
విశాఖ ఉక్కు టర్నోవర్ 875కోట్లు
ఉక్కునగరం, న్యూస్‌లైన్: నవరత్న సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మంచి ఫలితాలను సాధించింది. ఏప్రిల్ నెలలో రూ.875కోట్ల టర్నోవర్ సాధించి 51శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో వైర్‌రాడ్ మిల్ ఉత్పత్తులు 67శాతం వృద్ధితో రూ.75కోట్లు కలిగి ఉన్నది.
ఏప్రిల్ నెలలో ద్రవ ఉక్కు ఉత్పత్తి 16శాతం వృద్ధి నమోదు సాధించింది. ఈ సందర్భంగా సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో నియంత్రణ విధించినప్పటికీ ఉద్యోగుల అంకితభావం వల్ల ఉత్పత్తి స్థాయిలను పెంచడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో అదే విశ్వాసం, నమ్మకంతో పనితీరును కనబర్చి ప్లాంట్ పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు.