Visakhapatnam Steel Plant
-
మూడు డిమాండ్లపైనా మౌనమే
-
3 డిమాండ్లపైనా మౌనమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటమంతా.. ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపి వేయడం.. క్యాపిటివ్ మైన్స్‌ను కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడం..! మరి విశాఖ ఉక్కుకు ఊరట దక్కాలంటే ఇందులో ఒక్కటైనా నెరవేరాలి కదా? తమ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం నుంచి రూ.వేల కోట్ల ప్యాకేజీని సాధించినట్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు ప్రచారం చేసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని.. ముడి సరుకు సరఫరాదారుల బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు, ఇతర బెనిఫిట్స్, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుకే అది చాలదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.భారీగా బకాయిలు..విశాఖ స్టీలు ప్లాంటు ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొంటోంది. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌తో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ, ఉద్యోగులకు బకాయిపడ్డ వేతనాలు, వివిధ రకాల బెనిఫిట్స్, వీఆర్ఎస్ అమలు.. ఇలా మొత్తం రూ. 25 వేల కోట్ల మేర స్టీలు ప్లాంటు లోటు బడ్జెట్లో ఉంది. ఉద్యోగులకు సెప్టెంబరు నుంచి పెండింగ్ వేతనాలు, పీఎఫ్ ఇతర బకాయిలు కలిపి రూ.1,600 కోట్ల మేర ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ కోసం రూ.1,000 కోట్ల మేర అవసరం. ముడి సరుకు సరఫరా చేసిన వెండర్స్‌కు ఏకంగా రూ.7 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ ఉక్కుకు ప్రస్తుతం ఏకైక రైల్వే లైన్ ద్వారా ఆరు ర్యాకులు (దాదాపు వంద టన్నులు) బొగ్గు సరఫరా అవుతుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే రోజూ తొమ్మిది ర్యాక్‌లు అవసరం. నక్కపల్లి ప్రైవేటు స్టీలు ప్లాంటులో కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరో 4–5 ర్యాకులు బొగ్గు అవసరం అవుతుంది. రోజుకు 13–14 ర్యాక్‌ల బొగ్గును ఒక్క రైల్వే లైను ద్వారా తీర్చడం సాధ్యం కాదు. ప్రైవేట్ సంస్థతో పోటీపడి బొగ్గు సమస్యను పరిష్కరించుకునే అవకాశం విశాఖ స్టీలుకు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో నాలుగు వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరో 1,000 మందిని వీఆర్ఎస్ ద్వారా తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 7 వేల మందితో 7 మిలియన్ టన్నుల ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్పం..విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈమేరకు అసెంబ్లీలో 2021 మే నెలలో తీర్మానం కూడా చేశారు. పార్లమెంటులో సైతం వైఎస్సార్ సీపీ తన గళాన్ని వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సైతం తాజాగా స్వయంగా చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ జగన్ కేంద్రానికి పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోదీ సభలో కూడా వైఎస్ జగన్ దీన్ని ప్రస్తావించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి విశాఖలో భారీ పాదయాత్రను కూడా చేపట్టారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు విశాఖ స్టీలు ప్లాంటు ఆర్థిక సమస్యలతో పాటు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.తాత్కాలిక ఉపశనమం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రుణాలు, పెండింగ్ బకాయిలు కలిపితే సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలి. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ సొంత గనులు కేటాయిస్తేనే..ప్యాకేజీ వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలి. సొంత గనులు ఇవ్వడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయాలి. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ అంతా బూటకం..కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం బూటకం. దేశంలో అన్ని స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ ప్లాంట్‌కు మాత్రం ఎందుకు ఇవ్వరు? స్టీల్‌ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. – సీహెచ్ నరసింగరావు, సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్
-
విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికుల (vizag steel) అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు.మరో వైపు, కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పల్లె కన్నీరు పెడుతోందో -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాల్సిందే
సీతంపేట (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాలివైఎస్సార్సీపీ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలన్నారు. ప్లాంట్ ఉద్యోగుల జీతాల తగ్గింపుతో గాజువాకలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయన్నారు. రూ.200 కోట్ల టర్నోవర్ తగ్గిపోయిందన్నారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జనసేన పార్టీ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, సీపీఎ (ఎంల్) నేత గణేష్ పాండా, ఏఐటీయూసీ నేత కె.శంకరరావు, ఎస్‌యూసీఐ నేత సీహెచ్ ప్రమీల, ఆప్ నేత శీతల్, బీఎస్పీ నేత శివప్రసాద్, ఆర్పీఐ నేత బొడ్డు కల్యాణరావు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి
సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశం పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు రకరకాల కుట్రలు చేస్తోందని, ప్రైవేటీకరణను ఆపుతామని ప్రకటించిన తెలుగుదేశం, జనసేన నేతల్లో చిత్తశుద్ధి లోపించిందని తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవటంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని నేతలు మండిపడ్డారు. యురేనియం తవ్వకాలూ నిలిపివేయాలి.. ఇక కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ప్రాంత గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, ఆ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటించాలని కూడా వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో కృష్ణానది, బుడమేరు, గోదావరి తదితర నదుల వరదలతో నష్టపోయిన బాధితులందరికీ ఇంకా పూర్తిగా సహాయం అందలేదని, ప్రభుత్వ హామీ ప్రకారం ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, సీహెచ్ బాబురావు (సీపీఎం), కె.రామకృష్ణ, జల్లి విల్సన్ (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు. -
అగమ్యగోచరం.. స్టీల్‌ప్లాంట్ భవితవ్యం
ఉక్కునగరం: రాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఒక బ్లాస్ట్ఫర్నేస్తో కనిష్ట ఉత్పత్తి సాధిస్తూ సమస్యల సుడిగుండలో చిక్కుకుంది. ఇప్పుడు ఉన్న బొగ్గు, ఐరన్ ఓర్ నిల్వలతో సింగిల్ ఫర్నేస్ తప్ప రెండు ఫర్నేస్‌లు నడిపే పరిస్థితి లేదు. సింగిల్ ఫర్నేస్‌తో నెలకు రూ. 1000 కోట్లకు మించి టర్నోవర్ సాధ్యం కాదు. తద్వారా మరిన్ని అప్పులు, ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నా రు. ఇదే పరిస్థితి కొనసాగి.. ఉన్న ఒక్క ఫర్నేస్‌లో సాంకేతిక లోపం తలెత్తితే జీరో ఉత్పత్తి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెయిల్‌లో విలీనమే శాశ్వత పరిష్కారమని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విలీ నం దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.ఇటీవల కాలంలో స్టీల్‌ప్లాంట్ పరిస్థితి అత్యంత క్లిష్టదశకు చేరుకుంది. మూడు బ్లాస్ట్ఫర్నేస్లలో ఒకటి మూడేళ్లుగా మూత పడి ఉంది. ఉన్న రెండింటిలో ఒక బ్లాస్ట్ఫర్నేస్లోనే కనిష్ట స్థాయి ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. గత మూడు రోజులుగా న్యూఢిల్లీ కేంద్రంగా ఉక్కు మంత్రిత్వశాఖ విస్తృతంగా జరిపిన చర్చల్లో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు రూ.12 వేల కోట్లు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇస్తే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని నివేదించారు. దీనిపై ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు అంతసాయం చేయలేమని, రూ.3,100 కోట్లు ఇవ్వగలమని, దానికి సంబంధించి ప్రణాళిక ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఉక్కు మంత్రిత్వశాఖ ఇస్తామన్న ప్యాకేజీ రూ.3,100 కోట్లు ముడి సరకులు కొనుగోలుకు ఉపయోగపడటం తప్ప ఇప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించడానికి సరిపోయే పరిస్థితిలేదు. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతితో ఆ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ స్టీల్‌ప్లాంట్ సింగిల్ ఫర్నేస్ నిర్వహణకు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని ఉక్కు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.పట్టించుకోని కూటమి ప్రభుత్వంఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడంతో పాటు సెయిల్‌లో విలీనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలను ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉక్కు అఖిలపక్ష నాయకులను అమరావతికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయించారు. ‘మీరు పని చేయండి.. నేను చూసుకుంటాను’ అని చంద్రబాబు చెప్పడం తప్ప.. ఆ దిశగా ఎటువంటి చర్యలు కనిపించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని మోదీని చంద్రబాబు కలిసినప్పటికీ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని లేవనెత్తకపోవడం పట్ల ఉక్కు వర్గాలు విస్మయం చెందాయి. విశాఖ ఎంపీ భరత్‌ను కలిసి స్టీల్‌ప్లాంట్ పరిస్థితిని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వివరించారు. అతను కూడా కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడి ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత స్టీల్‌ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 45 రోజులు సమయం ఇస్తే కచ్చితంగా మంచి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకీ అతీగతి లేదు. గత వారం ఉక్కు అధికారుల సంఘం నాయకులు కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్‌ను కలిసి సెయిల్‌లో విలీనం అంశంపై మాట్లాడారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణం జోక్యం చేసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇప్పించడంతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా ఒత్తిడి తేవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటం అందరి బాధ్యతస్టీల్ప్లాంట్ను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాట చెబితే ఆగుతుంది. 1,310 రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఇతర స్టీల్ప్లాంట్ల కంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉండటం వల్లే అందరి కళ్లు ఈ ప్లాంట్‌పై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూప్రభుత్వ రంగం కోసమే భూములిచ్చారురాష్ట్రంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కోసమే నిర్వాసితులు తమ భూములు, ఇళ్లు ఇచ్చారు. వారి పునరావాసం, ఉపాధి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే హక్కు కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీతో పాటు సెయిల్‌లో విలీనం చేసేలా చూడాలి.– మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి, స్టీల్ప్లాంట్విస్తరణ అప్పులు, వడ్డీ పదేళ్లు వాయిదా వేయాలిస్టీల్ప్లాంట్ విస్తరణకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ భారం వల్ల స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి తలెత్తింది. దేశంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇచ్చినట్టే విస్తరణ అప్పులు, వడ్డీలను మాఫీ చేయడం లేదా కనీసం పదేళ్లపాటు వాయిదా వేయాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక భారం తొలగించాలి. సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా ముడిసరకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.– డి.ఆదినారాయణ, గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి, స్టీల్ప్లాంట్ప్రభుత్వ రంగంలో సీట్లు పెంచాలినీట్లో 478 మార్కులు వచ్చాయి. దీని వల్ల ఏ–కేటగిరీకి బదులు బి–కేటగిరీ సీటు వచ్చింది. ఏలూరు ఆశ్రమ్ కాలేజీలో చదువుతున్నాను. రిజర్వేషన్ లేదు. మాలాంటి వారికి ఓపెన్‌లో ఏ–కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరగాలి. ప్రస్తుతం ఏడాదికి ఫీజు రూ.13 లక్షల ఫీజు కట్టాల్సి వస్తోంది. అదే ఏ –కేటగిరీ అయితే ఫీజు రూ.20 వేలు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ కాలేజీలు అయితే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పేద విద్యార్థులకు మేలు జరిగేలా తగిన నిర్ణయం తీసుకోవాలి. – గోపిశెట్టి గీత, మురళీనగర్ఆశలు నీరుగార్చవద్దు మెడిసిన్ చేయాలని ఎన్నో ఆశలతో చదువుతున్నాం. కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోంది. గత ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐదు ప్రారంభమయ్యాయి. మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 7 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కళాశాలలన్నీ పూర్తయితే మొత్తం 1,800 సీట్లు అందుబాటులో వస్తాయి. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి అవకాశం లభిస్తుందనుకొన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలపై కత్తి కట్టింది. దీని వల్ల నీట్ రాసి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ సీట్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. – గొలగాని శ్రీరాజ్ఞ,పెదగదిలి -
గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి: మంత్రి బొత్స
విశాఖపట్నం, సాక్షి: ప్రజలు నిలదీయకున్నా సరే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏంటో తెలియజేయాలని చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు గాజువాక వస్తున్న తరుణంలో బాబు వైఖరి స్పష్టం చేయాల్సిందేనని బొత్స అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలి. రేపు గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి. ప్రజలు అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి. స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. .. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతాం. టీడీపీ-జనసేన-బీజేపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే. లాబీయింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నా. అనకాపల్లిలో క్యాష్ పార్టీ తప్ప టీడీపీకి బీసీ నేత దొరకలేదా?. వలంటీర్లపై చంద్రబాబుది నాలుకా,. తాటిమట్టా. వృద్ధాప్యం, ప్రజావ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నట్లున్నారు అని బొత్స ఎద్దేవా చేశారు. జగన్‌లాంటి నాయకుడ్ని చూడలేదు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట మీద నిలబడని నాయకులు. పైగా బలహీన వర్గాలంటే చిన్నచూపు. వాళ్లలా మేం మాయ మాటలు చెప్పం. జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు. నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు. మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు. బీసీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్. అందుకే బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు. మత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్. ఈ ఎన్నికల్లో మత్యకారులకు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఒక మత్స్య కారుని రాజ్య సభకు పంపించారు అని మంత్రి బొత్స గుర్తు చేస్తున్నారు. -
‘స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని సీఎం జగన్ కోరారు’
సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకమని, అయినా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది ప్రజలు సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు.. వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని పేర్కొన్నారాయన. కేంద్రం నడపలేని స్టీల్ ప్లాంట్‌ని ఓ రాష్ట్రం నిర్వహించగలదా? అని ప్రశ్నించారాయన. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. అసలు కొనడం అనే మాటే ఉత్పన్నం కాదు. బీజేపీ, బీఆర్ఎస్లు రాజకీయంలో భాగంగా వాళ్లు చేసేది చేస్తున్నారు. తెలంగాణ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే చెప్తోంది అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అనేది స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకమా? అనుకూలమా? అనేది స్పష్టం చేయాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒకవేళ వ్యతిరేకమైతే.. బీఆర్ఎస్ బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటోందన్నారాయన. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక మొమోరాండం ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? అధికారులు లేదంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది మా స్టాండ్. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాన మంత్రి మోదీకి ఇదే చెప్పారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు..ఇదే మా నినాదం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలోని సంస్థ ఆధారంగా.. మా మీద(వైఎస్సార్సీపీ ప్రభుత్వం) దుష్ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలు అమ్మితే ఏం చేసింది అని ఈనాడు తీరును ఎండగట్టారాయన. -
సంతకం పెట్టని టీడీపీ
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ సమర్థిస్తోందా? నిరసన కార్యక్రమాలు బూటకమేనా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ నీతిని మరోసారి బయట పెట్టుకున్నారా? అనే ప్రశ్నలకు ఆ పార్టీ ఎంపీల తీరు అవుననే సమాధానం ఇస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ (ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేలా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చే వినతిపత్రంపై సంతకం చేయాలని టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్నాయుడు, కేసినేని నాని, గల్లా జయదేవ్, కె.వరప్రసాద్‌లను వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి కోరారు. ఆ వినతిపత్రంలో లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతిపక్షాల్లో వైఎస్సార్సీపీతోపాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, శివసేన, ఐయూఎంఎల్, ఆర్జేడీ, బీజేడీ, సీపీఎం, ఎన్సీపీ, ఎన్సీ, ఎంఐఎం, ఆర్ఎల్పీ, ఆర్ఎస్పీ, కేసీ(ఎం) తదితర పార్టీల ఎంపీలు సంతకాలు చేశారు. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంతకాలు చేసి, మద్దతు తెలిపారు. కానీ.. టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న కార్యక్రమాలన్నీ బూటకమేనని స్పష్టమవుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ అంగీకరించినట్లే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆదినుంచి వైఎస్సార్సీపీ పోరాటం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆదిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ అధీనంలో లాభసాటిగా నడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వైఎస్సార్సీపీ ఇటు క్షేత్ర స్థాయిలో, అటు పార్లమెంట్లో తన వాణి గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా మిగతా పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొత్తంగా 120 మంది వినతిపత్రంపై సంతకాలు చేయగా, ఒక్క టీడీపీ మాత్రం నిరాకరించడం గమనార్హం. ఈ వినతిపత్రాన్ని శుక్రవారం విజయసాయిరెడ్డి ప్రధానికి అందజేశారు. దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటితో స్పష్టమవుతోంది. బీజేపీకి మరింత దూరమవుతామని చంద్రబాబు భయపడే వినతిపత్రంపై సంతకాలు చేయొద్దని టీడీపీ ఎంపీలను ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
Rajya Sabha: స్టీల్‌ప్లాంట్‌పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం
సాక్షి, ఢిల్లీ: ప్రైవేటీకరణకు పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్‌కి వెయ్యి కోట్ల లాభాలు వచ్చాయి. లాభాల్లో ఉన్న పీఎస్‌యూలను ప్రైవేటీకరణ చేయవద్దు. సొంత గనులను కేటాయించకపోవడం, హక్కులను పునర్వ్యవస్థీకరించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని’’ ఎంపీ అన్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఎలాంటి సంస్కరణలు చేయలేక పోవడం శోచనీయం. హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తగ్గించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 20,928 కోట్ల నుంచి 26,264 కోట్ల రూపాయలకు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 20,928 కోట్ల రూపాయలతో చేపట్టే విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌కు జూలై 2016లో హెచ్పీసీఎస్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్ట్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్ పనులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 26,785 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ దిగుమతులు ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 వరకు 26,785 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎం) ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకున్నట్లు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 31,137 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో (ఆన్‌షోర్‌లో) 2016-17 నుంచి 2020-21 వరకు 4,647 ఎంఎంఎస్‌సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2017-18లో 32 వేల మెట్రిక్ టన్నుల సీఎన్జీ అమ్మకాలు జరగ్గా 2020-21లో అది 13 వేల మెట్రిక్ టన్నులకు తగ్గాయని చెప్పారు. కోవిడ్ కారణంగా సీఎన్జీ అమ్మకాలు తగ్గినట్లు తెలిపారు. 2021-22లో సీఎన్జీ అమ్మకాలు పుంజుకుని 14 వేల మెట్రిక్ టన్నులకు చేరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, విజయవాడ, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు, కోలార్, వెల్లూరు జిల్లాల్లో కలిపి మొత్తం 111 సీఎన్జీ స్టేషన్లు ఉన్నట్లు మంత్రి వివరించారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మించాలని సదస్సు పిలుపునిచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో విస్తృతంగా సంతకాలు సేకరించి బడ్జెట్ సమావేశాల నాటికి పార్లమెంటుకు కోటి సంతకాలు పంపాలని సదస్సు తీర్మానించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా కోటి సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్త సదస్సులు, భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కె.ఎం. శ్రీనివాస్, ఆదినారాయణ మాట్లాడారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.పోలారి (ఇఫ్టూ), నరహరశెట్టి నరసింహారావు, పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.వి.సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేం స్వతంత్రంగా వ్యవహరించలేం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరే తమ వైఖరి అని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గురువారం హైకోర్టుకు నివేదించింది. తమది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినందువల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్టీల్ ప్లాంట్ తరఫు న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగాకానీ, వ్యతిరేకంగాకానీ తమ వైఖరిని చెప్పలేమన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌నే తాము అన్వయింప చేసుకుంటున్నామని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణపై ఫిబ్రవరి 2న తుది విచారణ మొదలు పెడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు ప్రైవేటీకరణ విషయంలో ఏవైనా కీలక పరిణామాలు ఉంటే వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ముందస్తు విచారణ కోరవచ్చునంటూ పిటిషనర్లకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు మరొకరు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫు న్యాయవాది స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా పలు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం సూచించగా.. వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ వ్యాజ్యాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. -
బొగ్గు కొరత వెనుక కేంద్రం కుట్ర: ప్రొఫెసర్ నాగేశ్వర్
సీతంపేట (విశాఖ ఉత్తర): బొగ్గు కృత్రిమ కొరత వెనుక కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. స్థానిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం’ అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ జూమ్ ద్వారా ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారి తీస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం వెనుక వాటిని అమ్మాలన్న ఆలోచన దాగుందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాని నిర్వీర్యానికే చర్యలు చేపడుతున్నట్టు ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి ప్రణాళిక లేకపోవడమే బొగ్గు సమస్యకు కారణమన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఏపీ జెన్కో సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు. రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా.. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రైవేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం..సీనియర్ మేనేజర్ మృతి
సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి యత్నం
ఉక్కు నగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి కార్మికులు యత్నించారు. భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సలహాదారుల నియామకానికి టెండర్లు వేయడానికి ఎవరైనా విశాఖ వస్తే తరుముతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజా సంపదను తన తాబేదార్లకు కట్టబెట్టడంలో భాగంగా విశాఖ ఉక్కును నూరు శాతం అమ్మాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇక్కడి ప్రజా పోరాటాన్ని చూసి గుత్తేదారులు ఎవరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ప్రక్రియను కొనసాగించాలని చూస్తే సహించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మెజార్టీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ప్రధానికి లేఖ రాసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. అయినప్పటికి తమ ఉద్యమం ఆగబోదన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్.నర్సింగరావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావు, వై.మస్తానప్ప, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, విళ్లా రామ్మోహన్కుమార్, డి.సురేష్‌బాబు, వరసాల శ్రీనివాస్, డేవిడ్, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, మాటూరి శ్రీనివాసరావు, నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి, ముత్యాలు, ఎం.శంకరనారాయణ, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి నిర్మలకు ‘ఉక్కు’ నిరసన సెగ
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనను అడ్డుకునేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ తీవ్ర ప్రయత్నం చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీతారామన్‌ను అడ్డుకోవాలని విశాఖ కార్మిక సంఘాలు పలుమార్లు విఫలయత్నం చేశాయి. ఆదివారం ఉదయం మంత్రి కేడీపేట వెళ్తున్నారని తెలుసుకున్న పరిరక్షణ కమిటీ నాయకులు కూర్మన్నపాలెం కూడలిలో అడ్డుకోవాలని భావించారు. పసిగట్టిన పోలీసులు ఆమెను సింహాచలం మీదుగా పంపించారు. దీంతో పరిరక్షణ కమిటీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, కె.సత్యనారాయణరావు, అయోధ్య, సుబ్బయ్య, రామకృష్ణ, కోరాడ వెంకటరావు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ పట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవెటీకరణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్రం అఫిడివిట్ దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. కాగా, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. -
'విశాఖ ఉక్కు' ఖాయిలా పరిశ్రమ కాదు.. స్పష్టం చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ఖాయిలా పరిశ్రమ కాదని కేంద్రం పేర్కొంది. మరోవైపు పరిశ్రమ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తామని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ, ఉక్కుశాఖ ఈ మేరకు సమాధానమిచ్చాయి. లోక్‌సభలో బీజేపీ ఎంపీ పూనం మహాజన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ సమాధానమిస్తూ.. ప్రభుత్వరంగ సంస్థల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ – విశాఖ ఉక్కు పరిశ్రమ) ఉక్కు పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలు ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల జాబితాలోకి రావని స్పష్టం చేశారు. ఎంపీలు రవికిషన్, ఎస్కే గుప్తా, సుభ్రతపాఠక్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారద్ సమాధానమిస్తూ.. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలు, ఉక్కు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ – విశాఖ ఉక్కు పరిశ్రమ)లో పెట్టుబడులు ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఉన్నతవిద్యలో ఆన్లైన్ లెర్నింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ రీజినల్ లాంగ్వేజెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.250 కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ఆపాలని కోరాం శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలని కృష్ణానది యాజమాన్య నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ), తెలంగాణ జెన్కోను కోరినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని సాగు, తాగు అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని 1.09 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ప్రభుత్వం రుణ గ్యారంటీ ఇచ్చినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్‌రాణే.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి రహదారులకు జాతీయ హోదా ప్రకటించేందుకు 12 కొత్త ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి గడ్కరీ చెప్పారు. రాష్ట్రంలోని 12 హైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని బీజేపీ సభ్యుడు వైఎస్ చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) ఫేజ్–2, ఫేజ్–3 పథకాల్లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మతి తెలియజేస్తూ 31 డ్యాముల కోసం రూ.667 కోట్లతో అంచనాలు పంపించిందని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. దేశంలో పోర్టుల అభివృద్ధి, తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయి సద్వినియోగం చేసుకోవడం కోసం తీసుకొస్తున్న కొత్త చట్టం ముసాయిదా బిల్లుపై కొన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సూచనలు రావాల్సి ఉందని టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలశాఖ సహాయమంత్రి శంతను ఠాకూర్ తెలిపారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా చేశారు. స్టీల్‌ప్లాంట్ మెయిన్‌గేట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వంద శాతం అమ్మేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది, స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ఆక్సిజన్ యూనిట్ సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణవాయువు ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఆక్సిజన్ యూనిట్ పనులు పూర్తి చేసేందుకు ఫ్రెంచ్ సంస్థ.. ఎయిర్ లిక్విడ్ ఇండియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎల్‌ఐహెచ్) అంగీకరించింది. రూ.85 కోట్లతో ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీంతో మరో ఆక్సిజన్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌లో ఐదు ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఫ్రెంచ్ సంస్థ.. స్టీల్‌ప్లాంట్‌లో రోజుకు 850 టన్నులు ఉత్పత్తి చేసేలా ఆక్సిజన్ యూనిట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు సంబంధించి 2013 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2016 నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.750 కోట్లు చెల్లించాలని స్టీల్‌ప్లాంట్‌ను ఏఎల్‌ఐహెచ్ డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించని స్టీల్‌ప్లాంట్ 2017 అక్టోబర్‌లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ మే 1లోపు పనులు ప్రారంభించాలని ఏఎల్ఐహెచ్ను ఆదేశించింది. అంతేకాకుండా ఒప్పందం చేసుకున్న సమయంలో ఉన్న బుక్ వాల్యూ ప్రకారమే ప్లాంట్‌ని స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. అయితే.. ఇతర పనులు పూర్తి చేసేందుకు స్టీల్ ప్లాంట్ తమకు రూ.85 కోట్లు చెల్లించాలని ఏఎల్‌ఐహెచ్ కోరగా ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో దశలవారీగా రూ.85 కోట్లు చెల్లించనున్నామని స్టీల్‌ప్లాంట్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో ఫ్రెంచ్ కంపెనీ ప్రతినిధులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. మే మొదటి వారంలో పనులు పూర్తి చేసి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 2 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా.. కోవిడ్ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు. ఇటీవలే 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్ని మహారాష్ట్రకు పంపారు. స్టీల్‌ప్లాంట్ నుంచి ఇప్పటివరకు మొత్తం 2 వేల టన్నుల ఆక్సిజన్ని సరఫరా చేశారు. తాజాగా కర్ణాటకకు 27 టన్నులు అందించారు. మొత్తం 5 యూనిట్లలో మూడింటి నుంచి రోజుకు 1,500 టన్నులు, రెండు యూనిట్ల నుంచి 1,200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తవుతోందన్నారు. ఇందులో 2,600 టన్నులు ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తవుతుండగా 100 టన్నులు 99.9 శాతం స్వచ్ఛమైన ద్రవ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తిలో సింహభాగం రాష్ట్ర అవసరాలకే వినియోగిస్తున్నట్లు తెలిపారు. -
భారత్ బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ నిర్వహించారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బంద్‌ను తలపెట్టిన పలు ప్రధాన పక్షాలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన మినహా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. లారీ అసోసియేషన్, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్‌లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపై రాస్తారోకో, ధర్నాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు విడనాడాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినదించారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, హోటల్స్, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. విజయవాడ బస్టాండ్ వద్ద బోసిపోతున్న పోలీస్ కంట్రోల్ రూం సెంటర్ ► విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) వద్ద ధర్నా చేపట్టారు. బంద్ సందర్భంగా పలువురు నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► గుంటూరులో వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ► కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద మధ్యాహ్నం తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ► అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పలు పార్టీలు, కార్మీక సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భీమవరంలో బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంద్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం శివారున ఉన్న తిరుమల విద్యా సంస్థకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. క్లాసులు జరగకపోయినా హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడాన్ని గమనించిన భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం జరగడంతో విద్యా సంస్థకు చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానికులు జోక్యం చేసుకని సర్దుబాటు చేశారు. రాళ్లు రువ్వడంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో గుండు కొట్టించుకుని నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేష్ ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులు ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటారని, బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో మారుమోగిన విశాఖ సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’, ‘విశాఖ ఉక్కు – ప్రైవేటీకరణ వద్దు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు, వాణిజ్య, వర్తక సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోలకే పరిమితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, సీఎఫ్ఐటీయూ, టీఎన్టీయూసీ , డీవైఎఫ్ఐ, ఐవైఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ఏఐడీఎస్వో, పీడీఎస్‌వో నాయకులు నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగర, రూరల్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ► గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ గేటు వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేతలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మోకాళ్లపై నిరసన తెలిపారు. ► గాజువాక, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆయా వైఎస్సార్సీపీ పార్టీల నేతలు, అఖిలపక్ష కారి్మక సంఘాల నేతలు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టి, వెంకోజిపాలెం వరకు ప్రదర్శన కొనసాగించారు. ► హుకుంపేట, అరకులోయ జంక్షన్, పాడేరు, అనకాపల్లి మెయిన్‌రోడ్ జంక్షన్లో రాస్తారోకోలు నిర్వహించారు. -
మీ నిర్ణయం మార్చుకోండి
గత నెలలో నేను మీకు (ప్రధాని) రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరించాను. ఆర్థిక మంత్రి ప్రకటనతో ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మా ఆకాంక్షలు, సెంటిమెంట్.. ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఉన్న మార్గాల గురించి మీకు మరోసారి వివరించడానికి అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలను వెంట తీసుకుని వస్తాను. త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మరోమారు మీకు లేఖ రాస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: దశాబ్దాల పోరాటాలు, ఆత్మ బలి దానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మాభిమానం, మనోభావాలతో ముడి పడిందని.. అలాంటి ప్లాంటును ప్రైవేటీకరించొద్దని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పూర్తిగా పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి మరో లేఖ రాశారు. ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసా గించాలని, ప్లాంటు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని స్పష్టం చేశారు. విశాఖ స్టీలు ప్లాంటును నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఇది రాష్ట్ర ప్రజలతో పాటు ప్లాంటు ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇస్తే ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు ప్రత్యామ్నా యాలను స్వయంగా కలిసి వివరిస్తానన్నారు. అఖిల పక్షంతో పాటు కార్మిక సంఘాల నేతలను వెంట పెట్టుకుని వస్తానని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, స్టీల్ ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు పలు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధానికి సీఎం జగన్ గతంలోనే లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. మరోసారి మీ దృష్టికి స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత ► సర్, నేను గత నెల (ఫిబ్రవరి 6వ తేదీ)లో మీకు రాసిన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్ విశాఖ) ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరిస్తూ, ప్లాంట్‌లో వ్యూహాత్మక 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరాను. అవే విషయాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా తెలియజేశాను. ► ఇదే సమయంలో ఆర్ఐఎన్ఎల్లో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అది రాష్ట్ర ప్రజలను, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ► విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యం, దాంతో రాష్ట్ర ప్రజలకు ముడిపడి ఉన్న సెంటిమెంట్ నేపథ్యంలో, సంస్థ పునరుద్ధరణకు ఉన్న మార్గాలను మరోసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ► ఆర్ఐఎన్ఎల్ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా నిల్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ, నవరత్నాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దదిగా నిలిచింది. ► దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్ ప్లాంట్ ఇది. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ, నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలతో పాటు, ఆటోమొబైల్ రంగం అవసరాలు కూడా తీరుస్తోంది. ► ఇది దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్న సంస్థ. దాదాపు దశాబ్ధ కాలం పాటు ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కొనసాగించిన ఉద్యమంలో దాదాపు 32 మంది అసువులు బాసారు. ఆ నేపథ్యంలోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నాటి ప్రధాని 1970 ఏప్రిల్ 17న ప్రకటన చేశారు. ► 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పని తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 2002లో దీన్ని ఖాయిలా పరిశ్రమగా బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీ కన్స్ట్రక్షన్)కు నివేదించారు. ► విశాఖ నగరంలోనే స్టీల్ ప్లాంట్‌కు దాదాపు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులు కాగా, ఇటీవలే ఆర్ఐఎన్ఎల్ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే విశ్వ వ్యాప్తంగా ఈ రంగంలో ఉత్పన్నమైన మాంద్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగా గనులు లేనందున ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగింది. ఫలితంగా లాభాలు పూర్తిగా పడిపోయాయి. ► విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం కంటే, ఆ సంస్థకు కాస్త అండగా నిల్చి, చేయూతనిస్తే తప్పనిసరిగా లాభాల బాటలో నడుస్తుందన్న గట్టి నమ్మకంతో చెబుతున్నాను. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడం, రుణాలను వాటాల రూపంలోకి మార్చాలనే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 1. రెండేళ్లు గడువు ఇస్తే పరిస్థితిలో మార్పు ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని రంగాలతో పాటు, స్టీల్ రంగం కూడా ఆర్థిక మాంద్యం నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పాదక సామర్థ్యం 7.3 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఐఎన్ఎల్ గత ఏడాది డిసెంబర్ నుంచి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పని చేస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 2. ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు చెందిన బైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది. ఒక్కో మెట్రిక్ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5,260కు సంస్థ కొనుగోలు చేస్తోంది. కాగా దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం మేర తీరుతుండగా, మిగిలిన ఇనుప ఖనిజాన్ని అవి ఎన్ఎండీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు కూడా 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండీసీ గనుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌పై రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలో ఉన్న మిగిలిన సంస్థలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీ పడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ రివైవల్ కోసం ఎంతో దోహదకారిగా నిలుస్తుంది. 3. రుణాలను ఈక్విటీలుగా మార్చాలి సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది. సంస్థ రుణ భారం రూ.22 వేల కోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్, విశాఖ) కూడా స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ చర్యలు సంస్థపై రుణ భారం తగ్గిస్తాయి. తద్వారా సంస్థ పనితీరు మరింత మెరుగు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుంది. 4. మిగులు భూమిలో ప్లాటింగ్ విశాఖ స్టీల్ పునరుద్ధరణకు మరో మార్గం కూడా ఉంది. ఆర్ఐఎన్ఎల్ వద్ద వినియోగించుకోని 7,000 ఎకరాల భూమి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ భూమిని ఆర్ఐఎన్ఎల్ చేత ప్లాటింగ్ చేయించి.. ప్లాట్లుగా మార్చి అమ్మితే ప్లాంట్‌ను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. తద్వారా సంస్థ విలువ పెరుగుతుంది. ఇందుకు అవసరమైన భూ వినియోగ మార్పిడికి అవసరమైన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ మీకు స్వయంగా వివరిస్తాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్‌తో పాటు సంస్థను తిరిగి లాభాల బాటలోకి మళ్లించడానికి ఏమేం చేయవచ్చన్న అన్ని విషయాలను స్వయంగా వివరించడం కోసం వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. అఖిలపక్ష బృందంతో పాటు, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ను స్వయంగా వివరిస్తాము. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. లక్ష్య సాధన కోసం మీ సమర్థవంతమైన నాయకత్వంలో, మీతో కలిసి అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను. సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలని, ఈ ప్రక్రియలో వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. -
'ఉక్కు' కోసం ఎందాకైనా..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు నగరంలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి ప్రజా ద్రోహానికి పాల్పడతారా? అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించాయి. శనివారం విశాఖ మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐద్వా, పీవోడబ్ల్యూ, హెచ్ఎంఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏపీఎంఎస్ మహిళా సంఘాల నాయకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు యత్నించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకొని.. ఆ తర్వాత కొద్దిసేపటికే విడిచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఎందాకైనా పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ద్వారకానగర్ బీవీకే కళాశాల సమీపంలో ఏపీ నిరుద్యోగ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. మరోవైపు ఉక్కు కర్మాగారంలోని టీటీఐ వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.జగదీశ్వరరావు చెప్పారు. సొంత గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెందుర్తిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు పాలకుల నిర్లక్ష్యంతోనే నష్టాలు.. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన విశాఖ స్టీల్‌ప్లాంట్.. ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నులకు చేరుకుంది. నాలుగేళ్లలో 203.6 శాతం వృద్ధి సాధించింది. 2010 నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కూడా కల్పించారు. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారుచేస్తూ దేశ విదేశాల్లో మంచి గుర్తింపు పొందింది. మొదట్నుంచీ లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యంతో నష్టాలు చవిచూసిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించి సహకారం అందిస్తే.. స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల్లోకి పయనిస్తుందన్నారు. వెంటనే ఉపసంహరించుకోండి.. గాందీనగర్ (విజయవాడసెంట్రల్): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ తెలిపింది. శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నికర నష్టం రూ.1421 కోట్లు
ఉక్కునగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1421 కోట్ల నికర నష్టం వచ్చింది. గురువారం స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ అధ్యక్షతన జరిగిన స్టీల్‌ప్లాంట్ 34వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ వివరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో 39 శాతం ఉత్పత్తి, 5 శాతం విలువ వృద్ధితో రూ. 12,271 కోట్ల సేల్స్ టర్నోవర్ సాధించామన్నారు. స్టీల్ ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆ ప్రభావంతో రూ. 1421 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 2015-16లో 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పూర్తయిందని, వాటితో పాటు ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల సంస్థ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు చేరిందని తెలిపారు. రానున్న కాలంలో విస్తరణ యూనిట్లను స్థిరీకరించడం ద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నామన్నారు. ఉక్కు యాజమాన్యం కార్మిక ఉత్పాదకత, కోక్ రేటు, పీసీఐ రేటు, ఇంధన వినియోగం తగ్గుదల తదితర అంశాలపై నిరంతరం దృష్టి సాధించి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషి చేస్తూనే ఉందన్నారు. సమావేశంలో రాష్ట్రపతి ప్రతినిధిగా ఉక్కు మంత్రిత్వశాఖ డెరైక్టర్ మహబీర్ ప్రసాద్‌తో పాటు, స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, రే చౌదరి, ఇండిపెండెంట్ డెరైక్టర్లు సునీల్ గుప్తా, కె.ఎం.పద్మనాభన్, జీఎం(ఫైనాన్స్) జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.