Nokia
-
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్‌బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్‌టెల్‌కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్‌తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్‌గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్‌కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే?
ఫిన్లాండ్కు చెందిన టెక్ కంపెనీ నోకియా ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కంపెనీ చైనాలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా యూరప్‌లో కూడా అదనంగా మరో 350 మందిని తొలగించింది. యూరప్‌లో ఉద్యోగాల కోతలను గురించి సంస్థ ప్రతినిధి ధృవీకరించినప్పటికీ.. చైనాలో ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావించలేదు.చైనా నోకియా కంపెనీలో 10,400 మంది ఉద్యోగులు ఉండగా.. ఐరోపాలో వీరి సంఖ్య 37,400గా ఉంది. ఖర్చులను తగ్గించి 2026 నాటికి సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లు లేదా రూ.7,300 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆదా చేయాలని నోకియా భావిస్తోంది.నోకియాకు కీలకమైన మార్కెట్లలో చైనా ఒకటి. అయితే.. హువావే, జెడ్‌టిఇ వంటి చైనా కంపెనీలను యుఎస్ నిషేధించడంతో, చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ వంటి వాటితో తమ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. 2019లో నోకియా నికర అమ్మకాలలో చైనా వాటా 27 శాతం కాగా.. ప్రస్తుతం ఇది 6 శాతానికి తగ్గింది.నోకియా ఉద్యోగుల తొలగింపు చేపట్టకముందే.. ఈ వారం ప్రారంభంలో మెటా సంస్థ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్‌ల విభాగంలోని టీమ్‌లలో కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అయితే ఏ విభాగంలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారనేది కంపెనీ వెల్లడించలేదు. -
అతిపెద్ద ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న నోకియా
ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణల కోసం నోకియా అతిపెద్ద గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం భారత్‌లోని చెన్నైలో రూ.450 కోట్ల పెట్టుబడికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు నోకియా, చెన్నై రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఫిన్లాండ్కు చెందిన నోకియా దేశంలో ఫిక్స్డ్ నెట్వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయలనే ఉద్దేశంతో రూ.450 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలిపింది. ఈ ల్యాబ్‌లో రానున్న రోజుల్లో 10జీ, 25జీ, 50జీ, 100 జీ(జీపొన్-గిగాబిట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్) నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేస్తామని నోకియా ఆసియా పసిఫిక్ ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల హెడ్ విమల్ కుమార్ కోదండరామన్ తెలిపారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా అడ్వాన్స్డ్ నెట్వర్క్ టెక్నాలజీ సేవలందించేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అతిపెద్ద ఫిక్స్డ్ నెట్‌వర్క్‌ల ల్యాబ్ చెన్నైలో ఏర్పాటు చేయడంవల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం.. -
సెకనుకు 1.2 జీబీ స్పీడ్.. నోకియా ఘనత
న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్‌లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్టెల్ వాణిజ్య నెట్వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి. -
వొడాఫోన్‌లో నోకియా, ఎరిక్సన్ వెండర్లకు 166 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్‌పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్సన్కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్‌లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది. -
'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ కంపెనీ సుమారు 25 సంవత్సరాల తరువాత మార్కెట్లో 'నోకియా 3210 4జీ' ఫోన్ లాంచ్ చేసింది. కాలంలో కలిసిపోయిందనుకున్న ఈ ఫోన్ మళ్ళీ కనిపించడంతో నోకియా ప్రియులు సంబరపడిపోతున్నారు.ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3210 4జీ ధర రూ. 3999. దీనిని ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో లేదా హెచ్ఎండీ వెబ్సైట్లో కొనుకోగలు చేయవచ్చు. ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తుంది. టీ107 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ కీబోర్డుతి వస్తుంది.ఈ కొత్త నోకియా 3210 4జీ ఫోనులో అందరికీ ఇష్టమైన 'స్నేక్' గేమ్ కూడా ఉంది. 64 ఎంబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 128 ఎంబీ స్టోరేజ్ పొందుతుంది. దీనిని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి SD కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ వంటి వాటి కోసం యాప్స్ కూడా ఉన్నట్లు సమాచారం.కెమెరా కోసం నోకియా 3210 4జీ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు 1450 mAh రినోవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్టుతో వస్తుంది.Here it is! As iconic as ever – Nokia 3210 4G! Relive the retro, now with a modern touch - YouTube, Scan & Pay with UPI, long battery life, Bluetooth, 4G connectivity, and more!Buy now - https://t.co/E7s4Mblyg4 #HMD #Nokia3210 #IconIsBack pic.twitter.com/0rs00bssDc— HMD India (@HMDdevicesIN) June 10, 2024 -
6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్‌ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్‌లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్‌లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఉద్యోగుల తొలగింపు.. ప్రముఖ టెలికం కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా భారీ షాకిచ్చింది. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా పలు టెలికాం సంస్థలు 5జీ కార్యాకలాపాల్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్నంత డిమాండ్ నోకియా 5జీ పట్ల లేదు. దీంతో 5జీ మార్కెట్ లో నోకియా సత్తా చాటుతుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో నోకియా ఉద్యోగులకు ఉద్వాసన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మనీ, టెక్నాలజీ, లీగల్ స్టఫ్ ఇన్‌ఛార్జ్‌ల వంటి పలు కీలక విభాగాల్లో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్స్, క్లౌడ్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మూడు విభాగాలుగా విభజించనుంది. ప్రతి విభాగం భారత్‌లో నోకియా వ్యాపారాల్లో వివిధ విభాగాలపై దృష్టి సారించనుంది. -
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
Layoffs: నోకియా సంచలన నిర్ణయం..14వేల మందికి ఉద్వాసన!
కార్పొరేట్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం పేరిట ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా ఇతర రంగాలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేల మంది సిబ్బందికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. నోకియా కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏకంగా తన కంపెనీలో పనిచేస్తున్న 14 వేల మందిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర అమెరికాలో సంస్థ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో రానున్నరోజుల్లో కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగుల కోత విధించనుంది. ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది పని చేస్తున్నారు. -
భారత్‌లో నోకియా 6జీ ల్యాబ్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా భారత్‌లో తమ 6జీ ల్యాబ్‌ను నెలకొల్పింది. కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. భారత్‌ను నూతన ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల సాధన దిశగా ఇది మరో ముందడుగని ఆయన తెలిపారు. సురక్షితమైన రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర విభాగాలకు ఉపయోగపడగలిగే 6జీ టెక్నాలజీ ఆధారిత నవకల్పనలపై ఈ ల్యాబ్ పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరులోని తమ గ్లోబల్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్లో నోకియా దీన్ని ఏర్పాటు చేసింది. భారత్ ఇప్పటికే 6జీ టెక్నాలజీలో 200 పైచిలుకు పేటెంట్లు దక్కించుకుంది. -
పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్వేర్! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా..
90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది నోకియా. నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు. మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల నోకియా 130 స్పెసిఫికేషన్లు నోకియా 130 ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది. నోకియా 150 స్పెసిఫికేషన్లు ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. -
నోకియా మొబైల్స్.. ఈ మోడల్స్ ఎప్పుడైనా చూశారా?
-
నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు!
Nokia 110 4G/2G: రిలయన్స్ జియో బాటలోనే నోకియా కూడా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ (UPI) పేమెంట్ ఆప్షన్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం విశేషం. నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 110 2జీ (Nokia 110 2G) ఫీచర్ ఫోన్లకు సంబంధించిన 2023 మోడల్‌లు తాజాగా విడుదలయ్యాయి. వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదీ చదవండి: హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్! స్పెసిఫికేషన్స్ నోకియా 110 4G/2G ఫోన్ల 2023 మోడల్లను 2021 మోడల్‌తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త కొత్త రంగుల్లో నూతన ఫోన్లు ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నోకియా 110 4జీ ఫోన్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే, ఈ కొత్త మోడల్‌ల ఫోన్లలో ఇన్‌బిల్ట్ యూపీఐ పేమెంట్ ఫీచర్ ఇచ్చారు. యూజర్లు ఒక బటన్‌ను నొక్కడం ద్వారా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. నోకియా 110 4జీ ధర రూ.2,499, నోకియా 110 2జీ ఫోన్ ధర రూ.1,699లుగా ఉంది. వీటిని నోకియా రిటైల్ స్టోర్లలోనూ, నోకియా అధీకృత, భాగస్వామ్య వెబ్సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ 1.8″ QQVGA డిస్ప్లే QVGA రిజల్యూషన్‌తో కూడిన రియర్ కెమెరా 12 రోజుల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ) నానో ఆకృతిలో పాలికార్బోనేట్తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్ IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వైర్లెస్ FM రేడియో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ 94.5 గ్రాముల బరువు 50mm x 121.5mm x 14.4mm కొలతలు ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
త్వరలో భారీ కొనుగోళ్లు.. రూ.13 వేల కోట్ల రుణాల కోసం ముఖేష్ అంబానీ చర్చలు!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు 1.6 బిలియన్ల మేర రుణాల్ని సమీకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా నుంచి ఎక్విప్మెంట్ కొనుగోలు నిమిత్తం భారీ ఎత్తున లోన్ రూపంలో రిలయన్స్ నిధుల్ని సమకూర్చుకోనుంది. కొనుగోలు ఒప్పందం గడవు సమీపిస్తున్న తరుణంలో సిటీ గ్రూప్ ఐఎన్‌సీ, హెచ్ఎస్బీసీ హోల్డింగ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సంస్థల నుంచి ఈ మొత్తాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో ప్రతినిధులు పైన పేర్కొన్న సంస్థల అధినేతలతో చర్చించనున్నారని, ముఖేష్ అంబానీ 15 కాల పరిమితితో రుణాన్ని తీసుకోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి, ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. అయితే, ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫిన్వెరా రిలయన్స్ తీసుకునే లోన్ మొత్తానికి గ్యారెంటీ కవర్‌కు ముందుకు వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా .. దేశీయ టెలికాం దిగ్గజం జియో 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు కావాల్సిన పరికరాల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. జియో సైతం స్ప్రెక్టం కొనుగోలు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థగా చరిత్రకెక్కింది. కాగా, రిలయన్స్ సంస్థ రుణాల కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదికల్ని జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలు ఖండించాయి. నోకియా అధికార ప్రతినిధి,రిలయన్స్ సైతం ఇదే తరహాలో స్పందించాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా? -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్‌లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్‌గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర
సాక్షి, ముంబై: బడ్జెట్ ఫోన్ల సంస్థ నోకియా మరోసారి తన ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అతి తక్కువ ధరలో నోకియా సీ 22 ఫోన్నుభారత మార్కెట్లోలాంచ్ చేసింది. మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్‌తో భారత దేశంలో విడుదల చేస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ గురువారం ప్రకటించింది. (BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్ ) దీని ధర రూ. 7999 గా నిర్ణయించింది. చార్కోల్, సాండ్, పర్పుల్ కలర్స్ లభ్యం. 4జీబీ ర్యామ్ 2 జీబీ వర్చువల్ స్టోరేజ్, 4జీబీ (2GB + 2GB RAM), 6జీబీ(4GB + 2GB వర్చువల్ RAM) 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభించ నుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీతోపాటుఅందిస్తున్న నోకియా సీ 22 ఈ రోజు నుంచే( మే 11) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇంకా IP52గా రేట్ బ్యాటరీ సేవర్ ఫీచర్ , స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే) నోకియా సీ-సిరీస్ నమ్మదగిన, సరసమైన స్మార్ట్ఫోన్లను అందించడంలో కస్టమర్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయదని హెచ్ఎండీ గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ ఒక ప్రకటనలో తెలిపారు. నోకియా సీ22 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ డిస్ప్లే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ 13 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 mAh బ్యాటరీ Introducing the all-new Nokia C22 comes with 4GB RAM + 2GB virtual RAM, 13MP dual rear camera, 1 year replacement guarantee and 3-day battery life to make you #LiveUntamed. Buy now: https://t.co/tKvqK84hWj#NokiaC22 pic.twitter.com/gVNg4kA7ki — Nokia Mobile India (@NokiamobileIN) May 11, 2023 -
కేవలం రూ. 7,999కే నోకియా కొత్త మొబైల్ - పూర్తి వివరాలు
నోకియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన సీ12 లైనప్‌లో మరో కొత్త 'సీ12 ప్లస్' మొబైల్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో సీ12, సీ12 ప్రో ఉన్నాయి. నోకియా నుంచి విడుదలైన ఈ కొత్త సీ12 ప్లస్ ధర రూ. 7,999. ఈ లేటెస్ట్ మొబైల్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సరసమైన ధర వద్ద విడుదలైన ఈ మొబైల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేట్స్ పొందింది. ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో అడుగుపెట్టింది. ధర ప్రకటించినప్పటికీ సేల్ తేదీని నోకియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలో వెల్లడించే ఛాన్స్ అవకాశం ఉందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) నోకియా సీ12 ప్లస్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అయినప్పటికీ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది 6.3 ఇంచెస్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో ఫ్రంట్ కెమెరా కోసం టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్టోరేజిని పెంచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: Dharampal Gulati: వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..) కొత్త నోకియా సీ12 ప్లస్ మొబైల్ 4జీ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ-పోర్టు, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 4,000mAh వరకు ఉంది. కెమెరా పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున వీడియో కాల్స్, సెల్ఫీ వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. -
నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్వర్క్ త్వరలో
న్యూఢిల్లీ: ఎంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. రాబోయే అంతరిక్ష యాత్రలో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ చెయ్యని సాహసంతో చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ రాబోయే నెలల్లో స్పేస్ఎక్స్ రాకెట్లో నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని నోకియా ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో ఈ నెల ప్రారంభంలో బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో విలేకరులకు వెల్లడించారు. దీని ప్రకారం నోకియా ఈ ఏడాది చివర్లో చంద్రునిపై 4జీ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. దీన్ని నాసా ఆర్టెమిస్-1 మిషన్‌లో ఉపయోగించబడుతుందనీ, తద్వారా చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యమని తెలిపారు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం ప్రస్తుతం SpaceX ఫాల్కన్ 9 రాకెట్లో నవంబర్‌లో ప్రారంభించనుందని, Intuitive Machines యొక్క Nova-C లూనార్ ల్యాండర్ మన సహజ ఉపగ్రహానికి సిస్టమ్ ఇతర పేలోడ్లను తీసుకువెళుతుంది, నోకియా 4జీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను చంద్రుని దక్షిణ ప్రాంతంలోని షాకిల్టన్ క్రేటర్‌పై దాని చివరి గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. భూసంబంధమైన నెట్‌వర్క్‌లు భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని చూపడం దీని లక్ష్యం.సంబంధించి 2020 అక్టోబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో నోకియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుందని సమాచారం. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) ఈ పరిశోధనలు హెచ్డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, టెలిమెట్రీ లేదా బయోమెట్రిక్స్ అవసరమయ్యే భవిష్యత్ మిషన్లకు సెల్యులార్ నెట్‌వర్క్‌లు ప్రారంభించే అధునాతన సామర్థ్యాలు అవసరం" అని నోకియా తన వెబ్ పేజీలో నాసా భాగస్వామ్యం గురించి వెల్లడించింది. మరోవైపు ఈ టెక్నాలజీలు చంద్రునిపై మంచును గుర్తించడంలో పరిశోధకులకు సహాయ పడతాయి. అలాగే భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటి వాటిని గుర్తిస్తే గ్రహం మీద మానవ జీవితాన్ని నిలబెట్టడంలో సహాయ పడుతుందని నాసా అంచనా. -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్‌ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్‌ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్‌లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో ఆధునిక స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇలాంటి వాటినే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా ఇప్పుడు నోకియా కంపెనీ ఒక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది. బార్సిలోనాలో జరిగిన ఏండబ్ల్యుసి 2023 ఈవెంట్లో 'నోకియా సీ99' అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటివి ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే విషయం వెల్లడి కాలేదు. నోకియా సీ99 ధరలు కూడా కంపెనీ వెల్లడించలేదు, కానీ దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే, లేటెస్ట్ హై ఎండ్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) కొత్త నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. ఈ సరికొత్త మొబైల్ గురించి తెలియాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది త్వరలో తెలుస్తుంది. -
Nokia C12: నోకియా మరో బడ్జెట్ ఫోన్ లాంచ్, ధర చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. సీ సిరీస్‌లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది. నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.3అంగుళాల HD+ డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్ స్ట్రీమ్లైన్డ్ OS 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ రియర్ కెమెరా 12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు. Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f — Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023 -
నోకియా కొత్త లోగో చూశారా? నెటిజన్ల రియాక్షన్స్ మాత్రం..!
సాక్షి, ముంబై: టెలికాం పరికరాల తయారీదారు నోకియా సరికొత్త ప్లాన్లతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త, బడ్జెట్ఫోన్లతో ప్రత్యేకతను చాటుకుంటున్న నోకియా తాజాగా తన ఐకానిక్ లోగోను మార్చింది. దాదాపు 60 ఏళ్లలో తొలిసారిగా నోకియా (NOKIA) లోగో మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ లోగోతోపాటు బిజినెస్ వ్యూహాన్ని కూడా మార్చుతుండటం గమనార్హం. తద్వారా తన బ్రాండ్ గుర్తింపును మరింత విస్తరించాలని భావిస్తోంది. కొత్త లోగోతో కొత్త శకనాకి నాంది పలకాలని భావిస్తోంది. సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ తన ప్లాన్లను ప్రకటించారు. నోకియా తన బ్రాండ్ ఐడెంటిటీని రిఫ్రెష్ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై నోకియా కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదు బిజినెస్ టెక్నాలజీ కంపెనీ కూడా అని ప్రకటించారు. బిజినెస్-టు-బిజినెస్ ఇన్నోవేషన్లీడర్గా ఎదగనుందని తెలిపారు. దీని ప్రకారం నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్లతో NOKIA అనే పదాన్ని రూపొందించింది. (నోకియా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, మీరే రిపేర్ చేసుకోవచ్చు!) మరోవైపు నోకియా కొత్తలోగోపై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు లోగోను బాగా ఇష్టపడుతోంటే, మరింకొందరు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. పాతదే బావుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కనెక్టింగ్ పీపుల్ అంటూ విపరీతంగా ఆకట్టుకున్న ఐకానిక్ లోగోను మార్చడంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా ఇటీవల రైట్ రిపేర్ లో భాగంగా కస్టమర్లు సొంతంగా రిపేర్ చేసుకునే జీ22ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. If you are eliminating vertical components from logo , then remove ‘I’ also. #Nokia pic.twitter.com/WclL5o0GZ6 — Anupam Biswas (@flyanupam) February 27, 2023 The new Nokia logo is mathematically correct. pic.twitter.com/uKu5O0kry8 — Arto Vartiainen (@artovartiainen) February 26, 2023 So disturbing #NokiaLogo #NokiaNewLogo The old one looked elegant and gorgeous. pic.twitter.com/ZYR6Ci3pU2 — Bernard D'sa (@bernarddsa) February 27, 2023