fixed interest
-
ఇకపై మరింత రాబడి.. ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్!
SBI FD Interest Rates Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎస్బీఐ ఈ ఎఫ్డీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది.ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిమితిని పెంచుకోవచ్చు. ఎస్బీఐ ప్రకటించిన ఈ కొత్త రేట్లు రూ .3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే.. » 7 రోజుల నుంచి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం.» 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం» 180 రోజుల నుంచి 210 రోజులు: సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం» 211 రోజుల నుంచి ఏడాది లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం» ఏడాది నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం» 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం» మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం» ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం. -
ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎస్, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .డీసీబీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.ఐడీఎఫ్సీఐడీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయిబ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది. ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.ఆర్బీఎల్లో వడ్డీ రేట్లు ఆర్బీఎల్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.ఆర్బీఎల్ బ్యాంక్ 18 నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
పెట్టుబడి పెట్టారా? వడ్డీ 7.60 శాతం,ఈ ఎస్బీఐ పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
గత ఏడాది పలు బ్యాంకులు కస్టమర్లకు తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీ రేట్లు అందించేలా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్ని అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో కొన్ని పథకాల కాల వ్యవధి నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు అమృత్ కలశ్, అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పేరుతో ఎఫ్డీలను అందిస్తున్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ల కోసం రీటైల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్ను 400 రోజుల పాటు అందిస్తుంది. ఈ మొత్తం సమయానికి ఏడాదికి 7.10శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ వివరాల ప్రకారం.. ‘ది స్పెసిఫిక్ టెన్యూర్ స్కీమ్ ఆఫ్ 400’ (అమృత్ కలశ్) పేరుతో ఫిక్స్డ్ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ఏప్రిల్ 12, 2023 నుంచి ప్రారంభం అయ్యింది. ఇక సీనియర్ సిటిజన్లు అత్యతధికంగా 7.60 శాతం వడ్డీ పొందవచ్చు’ అని పేర్కొంది. ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకంలోని పలు డిపాజిట్లపై ప్రీమెచ్యూర్డ్ (విత్డ్రా), లోన్ వంటి సౌకర్యం కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3శాతం నుంచి 7శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.50శాతం మధ్య వడ్డీ పొందవచ్చు. వడ్డీ చెల్లింపు, నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక వ్యవధిలో. ప్రత్యేక టర్మ్ డిపాజిట్లపై- మెచ్యూరిటీ ii) వడ్డీ, నెట్ ఆఫ్ టీడీఎస్, కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా టీడీఎస్ విధిస్తారు. పన్ను మినహాయింపు కోసం డిపాజిటర్ ఫారమ్ 15G/15Hలో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ అనేది 375, 444 రోజుల నిబంధనల కోసం ఐడీబీఐ బ్యాంక్ అందించే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్. బ్యాంకు రెగ్యులర్, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్వో) , నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) కస్టమర్లకు 444 రోజుల అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పథకం కింద 7.15 శాతం వడ్డీ రేటు, 375 రోజుల టెన్యూర్ కాలానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వృద్ధులకు 7.65 శాతం పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3 శాతం, 6.80 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.30శాతం మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. ఇతర ప్రత్యేక డిపాజిట్లు ఇండియన్ బ్యాంకు ప్రత్యేక ఎఫ్డీ ఐఎన్డీ సూపర్ 400 రోజులు; ఐఎన్డీ సుప్రీ 300 డేస్ ఆగస్ట్ 31,2023న ముగుస్తుంది. పంజాబ్ - సింధ్లు 400 రోజులు 601 రోజుల వ్యవధిపై అధిక వడ్డీ రేటును అందిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023గా బ్యాంకులు నిర్ణయించాయి. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీల)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి10 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంత పెంచిందో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి ►7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►61 రోజుల నుంచి 3 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది ►3 నెలల నుంచి 6 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 6 నెలల నుంచి 9 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 9 నెలల నుంచి ఏడాది నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం 24 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►13 నెలల నుంచి 2 సంవత్సరాల నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ► 2 నుంచి 30 నెలల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.26 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ►30 నెలల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కాలానికి ఎఫ్డీ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. -
ఎస్బీఐ కీలక నిర్ణయం, బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!!
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనుపెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణయంపై ఫిక్స్డ్ డిపాజిటర్లు సంతోషం వ్యక్తం చేస్తుండగా ..కొత్తగా పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ♦ ఎస్బీఐ వెబ్సైట్ కథనం ప్రకారం..ఎస్బీఐ ఇప్పుడు 2ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ♦2 సంవత్సరాల నుండి 3సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్డ్రేట్ల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.45 శాతానికి చేరింది. ♦ 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీల కాలపరిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది. ♦ 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్డీపై వడ్డీ రేట్లు మారవు. ఎస్బీఐ జనవరి 2022లో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న ఎఫ్డీల వడ్డీ రేటును రూ. 2 కోట్లలోపు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచిందని గమనించాలి. ఈ ఎఫ్డీలు ఇప్పుడు 5.1 శాతం (5% నుండి పెరిగాయి) సీనియర్ సిటిజన్లు 5.6% (5.5% నుండి) వడ్డీని పొందవచ్చు. ♦ డిసెంబర్ 2021లో ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బీపీఎస్కి పెంచింది. కొత్త బేస్ రేటు, అంటే సంవత్సరానికి 7.55శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో మరియు రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లను సవరించిన ఆ రెండు బ్యాంకులు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) రెపో రేటు(4 శాతం), రివర్స్ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ మానిటరరీ పాలసీ ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసీఓ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎఫ్డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు 2.75% నుంచి 5.15% మధ్య ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు యుకో బ్యాంక్ యుకో బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో డిపాజిట్ చేసే ఎఫ్డీలపై ఇతర సిటిజన్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 0.50 బేసిసి పాయింట్స్ అధికంగా పొందనున్నారు. యుకో బ్యాంక్ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు (చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం!) -
ఎస్బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!
కొత్త ఏడాదిలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్(ఎఫ్డి)పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్బీఐ తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 2021లో ఎస్బీఐ తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బిపిఎస్ పెంచినట్లు వెబ్సైట్లో తెలిపింది. కొత్త బేస్ రేటు (సంవత్సరానికి 7.55%) డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రుణగ్రహీతలకు లోన్స్ ఇచ్చేందుకు బేస్ రేటును కీలకంగా తీసుకుంటారు. బేస్ రేట్ పెరగడంతో అన్నీ రకాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పడిపోయాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడం అనేది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి ఒక మంచి శుభవార్త. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇటీవల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సర కాలానికి వడ్డీ రేటు 5.6 శాతంగా ఉండనుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా.. రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి బ్యాంక్ తెలిపింది. ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!) -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించిన ఐడీబీఐ
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు 2021 ఆగస్టు 16 నుంచి అమలులోకి రానున్నాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ కాలానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజైన్ అదుర్స్!) -
10.4 శాతం వడ్డీకే 20 ఏళ్ల గృహ రుణం
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొత్తగా 10.40 శాతం స్థిర వడ్డీ రేటుతో 20 ఏళ్ల గృహ రుణ పథకాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. రూ. 50 లక్షల దాకా రుణాలకు ఇది వర్తిస్తుంది. అందుబాటు ధర గృహాల కొనుగోలుకు ఉపకరించేలా ఈ పరిమిత కాలం ఆఫర్ను అందిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ (రిటైల్ రుణాల విభాగం) జైరామ్ శ్రీధరన్ చెప్పారు. బేస్ రేటు కన్నా ఈ వడ్డీ రేటు పావు శాతం అధికంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం బేస్ రేటు 10.15 శాతంగా ఉంది. బ్యాంకు ఖాతాదారులు కావాలనుకుంటే స్థిర వడ్డీ రేటు పథకం నుంచి చలన వడ్డీ రేటు పథకానికి మారొచ్చని శ్రీధరన్ పేర్కొన్నారు. ఇందుకోసం కొంత మొత్తం రుసుములైనా కట్టాలని, లేదా బాకీ ఉన్న అసలు మొత్తంపై 2% ఫోర్క్లోజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.