రాంతంలో షిఫ్ట్రూమ్లోని లాగ్‌బుక్‌లో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆవేదన తెలుపుతూ సూసైడ్ నోట్ రాశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం చేయవద్దని, ఇందుకోసం తన ప్రాణాన్ని 5.47 నిమిషాలకు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి ఇస్తున్నానని రాశారు. ఈ పోరాటం తన ప్రాణత్యాగంతో ప్రారంభం కావాలన్నారు. ఉదయం షిఫ్ట్ విధులకు హాజరైన ఉద్యోగులు లాగ్‌బుక్ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ ఏసీపీ పెంటారావు, సీఐ సత్యనారాయణరెడ్డి షిఫ్ట్రూమ్కు చేరుకుని అక్కడి ఉద్యోగులను విచారించారు. శ్రీనివాసరావు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక సింహగిరి కాలనీలో నివసిస్తున్న అతని కుటుంబీకులను విచారించారు. అతనికోసం గాలింపు చర్యల్లో భాగంగా గేటు సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. అతని మొబైల్ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడు: ఏసీపీ సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయిన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు ఆర్థికపరమైన మోసాల్లో ఉన్నాడని విశాఖ నగర సౌత్ ఏసీపీ సీహెచ్ పెంటారావు తెలిపారు. ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని శ్రీనివాసరావు మోసం చేశాడన్నారు. కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి నలుగురితో సుదీర్ఘంగా మాట్లాడినట్టు గుర్తించామన్నారు. వారిని విచారించగా ప్లాంట్‌లో ఉద్యోగాలిప్పిస్తానని సుమారు రూ.50 లక్షలు తీసుకున్నట్టు వెల్లడైందన్నారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంపై వారు ప్రశ్నించగా నకిలీ ఆర్డర్లు ఇచ్చాడని, మరికొంతమందికీ నకిలీ ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. సూసైడ్ నోట్లో రాసినట్టుగా శ్రీనివాసరావు ప్లాంట్ ఫర్నేస్‌లో ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని, అతను ఉదయం గేటు నుంచి బయటకు వెళ్లినట్టు కొంతమంది చెప్పారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, శ్రీనివాసరావు కుమారుడు మహేష్ మాట్లాడుతూ.. తన తండ్రి మోసం చేసే వ్యక్తి కాదన్నారు. తన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలపాలన్నాడు. -
'విశాఖ స్టీల్'ను అమ్మితే ఊరుకోం
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే ఊరుకోబోమని కార్మీక సంఘాల నాయకులు అల్టిమేటం జారీ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉక్కు నగరంలోని త్రిష్ణా మైదానంలో ఉక్కు కార్మీక గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. జాతీయ కార్మీక సంఘాల నాయకులు హాజరై స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గు గనులు, రైల్వే, బ్యాంకులు, బీమా ఇలా అన్ని రంగాలనూ ప్రైవేటుపరం చేయడానికే జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కార్మీకుల హక్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కాలరాయడానికే అన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ కార్మీకుల ఆందోళన ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గనులు కేటాయించని ఏౖకైక ప్లాంట్ విశాఖ స్టీల్‌ప్లాంటే అన్నారు. ఇస్కో, దుర్గాపూర్ స్టీల్, సేలం స్టీల్ప్లాంట్లను కొనడానికి వచ్చిన వారిని తరిమినట్టే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొనడానికి ఎవరైనా వస్తే తరిమి తరిమి కొట్టాలన్నారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ అదానీ, అంబానీల కోసమే మోదీ పని చేస్తున్నారన్నారు. బీఎంఎస్ జాతీయ కార్యదర్శి పాంథే మాట్లాడుతూ లిబర్‌లైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో కార్మీక వర్గాలకు సమస్యలు ప్రారంభమయ్యాయన్నారు. హెచ్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రిజ్వార్ అహ్మద్ మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారని, దేశాన్ని అమ్మడానికి సిద్ధమవుతున్నారన్నారు. ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానికి లేఖలు రాశారన్నారు. కార్మిక సంఘాల నేతలతో చర్చించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే నేడు షిప్‌యార్డు, బీహెచ్‌పీవీ సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నాయన్నారు. -
సూసైడ్ నోట్ రాసి.. ఉద్యోగి శ్రీనివాస్ కనిపించకుండా పోయారు..
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది. సూసైడ్ నోట్ రాసి.. ఉద్యోగి శ్రీనివాస్ కనిపించకుండా పోయారు. సాయంత్రం 5:49 నిమిషాలకు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లేఖలో పేర్కొనడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక సింహగిరి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్.. స్టీల్ ప్లాంట్‌లోని వ్తెర్ రాడ్ మిల్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్‌ను స్ట్రేటజిక్ సేల్ ప్రకటన రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 35 రోజులు దాటినా కేంద్రం దిగి రాకపొవడంతో ప్లాంట్ ప్రైవేట్ పరమవుతుందని ఆందోళన చెందిన శ్రీనివాస్.. ఈ క్రమంలో రాత్రి ‘సి’ షిఫ్ట్‌కు వెళ్ళారు. అక్కడే సూస్తెడ్ నోటు రాసి అందరికీ షేర్ చేసాడు. ఆందోళన చెందిన కార్మికులు వ్తెర్ రాడ్ మిల్స్, ఫర్నేష్ ప్రాంతాల్లో ఆరా తీశారు. అదే సమయంలో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. ప్లాంట్‌లోనే శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. చదవండి: భర్త చేష్టలతో విసుగుచెంది... బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు -
నేడు ఉక్కు పోరాట కమిటీ 5కె రన్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం నానాటికి బలపడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలంటూ విశాఖలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఇప్పటికే కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పోరాట కమిటీ సారథ్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. శనివారం జరిగిన దీక్షల్లో ఉక్కు ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యూఆర్ఎం అర్ ఎస్ అండ్ ఆర్ ఎస్ విభాగాల కార్మీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపిన హీరో చిరంజీవికి కార్మిక సంఘాలు, పోరాట కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లే ముందు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే కూర్మన్నపాలెం కూడలి నుంచి గాజువాక వరకు ఆదివారం 7 గంటలకు 5కె రన్ చేపట్టనున్నారు. అలాగే 15వ తేదీన పరిపాలన భవనం వద్ద ధర్నా, 20న కేంద్ర కారి్మక సంఘాల సారధ్యంలో ఢిల్లీలో అఖిలపక్షాల నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి రాజశేఖర్ తెలిపారు. ఉక్కు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు తెలుగు తల్లి విగ్రహం కూడలి నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్ వరకు సైలెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సీ కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. అదే విధంగా ఉక్కునగరం క్వార్టర్లలో రాత్రి 7 గంటల నుంచి 7.15 వరకు విద్యుత్ దీపాల్ని ఆపి.. నిరసన తెలపాలని నిర్ణయించారు. అదేవిధంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్లో శనివారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాణాలైనా అరి్పస్తాం.. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు. -
‘పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు’
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోరెందుకు మెదపడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, జనసేన పార్టీలకు క్లారిటీ లేదని, అందువల్లే వాళ్లు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై మమకారం ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంతో గట్టి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసివచ్చే పార్టీలను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తామని వెల్లడించారు. పోస్కో సంస్థకు అవసరమైతే కడప, కృష్ణపట్నం స్టీల్ ప్లాంట్లను తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే.. రెండేళ్లలో లాభాల బాట వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వందశాతం తప్పుడు నిర్ణయం: మంచు విష్ణు
-
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం: చిరంజీవి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకణకు వ్యతిరేకంగా పరీరక్షణ కమీటి చేస్తున్న పోరాటనికి తన మద్దతు ప్రకటిస్తునట్లు పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామని చిరంజీవి గుర్తుచేశారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిని విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలకు కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని సూచించారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయమైన హక్కు అని.. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions. With a Steely resolve, Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim — Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021 చదవండి: ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆచార్య -
చిల్లర రాజకీయాలొద్దు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కును కాపాడుకునే దిశగా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిగా అడుగులేస్తున్నారని, సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై ఆయనకు పరిపూర్ణ అవగాహన ఉందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృ ష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని అనుమతించిన మరుక్షణమే అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జగన్ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారని, సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు కన్నా మెరుగైన రీతిలో సమస్య పరిష్కరించే సత్తా జగన్‌కు ఉందని చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటన చేసిన వెనువెంటనే ఆయన స్పందించారని, కార్మికసంఘాలతో కూడిన అఖిల పక్షంతో చర్చించేం దుకు అవకాశం ఇవ్వాలని ప్రధానికి లేఖ రాశార న్నారు. ఆయన ప్రయత్నాలకు ఇది కొనసాగింపుగా చూడాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విశాఖ ఉక్కు విలువ రూ.31 వేల కోట్లు కాదు ► కేంద్రం చెబుతున్నట్టు విశాఖ ఉక్కు ఆస్తి రూ.31 వేలకోట్లు కాదు. రూ.లక్షన్నర కోట్లకుపైగా ఉంటుంది. మమ్మల్ని రాజీనామా చేయమంటున్న పవన్‌కళ్యాణ్ అసలు తానేం చేస్తున్నాడు? మేం రాజీమానా చేసినా మళ్లీ గెలుస్తాం. ప్రయోజనం ఏంటి? నువ్వెళ్లి పొత్తు పెట్టుకున్న పార్టీని ఒప్పించలేవా? ► విశాఖ స్టీల్ కోసం వచ్చిన కొరియన్ కంపెనీ పోస్కోను.. కడప, కృష్ణపట్నంకు వెళ్లండని ప్రభుత్వం సలహా ఇచ్చింది. వాళ్లు కృష్ణపట్నం వైపు ఆసక్తి చూపుతున్నారు. జగన్ దాపరికం లేని నాయకుడు. స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకునేందుకు ఆయన చేసిన సూచనలను ఎవరైనా అభినందిం చాల్సిందే. కానీ ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది. జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేకే తప్పుడు ఆరోపణలు ► విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషం కక్కుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని పక్కదారి పట్టించేలా రాశాయి. ► అవసరమైతే ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని ఆమె సాధారణ భాషలో చెబితే.. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చినట్టు రాశారు. అదే నిజమైతే ఈ స్థాయిలో ఎందుకు ఉద్యమిస్తాం? బంద్‌కు ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తుంది? ► విశాఖ స్టీల్‌ను జగన్ కొంటారనే ప్రచారం దుర్మార్గం. అసలు ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్న చంద్రబాబు దగ్గరే డబ్బులున్నాయి. విశాఖ స్టీల్‌ను కొనమని ఆయనకు సలహా ఇస్తున్నాం. -
ఉక్కు కోసం భగ్గుమన్న జనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/ ఉక్కు నగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు భగ్గుమన్నారు. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్రమంత్రి ప్రకటనను నిరసిస్తూ కార్మికులు, నిర్వాసితులు, ఉద్యోగ సంఘాలు విశాఖలో సోమవారం రాత్రి నుంచి చేపట్టిన ఆందోళన మంగళవారమూ కొనసాగింది. వీరికి మద్దతుగా ప్రజాసంఘాలు, వామపక్షాలు, కార్మిక సంఘాలూ రోడ్డెక్కాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రహదారిని నిర్బంధించడంతో వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉ«ధృతం చేస్తామని పోరాట కమిటీ హెచ్చరించింది. 11న యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఆందోళనలతో వేడెక్కిన విశాఖ.. కేంద్రం తీరుకు నిరసిస్తూ విశాఖ కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉద్యమకారులు సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్బంధించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ప్రకటనతో కూడిన ప్రతుల్ని దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. మరోవైపు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడించేందుకు భారీసంఖ్యలో ఆందోళనకారులు తరలివెళ్లారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రధాని డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని ప్రత్యేక బలగాలు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో తోపులాటలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్ డైరెక్టర్ వి.వేణుగోపాలరావును ఆందోళనకారులు దిగ్బంధించారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దాడికి యత్నించారు. వారిని పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెదరగొట్టారు. ఆయనకోసం వచ్చిన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.బాలాజీని కూడా కార్మికులు దిగ్బంధించారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్గేట్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలు రోడ్లలో అడ్డంగా చెట్లకొమ్మలు వేశారు. మరికొన్నిచోట్ల టైర్లని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వడ్లపూడి ప్రజలు తమ వీధుల్లోని రహదారుల్ని మూసివేసి కేంద్రాన్ని, బీజేపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక చైర్మన్, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలివ్వని బీజేపీ ఉన్నవి అమ్మేయడానికి సిద్ధపడటం దుర్మార్గమన్నారు. బీజేపీని, ఆ పార్టీకి సహకరిస్తున్న జనసేన నేతలను మున్సిపల్ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నినాదాలతో మార్మోగిన బెజవాడ బెజవాడ లెనిన్ సెంటర్ మంగళవారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో మార్మోగింది. పలు కార్మిక సంఘాలు మంగళవారం లెనిన్ సెంటర్లో ఆందోళన నిర్వహించి కేంద్రప్రభుత్వ జీవోలను దగ్ధం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ప్రజాసంఘాలు, లాయర్లు, రిక్షా కార్మికులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఇంకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన స్టీల్‌ప్లాంట్ సీఎండీ.. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పిలుపు మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్(పర్సనల్) కేసీ దాస్‌లు సోమవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించిన అనంతరం మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. నేడు అత్యవసర బోర్డు మీటింగ్ నిర్వహించే అవకాశముందని సమాచారం. 11న సమ్మె నోటీసు ప్రైవేటీకరణ ముప్పు నుంచి స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అనుసరించాల్సిన ప్రణాళికను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఖరారు చేసింది. 11వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసివ్వాలని, 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగాలని నిర్ణయించింది. పార్లమెంట్‌లోని వివిధ పార్టీల నేతలకు వినతిపత్రాలు అందజేయాలని, ఈ నెల 20న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉక్కు కార్మికుల గర్జన పేరిట స్టీల్‌ప్లాంట్ త్రిష్ణా మైదానంలో బహిరంగసభ నిర్వహించాలని, కిసాన్‌మోర్చా ఢిల్లీ నాయకులతో నగరంలో 28న భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సమావేశంలో కమిటీ నాయకులు సీహెచ్.నర్శింగరావు, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 11 నుంచి ఆందోళన: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలసి ఆందోళన ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక మంగళవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. కేంద్రం ప్రకటనను నిరసిస్తూ 11వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వేదిక కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం, 13, 14 తేదీల్లో ఎంపీలకు సామూహిక వినతిపత్రాలు, 15న రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద విశాఖ స్టీల్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసన దినం జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 15న వేదిక సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు. -
ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు ఉద్యమానికి మద్దతు
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు:ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ఉన్నారని గుర్తుచేశారు: కన్నబాబు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దం: విజయసాయిరెడ్డి
-
మోదీ పేరు ఎత్తితే బాబుకు వణుకు పుడుతోంది
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు. తమకు తెలిసి జరుగుతోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అన్ని పక్షాలను తీసుకెళ్లి సమస్య వివరిస్తామని తెలిపారు. తాము కేంద్రంతో రాజీ పడితే పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నిస్తామని అన్నారు. పార్లమెంట్లో బలం ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్రాన్ని విమర్శించకుండా తమపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యేవరకు ఉద్యమానికి మద్దతుగా ఉంటామని వెల్లడించారు. సబ్బంహరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సబ్బంహరికి సిగ్గుంటే టీడీపీకి రాజీనామా చేయాలని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని కాకుండా అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీలో సబ్బంహరి ఎలా ఉంటారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రశ్నించానని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. కేంద్ర వైఖరిని తెలుసుకునేందుకు ప్రశ్నించినట్టు తెలిపారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వాళ్లెవరైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణపై ప్రశ్నించాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నాడని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించారని, ప్రధాని మోదీ పేరు ఎత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్ చదవండి: భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్‌ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నదని, గతంలో జరిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే 20 వేల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ అత్యుత్తమంగా నడిచిందని, చంద్రబాబు హయాం (2014-15) నుంచే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు. -
భగ్గుమన్న స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఉక్కు కార్మీక వర్గం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు కార్మీకులు కూర్మన్నపాలెం కూడలి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం మంత్రి ప్రకటన తెలిసిన వెంటనే స్టీల్‌ప్లాంట్ కార్మీక నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సర్దిచెప్పటానికి ప్రయత్నించినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. ఇంతలో అక్కడికి యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు వచ్చారు. ఆయన కారును ఆందోళనకారులు కొద్దిసేపు అడ్డుకున్నారు. సాయంత్రం 6.30కి ప్రారంభమైన రాస్తారోకో రాత్రికి కూడా కొనసాగింది,. పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, విళ్లా రామ్మోహన్కుమార్, వి.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం చేసిన ప్రకటన దుర్మార్గమైనదన్నారు. ప్రతి ఆంధ్రుడు ఖండిస్తున్నారన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ప్రైవేటీకరణ తథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని.. అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు పరిశ్రమ) ప్రైవేటీకరణలో భాగంగా వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ అనుమతి తెలిపిందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వ వాటా ఉపసంహరణ అనేది.. వినియోగం, సామర్థ్య విస్తరణ, సాంకేతికత పెంచడం, మెరుగైన నిర్వహణ పద్ధతులకు తగిన పెట్టుబడులు తీసుకొచ్చేలా ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా ఉత్పత్తితో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. అలాగే భాగస్వాములు, ఉద్యోగుల వాటా కొనుగోలు చేయడానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ నిబంధనలు వర్తిస్తాయని సీతారామన్ పేర్కొన్నారు. ఆస్తులు రూ.32 వేల కోట్లు.. అప్పులు రూ.21 వేల కోట్లు విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు ఆస్తులు, అప్పులపై వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్, బాలశౌరి, టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరును ఆయన వివరించారు. విశాఖ ఉక్కు ప్లాంటు, పరికరాలు, ఆస్తులు విలువ గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.32,022.32 కోట్లుగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఈక్విటీ షేర్ పెట్టుబడి విలువ రూ.4,889.85 కోట్లుగా ఉందని తెలిపారు. అలాగే గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.21,236.01 కోట్ల అప్పులున్నాయని వివరించారు. -
ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదు..
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దాని ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామని ఆయన హామీనిచ్చారు. సోమవారం పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో కేంద్రమంత్రులను కూడా కలిశామని వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. స్టీల్ ప్లాంట్‌పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత చంద్రబాబుదేదని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తుందని, రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రమే స్పష్టం చేసినా వారి దుశ్ప్రచారం ఆగడం లేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పాలనలో స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం జరగదని హామినిచ్చారు.స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. నీతి, న్యాయానికి కట్టుబడ్డ సీఎం జగన్ వెనుకే రాష్ట్ర ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని అవాక్కులు, చవాక్కులు పేలినా ప్రజల మద్దతు సీఎం జగన్‌కే ఉందని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూర్మన్నపాలెం మెయిన్‌గేట్ వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన స్వరాలు వినిపించాయి. -
జనం బరితెగించాలి: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ‘ఆటవిక రాజ్యంలో రౌడీలు, గూండాలు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు.. అందుకే ఇప్పుడు బరి తెగించాలి.. గట్టిగా కొట్టాలి.. విశాఖకు పట్టిన శని వదిలించుకోవాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా విశాఖ నగరంలో రెండో రోజు శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. గాజువాక, విశాఖ దక్షిణం, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ‘మీలో రోషం రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో రూ.1000, రూ.2000కు రాజీ పడిపోతే.. జీవితాల్లో శాశ్వతంగా నరకమే ఉంటుంది. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అన్నారు. గాజువాక, పూర్ణా మార్కెట్, జగదాంబ జంక్షన్, సీతమ్మధార ప్రాంతాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. మీకు మంచి చేయలేకపోయానని బాధ పడుతున్నానని చెప్పారు. మంచి చేసిన నేను మంచి పేరు తెచ్చుకోలేకపోయాననే బాధ కూడా ఉందన్నారు. తన 14 ఏళ్ల సీఎం రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు. మరో హైదరాబాద్‌గా విశాఖను తయారు చేయాలని భావించి.. అందుకోసం ప్రణాళిక తయారు చేస్తే.. ఇప్పుడు దాన్ని గందరగోళంగా తయారు చేశారని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉంచుతూ.. విశాఖని ఫైనాన్షియల్ హబ్‌గా, నంబర్ వన్ సిటీగా తయారు చేయాలని అనుకున్నానని తెలిపారు. జగన్ పాలనలో బూతుల మంత్రి, హవాలా మంత్రి, కొబ్బరికాయల మంత్రితో పాటు అనేక రకాల మంత్రులున్నారని ఎద్దేవా చేశారు. మీ బట్టలు విప్పించే రోజులు తొందర్లోనే వస్తాయని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని జగన్‌కు చెబితే ఇంత వరకూ స్పందించలేదన్నారు. అమ్మ ఒడి, నాన్న బుడ్డీ అని మాట్లాడుతున్నారే తప్ప.. అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కాగా, చంద్రబాబుకు రెండో రోజు కూడా విశాఖ ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబుకు ఏయూ విద్యార్థి జేఏసీ నుంచి నిరసన ఎదురైంది. విశాఖని రాజధానిగా చేసేందుకు అంగీకరించని చంద్రబాబుకు నగరంలో తిరిగే అర్హత లేదంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చంద్రబాబు రోడ్‌షో ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రచారానికి జనం కరువవ్వడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. స్వామీజీలు ఇలాంటి పనులు చేస్తారా? ‘రామతీర్థంలో రాముడి తల తీస్తే ఇక్కడి దొంగ స్వామి వెళ్లలేదు. స్వామీజీలు ఎవరైనా ముద్దులు పెడతారా? స్వాములు నిష్టగా, పవిత్రంగా ఉండి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదిస్తారే తప్ప, ఇలాంటి పనులు చేయరు. హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చారు’ అని శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతంపేటలో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్వామీజీలు ఎవరినీ తాకరని, ఈ స్వామి మాత్రం సీఎంకు ముద్దులు పెట్టేస్తారన్నారు. బలవంతపు ఏకగ్రీవాల మాదిరిగా.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఐదేళ్లలో తాము రూ.1.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. జగన్ 22 నెలల్లో రూ.1.60 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. -
విద్యార్థులకు టీడీపీ పాఠాలు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకులను స్కూల్‌కు పిలిపించి సభ నిర్వహించడం చర్చకు దారితీసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు టీడీపీ నాయకులు ర్యాలీగా రావడంతో తాడేపల్లి కళ్లం అంజిరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం రాయల సుబ్బారావు.. వారికి ఫోన్ చేసి మరీ పాఠశాలకు పిలిపించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అసెంబ్లీని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులతో ప్రసంగాలు చెప్పించారు. తమ పార్టీ నాయకులు, తమ పార్టీ గొప్పతనం అంటూ వారు పిల్లల ముందు ఊదరగొట్టారు. దీనిపై పాఠశాల హెచ్ఎంను వివరణ కోరగా స్కూల్లో సభలు, సమావేశాలేవీ ఏర్పాటు చేయలేదని చెప్పారు. అసెంబ్లీ ఏర్పాటుచేసి మీటింగ్ పెట్టించారట కదా అని ప్రశ్నిస్తే.. అదేం లేదంటూ మాట దాటవేశారు. -
బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు కార్మిక వర్గం కదం తొక్కింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రయత్నాలు విరమించుకోవాలని, ఉక్కు పరిశ్రమ సొంతంగా నిలదొక్కుకుని లాభాల బాటలో పయనించేలా చూడాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ స్టీల్‌ప్లాంట్ కార్మికులను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికి అండగా నిలవడంపై కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. బంద్‌కు బీజేపీ పూర్తిగా దూరంగా ఉండగా.. జనసేన విశాఖలో మాత్రమే మద్దతు పలికి రాష్ట్రవ్యాప్తంగా దూరంగా ఉండటం గమనార్హం. బంద్‌లో వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీలతోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్తక, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశాఖలోని మద్దెలపాలెం జంక్షన్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పాల్గొని బంద్‌కు సంఘీభావం తెలిపారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమాలకు సంధానకర్తగా వ్యవహరించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు ఎం.రాజశేఖర్, వై.మస్తానప్ప, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు అన్నివర్గాల సంఘీభావం రాష్ట్రవ్యాప్త బంద్‌కు అన్ని వర్గాలు సంఘీభావంగా నిలిచాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్క లేదు. డిపోల నుంచి బస్సులు బయటకు తీయబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకటించాయి. బంద్‌లో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని యూనియన్లకు చెందిన కార్మికులు సైతం బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు ఆర్టీసీలో మొత్తం 10,057 బస్సులు ఉండగా.. 8,619 బస్సులు డిపోల నుంచి కదల్లేదు. హైకోర్టు, సచివాలయాలకు వెళ్లే వారికి మాత్రం ఇబ్బందుల్లేకుండా బస్సుల్ని తిప్పారు. మధ్యాహ్నం వరకు బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీకీ రూ.8 కోట్ల నష్టం వాటిల్లింది. దూర ప్రాంత సర్వీసులను మధ్యాహ్నం నుంచి కొనసాగించారు. బంద్‌కు మద్దతు పలికిన లారీ యాజమానుల సంఘం ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో లారీ యజమానుల సంఘం రాష్ట్ర నాయకులు వైవీ ఈశ్వరరావు, గోపిశెట్టి వీర వెంకయ్య పాల్గొన్నారు. కడపలో వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు పార్టీల నిరసన ఉద్యమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మద్దతు పలికింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడలో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. బంద్ కారణంగా కాకినాడ జేఎన్టీయూలో పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ సీపోర్ట్‌లో కార్మికులు బంద్ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతపురంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంద్‌కు అమరావతి సచివాలయ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. బంద్‌కు జర్నలిస్టు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
సర్కారీ షేర్లు జిగేల్!
గత నాలుగేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకోని ప్రభుత్వ రంగ దిగ్గజాలు కొద్ది రోజులుగా మార్కెట్లను మించుతూ పరుగందుకున్నాయి. తాజా బడ్జెట్లో పలు పీఎస్‌యూలను ప్రైవేటైజ్ చేయనున్నట్లు ప్రతిపాదించడంతో రీరేటింగ్‌కు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ పీఎస్‌యూల మార్కెట్ విలువ 28 శాతంపైగా ఎగసింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు ఊపందుకున్నాయి. మరోవైపు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలను ప్రైవేటైజ్ చేసేందుకు ప్రతిపాదించింది. దీనికితోడు గత నాలుగేళ్లుగా మార్కెట్ ర్యాలీని అందుకోకపోవడంతో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు చౌకగా ట్రేడవుతున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభదాయకత మెరుగుపడనున్న అంచనాలు, ప్రైవేటైజ్ కారణంగా రీరేటింగ్‌కు పెరిగిన అవకాశాలు కొద్ది రోజులుగా పీఎస్‌యూ కౌంటర్లకు డిమాండును పెంచినట్లు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలోని పలు కంపెనీలు కమోడిటీ ఆధారితంకావడం, కొద్ది రోజులుగా కమోడిటీల సైకిల్ అప్టర్న్ తీసుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు వివరించారు. జోరు తీరిలా పలు సానుకూలతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో పీఎస్‌యూ షేర్లు ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. వెరసి 2021 జనవరి నుంచి చూస్తే పీఎస్‌యూ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 3.84 లక్షల కోట్లమేర జత కలసింది. అంటే గత వారాంతానికల్లా ఈ విలువ 28 శాతం ఎగసి రూ. 19.45 లక్షల కోట్లకు చేరింది. 2017 తదుపరి ఇది అత్యధికంకాగా.. గత రెండు నెలల్లో ప్రామాణిక ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 శాతమే ర్యాలీ చేయడం గమనార్హం! హింద్ కాపర్ స్పీడ్ కొత్త ఏడాదిలో దూకుడు చూపుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజాలలో హిందుస్తాన్ కాపర్ ముందుంది. జనవరి– ఫిబ్రవరి మధ్య ఈ షేరు 152 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎంఎస్టీసీ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఫ్యాక్ట్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్), నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్), ఎన్బీసీసీ ఇండియా, ఇండియన్ బ్యాంక్ 90–60 శాతం మధ్య జంప్‌చేశాయి. -
‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి బీపీసీఎల్ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి. 2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ.. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. -
'ఉక్కు' పిడికిలి బిగిసింది
సాక్షి,అమరావతి/ఉక్కునగరం(విశాఖ)/పటమట (విజయవాడతూర్పు)/పట్నంబజారు(గుంటూరు): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల(జేఏసీ) పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా విశాఖతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. విశాఖలో భారీ రాస్తారోకో.. విశాఖ జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. దీంతో లంకెలపాలెం నుంచి బీహెచ్‌పీవీ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని కార్మికులు హెచ్చరించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ► విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి, చోడవరం, పెదబయలు, నక్కపల్లి, కొయ్యూరు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట, కొత్తవలస, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, టెక్కలి, పలాస ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ► అలాగే అనంతపురం జిల్లా పెనుకొండ, నల్లచెరువు, తనకల్లు, కర్నూలు జిల్లా కోడుమూరు, కృష్ణా జిల్లా విజయవాడ, తిరువూరు, మొవ్వ, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, ప్రకాశం జిల్లా మార్టూరు, ఒంగోలు, వైఎస్సార్ జిల్లా కడప, రాజంపేట తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలు, ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. గుంటూరు జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత్ బంద్ పాక్షికం.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, కొత్త ఈ–వే బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో పాక్షికంగానే కన్పించింది. అయితే భారత్ బంద్‌లో భాగంగా నిత్యావసర ధరలను తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లతోపాటు విశాఖ ఉక్కు నినాదాన్ని కూడా జోడించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. భారత్ బంద్ నేపథ్యంలో.. లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో పలుచోట్ల రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలోని రామవరప్పాడు, భవానీపురం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లిలో లారీలు పెద్దసంఖ్యలో నిలిచాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖలోని గాజువాక యార్డులో ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో 13 వేల లారీలు ఉండగా.. బంద్ కారణంగా 8 వేల లారీలు నిలిచిపోయాయని లారీ అసోసియేషన్ నేతలు తెలిపారు. -
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
-
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఉక్కు నినాదాలతో మార్మోగింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
వ్యాపారాలకు చేయూతే ప్రభుత్వ బాధ్యత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) భారీ స్థాయిలో ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా సమర్థించుకున్నారు. వ్యాపార సంస్థలకు కావాల్సిన తోడ్పాటు అందించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యతని, సొంతంగా వ్యాపారాలు నడపడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నిధులతో.. నష్టాల్లో ఉన్న సంస్థలను నడిపే బదులు ప్రజోపయోగకరమైన సంక్షేమ పథకాలకు వెచ్చించడం శ్రేయస్కరమని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వమనేది ప్రధానంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ప్రధాని పేర్కొన్నారు. చమురు.. గ్యాస్, విద్యుత్ తదితర రంగాల్లో 100 పైగా పీఎస్‌యూలు .. సామర్థ్యానికన్నా తక్కువగా పనిచేయడమో లేక వనరులను సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితుల్లోనో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిల్లో వాటాలు విక్రయించడం తదితర మార్గాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల మేర పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 2021–22 బడ్జెట్లో ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘ఎంటర్‌ప్రైజ్‌లు, వ్యాపారాలకు తోడ్పాటునివ్వడం ప్రభుత్వ బాధ్యత. సొంతంగా వ్యాపార సంస్థలను పెట్టడం, వాటిని నిర్వహించడం వంటివి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు‘ అని ఆయన స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా.. రక్షణ, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, బ్యాంకింగ్ తదితర వ్యూహాత్మకమైన నాలుగు రంగాలు మినహా మిగతా అన్ని రంగ్లాలోని పీఎస్‌యూలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ సంస్థలు నామమాత్ర సంఖ్యలో కొనసాగుతాయన్నారు. పెట్టుబడులు, అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ విధానాలు, మరింత ప్రతిభావంతులైన మేనేజర్లు, ఆధునికత వంటి సానుకూల పరిణామాలు ప్రైవేట్ రంగం రాకతో సాధ్యపడగలవని మోదీ చెప్పారు. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. -
వాటిని అమ్మిందెవరు? గొంతు నులిమిందెవరు?
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగం స్వాధీనం చేసుకోవాలి. వాటిని కేవలం వాణిజ్య పరంగానే నడపాలి. ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తాం. ప్రైవేటీకరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించాం. రాబోయే కాలంలో దీన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాం. ప్రైవేటీకరణే తారకమంత్రం. ప్రైవేటీకరణలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది..’ ఇదీ.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన ‘ప్రైవైటైజేషన్– ఏ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే పుస్తకంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాసిన ముందుమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999–2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణపై తన కలలు, ఏంచేశాను, ఏంచేయాలనే అంశాలను ఆయన చాలా విపులంగా అందులో వివరించారు. ఆ ఐదేళ్లలో చంద్రబాబు ఆంధ్రా పేపర్ మిల్లు సహా అనేక షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ప్రైవేటు పరం చేశారు. ఆల్విన్ వాచ్ సహా అనేక సంస్థల్ని మూసివేశారు. మరెన్నో సంస్థలను నిర్వీర్యం చేసేశారు. అమ్మకానికి ముద్దుపేరు సంస్కరణలు ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసే కార్యక్రమానికి ఆయన ముద్దుగా సంస్కరణలు (ఏపీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రిఫామ్స్) అనే పేరు పెట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని అయినకాడికి అమ్మేయడమే ఈ సంస్కరణల లక్ష్యం. అమ్మడం కుదరని వాటిని మూసివేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక సెక్రటేరియేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఈ సెక్రటేరియేట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం, ప్రైవేటుపరం చేయడాన్ని ఒక ఉద్యమంలా నడిపించారు. సంస్కరణల పేరిట 1999 నుంచి 2004 మార్చి నాటికి రెండు దశల్లో మొత్తం 54 ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ/ పెట్టుబడుల ఉపసంహరణ, ఏకంగా మూసివేత వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించారు. 2006–07 నాటికి 87 సంస్థల్ని ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో అవి బతికిపోయాయి. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కాకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా కనిపించేది కాదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ బ్యాంకు సూచనలు, షరతుల ప్రకారం చంద్రబాబు లక్షలాది మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించారు. అప్పట్లో చంద్రబాబుకు ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే పేరు రావడం గమనార్హం. ఇంత చేసిన చంద్రబాబు ఇప్పుడు ‘విశాఖ ఉక్కు’ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ అప్పటి చంద్రబాబు నిర్వాకం మొదటి దశలో 19 ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. 8 సంస్థల్ని ప్రైవేటీకరించారు. 6 సంస్థలు మూసేశారు. 4 సంస్థల కోరలు పీకి నిర్వీర్యం చేశారు. ఇక రెండో దశలో 68 సంస్థల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో 12 సంస్థల్ని ప్రైవేటీకరించారు. ఏకంగా 16 సంస్థల్ని మూసివేశారు. 8 సంస్థలకు జవసత్వాలు లేకుండా చేశారు. రెండో దశలో ప్రైవేటీకరించిన సంస్థలు 1. పాలెయిర్ కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, 2. వెస్ట్ గోదావరి కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 3. ఎన్వీఆర్ కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు, జంపని, 4. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, అనకాపల్లి, 5. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, చీపురుపల్లి, 6. వోల్టాస్ లిమిటెడ్, 7. గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, 8. వజీర్ సుల్తాన్ టుబాకో (వీఎస్టీ), 9. టాటా మోటార్స్ (గతంలో టెల్కో), 10. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ఏసీసీ), 11. సిర్పూర్ పేపర్ మిల్స్, 12. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ మూసివేసిన సంస్థలు: 1. ఎన్రిచ్ 2. ఫెడ్కాన్ 3. ఏపీ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4. ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5. శ్రీకృష్ణదేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ 6. శ్రీ విజయవర్థని ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ 7. ఏపీ స్పిన్‌ఫెడ్ 8. కరీంనగర్ కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 9. ఏపీ షుగర్‌ఫెడ్ 10. చిత్తూరు డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ 11. శ్రీ రాజరాజేశ్వరి కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 12. రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్, ఆత్మకూర్ 13.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ రాయచోటి, 14.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ కదిరి ఈస్ట్, 15.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ కదిరి వెస్ట్, 16.రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై కో–ఆపరేటివ్ జోగిపేట నిర్వీర్యం చేసిన సంస్థలు: 1. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ 3. ఆప్కో 4. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 5. నెడ్‌క్యాప్ 6. ఏపీ ఫిల్మ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 8. ఏపీ సెరీఫైడ్. ప్రైవేటీకరించిన సంస్థలు: 1. శ్రీ హనుమాన్ సహకార చక్కెర కర్మాగారం 2. ఏఎస్ఎం సహకార చక్కెర కర్మాగారం 3. ఆదిలాబాద్ సహకార స్పిన్నింగ్ మిల్లు 4. రాజమండ్రి సహకార స్పిన్నింగ్ మిల్లు, 5. నిజాం షుగర్స్ లిమిటెడ్‌తో పాటు దాని పరిధిలో ఉన్న చాగల్లు డిస్టిలరీ, శంకర్‌నగర్ షుగర్ మిల్లు, మాంబోజిపల్లి షుగర్ మిల్లు, మెట్పల్లి షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మధునగర్ షుగర్ మిల్లు, మాంబోజిపల్లి డిస్టిలరీ 6. నంద్యాల కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 7. నాగార్జున కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు 8. పర్చూర్ కో–ఆపరేటివ్ షుగర్ మిల్లు మూసేసిన సంస్థలు 1. ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, 2. ఏపీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 3. ఆల్విన్ వాచెస్ లిమిటెడ్, 4. నెల్లూరు కో–ఆపరేటివ్ స్పినింగ్ మిల్లు 5. చీరాల కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు 6. చిలకలూరిపేట కో–ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు నిర్వీర్యం చేసిన సంస్థలు 1. ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 2. ఏపీ స్టేట్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 3. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 4. ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. -
విశాఖ ఉక్కు కోసం పోరాడింది టీడీపీనే
గాజువాక: ‘నాడు విశాఖ ఉక్కు కోసం పోరాడింది టీడీపీనే.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు పోరాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడ్డారు. అప్పట్లో టీడీపీ ఎంపీలుగా ఉన్న ఎర్రన్నాయుడు, మూర్తి విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్లో పోరాడారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నది కూడా టీడీపీనే’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే అని, మరింత ఉధృతం చేస్తామన్నారు. ‘విశాఖ ఉక్కును అమ్మడానికి వాడెవ్వడు? కొనడానికి వీడెవ్వడు? ఫ్యాక్టరీ జోలికొస్తే తరిమికొడతాం. పోస్కో గోస్కో అని వస్తే చర్మం వలుస్తాం’ అని హెచ్చరించారు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల పాలైందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము సీఎం వైఎస్ జగన్‌రెడ్డికి లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కళకళలాడేదని, ఇప్పుడు కబ్జాలు, దౌర్జన్యం, విధ్వంసం, దాడులతో ప్రశాంతతే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మిని ఓడించారన్న కక్షతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్‌రెడ్డి అంగీకరించి, ఉత్తరాంధ్రపై కక్ష తీర్చుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మేయడానికి మీరెవ్వరు?’
సాక్షి, విశాఖపట్నం/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయడానికి మీరెవ్వరంటూ కేంద్ర పెద్దలను సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ప్రయివేటీకరించే నిర్ణయాన్ని ఎందుకు రహస్యంగా తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజా వేదిక ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.200 కోట్ల లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రయివేటీకరించేందుకు పూనుకున్నారని, మళ్లీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం పూనుకోవడం దేశద్రోహమన్నారు. తెలుగువాడైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయమై చూస్తూ ఊరుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ జెండాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీలకు పక్కన పెట్టాలంటూ ప్రధానిని కోరారు. సౌత్ కొరియా కంపెనీ ‘పోస్కో’ను విశాఖలో అడుగు పెట్టనీయకూడదన్నారు. విశాఖ మనదిరా.. స్టీల్ ప్లాంట్ మనదిరా.. కేంద్రమేందిరో.. దాని దూకుడేందిరో.. అంటూ పాట పాడి ఉత్తేజం కలిగించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, రైటర్స్ ఆకాడమీ చైర్మన్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ‘ఉక్కు’ ఉద్యమం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలు, సంఘాల నాయకులు, ప్రత్యేక హాదా, విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని, దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంవీవీ సత్యనారాయణ, తలారి రంగయ్య, డాక్టర్ సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవిలు శుక్రవారం పార్లమెంట్‌లోని హోం మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విడుదల, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్లో పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, ఎంవీవీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని కోరాం ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని హోంమంత్రికి చెప్పాం. ప్రధానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని, ప్లాంట్‌ను లాభాల బాట పట్టించే విధంగా చర్యలు చేపట్టాలని కోరాం. దీనిపై అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేపట్టే విషయమై త్వరలో నిర్ణయం వెలువరిస్తామన్నారు..’ అని సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. ఉద్యోగుల ఆందోళన వివరించాం ‘విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల ఆందోళన గురించి కేంద్ర హోం మంత్రికి వివరించాం. 32 మంది బలిదానం ఫలితంగా స్టీల్‌ప్లాంట్ ఏర్పడటం, అనేక మంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గురించి తెలియజేశాం. వారి త్యాగాలను గుర్తించాలని కోరాం. కర్మాగారం నష్టాలకు కారణాలు చెప్పాం. లాభాల బాటలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించాం. స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్ల కేటాయింపు లేకపోవడం ఆయన దృష్టికి తెచ్చాం. రూ.23 వేల కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చాలి లేదా ఈక్విటీగా మార్చాలని కోరాం..’ అని ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. ‘దిశ’ దేశవ్యాప్తంగా ఉపయోగపడే చట్టం ‘దిశ చట్టం దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదించాలని హోంమంత్రిని కోరాం. ఇందుకోసం ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో అవసరమైన మార్పులు చేయాలి. తెలంగాణలో జరిగిన ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ఈ చట్టాన్ని తెచ్చారు. మహిళలపై దాడుల వంటి ఘటనలను వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. దిశ చట్టం అమలుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలను, ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్న విషయాన్ని కేంద్రం గమనించాలి. రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు..’ అని వంగా గీత తెలిపారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన అమిత్‌షాకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్సీపీ ఎంపీలందరం పోరాడుతామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షలు ప్రారంభం ఉక్కునగరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద శుక్రవారం కార్మికుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న కొల్లు రామ్మోహన్ ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, నన్నపనేని రాజకుమారి తదితరులు శిబిరం వద్దకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. -
‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఎదుట కార్మికులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై జేఏసీ.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 18న స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన జేఏసీ.. ఈ నెల18నే స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. గాజువాకలో ఈనెల 18న కార్మికుల బహిరంగ సభ నిర్వహించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సన్నాహాలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. అమరుల త్యాగాలు తెలియకుండా మాట్లాడటం బాధాకరమన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. (చదవండి: ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
ప్రైవేటీకరణకు బీజం పడింది చంద్రబాబు హయాంలోనే..
సాక్షి, తాడేపల్లి: వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండటం చాలా బాధాకరమని, ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఇది ఆవిర్భావం కాలేదని, దీని వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాటం జరిగిందని గర్తు చేశారు. విశాఖ ఉక్కు కేవలం విశాఖకే కాదు యావత్ రాష్ట్రానికే తలమానికమన్నారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేసే దిశగా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ అంశంపై పోరాటం చేయాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అసలు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణకు తొలి అడుగు చంద్రబాబు హయాంలోనే పడిందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని ఆయన నిలదీశారు. బీజేపీతో జతకట్టిన జనసేనానికి కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్లేది విశాఖ ఉక్కు కోసమా.. లేక తిరుపతి సీటు కోసమా అంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉండవని తెలిసి కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం అమ్మే అవకాశం ఉంటే చంద్రబాబు ఏ రోజో ఆ పని చేసే వాడని విమర్శించారు. అప్పటి వరకు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్ళిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. ఈ అంశంపై సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకొని కలిసికట్టుగా విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరారు. పట్టుమని 10 పంచాయతీలు కూడా గెలవలేని తెలుగుదేశం పార్టీ.. వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని ఢంకా కొట్టడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్సీపీ 90 శాతం పంచాయతీలను గెలుచుకుందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన ప్రతి ఇంటికి వెళ్ళింది కాబట్టే ఎన్నికలు ఏవైనా, ఎప్పుడు జరిగినా 90 శాతం ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తామని, పెట్టుబడుల ఉపసంహరణను ఆపడానికి ఏమి చేయాలో అన్ని చేస్తామని ఆయన వివరించారు. -
అందుకు మేం వ్యతిరేకం: రాజ్యసభలో ఎంపీ బోస్
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు పోరాటం చేసి స్టీల్‌ప్లాంట్ సాధించుకున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను మూడు దశల్లో పునరుద్ధరించాలని ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలి. రుణాలను ఈక్విటీగా మార్చాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్లను కేటాయించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని’’ ఎంపీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్‌పై ఎలాంటి ప్రస్తావన లేదని, విశాఖ మెట్రోకు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకి కిసాన్ రైళ్లను ఎక్కువగా నడపాలని కోరారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.సంకుచిత బుద్ధితో టీడీపీ నేతలు ఆలయాలను కూల్చారని, ఆలయాల్లో విధ్వంసంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రవీణ్ చక్రవర్తి మతమార్పిడిలకు పాల్పడ్డారని.. తమ పాలనలో ఆలయాలపై దాడులు చాలా తగ్గాయని’’ ఎంపీ పేర్కొన్నారు. (చదవండి: బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో..) కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి! -
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలు అందరం.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఏపీ భవన్లో పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, అనూరాధ, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డెప్ప, పోచ బ్రహ్మానందరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘1999–2004 మధ్య 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చంద్రబాబు, ఆయన తొత్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడటం హాస్యాస్పదం. వైఎస్ జగన్ ఉక్కు మనిషి అయితే, చంద్రబాబు తుక్కు మనిషి. చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ గురించి తెలీదు. సుజనా స్టీల్ గురించే తెలుసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనలు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం. ఏడు మేజర్ పోర్టుల ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాం. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరాం’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్ఈసీని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉండాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను గవర్నర్ నియమిస్తారు. అందువల్ల శాసనసభ సిఫారసు మేరకు ఎస్ఈసీని తొలగించే అధికారమూ గవర్నర్‌కు ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలని వైఎస్సార్సీపీ కోరుతోందని చెప్పారు. రాష్ట్రంలో విగ్రహాలు చోరీలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని, మత మార్పిడుల్లోనూ చంద్రబాబు, ఆయన అనుచరుల పాత్రే ఉంది’ అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక మంత్రికి వివరించినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవపరచడమో, విధులు నిర్వర్తించకుండా చేయడమో తన ఉద్దేశం కాదని, సోమవారం సభలో తాను ఆవేదనలో ఉన్న సమయంలో జరిగిన పరిణామమని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ జీరోఅవర్‌లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చారు. ఆవేదనలో వచ్చిన భావోద్వేగమే తప్ప దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కేశినేని వ్యాఖ్యలపై మిథున్ అభ్యంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలోజరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తప్పు పడుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీ చట్టాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని ప్యానల్ స్పీకర్ భరృ్తహరి మెహతాబ్ పేర్కొన్నారు. -
విశాఖ స్టీల్ కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: ఉండవల్లి
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తొలి ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుపరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా అన్ని పక్షాలు స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయకుండా ఉండే వరకైనా కలిసి ఉండాలన్నారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేలా రాష్ట్రంలోని పార్టీలన్నీ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే మన ముందున్న మార్గమన్నారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదు. దీని ప్రైవేటీకరణ దిశగా వేసే ఏ అడుగైనా రాష్ట్రానికి నష్టమే. అందువల్ల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం..’ అని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని ప్లాంటును పరిరక్షించాలని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఏపీలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ యూనిట్ ఇది. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి అందిస్తోంది. పరోక్షంగా మరో 20 వేలకు మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్దకాలం పోరాటం తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీనిపై ఏపీ ప్రజలకు అపారమైన సెంటిమెంట్ ఉంది. అందువల్ల ప్రధాన మంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపై లేఖ రాశారు. స్టీల్ ప్లాంటు తెలుగు ప్రజల సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు శాఖతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నెలకు రూ. 200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. 6.3 మిలియన్ టన్నుల మేర వార్షిక ఉత్పత్తి చేస్తోంది. ఇదే తరహా పనితీరు స్థిరంగా కొనసాగాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఒప్పందాల రద్దుకు అనుమతి ఇవ్వండి ‘గత టీడీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ గరిష్టంగా రూ.5.90ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు మేము యూనిట్ ధరను రూ.2.49కి తీసుకొచ్చాం. గణనీయమైన ఆదా చేస్తున్నాం. అందువల్ల కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్లతో డిస్కమ్‌లు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వండి..’ అని కోరారు. అవి సరెండర్ చేస్తే ఏటా రూ. 325 కోట్ల మేర రాష్ట్రానికి ఆదా అవుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలి ‘ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలు కూడా నెరవేర్చాలి..’ అని మిథున్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. మతపరమైన రాజకీయాలకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. కాగా, ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి సమాధానం కావాలని మిథున్‌రెడ్డి కోరారు. -
స్టీల్‌ప్లాంట్ జోలికొస్తే ఖబడ్దార్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరు మొదలయింది. ప్రజాప్రతినిధుల సహకారంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. స్టీల్ ప్లాంట్ బి సి గేట్ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన నిరసన సభకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఇందులో అన్ని పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అదే ఉద్యమస్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మిక నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో ఉందని, విస్తరణ కారణంగా రుణాలు తీసుకోవడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్లాంట్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షత చూపిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖను స్ఫూర్తిగా తీసుకొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పర్యాటక శాఖ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రైతు ఉద్యమానికి మించిన ఉద్యమం కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. (చదవండి: ‘అలా చేస్తే పతనం తప్పదు’) (చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..) -
ఉక్కు సంకల్పంతో పోరాడతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తలమానికం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఆదివారం విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు ఒక విధానం లేదని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ప్రేమ ఉంటే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని వద్ద మాట్లాడాలన్నారు. కేంద్ర విధానాలు, విదేశీ డంపింగ్, సొంత గనులు లేకపోవడం తదితర కారణాలతో మూడేళ్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను చవిచూస్తోందని తెలిపారు. 1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.30 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే వైఎస్సార్ సీపీ నుంచి తొలి ఎంపీగా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కె.కె రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, ముఖ్యనాయకులు రవిరెడ్డి, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయమే పరిష్కారం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించేందుకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, ఆ దిశగా తొలుత ఆలోచించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలే అత్యుత్తమ మార్గాలని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది కాలంగా వస్తున్న నష్టాలను సాకుగా చూపి, నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి.. స్టీల్ ప్లాంట్‌ను గంప గుత్తగా అమ్మేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం సబబు కాదంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచి, లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రతిపాదించారు. 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న ఈ ప్లాంట్ గత డిసెంబర్లో 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పని చేసిందని, తద్వారా రూ.200 కోట్లు ఆర్జించిందన్నారు. ఇదే రీతిలో ప్లాంటు రెండేళ్ల పాటు నడిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని వివరించారు. అసలు సమస్య ముడి ఖనిజమే – ముడి ఖనిజానికి అదనపు చెల్లింపుల వల్ల ప్లాంట్‌పై రూ.3,472 కోట్ల భారం పడుతోందని.. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను కేటాయించడం ద్వారా ప్లాంట్‌ను తిరిగి ప్రగతి బాటలోకి తీసుకెళ్లొచ్చని సూచించారు. – ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఎన్‌ఎండీసికి చెందిన బైలదిల్లా గనుల నుంచి మెట్రిక్ టన్ను రూ.5,260 చొప్పున మా ముడి ఖనిజాన్ని కొనుగోలు చేస్తోందని, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌కు ఇదే అత్యంత ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు. – పోటీ పరిశ్రమలన్నింటికీ సొంతంగా గనులు ఉన్నాయని, 60 శాతం ముడి ఖనిజం అవసరాలను సొంత గనుల ద్వారా తీర్చుకుంటూ, మిగిలిన 40 శాతం మాత్రమే ఎన్ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. సెయిల్‌కు 200 ఏళ్లకు సరిపడా ముడి ఖనిజం అవసరాలను తీర్చే గనులున్నాయని ఆ లేఖలో తెలిపారు. రుణాలను వాటాల రూపంలోకి మార్చొచ్చు – స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిన రుణాలను వాటాల రూపంలోకి మార్చితే ఒత్తిడి తగ్గుతుందని, వడ్డీల బెడద కూడా ఉండదని సీఎం తెలిపారు. రూ.22 వేల కోట్ల రుణాలకు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. – ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి, స్టాక్ ఎక్సేంజ్ లిస్టింగ్ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్ ఆప్షన్ కలిగించవచ్చనని సీఎం పేర్కొన్నారు. తద్వారా ప్రజల నుంచి కూడా నిధుల సమీకరణకు అవకాశం ఏర్పడుతుందని, ప్లాంట్ సవ్యంగా నడుస్తుందని వివరించారు. – విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేలాది ఎకరాల భూములున్నాయని.. ప్లాంట్, టౌన్‌షిప్‌కు పోగా మిగిలిన భూముల్లో గ్రీన్ సిటీ (ప్లాట్లు వేయడం) ఏర్పాటు చర్యలు తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, ఇందుకు రాష్టప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని సీఎం సూచించారు. ఈ డబ్బు ప్లాంట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలి ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడటానికి ఆ నష్టాలేవో కేంద్ర ప్రభుత్వమే భరించాలని, లేదా ఆ నష్టాలను మాఫీ చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్లాంట్ ఉద్యోగులూ ఇదే విషయం చెబుతున్నారు. ఇందుకు నీతి అయోగ్ లేదా మరెవరో అభ్యంతరం పెడతారనుకుంటే ఒఎన్జీసీనో, లాభాల్లో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో టేకోవర్ చేసేలా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయని ఉదహరిస్తున్నారు. ప్లాంట్‌కు ఉన్న మిగులు భూమిని టెండర్లు పిలిచి మంచి ధరకు విక్రయించవచ్చని, లేదా దీర్ఘకాలం లీజుకు ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వచ్చే డబ్బును ప్లాంట్‌కు కేటాయించి, నష్టాలు తగ్గించుకోవడానికి కొత్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. ఇది కూడా వీలు కాదనుకుంటే దుర్గాపూర్ స్టీల్స్ తరహాలో డిజిన్వెస్ట్మెంట్కు వెళ్లొచ్చు. సొంత గనులు కలిగి ఉన్నప్పటికీ ‘సెయిల్’ నష్టాల్లో ఉందని, సొంత గనులు లేని విశాఖ స్టీల్స్ గత ఏడాది రూ.200 కోట్ల లాభాలు ఆర్జించిన విషయాన్ని విస్మరించడం బాధాకరం అని ప్లాంట్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్లాంట్‌ను ఆదుకోవడానికి ఇన్ని ప్రత్నామ్నాయాలు ఉండగా ఏకంగా ప్రైవేటీకరణే అనడం తగదంటున్నారు. సొంత గనులు కేటాయిస్తే మూడేళ్లలో లాభాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ పనులు 1980లో ప్రారంభమై.. 1991 నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలైంది. టెక్నాలజీకి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టడం వల్ల ప్రారంభంలో నష్టాల్లోకి వెళ్లింది. 2001లో ప్లాంట్‌లో పరికరాలను ఆధునికీకరించాం. తప్పులు సరిదిద్దుకున్నాం. అప్పటి నుంచి లాభాలు మొదలయ్యాయి. 2001లో రేటెడ్ కెపాసిటీకి ఎదిగాం. 2002–2003 ఆర్థిక సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా రూ.522 కోట్లు లాభం వచ్చింది. 2003–04 రూ.1,540 కోట్లు, 2004–05లో రూ.2,008 కోట్లు లాభాలార్జించింది. 2007–08 వరకూ వరుసగా లాభాల బాటలో పయనించింది. 2004–05లో లాభాలు రాగానే విస్తరణ దిశగా అడుగులు వేశాం. గనుల సహకారం కావాలని కోరాం. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)తో ఎంవోయూ చేసుకున్నాం. స్టీల్ సెక్టార్లో విస్తరణ ఆమోదం (2005 అక్టోబర్‌లో) పొందిన మొట్టమొదటి ప్లాంట్ ఇది. అప్పటికి ఉన్న రూ.8,621 కోట్ల క్యాష్ డిపాజిట్స్‌తో 2005లో విస్తరణ పనులు ప్రారంభించి 2008 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అనుకున్నాం. 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులకు 8 ఏళ్లు పట్టింది. దీంతో డిపాజిట్స్ ఖాళీ అయ్యాయి. విస్తరణ తర్వాత.. పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. 6.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి విస్తరించడం వల్ల.. సాంకేతికతను అందిపుచ్చుకుని లాభాల బాట పట్టేందుకు సమయం పడుతుంది. ముడి ఖనిజం కోసం ఒక్క ఎన్ఎండీసీపైనే ఆధారపడకుండా.. ఎక్కడ మంచిది దొరుకుతుందో చూసుకోవాలి. సాధారణ రేటుకు అందించేలా కేంద్రం కృషి చేయాలి. సీఎం జగన్ వీటన్నింటినీ వివరిస్తూ ప్రధానికి లేఖ రాశారు. సొంత గనులు కేటాయిస్తే మూడేళ్లలో లాభల బాట పడుతుంది. – యండమూరి శివసాగరరావు, స్టీల్‌ప్లాంట్ మాజీ సీఎండీ కేంద్రం చెప్పేవన్నీ కుంటి సాకులే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం చెప్పేవన్నీ కుంటి సాకులే. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలను ఆచరణలోకి తెస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనడంలో సందేహం లేదు. రుణాలపై వడ్డీ రేటు తగ్గించాలి. సొంత మైన్స్ లేకపోవడం వల్లే ఆర్థిక భారం పడుతోంది. – ప్రొఫెసర్ ప్రసాదరావు, ఆంధ్రా యూనివర్సిటీ, ఎకనమిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిపోతోంది. సొంత గనులు లేని కారణంగా భారం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి స్పష్టంగా వివరించారు. ఈ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించేలా అన్ని విధాలా ఒత్తిడి తేవాలి. – ఆచార్య పి.విశ్వనాథం, కామర్స్ మేనేజ్మెంట్ విభాగం, ఆంధ్ర యూనివర్సిటీ -
ప్రజాభిప్రాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పురంధేశ్వరి
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల సానుకూలంగా ఉందని.. ప్రజాభిప్రాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో విశాఖ వాసులకు, రాష్ట్ర ప్రజలకు విడదీయని బంధం ఉందన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు. -
'ఉక్కు' కోసం ఎందాకైనా..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు నగరంలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి ప్రజా ద్రోహానికి పాల్పడతారా? అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించాయి. శనివారం విశాఖ మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐద్వా, పీవోడబ్ల్యూ, హెచ్ఎంఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏపీఎంఎస్ మహిళా సంఘాల నాయకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు యత్నించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకొని.. ఆ తర్వాత కొద్దిసేపటికే విడిచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఎందాకైనా పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ద్వారకానగర్ బీవీకే కళాశాల సమీపంలో ఏపీ నిరుద్యోగ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. మరోవైపు ఉక్కు కర్మాగారంలోని టీటీఐ వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.జగదీశ్వరరావు చెప్పారు. సొంత గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెందుర్తిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు పాలకుల నిర్లక్ష్యంతోనే నష్టాలు.. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన విశాఖ స్టీల్‌ప్లాంట్.. ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నులకు చేరుకుంది. నాలుగేళ్లలో 203.6 శాతం వృద్ధి సాధించింది. 2010 నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కూడా కల్పించారు. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారుచేస్తూ దేశ విదేశాల్లో మంచి గుర్తింపు పొందింది. మొదట్నుంచీ లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యంతో నష్టాలు చవిచూసిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించి సహకారం అందిస్తే.. స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల్లోకి పయనిస్తుందన్నారు. వెంటనే ఉపసంహరించుకోండి.. గాందీనగర్ (విజయవాడసెంట్రల్): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ తెలిపింది. శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు చేతుల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాబోతుంది. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్ ఎకనామిక్ అఫైర్స్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. విశాఖ ఉక్కు సంస్థలో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం 2002 నుంచి 2015 వరకు లాభాలు ఆర్జించింది. 2015 నుంచి 2018 వరకు నష్టాలు చవిచూసింది. 2018-19లో 97 కోట్ల రూపాయలు లాభం సాధించినా తర్వాత మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకుంది. చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం' -
నేడు బీపీసీఎల్ బిడ్ల పరిశీలన!
న్యూఢిల్లీ: బీపీసీఎల్ ప్రైవేటీకరణలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కంపెనీలో తనకున్న 52.98 శాతం వాటాను కేంద్రం విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా కొనుగోలు కోసం దరఖాస్తు చేసిన కంపెనీల బిడ్లను నేడు (మంగళవారం) అత్యున్నత సంఘం మదింపు చేయనున్నదని సమాచారం. ఈ వాటా కొనుగోలు కోసం వేదాంతతో పాటు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ (థింక్ గ్యాస్ మాతృసంస్థ)లు బిడ్లు సమర్పించాయి. ఈ బిడ్లను తనిఖీ చేసి డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికపై ఈ అత్యున్నత సంఘం చర్చిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీకి సలహాదారుగా డెలాయిట్ సంస్థ వ్యవహరిస్తోంది. కేంద్రానికి రూ.46,600 కోట్లు...! బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి గత ఏడాది నవంబర్లోనే ఆమోదం లభించింది. అప్పటి నుంచి చూస్తే, షేర్ ధర 20 శాతం మేర పడిపోయింది. బీఎస్ఈలో సోమవారం నాడు బీపీసీఎల్ షేర్ రూ.406 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం చూస్తే 52.98 శాతం వాటాకు కేంద్ర ప్రభుత్వానికి రూ.46,600 కోట్లు లభిస్తాయి. కాగా ఈ వాటాను కొనగోలు చేసిన ఏ కంపెనీ అయినా మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఆఫర్‌కోసం మరో రూ.22,800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్‌లో రెండో అతి పెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇదే. భారత ముడి చమురు రిఫైనరీలో బీపీసీఎల్ వాటా 15.33 శాతంగా ఉంది. ఇంధనాల మార్కెటింగ్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతం. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా నాలుగు రిఫైనరీలున్నాయి. ముంబై(మహారాష్ట్ర), కోచి(కేరళ), బినా(మధ్యప్రదేశ్), నుమాలిఘర్(అస్సాం)లోని నాలుగు రిఫైనరీల వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులు. ఈ కంపెనీ మొత్తం 17,355 పెట్రోల్ పంపులు, 6,159 ఎల్పీజీ డీలర్లు, 61 విమానయాన ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది.