90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది నోకియా.
నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు.
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
నోకియా 130 స్పెసిఫికేషన్లు
నోకియా 130 ఫోన్‌లో 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది.
నోకియా 150 స్పెసిఫికేషన్లు
ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్‌ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment