Special Scheme
-
గడువు ముగియనున్న ఎస్బీఐ స్పెషల్ స్కీమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) స్కీమ్ ‘ఎస్బీఐ అమృత్ కలశ్’కు గడువు త్వరలో ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డీ ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30 ముగుస్తుంది.ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డీ ప్లాన్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలు సార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది.కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ.. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌తో అందిస్తున్న సాధారణ ఎఫ్డీ పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డీ ప్లాన్‌పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిస్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తోంది.అమృత్ కలశ్ ఎఫ్డీ రేట్లుఎస్బీఐ అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను సబ్స్క్రయిబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తోంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1-2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డీ ప్లాన్‌కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తోంది. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...
ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) చేసే వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఎప్పటికప్పుడు స్పెషల్ స్కీమ్స్ తీసుకొస్తుంటుంది. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో వీటిలో డిపాజిట్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆకర్షణీయ వడ్డీ అందించే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఎస్బీఐలో రెండు ఉన్నాయి. అవి ఒకటి ‘అమృత్ కలశ్’ (SBI Amrit Kalash) కాగా మరొకటి ‘వుయ్‌కేర్’. అయితే వీటిలో ఎస్బీఐ వుయ్‌కేర్ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో నెలతో ముగుస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం అధిక వడ్డీని అందించే ‘ఎస్బీఐ వుయ్‌కేర్’ (SBI Wecare) అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది ఎస్బీఐ. రెన్యూవల్ అయ్యే మెచ్యూరింగ్ డిపాజిట్లతోపాటు కొత్త డిపాజిట్లకూ ఈ పథకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. పథకం ముఖ్యాంశాలు డిపాజిట్ వ్యవధి: కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 10 సంవత్సరాలు. అర్హత: 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మాత్రమే అర్హులు. వడ్డీ రేటు: 7.50 శాతం. ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: వడ్డీ రేట్లు మారాయ్.. -
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
Factcheck ఈ స్పెషల్ స్కీం కింద ప్రతీ ఆడబిడ్డకూ 1.80 లక్షలు? నిజమా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకు రూ.1.80 లక్షలు ఇస్తోందంటే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఈ వార్తను హైలైట్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ తేల్చి చెప్పింది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) వివరాలను పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో పుకార్లు,నకిలీ వార్తలకు కొదవే ఉండదు. ఇదిగో తోక ..అంటే అదిగో పులి అంటూ నకిలీ గాళ్లు చెలరేగిపోతారు. తాజాగా అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆడబిడ్డకూ లక్షా, 80వేల రూపాయలు అందిస్తోందని, ఈ మొత్తాన్ని బాలిక తల్లిదండ్రుల ఖాతాలో జమ కానుందంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో స్పందించిన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణచేసి ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. (మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: కొత్త ఆప్షన్స్‌తో పండగే!) పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్త, వీడియో నకిలీవని, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదని పీఐబీ అధికారిక ట్విటర్ ఖాతా తేల్చి చెప్పింది. అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద యోజన అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని కాబట్టి, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఎలాంటి సహకారం అందించే ప్రశ్నే లేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల వలలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) 'Government Gyan' नामक #YouTube चैनल की एक वीडियो में दावा किया गया है कि केंद्र सरकार 'प्रधानमंत्री कन्या आशीर्वाद योजना' के तहत सभी बेटियों को ₹1,80,000 की नगद राशि दे रही है#PIBFactCheck ✅ यह वीडियो #फ़र्ज़ी है। ✅ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/y8KRVfxVrF — PIB Fact Check (@PIBFactCheck) March 11, 2023 కాగా ప్రభుత్వ జ్ఞాన్ అనే యూట్యూబ్ చానెల్ ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రతీ అమ్మాయికి తల్లిదండ్రులకు కేంద్రం రూ.180,000అందజేస్తుందని ఒక వీడియోలో పేర్కొనడం, అది వైరల్ కావడం తెలిసిందే. -
ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 6 శాతం వరకూ అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ, ‘బరోడా తిరంగా డిపాజిట్ పథకం’ పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వినియోగదారులకు అధిక వడ్డీరేటుతో తిరంగా డిపాజిట్ స్కీమ్ అందించడం సంతోషంగా ఉందనీ, అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో బీఓబీ ఒకటని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ప్రకటనలో తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!) 2022 డిసెంబర్ 31 వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. తిరంగా డిపాజిట్ స్కీమ్ వివరాల ప్రకారం, 555 రోజుల కాలవ్యవధికి డిపాజిట్‌పై 6.15శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 0.5శాతం అదనపు వడ్డీని, నాన్-కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద నాన్-కాలబుల్ 555 రోజుల డిపాజిట్ పై 6.65 శాతం వరకూ వరకు వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం 555 రోజులకు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1.26 లక్షల కంటే ఎక్కువే పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 1.28 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. -
మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం ‘సమర్థ్’
International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఈ) సోమవారం ’సమర్థ్’ పేరిట ప్రత్యేక స్కీమును ఆవిష్కరించింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. సమర్థ్ కింద ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా స్కీములు అన్నింటిలోనూ మహిళలకు 20 శాతం సీట్లను ఔత్సాహిక మహిళా ఎంట్రప్రెన్యూర్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. 2022–23లో దీనితో 7,500 మంది పైచిలుకు మహిళలకు ప్రయోజనం చేకూరగలదని ఆయన వివరించారు. ఇక మార్కెటింగ్పరమైన సహకారం అందించే పథకాల్లో భాగంగా దేశ, విదేశ ఎగ్జిబిషన్లకు పంపించే ఎంఎస్ఎంఈ వ్యాపార బృందాల్లో 20 శాతం వాటా మహిళల సారథ్యంలోని సంస్థలకు లభిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2022–23లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)కి సంబంధించిన కమర్షియల్ స్కీముల వార్షిక ప్రాసెసింగ్ ఫీజులో 20 శాతం రాయితీ కూడా మహిళా ఎంట్రప్రెన్యూర్లు పొందవచ్చని పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
పిల్లల కోసం ఎస్బీఐ ప్రత్యేక స్కీము
ముంబై: పదేళ్లకు మించిన మైనర్లు సొంతంగా బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడానికి, లావాదేవీలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన నేపథ్యంలో బాలల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వెల్లడించింది. ‘మైనర్ల అకౌంట్లకు సంబంధించి ఓవర్డ్రాఫ్టులపై ఆంక్షలున్నాయి. ఓవర్డ్రాఫ్టులుంటే వాటిని వసూలు చేయలేం. డిపాజిట్లపై ఆంక్షల్లేవు. బాలల కోసం మూడునెలల్లో ప్రత్యేక పథకాన్ని మేం ప్రారంభిస్తాం’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య గురువారం ముంబైలో మీడియాకు తెలిపారు. బ్యాంకింగ్ సౌకర్యాలను అందరికీ అందుబాటులోకి తేవడమే రిజర్వ్ బ్యాంకు ఉద్దేశమని చెప్పారు. ముందుగా చెల్లించే చర వడ్డీ రుణాలపై ప్రీపేమెంట్ పెనాల్టీ వసూలు చేయవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలు ఎస్బీఐపై ఎలాంటి ప్రభావం చూపుతాయని ప్రశ్నించగా, తమ బ్యాంకులో అలాంటి చార్జీలేవీ లేవని బదులిచ్చారు