Snapdragon
-
ఐకూ నుంచి స్నాప్‌డ్రాగన్ 8 ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్‌ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్‌ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది. ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్‌చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. -
అదిరిపోయే ప్రాసెసర్‌తో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్..!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తన ప్రీమియం ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను నేడు(ఫిబ్రవరి 24) మన దేశంలో విడుదల చేసింది. ఈ కొత్త మోటరోలా ఫోన్ గత ఏడాది తీసుకొచ్చిన మోటరోలా ఎడ్జ్ 20ప్రోకు కొనసాగింపుగా తీసుకొని వచ్చారు. ఈ మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్144హెర్ట్జ్ పివోఎల్ఈడి డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్'కి కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 11లో వీడియో కాన్ఫరెన్స్ కోసం దీనిని వెబ్ క్యామ్'గా వాడుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 30ప్రో అసుస్ రోగ్ ఫోన్ 5, వివో ఎక్స్70 ప్రో, ఐక్యూ 9 సిరీస్ వంటి వాటికి పోటీనిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ధర: మోటరోలా ఎడ్జ్ 30 ప్రో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.49,999 ధరకు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఫ్లిప్ కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మోటరోలా ఎడ్జ్ 30 ప్రోపై రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా జియో వినియోగదారులకు రూ.10,000 విలువైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ఫీచర్స్: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ OLED డిస్ప్లే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. మూడు బ్యాక్(50 ఎంపీ + 50 ఎంపీ + 2 ఎంపీ) కెమెరాలు ఉన్నాయి. ఇందులో 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఎడ్జ్ 30 ప్రోలో 4,800 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 68 డబ్ల్యు టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్'కి సపోర్ట్ చేస్తుంది. (చదవండి: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!) -
మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ మోడల్లను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఐక్యూ 8ప్రో మొబైల్ భారత మార్కెట్లో ఐక్యూ 8 లెజెండ్‌గా రానుంది. ఈ రెండు ఫోన్లను ఆగస్టులో చైనాలో లాంఛ్ చేశారు. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రముఖ మోటార్‌స్పోర్ట్ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఈ నెల చివరలో లేదా వచ్చే నెల ప్రారంభంలో మన ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐక్యూ 8, ఐక్యూ 8 లెజెండ్ ఫోన్స్ ఇండియా ధర తెలియదు. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ల చైనా మార్కెట్ ధరనే కలిగి ఉండే అవకాశం ఉంది. చైనాలో ఐక్యూ 8 ధర సీఎన్ వై 3,799(సుమారు రూ.43,600)గా ఉంటే, ఐక్యూ 8 లెజెండ్ ధర సీఎన్ వై 4,999(సుమారు రూ.57,300)గా ఉంది. (చదవండి: జియోను వెనక్కినెట్టిన వోడాఫోన్ ఐడియా...!) ఐక్యూ 8 ఫీచర్లు(అంచనా) 6.56 అంగుళాల స్క్రీన్ 1080x2,376 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48 + 13+ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4,350 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ ఐక్యూ 8 లెజెండ్ ఫీచర్లు(అంచనా) 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 50 + 48 + 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 120 డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
బడ్జెట్లో మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఆవిష్కరించిన తన జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐక్యూ జెడ్5 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేసి వస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. (చదవండి: పది సెకండ్ల యాడ్‌కు 18 లక్షలే....!) ఐక్యూ జడ్5 ధర భారతదేశంలో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఐక్యూ జడ్5 రూ.23,990కి లభిస్తే, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.26,990 ఉంది. ఇది ఆర్కిటిక్ డాన్, మిస్టిక్ స్పేస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో(iQoo.com, Amazon.in) అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్ కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్/క్రెడిట్, ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. ఐక్యూ జెడ్5 స్పెసిఫికేషన్లు 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD డిస్ ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ 8 జీబీ/12 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.23,990 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.26,990 -
ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్
రియల్మీ తన జీటీ నియోను 2 సెప్టెంబర్ 22న చైనాలో విడుదలకు చేయడానికి సిద్దం అవుతుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇప్పటికే లాంఛ్ కు ముందు కొన్ని స్పెసిఫికేషన్లను బయటకు విడుదల చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. రియల్మీ జీటీ నియో 2లో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తీసుకొనివస్తున్నారు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ శామ్ సంగ్ ద్వారా ఈ4 అమోల్డ్ ప్యానెల్ తో రానుంది. దీనిలో 120హెర్ట్జ్ రిఫ్రెష్ గల డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ 6.62 అంగుళాల డిస్ ప్లే ఎఫ్ హెచ్ డీ+ రిజల్యూషన్ తో కలిగి ఉండనుంది. దీనిలో 65డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. జీటీ నియో 2, 64 ఎంపి సెన్సార్ గల ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుందని రియల్ మీ ధృవీకరించింది. ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ ర్యామ్ ఆప్షన్లతో కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే విషయంపై ఇంకా సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. (చదవండి: బ్లాక్‌బస్టర్ డీల్స్‌తో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్) -
వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో 9 ఆర్టీ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్‌ప్లస్ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్‌ప్లస్ 9 ఆర్టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్‌వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం) వన్‌ప్లస్ 9 ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల శామ్ సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 766 సెన్సార్ ట్రిపుల్ సెటప్ కెమెరా 65డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
ఇక మొబైల్ ఫోన్లలో అదిరిపోయే గ్రాఫిక్స్!
ప్రముఖ చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ తర్వాత తరం రాబోయే చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ కోసం పనిచేస్తోంది. అలాగే, ఈ కంపెనీతో పాటు శామ్సంగ్ కూడా తర్వాతి తరం ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ కోసం పనిచేస్తున్నాయి. ఈ రెండూ కంపెనీలు కూడా ప్రధానంగా మొబైల్ గేమర్లను లక్ష్యంగా పెట్టుకొని వస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఉన్న ఎఎమ్ డి ఆర్డీఎన్ఎ జీపీయు గ్రాఫిక్స్ వల్ల గేమర్స్ కి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. లెనోవో చైనా ఫోన్ బిజినెస్ మేనేజర్ చెన్ జిన్ వీబోలో పోస్ట్ చేసిన ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 895 చిప్సెట్ అప్ గ్రేడ్ జీపీయుతో రానుంది. లెనోవో కంపెనీ నుంచి రాబోయే ఫ్లాగ్ షిప్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లెజియన్ 3 ప్రోను టీజ్ చేసినప్పుడు అతను ఈ సమాచారాన్ని వెల్లడించాడు. స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఎస్ఎమ్ 8450 అని కోడ్ నేమ్ కలిగి ఉంది. ఈ ఏడాది చివరిలో హవాయిలో క్వాల్కామ్ వార్షిక సమావేశంలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న లీక్స్ ప్రకారం, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్, ఎక్స్65 5జీ మోడెంను 4 ఎన్ఎమ్ మీద నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 5 ఎన్ఎమ్ మీద తయారు చేశారు. స్నాప్‌డ్రాగన్ 895 గల ఫోన్లు ఎంఎంవేవ్/సబ్-5 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ గల 5జీ నెట్ వర్క్ లను కనెక్ట్ చేస్తాయి. ప్రస్తుతం, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ తో పోటీ పడటానికి సిద్దం అవుతుంది.(చదవండి: మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు) గేమ్ ఛేంజర్ ఎక్సినోస్ 2200 చిప్సెట్ కొన్ని బెంచ్ మార్క్ లలో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్ ను అధిగమించినట్లు సమాచారం. ముఖ్యంగా, మాన్హాటన్(Manhattan) 3.0 1080పీ అని పిలిచే ఒక బెంచ్ మార్క్ లో ఎక్సినోస్ 2200 చిప్సెట్ సెకనుకు 170.7 ఫ్రేమ్ లను నమోదు చేసింది. ఇది ఏ14 బయోనిక్, స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ లు నమోదు చేసిన 120 ఫ్రేమ్స్ కంటే చాలా ఎక్కువ. 2022లో స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ గల శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లను మనం చూసే అవకాశం ఉంది. షియోమీ, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 895 ప్రాసెసర్ ఉపయోగించవచ్చు. ఇక అప్పటి మార్కెట్ ని బట్టి శామ్సంగ్ స్నాప్‌డ్రాగన్ 895, ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు.. శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను యుఎస్ వంటి మార్కెట్లలో తీసుకొస్తే, ఇతర మార్కెట్లలో ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్‌ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్‌ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్‌ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్‌కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్‌లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్‌ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్‌ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు
ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలలో ఒకటైన షియోమీకి చెందిన ఎంఐ 11 మొబైల్ ఇంకా అన్నీ దేశాలలో విడుదల అయ్యిందో కాలేదో గాని అప్పుడే తదుపరి తరం మొబైల్ ఎంఐ 12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఈ పుకార్ల ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. మన మానవుడి కంటి సామర్థ్యమే 576 మెగాపిక్సల్ అలాంటిది ఎంఐ 12 మొబైల్ లో 200 మెగాపిక్సల్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. పుకార్ల ప్రకారం అయితే ఈ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలో తీసుకొచ్చిన ఎంఐ 11లో ఫ్లాగ్ షిప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మొదటిసారి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా షియోమీ(ఎంఐ 11) కంపెనీకి చెందినదే. తర్వాత రాబోయే ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో తదుపరి క్వాల్ కామ్ నుంచి రాబోయే ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చైనీస్ టిప్ స్టార్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. షియోమీ కొత్తగా తీసుకొని రాబోయే ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్8450 అనే పేరుతో పిలిచే ప్రాసెసర్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఆ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 895 లేక కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అని విషయం పూర్తిగా తెలియదు. 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నిక్ స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అనే ప్రాసెసర్, 888 ప్రాసెసర్ కంటే చాలా శక్తివంతమైనది. ఎంఐ 12లో శామ్ సంగ్, ఒలంపస్ నుంచి రాబోయే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ పుకార్ల ప్రకారం 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నిక్ ద్వారా 200-మెగాపిక్సెల్ కెమెరా అవుట్ పుట రానుంది. అంటే 12 మెగాపిక్సల్ సామర్ధ్యమే(12*16 =192 మెగాపిక్సల్). ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ లో ఒలంపస్ లోగో కూడా ఉండవచ్చు. ఇది అడ్రినో 730 జీపీయు, క్వాడ్-ఛానల్ ఎల్ పీడీడీఆర్5 ర్యామ్ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తుంది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం -
పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్మీ తన జీటీ 5జీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్మీ బుక్ ల్యాప్‌టాప్, రియల్మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో రియల్మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను చైనా సీఎన్‌వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,299 (రూ. 37,800). రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు: 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్) 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
అదిరిపోయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్
వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్‌ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్ సీఈ 5జీ' స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. వన్‌ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్‌ప్లస్ ఎదురు చూశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999 చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తీసుకొని రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ జూన్ 10న తన సమ్మర్ లాంచ్ ఈవెంట్లో కొత్త వన్‌ప్లస్ టీవీ యు-సిరీస్ మోడళ్ తో పాటు వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గతంలో యూరప్, ఉత్తర అమెరికాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీని పోలి ఉంటుందని తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ ఫోన్ గురించి మరికొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు ఆండ్రాయిడ్ సెంట్రల్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ పేరులో సీఈ అంటే కోర్ ఎడిషన్ అని అర్ధం. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుందని సమాచారం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ టీవీ యు సిరీస్‌తో పాటు లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 16 నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఓపెన్ సేల్ కి వస్తుంది. చదవండి: పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్ -
ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్షిప్ ఫెస్ట్ పేరుతో మే 10 నుంచి మే 14 వరకు ఒక ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో ఫ్లాగ్ షిప్ మొబైల్స్ తక్కువ ధరకు లభిస్తాయి. అందులో భాగంగానే మోటొరోలా రేజర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లాగ్షిప్ ఫెస్ట్‌లో భారీ డిస్కౌంట్ కంపెనీ అందించింది. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను తీసుకొచ్చారు. ఇందులో ఉన్న రెట్రో మోడ్ ద్వారా పాత రేజర్ సిరీస్ ఫోన్లను ఉపయోగించిన అనుభూతిని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,49,999 కాగా దీన్ని రూ.89,999కే విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా రూ.60 వేల తగ్గింపు ఈ ఫోన్‌పై లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతం ఇందులో అందుబాటులో ఉంది. మోటొరోలా రేజర్ స్పెసిఫికేషన్లు 6.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
గేమింగ్ ఫోన్‌పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ కార్నివాల్లో అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 6.59 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.55,999గా ఉండగా ఈ సేల్‌లో రూ.41,999కే విక్రయిస్తున్నారు. అలాగే, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999 నుంచి రూ.12,000 తగ్గింపుతో రూ.45,999కు అందిస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 3 ఫీచర్లు: 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ హెచ్డీఆర్ డిస్ ప్లే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ మెయిన్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ చదవండి: బజాజ్ చేతక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్! -
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3
పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది. పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డాట్ డిస్ ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) పోకో ఎఫ్3 ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 6 జీబీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) చదవండి: ఫేస్బుక్ మరో సంచలనం జాగ్వార్ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదల -
లీకైన పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్, ధర
మొబైల్ ఫోన్ కొనాలనుకునే వారికి పోకో గుడ్ న్యూస్ తెలిపింది. పోకో ఎక్స్ 3 ప్రో మోడల్ ను మార్చి 30న ఇండియాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేతో పాటు ఎల్ సీడి స్క్రీన్ ను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ సాప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్(అంచనా) 6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12 క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 48ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా 20ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్ 5260ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.25,500 6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.23,500 చదవండి: ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్ బైక్ విడుదల -
ఇండియాలో తొలి 18జీబీ ర్యామ్ ఫోన్ విడుదల
ఆసుస్ రోగ్ ఫోన్ 5 మొబైల్ ను మనదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త గేమింగ్ ఫోన్ మూడు విభిన్న మోడళ్లలో తీసుకొచ్చారు. అసుస్ రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్ ఎడిషన్). ఈ మూడు మోడళ్లు 144 హెర్ట్జ్ శామ్సంగ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తాయి. ఇవి రోగ్ ఫోన్ 3 కంటే 23 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. రోగ్ ఫోన్ 5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో గేమ్ కూల్ 5 అనే ఫీచర్ ఉండనుంది. రోగ్ ఫోన్ 5లో ఎయిర్ ట్రిగ్గర్ 5 అనే కొత్త ఫీచర్‌ను అందించారు. భారత దేశంలో 18జీబీ ర్యామ్ తో వచ్చిన తోలి మొబైల్ అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్. అసుస్ రోగ్ ఫోన్ 5 ఫీచర్లు: డిస్ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ రిఫ్రెష్ రేట్: 144 హెర్ట్జ్ ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్: 18 జీబీ స్టోరేజ్: 512 జీబీ ఫ్రంట్ కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ సెల్పీ కెమెరా: 24 ఎంపీ బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్: 65 వాట్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 అసుస్ రోగ్ ఫోన్ 5 ధర: 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.49,999 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ.57,999 అసుస్ రోగ్ ఫోన్ 5 ప్రో ధర: 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.69,999 అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర: 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.79,999 చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా? -
లీకైన పోకో ఎక్స్3 ప్రో ధర, ఫీచర్లు
చైనా మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి త్వరలో రాబోతున్న పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. పోకో ఎక్స్3 ప్రో ధర, స్టోరేజ్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5200ఎంఏహెచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టిప్ స్టర్ సుధాంశు అంభోర్ ట్వీటర్ ద్వారా లీక్ చేశారు. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 250 యూరోలుగానూ(సుమారు రూ.21,600), 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 300 యూరోలుగానూ(సుమారు రూ.26,000) ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను తీసుకోని రానున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ ఫీచర్లు ఉండనున్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో ఈ ఫోన్ రానుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ఈ ఫోన్ త్వరలో రానుంది. చదవండి: ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! -
మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్
వన్‌ప్లస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త మొబైల్ విడుదల అవుతుందా అని మొబైల్ ప్రియులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మొబైల్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్‌ప్లస్ 9 సిరీస్ విడుదల తేది బయటకి వచ్చింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్ ప్లస్ 9ఈ, వన్ ప్లస్ 9 లైట్, వన్ ప్లస్ 9ప్రో తీసుకొనిరావచ్చు. మార్చి 23న ఈ మొబైల్స్ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల ప్రారంభ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్, జెడ్ ఇయర్‌బడ్స్ రెండు వెర్షన్లలో ఒకదాన్ని పొందవచ్చు అని సమాచారం. వన్ ప్లస్ 9ప్రో ఫీచర్స్(అంచనా): 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ 48 ఎంపీ + 50 ఎంపీ + 8 ఎంపీ చదవండి: వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్ ఇక వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి -
నోకియా నుంచి మరో రెండు బడ్జెట్ మొబైల్స్
మొబైల్ మార్కెట్ లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నోకియా నేడు నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్‌ని భారత్ లో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం మరో విశేషం. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఫిబ్రవరి 17న నోకియా 5.4 మొబైల్ ఫస్ట్ సేల్ కి రానుంది. అలాగే నోకియా 3.4ని ఫిబ్రవరి 20న కొనవచ్చు. నోకియా 5.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ, 6జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: చార్కోల్, డస్క్, ఎఫ్జార్డ్ ధర: రూ.13,999(4జీబీ, 64జీబీ) రూ.15,499(6జీబీ, 64జీబీ) నోకియా 3.4 ఫీచర్స్: డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ ప్లస్ బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 460 బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 కలర్స్: డస్క్, పోలార్ నైట్ ధర: రూ.11,999 -
బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3
న్యూఢిల్లీ: పోకో ప్రియులు ఎంతగానో ఇష్టపడే పోకో ఎం3 మొబైల్ నేడు ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన పోకో ఎం2కు కొనసాగింపుగా పోకో ఎం3 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. పోకో ఎం3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. దీనిలో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.(చదవండి: మహిళను రక్షించిన యాపిల్ స్మార్ట్‌వాచ్) పోకో ఎం3 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ గల పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 మీద పనిచేయనుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.53-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్(1,080x2,340 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.79 లెన్స్ 48ఎంపీ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 మాక్రో లెన్స్‌తో 2ఎంపీ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 ఎంపీ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం పోకో ఎం3 ముందు భాగంలో ఎఫ్/2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. పోకో ఎం3 64జీబీ,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ లలో లభిస్తుంది. ఇవి రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ వోల్టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్, యుఎస్బి టైప్-సి, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనిలో స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 198 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి!) పోకో ఎం3 ధర: భారతదేశంలో పోకో ఎం3 6 జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.10,999 ఉండగా, 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో సేల్ కి రానుంది. పోకో ఎం3ను ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. -
లీకైన శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎ72 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు అనాటెల్ బ్రెజిల్ సర్టిఫికేషన్ సైట్లో లీక్ అయ్యాయి. ఆ సర్టిఫికేషన్ సైట్ జాబితాలో ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు బయటకి లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ72కు సంబందించిన వివరాలు గతంలో కూడా అనేక సందర్భాల్లో లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు.(చదవండి: షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!) శాంసంగ్ ఏ72 ఫీచర్స్ లీకైన వివరాల ప్రకారం 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ71కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ71లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ అనాటెల్ వెబ్ సైట్లో SM-A725M/DS మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇందులో డిఎస్ అంటే డ్యూయల్ సిమ్ అని అర్థం. శామ్సంగ్ గెలాక్సీ ఎ72 బిగ్ 6.7-అంగుళాల డిస్ప్లే, యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటు దిగువన స్పీకర్ గ్రిల్ కలిగి ఉండవచ్చు. ఇవి తప్ప శాంసంగ్ గెలాక్సీ ఏ72కి సంబందించిన వివరాలేవీ తెలియరాలేదు.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) శాంసంగ్ ఏ72 ధర ఈ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. ఈ ఫోన్ ధర కూడా ఆన్లైన్లో లీకైంది. ఈ ఫోన్ కొన్ని మార్కెట్లలో 4జీతో, కొన్ని మార్కెట్లలో 5జీతో రానుంది. కొన్ని మార్కెట్లలో రెండు వేరియంట్లూ రానున్నట్లు తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన 4జీ వేరియంట్ ధర 449 యూరోలుగానూ(సుమారు రూ.39,800), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న 4జీ వేరియంట్ ధర 509 యూరోలుగానూ(సుమారు రూ.45,100) ఉండనున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీ ధర 600 డాలర్లుగా(సుమారు రూ.43,800) ఉండనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ కూడా వచ్చే నెలలో జరగనుందని సమాచారం. -
షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!
షియోమీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11 మొబైల్ విడుదల తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11ను ఫిబ్రవరి 8న గ్లోబల్ లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత నెలలో చైనాలో ఎంఐ 10కి కొనసాగింపుగా ఎంఐ 11ను విడుదల చేశారు. డిసెంబరులో ఆవిష్కరించబడిన ఫ్లాగ్షిప్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో వచ్చిన మొదటి మోడల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డు సృష్టించింది. దీనిలో షియోమీ కొత్త ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను తీసుకోనురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ ఎంఐ 11 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.8-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పాటు 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ను తీసుకోని రానున్నారు. ఎంఐ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ ఎంఐ 11లో 256జీబీ యుఎఫ్ఎస్3.1 స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ లో ఎంఐ టర్బోచార్జ్ 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే 4,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, ఇన్ఫ్రారెడ్, యుఎస్బి టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. ఎంఐ 11 ధర: గ్లోబల్ మార్కెట్ షియోమీ ఎంఐ 11 ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ చైనాలో కోసం సిఎన్‌వై3,999 (సుమారు రూ.45,300)కి లాంచ్ చేశారు. ఎంఐ 11 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ సిఎన్‌వై 4,299 (సుమారు రూ.48,700)కి, టాప్-ఆఫ్-లైన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్ సిఎన్‌వై4,699(సుమారు రూ.53,200) ధరను కలిగి ఉంది. -
రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల
సోనీ కంపెనీ చివరకు ఫ్లాగ్‌షిప్‌గా పిలవబడే ఎక్స్‌పీరియా ప్రో విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రీ-వ్యూ కోసం ఫోన్లో డబుల్ మానిటర్ ఇందులో ప్రవేశపెట్టారు. దింతో పాటు ఫోన్‌కి మైక్రో హెచ్డిఎంఐ కనెక్టర్ అందించారు. దీని సహాయంతో సోనీ ఎక్స్‌పీరియా ప్రో యూజర్లు తమ ఫుటేజీని కెమెరా నుంచి ఎఫ్‌టిపికి బదిలీ చేసుకోవచ్చు. అలాగే కెమెరాను ఫోన్‌కు కనెక్ట్ చేసి4కె ఓఎల్ఈడి డిస్ప్లే మానిటర్ తరహాలో లైవ్ ఫీడ్‌ను చూడవచ్చు. సోనీ ఎక్స్‌పీరియా ప్రో 5జీ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.(చదవండి: వాట్సాప్ పేకు గట్టి ఎదురుదెబ్బ) సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఫీచర్స్: ఇందులో 6.5 అంగుళాల 4కే హెచ్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. సోనీ ఎక్స్‌పీరియా ప్రో ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6రక్షణతో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపీ ఎఫ్/ 1.7లెన్స్‌తో ఎక్స్మోర్ ఆర్ఎస్ను కలిగి ఉంది. మిగిలిన రెండు కెమెరాలు 124-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్ఓవి)తో ఎఫ్ / 2.2 లెన్స్, ఎఫ్/2.4 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం సోనీ ఎక్స్‌పీరియా ప్రో ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగిఉంది.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్) సోనీ ఎక్స్‌పీరియా ప్రోలో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, మైక్రో-హెచ్డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎక్స్‌పీరియా అడాప్టివ్ ఛార్జింగ్, యుఎస్బి పవర్ డెలివరీ(పిడి)ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది. ఇది 225 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. సోనీ ఎక్స్‌పీరియా ధర: ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో ఉన్న ఈ వేరియంట్ ధరను $2,499(సుమారు రూ.1,82,500)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, బీఅండ్హెచ్ ఫొటో వీడియో, సోనీ ఆన్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. -
మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో అదిరిపోయే ఫీచర్స్
మోటొరోలా తన కొత్త ఫోన్ ఎడ్జ్ ఎస్ మొబైల్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గత వారం క్వాల్కామ్ కంపెనీ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ తో విడుదలైన మొట్టమొదటి మొబైల్ ఇదే. మోటరోలా ఎడ్జ్ ఎస్‌లో డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ ఉన్నాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు రెండు కెమెరాలను తీసుకొచ్చారు. ఎడ్జ్ ఎస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.(చదవండి: పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఫీచర్స్: డ్యూయల్ సిమ్(నానో) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఆండ్రాయిడ్ 11లో మైయుఐ మీద నడుస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రినో 650 జీపీయును తీసుకొచ్చారు. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ(యుఎఫ్ఎస్ 3.1) వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఎడ్జ్ ఎస్‌లో 64 మెగాపిక్సెల్(ఎఫ్/1.7) ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు) వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. మోటరోలా 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. దీని బరువు 215 గ్రాములు. మోటరోలా ఎడ్జ్ ఎస్ ధర: మోటరోలా ఎడ్జ్ ఎస్ 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సిఎన్‌వై 1,999(సుమారు రూ.22,600), 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సిఎన్‌వై 2,399(సుమారు రూ.27,000)గా నిర్ణయించారు. టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సిఎన్‌వై 2,799(సుమారు రూ.31,600)గా ఉంది. ఫోన్ ఎమరాల్డ్ లైట్, స్నో, మిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.