ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్‌టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.
ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ను వన్–స్టాప్ షాప్‌గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్‌టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.
కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఎయిర్‌టెల్-బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ స్టోర్‌ల నెట్‌వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
“ఎయిర్‌టెల్-బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్న ఆఫర్‌ల శ్రేణికి యాక్సెస్‌ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్‌ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment