SBI FD Interest Rates Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎస్‌బీఐ ఈ ఎఫ్‌డీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది.
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిమితిని పెంచుకోవచ్చు. ఎస్‌బీఐ ప్రకటించిన ఈ కొత్త రేట్లు రూ .3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఎస్‌బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే..
» 7 రోజుల నుంచి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం.
» 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం
» 180 రోజుల నుంచి 210 రోజులు: సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం
» 211 రోజుల నుంచి ఏడాది లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం
» ఏడాది నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
» 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
» మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం
» ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
Comments
Please login to add a commentAdd a comment