న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌లో తాజాగా 1.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఆఫ్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.
అయితే డీల్ విలువను వెల్లడించనప్పటికీ.. ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ ప్రకా రం వాటా విలువ రూ. 11,680 కోట్లుగా అంచనా. కాగా.. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం వాటా 40.33 శాతానికి చేరింది. మరోవైపు ఇండియన్ కాంటినెంట్ వాటా 3.31 శాతానికి పరిమితమైంది. భారతీ టెలికంలో సునీల్ భారతీ మిట్టల్ వాటా 50.56 శాతంకాగా.. సింగ్‌టెల్ 49.44% వాటాను కలిగి ఉంది.
ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్‌లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు!
Comments
Please login to add a commentAdd a comment