వన్‌ప్లస్‌కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల | Vivo X60 series With Snapdragon SoCs Launched in India | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌కు పోటీగా వివో ఎక్స్60 సిరీస్ ఫోన్లు విడుదల

Published Thu, Mar 25 2021 9:46 PM | Last Updated on Thu, Mar 25 2021 9:46 PM

Vivo X60 series With Snapdragon SoCs Launched in India - Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో వన్‌ప్లస్‌కు పోటీగా ఎక్స్60 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో ఎక్స్60, ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో వన్‌ప్లస్‌కు 
దీటుగా మంచి ఫీచర్లను అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేలు ఇందులో ఉన్నాయి. వివో ఎక్స్60లో ఎక్కువ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఎక్స్60 ప్రో, ఎక్స్60 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ 9 సిరీస్, ఎంఐ 10 సిరీస్ ఫోన్లతో వివో ఎక్స్60 సిరీస్ పోటీ పడనుంది.

వివో ఎక్స్60 స్పెసిఫికేషన్లు:

  • 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌
  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 
  • 8 జీబీ, 12 జీబీ ర్యామ్
  • 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్)
  • 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
  • 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా
  • బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 11.1   
  • 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,990
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,990

వివో ఎక్స్60 ప్రో స్పెసిఫికేషన్లు

  • 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌
  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 
  • 48 ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్)
  • 13 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
  • 13 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా
  • బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 11.1  
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,990

వివో ఎక్స్60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు

  • 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే 
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌
  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ 
  • 50 ఎంపీ మెయిన్ కెమెరా (జీఎన్1 సెన్సార్)
  • 48 ఎంపీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్)
  • 32 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
  • 8 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరా
  • బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ 
  • 55 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 11.1  
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,990

చదవండి:

జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement