కూర్మన్నపాలెంలో రాస్తారోకో చేస్తున్న ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ తీవ్ర ప్రయత్నం చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీతారామన్‌ను అడ్డుకోవాలని విశాఖ కార్మిక సంఘాలు పలుమార్లు విఫలయత్నం చేశాయి.
ఆదివారం ఉదయం మంత్రి కేడీపేట వెళ్తున్నారని తెలుసుకున్న పరిరక్షణ కమిటీ నాయకులు కూర్మన్నపాలెం కూడలిలో అడ్డుకోవాలని భావించారు. పసిగట్టిన పోలీసులు ఆమెను సింహాచలం మీదుగా పంపించారు. దీంతో పరిరక్షణ కమిటీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, కె.సత్యనారాయణరావు, అయోధ్య, సుబ్బయ్య, రామకృష్ణ, కోరాడ వెంకటరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment