వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఐక్యూ యు 3ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.58-అంగుళాల స్క్రీన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐక్యూ యు 3 5జీ మొబైల్ చైనాలో ప్రీ-ఆర్డర్ల కోసం డిసెంబర్ 18 నుండి సేల్ లో ఉంచింది. ఐక్యూ యు 3 గ్లో కలర్, టూ ఎర్లీ బ్లాక్ లభిస్తుంది. ఈ బ్రాండ్ చైనాలో వివోలో భాగంగా పనిచేస్తుంది, కానీ దేశంలో చైనా బ్రాండ్ల పట్ల పెరుగుతున్న ఆగ్రహం కారణంగా దీనిని స్వతంత్ర బ్రాండ్‌గా తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా సమాచారం లేదు.
ఐక్యూ యు 3 ఫీచర్స్:
ఐక్యూ యు3 మొబైల్ 6.58-అంగుళాల ఎల్‌సిడి స్క్రీన్‌ను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు 5 జి చిప్‌సెట్ ద్వారా 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఐక్యూ యు 3లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాతో ఎఫ్/1.79 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఎఫ్ /2.4 ఎపర్చరుతో ఉంటుంది. ఇది 4కేలో వీడియోలను రికార్డ్ చేయగలదు, 10x డిజిటల్ జూమ్ కలిగి ఉంటుంది. ఐక్యూ యు 3లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఐక్యూ యు 3 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికివస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు 1,498 యువాన్లు(సుమారు రూ.16,800), 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు సిఎన్‌వై 1,698 యువాన్లు(సుమారు రూ.19,000) ధరను నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment