నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్‌బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.
రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్‌ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.
ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్‌బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది.
ఫిబ్రవరిలో ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.
ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్‌బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment