నోకియా దూకుడు: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు | Nokia 7 Plus, Nokia 6 (2018) and Nokia 8 Sirocco India launch expected on April 4 | Sakshi
Sakshi News home page

నోకియా దూకుడు: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు

Published Thu, Mar 29 2018 11:47 AM | Last Updated on Thu, Mar 29 2018 11:53 AM

Nokia 7 Plus, Nokia 6 (2018) and Nokia 8 Sirocco India launch expected on April  4 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల విడుదలలో నోకియా సంస్థ దూకుడు పెంచింది.  ముఖ్యంగా  ఆండ్రాయిడ్‌ గో ఆధారంగా ఇటీవల నోకియా 1 గో ను లాంచ్‌ చేసిన సంస్థ తాజాగా మూడు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను   లాంచ్‌ చేయనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో ఏకంగా 3 కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో, నోకియా 6 (2018) పేరుతో వీటిని లాంచ్‌ చేయనుంది. వీటితో పాటు నోకియా 8110 పేరిట ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్‌ను కూడా ఇదే ఈవెంట్‌లో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్‌ ఓరియో, డ్యుయల్‌ రియర్‌ కెమెరా,  గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫాస్ట్‌ చార్జింగ్‌ తదిరల ఫీచర్లు వీటి ప్రధాన ప్రత్యేకతలుగా నిలవనున్నాయి.  ఇక ధరల విషయానికి వస్తే.. నోకియా 7 ప్లస్ రూ.32వేలకు లభించే అవకాశం ఉండగా, నోకియా 8 సిరోకో రూ.60వేలకు, నోకియా 6 (2018) రూ.20వేలకు లభించే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఈ  ఈవెంట్‌కు ఇప్పటికే మీడియాకు ఆహ్వానాలు పంపినప్పటికీ .. లాంచింగ్‌పై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సెల్స్‌  రిజల్యూషన్
 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
 64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 12+13 ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 2560 x 1440 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
 6 జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 12+13 ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరా
 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 6 (2018) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16 ఎంపీ రియర్‌ కెమెరా
 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement