వివో వీ20 ప్రో 5జీ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది గతంలో థాయ్ ల్యాండ్‌లో విడుదలైన ఫోన్ మాదిరిగానే ఉండనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ని సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వివో వీ20 ప్రో అమెజాన్ మరియు దేశవ్యాప్తంగా ఇతర రిటైల్ కేంద్రాలలో అందుబాటులో ఉండనుంది. (చదవండి: నోకియా 9.3 ప్యూర్‌వ్యూ మళ్లీ వాయిదా)
వివో వీ20 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11పై పని చేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇందులో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో వీ20 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 44 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది.
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ పై వివో వీ20 ప్రో పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. వివో వీ20 ప్రో 5జీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బరువు 170 గ్రాములుగానూ ఉంది. వివో వీ20 ప్రో 5జీ ని భారతదేశంలో 29,990 ధరకే తీసుకురానున్నట్టు సమాచారం. మూన్ లైట్ సొనాటా, మిడ్ నైట్ జాజ్, సన్ సెట్ మెలోడీ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment