-
పాత ఫోన్లు.. కొత్త సాఫ్ట్వేర్! 90ల నాటి నోకియా ఫోన్లు మళ్లీ కొత్తగా..
90ల నాటి నోకియా ఫీచర్ ఫోన్లు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉన్న స్నేక్ గేమ్ అంటే అప్పటి పిల్లలకు చాలా ఇష్టం. పెద్దలు కూడా ఈ ఫోన్లు వాడటానికి ఇష్టపడేవారు. అప్పటి ఫోన్లలో కొన్ని మోడళ్లను కొత్త సాఫ్ట్‌వేర్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది నోకియా. నోకియా 130, నోకియా 150 మోడల్ ఫీచర్ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌తో తీసుకొస్తున్నట్లు నోకియా తాజాగా ప్రకటించింది. స్మార్ట్ఫోన్లతో విసిగిపోయినవారికి, తమ సమయమంతా వృధా అవుతోందని, వాటికి దూరంగా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ ఫోన్లు పరిష్కారంగా నిలుస్తాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఉన్నవారు వీటిని సెకండరీ ఫోన్లుగా వినియోగించవచ్చు. మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల నోకియా 130 స్పెసిఫికేషన్లు నోకియా 130 ఫోన్లో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంటుంది. 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. ఇందులో కెమెరా ఆప్షన్ ఉండదు. 12 కీల నావిగేషనల్ కీప్యాడ్ ఉంటుంది. అందరికీ ఇష్టమైన స్నేక్ గేమ్ సరికొత్త వెర్షన్ ఇందులో ఉంటుంది. నోకియా 150 స్పెసిఫికేషన్లు ఇందులోనూ 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఈ బ్యాటరీ నెల రోజుల స్టాండ్‌బై టైం ఇస్తుంది. పాటలు వినేందుకు ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇక 0.3 ఎంపీ కెమెరా వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. -
నోకియా కొత్త ఫోన్ భారత్‌లోకి వచ్చేసింది!
ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో తిరుగులేని బ్రాండ్ నోకియా. స్మార్ట్ ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్ తన వైభవం కోల్పోయింది. తాజాగా తన పునర్వైభవం కోసం నోకియా కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది. గత డిసెంబర్ లో నోకియా బ్రాండ్ లో హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన నోకియా 150, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్లలో, నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ లో దీన్ని అమ్మకానికి ఉంచింది. దీని ధర రూ.2059గా హెచ్ఎండీ గ్లోబల్ పేర్కొంది. నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్, ఫ్లిప్ కార్ట్ లో తెలుపు లేదా నలుపు రంగుల్లో లభ్యమవుతుండగా.. అమెజాన్ ఇండియాలో కేవలం నలుపు రంగు ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఈ ఫోన్ ఫీచర్లు. ఈ ఫోన్ కు 1020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 32 గ్రాముల బరువున్న ఈ ఫోన్లో ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్ వీ3.0 విత్ స్లామ్, వీజీఏ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. నోకియా బ్రాండులో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.. నోకియా 3, నోకియా 5, నోకియా 6లను హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవలే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో ప్రకటించింది. ఈ ఫోన్లను రెండో క్వార్టర్లో భారత్ తో సహా 120 మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. సరసమైన ధరల్లోనే వీటిని లాంచ్ చేస్తామని పేర్కొంది.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మియాపూర్‌లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
రామసేతు రహస్యం పార్ట్1: రామసేతు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
భారత్-కెనడా మ్యాచ్ వర్షార్పణం..
Advertisement