Noika 5.4 Price in India, Launch Date, Specifications, Features - Sakshi
Sakshi News home page

నోకియా నుంచి మరో రెండు బడ్జెట్ మొబైల్స్ 

Published Wed, Feb 10 2021 4:51 PM | Last Updated on Wed, Feb 10 2021 5:05 PM

Nokia 5 4 and Nokia 3 4 Launched in India - Sakshi

మొబైల్ మార్కెట్ లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నోకియా నేడు నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్‌ని భారత్ లో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం మరో విశేషం. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఫిబ్రవరి 17న నోకియా 5.4 మొబైల్ ఫస్ట్ సేల్ కి రానుంది. అలాగే నోకియా 3.4ని ఫిబ్రవరి 20న కొనవచ్చు.

నోకియా 5.4 ఫీచర్స్: 
డిస్‌ప్లే: 6.39 అంగుళాల హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ 
ఫాస్ట్ ఛార్జింగ్: 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 
బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 8 ఎంపీ 
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 
కలర్స్:  చార్‌కోల్, డస్క్, ఎఫ్‌జార్డ్
ధర: రూ.13,999(4జీబీ, 64జీబీ)
       రూ.15,499(6జీబీ, 64జీబీ)

నోకియా 3.4 ఫీచర్స్: 
డిస్‌ప్లే: 6.39 అంగుళాల హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ 
ఫాస్ట్ ఛార్జింగ్: 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 460 
బ్యాక్ కెమెరా: 48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 16 ఎంపీ 
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10 
కలర్స్:  డస్క్, పోలార్ నైట్
ధర: రూ.11,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement