
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లతో సహా వివిధ రేంజ్ ధరల్లో శాంసంగ్, ఐక్యూ, వివో, రియల్‌మీ వంటి బ్రాండ్ల నుంచి అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆయా ఫోన్‌లకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్లు.. వాటి ఫీచర్ల గురించి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.
రియల్‌మీ నార్జో 80 ప్రో
ఏప్రిల్ 9న రియల్‌మీ నార్జో 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. శక్తివంతమైన డైమెన్సిటీ 7400 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఎక్కువ కాలం పనిచేసే అంతరాయం లేని మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులకు ఈ కాంబినేషన్ అనువైన ఎంపికగా చేస్తుంది.
వివో వీ50ఈ
ఏప్రిల్ 10న లాంచ్ కానున్న వీ50ఈతో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని వివో కొనసాగిస్తోంది. సోనీకి చెందిన ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన ఈ ఫోన్ అసాధారణ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది, షట్టర్ బగ్స్, కంటెంట్ క్రియేటర్లకు సరైనదిగా ఉంటుంది.
ఐక్యూ జెడ్10
7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో కూడిన ఈ డివైస్ గేమర్స్, హెవీ డ్యూటీ యూజర్ల కోసం రూపొందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మొబైల్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.