న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్‌టెల్ నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్‌షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్‌బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌పుట్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌ను నోకియా అందించనుంది.
‘వీటి చేరికతో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్‌వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్‌టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.
నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్‌టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్‌వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్‌టెల్‌కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment