న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకు రూ.1.80 లక్షలు ఇస్తోందంటే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఈ వార్తను హైలైట్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ తేల్చి చెప్పింది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ)
వివరాలను పరిశీలిస్తే..
సోషల్ మీడియాలో పుకార్లు,నకిలీ వార్తలకు కొదవే ఉండదు. ఇదిగో తోక ..అంటే అదిగో పులి అంటూ నకిలీ గాళ్లు చెలరేగిపోతారు. తాజాగా అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆడబిడ్డకూ లక్షా, 80వేల రూపాయలు అందిస్తోందని, ఈ మొత్తాన్ని బాలిక తల్లిదండ్రుల ఖాతాలో జమ కానుందంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో స్పందించిన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణచేసి ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. (మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: కొత్త ఆప్షన్స్‌తో పండగే!)
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ వార్త, వీడియో నకిలీవని, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదని పీఐబీ అధికారిక ట్విటర్ ఖాతా తేల్చి చెప్పింది. అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద యోజన అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని కాబట్టి, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఎలాంటి సహకారం అందించే ప్రశ్నే లేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల వలలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా)
'Government Gyan' नामक #YouTube चैनल की एक वीडियो में दावा किया गया है कि केंद्र सरकार 'प्रधानमंत्री कन्या आशीर्वाद योजना' के तहत सभी बेटियों को ₹1,80,000 की नगद राशि दे रही है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 11, 2023
✅ यह वीडियो #फ़र्ज़ी है।
✅ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/y8KRVfxVrF
కాగా ప్రభుత్వ జ్ఞాన్ అనే యూట్యూబ్ చానెల్ ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రతీ అమ్మాయికి తల్లిదండ్రులకు కేంద్రం రూ.180,000అందజేస్తుందని ఒక వీడియోలో పేర్కొనడం, అది వైరల్ కావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment