Vivo
-
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్
-
వివో ఎక్స్200 సిరీస్.. ఇలాంటి కెమెరా తొలిసారి
మొబైల్స్ తయారీ సంస్థ వివో తాజాగా భారత్‌లో ఎక్స్200 సిరీస్ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ఉన్నాయి. భారత్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ జైస్ అపోక్రోమాటిక్ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్ సెమీ–సాలిడ్ సేŠట్ట్ బ్యాటరీని వివో ఎక్స్200 ప్రో మోడల్‌కు పొందుపరిచారు.6.78 అంగుళాల ఆమర్ గ్లాస్ డిస్ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సైతం జోడించారు. ఎక్స్200 మోడల్ 6.67 అంగుళాల షాట్ ఆల్ఫా గ్లాస్ డిస్ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.ఫన్‌టచ్ ఓఎస్ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, వివో ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్200 ప్రో ధర రూ.94,999 ఉంది. -
వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్..
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ పోర్ర్టెయిట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్ ధర రూ. 21,999 కాగా 8GB+256GB వేరియంట్ ధర రూ.23,999. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.నవంబర్ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ కార్డ్, బీవోబీ కార్డ్ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్ స్మార్ట్ఫోన్లకు బాలీవుడ్ నటి సుహానా ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది. -
రూ.15,000 లోపు ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు
-
మరో మడత ఫోన్ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!
దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)తేలికపాటి డిజైన్‌ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాఅంచనా ధరవివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్‌లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా. -
వివో ఇండియాకు భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివోకు భారీ షాక్ తగిలింది. వివో అనుబంధ వివో ఇండియా కు చెందిన మరో ముగ్గురు అధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతేడాది వివో ఇండియా వ్యాపారా లావాదేవీలపై ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల ద్వారా రూ.62,476 కోట్ల మేరకు చైనాకు వివో ఇండియా అక్రమంగా తరలించిందని ఈడీ అభియోగం మోపింది. అదే ఏడాది జూలైలో వివో ఇండియా కార్యాలయాలు, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివో ఇండియాతోపాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవలే పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంతకుముందు హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి హోం రాయ్, చైనీయుడు గౌంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరు నలుగురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది. ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదన లేదు’ -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
సరికొత్త టెక్నాలజీతో వివో వై36 లాంచ్: ధర తక్కువే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో వివో వై సిరీస్‌లో వివో వై 36 కెమెరాను భారత మార్కెట్లో తీసు కొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు! వివో వై36 ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేయ్ వేరియంట్ రూ. 16,999గా నిర్ణయించింది. 'డైనమిక్ డ్యూయల్ రింగ్' డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్రాంట్ గోల్డ్ మెటోర్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది. ICICI & HDFC కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు వివో వై36 ఫీచర్లు 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 50+2 ఎంపీ రియర్‌కెమెరా ఆరా స్క్రీన్ లైట్‌తో 16MP ఫ్రంట్ కెమెరా 5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) Here's another reason to amp up your style! Bringing you the all-new vivo Y36 with Stylish Glass Design and 44W Flash Charge. Buy now!#ItsMyStyle #vivoY36 pic.twitter.com/BI4ngPIJwi — vivo India (@Vivo_India) June 22, 2023 -
భారత్‌లో 5జీ ఫోన్లను తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు (కంపెనీల నుంచి విక్రయదారులకు రవాణా) జనవరి–మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం తగ్గి 3.1 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో మొదటి త్రైమాసికంలో అతి తక్కువ షిప్మెంట్ ఇదేనని ఐడీసీ పేర్కొంది. రియల్మీ, షావోమీ ఫోన్ల షిప్మెంట్లో ఎక్కువ క్షీణత నమోదైంది. ఇవి మార్కెట్ వాటాను కూడా నష్టపోయాయి. 2023లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ఇక స్మార్ట్ఫోన్ల రవాణాలో క్షీణత ఉన్నప్పటికీ.. శామ్సంగ్ 20.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 17.7 శాతం వాటాతో వివో ఉంది. ఒప్పో 17.6 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో షిప్మెంట్ పరంగా వృద్ధిని చూపించిన ఏకైక సంస్థగా ఒప్పో నిలిచింది. షావోమీ షిప్మెంట్ 41.1 శాతం తగ్గి 50 లక్షల యూనిట్లుగా ఉంది. మార్కెట్ వాటా 2022 మొదటి త్రైమాసికంలో 23.4 శాతంగా ఉంటే, అది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 16.4 శాతానికి తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో 9.47 శాతం వాటాతో రియల్మీ ఉంది. 29 లక్షల యూనిట్లను రవాణా చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రియల్మీ మార్కెట్ వాటా 16.4 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. 2022 ద్వితీయ ఆరు నెలల్లో పండుగలకు ముందు విక్రేతలు స్టాక్ పెంచుకోవడంతో, వారి వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయి’’అని ఐడీసీ నివేదిక తెలిపింది. ఇక మొత్తం షిప్మెంట్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగింది. తక్కువ ధరల 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. -
వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ను భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ స్మార్ట్ఫోన్లను బుధవారం లాంచ్ చేసింది. MediaTek డైమెన్సిటీ 9200 SoC,కెమెరా-ఫోకస్డ్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్, V2 చిప్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఇప్పటికే చైనా, మలేషియాలో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ఫోన్లు వచ్చే వారం దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి గత ఏడాది ఎక్స్ 80 సిరీస్‌ను లాంచ్ చేసిసక్సెస్ అయిన సంగతి తెలిసిందే. వివో ఎక్స్ 90 ప్రొ, వివో ఎక్స్ 90 ధర, లభ్యత వివో ఎక్స్ 90 ప్రొ ధర సింగిల్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 84,999. లెజెండరీ బ్లాక్ షేడ్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) వివో ఎక్స్ 90 రూ. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 59,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 63,999. ఆస్టరాయిడ్ బ్లాక్ , బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి . మే 5 నుండి అమ్మకాలు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.ఎస్బీఐ, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొత్త స్మార్ట్ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్కి వస్తే..దాదాపు రెండు మోడల్స్ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. వివో ఎక్స్ 90 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.78-అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే 1,260x 2,800 పిక్సెల్స్ రిజల్యూషన్ Android 13-ఆధారిత FunTouch OS, 120Hz రిఫ్రెష్ రేట్ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 SoC 50+50+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 4,870mAh బ్యాటరీ 8 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే! -
మొబైల్స్ ఎగుమతికి కొత్త వ్యూహాలు.. ఈ ఏడాది టార్గెట్ ఇదే!
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీలో ఉన్న వివో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 2023 చివరినాటికి మరో రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలో నూతనంగా రాబోతున్న యూనిట్లో ఉత్పత్తి 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. 169 ఎకరాల విస్తీర్ణంలో నెలకొంటున్న ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 కోట్ల యూనిట్లు. ఈ ఏడాది 10 లక్షలకుపైగా మేడిన్ ఇండియా మొబైల్స్‌ను ఎగుమతి చేసే పనిలో నిమగ్నమైనట్టు కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా వివో మేడిన్ ఇండియా ఫోన్లు గతేడాది థాయ్‌లాండ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో విక్రయిస్తున్న ప్రతి వివో ఫోన్ దేశీయంగా తయారైనదే. బ్యాటరీ 95 శాతం, చార్జర్ విడిభాగాలు 70 శాతం స్థానికంగా సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో వివో తయారీ కేంద్రం ఉంది. రూ. 7,500 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా తొలిదశలో 2023 చివరినాటికి ర.3,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ‘ఇప్పటికే రూ. 2,400 కోట్లు వ్యయం చేశాం. మరో రూ. 1,100 కోట్లు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఇక్కడ అడుగు పెట్టిన నాటి నుండి వ్యూహాత్మక మార్కెట్ గా భారత్ కొనసాగుతోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల తెలిపారు. -
వివో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది - వివరాలు
రోజు రోజుకి మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలవుతుండటంతో వినియోగదారులు కూడా కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వివో కంపెనీ ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ అనే స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ తరహా మొబైల్స్ లాంచ్ చేశాయి. కాగా ఈ విభాగంలో వివో కూడా చేరనుంది. ఇందులో భాగంగా కంపెనీ విడుదలకానున్న కొత్త మొబైల్ మోడల్ నెంబర్ కూడా (V2256A) తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇది త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వివో ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 50MP సోనీ IMX8606 ప్రైమరీ కెమెరా వంటి వాటితోపాటు 6.8 ఇంచెస్ 120Hz మెయిన్ డిస్ప్లే, పైన చిన్న సెకండరీ డిస్ప్లేను పొందుతుంది. మొత్తం మీద ఇది కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా తయారైవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) వివో ఎక్స్ ఫ్లిప్ అనేది చైనీస్ ఉత్పత్తి అయినప్పటికీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,695 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 4,338 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర సుమారు రూ. 79,990 వరకు ఉంటుందని అంచనా, ఇది ఏప్రిల్ 17న విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
వివో వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. టాప్ ఎండ్ మీడియా టెక్ సాక్ ప్రాపెసర్లతో వివో వీ27, వివో వీ27 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చింది. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ఫీచర్లు ప్రాసెసర్ తప్ప వివీ వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు దాదాపు రెండూ ఒకే విధమైన ఫీచర్లతో వచ్చాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత FunTouch OS 13ని, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్ప్లే, 4600mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా 50+2+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, అలాగే ఆటో ఫోకస్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ధర, లభ్యత వివో వీ 27 ప్రొ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 39,999. టాప్-ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 42,999. వివో వీ 27: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 32,999 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ. 36,999 ఈ స్మార్ట్ఫోన్లు సిరీస్ మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ షేడ్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్, వివొ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయం. వివో వీ27 ప్రొ ప్రీ-బుకింగ్ ఈ రోజు (మార్చి 1) ప్రారంభం. మార్చి 6 నుండి సేల్ షురూ. ఇక వివో వీ27 సేల్ మార్చి 23 నుండి ప్రారంభం. అలాగే కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డు కొనుగోళ్ల ద్వారా మూడు వేలు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ. 2500 exchange బోనస్ కూడా లభిస్తుంది. -
Vivo V27 Pro: విడుదలకు ముందే వివరాలు లీక్, ధర ఎంతంటే?
మార్కెట్లో వివో కంపెనీ తన 5జీ సిరీస్‌లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ విడుదల చేయకముందే ప్రైస్, డీటైల్స్ అన్నీ కూడా ప్రకటించింది. కంపెనీ వీ27 సిరీస్‌లో వీ27, వీ27 ప్రో విడుదలచేయనుంది. ఈ రెండూ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో రానున్నాయి. వివో వీ27 ప్రో భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అవి 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్, చివరగా టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999. కంపెనీ విడుదల చేసే వివో వీ27 ప్రారంభ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ ధరలు మర్చి 01న అధికారికంగా విడుదలవుతాయి. ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో వెల్లడయ్యాయి. వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది. -
Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో.. వై సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్‌లో వివో వై100 విడుదలైన కొద్దిసేపటికే వివో వై56 5జీ మార్కెట్లోకి వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ బడ్జెట్ కేటగిరీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 19,999. ఆరెంజ్ షిమ్మర్, బ్లాక్ ఇంజిన్ రంగుల్లో లభిస్తోంది. వివో అఫీషియల్ వెబ్‌సైట్‌తోపాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు. మరి ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేయండి.. వివో వై56 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్: 6.58 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (SD కార్డ్‌తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు) 50ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బరువు 184 గ్రాములు (ఇదీ చదవండి: రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?) -
రంగులు మార్చే ఫోన్: వివో వై100 లాంచ్, ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: వివో సంస్థ వై100 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ వెనుక భాగం రంగులు మారడం ఇందులో ప్రత్యేకత. ఇందుకోసం ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. 64 మెగాపిక్సల్ ఓఐఎస్ యాంటీ షేక్ కెమెరా ఏర్పాటు చేశారు. చూడ్డానికి ప్రీమియంగా, తక్కువ బరువుతో ఉంటుందని వివో తెలిపింది. పసిఫిక్ బ్లూ , ట్విలైట్ గోల్డ్ - మరియు మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం.181 గ్రాముల బరువుతో ఉంటుంది. వివో వై100 ఫీచర్లు 6.38 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 7.73 ఎంఎం స్లీక్ బాడీ Android 13, FunTouch OS 13 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ ఫ్లాష్ చార్జర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. లభ్యత, ఆఫర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లతోపాటు, రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది. కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. When change is the only constant, why stick to one color? Stay tuned for the Color Changing Glass Finish of vivo Y100. Stay tuned! To know more, visit https://t.co/5bNAoMyRiK#vivoY100 #ItsMyStyle #ColorMyStyle#ComingSoon #5G pic.twitter.com/wmuhn2Wj5B — vivo India (@Vivo_India) February 8, 2023 -
విడుదల కానున్న ఒప్పో మడత ఫోన్.. ధర ఎంతంటే?
ఒప్పో తొలి ఫ్లిప్ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. గత ఏడాది చైనా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మడత ఫోన్‌ను ఈనెల 15వ తేదీన లాంచ్ చేయనున్నట్టు ఒప్పో అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌లో 3.26 అంగుళాల అమోలెడ్ సెండరీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే 6.8 అంగుళాల అమోలెడ్ ప్రైమరీ అమోలెడ్ డిస్ప్లేతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వస్తోంది. 5జీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్సిటీ 9000+ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఒప్పో ఇస్తోంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 5,999 యువాన్లు (సుమారు రూ.71,200)గా ఉంది. భారత్‌లో సుమారు ఇదే ధరతో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మడత ఫోన్ పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. -
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు ఎదురు దెబ్బ.. భారీ షాకిచ్చిన భారత్!
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు ఎదురు దెబ్బ తగిలింది. దేశీయంగా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కేంద్ర అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు 27వేల ఫోన్ల రవాణాను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ భారత్‌లో స్మార్ట్ ఫోన్లను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తుంది. అయితే తాజాగా వివో తయారు చేసిన ఆ స్మార్ట్ఫోన్లను, వాటి విలువను తక్కువగా చూపెట్టి దేశ సరిహద్దులు దాటిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లను సరఫరా చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆఫోన్ల విలువ దాదాపు 15 మిలియన్లని తేలింది. ఈ సందర్భంగా వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ డిసెంబర్ 2న ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. కేంద్ర సంస్థలు తమ మెరుగైన పనితీరుతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయని అన్నారు. రూ.62,476కోట్లు చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మనీ ల్యాండరింగ్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈఏడాది జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలకు చెందిన 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అదే సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది. పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. వివో ఫోన్లను ఇతర దేశాలకు తరలించడం సంచలనంగా మారింది. -
వివో వైఓ2, ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!
సాక్షి, ముంబై: వివో బడ్జెట్ ధరలో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ2 పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్, 5000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వైఓ2 ఫీచర్లు 6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 mAh బ్యాటరీ Trendy style and unmatched vibe. Unveiling the new #vivoY02 Buy Now : https://t.co/eDzazkRLla#ItsMyStyle #BuyNow pic.twitter.com/Pziuht03RY — vivo India (@Vivo_India) December 5, 2022 -
సూపర్ ఫీచర్లతో వివో ఎక్స్90 సిరీస్ వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో కొత్త సిరీస్ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్80 సిరీస్‌కు కొనసాగింపుగా వివో ఎక్స్90 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అద్భుతమైన ఫీచర్స్‌తో, ముఖ్యంగా నాలుగుపవర్ ఫుల్ కెమెరాలతో తీసుకొస్తోంది. వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ+ మూడు వేరియంట్లలో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. త్వరలోనే భారత మార్కెట్లలో కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్, బ్లాక్ కలర్లో ఇవి లభ్యం కానుంది. చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వైబోలో ఫోటోలు, ఫీచర్లు లీక్ అయ్యాయి. వివో ఎక్స్90 ఫీచర్లు అంచనాలు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 క్వాల్‌కాం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ 50+50+ 64+48 రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్ 4,700mAh బ్యాటరీ ధర: ఈ రోజు (నవంబరు 22) సాయంత్రం లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, 800 డాలర్లు, సుమారు రూ. 65,315 ఉంటుందని అంచనా. -
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్‌లో కబడ్డీ సందడి
-
బంపరాఫర్.. రూ. 999కే అదిరిపోయే ఫీచర్లున్న వివో స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
వివో (Vivo) కొన్ని నెలల క్రితం మార్కెట్లో కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా వివో టీ1 ఎక్స్( Vivo T1X) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది యూజర్లకు మంచి గేమింగ్ ఎక్సపీరియన్స్ కోసం ప్రత్యేకంగా తయారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌కు సంబంధించి అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. కేవలం రూ.999 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అదెలా అనుకుంటున్నారా, దానిపై ఓ లుక్కేద్దాం! Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం అవి ఫ్లిప్‌కార్ట్( Flipkart)లో.. 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.16,999గా ఉండగా, 4GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ.17,990, ఉంది. వీటితో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన దాని టాప్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990గా ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లతో అందిస్తోంది. ఇవి గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. చదవండి: సామాన్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. భారీగా తగ్గిన వంటనూనె ధరలు! కేవలం.. రూ.999లకే ఈ ఫోన్ మీ జేబులోకి ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్ల బొనాంజా సేల్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సెల్లో, మీరు 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ. 999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలా అంటే .. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,990గా ఉంది. ఇందులో 21 శాతం తగ్గింపు ఆఫర్‌తో వస్తోంది. అంటే ఈ ఫోన్‌ని రూ.14,999కే వస్తుంది. దీంతో పాటు, మీరు ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్. కంపెనీ దీనిపై రూ.14,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కనుక కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వనియోగం చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 999కు మీ సొంతం చేసుకుని జేబులో పెట్టుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ బెనిఫిట్ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ పని చేస్తున్న కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. చదవండి: ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట! -
వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’ తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివో ఎక్స్80 సిరీస్, వివో వీ25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటి వరకు లేనంత డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్80 సిరీస్‌పై రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐపై ఈ ప్రయోజనాలు అందిస్తోంది. ముందు రూ.101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ ( EMI) కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని పై వివో పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ ఆఫర్‌పై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని వివో రిటైలర్ సంప్రదించడం ఉత్తమం. రూ.15వేలకు పైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
వావ్ అనే లుక్‌లో వివో వై16.. ఫీచర్లు అదిరే, రూ.10వేల కన్నా తక్కువే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల బ్రాండ్ వివో కొత్తగా తమ వై–సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9,999 (3జీబీ+32 జీబీ) నుంచి రూ. 12,499 (4 జీబీ+64 జీబీ) వరకూ ఉంటుంది. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కోటక్, ఐడీఎఫ్సీ, వన్‌కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్ కార్డులతో రూ. 1,000 వరకూ, ఆన్లైన్ కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రెడిట్ కార్డులపై రూ. 750 మేర క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 6.51 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కార్డ్ స్లాట్, 13 ఎంపీ మెయిన్.. 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కమెరా, మీడియాటెక్ పీ35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
‘భారత్‌కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు!
భారత్‌లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమా తగ్గడంతో దేశీయ మార్కెట్‌కు గుడ్ బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు గుడ్‌బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది. మేడిన్ ఇండియా ‘భారత్ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈజిప్ట్‌లో ఒప్పో చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కల్పన జరనున్నట్లు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 బంపరాఫర్ ..ఏకంగా 80 శాతం డిస్కౌంట్! పన్ను ఎగొట్టి 2021 డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల్ని విచారించారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ (Prevention of Money Laundering Act (PMLA) యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివో తో పాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేల కోట్లు ఆ సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, ఆ మొత్తం 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది.వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఒప్పో సంస్థ రూ. 4389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా రూ. 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. ఈ తరుణంలో భారత్‌కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
చైనాకు ఝలక్.. ఆ మొబైల్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాలకు చైనాకు కవ్వింపు చర్యలను తిప్పి కొట్టడంతో పాటు డ్రాగన్ కంట్రీకి సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది. అటు సరిహద్దుల్లో మాత్రమే కాదు వ్యాపారం పరంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ అదును చూసి చెక్ పెడుతోంది. ఈ క్రమంలోనే చైనాకు సంబంధించిన పలు యాప్‌లను నిషేధిస్తూ గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడిన కేసులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని ప్రస్తుతం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని కూడా ఆర్థిక మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఒపో, షావోమీ, వివో ఇండియాలు ఇందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఒపో విషయంలో రూ.2,981 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు భావిస్తున్నామన్నారు. షావోమీ విషయంలో చెల్లించాల్సిన మొత్తం రూ.653 కోట్లు ఉంటుదని అంచనా అన్నారు. ఇక వివో ఇండియాకు రూ.2,217 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివాదాలకు సంబంధించి షావోమీ రూ.46 లక్షలు డిపాజిట్ చేస్తే, వివో ఇండియా రూ.60 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. చదవండి: Indian Railways: రైలులో ప్రయాణం.. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు ఉచితం! -
చైనా దిగ్గజం వివోకు ఈడీ షాక్, పెద్ద ఎత్తున సోదాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై మంగళవారం దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది మనీలాండరింగ్ ఆరోపణలతో ఈ దాడులు చేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ల కింద ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. టెలికాం మేజర్ వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ 40కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత నెలలో, రెండు చైనా కంపెనీలు నకిలీ పత్రాలు, చిరునామాలతో అక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో ఈడీ ఈ చర్యకు దిగింది. ఇప్పటికే జెడ్‌టీఈ కార్పొరేషన్, వివో మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీ లోకల్ యూనిట్లు ఆర్థిక అవకతవకల విచారణను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మొబైల్ దిగ్గజం షావోమి కూడా ఈడీ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. -
వివో నుంచి ఎక్స్80, ఎక్స్ 80ప్రో
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్షిప్ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది. -
వచ్చేస్తోంది..వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..లాంచ్ ఎప్పుడంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణపై దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఒప్పో ఫోల్డబుల్ ఎన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి వివో కూడా వచ్చి చేరనుంది. త్వరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది వివో. ఏప్రిల్ 11 న లాంచ్..! మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఏప్రిల్ 11న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వివో ఎక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను కంపెనీ టీజ్ చేసింది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ భారీ స్క్రీన్, బ్యాటరీతో రానున్నుట్లు సమాచారం. దీంతో పాటుగా ఏప్రిల్‌లో జరిగే లాంచ్ ఈవెంట్లో...వివో ప్యాడ్ టాబ్లెట్, Vivo X ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్, Vivo X నోట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వంటి మూడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. చైనీస్ సోషల్‌మీడియా విబో ప్రకారం..వివో ఎక్స్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. బ్లూ, క్రిమ్సన్, ఆరేంజ్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. Vivo X ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ ప్రాసెసర్‌తో రానున్నట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ గెలిచిన ‘డూన్’.. అవార్డు రావడంలో మనోడిదే కీలక పాత్ర -
స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో 'లోకల్' స్కెచ్!! వేలకోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో రానున్న రెండేళ్లలో దేశీయంగా రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఈ కేలండర్ ఏడాది(2022)లో దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసే యోచనలో ఉంది. దేశీయంగా మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వివో ఇండియా (వ్యాపార వ్యూహాల) డైరెక్టర్ పాయిగమ్ డానిష్ తాజాగా తెలియజేశారు. తద్వారా దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే(2021 వరకూ) రూ.1,900కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.రానున్న రెండేళ్లలో మరో రూ.3,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. పెట్టుబడులన్నీ తయారీకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. లోకల్ డిమాండ్ స్థానికంగా మొబైల్ ఫోన్లకున్న డిమాండుకు అనుగుణంగా గ్రేటర్ నోయిడా ప్లాంట్ల నుంచి సరఫరాలు చేస్తున్నట్లు డానిష్ పేర్కొన్నారు. ఇకపై హ్యాండ్సెట్లను ఎగుమతి చేయడంపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించారు. వెరసి ఈ ఏడాది నుంచే ఎగుమతులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాలకు అనుగుణంగా గత ఏడేళ్లలో తామెంత బలపడిందీ ఈ అంశాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో వివో 10 కోట్లకుపైగా వినియోగదారులను చేరుకున్నట్లు తెలియజేశారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2021లో షియోమీ, శామ్సంగ్ తదుపరి 15.6 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా మూడో ర్యాంకులో నిలిచినట్లు వెల్లడించారు. మరో 5000 మందికి ఉపాధి ప్రస్తుతమున్న 6 కోట్ల స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డానిష్ తెలియజేశారు. ఇందుకు వెచ్చిస్తున్న రూ. 7,500 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరనున్నట్లు తెలియజేశారు. తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10,000 మంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2023లో అదనంగా 5,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో కొనుగోలు చేసిన మరో 169 ఎకరాలలో కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం బ్యాటరీలను 90 శాతం, చార్జర్లను 60 శాతంవరకూ దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. 2023కల్లా 65 శాతం డిస్ప్లేలను స్థానికంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. -
పవర్ఫుల్ ర్యామ్, 50 ఎంపీ కెమెరాతో వివో 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా భారత మార్కెట్లో టీ1 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. టీ సిరీస్‌లో ఇది మొదటి స్మార్ట్‌ఫోన్ అని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, వివో పోర్టల్, రిటైల్ స్టోర్స్‌లో దీని ధర రూ. 15,990 నుంచి రూ. 19,990 వరకూ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్లు వినియోగించుకుంటే రూ. 14,990కే పొందవచ్చని వివో వివరించింది. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. రూ. 20,000 లోపు ధరలో ఇది అత్యంత పల్చని స్మార్ట్‌ఫోన్ అని పేర్కొంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ ఫోన్లో 50 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్‌టచ్ ఓఎస్ 12 మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో (స్ట్రెయిట్ బ్లాక్, రెయిన్బో ఫ్యాంటసీ) లభిస్తుంది. చదవండి: తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్‌తో ఐటెల్ ఇయర్ బడ్స్..! ధర ఏంతంటే..? -
గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు..! ఇండియన్స్ ఫేవరెట్ బ్రాండ్ అదే..!
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆటోమొబైల్, సర్వీస్ సెక్టార్స్ భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రేరిత బాధల నుంచి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ సురక్షితంగా తప్పించుకుంది. 2021లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు రెండు లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జరిపినట్లు తెలుస్తోంది. చిప్స్ కొరత ఉన్నప్పటీకి..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చిప్స్ కొరత తీవ్రంగా వేధించింది. చిప్స్ కొరత ఉన్పప్పటీకి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 38 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2021లో దాదాపు రూ. 2,83,666 కోట్లకు చేరుకుంది. 2020తో పోలిస్తే 27 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. 2021లో భారతీయులు ప్రతి గంటకు 19,406 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పటివరకు చూసిన అత్యధిక షిప్మెంట్. ఇదిలా ఉండగా కాంపోనెంట్ కొరత కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఎగుమతులు మందగించడం విశేషం. టాప్ బ్రాండ్ అదే..! భారత స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో 2021గాను షావోమీ బ్రాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. అయినప్పటికీ, కాంపోనెంట్స్ సరఫరాలో పరిమితుల కారణంగా కంపెనీ నాల్గవ త్రైమాసికంలో ఎగుమతులలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఇక రెండో స్థానంలో శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ 2021లో 8 శాతం క్షీణతను నమోదుచేసింది. రూ. 20,000 నుంచి రూ. 45,000 సెగ్మెంట్లోని 5G స్మార్ట్ఫోన్ల ద్వారా మార్కెట్లో 18 శాతం వాటాను పొందింది. శామ్సంగ్కు ఇది శుభవార్త అయినప్పటికీ, ఇది కూడా సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. శాంసంగ్ ఫోల్డబుల్ విభాగంలో అగ్రగామిగా నిలిచింది. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లలో 2021గాను 388 శాతం వృద్ధిని శాంసంగ్ సాధించింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ రియల్మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి. వివో 2021లో 19 శాతం వాటాతో టాప్ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించిగా...ఒప్పో 6 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక యాపిల్ 2021గాను 108 శాతం వృద్దిని నమోదుచేసింది. చదవండి: చిప్ షార్టేజ్ సంక్షోభం.. అయినా 583.5 బిలియన్ డాలర్ల షాకింగ్ బిజినెస్‌తో హిస్టరీ! -
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్న వివో
-
ఇకపై 'వివో' కాదు 'టాటా' ఐపీఎల్.. ఐపీఎల్ 2022లో కీలక మార్పు
Tata IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ ‘వీవో’ తప్పుకుంది. 2018 నుంచి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న వీవో.. మరో రెండేళ్ల గడువు ఉండగానే నాటకీయ పరిమాణాల మధ్య వైదొలగడంతో దేశీయ వ్యాపార దిగ్గజం 'టాటా' టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు 2023 సీజన్‌కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ చేయనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. కాగా, భారత్-చైనాల మధ్య వివాదాల కారణంగా 2020 సీజన్లో వీవో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పించబడిన సంగతి తెలిసిందే. అప్పుడు వీవో స్థానంలో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. చదవండి: ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్! -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..?
ఊసరవెల్లిలా రంగులు మారే ఫోనేంటి...? ఆశ్యర్యపోతున్నారా...మీరు చూసింది నిజమే... ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ అచ్చం ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. తొలి కలర్ ఛేజింగ్ బ్యాక్ ప్యానల్ స్మార్ట్‌ఫోన్‌ను వివో భారత్‌లో బుధవారం రోజున లాంచ్ చేసింది. ఏరోస్పేస్ గ్రేడ్‌తో స్మార్ట్‌ఫోన్...! చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత్‌లోకి సరికొత్త వివో వీ23 సిరీస్ స్మార్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ రంగులు మారడంతో పాటుగా భారతదేశపు మొట్టమొదటి 50ఎంపీ 'ఐ ఏఎఫ్(ఆటోఫోకస్) డ్యూయల్ సెల్ఫీ' కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా వివో వీ23 సిరీస్ నిలుస్తోంది. వివో వీ23 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ డిజైన్‌తో రానుంది. ఈ ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 63 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాగా ఇది నిలుస్తోంది. వీ23 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇది మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌లో అద్భుతంగా సెట్ చేశారు.దీంతో స్మార్ట్‌ఫోన్ సన్నగా కేవలం 7.39 mm మందంతో ఉండనుంది. దీని బరువు కేవలం 179 గ్రాములు మాత్రమే. ధర ఎంతంటే..? న్యూ వివో వీ23, వీ23 ప్రొ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వీ23 ప్రో 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,990, వీ23 ప్రో 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,990 గా ఉంది. వివో వీ23 8GB ర్యామ్+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,990 కాగా, 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,990గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లను జనవరి 13 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో, జనవరి 19 నుంచి అన్ని వివో ఇండియా రిటైల్ స్టోర్స్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. వివో వీ23 ప్రో ఫీచర్స్ 6.56-అంగుళాల ఫుల్హెచ్డీ AMOLED డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సీటీ 1200 చిప్ సెట్ ఫన్‌టచ్ ఒఎస్ 12 బేస్డ్ఆన్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ ఆటోఫోకస్డ్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా 108 ఎంపీ రియర్ కెమెరా 12జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 5జీ సపోర్ట్ 4300mAh బ్యాటరీ 44W ఫాస్ట్ చార్జింగ్ చదవండి: బ్లాక్‌బెర్రీ.. ఒకప్పుడు ‘స్మార్ట్’ కింగ్.. మరి పతనానికి కారణాలు తెలుసా? ఇవే.. -
ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్..!
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీగా ఆదరణను నోచుకుంటున్నాయి. ఇప్పటికే శాంసంగ్ లాంటి కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లను యేలుతున్నాయి. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వస్తోన్న ఆదరణతో ఒప్పో, వివో లాంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను తయారుచేసే పనిలో నిమగ్నమైనాయి. ఇది స్మార్ట్‌ఫోనా..లేదా ల్యాప్‌ట్యాపా...! ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో అద్బుతమైన ఆవిష్కరణకు సిద్ధమైంది. ఫోల్టబుల్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఆవిష్కరణతో వివో ముందుకురానుంది. స్మార్ట్‌ఫోనా లేదా ల్యాప్‌ట్యాపా అన్నట్లుగా వివో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఉండనుంది. సాధారణంగా మనం వాడే ల్యాప్‌ట్యాప్‌లో స్క్రీన్‌తో పాటుగా కీబోర్డు హింజ్ సహయంతో కనెక్ట్ అయ్యి ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం వివో ఇలాంటి ఆవిష్కరణను ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో తెచ్చేందుకు సన్నాహాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. వివో హింజ్లెస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్..! వివో మూడు మడతలతో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పేటెంట్ కోసం ఈ ఏడాది జూన్‌లో USPTO (యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్)కి ఫైల్ చేసినట్లు లెట్స్ గో డిజిటల్ వెల్లడించింది. ఇది మడతపెట్టినప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కన్పిస్తూ టాబ్లెట్లా మారిపోతుంది. ఈ ఆవిష్కరణలో వర్చువల్ ప్రొజెక్షన్ కీబోర్డు హైలెట్‌గా నిలవనున్నుట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన ప్రొజెక్టర్ ద్వారా వర్చువల్ కీబోర్డు కన్పించనుంది. లెట్స్‌గోడిజిటల్ భాగస్వామ్యంతో పర్వేజ్ ఖాన్ అనే గ్రాఫిక్ డిజైనర్ వివో పేటెంట్‌కు అప్లై చేసిన మోడల్ స్మార్ట్‌ఫోన్ వీడియోను తయారుచేశారు. చదవండి: అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్..! -
షావోమీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఒప్పో,వివో..!
Xiaomi Revenue Fails To Meet Expectations As Competition From Oppo Vivo Intensifies: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి సమీప ప్రత్యర్థి స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన ఒప్పో, వివో భారీ షాక్‌ను ఇచ్చాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒప్పో, వివో కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో కంపెనీ ఆదాయ అంచనాలను చేరుకోవడంలో షావోమీ విఫలమైంది. కంపెనీ క్యూ3 రెవెన్యూలో కేవలం 0.4 శాతం వృద్దిని మాత్రమే నమోదు చేసింది. క్యూ3 రెవెన్యూలో షావోమీ 8.2 శాతం పెరుగుదలను సాధించింది. రిఫీనిటివ్ డేటా ప్రకారం...మూడు నెలల్లో (జూలై -సెప్టెంబర్) దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను షావోమీ జరిపింది. ఈ క్యూ3లో సుమారు రూ. 92,300 కోట్లను షావోమీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వన్-టైమ్ లాభాలు, నష్టాలను మినహాయించి, షావోమీ సుమారు రూ. 6,040 కోట్ల లాభాన్ని ఆర్జించింది. షావోమీ ఆదాయం కేవలం 0.4 శాతం పెరిగి రూ. 55,655 కోట్లకు చేరుకుంది. రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం... చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. హువావేపై అమెరికా ఆంక్షలను విధించడంతో షావోమీ ఈ మేర లాభాలను పొందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీప ప్రత్యర్థులు ఒప్పో, వివో కంపెనీలు క్యూ3లో గడించిన వృద్ధిని షావోమీ పొందలేకపోయింది. చైనాలో షావోమీ షిప్మెంట్లు మూడో త్రైమాసికంలో కేవలం 4 శాతం మేర పెరిగాయని కెనాలిస్ తెలిపింది. చదవండి: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై స్మార్ట్‌ఫోన్ కంపెనీల దండయాత్ర!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 91మొబైల్స్ నివేదిక ప్రకారం.. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని ఒప్పో కంపెనీ యోచిస్తోంది. ఒప్పో ఎలక్ట్రిక్ వేహికల్ గురించి వార్తలు ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఈ నెల ప్రారంభంలో ఒప్పో తన సహ బ్రాండ్లు అయిన రియల్ మీ, వివోతో కలిసి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తులను దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒప్పో నిజంగా భారతదేశంలో ఈవీలను లాంఛ్ చేస్తుందా అనే విషయం గురుంచి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే స్మార్ట్ఫోన్లతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావలనే కంపెనీ విస్తరణ ప్రణాళికలను ఇది తెలియజేస్తుంది. తాజా నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒప్పో ప్రణాళిక పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పని ప్రారంభించిందని, టెస్లాకు బ్యాటరీ అందజేసే తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులతో ఒప్పో కంపెనీ సీఈఓ టోనీ చాన్ సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. (చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!) ఇక తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ షియోమీ కూడా 2024 మొదటి అర్ధభాగంలో తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొని రావాలని యోచించడంతో ఒప్పో కూడా ఆ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి, రాబోయే 10 ఏళ్లలో ఈ వ్యాపారంలో 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని షియోమీ తన ప్రణాళికల గురుంచి ప్రకటించింది. ఇది గత నెలలో తన ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం షియోమీ ఈవీ ఇంక్ పేరునును కూడా నమోదు చేసింది. ఇప్పటికే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికి కలిగి ఉన్న ఒప్పో, రియల్ మీ, షియోమీ వంటి కంపెనీలు ఈవి మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. (చదవండి: ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!) -
ఈ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా, అదిరిపోయే ఫీచర్లతో
దసరా,దివాళీ సేల్స్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో...తాజాగా మరో సిరీస్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుస సిరీస్ విడుదలతో దూకుడు మీదున్న వివో సంస్థ ఇప్పటుడు'వీ23ఈ' పేరుతో మరో సిరీస్‌ను విడుదల చేయనుంది. త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. వివో వీ23ఈ ఫీచర్లు వివో వీ23ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లపై టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హీలియా జీ96 చిప్ సెట్, 4,050ఎంఏహెచ్ బ్యాటరీ, రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 వెర్షన్ బేస్డ్ ఫన్ టచ్ 12తో రన్ అవుతుంది. 6.44-అంగుళాల, 2,400x1,080 పిక్సెట్స్, ఆమోలెడ్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో 64 మెగాపిక్సె మెయిన్ సెన్సార్లతో ట్రిపుల్ రేర్ కెమెరా, కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ 3వ స్నాపర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టిప్‌స్టర్ ప్రకారం..వివో వీ23ఈ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,050mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హ్యాండ్సెట్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆన్‌బోర్డ్ సెన్సార్లు గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, టెలస్కోప్ ఫీచర్లతో పాటు కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయంతో అందుబాటులో రానున్నట్లు లీకైన రిపోర్ట్లలో తెలుస్తోంది. చదవండి: దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు -
బంపర్ ఆఫర్..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!
దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకో శుభవార్త. దివాళీ ఫేస్టివల్ సందర్భంగా ఖరీదైన స్మార్ట్ ఫోన్ కేవలం రూ.101 డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అదిరిపోయే దివాళీ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చవని తెలిపింది. ఇక ఈ ఆఫర్ లో వివో ఎక్స్70 సిరీస్ కు చెందిన వివో వీ21, వివో వై 73, వివో వై33ఎస్ ఫోన్లు ఉన్నాయని వెల్లడించింది. నేటి నుంచి నవంబర్ 7వరకు అన్నీ ఆఫ్‌లైన్ ఛానళ్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. బజాజ్ ఫైనాన్స్‌లో డౌన్ పేమెంట్ కింద రూ.101 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఫోన్ ధరను బట్టి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వివో ఫోన్ ధర రూ. 15,000 కంటే ఎక్కువ ధరను కలిగి ఉండాలి. ఇదే కాదు.. ఇంకా ఆఫర్లు ఉన్నాయ్ వివో ఎక్స్70 సిరీస్ ఫోన్లను సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీబీ కార్డ్‌లతో కొనుగులో చేసిన కస్టమర్లకు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో ఎక్స్ 70 సిరీస్, వీ21 5జీ, వీ 21 ఈ 5జీ స్మార్ట్ఫోన్లపై వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్లు క్రెడిట్ కార్డ్ లేకుండా ఈఎంఐ సదుపాయాన్ని అందించే 'జెస్ట్ మనీ' సంస్థ సాయంతో ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. దీంతో పాటు రిలయన్స్ జియో నుండి రూ. 10,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది. అయితే వివో కస్టమర్లు పొందే జియో ప్రయోజనాల గురించి వివరాల్ని వెల్లడించలేదు. వివో స్మార్ట్‌ఫోన్ ధరలు వివో స్మార్ట్‌ఫోన్ ధరల విషయానికి వస్తే వివో ఎక్స్ 70ప్రో ప్లస్ వేరియంట్ 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వెర్షన్ ధర రూ.79,990కి అందుబాటులో ఉంటుంది. వివో ఎక్స్ 70ప్రో 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.46,990 అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్పేస్ వేరియంట్ ధరరూ 49,990 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.52,990 వివో 21 8జీబీ ప్లస్128జీబీ వేరియంట్ ధర రూ.29,990 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.32,990 వివో వీ21ఈ 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.24,990 వివో వై 73 ధర రూ.17,990 గా ఉంది. చదవండి: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
అదరగొట్టే స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకునే ఫీచర్లు
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరల్లో ఆఫోన్లు లభ్యం కావడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తాజాగా వివో 'వై71టీ' సిరీస్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ముందుగా ఈఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉండగా..త్వరలో భారత్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వివోవై71టీ స్పెసిఫికేషన్స్ వివోవై71టీ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.44అంగుళాల (1,080*2, 2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే, 20.9 యాస్పెట్ రేషియో అండ్ 90.1పర్సెంట్ స్క్రీన్ టూ బాడీ రేషియో,ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810ఎస్ఓఎస్, జీ57జీపీయూ, ఎల్డీఆర్ఆర్4 ర్యామ్‌తో 8జీబీని అందిస్తుంది. వర్చువల్ వర్క్‌తో పాటు మల్టీటాస్క్ వర్క్ కోసం 4జీబీని అదనంగా వినియోగించుకోవచ్చు. ఇక ఫోటోస్, వీడియోస్ కోసం డ్యూయల్ రేర్ కెమెరా సెటప్, ఎఫ్/1.79లెన్స్‌తో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,ఎఫ్/2.2 ఆల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 16మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, ముందు భాగంలో ఎఫ్/2.0లెన్స్ కెమెరా సెన్సార్లు ఉన్నాయి. వివో వై71టీ యూఎఫ్ఎస్ 2.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 256వరకు జీబీ, కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ వివోఎల్టీఈ,వైఫై, బ్లూటూత్ బీ 5.1, జీపీఎస్/ఏ-జీవీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యాంబీనెట్ లైట్, గ్రైస్కోప్, మ్యాగ్నెటోమీటర్,ప్రోక్సిమిటీ సెన్సార్ తో పాటు డిస్ప్లేలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు ఉన్నాయి. వివో వై 71టీ ధర వివో వై 71టీ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.21,000 ఉంది. 8జీబీ ప్లస్ 256జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.23,400 ఉండనుంది. మిరేజ్, మిడ్ నైట్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా మిగిలిన దేశాల్లో ఆఫోన్ ధర ఎంత ఉంటాయనేది వివో ప్రకటన చేయాల్సి ఉంది. చదవండి: Xiaomi: షావోమి దూకుడు, ఫాస్ట్ డేటా షేరింగ్ కోసం.. -
మార్కెట్లో అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్ ఫోన్..ఓ లుక్కేయండి!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో 'వై3ఎస్' పేరుతో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ మిగిలిన బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివో వై3ఎస్ ఫీచర్లు, ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.10వేలు, అంతకాన్న ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల లో వివో వై3ఎస్ నిలిచింది. రూ.9,490 ఉన్న ఈ ఫోన్లో 6.51 అంగుళాల హెచ్డీ 1600*720 పిక్సెల్స్‌తో ఎల్సీడీ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 గ్రో ఎడిషన్ + ఫన్‌టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే, సెల్ఫీ కెమెరాకు వాటర్ డ్రాప్ నాచ్ ఫీచర్ కూడా ఉంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉన్న ఈ ఫోన్ 19 గంటల పాటు ఆన్లైన్ హెచ్డీ మూవీ చూడొచ్చని, 8 గంటలు గేమ్స్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది. వీటితో పాటు ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ 2.0 పోర్ట్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వివో వై3ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లూ, మింట్ గ్రీన్, పెరల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉందని వివో ప్రతినిధులు తెలిపారు. ఒక్కవేరియంట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 2జీబీ ర్యామ్ అండ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, పేటీఎం, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్‌తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
ఈ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచిన వివో...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కీలక నిర్ణయం తీసుకుంది. వివో వై33 మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా పెంచేసింది. వివో వై33 మోడల్‌పై సుమారు రూ. 1000 వరకు పెంచింది. దీంతో వివో వై33 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,990కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మీడియా టెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వివో వై33 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై 33 స్మార్ట్‌ఫోన్ పాత ధర రూ. 17,990 ఉంది. గత నెలలో ఒప్పో ఎ54, ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ ధరలను వెయ్యికిపైగా ఒప్పో కూడా పెంచింది. చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...! వివో వై33 ఫీచర్స్...! 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్-11 8జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 50+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ చదవండి: సై అంటే సై అంటూన్న దిగ్గజ టెక్ కంపెనీలు..! -
మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌సేల్ ముగియగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతుంది.అయితే ఈ సేల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా టెక్ సంస్థలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో బడ్జెట్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. వివో వై20టీ ఫీచర్లు 'వివో వై20టీ' సిరీస్‌లో విడుదలైన ఈ ఫోన్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 6.51 అంగుళాల 720పీ హెచ్డీ క్వాలిటీతో పాటు సెక్యూర్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 చిప్ సెట్, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, ర్యామ్‌ను ఎక్స్టెండ్ చేసుకుందుకు ర్యామ్ 2.0 ఫీచర్, 1జీబీ వర్చువల్ మెమెరీ, గేమ్‌లతో పాటు ఇతర మల్టీ టాస్కింగ్ వర్క్ పర్పస్ కోసం 7జీబీ మెమెరీ అందుబాటులో ఉంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ బొకేహ్ కెమెరా, కెమెరాకు అతి దగ్గరలో (4 సెంటీ మీటర్లు) ఉన్న ఫోటోలు తీసేందుకు సూపర్ మ్యాక్రో కెమెరా, Aura స్క్రీన్ లైట్ అండ్ పోట్రేట్ మోడ్ సాఫ్ట్వేర్ ఫీచర్ మోడ్‌లో 8ఎంపీ సెల్ఫీ షూటర్ సదుపాయం ఉంది. వివో వై20 టీ ధర ఎంతంటే భారత్‌లో విడుదలైన వివో వై20 టీ ఫోన్ ప్యూరిస్ట్ బ్లూ,అబ్సిడియన్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతున్న 6జీబీ/ 128 జీబీ ర్యామ్ స్టోర్ వేరియంట్ ధర రూ.15,490 ఉంది. ఈ ఫోన్ ను బజాజ్ ఫిన్ సర్వ్‌లో 12నెలలు పాటు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. వివో ఈ-స్టోర్‌లో కొనుగోలు దారులకు రూ.500 క్యాష్ బ్యాక్‌తో పాటు అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ స్టోర్లలో 6నెలల పాటు నో కాస్ట్ ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఈ ల్యాప్ ట్యాప్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా.. -
క్వాడ్ కెమెరా సెటప్‌తో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఎక్స్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. వివో ఎక్స్70 , వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ భారత మార్కెట్లోకి ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వివో ఎక్స్70 ప్రో ప్లస్ 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్స్‌తో రానున్నాయి. ఈ మోడళ్లు 128జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లు జీస్ టి సర్టిఫైడ్ కోటింగ్‌తో రానున్నాయి. స్మార్ట్ఫోన్లు రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ వీడియో, ప్యూర్ నైట్ వ్యూ, ప్రో సినిమాటిక్ మోడ్ మరిన్ని కెమెరా ఫీచర్లను అందిస్తున్నాయి. వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ 6.78-అంగుళాల అమ్లోడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 870 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్వాడ్ కెమెరా సెటప్ విత్ మైక్రో గింబల్ స్టెబిలైజేషన్ 50 ఎమ్పీ ప్రైమరీ కెమెరా 8 ఎమ్పీ పెరిస్కోప్ జూమ్ లెన్స్ 12 ఎమ్పీ టెలిఫోటో లెన్స్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ -
గేమింగ్ ప్రియుల కోసం ఐక్యూ నుంచి కొత్త ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనా మార్కెట్లలోకి ఐక్యూ జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 23న లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లలోకి కూడా వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఐక్యూ జెడ్5 భారత్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని జీఎస్ఎమ్ఎరీనా పేర్కొంది. రాబోయే ఐక్యూ జెడ్5 భారత మార్కెట్లలో సుమారు రూ. 30వేల లోపే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఐక్యూ జెడ్5 అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్ ప్రియులకు సౌకర్యవంతంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) ఐక్యూ జెడ్5 ప్రో స్పెసిఫికేషన్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ LPDDR5 ర్యామ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64 ఎంపీ రియర్ కెమెరా ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో , హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్ -
Apple: పడిపోయిన యాపిల్ మార్కెట్! భారమంతా ఐఫోన్ 13 పైనే?
Apple iPhone 13: టెక్ దిగ్గజం యాపిల్‌కి షాక్ తగిలింది. నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ ఫోర్స్ తాజా లెక్కలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. తగ్గిన అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్ ఫోర్స్ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్ పేర్కొంది. నాలుగో స్థానానికి ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో యాపిల్ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసినికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది. ఐఫోన్ 13పైనే భారం యాపిల్ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్ ఐఫోన్ 13ను రిలీజ్ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్ ఆర్బిట్ టెక్నాలజీపై ఐఫోన 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 13కి మరింత క్రేజ్ తెచ్చేందుకు యాపిల్ వాచ్ 7 సిరీస్‌ను సైతం రిలీజ్ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్ 13పైనే ఆ సంస్థ భారం వేసింది. చదవండి: గూగుల్ సెర్చ్‌లో తొలి పదం.. ఆసక్తికరమైన విషయం -
అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై33ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. ధర రూ.17,990 ఉంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్సెల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫన్‌టచ్ ఓఎస్ 11.1, బిల్ట్ ఇన్ బ్లూలైట్ ఫిల్టర్, 8 జీబీ ర్యామ్, 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. చదవండి : ఈ టెక్నాలజీని ఒకేసారి ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా? -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్‌లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్‌ఫోన్‌ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్‌బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ కు పోటీగా దూసుకెళ్తున్న షియోమీ
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు. 2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. -
ఆ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా.. 40కోట్లు దాటిన యూజర్లు
హైదరాబాద్: అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల షిప్‌మెంట్‌పై కేనలిస్ డేటా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా స్మార్ట్ఫోన్ల వినియోగం 12శాతం పెరిగాయి. వాటిలో శాంసంగ్ 19శాతం స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తొలిస్థానాన్ని దక్కించుకుంది. షియోమి17శాతంతో రెండో స్థానంలో ఉండగా.. 14శాతంతో యాపిల్ సైతం మూడో స్థానంలో నిలిచింది. వివో,ఒప్పో స్మార్ట్ఫోన్లు ఐదోస్థానంలో నిలిచింది. తొలి క్వార్టర్లో 10 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 27 శాతం అధికంగా స్మార్ట్ఫోన్లను షిప్మెంట్ చేసినట్టు కేనలిస్ డేటా తెలియజేస్తోంది. గతేడాది కూడా వివో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 50కు పైగా దేశాల్లో వివోకు విక్రయ నెట్వర్క్ ఉండగా.. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారని కేనలిస్ డేటాలో పేర్కొంది. చదవండి: 'పెగసెస్' మీ స్మార్ట్‌ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?! -
5జీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో దూసుకెళ్తున్న వివో
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో 5జీ స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో సత్తా చాటుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో శామ్ సంగ్ తర్వాత ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ బ్రాండ్ గా నిలిచినట్టు పరిశోధన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే వివో అమ్మకాలు 62 శాతం పెరిగి 1.94 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని వివరించింది. 5జీ ప్రమాణాలు, కీలక సాంకేతికత విషయంలో కంపెనీ పురోగతి సాధించిందని వివో తెలిపింది. చైనా యూరప్‌లో వివో సుస్థిర స్థానం సంపాదించింది. ఆపిల్ ఇప్పటికి 5జీ టాప్ బ్రాండ్ గా కొనసాగుతుంది. ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ 29.8 శాతం వాటాను కలిగి ఉంది. తరువాత స్థానంలో ఒప్పో 15.8 శాతం వాటాతో ఉండగా, వివో 14.3 శాతం వాటాను కలిగి ఉన్న మూడవ అతిపెద్ద 5జి బ్రాండ్ గా నిలిచింది. -
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో గింబల్‌ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్‌డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్‌కు తేలికపాటి డ్రోన్‌ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు పేటెంట్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌ను కలిగి ఉంది . ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ .49,990. -
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్‌వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్‌లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్‌కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
జోరుమీదున్న స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్‌తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను నడిపించాయి. స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో.. మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 207 శాతం, వన్‌ప్లస్ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్‌ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్ స్కీమ్స్‌పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్ వేవ్‌తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ చెబుతోంది. కోవిడ్-19, లాక్డౌన్స్ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్-సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. చదవండి: గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా? -
బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ ఫోన్ అదరహో...!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్‌లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్‌ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్‌ను ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్ఐ 11 ఎక్స్‌తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్ఐ 11 ఎక్స్ ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లో లభిస్తుంది. ఐక్యూ 7 ధరలు: (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990 (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990 ఐక్యూ 7 ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఐక్యూ 7 లెజెండ్ ధరలు (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990 ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చదవండి: రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ : సరసమైన ధరలో -
ఏం కోహ్లి.. గాల్వాన్ ఘటన మరిచిపోయావా..?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివోకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న క్రేజ్ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని భావించిన సదరు సంస్థ కోహ్లిని ప్రచాకర్తగా నియమించుకుంది. అయితే ఇండో-చైనా సరిహద్దుల్లో గతకొంత కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోహ్లి చైనా కంపెనీకి ప్రచాకర్తగా వ్యవహరించడమేంటని భారతీయ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. Virat Kohli named brand ambassador of VIVO. Virat Kohli should be shy to promote Chinese products! People trolled Ms dhoni last year I guess. Now the same people will defend Virat Kohli. Complete hypocrites! pic.twitter.com/hfS2EINDjO — Kp (@LoyalCSKfan) April 7, 2021 చైనా కంపెనీ అయిన వివోకు ప్రచారకర్తగా ఉండేందుకు సిగ్గుందా? అని కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాల్వాన్ ఘటన సమయంలో దేశభక్తి చాటిన నువ్వు.. ఏడాది తిరగకుండానే వీర జవాన్ల మరణాలు మరిచిపోయావా? అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో కోహ్లి చేసిన ట్వీట్‌ను అభిమానులు రీట్వీట్ చేసి మరీ నిలదీస్తున్నారు. కాగా, గతేడాది గాల్వాన్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన సైనికలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జవాన్ల మధ్య జరిగిన ముఖాముఖి పోరాటంలో తెలుగువాడైన కల్నల్ సంతోష్‌తో పాటు 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. Patriot Virat Kohli has become a brand ambassador of Vivo pic.twitter.com/dNf5ShoWbJ — Dennis (@DennisCricket_) April 7, 2021 VIVO is back as title sponsor of IPL. Good day to remember this pic.twitter.com/rRI4LvPOEW — Nimo Tai 2.0 (@Cryptic_Miind) April 7, 2021 అయితే, ఇదంతా జరిగి ఏడాది తిరక్కుండానే కోహ్లి చైనా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, బీసీసీఐ తిరిగి వివోను టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్ల కాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గాల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ.. వివోతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకొని, ఐపీఎల్ 2020 సీజన్‌కు డ్రీమ్ 11ను టైటిల్ స్పాన్సర్‌గా నియమించుకుంది. ఇదిలా ఉండగా, కొద్ది గంటల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. చదవండి: ఫేస్ టు ఫేస్ ఫైట్‌లో ముంబైదే పైచేయి -
వన్‌ప్లస్‌కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వన్‌ప్లస్‌కు పోటీగా ఎక్స్60 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో వన్‌ప్లస్‌కు దీటుగా మంచి ఫీచర్లను అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేలు ఇందులో ఉన్నాయి. వివో ఎక్స్60లో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్, ఎంఐ 10 సిరీస్ ఫోన్లతో వివో ఎక్స్60 సిరీస్ పోటీ పడనుంది. వివో ఎక్స్60 స్పెసిఫికేషన్లు: 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,990 వివో ఎక్స్60 ప్రో స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990 వివో ఎక్స్60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా (జీఎన్1 సెన్సార్) 48 ఎంపీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్) 32 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 55 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 11.1 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990 చదవండి: జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ -
వెల్లువెత్తనున్న ప్రకటనలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకటనలు, మార్కెటింగ్ కార్యకలాపాలకు కంపెనీలు 2021-22లో పెద్ద ఎత్తున వ్యయం చేయనున్నాయి. కోవిడ్-19 కారణంగా 2020లో భారత ప్రకటనల పరిశ్రమ విలువ పరంగా 21.5 శాతం తగ్గింది. ప్రస్తుత సంవత్సరంలో 23.2 శాతం వృద్ధితో పరిశ్రమ రూ.80,123 కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మారుతి సుజుకి, అమూల్, ఎల్జీ, పార్లే, పెప్సికో, వివో, మారికో, ఇమామి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్‌కు భారీగా ఖర్చు చేయనున్నాయి. కొన్ని సంస్థలు గతం కంటే 50 శాతం వరకు అధికంగా వెచ్చించనున్నట్టు సమాచారం. ఆదాయంతోపాటు మార్కెట్ వాటాను పెంచుకునే వేటలో కంపెనీలు ఖర్చుకు వెనుకాడడం లేదు. డిమాండ్ నేపథ్యంలో.. కొన్ని నెలలుగా కస్టమర్లు వస్తువులు, ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తుండడం కంపెనీలను ఆకట్టుకుంటోంది. మహమ్మారి మూలంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన వ్యాపారం నుంచి రికవరీకి 2021-22లో చేసే వ్యయాలు దోహదం చేస్తాయని సంస్థలు భావిస్తున్నాయి. వేసవిలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, శీతల పానీయాలు, ఐసీ క్రీమ్స్ వంటి విభాగాలకు డిమాండ్ ఉంటుంది. ఈ విభాగాల్లో వ్యాపారం సాగిస్తున్న కంపెనీలు ఆ మేరకు ప్రకటనలు, మార్కెటింగ్‌పై వ్యయాలను పెంచనున్నాయి. గతేడాది డిజిటల్ ప్రకటనలకు పరిమితమైన ఈ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వేదికలనూ వినియోగించు కోనున్నాయి. ప్రధానంగా ప్రింట్ మీడియా కీలకం కానుందని కాంటినెంటల్ కాఫీ మార్కెటింగ్ హెడ్ ప్రీతమ్ పటా్నయక్ తెలిపారు. ఎఫ్ఎంసీజీ రంగం 15-20 శాతం అధికంగా వ్యయం చేయనుందని అన్నారు. ఖర్చుల్లోనూ పోటీయే.. ప్రకటనలు, మార్కెటింగ్ కోసం చేసే వ్యయాల్లోనూ కంపెనీలు పోటీపడుతున్నట్టు ఉంది. 2021-22లో ఎల్జీ ఏకంగా రూ.650 కోట్లు వ్యయం చేయనుంది. గతంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం అధికం. ఇప్పటి వరకు ఎల్జీ ఇండియా ఈ స్థాయిలో ఖర్చు చేయకపోవడం గమనార్హం. అంచనాలను మించి మార్కెట్ రికవరీ అయిందని, ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. బ్లూ స్టార్ రూ.35 కోట్ల నుంచి రూ.64 కోట్లకు బడ్జెట్ పెంచింది. గతేడాది లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ నుంచి కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయడం ప్రారంభించాయి. దాదాపు 2019-20 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వ్యయాలు చేశాయి. ముందు వరుసలో ఎఫ్ఎంసీజీ.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని కంపెనీలు ప్రకటనలు, మార్కెటింగ్ విషయంలో ముందున్నాయి. ఆ తర్వాత ఈ-కామర్స్, ఆటోమొబైల్, టెలికం, రిటైల్, డ్యూరబుల్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రకటనలు ప్రధానంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో రియల్టీ రంగం ప్రధాన ఆకర్షణ అని బ్రాండింగ్ సేవల్లో ఉన్న జాన్‌రైజ్ క్రియేటివ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. గతంలో లేని విధంగా ఆరోగ్య బీమా, మ్యూచువల్ ఫండ్స్ ప్రకటనలూ వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఇక్కడి మార్కెట్లో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, గుంటూరు వంటి పెద్ద నగరాలు, ఖర్చులకు వెనుకాడని కస్టమర్లు ఉండడమూ కంపెనీలకు కలిసి వస్తోందని వివరించారు. చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం -
వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ గతేడాది మనదేశంలో ఐక్యూ 3 పేరిట ఒక ఫోన్ తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి మనదేశంలో ఐక్యూ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో ఫ్లాగ్షిప్ ఐక్యూ 7 మొబైల్ ని తీసుకొనివచ్చింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఐక్యూ 7ను మార్చి చివరి నాటికి లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ది-బాక్స్ తీసుకురానున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టెర్ దేబయన్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి చివరి నాటికి ఐక్యూ 7 భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. మరో రెండు స్మార్ట్ఫోన్లు ఏప్రిల్ చివరి నాటికి లాంచ్ అవుతాయి. ఐక్యూ 7 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ చైనాలో సిఎన్‌వై 3,798(సుమారు రూ.43,100)కు,12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,198 యువాన్లుకు(సుమారు రూ.47,600) తీసుకొచ్చారు. వన్ ప్లస్ కి పోటీగా ఐక్యూ 7లో క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఐక్యూ 7 ఫీచర్స్(అంచనా) డిస్ప్లే: 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్ బ్యాటరీ: 4,000 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 120వాట్ ర్యామ్: 8జీబీ, 12జీబీ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 13 ఎంపీ + 13 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ కలర్స్: బ్లాక్, లేటెంట్ బ్లూ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2 చదవండి: ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62 -
వివో నుంచి మరో వై-సిరీస్ మొబైల్
మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై31ను నేడు భారతదేశంలో విడుదల చేసింది. వివో వై-సిరీస్‌లో ఇప్పటికే మూడు ఫోన్లు విడుదలయ్యాయి. వివో వై31లో వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 600-సిరీస్ ప్రాసెసర్ ను అందించారు. ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వివో వై31ఎస్ ఇటీవలే చైనాలో 5జీ సపోర్ట్‌తో లాంచ్ అయింది.(చదవండి: వివో వై31 ఫీచర్స్: వివో వై31 ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఇది 6.58-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపిఎస్ డిస్ప్లేతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ 2-మెగాపిక్సెల్ యూనిట్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 మీద పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశంలో వివో వై31 ధర రూ.16,490గా నిర్ణయించబడింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల నుండి మీరు ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది రేసింగ్ బ్లాక్, ఓషన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. -
సూపర్ ఫీచర్లు, తక్కువ ధర : వివో కొత్త ఫోన్
సాక్షి,ముంబై : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12ఎస్ ను భారత్‌లో లాంచ్ చేసింది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్ లాంటి ఫీచర్లతో వచ్చిన బడ్జెట్ ఫోన్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వివో వై 12 ఎస్ ధర, లభ్యత సింగిల్ వేరియంట్లో వివోవై12 ఎస్ లభ్యం. 3 జీబీ+ 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 9,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, దేశంలోని ఇతర భాగస్వామి రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో వై 12ఎస్ స్పెసిఫికేషన్లు 6.51అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 సాక్ 13+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎక్స్ 60 ప్రోను లాంచ్ చేసిన వివో
చైనా: వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో ధరలు, ఫీచర్స్, అమ్మకపు తేదీలను అధికారికంగా సంస్థ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో రాబోయే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ జనవరిలో లాంచ్ కానుంది. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో రెండూ శామ్సంగ్ ఎక్సినోస్ 1080 5జీ ప్రాసెసర్ తో రానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ఫోన్లు ఇవి. వివో ఎక్స్ 60, ఎక్స్ 60 ప్రో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్‌హెచ్‌డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉన్నాయి. అయితే భారతదేశంలో వీటిని ఎప్పుడు తీసుకొస్తారో అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వివో ఎక్స్ 60 ప్రో ఫీచర్స్: వివో ఎక్స్ 60 ప్రో 6.56-అంగుళాల అమోలేడ్ డిస్ప్లేతో ఎఫ్‌హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ మొబైల్ 5నానోమీటర్ తయారు చేయబడిన ఎక్సినోస్ 1080 ప్రాసెసర్ తో పని చేయనుంది. ఇది 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ సరికొత్త ఆరిజిన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేసే 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 48 ఎంపీ(ఎఫ్/1.48) సోనీ ఐఎమ్ఎక్స్ 598 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 13 ఎంపీ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్, 13ఎంపీ లెన్స్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఇది సెకండ్-జెన్ మైక్రో-గింబాల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ టెక్నాలజీతో వస్తుంది. వివో ఎక్స్ 60 ప్రోలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32ఎంపీ కెమెరా ఉంది. ఇందులో భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ పరంగా వివో 60 ప్రోలో డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. వివో ఎక్స్ 60 ప్రో 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 4,498 (సుమారు రూ.50,500)కి లభిస్తుంది. ఈ మొబైల్ బ్లూ, బ్లాక్ రంగులలో లభిస్తుంది. వివో ఎక్స్ 60 ఫీచర్స్: వివో ఎక్స్ 60 ఫీచర్స్ ప్రో మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఎక్సినోస్ 1080 ప్రాసెసర్, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఓఎస్. వివో ఎక్స్ 60 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. చైనాలో వివో ఎక్స్ 60 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సీఎన్‌వై 3,498 (సుమారు రూ.39,400), 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,798(సుమారు రూ.42,700), 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,998(సుమారు రూ.45,000)కి లభిస్తుంది. -
వివో నుండి మరో బడ్జెట్ మొబైల్
చైనా: వివో చైనాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై30 స్టాండర్డ్ ఎడిషన్ అని పిలువబడే ఈ మొబైల్ జూలైలో భారతదేశంలో లాంచ్ అయిన వివో వై30 యొక్క డౌన్‌గ్రేడ్ వెర్షన్ అని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాలో వివో వై 30 ధర 1,398యువాన్లు(సుమారు రూ.15,700)గా నిర్ణయించబడింది.(చదవండి: పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్) వివో వై 30 ఫీచర్స్: వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ పై నడుస్తుంది. ఇందులో పవర్‌వీఆర్ జీఇ8320 జీపీయును తీసుకొచ్చింది. దీనిలో 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ మొబైల్ లో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రెగ్యులర్ వివో వై 30 మాదిరిగానే వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి ప్యానల్‌తో వస్తుంది. ఇది 720 x 1600 రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో వివో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. వివో వై 30 స్టాండర్డ్ ఎడిషన్ లో 13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8మెగాపిక్సల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, యుఎస్బి ఒటిజి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అందిస్తుంది. -
వివో సబ్ బ్రాండ్ కొత్త 5జీ మొబైల్
వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఐక్యూ యు 3ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల స్క్రీన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐక్యూ యు 3 5జీ మొబైల్ చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం డిసెంబర్ 18 నుండి సేల్ లో ఉంచింది. ఐక్యూ యు 3 గ్లో కలర్, టూ ఎర్లీ బ్లాక్ లభిస్తుంది. ఈ బ్రాండ్ చైనాలో వివోలో భాగంగా పనిచేస్తుంది, కానీ దేశంలో చైనా బ్రాండ్ల పట్ల పెరుగుతున్న ఆగ్రహం కారణంగా దీనిని స్వతంత్ర బ్రాండ్‌గా తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా సమాచారం లేదు. ఐక్యూ యు 3 ఫీచర్స్: ఐక్యూ యు3 మొబైల్ 6.58-అంగుళాల ఎల్సిడి స్క్రీన్‌ను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5 జి చిప్సెట్ ద్వారా 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఐక్యూ యు 3లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాతో ఎఫ్/1.79 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ /2.4 ఎపర్చరుతో ఉంటుంది. ఇది 4కేలో వీడియోలను రికార్డ్ చేయగలదు, 10x డిజిటల్ జూమ్ కలిగి ఉంటుంది. ఐక్యూ యు 3లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఐక్యూ యు 3 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికివస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు 1,498 యువాన్లు(సుమారు రూ.16,800), 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు సిఎన్‌వై 1,698 యువాన్లు(సుమారు రూ.19,000) ధరను నిర్ణయించారు. -
త్వరలో జియో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్స్
జియో ఈ నెలలో చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. తన 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను స్మార్ట్ఫోన్లకు తరలించే ప్రయత్నంలో భాగంగా రిలయన్స్ జియో చైనా ఫోన్ తయారీ సంస్థ వివోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ వివో వై-సిరీస్‌లో రానుందని ధర రూ.8 వేల రేంజ్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్కౌంట్లు, ఒటిటి సబ్ స్క్రిప్షన్, వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి ఆఫర్లతో జియో త్వరలో 'ఎక్స్‌క్లూజివ్' స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి జియో యోచిస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం లేనప్పటికీ, ఒక నివేదిక ప్రకారం జియో వీటిని తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో కేవలం రిలయన్స్ జియో సిమ్ కార్డు మాత్రమే పనిచేసే విధంగా రూపకల్పన చేస్తుంది.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) రిలయన్స్ జియో వివోతో పాటు కార్బన్, లావా మరియు ఇతర చైనా బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వివో ఈ మధ్యే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.7,990గా నిర్ణయించారు. అలాగే జియో టెక్ దిగ్గజం గూగుల్‌తో పొత్తు పెట్టుకుని తక్కువ ధర గల 4జీ ఫోన్లను వచ్చే ఏడాది తీసుకురావాలని జియో యోచిస్తోంది. రిలయన్స్ జియో 3000 నుంచి 4000 మధ్య తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ఇంతక ముందు ఐటెల్ కంపెనీతో కలిసి పనిచేసింది. జియో ప్రధాన ప్రత్యర్థి అయిన భారతి ఎయిర్టెల్ కూడా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా లావా, కార్బన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎయిర్ టెల్ ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్ -
డిసెంబర్ 2న వివో వీ20 ప్రో లాంచ్..
వివో వీ20 ప్రో 5జీ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది గతంలో థాయ్ ల్యాండ్‌లో విడుదలైన ఫోన్ మాదిరిగానే ఉండనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ని సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వివో వీ20 ప్రో అమెజాన్ మరియు దేశవ్యాప్తంగా ఇతర రిటైల్ కేంద్రాలలో అందుబాటులో ఉండనుంది. (చదవండి: నోకియా 9.3 ప్యూర్‌వ్యూ మళ్లీ వాయిదా) వివో వీ20 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11పై పని చేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇందులో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో వీ20 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 44 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ పై వివో వీ20 ప్రో పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్లో అందించారు. వివో వీ20 ప్రో 5జీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బరువు 170 గ్రాములుగానూ ఉంది. వివో వీ20 ప్రో 5జీ ని భారతదేశంలో 29,990 ధరకే తీసుకురానున్నట్టు సమాచారం. మూన్ లైట్ సొనాటా, మిడ్ నైట్ జాజ్, సన్ సెట్ మెలోడీ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. -
వివో వై1ఎస్ వచ్చేసింది
వివో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం వివో వై1ఎస్ రూపంలో మొబైల్ ని తీసుకొచ్చింది. సాదారణంగా సోషల్ మీడియా ద్వారా ఫోన్‌ను ప్రకటించే బదులు, ఈ సారి తన వెబ్సైట్ ద్వారా ఫోన్‌ను తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.(చదవండి: పడిపోయిన మొబైల్ అమ్మకాలు) వివో వై1ఎస్ స్పెసిఫికేషన్స్ వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం దీని 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా పేర్కొన్నారు. -
పడిపోయిన మొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి. వచ్చే డిసెంబరు నెలలో మరింత తగ్గుతాయి అని తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. (చదవండి: బడ్జెట్ లో రెడ్మీ నోట్ 9 5జీ మొబైల్స్) "పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్‌మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. -
వివో నుండి మరో బడ్జెట్ ఫోన్
మొబైల్ ప్రపంచంలో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివో తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో మరో మొబైల్ ని తీసుకువచ్చింది. "వివో వై12ఎస్" పేరుతో హాంకాంగ్ మరియు వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించింది. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వి 10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఫాంటం బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభించనున్నాయి. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు 270 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా, అలాగే ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భారతదేశంలో వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ .11,999గా ఉండనుంది. -
దివాలీ ఆఫర్ : 101 రూపాయలకే స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్, వీ 20, ఎక్స్ 50 సీరిస్ స్మార్ట్ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో తాజాగా ట్వీట్ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి మీ రెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. Light up a new delight with great Diwali offers. Get your hands on the most loved vivo phones by paying just ₹101 and enjoy additional benefits. Click on the link to find the nearest vivo store: https://t.co/GYFTgNDbnQ pic.twitter.com/zzTwxLPhqv — Vivo India (@Vivo_India) November 6, 2020 -
5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూడా వివో కూడా 5 జీ సిరీస్ లో వివో ఎక్స్ 50 , వివో ఎక్స్ 50 ప్రో ఫోన్లతో విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ 50 ఈ 5 జీ తైవాన్‌లో విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్, 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో దీన్ని తీసుకొచ్చింది. వివో ఎక్స్ 50ఈ 5 జీ ధర సుమారు రూ .35600 వివో ఎక్స్ 50ఈ 5జీ ఫీచర్లు 6.44 అంగుళాలు అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ సాక్ చే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+13+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ
న్యూఢిల్లీ: చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. గత బోర్డు పాలకులు, మేటి ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారు. అప్పుడపుడు ఎదురయ్యే సమస్యల్ని బలమైన బోర్డు ఎప్పట్లాగే అధిగమిస్తుంది. (ఆర్సీబీతోనే నా ప్రయాణం) గొప్ప ఘనతలు, విశేషాలు ఇవన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవు. అలాగే ఒక్కరాత్రితోనూ కూలిపోవు. కొన్ని నిర్ణయాలు లాభాలు తెస్తే మరికొన్ని నష్టాలు తేవొచ్చు. దేన్నయినా ఎదుర్కోవాలి. ధైర్యంగా సాగాలి’ అని అన్నాడు. చైనీస్ మొబైల్ బ్రాండ్ 2018– 2022 కాలానికి గానూ రూ. 2199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో భారత్‌లో చైనా ఉత్పాదనలన్నీ నిషేధించాలనే ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘వివో’ ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ స్పాన్సర్ వేటలో పడింది. అంతేకాకుండా 2021లో జరిగే పురుషుల టి20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ చేజిక్కించుకోవడం తనకేం ఆశ్చర్యాన్ని కలిగించలేదని గంగూలీ అన్నాడు. ‘షెడ్యూల్ ప్రకారం 2021లో టి20, 2023లో వన్డే ప్రపంచ కప్‌లు భారత్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది’ అని గంగూలీ పేర్కొన్నాడు. 2022 టి20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.(సూపర్ కింగ్స్ ట్రైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్) -
ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)టైటిల్ స్పాన్సర్‌గా ఉండలేమన్న వివో అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మన్నించింది. గురువారం వివోతో కటీఫ్‌కు భారంగానే ఓకే చెబుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో వివోను బీసీసీఐ కొనసాగించడం పెద్ద దుమారం లేచింది. అటు రాజకీయ విమర్శలతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం బీసీసీఐ తీరును ఎండగడుతూ పోస్టులు పెట్టారు. దాంతో వివోనే సొంతంగా తప్పుకోవడానికి నిర్ణయించుకుంది. ఇదే ప్రతిపాదనను బీసీసీఐ ముందుంచగా దానికి ఎట్టకేలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త టైటిల్ స్పాన్సర్ వేటలో పడింది బీసీసీఐ. ఐపీఎల్ నిర్వహణకు ఇంకో నెల మాత్రమే సమయం ఉండటంతో టైటిల్ స్పాన్సర్‌ను ఎంపిక చేసుకోవడం బీసీసీఐకి సవాల్‌గా మారింది. వచ్చే నెల 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో టైటిల్ స్పాన్సర్ కోసం వెతుకులాట ఆరంభించాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఎవరు ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టైటిల్ స్పాన్సర్ కోసం ఎవరైనా వచ్చినా తక్కువ మొత్తంలోనే దానికి డీల్ కుదుర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. (కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్ కెప్టెన్) 2008లో ఐపీఎల్ మొదలైన తర్వాత ముందుగా డీఎల్ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్ ఫిక్సింగ్ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్షిప్ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తి కాగా, మూడో ఏడాదే సమస్యలు తలెత్తాయి. చైనాతో విభేదాల కారణంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై భారత్ దృష్టి పెట్టిన నేపథ్యంలో వివో అందులో చేరింది. ఈ క్రమంలోనే విమర్శల దాటిని తట్టుకోలేక వివో స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మొగ్గుచూపింది. దీనిపై బీసీసీఐ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపిన పిదప చేసేది లేక అంగీకారం తెలిపారు. ఇప్పటికే టీమిండియా కిట్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లు ఆహ్వానించిన బీసీసీఐ.. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం వేట ప్రారంభించాల్సి ఉంది. దీనికి బిడ్లు వేస్తారా లేక ఏ సంస్థకైనా తమ ఇష్టప్రకారం టైటిల్ స్పాన్సర్ హక్కులు ఇస్తారా అనేది చూడాలి. ఇది ఈ ఏడాదికే అని చెబుతున్నా రాబోవు సీజన్లో కూడా వివోతో బీసీసీఐ ఎంతవరకూ జోడి కడుతుందా అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఇరు దేశాల మధ్య ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి తొందరగా ముగింపు దొరుకుతుందనుకుంటే పొరపాటు. చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం చూస్తున్న సమయంలో వివోతో మళ్లీ ఒప్పందం అనేది ఉంటుందా అనేది క్రికెట్ అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ వివోతో ఒప్పందం ఓవరాల్‌గా రద్దయితే మాత్రం బీసీసీఐ భారీ మొత్తంలోనే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌కు వెళుతున్న బీసీసీఐ.. ఎంతకొంతా ఉపశమనం పొందినా పూర్తిస్థాయి లాభాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూడలేదు. ఇటువంటి తరుణంలో వివో తప్పుకోవడం బీసీసీఐకి మరో దెబ్బ. అయినప్పటికీ ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న బీసీసీఐకి ఈ నష్టం నుంచి బయటపడటానికి కూడా ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇదిలా ఉంచితే, అనేక సమస్యల మధ్య ఐపీఎల్‌కు వెళుతున్న బీసీసీఐ.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ఎంతవరకూ సక్సెస్ ముగిస్తుందనే విషయంలో కూడా ఆసక్తి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. ఐపీఎల్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే అందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. బయో సెక్యూర్ విధానంలో ఐపీఎల్‌ను సమర్థవంతంగా నిర్వహించడం అనేది ఇప్పుడు బీసీసీఐ ముందున్న చాలెంజ్. -
ఐపీఎల్ నుంచి వివో తప్పుకుంది!
న్యూఢిల్లీ: భారత్-చైనా వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లపై భారత్ నిషేధం విధించుకుంటూ పోతుంటే, చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వివోను ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగించడానికి బీసీసీఐ మొగ్గుచూపడంతో ఇప్పటివరకూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో బీసీసీఐ వ్యహరిస్తున్న తీరును వేలెత్తి చూపుతూ రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో విమర్శల జోరు అందుకోవడంతో వాటికి ముగింపు పలకడానికి వివో సిద్ధమైంది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగానే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. (‘కిట్’ స్పాన్సర్ వేటలో...) అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అంగీకరించనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల భారతదేశం – చైనా సరిహద్దు లలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వివిధ రంగాల నుండి చైనా వస్తువులను బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్‌లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగడం మంచిది కాదని భావించిన వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి విరమించుకోవడానికి సన్నద్ధమైంది. (వద్దు సార్.. జట్టును నాశనం చేస్తాడు!) అయితే కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే తప్పుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ సంబంధించి వివో హక్కులను ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ. 2199 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వివో ప్రతి సంవత్సరం జరిగే లీగ్ లో రూ. 440 కోట్లు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే తాజాగా జరిగిన ఐపిఎల్ సమావేశంలో చర్చల తర్వాత వివో కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతుందని బీసీసీఐ తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐపీఎల్ ను బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ పిలుపు ఇచ్చింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివో సంస్థ స్పాన్సర్ షిప్ తప్పుకోవడమే మంచిదని నిర్ణయించింది. అది కూడా ఈ ఏడాది సీజన్ ఐపీఎల్‌కు దూరంగా ఉండబోతున్నట్లు బీసీసీఐకి తెలిపింది. దీనిపై బీసీసీఐ-వివోల మధ్య చర్చలు నడుస్తున్నాయి. (ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్) -
భారత్‌లో వివో డిజైన్ సెంటర్
న్యూఢిల్లీ: స్థానికంగా డివైజ్‌లను అభివృద్ధి చేసే క్రమంలో చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత్‌లో పారిశ్రామిక డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను 50,000కు పెంచుకోనుంది. వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ విభాగం) నిపుణ్ మార్యా ఈ విషయాలు తెలిపారు. 3.3 కోట్లు యూనిట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే దిశగా భారత్‌లో రూ. 7,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కంపెనీ ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన వివరించారు. ‘భారత్‌లో తయారు చేయడం మాత్రమే కాదు డిజైన్ కూడా ఇక్కడే చేస్తాం. ఇందుకోసం త్వరలో పారిశ్రామిక డిజైన్ కేంద్రం భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం. భారతీయ వినియోగదారుల అవసరాలపై ఈ సెంటర్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. భారత్‌లోనే డిజైన్ చేసి, తయారు చేసిన తొలి ఉత్పత్తి 2020–21లోనే మార్కెట్లోకి వస్తుంది‘ అని మార్యా తెలిపారు. ఎక్స్50 సిరీస్ ఫోను..: ప్రీమియం సెగ్మెంట్‌కి సంబంధించి ఎక్స్50 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను వివో గురువారం వర్చువల్‌గా ఆవిష్కరించింది. వీటి ధర రూ. 34,990, రూ. 37,990గా ఉంటుంది. మరింత మెరుగైన ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా తదితర స్పెసిఫికేషన్స్ గల ఎక్స్50 ప్రో ధర రూ. 49,990గా ఉంటుందని మార్య చెప్పారు.