స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్‌బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్‌డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.
ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్‌డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్‌బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్‌డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్‌డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్‌లు, సీనియర్ సిటిజన్‌లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.
అమృత్ కలశ్ ఎఫ్‌డీ రేట్లు
ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్‌లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్‌డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్‌లకు 6.8%, సీనియర్ సిటిజన్‌లకు 7.3% వడ్డీని ఎస్‌బీఐ చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment