girl child
-
మహానగరంలో ఏదీ భద్రత?
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి. -
గొంతుకోసి చెత్తకుప్పలోకి విసిరేస్తే..
ఆడబిడ్డ పుట్టిందని ఏ చెత్తకుప్పల్లోనో, గుడిమెట్ల మీద వదిలేసే ఘటనలు చూసే ఉంటారు. కానీ, ఇక్కడ ఓ నాన్నమ్మ వద్దనుకోవడంతోనే ఆగిపోలేదు. అతికర్కశంగా.. తన కొడుకుకు పుట్టిన బిడ్డను గొంతు కోసి చెత్తకుప్పలో పడేసింది. అయితే.. తుంచిన ఆ పసిమొగ్గకు వైద్యులు మళ్లీ ఊపిరిపోసి పునర్జన్మ ప్రసాదించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో.. నెలరోజుల కిందట అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు కోసి చెత్తకుండీలో పడేసింది ఆమె నానమ్మ. రక్తపుమడుగులో చలనం లేని స్థితిలో పడి ఉన్న బిడ్డ దేహాన్ని పోలీసులు భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్ర స్రావం కావడంతో బతకడం కష్టమేనని వైద్యులు భావించారు. అయితే.. పెద్ద అద్భుతమే జరిగింది!. పాప గొంతు కోసినా కీలకమైన ధమనులు, సిరల తెగలేదు. దీంతో పలు శస్త్రచికిత్సలు చేసి ఆమెను బతికించగలిగారు వైద్యులు. మొత్తంగా.. ఆ బిడ్డకు నెల రోజులపాటు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. పైగా ఆ పాపకు పీహూ అని పేరు పెట్టారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో మృత్యువును జయించిన పీహూను రాజ్‌గఢ్‌లోని ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్ తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదుకాగా, నాన్నమ్మ, ఆ పసికందు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మధ్యప్రదేశ్ లాంటి ఘటనల్లో దేశంలోనే ముందుంది. నవజాత శిశువుల్ని రోడ్డున పడేస్తున్న కేసులు అక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ(జాతీయ నేర గణాంకాలు) నివేదికలు చెబుతున్నాయి. -
కీర్తి కథ.. కన్నీటి వ్యథ
తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి’పాప’.. అంగట్లో సరుకుగా మారింది. ఆడపిల్లగా పుట్టడమే పాపమన్నట్లు కన్నతల్లిదండ్రులే చిన్నచూపు చూశారు. కుటుంబం గడవని స్థితిలో చిన్నారిని అమ్మకానికి పెట్టారు. మానవత్వానికి మాయని మచ్ఛగా ఈ ఘటన నిలవకుండా చిన్నారిని అక్కున చేర్చుకుంది నాన్నమ్మ. అయినా పసికందును కష్టాలు వీడడం లేదు. తాను రాలిపోయేలోపు ఆ చిన్నారికి ఏదైనా ఆదరవు చూపాలని ఒంటరి పోరు సాగిస్తున్న పండుటాకు ఆశిస్తోంది. ఆ దిశగా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది. అనంతపురం కల్చరల్: సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఆడపిల్ల జీవితం ఇంకా మధ్య యుగ భావజాలంలోనే కొట్టుమిట్టాడుతోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే గర్భస్థ దశలోనే చిదిమేస్తున్నారు కొందరు. పుట్టిన తర్వాత రోడ్డు పాలు చేస్తున్నారు మరికొందరు. ‘ఆడ పిల్ల ఇంటికి దీపం’.. ‘ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, బతకనిద్దాం’, ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాలు కేవలం రాత‘కోతల’కే తప్ప ఆచరణలో ఏ మాత్రమూ కనిపించడం లేదనేందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలో వెలుగు చూసింది. యాంత్రిక జీవనంలో సాటి మనిషి గురించి ఆలోచించడమే మానేసిన నేటితరం రోజూ తమ కంటి ముందే కనిపిస్తున్న ఈ దయనీయ చిత్రాన్ని గమనించలేకపోతోంది. కన్నపేగునే కాదనుకున్నారు అనంతపురం నగరంలోని పాతూరు మున్నానగర్‌లో నివాసముంటున్న వెంకటలక్ష్మి, బ్రహ్మయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాతికేళ్ల క్రితం బ్రహ్మయ్య మృతిచెందాడు. ఆ సమయంలో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న వెంకటలక్ష్మి ఊరూరా తిరిగి రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు అయిన తర్వాత ఎవరి స్వార్థం వారు చూసుకుని తలో దారికి వెళ్లిపోయారు. కన్నతల్లి వీధి పాలైంది. చిన్న కొడుకుకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో రెండోసారి కొడుకు పుడతాడన్న ఆశతో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టేసరికి విపరీతమైన ద్వేషంతో నెలల పసికందును అమ్మేయడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాన్నమ్మ వెంకటలక్ష్మి రగిలిపోయింది. కుమారుడు, కోడలు నిర్ణయాన్ని కాదని పోలీసుల సాయంతో మనవరాలి పోషణ భారాన్ని తీసుకుంది. చిన్నారికి కీర్తి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఈ క్రమంలో వయస్సు మీదపడుతుండడంతో తాను కాలం చేసేలోపు చిన్నారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తోంది. ఆస్తిపాస్తులేమీ లేక బొరుగుల బండిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆమె ఆశ కలగా మిగిలిపోకుండా మానవతావాదులు స్పందించాలని వేడుకుంటోంది. ఆడబిడ్డను ఆదుకోండయ్యా ‘అయ్యా నా జీవితం ముగిసిపోతోంది. ముగ్గురు కొడుకులు పుడితే వారెవరికీ నా బాగోగులు పట్టలేదు. ఒక్కగానొక్క కుమార్తెను రాజు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తే ఆయన ఊరంతా అప్పులు చేసి భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. నా పరిస్థితి చూసి జాలిపడి బ్యాంకు వాళ్లు బొరుగుల బండి పెట్టించారు. డీఈఓ ఆఫీసు పక్క సందులో సోనోవిజన్ కింద బొరుగులమ్ముకుంటూ బతుకుతున్నా. ఈ పాప (మనవరాలు కీర్తి)ను రోడ్డుపాలు చేసి వెళ్లిపోయిన వారు నా బిడ్డలంటే నాకే అసహస్యంగా ఉంది. ‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!ఇప్పటికైతే పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నా. నా తర్వాత పాపకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుడికి మొక్కుకుంటున్నా. చుట్టుపక్కల వాళ్లు పాపకు పాలో, తిండో ఇచ్చిపోతుంటారు. పాప పెరిగి పెద్దయి బాగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా దాతలు కనికరిస్తే చాలు. సాయం చేయండయ్యా. మీ సాయం వృధా కాకుండా బ్యాంక్‌లో పాప పేరున ఫిక్స్డ్ డిపాజిట్టు చేయిస్తా. లేదా మీరే చేయించండి.’ – వెంకటలక్ష్మి, చిన్నారి నాన్నమ్మ, అనంతపురం -
ఐదేళ్లుగా ఆ పాపకు.. పాలు, నీళ్లే ఆహారం
మార్కాపురం: అన్న ప్రాసన రోజు అందరిలాగే తమ చిన్నారికి సంతోషంగా అన్నంపెట్టారు ఆ దంపతులు. వెంటనే వాంతి (Vomiting) చేసుకుంది. తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. మరుసటిరోజూ అన్నం పెట్టారు. మళ్లీ అదే పరిస్ధితి. ఇలా ఒక నెలరోజులు జరిగే సరికి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పలు కార్పొరేట్ వైద్యశాలలను సంప్రదిస్తే ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి (Rare Disease) సోకిందని వైద్యులు చెప్పారు. అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోవడంతో ఏం తిన్నా వాంతులు అవుతున్నాయని చెప్పారు. పాలు.. నీళ్లు మాత్రమే తాగించాలని వైద్యులు చెప్పడంతో, ఆ చిన్నారి గత ఐదేళ్ల నుంచి పాలు, నీళ్లతోనే బతుకుతోంది. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం వారిది. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని జార్జిఫార్మసీ కళాశాల వెనుక ఉండే మంచా భాస్కర్, కృష్ణవేణి దంపతుల కన్నీటి వ్యధ ఇది. మార్కాపురం (Markapuram) పట్టణంలోనే ఒక ఆసుపత్రిలో భాస్కర్ కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. పాపకు రక్షణ అనే పేరును పెట్టుకున్నా, ఆమె ప్రాణాలకు రక్షణ కల్పించలేని దీనస్థితిలో ఉన్న ఆ దంపతులు దాతల దయ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.8 లక్షలు ఖర్చవుతుందన్నారు...ప్రస్తుతం మా చిన్నారి అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. ఆపరేషన్ చేస్తే ఇబ్బంది తొలగుతుందని వైద్యులు చెప్పారు. అయితే అందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. పాప వైద్యం నిమిత్తం ప్రతి 2 నెలలకు ఒకసారి రాజమండ్రికి వెళ్లి రూ.25 వేలు ఖర్చుపెట్టుకుని వస్తున్నాం. దాతలు స్పందించి వైద్యానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. స్పందించే దాతలు 83743 89936 నంబరుకు సాయం చేయాలని కోరుతున్నాం. – భాస్కర్, రక్షణ తండ్రి చదవండి: పసికందుకు హెల్త్ ప్రాబ్లమ్.. పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రుల యత్నం -
National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?
స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు–ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు. బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా... ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.ఇవీ చదవండి: National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్! – డా‘‘ హెచ్. అఖ్తర్ బాను ‘ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, కర్నూలు(నేడు జాతీయ బాలికా దినోత్సవం) -
National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!
కరాటే అనేది మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు... మహత్తరమైన ఫిలాసఫీ కూడా. ఆ తత్వంలో... మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే... సాహసంతో దూసుకెళ్లే స్ఫూర్తి దాగుంది. అందుకే కరాటే అనే ఆత్మరక్షణ విద్య అత్యవసరం అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వంద విద్యాసంస్థల్లో 30 రోజుల పాటు 50 వేల మంది అమ్మయిలకు కరాటే క్లానుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు...అక్షరక్రమంలోనే కాదు, ఆత్మరక్షణలోనూ అనంతపురం జిల్లాను ముందు వరుసలో ఉంచే లక్ష్యంగా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాఠశాలల నుంచి కాలేజీల వరకు కరాటే క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలసి అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యతోపాటు యోగా, మానసిక వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సామాజిక ఉద్యమకారిణి, తొలితరం ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోని బాలికల పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. (National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?)‘నిజం చెప్పాలంటే కొన్నిరోజుల ముందువరకు ఇల్లు దాటి ఒంటరిగా బయటికి రావాలంటే భయంగా ఉండేది. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయమే దీనికి కారణం. ఒకరోజు మా అక్క ను ఎవరో అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంట్లో చెప్పి ఏడ్చింది. అప్పటినుంచి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందేమోననే భయం ఏర్పడింది. కరాటే క్లాసులకు హాజరు కావడం వల్ల నాలో ఉన్న ఆ భయం పోయింది. ఇప్పుడు నేను నిశ్చింతగా బయటికి వెళుతున్నాను. ఎవరైనా కామెంట్ చేస్తే వారిని ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది పల్లవి.‘కరాటే నేర్చుకోవడం అనేది ఎవరినో భయపెట్టడానికి కాదు. మనం ధైర్యంగా ఉండడానికి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యల వల్ల క్రమశిక్షణ, ఆరోగ్య స్పృహ పెరుగుతుందనేది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను’ అంటుంది శ్రీలత. (National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!)‘మా అమ్మాయికి ఎంసెట్ కోచింగ్ ఇప్పటినుంచే ఇప్పిస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకునే తల్లిదండ్రులను, ‘అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు!’ అని ఆశ్చర్యపడేవాళ్లను ఎందరినో చూస్తుంటాం. పల్లవి, శ్రీలత, ఆఫ్రోజ, భార్గవి.. లాంటి అమ్మాయిల మనసులో మాట విన్నప్పుడు కరాటే నుంచి యోగా వరకు శిక్షణ తరగతులు నిర్వహణ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.– ఖాజీ హిదాయతుల్లా, సాక్షి, అనంతపురం సిటీఎప్పుడు ఏ ఆపద వచ్చినా...జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది అమ్మాయిలను ఆత్మరక్షణ విద్యలో ఆరితేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ప్రతి మండలం లో కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నాం. నాలుగు రిసోర్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటికి వీరవాహిని, బలప్రభ, సురసేన, శక్తిసేనగా నామకరణం చేశాం. సంక్షేమ శాఖ, కరాటే అసోసియేషన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ప్రతి టీమ్‌ను పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. పది నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు టీ నేజ్ అమ్మాయిలకు వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నాం. – బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్, అనంతపురంఅదృష్టంగా భావిస్తున్నా...కరాటే, యోగా, మానసిక వికాసం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఉచితంగా శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా ఆకతాయులు నా జోలికి వస్తే తోక ముడిచి పరుగెత్తేలా చేయగలననే నమ్మకం వచ్చింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తే మరింత బాగుంటుంది.– జి. భార్గవి, ఇంటర్ విద్యార్థిని, రాప్తాడుసెల్ఫ్–డిఫెన్స్సాహసానికి జెండర్ భేదం లేదు. అయితే కొన్ని ఆటలు మాత్రం ‘పురుషులకు మాత్రమే’ కోట గోడలలో బంధీలై పోయాయి. ఇప్పుడు ఆ కోటలు బ్రద్దలవుతున్నాయి. తమిళనాడులో ‘ఇలవట్ట కల్’ అనేది పురాతన ఆట. పెద్ద పెద్ద గుండ్రాళ్లను ఎత్తి పడేసే ఈ ఆటలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలు ప్రేక్షక΄ాత్రకే పరిమితం అయ్యేవారు. ఈసారి మాత్రం మేము సైతం అంటూ ‘ఇలవట్ట కల్’లో మహిళలు సత్తా చాటారు. భవిష్యత్ తరాలకు తరగని ఉత్సాహాన్ని ఇచ్చారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈసారి మహిళల కోసం ‘ఇలవట్ట కల్’ ప్రత్యేకంగా నిర్వహించారు. 47 కేజీలు, 67 కేజీల విభాగంలో మహిళలు సత్తా చాటారు. ఎత్తే సత్తా ‘ఇలవట్ట కల్’ ΄ోటీలలోపాల్గొన్న భవధరణి 67 కేజీల బరువు ఉన్న రాతిగుండును ఏకంగా రెండు సార్లు అలవోకగా ఎత్తిపడేసి మొదటి బహుమతిని గెలుచుకుంది. ‘ఈ ΄ోటీలలో ΄ాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి... సంప్రదాయంగా వస్తున్న ఆటలను కాపాడుకోవడం. రెండు... ఇలవట్ట కల్లో మహిళలు కూడా సత్తా చాటగలరు అని నిరూపించడం’ అంటుంది భవధరణి.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
కూతురి కోసం మంచి పథకం
ఎందెందు వెదికిన అందందు కలదె మగువా.. అని నేటి రోజుల్లో మహిళలు ప్రవేశించని రంగమంటూ లేదు. అయినా ఏదో తెలియని వెలితి. లింగ వివక్ష, ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇప్పటికీ దేశంలో చాలాచోట్ల మహిళల పురోగతికి అవరోధంగానే నిలుస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 4.5 కోట్ల మంది పేదరికంతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల పల్లెల్లో అమ్మాయిల్ని మధ్యలోనే చదువు మాన్పించేయడం, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేయడం వంటి అంశాలు ఈ పేదరికానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పురోభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్నాయి. ఇలాంటివాటిలో బాలికల ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకమే ‘సుకన్య సమృద్ధి యోజన’. దేశంలో లక్షలాది బాలికలకు సాధికారత కల్పించే ఈ పథకం సరిగ్గా పదేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గత నవంబర్ నాటికి 4.10 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభమయ్యాయి.ఇది ఎలా పనిచేస్తుంది?ఇదొక పొదుపు పథకం. ఇంట్లో అమ్మాయి పుట్టిన వెంటనే ఖాతా తెరవచ్చు.అంతేకాదు ఆమెకు పదేళ్లు వచ్చేవరకు ఏ సమయంలోనైనా ఖాతాను ప్రారంభించవచ్చు.కనీసం రూ.250తో ఈ పథకాన్ని అమ్మాయిల పేరిట తల్లిదండ్రులు/ సంరక్షకులు తెరవవచ్చు.ఖాతా తెరిచినప్పటి నుంచి ప్లాన్ మెచ్చూర్ అయ్యేవరకు లేదా ఖాతా మూసివేసే వరకు ఈ పథకం ప్రయోజనాలు అమ్మాయికే చెందుతాయి. ప్రతి అమ్మాయికీ ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.తల్లిదండ్రులు తమ అమ్మాయిల కోసం గరిష్టంగా రెండు ఖాతాలను తెరవవచ్చు.కొన్ని సందర్భాల్లో ప్రత్యేక మినహాయింపు పొందవచ్చు. అదెలాగంటే కవలలుపుట్టినా, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా సంబంధిత ఆధారాలను సమర్పించడంద్వారా ఈ ప్రయోజనాన్ని దక్కించుకోవచ్చు.అవసరమైతే ఈ ఖాతాను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.ఖాతా తెరవాలంటే ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు శాఖలో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.ఖాతా తెరవడానికి పుట్టిన అమ్మాయి తాలూకు జనన ధ్రువీకరణ పత్రం, నివాస రుజువు సమర్పించాలి.కనీస డిపాజిట్ రూ.250. ఆపై రూ.50 చొప్పున అంటే 300, 350, 400, 450, 500..ఇలా మన స్థోమతను బట్టి డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ డిపాజిట్ పరిమితి రూ.1,50,000 మించకూడదు. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లవచ్చు.ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చేవరకు ఈ ఖాతా నిర్వహణ తల్లిదండ్రులు, సంరక్షకులు చేతుల్లోనే ఉంటుంది.ఇది పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినందున ఎప్పుడుపడితే అప్పుడు ఈ పథకం నుంచి సొమ్ములు విత్ డ్రా చేయడానికి వీలుండదు.ఇక 18 ఏళ్లు నిండిన అమ్మాయి, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను తన అజమాయిషీలోకి తీసుకోవచ్చు. నెలవారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. దీన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమ చేస్తారు.ఖాతాదారుకు 21 ఏళ్లు పూర్తి అయ్యాక ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని ముందుగానే మూసివేసే సౌలభ్యం ఉంది. అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి, 21 ఏళ్ల లోపే పెళ్లి చేయాలనుకుంటే పథకం మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేయవచ్చు. దీనికి తగిన ఆధారాలను సమర్పించాలి.ఒకవేళ పైచదువులకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు కూడా కొంత సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఖాతాదారు పదో తరగతి పూర్తి చేసి లేదా 18 ఏళ్లు నిండినా (వీటిలో ఏది ముందయితే అది) అంత క్రితం ఆర్థిక సంవత్సరం చివరి వరకు జమ అయినా మొత్తంలో సగం వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా తగిన ఆధారాలను సమర్పించాలి.ఈ విత్‌డ్రాలను ఒకేసారి గానీ, ఏడాదికోసారి చొప్పున అయిదేళ్లపాటు గానీ చేసుకోవచ్చు.ఒకవేళ ఖాతాదారు అకాల మరణం చెందితే డెత్ సర్టిఫికెట్తో దరఖాస్తు సమర్పించి ఖాతా మూసివేయవచ్చు. అప్పటివరకు ఉన్న బ్యాలెన్స్, వడ్డీలను తల్లిదండ్రులు/ సంరక్షకులకు చెల్లిస్తారు.ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేదా సంరక్షుకులు చనిపోయి, ఖాతా నిర్వహించలేని సందర్భాల్లోనూ ముందుగానే ఖాతాను మూసివేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన తొలి ఐదేళ్లలో మాత్రం ఇలా మూసివేయడానికి కుదరదు.ఈ పథకం కింద డిపాజిట్ చేసే మొత్తాలపై వచ్చే వడ్డీకి, మెచ్యూర్ అయ్యాక వచ్చే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీ 8.2 శాతం.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లుకేవలం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్లకు విద్యా విషయంలోనూ, ఆర్థిక స్వతంత్రతలోనూ స్వావలంబన చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైందే సుకన్య సమృద్ధి యోజన పథకం. ముఖ్యంగా చిన్న స్థాయి ఆదాయవర్గాల వారికి తమ పిల్లలపై చదువులకు అప్పటికప్పుడు పెద్ద మొత్తాలు అప్పులు చేయాల్సిన అవసరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే తమ అమ్మాయిల పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు విషయంలోనూ ఈ సొమ్ములు చాలావరకు ఆదుకోగలుగుతాయి. తల్లిదండ్రులు దీన్నొక మంచి పథకం కింద భావించి ముందడుగు వేయొచ్చు.- బెహరా శ్రీనివాస రావు, ఆర్థిక నిపుణులు -
#HBDYSJAGAN అక్కాచెల్లెమ్మలకు అండగా, జగన్ మామగా..!
వైఎస్ జ‘గన్’.. ఆ పేరులోనే ఉంది డైనమిజం. జగన్ అంటే జన ప్రభంజనం. జగనన్నగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి రాజకీయ చతురతతో, పాలనా దక్షతతో అనతి కాలంలోనే డైనమిక్ లీడర్‌గా ఎదిగి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందిన తీరు ఆదర్శప్రాయం.మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ది ముడి పడి ఉందని నమ్మి అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా, మున్నపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆడబిడ్డకు ప్రయోజనం చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు జగనన్న. ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో విద్యార్థినులు విజయపతాకను ఎగురేసేలా విప్లవాత్మక అడుగు వేశారు ‘జగన్ మామ’. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన చరిత్ర ఆయనది. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా, జగనన్న పెళ్లి కానుక, ఇంకా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చారు. అంతేకాదు రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ మహిళా నేతలకు పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. మహిళా భద్రతకు భరోసా ఇచ్చిన ‘దిశ యాప్’ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.అంతేనా.. 2019 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ 'నవరత్నాలు' అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిన జననేత. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత జన నీరాజనాలు అందుకొని, సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొంది, రాజకీయ జీవితంలో శిఖరాలను అధిరోహించినా... ఆయన చూపు జనం మీదనే. ఏ కష్టం కాలం వచ్చినా, తక్షణమే బాధితులకు అండగా నిలబడ్డారు. అకాల వర్షాల్లో రైతులకు భరోసా ఇచ్చినా, వరదల్లో బాధితులకు నేనున్నాంటూ అండగా నిలబడినా, విద్యార్థులకు, మహిళలకు, ఒకరనేమిటి, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు నభూతో నభవిష్యతి. రాజకీయ జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఒదిగి ఉండే నైజం ఆయనది. అంతేకాదు తాజా ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆయన ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ పరిణామానికి సాకులు వెదకలేదు. ఎవర్నీ నిందించలేదు. అత్యంత నిబ్బరంతో ప్రజల ముందుకొచ్చిన వైనమే ఇందుకు నిదర్శనం.పదవి, అధికారంతో సంబంధం లేకుండా, తానెప్పుడూ బాధితుల పక్షమేననీ, జనంతోనే పయనం, జనం కోసమే పోరాటం అంటూ ప్రకటించిన పోరు పతాక వైఎస్ జగన్. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటూ, ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న జననేత జగన్. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై గళం విప్పడంలో మహిళలకు అండగా నిలబడటంలో అప్పుడూ, ఇప్పుడూ అదే తెగువ.. అదే నిబద్ధత!అప్పుడైనా,ఇప్పుడైనా, ఎప్పుడైనా... జగన్ అంటే జనప్రభంజనం అంటోంది బడుగు బలహీన లోకం.ఆనాటి పాదయాత్ర నుంచి నిన్నామొన్నటి కర్నూలు పర్యటన దాకా జగన్ వెంటే జనం, జనంతోనే జగన్ అంటోంది మహిళాలోకం.జగన్ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటోంది చిన్నారి లోకం. -
కూతురు పుట్టిందని.. సెల్ఫోన్లు పంచిపెట్టారు!
సారంగాపూర్: కూతురు పుట్టడంతో.. మహాలక్ష్మి పుట్టిందని ఆ దంపతులు సంబరపడ్డారు. తమ సంతోషాన్ని పదిమందితో పంచుకోవాలని సంకల్పించారు. ఈ మేరకు వారు సోమవారం గ్రామంలోని 25 మంది ఆటో డ్రైవర్లకు రూ.3.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు బహూకరించారు. మరో 1,500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దీనికి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ వేదికగా మారింది. గ్రామానికి చెందిన ఓగుల అజయ్, అనీల దంపతులకు 18 రోజుల క్రితం కూతురు జన్మించింది. దీంతో తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆ సంతోషంతో గ్రామంలోని ప్రతి ఆడబిడ్డకు (1,500 మంది మహిళలకు) ఇటీవల చీరలు పంపిణీ చేశారు. తాజాగా ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కటి రూ.14 వేల విలువైన సెల్‌ఫోన్ అందజేశారు.అజయ్ పెళ్లికి ముందు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. తరువాత స్వదేశానికి వచ్చిన ఆయన.. శ్రీకృష్ణ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువుకు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఆలయాల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. చదవండి: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు -
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే తెలుసా? సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే!
ప్రసవం తరువాత మహిళలకు భర్తతో పాటు, కుటుంబ సభ్యుల తోడు, సహకారం చాలా అసవరం. బిడ్డల సంరక్షణలో ఇంట్లోని పెద్దల మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది. లేదంటే కొంతమందిలోఅనేక సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు:డాక్టరు గారూ! మా అమ్మాయికి 24 ఏళ్లు. నాలుగు వారాల కిందట సిజేరియన్ ద్వారా మొదటి కాన్పులో మగబిడ్డను ప్రసవించింది. పిల్లవాడు కొంచెం బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని డాక్టర్ చెప్పారు. అయినా మా అమ్మాయి మొహంలో సంతోషం లేదు. తరచూ ఏడవటం, కంటినిండా నిద్రపోకవడం, ఆ బిడ్డను సరిగా పెంచలేనని బాధపడటం, భారంగా భావించడం, బిడ్డను ఏమైనా చేసి తాను కూడా చనిపొతే బాగుండునని మాటిమాటికీ దుఃఖించడం చేస్తోంది. మా అల్లుడు, మేమంతా కూడా ఆమెకు ఎంత ధైర్యం చెప్పినా, అలాగే బాధపడుతోంది. తను ఎందుకు ఇలా ఉంటోందో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పి. విజయలక్ష్మి, హైదరాబాద్మీ కూతురి విషయంలో మీరు పడే బాధ నేనర్థం చేసుకోగలను. మీ అమ్మాయి ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అనే మానసిక రుగ్మతకు లోనయినట్లు అర్థమవుతుంది. ప్రసవానంతరం 15 శాతం మంది స్త్రీలలో ఈ సమస్య వచ్చే అవకాశముంది. ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, మెదడులో వచ్చే రసాయనిక మార్పులు, వారసత్వ లక్షణాలూ ఇందుకు ముఖ్య కారణాలు. ప్రసవం తర్వాత ఒకటి రెండువారాలు కొంచెం డల్‌గా దిగాలుగా ఉండటం (పోస్ట్ పార్టమ్ బ్లూస్) కొంత సాధారణమైనప్పటికీ, మీ అమ్మాయికి వచ్చిన సమస్యను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుంది.మీరు వెంటనే దగ్గర్లోని మానసిక వైద్యునికి చూపిస్తే వారు కౌన్సెలింగ్, మందుల ద్వారా చికిత్స చేస్తారు. ఆమెలో ఆత్మహత్య భావాలున్నాయన్నారు కాబట్టి, అవసరమైతే అలాంటి వారిని కొన్నాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయించి మరింత గట్టి వైద్యం చేయించాల్సి ఉంటుంది. ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు బిడ్డ సంరక్షణ మీరు తీసుకుని, తల్లి నుంచి బిడ్డకు ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్య చికిత్స, కుటుంబ సభ్యుల సహకారంతో మీ అమ్మాయి పూర్తిగా కోలుకుంటుంది. డోన్ట్ వర్రీ! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి... పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సనా సయ్యద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వెల్కమ్ టూ బేబీ గర్ల్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. గత నెలలోనే తన భర్తతో కలిసి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. బుల్లితెర నటి సనా సయ్యద్ ప్రముఖ సీరియల్ కుండలి భాగ్యతో ఫేమస్ అయింది. ఈ సీరియల్లో పల్కీ పాత్రను పోషించింది. తాజాగా సనా సయ్యద్ తనకు కుమార్తె పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రెగ్నెన్సీ తర్వాత కుండలి భాగ్య సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో అద్రిజా రాయ్‌ని తీసుకున్నారు. అంతే కాకుండా సనా సయ్యద్ దివ్య దృష్టి వంటి షోలలో కూడా కనిపించింది. ఆమె 2021లో ఇమాద్ షమ్సీని వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sana Sayyad (@sana_sayyad29) -
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్‌బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
నా బిడ్డను ఎవరైనా తీసుకోండి
చిక్కబళ్లాపురం: జిల్లాలోని బాగేపల్లి తాలూకా మరసనహళ్లి గ్రామంలో నివాసముంటున్న రాజమ్మ అనే మహిళ ఆడబిడ్డను ఎవరైనా దత్తత తీసుకోండి అని ప్రాధేయ పడుతోంది. భర్త లక్ష్మినారాయణ వేధింపులే ఇందుకు కారణం. వీరికి ఒక ఆడకూతురు ఉంది. ఇటీవల రెండో కాన్పులోను ఆడ శిశువు జన్మించింది. అప్పటినుంచి భర్త, అత్తమామలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని తెలిపింది. చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పసికందుతో వచ్చి తన బిడ్డను ఎవరైనా దానం తీసుకోవాలని మొర పెట్టుకుంది. ఆమె దీనస్థితిని చూసినవారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు లేని రాజమ్మ ఇటు భర్త ఆసరా లేక, ఇద్దరు బిడ్డలను పోషించేదెలా అని వాపోయింది. తాను గర్భిణిగా ఉండగా భర్త బాగా చూసుకొనేవారు, మగపిల్లాడు పుడతాడని చాలా ఆశతో ఉన్నారు, అయితే ఆడబిడ్డ పుట్టగానే తాత్సారంగా చూస్తున్నారు, నాకు చాలా బాధ కలుగుతోంది అని ఆమె విలపించారు. -
National Girl Child Day 2024: మాటలు కాదు చేతలు కావాలి: ఆనంద్ మహీంద్ర
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పారిశ్రామిక వేత్త ఆనంద్ మహాంద్ర ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమ్మాయిలకు చిన్న చేయూత దొరికితే కాలు అద్భుతాలు చేసి చూపిస్తారనే సందేశంతో ఈవీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. అద్భుత విజయాలు చిన్న సపోర్ట్, సాయం చాలు. ఇది మాటల్లోకాదు చేతల్లో అనునిత్యం ప్రతీ రోజు సాగాలి. ప్రతిరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డేనే అంటూ నాన్హి కాలీ అధికారిక హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోను తన అభిమానుల కోసం షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర. సెజు అనే అమ్మాయి సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో పొందుపర్చింది. ఫుట్‌బాల్ అంటే ఇష్టమున్న సెజును టోర్నమెంట్లో ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సెజు లేకుండానే పోటీలకు వెళ్లిన జట్టు కప్పు గెల్చుకుని వస్తుంది. ఈ విజయాన్ని గ్రామస్తులంతా సంబరం చేసుకుంటారు. ఇది చూసి..తన బిడ్డ కలల్ని అడ్డుకున్నది తామేనని గుర్తిస్తారు తల్లిదండ్రులు. అంతేకాదు ఇంకెపుడూ ఆమె ఆశలకు, కలలకు అడ్డు రాకూదని నిర్ణయించుకుంటారు. ఫలితంగా సెజు పుట్‌బాల్ క్రీడకే కాదు.. తను పుట్టిన గడ్డకు కూడా పేరు తీసుకొస్తుంది. మహీంద్ర అండ్ మహీంద్ర ఆధ్వరంలోని నాంది ఫౌండేషన్‌తో పాటు, నాన్హి కాలీ ప్రాజెక్ట్ భారతదేశంలోని ప్రతి నిరుపేద బాలికా విద్య, గుర్తింపు పొందే హక్కును పొందేలా చేస్తుంది. బాలికా విద్యకు మద్దతిస్తుంది. సెజు లాగా, లక్షలాది మంది అమ్మాయిల కలలు ప్రాజెక్ట్ నాన్హి కాలీ ద్వారా కౌన్సెలింగ్, యువతులు, వారి తల్లిదండ్రులకు మద్దతిస్తుందని నాన్హి కాలీ ట్విటర్ ద్వారా తెలిపింది. A little support goes a long way! Despite her talent, Seju, a young girl, was not allowed to join her football team in a tournament. However, when the team returned, it changed everything. Watch the video to know what happened. Like Seju, the dreams of lakhs of girls are… pic.twitter.com/dQlCbsoRuP — nanhikali (@NanhiKali) January 24, 2024 -
National Girl Child Day 2024: ఎదగాలి.. చదవాలి!
ప్రతీ ఏడాది జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడటం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జాతీయ బాలికా దినోత్సవ చరిత్ర: మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 24 జనవరి 2008న జరుపుకున్నారు. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి చిహ్నంగానే మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రో జాతీయ బాలికా దినోత్సవాన్ని మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు. ఆ తరువాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి ఇమేజ్(CSR) సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా 2015లో బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరతరాలుగా వేళ్లూనుకొని ఉన్న ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు తల్లి గర్భంలో ఉండగానే ఆడపిల్లల పట్ల వివక్ష ప్రారంభ మవుతుంది. ఇందుకు నిదర్శనమే ఆడ భ్రూణహత్యలు, శిశుహత్యలు. ఆడపిల్లను భారంగా, మగబిడ్డను ఉద్ధరించేవాడిగా పరిగణించే పరిస్థితి కుటుంబం నుంచే మొదలవుతుంది. నిర్లక్ష్యం, చిన్నచూపు బాలికల అభివృద్ధికి వారి సాంస్కృతిక సాంఘిక, ఆర్థిక, సామాజిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తోంది. లింగ అసమానతతోపాటు విద్య ,ఆరోగ్య సంరక్షణ వంటి అనేక అంశాల్లో వివక్ష, బాల్య వివాహాలు బాలికల పాలిట శాపంగా మారుతోంది. తరాలు మారుతున్నా ఈ పరిస్థితి ఇంకా సమసిపోలేదు. పైగా వెర్రితలలు వేస్తోంది. పేదరికం, బాల్య వివాహాలు ,ఇతర సామాజిక కారణాల వల్ల అసలు విద్యకే నోచుకోవడం లేదు. మరికొంతమంది చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. ఫలితంగా అది బాల్య వివాహానికి దారి తీస్తోంది. ప్రపంచంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో మనది మూడోస్థానం. బాలికల కల ప్రతి అమ్మాయికి, ఆమె నేపథ్యం లేదా పరిస్థితితో సంబంధం లేకుండా, ఆరోగ్యసంరక్షణ, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలుండాలి.బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు. ఈ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక సంస్థలు జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపు కుంటారు. సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా, హాయిగా ఎదిగే అవకాశాలు, ఎలాంటి హింస, వివక్ష, వేధింపులు లేని సమాజమే నేటి ఆడపిల్లల కల. ఈ కల పండే రోజు త్వరలోనే రావాలని, ఆశల రెక్కలు విప్పుకొని మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరమూ కోరుకుందాం. మహిళలకు అవకాశం ఇవ్వాలేగానీ, కుటుంబం, సమాజం, సంస్థల్ని చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, ఎదగనిద్దాం..చదవనిద్దాం!! ఇదే ప్రతి పౌరుడి నినాదం కావాలి.కుటుంబం, సమాజం, సంస్థల్ని దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు. మన జీవితాలకు అర్థం..పరమార్థం..శాంతి.. శ్రేయస్సుతోపాటు ఎనలేని ప్రేమను అందించే బంగారు తల్లులు మన ఆడబిడ్డలు. -
ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేస్తున్నారు
జననాల్లో బాలిక నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. చదువు, సంస్కారం ఉన్నవారు సైతం అమ్మాయిపై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా.. ప్రమాదం నుంచి మాతృత్వాన్ని కాపాడలేక పోతున్నారు. వరంగల్ నగరంతో పాటు జిల్లాలో ఈ ఏడాది మే ఒకటి నుంచి ఆగస్టు 22 వరకు 3,830 మంది శిశువులు జన్మించారు. ఇందులో 2,045 మంది మగ శిశువులు ఉంటే.. ఆడపిల్లలు 1,785 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి పరిశీలిస్తే 260 సంఖ్య తేడా కనిపిస్తోంది. ఇది జిల్లా వైద్యారోగ్య అధికారిక గణాంకాల ప్రకారమే. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయనడానికి ఈ లెక్క లే నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మే 29న లింగ నిర్ధారణ పరీక్షలతో సంబంధమున్న ప్రభుత్వ వైద్యులతో సహా 18 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ వరంగల్ నగరంతో పాటు నర్సంపేట తదితర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విభాగాధికారుల నిర్లక్ష్యంతోనే ఆయా ఆస్పత్రులు, క్లినిక్, స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రైట్ అథారిటీ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంలో దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లకు అనుమతిచ్చారు. 2001 నుంచి పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయినవి 102 ఉంటే.. 68 మాత్రమే నడుస్తున్నాయని, 34 నడవడంలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. కేసీఆర్ కిట్ ప్రకారం జిల్లాలో 1,000 మంది మగ పిల్లలకు ఆరేళ్ల పిల్లలు 873 మంది మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటు ఆస్పత్రులు, అటు స్కానింగ్ కేంద్రాల్లోని బోర్డులపై లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ప్రదర్శిస్తున్నా కొందరు వైద్యుల కాసుల కక్కుర్తితో ఆడపిల్లలను కడుపులోనే చిదిమేస్తున్నారన్న విషయాన్ని మూడు నెలల క్రితం పోలీసుల దాడుల్లో పట్టుబడిన లింగ నిర్ధారణ ముఠాతో బహిర్గతమైంది. అయినా ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడికక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆపై భ్రూణహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లావైద్యారోగ్య అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పరీక్షలు, భ్రూణ హత్యలు..! వివక్ష వేళ్లూనుకుంటోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. భ్రూణ హత్యలు ఆగట్లేదు. కొన్నాళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆడశిశువుల జననాలు తగ్గుతున్నాయి. ఇటీవల లింగ నిర్ధారణ ముఠా అరెస్టయినా.. మరికొన్ని చోట్ల యథేచ్ఛగా ఈదందా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాలకు ‘అమ్మ’ కరువయ్యే ప్రమాదం ఉంది. లింగ వ్యత్యాసంపై అధ్యయనం చేస్తాం.. దుగ్గొండి మండలంలో 95 మంది మగ పిల్లలు పుడితే 68 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా గీసుగొండ మండలంలో 96 మంది మగపిల్లలు పుడితే 111 మంది ఆడ పిల్లలు జన్మించారు. లింగ వ్యత్యాసం అధికంగా ఉన్న మండలాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాల గురించి వివరిస్తాం. అలాగే ఆస్పత్రులు, స్కానింగ్ సెంట ర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచుతాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి, వరంగల్ -
నా కోరిక నెరవేరింది.. చిట్టి పాదాల పారాణి ముద్రలతో స్వాగతం! మనసుకు హాయి..
మా ఇంటి మహాలక్ష్మి ఆడపిల్లపుట్టిందని సంబరం చేశారు. ఇంట్లోకి పూలతో రహదారి పరిచారు. చిట్టి పాదాల పారాణి ముద్రలు వేశారు. అమ్మాయి పుడితే ఇలా స్వాగతం పలకండి. ‘ఆడదే ఆధారం... మన కథ ఆడనే ఆరంభం...’ అంటూ పాడుకునే నేల మనది. ఆడపిల్ల పుట్టగానే గొంతులో వడ్ల గింజలు వేసిన నేల కూడా ఇది. తల్లి గర్భంలోనే శిశువును గుర్తించి పుట్టకముందే ప్రాణం తీస్తున్న పాపాలకూ కొదవలేదు. ఇక ఆడపిల్లను కన్నతల్లికి ఎదురయ్యే కష్టాలను ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆడపిల్ల పుట్టింది... అనగానే కోడలిపై చిర్రుబుర్రులాడే అత్తలు, భార్య–బిడ్డల ముఖం చూడని మగవాళ్లు ఉన్న సమాజం మనది. ఇన్ని దారుణాల మధ్య ఓ సంతోషవీచిక వెల్లివిరిసింది. పుట్టింది ఆడపిల్ల అని తెలియనే పండుగ చేసుకున్నారు. ఊరూ వాడా అందరినీ పిలిచి వేడుక చేసుకున్నారు. అమ్మమ్మగారింట్లో రెండు నెలలు పూర్తి చేసుకున్న బిడ్డ మూడవ నెల నానమ్మ దగ్గరకు ప్రయాణమైంది. ఆ బిడ్డనెత్తుకుని అత్తగారింటికి వచ్చిన తల్లికి పూలబాట పరిచారు అత్తింటివాళ్లు. పాపకు ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డ పుట్టడం అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావడమేనన్నారు. ఆదర్శంగా నిలిచిన కుటుంబం తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కే సముద్రం మండలం, తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడగంటి శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతుల ఆదర్శవంతమైన ఆత్మీయత ఇది. పాపాయి కోసం పూజలు కోడలు గర్భిణి అని తెలియగానే మగ పిల్లవాడు పుట్టాలని అనుకుంటారు. కానీ భద్రకాళి కుటుంబీకులు మాత్రం ఆడపిల్ల కావాలని పూజలు చేశారు. వాళ్ల పెద్దకొడుకు సాయి కిరణ్‌కు సిరిసిల్ల పట్టణానికి చెందిన సంహితతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. సంహిత నెలతప్పినప్పటి నుంచి భద్రకాళితోపాటు ఆమె తోడికోడలు సుమ, మరదలు రమ్య కూడా ఆడపిల్లలు పుట్టాలని వ్రతాలు, పూజలు చేశారు. వాళ్లందరికీ మగపిల్లలే. ఈ తరంలోనైనా ఇంట్లో ఆడపిల్ల కావాలని వాళ్ల కోరిక. ప్రసవం రోజు వరంగల్‌లో ఆసుపత్రికి ఇంటిల్లిపాది తరలి వెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంతోషంగా కేకలు వేస్తూ, హాస్పిటల్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అపూర్వ స్వాగతం కోడలు పుట్టింటికి వచ్చిన రోజు ఇంటిని పూలతో అలంకరించారు. ముత్తయిదువలతో స్వాగతం పలికారు. చిన్నపాప కాళ్లకు పారాణి రాసి తొలి అడుగుల గుర్తులు నట్టింట్లో ముద్రించుకున్నారు. ఆ అడుగులను కళ్లకు అద్దుకున్నారు. ఆ జ్ఞాపకం కలకాలం నిలిచి ఉండడానికి ఫొటోలు తీశారు. నా కోరిక తీరింది నాకు చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టం. మా వారు కూడా ఆడపిల్ల ఉన్న ఇంటి అందమే వేరు అంటూ ఉంటారు. అందుకోసమే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడ పిల్లలను ప్రతి పండుగకు పిలుస్తాం. వారు చేసే సందడి చూసి సంబుర పడుతాం. మా ఇంట్లో ఆడపిల్ల ఉండాలనే కోరిక నెరవేరింది. అందుకోసమే అలా స్వాగతం పలికాం. – భద్రకాళి, పాపాయి నానమ్మ – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
Factcheck ఈ స్పెషల్ స్కీం కింద ప్రతీ ఆడబిడ్డకూ 1.80 లక్షలు? నిజమా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకు రూ.1.80 లక్షలు ఇస్తోందంటే ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఈ వార్తను హైలైట్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని పీఐబీ తేల్చి చెప్పింది. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ) వివరాలను పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో పుకార్లు,నకిలీ వార్తలకు కొదవే ఉండదు. ఇదిగో తోక ..అంటే అదిగో పులి అంటూ నకిలీ గాళ్లు చెలరేగిపోతారు. తాజాగా అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆడబిడ్డకూ లక్షా, 80వేల రూపాయలు అందిస్తోందని, ఈ మొత్తాన్ని బాలిక తల్లిదండ్రుల ఖాతాలో జమ కానుందంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో స్పందించిన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణచేసి ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. (మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: కొత్త ఆప్షన్స్‌తో పండగే!) పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్త, వీడియో నకిలీవని, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదని పీఐబీ అధికారిక ట్విటర్ ఖాతా తేల్చి చెప్పింది. అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద యోజన అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని కాబట్టి, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఎలాంటి సహకారం అందించే ప్రశ్నే లేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల వలలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వచ్చేసింది! భారీ డిస్కౌంట్ కూడా) 'Government Gyan' नामक #YouTube चैनल की एक वीडियो में दावा किया गया है कि केंद्र सरकार 'प्रधानमंत्री कन्या आशीर्वाद योजना' के तहत सभी बेटियों को ₹1,80,000 की नगद राशि दे रही है#PIBFactCheck ✅ यह वीडियो #फ़र्ज़ी है। ✅ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/y8KRVfxVrF — PIB Fact Check (@PIBFactCheck) March 11, 2023 కాగా ప్రభుత్వ జ్ఞాన్ అనే యూట్యూబ్ చానెల్ ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రతీ అమ్మాయికి తల్లిదండ్రులకు కేంద్రం రూ.180,000అందజేస్తుందని ఒక వీడియోలో పేర్కొనడం, అది వైరల్ కావడం తెలిసిందే. -
International women's day 2023: ‘ఆమె’ కోసం ఇలా చేస్తే రూ. 25 లక్షలు మీ సొంతం!
ఆడబిడ్డల పుట్టుకే ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో వారికి ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛను ఇచ్చి ఆత్మగౌరవంతో ఎదిగేలా చేయడం చాలా అవసరం. తద్వారా అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా, వారిని ఆర్థిక భారంగా భావించకుండా, భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలందేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతో వచ్చిందే ‘సుకన్య సమృద్ధి యోజన’. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక పథకం, ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం. కేంద్రం ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం,రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం బేటీ బచావో, బేటీ పఢావో. ఇందులో భాగంగా తీసుకొచ్చిన పొదుపు పథకమే సుకన్య సమృద్ధి యోజన. స్పెషల్‌గా అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అందించారు. సుకన్య సమృద్ధి యోజన (SSY) 2015లో ప్రారంభించింది ప్రభుత్వం. దీని సాయంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్ల కోసం అధీకృత వాణిజ్య బ్యాంకు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ఆదాయం లభించనుంది. ఈ ఆదాయాన్ని మనం పెట్టిన పెట్టుబడి , వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. సుకన్య సమృద్ధి యోజన - అర్హత అమ్మాయి తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి అమ్మాయికి పదేళ్లకు మించి ఉండకూడదు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబానికి ఇద్దరు కుమార్తెలకు మాత్రమే అవకాశం సుకన్య సమృద్ధి యోజనకు అర్హత పొందిన తర్వాత అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని కాలిక్యులేటర్లో నమోదు చేయాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. అంటేకేవలం రూ.250తో సుకన్య ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అలాగే గరిష్టంగా నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. అకౌంట్ తెరవొచ్చు. ఈ ఖాతా తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత పాక్షికంగా కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి నగదు మన సొంతం అవుతుంది. ఇంతకు ముందు కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండేది. అయితే, భారత ప్రభుత్వం జూలై 2018లో దీన్ని రూ.250కి తగ్గించడం గమనార్హం. ఉదాహరణకు, 10 సంవత్సరాలకు 7.6శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 8,333 (సుమారుగా) చొప్పున ఏడాదికి లక్షరూపాయల పెట్టుబడి పెట్టారనుకుందాం. మీకు వడ్డీతో కలిపి రూ.15,29,458లు చేతికి అందుతాయన్న మాట. అదే నెలకు రూ. 5 వేలు చొప్పున 21 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా (రూ.25,59,142) వస్తాయి. అలాగే నెలకు 8 వేల రూపాయల చొప్పున 21 ఏళ్లు పెట్టుబడి పెడితే వచ్చే మెచ్యూరిటీ రూ. 40,94,627లు. అయితే ఈ వడ్డీరేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్‌లో చేరేందుకవసరమైన డాక్యుమెంట్లు పాన్ కార్డు ఆధార్ కార్డు పాప ఫోటోలు పాప ఆధార్ కార్డు పాప బర్త్ సర్టిఫికెట్ పన్ను మినహాయింపు సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ముద్దుల తనయ కోసం ఎంతో కొంత పెట్టుబడిని మొదలు పెట్టండి. బంగారు భవిష్యత్తును ఆమెకు కానుకగా ఇవ్వండి! -
ఒకే సిరంజీ.. హెచ్ఐవీ సోకడంతో బయటకు నెట్టేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఓ డాక్టర్ పేషెంట్లందరికీ ఒకే సిరంజీతో సూది మందులు ఇవ్వగా.. ఓ బాలికకు హెచ్ఐవీ సోకింది. అయితే బాలికకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యాక సిబ్బంది ఆమెను బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం.. యూపీ ఎటాహ్ జిల్లా రాణి అవంతి బాయి లోధా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ అప్పటికే కొందరు షేషంట్లకు వాడిన సిరంజీతో ఇంజెక్షన్ చేశాడు. ఆ సమయంలో పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సిబ్బంది పట్టించుకోకుండా ఇంజెక్షన్ వేశాడు. ఆ తర్వాత అదే సిరంజీని మరికొందరికి వాడాడు కూడా. ఆపై కొన్నిరోజులకు చిన్నారికి రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీగా తేలింది. దీంతో రాత్రికి రాత్రే ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై శనివారం ఆమె తల్లిదండ్రులు జిల్లా న్యాయాధికారి(కలెక్టర్) అంకిత్ కుమార్ అగర్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందిస్తూ.. ఘటనపై సమగ్ర వివరణ కోరామని, డాక్టర్‌ది తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. मेडिकल कॉलेज,एटा में चिकित्सक द्वारा एक ही सिरिंज से कई मरीजों को इंजेक्शन लगाए जाने एवं एक बच्चे की जाँच रिपोर्ट एचआईवी पॉजिटिव मिलने संबंधी प्रकरण का तत्काल संज्ञान लेते हुए मेरे द्वारा प्रधानाचार्य,स्वशासी राजकीय मेडिकल कॉलेज एटा से उक्त संबंध में स्पष्टीकरण मांगा गया है (1/2) — Brajesh Pathak (@brajeshpathakup) March 4, 2023 -
అది హత్యా.. ఆత్మహత్యా!.. 4 నెలల క్రితం బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, నల్గొండ: పన్నెండేళ్ల బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఆత్మహత్యేమో అని భావించిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ గ్రామంలోని కొందరి వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాలిక మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేయించారు. ఇదంతా జరిగి నాలుగు నెలలైంది. ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. పైగా ఇటీవల సదరు బాలిక సమాధి తవ్వేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంతకాలమైనా పోలీసులు ఏమీ తేల్చడం లేదని, నిందితులను విచారించలేదని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. నాలుగు నెలల కింద ఘటన పెర్కకొండారం గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేశ్–పుషష్పలతల కుమార్తె మెర్సి(12). స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదివే ఆమె.. ఈ ఏడాది జూలై 13న ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. మెర్సి నోట్‌బుక్‌లో సుసైడ్ నోట్ రాసి పెట్టి ఉంది. ఆమెది ఆత్మహత్యగా భావించిన తల్లిదండ్రులు, బంధువులు అదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల సమయంలో గ్రామానికి చెందిన కట్ట పద్మారావు, పెరుమాండ్ల కృష్ణ, పెరుమాండ్ల ప్రభాకర్‌లు ఆ ఇంటికి వచ్చి.. నోట్‌బుక్‌లో రాసి ఉన్న సుసైడ్ నోట్‌ను చించివేశారు. మెర్సి మృతి చెందిన మూడో రోజు ఆమె సమాధి వద్ద తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో తల్లిదండ్రులకు అనుమానం వచ్చిన, పద్మారావు, కృష్ణ, ప్రభాకర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూతగాదాల నేపథ్యంలో వారే తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే తప్పుడు సుసైడ్‌నోట్‌ను వారే రాసి, తర్వాత చించివేశారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరో రోజున సమాధి నుంచి మెర్సి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కేసు ముందుకు కదలలేదు. సమాధి తవ్వేసి ఉండటంతో..: మెర్సి తల్లిదండ్రులు కుమార్తెకు నివాళులు అర్పించేందుకు గత నెల 28న సమాధి వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే సమాధి తవ్వి పైకప్పు రాయి దూరంగా పడవేసి ఉంది. తల్లిదండ్రులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు కేసు విచారణ చేపట్టలేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని వివరించారు. దీనితో ఎస్పీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేస్తున్నాం మెర్సి మృతిపై తల్లిదండ్రుల ఫిర్యా దు ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. కేసును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవం. మెర్సి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. దాని ఆధారంగా విచారణ జరుగుతోంది. మెర్సి సమాధిని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన విషయం వాస్తవమే. ఈ ఘటనపైనా దర్యాప్తు చేపట్టాం. కానీ సమాధిలో మృతదేహం ఉందో, లేదో మేం చూడలేదు. సీఐ రాఘవరావు, శాలిగౌరారం -
ఆడపిల్ల పుట్టిందని..
జమ్మికుంట: ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టడమే శాపమైంది. బిడ్డతో కాపురానికి వచ్చిన ఆమెకు మెట్టినింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లోకి రానీయకుండా అత్తమామలు అడ్డుకున్నారు. కాపురానికి రావద్దని భర్త తెగేసి చెప్పాడు. ఆ ఇల్లాలు 100కు కాల్ చేయగా.. పోలీసులు వచ్చి.. గొడవలు వద్దని, పంచాయితీ చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తికి బండ ప్రభాకర్, పుష్పలత దంపతుల కూతురు బండ స్పందనను ఐదేళ్ల క్రితం మాచనపల్లికి చెందిన గాండ్ల శంకర్, అరుణ దంపతుల కుమారుడు కిరణ్‌కిచ్చి వివాహం చేశారు. రూ.4 లక్షల కట్నం, ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 11 నెలల క్రితం స్పందన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని కిరణ్ కనీసం చూసేందుకూ రాలేదు. పైగా కాపురానికి నిరాకరిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం స్పందన తండ్రి చనిపోవడంతో ఆమెకు పెద్ద దిక్కులేకుండా పోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా కిరణ్ మనసు మారలేదు. బంధువుల సహకారంతో స్పందన ఆదివారం మాచనపల్లికి చేరుకుంది. దీంతో అత్తమామ, భర్త, ఆడబిడ్డ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని గెంటేశారు. దీంతో బాధితురాలి బంధువులు 100 కాల్ చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు రెండురోజుల్లో పంచాయితీ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. స్పందన పుట్టెడు దుఃఖంతో మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. -
షాకింగ్ వీడియో: భారీ కొండ చిలువతో చిన్నారి ఆటలు
చిన్న పామును చూస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది భారీ కొండ చిలువ కనిపిస్తే ఎలా ఉంటుంది. కానీ, ఓ చిన్న పాప.. భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. పడక గదిలో పాముతో చిన్నారి ఆటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాముతో చిన్నారి ఆడుకుంటున్న వీడియోను స్నేక్మాస్టర్ఎక్సోటిక్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పాప పేరు అరియానాగా తెలిసింది. ఆమెకు పాములంటే చాల ఇష్టం. పాములను తన స్నేహితులుగా చూసుకుంటుంది. వివిధ రకాల పాములతో ఆడుకుంటున్న వీడియోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో.. చిన్నారి బ్లాక్ పైథాన్ తోక పట్టుకుని లాగుతుంటుంది. ఆ పాము చిన్నారి నుంచి తప్పించుకుని బెడ్‌లోకి దూరేందుకు ప్రయత్నిస్తుంది. అది పడుకోవాలని భావిస్తోంది అని వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు 20కేకుపైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల నుంచి ఆందోళన చెందుతున్న సందేశాలు వచ్చాయి. పాములు బొమ్మలు కాదని పలువురు సూచించారు. View this post on Instagram A post shared by Ariana (@snakemasterexotics) ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఎయిర్‌హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే? -
కామాంధుడిని కర్రతో బాదిన తొమిదేళ్ల అమ్మాయి..
సాక్షి, బంజారాహిల్స్: కామాంధుడిని కర్రతో బాది తోటి బాలికను లైంగిక దాడి నుంచి కాపాడింది ఓ తొమ్మిదేళ్ల చిన్నారి. తాము అమాయకులమే కాదు సమయమొస్తే అపర వీరనారులమవుతామని చాటిచెప్పిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఫిలింనగర్‌లోని బద్ధం బాల్‌రెడ్డినగర్ బస్తీలో నివసించే కైసర్ దినసరి కూలీ. శనివారం సాయంత్రం తన ఇంటి ఎదుట ఆడుకుంటున్న నలుగురు బాలికలకు చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచాడు. వీరిలో ఇద్దరు తమకు దాహం వేస్తోందని బయటికి వచ్చేశారు. మరో ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలు గదిలోనే ఉండిపోయారు. వీరిలో ఓ బాలికపై కైసర్ లైంగిక దాడికి యత్నిస్తుండగా మరో బాలిక కర్రతో అతనిపై దాడి చేసింది. ఈ క్రమంలో కైసర్‌ను విడిపించుకున్న బాధిత బాలిక బయటికి పరుగులు తీసింది. ఆమె వెంబడే కైసర్‌ను కొట్టిన బాలిక కూడా ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. అప్పటికే తన కూతుళ్లు కనిపించడం లేదంటూ వారి తల్లి ఆ ప్రాంతంలో వెతుకుతుండగా ఆ ఇంట్లో నుంచి పిల్లలు బయటికి రావడం కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయాన్ని తల్లికి చెప్పారు. అసభ్యంగా ప్రవర్తించారని వివరించారు. శనివారం రాత్రి బాధిత బాలిక తల్లితో పాటు ఆమె ఆడబిడ్డ ఇద్దరూ వెళ్లి కైసర్‌ను ప్రశ్నించగా వారిని కిందకు తోసిపడేసి బైక్‌పై ఉడాయించాడు. ఘటనపై బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కైసర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్‌లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు.. -
మళ్లీ ఆడపిల్లేనా..?! కాదు... అక్కడ ఆడపిల్ల పుడితే.. ఊరంతా ఆనందమే
సాక్షి, సంగారెడ్డి: ‘‘..మళ్లీ ఆడపిల్లేనా..?!’’రెండోకాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇలాంటి మాట తరచూ వింటుంటాం. ఆడపిల్లను గుండెల మీద మోయలేని భారంగా భావిస్తుంటారు. కానీ, అక్కడ ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ వాతావరణమే.. ఇంటింటా సంబురమే. మిఠాయిలు పంచుకుంటారు.. గ్రామ పంచాయతీ భవనాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరిస్తారు. చిన్నారికి, తల్లిదండ్రులకు కొత్తబట్టలు పెట్టి ఆ కుటుంబానికి భరోసా ఇస్తారు. ఆ గ్రామమే కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్. ఆదర్శంగా నిలుస్తున్న హరిదాస్పూర్పై ‘సాక్షి’ప్రత్యేక కథనం... ఆలోచన వచ్చింది అప్పుడే.. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామ సర్పంచ్ షఫీ, కార్యదర్శి రోహిత్ కులకర్ణి ఇంటింటికీ తిరిగి పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. చిన్న కూతురు సత్యవతికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం చేసుకుంది. సత్యవతికి మొదటి రెండు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పు కూడా ఆడపిల్లే పుట్టడంతో కమలమ్మ తీవ్ర నిరాశ చెందింది. సర్పంచ్, కార్యదర్శికి కమలమ్మ తన ఆవేదన చెప్పుకుంది. దీంతో ఈ కుటుంబానికి అండగా ఉండాలని భావించారు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటా విస్తృతంగా అవగాహన కల్పించారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. చదవండి: ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ చిన్నారి పేరిట బ్యాంకులో, పోస్టాఫీసులో ఖాతా తెరుస్తారు. కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు చేస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.వెయ్యిని గ్రామపంచాయతీవారే చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు 85 మంది ఆడపిల్లల పేర్లను ఈ పథకం కింద నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హరిదాస్పూర్ను ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించింది. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తమ గ్రామానికి అవార్డును అందజేయనున్నట్టు పంచా యతీ కార్యదర్శి రోహిత్ కులకర్ణి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: Ukraine Cat: ఉక్రెయిన్ నుంచి పిల్లిని తెచ్చుకున్నాడు.. కానీ -
10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!
ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు. వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నెలల్లోనే... 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. ఆ రెండు ఆస్పత్రుల్లోనే... జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్ కోసం తీసుకువచ్చే ఆర్ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. కష్టమే! తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది. స్కానింగ్ చేయాల్సిన పరిస్థితులు ► జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు ► ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. ► లింగ సంబంధిత వ్యాధులు గుర్తించినప్పుడు. ► స్కానింగ్‌కు చట్టం ఆమోదించే పరిస్థితులు. ► గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. ► గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. ► గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు స్కానింగ్ చేయవచ్చు. సమాచారమిస్తే చర్యలు జిల్లాలో ఏ స్కానింగ్ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ -
పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని వెళ్లగొట్టాడు..
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త.. ఆడపిల్లలు పుట్టారని వెలేశాడంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. స్పందించిన మానవతావాదులు ఆమెను కాపాడి జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి వద్దకు పిలుచుకెళ్లారు. బాధితురాలి వేదన ఆమె మాటల్లోనే.. ‘నా పేరు మమత. బుక్కపట్నం మండలం కొడపగానిపల్లి. బుక్కపట్నంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామ్మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మాది ప్రేమ వివాహం. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నా భర్త నా నుంచి దూరమయ్యాడు. బుక్కపట్నంలో తాను పనిచేస్తున్న సచివాలయంలోనే వివాహిత అయిన ఓ ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని నిలదీయడంతో నాపై పలుమార్లు దాడికి ప్రయత్నించాడు. అతని వేధింపులు తాళలేక 2021, డిసెంబరులో నిర్వహించిన పోలీస్ స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశా. దిశా పోలీసు స్టేషన్‌కు నా భర్తను పిలిపించి మందలించి పంపారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా ఇంటి ముఖం కూడా చూడడం లేదు. నా తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి.. నన్ను, పిల్లలను పోషించలేక పోతున్నారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించి, నా సంసారాన్ని చక్కబెట్టాలని కోరేందుకు వచ్చా. అయితే నా కష్టం తీరుతుందని అనుకోలేదు. దీంతో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువులో పిల్లలను తోసి నేనూ దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. నా ప్రయత్నాన్ని అక్కడున్న వారు అడ్డుకుని జాయింట్ కలెక్టర్ సిరి మేడమ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి కదిరి ఆర్డీఓకు ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు’ అంటూ వివరించారు. బాధితురాలు మమత -
అబార్షన్లను నియంత్రిస్తేనే ఆడ పుట్టుక
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో బర్త్ రేషియో (జననాల రేటు) చూస్తే అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. కొన్ని జిల్లాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య రేషియో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గడిచిన ఏడాది డిసెంబర్ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో శుభపరిణామం.. మొత్తం 13 జిల్లాల్లో గతేడాది సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలున్నది ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే. ఈ జిల్లాలో గడచిన రెండేళ్లలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. అన్నిజిల్లాల కంటే అనంతపురం జిల్లాలో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉన్నట్టు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. రమారమి ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు లెక్క. కర్నూలు జిల్లాలోనూ కేవలం 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అమ్మాయి అనగానే అబార్షన్ చేయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలు రాష్ట్రంలో పీసీ పీ అండ్ డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యులు (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని చెప్పారు. కొంతమంది గైనకాలజిస్ట్లు, రేడియాలజిస్ట్‌లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి. అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. -
అమ్మా... నన్ను చంపొద్దు.. మగ పిల్లలకంటే తక్కువేం కాదు!
సాక్షి, మంచిర్యాల: ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లే.. అయితే మానవుడు ఎంత అభివృద్ధి చెందినా.. తల్లిగర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిస్తే బయట పడకుండానే హతమారుస్తున్నారు. మరికొందరు ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, మురుగునీటి కాలువల్లో వదిలేసి వెళ్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యలను పుట్టింట్లోనే వదిలేసిన భర్తలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. హక్కుల సాధన, రక్షణ కోసం అనేక చట్టాలు అమలు చేస్తున్నాయి. దీంతో బాలికలు ఉన్నత చదువుల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో 2008 నుంచి ప్రతిసంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహిస్తోంది. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కథనం... సంక్షేమ పథకాలు సుకన్య సమృద్ధి యోజన సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణహత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాల్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అప్పడే పుట్టిన శిశువు నుంచి పదేళ్ల వయసున్న ఆడపిల్ల తల్లితండ్రులు బాలిక పేరుపై తపాలా శాఖలో రూ.250 చెల్లించి ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఖాతా ప్రారంభం నుంచి 14 ఏళ్లు, గరిష్టంగా 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. చేసిన పొదుపుపై వడ్డీ ఉదాహరణ నెలకు రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు జమ చేస్తే 21 ఏళ్ల తర్వాత రూ.6,07,128 వస్తాయి. 21 ఏళ్ల తర్వాత బాలిక వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి మొత్తం అందజేస్తారు. ఇద్దరు బాలికలున్న వారు రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ము జమ చేయాలి. ముగ్గురు కుమార్తెలుంటే మరో ఖాతా తెరిచేందుకు వీలు లేదు. చదవండి: Saroornagar Lake: మారని కథ.. నెరవేరని సీఎం కేసీఆర్ హామీ! బేటీబచావో.. బేటీపడావో.. బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంబరం చేసుకోవాలి, కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలని ప్రసంగించారు. ఈ పథకాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. బాలికా సమృద్ధి యోజన 1997 నుంచి ఈ పథకం అమలులో ఉంది. పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆడపిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 నగదు గిప్టుగా ఇస్తారు. ఆ తర్వాత బాలిక పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300, నాలుగో తరగతికి రూ.400, ఐదోతరగతికి రూ.500, ఆరోతరగతికి రూ.600, ఏడోతరగతికి రూ.700, ఎనిమిదో తరగతికి రూ.800, తొమ్మిదో తరగతిలో రూ.1000 స్కాలర్షిప్ అందజేస్తారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు, బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందిస్తోంది. పేదింట్లో ఆడపిల్ల వివాహం భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి ప్రీమియం చెల్లించిన వారి పిల్లలు 9, 10, ఇంటర్, ఐఐటీ చదువుతుంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఇస్తారు. బాలికా సంరక్షణ యోజన నిరుపేద బాలికల్లో భరోసా నింపేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం(జీసీపీఎస్) ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఒకే ఆడపిల్ల జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కో బాలికకు రూ.30వేల చొప్పున ఈ మొత్తాన్ని 20 ఏళ్లు నిండిన తర్వాత అందజేస్తారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ దేశంలో బాలికల విద్య, అభ్యున్నతికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(అఐఇఖీఉ) ప్రగతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశంలోని 5 వేల మంది విద్యార్థినులకు సంవత్సరానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. హక్కులు.. చట్టాలు బాలల హక్కులు ప్రపంచ దేశాలన్నీ కూటమిగా ఏర్పడి సమాజంలో బాలలకూ హక్కులు ఉండాలని నిర్ణయించాయి. అందులో కొన్ని ముఖ్యమైన హక్కులను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. రక్షణ హక్కు బాలికలు తల్లిదండ్రుల నుంచి రక్షణ పొందవచ్చు. కుల, మత, లింగ వివక్ష, నిర్లక్ష్యం, దౌర్జన్యం, హింసాత్మక చర్యల నుంచి కాపాడుకోవడం, అంటువ్యాధులు, కరువు వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందవచ్చు. జీవించే హక్కు శిశువుగా తల్లిగర్భంలో ఉన్న దశ నుంచే సమగ్రంగా ఎదిగే వరకు ఉపకరించే హక్కు. ఈ హక్కు బాలికల ఎదుగుదలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను పొందేవరకు ఉపయోగపడుతుంది. స్వేచ్ఛగా జీవించటానికి, ఆటంకాలు లేకుండా ఎదగడానికి బాలికలకు తోడ్పాడుతుంది. అభివృద్ధి హక్కు బాలలు స్వయం సమృద్ధిని సాధించటానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఈ హక్కు ద్వారా వినియోగించుకోవచ్చు. భాగస్వామ్య హక్కు బాలలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనేలా ఈ హక్కు ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో వారికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకుని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది. బాలికల సంరక్షణకు చట్టాలు ► 18 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగితే ఫోక్సో చట్టం కిందికి వస్తాయి. 2016 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ► 2006 నుంచి బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. ► 2014 నుంచి బాలల అక్రమ రవాణా నిరోధక చట్టం అమలవుతోంది. ► దాడులకు గురైన బాలికలకు వన్‌స్టాప్ సెంటర్ (సఖి) అండగా నిలుస్తోంది. ► సమాజంలో జరుగుతున్న దాడులు, బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ► విద్యార్థులు మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే విద్యాలయాల నుంచి తా త్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. మరే విద్యాలయంలో ప్రవేశం పొందకుండా చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. బాలికలను లైంగికంగా వేధిస్తే.. అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో అమోదంలభించింది. బాలిక ఆమోదం తెలిపినా, తెలపక పోయినా 18 ఏళ్లలోపు వారిపై ఏ లైంగిక దాడిచేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేద జీవిత ఖైదు కూడా విధించవచ్చు. పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులు గురిచేస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష జరిమాన విధించే అవకాశం ఉంది. అమ్మా... నన్ను చంపొద్దు! మంచిర్యాలక్రైం/బోథ్: ఆడపిల్ల అని తెలిస్తే చాలు భ్రూణహత్యలు చేస్తున్నారు.. కన్న తల్లే శిరచ్ఛేదనం చేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. పుట్టబోయేది కూడా ఓ మహిళేనని తల్లులు గుర్తెరగడం లేదు. ఫలితంగా జనగణన లెక్కలోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడాలు కనిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 940 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. 2021 జనాభా ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మంది మహిళలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం వెయ్యి మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారు. స్కానింగ్ సెంటర్ల పాపం.. తన గర్భంలో పెరుగుతున్నది ఆడా, మగా తెలుసుకునేందుకు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై గర్భిణులు ఒత్తిడి తెస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు ఆశ చూపించి గర్భంలో పెరిగే శిశువు గురించి తెలుసుకుంటున్నారు. ఒకవేళ తన గర్భంలో ఆడపిల్ల ఉంటే తన భర్త లేదా అత్తామామల ఒత్తిడి వల్లనో పసిగుడ్డు ప్రాణం తీస్తున్నారు. శిక్షలు ఇలా... భ్రూణ హత్యలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్(రెగ్యులేషన్ ఆండ్ ప్రివెన్షన్ ఆప్ మిస్ యూజ్ యాక్ట్) తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమైనప్పటికీ చాలామంది రేడియాలజిస్టులు నిబంధనలు తుంగలో తొక్కి తమ దందా సాగిస్తున్నారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై చట్టాలు కఠినంగా ఉన్నా అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏ స్కానింగ్ సెంటర్ అయినా మొదటి సారి లింగనిర్ధారణ చేస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా విధించడంతోపాటు ఆరు నెలలు జైలు లేదా ఏడాది జైలు శిక్షతో పాటు మెడికల్ డిగ్రీని రద్దు చేస్తారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దాడులు చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్హం. మగ పిల్లలకంటే తక్కువేం కాదు బజార్హత్నూర్ గ్రామానికి చెందిన జువుల కళావతి, భూమన్న దంపతులకు ఇద్దరూ కూతుళ్లు సంతానం. అయినా వారు అధైర్య పడలేదు. ఆడపిల్లలను క్రమశిక్షణతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజినీర్ చేయాలని పిల్లలు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల కలలను కూతుళ్లు నిజం చేస్తున్నారు. భూమన్న మండలంలోని దేగామ జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్ద కూతురు నిహారికను 6వ తరగతి వరకు మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు కాగజ్‌నగర్ నవోదయ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివించాడు. ప్రస్తుతం నిహారిక ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు నిపుణ 6వ తరగతి వరకు శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు ఆదర్శ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదువుకుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అవగాహన కల్పిస్తున్నాం.. బాల్య వివాహాల నియంత్రణ కు ఐసీపీఎస్ ద్వారా అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. గ్రామపంచాయతీల్లో 12 మంది సభ్యులతో కమిటీలను కూడా వేశాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం కౌన్సెలింగ్ నిర్వహించి నిలిపివేస్తాం. – మిల్కా, సంక్షేమ అధికారి, ఆదిలాబాద్ మేం ముగ్గురం ఆడపిల్లలం.. కుంటాల: మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామం. అమ్మానాన్న రాణి–తిరుపతి. మేం ముగ్గురం ఆడపిల్ల లం. నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. నేను కుంటాల ఎస్సైగా పని చేస్తున్నా. పెద్ద చెల్లే స్నేహాంజలి బిటెక్ పూర్తి చేసింది. చిన్న చెల్లె మహిజ డిగ్రీ పూర్తి చేసింది. ఆడపిల్లలపై వివక్షత చూపు చూడకుండా నా వంతుగా కృషి చేస్తున్నా. – పోగుల స్రవంతి, ఎస్సై, కుంటాల ఒక్కరే ముద్దు ఆదిలాబాద్‌టౌన్: ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే నినాదంతో మేము మేమిద్దం ఒక్కరే చాలన్న నిర్ణయానికి వచ్చాం. మా పాప పేరు అవంతిక. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒక్కరు చాలు. మా కూతురే మాకు ప్రాణం. – కూతురుతో గండ్రత్ అంకిత – సంతోష్ దంపతులు కూతుర్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని.. తాంసి: మాకు 2004 సంవత్సరంలో మొదటి సంతానంగా కూతురి జన్మించింది. ఒక్క కూతురే చాలనుకోన్నారు. కూ తురినే ఉన్నతంగా చదివించి సమాజానికి ఆదర్శంగా నిలుపాలని నిర్ణయించుకున్నాం. కూతురిని తన అభిరుచులకు తగ్గట్టు చది విస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆడపిల్ల అంటే మగ పిల్లల కంటే ఎక్కువ అనే విధంగా మా కూతురిని ఆదర్శంగా నిలుపుతాం. – రామగిరి మాధవి, రమేష్ దంపతులు, తాంసి వివక్ష రూపుమాపాలి కాగజ్‌నగర్: తల్లి గర్భం నుంచే ఆడపిల్లకు వివక్ష మొదలవుతుంది. ఈ కారణంగానే భ్రూణ హత్యలకు దారితీస్తుంది. వివక్ష అనేది వారి కుటుంబాల నుండే మొదలవుతోంది. మనమంతా దీనిని రూపుమాపాలి. తల్లిదండ్రులు సైతం బాలురకు ఇచ్చే స్వేచ్ఛ ఆడపిల్లలకు ఇవ్వడం లేదు. సమాజంలో ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. – కె శ్రావణి, బీజెడ్సీ, ద్వితీయ సంవత్సరం, కాగజ్‌నగర్ ఎవరైనా ఒక్కటే.. నేరడిగొండ: మేము కూతురైనా కొడుకైనా ఒక సంతానం చాలని 2011లోనే నిర్ణయించుకున్నాం. మాకు మొదటి సంతానంగా పాప పుట్టింది. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నాం. కూతురుకు మంచి భవిష్యత్తు అందించాలని నిర్ణయించుకున్నాం. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ.. పాప భవిష్యత్ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాం. చిన్నారి స్పందన రెడ్డితో కుంట కిరణ్‌కుమార్ రెడ్డి దంపతులు -
ఎవరో కని పాడేశారు.. ఆ నవజాత శిశువుని అక్కున చేర్చుకున్న కుక్క!
The baby was rescued from a field in Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ముంగేలి జిల్లాలో లోర్మీ సరిస్టాల్ గ్రామంలోని స్థానికులు ఒక పసికందు కేకలు విని అటుగా వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన నవజాత శిశువు పొలం వద్ద పడి ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు ఒక తల్లి కుక్క తన ఆరు పిల్లలతో ఆ నవజాత శిశువుని రాత్రి అంతా కాపాల కాసి మరీ రక్షించింది. అయితే స్థానికుల్ని నుంచి ఈ సమాచారం అందుకున్న టాస్కఫోర్స్ బృందం ఘటనస్థలికి వచ్చి విచారించారు. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') ఈ మేరకు ఏఎస్ఐ చింతారామ్ బింజ్వార్ శిశువును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు చిన్నారిని ది చైల్డ్ లైన్ ప్రాజెక్ట్‌కి రిఫర్ చేసి ఆకాంక్ష అని పేరు పెట్టారు. కాగా, నవజాత శిశువు కుటుంబం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాలతోపాటు ఫోటోలను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వార్త చదివిన తర్వాత తాను కలత చెందానని, కూతురు, కొడుకు అనే లింగవివక్షను గురించి ఆలోచించి ఉంటే మీరు తల్లిదండ్రులగా ఉండటానికి తగినవారు కాదని ట్విట్టర్లో ఆవేదనగా పేర్కొన్నారు. (చదవండి: గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!) खबर पढ़कर मन व्यथित हो गया. बच्ची को पुलिस ने अस्पताल पहुंचा दिया है, मामले की छानबीन जारी है. यदि आप बेटा-बेटी में भेद-भाव की सोच से ग्रस्त हैं तो आप अभिभावक बनने लायक नहीं हैं. दोषियों को कानून के तहत सख्त सजा मिले. ऐसे पाप रोकें, दकियानूसी सोच त्यागें, बेटा-बेटी एक समान मानें. pic.twitter.com/JDD5tQExSu — Dipanshu Kabra (@ipskabra) December 19, 2021 -
ఆస్ట్రేలియాలో కిడ్నాప్‌కు గురైన 4 ఏళ్ల చిన్నారి.. 18 రోజుల పాటు గాలింపు
-
18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు
సిడ్ని: ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్‌ని చూసి ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు, డిటెక్టివ్లు, చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చిన్నారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. కాకపోతే అవి ఆనందబాష్పాలు. ఎందుకంటే 18 రోజుల కిత్ర కిడ్నాప్‌కు గురైన క్లియో స్మిత్(4).. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఇన్ని రోజులు క్లియో కోసం కన్నీరుమున్నిరుగా విలపించిన వారంతా ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారు. క్లియో కిడ్నాప్ వ్యవహారానికి వస్తే.. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో.. సుమారు 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. రాత్రి తన టెంట్లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్ చేశాడు. ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా.. ) క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు. కేసు సీరియస్‌గా మారడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. క్లియో పిక్నిక్ వెళ్లిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు. చివరకు డిటెక్టివ్‌ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. దుర్వార్తే వినాల్సి వస్తుందని భావించారు. (చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ?) ఈ క్రమంలో సుమారు 18 రోజుల తర్వాత క్లియోని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి.. అతడి స్థావరం గురించి పోలీసులుకు సమాచారం తెలిసింది. ఎంతో చాకచక్యంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని చుట్టుమట్టారు పోలీసులు. అతడి నివాసంలోకి వెళ్లారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో. ఒక్కనిమిషం పాటు అధికారులకు నోటమాట రాలేదు. చిన్నారిని తట్టి.. ‘‘నీ పేరేంటని ప్రశ్నించగా.. నా పేరు క్లియో’’ అని చెప్పింది. వెంటనే హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 18 రోజుల పాటు కిడ్నాపర్ చెరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్దవారే ఎంతో భయపడతారు. (చదవండి: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) కానీ చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. చదవండి: 22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ The moment Cleo was rescued 👏 pic.twitter.com/arusYi9kCa — WA Police Force (@WA_Police) November 3, 2021 -
ఆ పెట్రోల్ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!!
పెట్రోల్, డీజిల్ ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి. ప్రతిఒక్కరూ.. ఆచి తూచి జాగ్రత్తగా వాడుతున్నారు. మరి ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే మీరేం చేస్తారు? వెంటనే రెక్కలు కట్టుకునిమరీ అక్కడ వాలిపోతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ఏకంగా మూడు రోజులపాటు వచ్చిన కస్టమర్లందరికీ ఫ్రీ పెట్రోల్ ఇచ్చాడు. తమ ఇంట ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! బేతుల్ జిల్లాకి చెందిన దీపక్ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్ 9న ఆడపిల్ల పుట్టింది. మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్ సైనాని పెట్రోల్ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. దసరా నవరాత్రుల వేళ అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాలు వెల్లడించాడు. కాగా గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానుంటుతున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో మూడురోజుల పాటు వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందించడంతో దీపక్ సైనాని వార్తల్లో నిలిచాడు. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే వెంటనే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించే ఈ రోజుల్లో, ఇంత విలువైన బహుమతి మేకోడలికి అందించిన అతని ఉన్నతమనసును చాటిచెబుతోంది. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? -
సమాధుల పక్కన ఆడశిశువు
డోర్నకల్: మహిళా దినోత్సవం రోజున మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపాన సమాధుల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పాలిథిన్ కవర్ చుట్టి ఉన్న పసికందు ఏడుపు విని సమీపంలో ఉన్న మహిళ అక్కడకు వెళ్లడంతో శిశువు కనిపించింది. బూరుగుపాడుకు చెందిన వేల్పుల వెంకటమ్మ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాకరకాయల కోసం దర్గా ప్రాంతానికి వెళ్లగా పసికందు ఏడుపు వినిపించింది. పక్కనే పరిశీలించగా అక్కడి సమాధుల పక్కన కవర్లో ఆడశిశువు కనిపించింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పసికందును ఆమె ఇంటికి తీసుకొచ్చింది. బొడ్డు పేగు, శరీరానికి రక్తం ఉండటంతో స్నానం చేయించిన తర్వాత పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు సమాచారం అందించింది. వారు వెంకటమ్మ ఇంటికి వచ్చి పసికందును పరిశీలించి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకున్న తరువాత ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ కార్యకర్త హైమావతి, ఆశ కార్యకర్త సులోచన పసికందును డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు పాపను వార్మర్లో ఉంచారు. 2.5 కేజీల బరువుతో పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యుడు బృందాధర్రావు, సీడీపీఓ ఇందిర, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ జ్యోతి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నరేశ్వై,ద్యాధికారి డాక్టర్ రంజిత్‌రెడ్డి, వైద్యురాలు డాక్టర్ విరాజిత తదితరులు ఆస్పత్రిలో పసికందును పరిశీలించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు పసికందును మహబూబాబాద్ శిశుగృహానికి తరలించారు. చదవండి: 20 ఏళ్ల క్రితమే అక్కడ మహిళా రాజ్యం -
మగపిల్లాడు ఏడ్వాలి, ఆడపిల్ల విరగబడి నవ్వాలి
కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు. ‘ఏంటా ఏడుపు ఆడపిల్లలా?’ ‘యెస్.. నేను అబ్బాయిని అయితే ఏంటి? నాకూ ఏడ్వాలని ఉంటుంది’ ‘అమ్మాయిలు కార్లు, బైక్‌ల గురించి ఆలోచించరు’ ‘తప్పు.. కార్లు, బైకుల బొమ్మలతో నాకూ ఆడుకోవాలనుంటుంది’ ‘పింక్ మా ఇద్దరికీ ఫేవరెట్ కలర్ అవచ్చు కదా! చిల్ ఇట్స్ జస్ట్ ఏ కలర్!’ ‘మా ఇద్దరికీ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఓడిపోయినా.. కిందపడి కాళ్లు కొట్టుకుపోయినా!’ ‘ఇంటి పని నేనూ నేర్చుకోగలను’ ‘మా ఇద్దరికీ ఒకే రకమైన కలలు ఉండొచ్చు కదా.. ఆకాశంలో పైపైకి ఎగరాలని.. నడుము తిప్పుతూ డాన్స్ చేయాలని.. సూపర్ హీరో కావాలని.. స్టయిల్‌గా ఉండాలని..!’ ‘మేమిద్దరం ఒకరితో ఒకరం పోటీ పడగలం.. గెలవచ్చు.. ఓడిపోనూవచ్చు. అయితే మాత్రం ఇద్దరిలో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ కాదు కదా.. ఇద్దరం సమానమే!’ డియర్ పేరెంట్స్.. ఇవన్నీ ఒప్పుకోవడం మీక్కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాని మా మనసులో మాటలవి. కాబట్టి మీరు రూల్స్ పెట్టాలనుకుంటే మా ఇద్దరికీ సమానమైన రూల్స్ పెట్టండి. మీరు పెరిగినట్టుగా కాకుండా మేం పుట్టినట్టుగా మమ్మల్ని సమంగా పెంచండి.’ ఇది పిల్లల (కూతురు, కొడుకు) వినతి పెద్దలకు. జెండర్ ఈక్వాలిటీ మీద ‘ఫ్లిప్‌కార్ట్’ యాడ్ అది. ‘జాతీయ బాలికా దినోత్సవం’ అంటే పరోక్షంగా లింగ వివక్షను రూపుమాపే కార్యక్రమం. అబ్బాయిని అమ్మాయి సరసన నిలబెట్టడం. అన్నింట్లో ముందు ఉండాలనే స్ఫూర్తి అమ్మాయికి సహజం. వెసులుబాటు దొరకాలేగానీ అబ్బాయిల అచీవ్‌మెంట్స్‌ను అమ్మాయిలు అలవోకగా అందుకోగలరు. వ్యోమగామిగా రోదసీ యాత్రలో పాలుపంచుకోవడాన్ని ఉదహరించుకోవచ్చు. కాని అమ్మాయిలు చేసే పనులనే అబ్బాయిలు అందుకోవడం లేదు. ఇది అలవాటు చేసి, వాళ్లకు ఆ వెసులుబాటు కల్పించే అవగాహన కోసమే ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ అయినా ‘జాతీయ బాలికా దినోత్సవం’ అయినా! మగపిల్లాడు ఏడ్వాలి.. ఆడపిల్ల విరగబడి నవ్వాలి. వంట పని అమ్మ పేటెంట్ కాదు అని అబ్బాయి గ్రహించగలడు. నాన్న సహాయంతో ఇంటి పనీ నేర్చుకోగలడు. సైకిల్ వేసుకొని అమ్మాయి బయటి పనులు చక్కదిద్దుకొస్తుంది. నీటి వసతిలేని చోట కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోయడానికి అమ్మాయి చదువును కట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కండబలం ఉన్న కొడుకు ఆ నీళ్లు తేగలడు. కోడిగుడ్లు వంటి పౌష్టికాహారం అమ్మాయికీ కావాలి. ఇంటి పనిలో అబ్బాయికి, ఆస్తిలో అమ్మాయికి వాటాలు ఉండాలి. వీటన్నిటి సాధనకు దశాబ్దాలు వేచే సమయం లేదు. గంటలు సెకన్లుగా పరిగెడుతున్న కాలం. ‘తెలియదు’, ‘మా వరకు రాలేదు’ అని తప్పించుకునే వీలున్న వర్తమానం కాదు. సమస్త సమాచారాన్ని, కనీస అవగాహనను అందరికీ సమంగా పంచుతున్న టెక్నాలజీ యుగం. ఈ నాగరికతలో కుల, మత, వర్ణ, ప్రాంత భేదాలతోపాటు లింగ వివక్షా తీవ్రమైన నేరం, అనాగరికం. ఆ జ్ఞానాన్ని లెక్కచేయక ఛాందసాన్ని అనుసరిస్తూ ఆడపిల్లను అడుగున పెడితే చక్కదిద్దే బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. కరోనా బాధితుల్లో మగవాళ్లే ఎక్కువ ఉన్నట్టుగా. మానవజాతి మనుగడకు ప్రాణం పోసేది మహిళే కాబట్టి.. ఆ మహిళలను రక్షించుకోవడం ప్రకృతికి బాగా తెలుసు. అపోహ కాదు ఇది శాస్త్రీయ అధ్యయనాలు రుజువు చేసిన సత్యం. దీన్ని గ్రహించి కొడుకును, కూతురుని సమానంగా పెంచితే రేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకుంటారు. -
నిరుపేద చిన్నారి.. దాతల సాయం కోరి..!
బుడిబుడి అడుగుల చిన్నారికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చెన్నూర్: తమ చిన్నారిని కాపాడమని మహేందర్, లక్ష్మి దంపతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తలా కొంత సాయం చేసి తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారి అందరితో కలిసి ఆనందంగా ఆడుకునే అభం, శుభం తెలియని చిన్నారి ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతోంది. కన్నవారు అష్టకష్టాలు పడుతూ స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్ పట్టణం బట్టిగూడెం కాలనీకి చెందిన మహేందర్, లక్ష్మిలకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి నవీన (3). రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. మహేందర్ టాటాఏస్ డ్రైవర్‌గా పని చేస్తుండగా లక్ష్మి కూలీ చేసి బతుకు బండిని లాగుతున్నారు. ఇద్దరూ కష్టపడి పిల్లలను కంటికి రెప్పలా సాకుతున్నారు. కానీ పది రోజుల క్రితం నవీనకు జ్వరం వచ్చింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నవీనకు డెంగీ లక్షణాలున్నాయని, కరీంనగర్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన చిన్నారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారి నవీనకు పరీక్షలు నిర్వహించి గుండెలాగేలా... ఆ చిన్నారి డెంగీతో పాటు లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. గురువారం నుంచి చికిత్సకు రోజుకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చవుతోంది. ఇప్పటికే రూ. 4.80 లక్షలు ఖర్చయ్యాయని.. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పుచేసి నెట్టుకొచ్చామని, ప్రస్తుతం అప్పులిచ్చేవారు కూడా లేరని చిన్నారి తండ్రి మహేందర్ అంటున్నారు. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఇప్పటికే చిన్నారి వైద్య ఖర్చులకు రూ. 5 లక్షలకు పైగా ఖర్చయింది. ఇంకా నాలుగు నుంచి రూ. 5 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ఆత్రుత పడుతున్నారు. కానీ అంతంతమాత్రంగా ఉన్న వారి ఆర్థికస్థోమతను చూసి ఎలాగా అని భయపడుతున్నారు. ఆపన్నహస్తం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చిన్నారి నవీన వైద్య ఖర్చుల కోసం చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చనగిల్డా రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. నెన్నల కృష్ణ, అకౌంట్ నంబర్: 62297400611 ఐఎఫ్ఎస్సీ: SBIN0020128 స్టేట్‌బ్యాంక్, చెన్నూర్ బ్రాంచ్,గూగుల్‌పే: 8096384756 -
చిన్నారులను అందంగా అలంకరించి..
పటాన్చెరు: అమీన్‌ఫూర్ అనాథశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. అనాథశ్రమం ముసుగులో అనేక చీకటి వ్యవహారాలు సాగేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు కూడ ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని, చిన్నారులను అందంగా అలంకరించి బయటకు పంపే వారని చెబుతున్నారు. వాస్తవానికి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి లేనిది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పంపకూడదు. రంగారెడ్డి జిల్లాలో అనాథాశ్రమం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శివారు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. (మరో బాలికపైనా అఘాయిత్యం!) అనాథశ్రమ భవనంపైఉన్న అడ్రస్ మాత్రం మియాపూర్ అనే రాసి ఉంది. అయినా రంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించలేదు. రేయింబవళ్లు అధికారుల స్టిక్కర్లగల వాహనాల రాకపోకలు సాగేవని, చిన్నారులను చాలా వేధించేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. అశ్రమ చిన్నారులే కాకుండా బయట నుంచి కూడా మహిళలు, యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు ఉన్నాయి. అనాథశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సిఫారసు చేసిన వారే ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారం ఆశ్రమంలో 49 మంది విద్యార్థులు ఉండాలి కానీ, 60 మంది వరకు బాలికలు ఉండేవారని చెబుతున్నారు. జిల్లా అధికారులకు తెలియకుండా అనాథ పిల్లలు చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. తరచూ చిరునామాలు మారుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన అనాథాశ్రమం అమీన్పూర్లో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆశ్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అధికార యంత్రంగానికి తెలియకుండా నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో మియాపూర్ దీప్తి శ్రీనగర్‌లో ఆశ్రమం నిర్వహించేవారని తెలిసింది. విజయవాడకు చెందిన నిర్వాకురాలు ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలు నుంచి విరాళాలు సేకరించేవారని, చాలా స్వల్పవ్యవధిలో రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించాలరని తెలిసింది. ఆశ్రమం ముసుగులో కొందరు బడా బాబులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనాథాశ్రమానికి నిధులు ఇచ్చే వారికి పూర్తి సొమ్ము ఇచ్చేసి అందులో కొంత సొమ్మును కమిషన్ రూపంలో తీసుకునే ఆశ్రమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఉలిక్కి పడిన అమీన్పూర్ పటాన్చెరు: అమీన్పూర్లో మరో ‘ముజఫర్‌పూర్’ ఘటన స్థానికులను కదిలించింది. అనాథ బాలికను చిదిమేసిన అంశంపై మానవతవాదులు కదిలిపోయారు. అన్ని టీవీ చానళ్లలోనూ ఈ వార్తపై కథనాలివ్వడంతో అమీన్పూర్ వాసులు ఒక్కసారిగా ఆందోళనకులోనయ్యారు. అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంలోని మిగిలిన చిన్నారుల విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాలిక మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ రాజేశ్వర్ సాక్షితో మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో కేసు నమోదయ్యిందని, అత్యాచార నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పట్టణ నాయకుడు కె.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాయని లలిత ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సాఆర్సీపీ ఎస్పీ విభాగం జిల్లా అధ్యక్షుడు డప్పు రాజు మాట్లాడుతూ బాలిక మృతికి కారకులైన వారందరినీ గుర్తించాలని, ఆశ్రమ అనుమతులన్ని రద్దు చేయాలన్నారు. -
గంటపాటు కారులో ఉక్కిరిబిక్కిరై..!
రేమల్లే (హనుమాన్‌జంక్షన్ రూరల్): అప్పటి వరకూ హుషారుగా, కేరింతలు కొడుతూ ఆడుకున్న పిల్లలు కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. బాపులపాడు మండలం రేమల్లేలో పెను విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్లితే.. అస్సాంకు చెందిన ఎండీ షాజహన్ ఆలీ, సంగీత, అమీనా బేగం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ హాసీం, రపెరన్లు జీవనోపాధి నిమ్తితం ఇక్కడకు వచ్చారు. ఏడాది కాలంగా వారంతా ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం షాజహన్ ఆలీ రెండో కుమార్తె సుహానా పర్వీన్ (6), అమీనా బేగం మొదటి కూతురు రింపా యాస్మిన్ (6), షేక్ హాసీం మూడవ కుమార్తె అప్సానా (6)లు క్వార్టర్స్ ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగి కారును క్వార్టర్స్ వద్ద నిలిపి ఉంచటంతో ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ సరదాగా ఆ కారులోకి ఎక్కారు. ఆ తర్వాత కారు డోర్లు మూసుకుపోయి ముగ్గురు చిన్నారులు ఆ వాహనంలో ఇరుక్కుపోయారు. గంటపాటు కారులో ఉక్కిరిబిక్కిరై..! ఆడుకునేందుకు కారులోకి ఎక్కిన చిన్నారులకు ఆ తర్వాత డోర్లు తీయటం తెలియకపోవటం, సమీపంలో ఎవ్వరూ లేకపోవటంతో దాదాపు గంట సేపు కారులో నానా తంటాలు పడ్డారు. కారులో ఊపిరి అందక, ఆసలు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకువచ్చేందుకు మార్గం తెలియక, శ్వాస అందక ఆ చిన్నారులు చివరి నిముషాల్లో పడిన తాపత్రయం వర్ణనాతీతం. అభంశుభం తెలియని ఆ పిల్లలు కారులో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులకు గురై చివరకు మృతి చెందారు. కొద్దిసేపటికే అటుగా వెళ్తున్న కొందరు కార్మికులు కారులో పిల్లలు పడిపోయి ఉండటాన్ని గుర్తించి డోర్లు తీసేందుకు యత్నించారు. కారు యాజమానిని పిలిచి డోర్లు తెరిచే సరికే చిన్నారుల నోట్లో నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించి వీరవల్లి పోలీసులు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు చిన్నారులు మృతిపై ప్రాథమిక విచారణ చేపట్టారు. శోకసంద్రంలో మృతుల కుటుంబాలు.. అప్పటి వరకూ నవ్వుతూ, తుళ్లుతూ తిరిగిన తమ పిల్లలు మృతదేçహాలుగా మారటంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆర్తనాదా లు మిన్నంటాయి. క్వార్టర్స్‌లోని తోటి కార్మికులు ఈ దుర్ఘటనతో విషాదంలోకి జారుకున్నారు. మృతుల తల్లిదండ్రులను ఓదార్చటం కష్టతరమైంది. బ్రతుకు దెరువు కోసం వస్తే కడుపుకోత మిగిలిందని రోదించటం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. కాగా అస్సాం రాష్ట్రంలోని బష్కా జిల్లా తమల్పూర్ గ్రామానికి చెందిన షాజహాన్ ఆలీ, సంగీత దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కాగా సుహానా పర్వీన్ రెండో కుమార్తె. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని చుప్రిజారాకు చెందిన షేక్ హాసీం, రపెరన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా మృతి చెందిన అప్సానా మూడో సంతానం. అస్సాంలోని తమల్పూర్కు చెందిన అమీనా బేగం భర్త చనిపోవటంతో జీవనోపాధి కోసం తన కుమార్తె రింపా యాస్మిన్‌ను తీసుకుని ఇక్కడకు వచ్చింది. కాగా, ముగ్గురు ఆడ పిల్లలు రెండోవ తరగతి చదువుతున్నారు. -
నేనేమి చేశాను నేరం?
చంద్రగిరి : పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లికే భారమైందా? విధి రాతకు ఎదురీదలేని ఆ తల్లి బిడ్డను ఇలా వదిలించుకుందా? వరకట్న వేధింపులా? అత్తింటి పోరా..? ఆర్థిక సమస్యలా..? లేక చేసిన తప్పుకు ప్రతిఫలమా..? కారణమేంటో తెలియ దు. కానీ అప్పుడే పుట్టిన ఆడ శిశువు చెట్లపొదల్లో కళ్లు తెరిచింది. ఆకలికి తాళలేక తల్లి పాలకోసం ఏడవడంతో అటుగా వెళుతున్న మహిళలు గుర్తించి, అక్కున చేర్చుకున్నారు. వెంటనే చుట్టూ బిడ్డ సంబంధీకులు ఎవరైనా ఉన్నారేమో అని చూశా రు. ఎవరూ కానరాకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఆ శిశువును అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ బిడ్డను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. శిశువు ఆచూకీ కోసం విచారిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సంఘటన తిరుచానూరు ప్రవేశ మార్గంలోని నిర్మానుష్య ప్రదేశంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది. -
వివాహితుడు, బాలిక ఆత్మహత్య
తూర్పుగోదావరి ,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పక్క పక్క బిల్డింగ్లు వారివి... ఏం జరిగిందో ఏమో.. ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని మృతదేహం వద్ద రోదించిన బాలిక కొద్ది సేపటికే ఇంటికెళ్లి ఉరేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి 16వ డివిజన్లోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ పది నిమిషాల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతి చెందిన వివాహితుడికి భార్య, ఐదేళ్ల పాప ఉండగా బాలిక తల్లి దుబాయ్‌లో పనికి వెళ్లగా తమ్ముడితో కలసి ఆమె ఇక్కడ ఉంటోంది. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై కె.శివాజీలు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం రామస్వామిపేటకు చెందిన రౌతు శివ (29) ఏడేళ్ల కిందట సత్యశ్రీని వివాహం చేసుకోగా ఐదేళ్ల రోషిణి సాయి కుమార్తె ఉంది. నాలుగేళ్ల నుంచి వారంతా వాంబే కాలనీలో ఉంటున్నారు. శివ, అతని భార్య సత్యశ్రీ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. గురువారం ఉదయం సత్యశ్రీ బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటి లోపల గడియపెట్టి ఎంత కొట్టినా భర్త శివ తీయకపోవడంతో పక్కింటి వారిని, ఇతరులను పిలిచింది. తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడంతో అతన్ని కిందకు దించి చూసే సరికి మృతి చెందాడు. శివ మృతదేహం వద్దకు బ్లాక్ నంబరు–6లో తమ్ముడితో కలసి ఉంటున్న దుర్గాదేవి (17) వచ్చి రోదించింది. ఈ లోగా ఆమెను అక్కడున్న వారిలో ఒకరు మందలించడంతో పరుగెత్తుకుని ఇంటికి వెళ్లి తలుపు వేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. తలుపు తీయకపోవడంతో బద్దలు గొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా దుర్గాదేవిని కిందకు దించారు. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్థిక సమస్యలే కారణం ఆర్థిక సమస్యలతోనే తన భర్త రౌతు శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సత్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం వస్త్ర దుకాణంలో పని చేస్తున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో కొంత ఆర్థిక సమస్య ఏర్పడిందని, దాని వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చెప్పింది. ఈ మేరకు ఎస్సై శివాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొట్టడం వల్లే మనస్తాపం చెంది.. అన్నగా పిలిచే శివ మృతదేహం వద్దకు దారా దుర్గాదేవి వెళ్లినప్పుడు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురు కొట్టడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక మేనమామ రమణ బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గాదేవి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లే డాడీ లే... అంటూ రౌతు శివ మృతదేహం వద్ద అతని భార్య సత్యశ్రీతో పాటు ఐదేళ్ల కుమార్తె రోషిణి సాయి కూర్చుని ‘లే డాడీ లే...’ అని అనడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. ఆ చిన్నారికి తామేం సమాధానం చెప్పాలంటూ సత్యశ్రీ, శివ తండ్రి రౌతు శ్రీను రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పాపతో కలసి జీవిస్తున్న తరుణంలో శివ ఆత్మహత్యకు పాల్పడడం మింగుడు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లికి ఏం చెప్పాలి దుర్గాదేవి మృతి చెందడంతో దుబాయ్‌లో ఉన్న ఆమె తల్లి సుజాతకు ఏం సమాధానం చెప్పాలని పిన్ని పగడాల సీతామహాలక్ష్మి రోదించింది. దుర్గాదేవిని తనకు అప్పగించి వెళ్లిన ఆమెకు తన ముఖం ఎలా చూపించాలంటూ బాధపడింది. అన్యాయంగా కొంతమంది కొట్టడంతోనే బాలిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. -
‘ప్రేమ్’నగర్లో పోలీసుల దాడి
సిరిసిల్లక్రైం: బాలికలను వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వేశ్యవృత్తిలోకి దింపుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సిరిసిల్లలోని ప్రేమ్‌నగర్‌లో సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఆరేళ్ల క్రితం ఓ యువతికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని నమ్మబలికి వ్యభిచార వృత్తిలోకి దింపడం.. ఈ విషయమై సదరు యువతి తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడం ఆదివారం రాత్రి జరిగింది. దీంతో ‘సాక్షి’లో ‘యువతికి విముక్తి’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. ఇదే సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు సిరిసిల్లలోని వేశ్యగృహాలపై దాడులు నిర్వహించారు. ఆ గృహాల్లో ఉన్నవారి నివాస ధ్రువీకరణ పత్రాలు విధిగా ఇవ్వాలని పోలీస్ అధికారి ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మైనర్లతో ఇలాంటి పనులు చేయిస్తే చట్టపరిధిలో చర్యలకు వెళ్తామని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవాలని, సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవ్వాలని, సదరు కాలనీవాసులపై నిఘా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలి : రూరల్ సీఐ సర్వర్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): పడుపు వృత్తిని నిర్వహిస్తూ అందరిచే చీత్కారాలకు గురై సమాజంలో చీడపురుగుల మారకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని అందరూ మెచ్చుకునే విధంగా గౌరవంగా బతకాలని రూరల్ సీఐ సర్వర్ అన్నారు. బుధవారం మండల కేంద్రలోని మానేరువాగు సమీపంలో గల వేశ్యగృహాలపై రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మహిళలు, యువతులు, చిన్నారులు ఎవరైనా ఉన్నారా అని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రతీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారో అడిగి, వారి ఆధార్‌కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు పరిశీలించారు. పడుపు వృత్తిని వీడనాడాలని కొత్త జీవితాలను ప్రారంభించాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి మహిళలు, యువతులు, చిన్నారులను తీసుకురావాడం, పడుపు వృత్తిని నిర్వహించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని గౌరవంగా బతకాలని సూచించారు. పోలీస్ ఆకస్మిక తనిఖీలు ఇకపై ఎప్పుడూ కొనసాగుతాయని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి ఎస్సై అభిలాష్, హెడ్ కానిస్టేబుల్ బుచ్చినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. చైల్డ్వెల్ఫేర్ ఆధ్వర్యంలో తనిఖీ.. ఇతర ప్రాంతాల నుంచి యువతులు, చిన్నారులను తీసుకవచ్చి బలవంతంగా వారిచే పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తంగళ్లపల్లి వేశ్యావాటికలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. -
చిన్నారికి సరికొత్త జీవితం!
గచ్చిబౌలి: జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. వివరాలివీ... గ్రీష్మిక వెన్నెముక వైకల్యంతో జన్మించింది. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ చిన్నారిని మార్చిలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమెకు పుట్టకతోనే గూని ఉందని వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కె.కృష్ణ చైతన్య గుర్తించారు. ఇది చాలా క్లిష్టమైనది కావడంతో బాలికకు ఒకసారి కాకుండా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసి ఆమెకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రాడ్‌ను పొడిగిస్తూ పోవాలి. వెన్నెముక ఎదుగుదలతోపాటే రాడ్ పొడవు కూడా పెంచాలి. అప్పుడే సమస్య పూర్తిగా నయమవుతుంది. సాధారణంగా ప్రతి 2 వేల మందిలో ఒకరికి ఇలా పుట్టుకతోనే గూని వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లలకు ఇది రావడంతో వాళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. శస్త్రచికిత్స ద్వారా గ్రోయింగ్‌రాడ్ వేశాం: డాక్టర్ కృష్ణచైతన్య వైకల్యం కారణంగా గ్రీష్మిక చిన్నచిన్న ఆనందాలకూ దూరమైందని కిమ్స్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కృష్ణచైతన్య సోమవారం తెలిపారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. ఆమెకు గ్రోయింగ్‌రాడ్ వేయాల్సి వచ్చిందని, పాపకు 13 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆమె ఎదుగుదలకు ఇది అత్యవసరమని గుర్తించి వేశామన్నారు. మొదటి శస్త్రచికిత్స 2019 మార్చిలో చేసి అందులో డి3/డి4, ఎల్3/ఎల్4 వద్ద యాంకర్ స్క్రూలు బిగించామన్నారు. రెండో శస్త్రచికిత్సను ఈ నెలలోనే చేసి ఆ స్క్రూలను కొంత విస్తరించామన్నారు. మొదటి చికిత్సకు ఆరు గంటల సమయం పట్టిందని, రాడ్లు, స్క్రూలు వేసి వెన్నెముకను సరిచేశామన్నారు. ఇందుకోసం మేము ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్ 3డి ప్రింటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. చిన్న వయసులో గుర్తిస్తే పిల్లల్లో ఇలాంటి వైకల్యాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా నయం చేయవచ్చన్నారు. సమావేశంలో ఆర్థోపెడిక్ స్పైన్ విభాగాధిపతి డాక్టర్ అన్నె సాయిలక్ష్మణ్, ట్రామా అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ సి.ఆర్.సురేష్‌బాబు, మత్తు వైద్య నిపుణుల బృందం పాల్గొన్నారు. -
తల్లిలాంటి వదినే బాలికను..
నిర్భయ, దిశ వంటి అనేక కఠినమైన చట్టాలు వస్తున్నా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై సైతం కామాంధులు కన్నేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా వారి జీవితాలను బుగ్గి చేస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయడంతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు బాలికలపై జరిగిన అఘాయిత్యాలు బయటపడటం కలవరపెడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు :కంటికి రెప్పలా కాపాడాల్సిన అయిన వారే వారి పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రక్షించాల్సిన వారే తమ జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా రోదిస్తున్నారు. విషయం బయటపడితే తమతో పాటు కుటుంబ పరువు పోతుందనే భయంతో పంటి బిగువున బాధను భరిస్తూ నరకయాతన పడుతున్నారు. ఒక పక్క కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అంతకంటే భయంకరమైన కొన్ని మానవ మృగాలు అభం శుభం తెలియని మైనర్ బాలికలపై తమ కామ వాంఛను తీర్చుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న అమానవీయ ఘటనలు వింటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన, మనోవేదనలకు గురవ్వాల్సిన దుస్థితి దాపురించింది. తమ జీవితాలను బాగు చేయాల్సిన తల్లిదండ్రులు, అన్న వదినలు, అక్కాచెల్లెళ్లు ఇలా పేగుబంధాలనే నమ్మలేని దుర్భర పరిస్థితి నెలకొంది. జిల్లాలో మైనర్ బాలికలపై జరుగుతున్న వరుస దుర్ఘటనలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ♦ జిల్లాలో గత వారం రోజుల్లో మూడు దుర్ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కావలి సమీపంలోని ముసునూరు ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక వారి వద్ద నుంచి వచ్చి అన్న, వదినల వద్ద ఉంటుంది. అయితే తల్లి తరువాత తల్లిలా భావించే వదినమ్మే ఆ బాలికను డబ్బు కోసం ఓ వ్యభిచార ముఠాకు రూ.27 వేలకు అమ్మివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను డబ్బిచ్చి కొన్న వ్యభిచార ముఠా కందుకూరు శివారు ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ బాధ భరించలేక వారి నుంచి తనకు రక్షణ కల్పించమంటూ సదరు బాలిక డయల్ 100 కు ఫోన్ చేయడంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కందుకూరు పోలీసులు బాలికను వ్యభికార కూపం నుంచి రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించే ముఠాతో పాటు ఆమె వదినపై కూడా దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన అయిన వారి అండ కోరుకునే బాలికలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ♦ ఒంగోలు నగరంలో జరిగిన మరో ఘటన అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ఉంది. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. కొంతకాలం పాటు కుమార్తెలిద్దరూ తల్లి వద్దే ఉన్నారు. అయితే తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కుమార్తె అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె మాత్రం తల్లివద్దనే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. అయితే తల్లి బలరాం కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం సాగిస్తోంది. అయితే ఆ కామాంధుడి కన్ను తన కూతురులాంటి మైనర్ బాలికపై పడింది. ఈ క్రమంలో మైనర్ బాలికను బెదిరించి రెండుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా కామాంధుడిని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ఆమె గోల చేయవద్దంటూ కూతురికి నచ్చజెప్పి ఇద్దరికి పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే తల్లితో సహజీవనం చేసే వ్యక్తితో తనకు పెళ్లి ఏంటని భావించిన బాలిక బేస్తవారిపేటలోని అమ్మమ్మ ఇంటికి చేరుకుని విషయం తెలియజేసింది. దీంతో బాధితులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా కామాంధుడితో పాటు అతనితో సహజీవనం చేస్తున్న బాలిక తల్లిపై సైతం కేసు నమోదైంది. కంటికి రెప్పలా చూడాల్సిన తల్లి కన్న కూతురినే తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిన ఆమెను విషయం తెలిసిన వారంతా ఛీత్కరించుకుంటున్నారు. ♦ కొత్తపట్నంలో ఆలస్యంగా మరో ఘటన వెలుగు చూసింది. తల్లి చనిపోయి, తండ్రికి చూపు సరిగా కనిపించక ఉన్న బాలికపై ఓ కామాంధుడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిగా ఉంది. అయితే కామాంధుడు చేసిన పాపానికి శాపమై తన కడుపులో బిడ్డగా పెరుగుతున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను మథనపడుతూ మౌనంగా రోదిస్తున్న తరుణంలో దీనిని గమనించిన మేనత్త గట్టిగా ప్రశ్నించడంతో మృగాడి దాష్టీకాన్ని బయటపెట్టింది. దీంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ♦ ఇలా చెప్పుకుంటూ పోతే మైనర్ బాలికలపై వరుసగా లైంగిక దాడులు, అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు బయటికి వచ్చేవారు కాదు. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరగదనే భయంతో పరువు పోతుందనే ఆందోళనతో రహస్యంగా ఉంచేవారు. అయితే దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు మైనర్ బాలిక, మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుండటంతో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి
తూర్పుగోదావరి ,అల్లవరం: ఓ బాలికను యువకుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు అల్లవరం పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రామచంద్రపురానికి చెందిన పోలినాటి మణితేజ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే ఓ బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. దీంతో ఆమె ఓడలరేవులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. బీవీసీలో ఇంజినీరింగ్ చదువుతున్న మణితేజ ఆ బాలిక అమ్మమ్మ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. ఈ సమయంలో బాలికతో పరిచయం పెంచుకున్నారు. అక్కడితో ఆగకుండా పరిచయాన్ని కాస్తా పెళ్లి వరకు తీసుకొచ్చాడు. బాలికకు పెళ్లి ఇష్టం లేకపోయినా గత నెల 29న తన స్నేహితులతో బలవంతంగా తీసుకొచ్చి బెండమూర్లంక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి రామచంద్రపురానికి తీసుకెళ్లాడు. అక్కడేం జరిగిందో బలవంతంగా పెళ్లి చేసుకున్న మణితేజ నుంచి తప్పించుకుని శనివారం అల్లవరం పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఎస్సై బి.ప్రభాకరరావు కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాసూమ్ బాషా దర్యాప్తు చేపట్టారు. -
అంతులేని వ్యథ
గతి తప్పిన బాల్యం.. గమ్యం లేని ప్రయాణం.. లక్ష్యం లేని జీవితం.. ఎక్కడ పుట్టామో తెలియదు.. ఎలా బతకాలో అర్థం కాదు.. తల్లిదండ్రులు ఉన్నారో లేదో గుర్తులేదు.. అనాథ బాలలు వీరు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి ఒకరు.. కుటుంబం నుంచి తప్పిపోయి మరొకరు.. ఇలా జీవన పోరాటంలో భిక్షాటన చేస్తూ.. బాలల సంరక్షణ కేంద్రాలకు చేరిన అభాగ్యులు వారు. ఇలాంటి వారిలో కొందరినైనా సొంత గూటికి చేర్చేందుకు ఆయా ప్రాంతాల్లోని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్) సిబ్బందిప్రయత్నిస్తూనే ఉంటారు. పలమనేరు: పదేళ్ల తర్వాత ఒడిశాలోని చిల్ట్రన్ హోమ్‌నుంచి వీకోట మండలంలోని తన స్వగ్రామమైన బోడిగుట్లపల్లి చేరుకున్న అనామిక కథ తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధువుల చెంతకు చేరిన ఆ బాలిక చిన్న నాటి నుంచి తన వారి చెంతకు చేరాలని తాను పడ్డ తపన.. బాధలు.. వారితో పంచుకుంది. తన లాగే మన జిల్లాకు చెందిన వారు అక్కడి దయావిహార్లో ఉన్నారని ఇక్కడి అధికారులకు తెలిపింది. దీంతో వారిని సైతం తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమ్మానాన్న చెంతకు చేరాలని ఓ బాలిక ఆరాటం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒడిశాలోని పూరి ప్రాంతం నుంచి అక్కడి స్వచ్ఛంద సంస్థల ద్వారా కనాస్ హోమ్‌లో ఉన్నట్టు అనామిక ఇక్కడి ఐసీపీఎస్ అధికారులకు చెప్పింది. తనకు తెలుగు కొద్దిగా వచ్చు కాబట్టి తనతో ఆ బాలిక వివరాలు చెప్పి తనను ఎలాగైనా సొంత ఊరికి చేర్చాలని రోదించిందట. దీంతో ఆబాలిక చిరునామా.. ఫోటోల కోసం ఇక్కడి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్‌ది మరోకథ ఎక్కడినుంచి వచ్చాడో తెలియని విజయ్ తిరుపతిలోని చిల్ట్రన్ హోమ్‌కు ఎనిమిదేళ్ళ క్రితం చేరాడు. ఇప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాల మేరకు పత్తికొండ అడవిలో తమ తల్లిదండ్రులున్నట్టు అక్కడి అధికారులకు తెలిపాడు. దీంతో చిత్తూరు నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లెల శివ ఆ బాలుడి తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు. సంబంధిత అంగన్వాడీ వర్కర్ల ద్వారా చిరునామా అన్వేషణ చేపట్టారు. జిల్లాలో పత్తికొండ గ్రామం గంగవరం మండలంలో ఉన్నట్టు గుర్తించి గత రెండు రోజులుగా స్థానిక సీడీపీవో రాజేశ్వరి సిబ్బంది కలసి ఆరా తీశారు. ఎట్టకేలకు పత్తికొండ సమీపంలోని అటుకురాళ్ళపల్లి అటవీ ప్రాంతంలో విజయ్ తల్లిదండ్రులను కలిశారు. చిన్నప్పుడు తప్పిపోయిన వారి కుమారుడు తిరుపతిలో ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఆ మాట చెప్పగాని తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారని అధికారి అనుకున్నారు. అయితే వారు ‘‘ఉంటే ఉండనీ.. వాడు ఇక్కడికొస్తే మాలాగే పాములు పట్టి ఆడించుకోవాల్సిందేగా’’ అన్ని నిట్టూర్చినట్టు తెలిసింది. దీంతో చేసిదిలేక విజయ్‌కు ఏదైనా చేతిపని నేర్పించి ఆపై స్వగ్రామానికి పంపేలా అధికారులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటివారెందరో? చిన్నతనంలో పారిపోయిన పక్క రాష్ట్రాల్లో వీధిబాలలుగా ఎందరో జిల్లాకు చెందిన చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా వారు పట్టణాల్లోని చిల్డ్రన్ హోమ్‌లకు చేరుతుంటారు. వారిని 18 సంవత్సరాల దాకా మాత్రమే అక్కడ ఉంచుకుంటారు. ఆపై తల్లిదండ్రుల సమాచారం లభిస్తే వారి చెంతకు చేర్చుతుంటారు. లేదంటే వారి దారిన వారిని వదిలేస్తుంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కార్యాలయాలుంటాయి. అక్కడి హోమ్‌లోని బాల, బాలికల వివరాల మేరకు సంబంధిత రాష్ట్రం, జిల్లాలకు ఈ కార్యాలయాలనుంచి సమాచారం అందుతుంటోంది. అయితే ఆ అభాగ్యుల భాగ్యం బాగుంటే వారు తల్లిదండ్రులకు చెంతకు చేరే అవకాశం ఉంటుంది. దశాబ్దాల నిరీక్షణలో ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులకు వద్దకు చేర్చేందుకు సంబంధిత అధికారులు మరింత చొరవ చూపితేనే వారి బతుకులు మారుతాయి. -
రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి
ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
కాలేయం చెడిపోయి.. పాపం.. పసిప్రాణం
ఎనిమిదేళ్ల చిన్నారి కాలేయ వ్యాధితో మంచానికే పరిమితమైంది. కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పసిప్రాణం అల్లాడుతోంది. ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో ఆ బిడ్డ మంచానికే పరిమితమైంది. 15 రోజుల్లో కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. చికిత్సకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని అర్థిస్తున్నారు. తిరుపతి తుడా : స్థానిక గోవిందనగర్ (రెండుమద్దిమాన్లు)లో కాపురం ఉంటున్న కె.మునెమ్మ, కె.సత్యనాగరాజు దంపతులకు కె. జోత్స్న(8) ఏకైక కుమార్తె. తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్‌లో రూ.7వేల వేతనంతో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సత్యనాగరాజు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోత్స్న అనారోగ్యం బారిన పడడంతో ఆస్పత్రిలో చూపించారు. కామెర్లు అని తేల్చి వైద్యులు చికిత్స చేశారు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. రుయా వైద్యుల సూచన మేరకు చెన్నైలోని ఎగ్మోర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు చేసిన చికిత్సతో కొంతవరకు జోత్స్న కోలుకోవడంతో తిరిగి వచ్చారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. మళ్లీ సమస్య తిరగబెట్టడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో లివర్ ఫెయిల్యూర్ అని ధ్రువీకరించారు. హుటాహుటిన చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో 15రోజుల్లోపు కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని తేల్చి చెప్పడంతో హతాశులయ్యారు. తన కుమార్తెను బతికించేకునేందుకు కాలేయదానం చేయడానికి సత్య నాగరాజు ముందుకొచ్చాడు. అయితే మార్పిడికి మాత్రమే రూ. 19.50 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో దిక్కు తోచలేదు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. మరోవైపు జోత్స్న ఉదర భాగం రోజు రోజుకూ ఉబ్బిపోతుండంతో దిక్కుతోచని స్థితిలో సాక్షికి తమ గోడు నివేదించారు. దాతలు ఎవరైనా సాయం చేయదలిస్తే...బాధితురాలి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు: కె. సత్యనాగరాజు, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 20219069477, ఐఎఫ్‌సీ కోడ్ ఎస్బీఐఎన్ 000610, ఎస్బీఐ టీటీడీ ఏడీ బిల్డింగ్ బ్రాంచ్. -
బాబాయే బాలికను వెంబడించి..
నెల్లూరు ,ఆత్మకూరు: పొలంలో మేకలు మేపుకునేందుకు వెళ్లిన బాలికను వెంబడించి మాయమాటలతో మభ్యపెట్టి బాబాయి వరసైన వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం మేరకు ఆత్మకూరు మండలం బసవరాజుపాళెం గ్రామానికి చెందిన ఓ మైనర్(12) మూడు రోజుల క్రితం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లింది. ఆ బాలికకు బాబాయి వరసయ్యే యువకుడు తిరుపతయ్య(ఉరఫ్ సురేష్) ఆ బాలికను వెంబడించి పొలంలో మాయమాటలు చెప్పాడు. సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూపించి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఎంత కష్టం వచ్చింది తల్లీ..
తూర్పుగోదావరి,రాజోలు: కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లకు వెళ్లేందుకు ఆ చిన్నారి నానా పాట్లు పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు పిల్లలతో కలసి ఓ గృహిణి తన స్వగ్రామం పొదలాడ వచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా తల్లి, ఎనిమిదేళ్ల కుమారుడికి పాజిటివ్ అని తేలింది. ఆధార్ నంబర్ సమస్య కారణంగా ఐదేళ్ల చిన్నారికి టెస్ట్ చేయలేదు. పాపకు కూడా కరోనా పరీక్ష చేయాలనే డిమాండ్‌తో డిమాండే తప్ప పొదలాడ నుంచి తాటిపాక పీహెచ్‌సీకి ఆ చిన్నారిని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రాజోలు నుంచి కరోనా పరీక్ష కోసం వెళుతున్న ఓ యువకుడు చిన్నారిని తాటిపాక పీహెచ్‌సీకి తీసుకు వెళ్లేందుకు ముందుకు వచ్చాడు. ఆరోగ్య సిబ్బంది తీసుకొచ్చిన రెయిన్ కోటు అమ్మమ్మ చిన్నారికి వేయగా.. మాస్క్ ఇతర జాగ్రత్తలతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ చిన్నారి మోటార్‌సైకిల్ ఎక్కి కరోనా టెస్ట్‌కు వెళ్లింది. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య.. భర్త అరెస్ట్
ముంబై: ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్యను చంపుతానంటూ బెదిరింపులకు దిగడమే కాకుండా ఆసుపత్రి సిబ్బందిని గాయపరిచిన వ్యక్తిని బరామతి(పుణే) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన కృష్ణ కాలే భార్య జూన్ 25న బరామతి డోర్లేవాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేని కాలే మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యను చంపుతానంటూ గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆస్పత్రి సిబ్బందిపై రాళ్లతో దాడి చేశాడు. అంతేగాక తన భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి) దీంతో బరామతి పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బరామతి సీనియర్ ఇన్స్పెక్టర్ ఆడుంబర్ పాటిల్ మాట్లాడుతూ.. ‘కాలే ఆసుపత్రికి వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చినందుకు భార్యను వేధించడమే కాకుండా అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. ఇక అతడిని అరెస్టు చేసి ఐపీసీ 353 (విధిలో ఉన్న ఒక ప్రభుత్వ సేవకుడిపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం), 333 (తన విధిని నిర్వర్తించడంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర హాని కలిగించడం), 504 (50) (శాంతిని ఉల్లంఘించడం) 506 (నేర బెదరింపులు) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని పేర్కొన్నారు. (కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు) -
తండ్రి స్నేహితుడి ఘాతుకం
చేవెళ్ల: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం ఇంటికి వెళ్లాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఖానాపూర్‌లో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి(55), బాధితురాలి తండ్రితో కలిసి స్థానికంగా కూలీ పనులు చేస్తుంటాడు. ఒకే గ్రామం కావటంతో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. అయితే, బుధవారం మద్యం మత్తులో ఉన్న జనార్దన్‌రెడ్డి బాలిక తండ్రి కోసం ఇంటికి వెళ్లాడు. ‘మీ నాన్న లేడా అని బాలికను ప్రశ్నించాడు. ఇంట్లో ఎవరులేరని, అమ్మానాన్న పనిమీద బయటకు వెళ్లార’ని బాలిక అతడికి చెప్పింది. దీంతో బాలిక ఒంటరిగా ఉందని గమనించిన జనార్దన్‌రెడ్డి ఆమె చేయి పట్టుకొని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రం ఇంటికి వచ్చారు. అదేరోజు రాత్రి పోలీసులకు పిర్యాదు చేశారు. సీఐ బాలకృష్ణ నిందితుడు జనార్దన్‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పాపకు ప్రాణం పోద్దాం!
పాలకుర్తి టౌన్: ముచ్చటైన జంట కడుపున ఇద్దరు కవల పిల్లలు పురుడుపోసుకున్నారు. వారి ఎదుగుదలను చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. బుడిబుడినడకలు, ముద్దు మాటలతో ఆ లేత మొగ్గలు కన్నవారికి కనులపండుగ చేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 15 నెలల ప్రాయంలో చిన్న కూతురు హృదయ సంబంధిత వ్యాధి బారిన పడి కన్నుమూసింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. కన్నీళ్లను దిగమింగి పెద్ద కూతురు ఆలనా పాలనా చూస్తూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో పెను ఉప్పెనలా మరో విపత్తు వచ్చి పడింది. పెద్ద కూతురు మనస్విని కేన్సర్ బారిన పడింది. ప్రాణాలకు భరోసా లేదని, ఖరీదైన వైద్యం చేస్తే తప్ప పాపను బతికించడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై హైదరాబాద్‌లో చిరుద్యోగంలో కుదురుకున్న మధ్యతరగతి తండ్రి ఈ పిడుగులాంటి వార్తతో కుదేలయ్యాడు. ఉన్న ఒక్క బిడ్డను బతికించుకోవాలని ఆ తండ్రి పడుతున్న తపన వర్ణనాతీతం. కేన్సర్ బారిన పడి బతుకు పోరాటం చేస్తున్న ఆ బిడ్డకు దాతలు ఆపన్నహస్తం అందిస్తే ప్రాణం నిలబడుతుంది. సమాజంలో మానవత్వం పరిఢవిల్లుతుంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. ప్రమాదకరమైన వ్యాధి బారినపడి బతుకు పోరాటం చేస్తున్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు నానా పాట్లు పడుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం వైద్యానికి ఖర్చు చేశారు. రోజుకు రూ.వేలల్లో వైద్య ఖర్చులకు చెల్లించాల్సి రావడం వారికి భారంగా మారింది. చాలీచాలని వేతనంతో బతుకుబండి లాగుతున్న మధ్య తరగతి వేతన జీవికి వైద్య ఖర్చులు భరించే స్థితి లేదు. పాపను కాపాడుకునే దారి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతలు సాయమందించి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నారు. ఖరీదైన వైద్యం.. భరించలేని దైన్యం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన భారత మల్లేష్ – భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు. మల్లేష్ హైదరాబాద్‌లోని జీవీకే కంపెనీలో చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న క్రమంలో కనురెప్పలపై కాలం కన్నెర్రజేసింది. చిన్న కూతురు మనస్విత 15 నెలల వయస్సులో ‘రెస్ట్రిక్టవ్ కార్డియోపతి’ వ్యాధి బారిన పడి రెండేళ్ల క్రితం తనువు చాలించింది. బోసినవ్వుల బిడ్డ అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టడంతో కుటుంబం షాక్‌కు గురైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పెద్ద కూతురు మనస్విని అల్లారుమద్దుగా పెంచుకున్నారు. మూడేళ్ల వరకు ఆ బిడ్డకు ఎలాంటి నలత లేదు. ఆ తర్వాత తరుచూ అనారోగ్యం బారిన పడటం మొదలైంది. ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే ‘అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా’ అనే కేన్సర్ సోకిందని వైద్యులు తేల్చారు. వైద్య ఖర్చులు రూ.20 లక్షల వరకు అవుతాయని, అంతకంటే ఎక్కువైనా భరిస్తే తప్ప పాప ప్రాణం నిలబడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంత డబ్బు లేకున్నా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాత్కాలికంగా వైద్యం అందిస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు భారత మల్లేష్, ఎస్బీఐ ఖాతా నంబర్ 3159 04824 88, పాలకుర్తి ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0014240 ఫోన్ పే / గూగల్ పే నంబర్ : 97042 23003 -
చిన్నారి ప్రాణం విలువ రూ.60వేలు?
మహబూబ్‌నగర్, నారాయణపేట: జ్వరం భారిన పడి వైద్యం కోసం వస్త వైద్యుడి నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణం పోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా.. రూ.60వేలు అందిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఆన్పూర్కు చెందిన సాబెన్న మూడేళ్ల కుమార్తె భూమిక మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్వరం, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి ఆ చిన్నారి కదలకపోవడంతో వైద్య సిబ్బందిని సంప్రదించారు. వారు వెంటనే వైద్యుడికి సమాచారం ఇవ్వగా, ఆయన వచ్చి పరీక్షించి బాలిక పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలిన సూచించారు. 4 నుంచి 5 గంటల మధ్యలో అంబులెన్స్‌లో హైదరాబాద్ బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లాక మార్గమధ్యలోనే చిన్నారి మృతిచెందింది. దీంతో వెనుదిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రాణం ఖరీదు రూ. 60 వేలు?! వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబీకులు రెండుగంటల పాటు వైద్యుడితో వాదనకు దిగారు. వారి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిదాటే సమయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇరువురిని సముదాయించారు. ఆటు వైద్యుడితో.. ఇటు చిన్నారి తండ్రితో పాటు బంధువులను కూర్చోబెట్టి శాంతింపజేశారు. వైద్యుడి అందించిన చికిత్సలపై వారు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టుబట్టారు. అయితే, తనవల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, మీరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుపెట్టుకోవచ్చని, ఏదైనా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులు తెలుస్తుందని వైద్యుడు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించి తండ్రి హన్మంతుతో పాటు మరో వ్యక్తిని వైద్యుడి వద్దకు పంపించారు. చివరకు వైద్యుడు రూ.60 వేలు చెల్లిస్తానని ఒప్పుకోవడంతో మా పాప ప్రాణామే పొయింది.. నా బిడ్డ ప్రాణం ఖరీదు రూ.60వేలా అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నారి మృతదేహాన్ని తీసుకొని కర్ణాటకలోని అన్పూర్కు వెనుదిరిగి వెళ్లిపోయారు. మా నిర్లక్ష్యం ఏమీ లేదు చిన్నారి మృతి చెందడంలో తమ ఆస్పత్రి నిర్లక్ష్యం ఏమీ లేదు. రాత్రి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా బాగానే ఉంది. తెల్లవారుజామున కదలడంలేదని చెప్పడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించా. మధ్యలోనే మృతిచెందడంతో ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. తమ తప్పులేదని చెప్పాం. అయినా న్యాయం చేయాలని కోరారు. అడ్మిట్, అంబులెన్స్ ఖర్చులు ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకున్నాం. – డాక్టర్ రంజిత్‌కుమార్,చిన్నపిల్లల వైద్యుడు, నారాయణపేట ఆందోళన...వైద్యుడితో వాదన ఉదయం 6గంటలకు చిన్నారి మృతదేహంతో సదరు ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణం పోయిందంటూ వైద్యుడితో వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగిన వారిని శాంతిపజేశారు. -
ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం
రంగారెడ్డి, దోమ: భర్త వేధింపులు తాళలేక ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల్ గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత(17)ను అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి మూడు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిరువురు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. ఈ క్రమంలో తనను భర్త తరచు వేధింపులకు గురిచేస్తున్నాడని నవనీత తల్లికి పలుమార్లు తెలిపింది. నెల రోజుల క్రితం శివకుమార్‌రెడ్డి నవనీతను తల్లిగారి ఇంట్లో వదిలేసి వెళ్లగా ఆదివారం రాత్రి ఆమె తల్లిగారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు వచ్చి చూసేసరికి ఆమె మృతిచెందింది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.(తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో) బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం. బాలిక ఆత్మహత్య చేసుకోవడంపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. మైనర్లు ఇలాంటి చర్యలకు పాల్పడడం కేవలం సినిమా, టీవీ సీరియల్స్ ప్రభావమని, మైనర్ల వివాహం చెల్లదని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాలు జరపాలని డిమాండ్ చేశారు. -
వ్యభిచార రొంపిలోకి బాలిక
నెల్లూరు(క్రైమ్): ఓ బాలిక(మైనర్) ఆర్థిక ఇబ్బందులతో ఉందని గ్రహించిన ఓ ముఠా నగదును ఆశగా చూపి ఆమెను వ్యభిచార రొంపిలోకి దించారు. సుమారు ఆరు నెలలుగా బాలికను విటుల వద్దకు పంపుతూ సొమ్ముచేసుకోవడంతోపాటు ఆమెను ఇబ్బందులకు గురిచేయసాగారు. దీంతో బాధిత బాలిక ముఠా కళ్లుగప్పి పరారై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి కుటుంబాన్ని వదిలి మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోసాగింది. పూట గడవడం కష్టంగా మారింది. దీంతో సదరు బాలిక సుమారు ఆరు నెలల క్రితం విజయవాడలోని తన పిన్ని ఇంటికి వచ్చి ఉండసాగింది. అక్కడ రామకృష్ణ అలియాస్ కృష్ణ అతని భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆమె తన ఆర్థిక పరిస్థితిని వివరించి పని చూపించమని వారిని కోరింది. అయితే వారు తాము చెప్పినట్లు వింటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మించి బాలికను వ్యభిచార కూపంలోకి దించారు. విజయవాడలో కొంతకాలం ఉంచి అనంతరం లాక్డౌన్ ముందుగా బాలికను నెల్లూరులోని హరనాథపురంలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ వద్ద ఉంచారు. కృష్ణ దంపతులు, మహిళ, ఆమె తమ్ముడు పృథ్వీరాజ్, మరిది వినయ్‌కుమార్ తమకు తెలిసిన వారి వద్దకు బాలికను పంపి సొమ్ము చేసుకోసాగారు. బాలికకు డబ్బులు కూడా ఇచ్చే వారు కాదు. బాలిక తన తల్లి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకోసాగారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన బాలికను నిర్వాహకులు కారులో ఎక్కించుకుని మైపాడు వద్ద వదిలిపెట్టారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కె.శ్రీనాథ్ (తలారి) ఆమెను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. శ్రీనాథ్ అర్ధరాత్రి అయిన తర్వాత తిరిగి ఆమెను నిర్వాహకుల వద్ద వదిలివెళ్లాడు. వారు కారులో ఎక్కించుకుని నెల్లూరుకు బయలుదేరారు. ఇందుకూరుపేట మండల పరిధిలోని మొత్తలు వద్ద వారు కారు ఆపి మూత్రవిసర్జనకు వెళ్లగా బాలిక తప్పించుకుంది. ఈ మేరకు బాధిత బాలిక ఈ నెల 30వ తేదీ ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జరిగిన విషయాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు కేసు నమోదు చేశారు. రూరల్ డీఎస్పీ వై.హరినాథ్‌రెడ్డి నేతృత్వంలో నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్ఐ పి.నరేష్, మహిళా ఎస్ఐ ఆదిలక్ష్మి, సిబ్బంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితులు రామకృష్ణ, అతని భార్య పరారు కాగా మిగిలిన వారు 31వ తేదీ సాయంత్రం కొరుటూరు వద్ద ఉండగా వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సూత్రదారుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసును త్వరితగతిన చేధించిన సీఐ కె.రామకృష్ణ, ఇందుకూరుపేట ఎస్ఐ పి.నరేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పూర్తిస్థాయి విచారణ ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని విలేకరులు డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు అధికారి పాత్రపై ఆరోపణలు వచ్చిన మాట మాత్రం వాస్తవమేనని, అయితే ప్రాథమిక విచారణలో అతని ప్రమేయం లేదని డీఎస్పీ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. -
బాలికను గర్భవతిని చేసి.. కులం పేరుతో..
రంగారెడ్డి, కొత్తూరు: ప్రేమపేరుతో బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఓ యువకుడు వదిలేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ అంటూ వదిలేయడంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేందర్ (21), బాలిక ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమమాయలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట కుటుంబసభ్యులు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. బాలికను వివాహం చేసుకోనని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై సీఐ చంద్రబాబును వివరణ కోరగా బాలిక ఫిర్యాదు వాస్తవమేనన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ట్రాక్టర్ కిందపడి బాలిక దుర్మరణం
కట్టంగూర్ ( నకిరేకల్) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ కిందపడి ఓ బాలిక దుర్మరణం చెందింది. ఈ ఘటన మండలంలోని పరడ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన మార్త వాణి(15) తన తల్లిదండ్రులు, అక్కయ్యతో కలిసి వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని నలుగురు నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో అదే దారిగుండా గ్రామంలోకి వెళుతున్న లింగయ్యట్రాక్టర్ ఎక్కి ఇంజన్ మడ్‌గర్‌రేకుల మీద కూర్చున్నారు. అదే దారిలోని జోలం ఎర్రయ్య బావి సమీపంలోకి రాగానే వర్షం మొదలైంది. ఆ సమయంలో బాటపై ఉన్న రాయిని ఇంజన్ పెద్ద టైర్ ఎక్కడంతో మడ్గర్ రేకుపై ఉన్న వాణి కిందపడింది. ఈ క్రమంలో ట్రాలీ టైరు బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వెంకటనర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జీ. కరుణప్రసాద్ తెలిపారు. -
బాలికను వేదిస్తున్న ‘ఈ–పోకిరీ’ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఓ మైనర్‌ను వేధిస్తున్న సైబర్ పోకిరీపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. స్పందించిన అధికారులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. పాతబస్తీలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన బిలాల్ ఇన్‌స్ట్రాగామ్‌లో మారుపేరుతో ఖాతా తెరిచాడు. దీని ఆధారంగా అనేక మంది యువతులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వారితో తొలినాళ్లలో స్నేహపూర్వకంగానే వ్యవహరించే వాడు. ఆ తర్వాత అసభ్యకర, అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇలా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఎవరైనా బిలాల్‌ను బ్లాక్ చేస్తే.. మరోకొత్త పేరుతో, వేరే ఖాతా తెరిచేవాడు. ఇలా ఇంతకు ముందు తనను బ్లాక్ చేసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. యాక్సెప్ట్ చేస్తే మళ్లీ వేధింపులు మొదలెట్టేవాడు. ఈ రకంగా బిలాల్ ఇప్పటి వరకు 15 ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు తెరిచినట్లు తేలింది. బిలాల్ వేధింపులు తారాస్థాయికి చేరడంతో ఇతడిని ఫాలో అవుతున్న వారి లిస్ట్ ఆధారంగా ఒకరితో మరొకరు సంప్రదించుకున్నారు. ఫలితంగా ఇతగాడు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో వారంతా కలిసి బిలాల్‌ను మందలిస్తూ, ఇదే ధోరణి కొనసాగితే తాము పోలీసులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అయినా అతడి వ్యవహారశైలిలో మార్పు రాలేదు. దీంతో ఇటీవల ఓ బాలిక ఆన్లైన్ ద్వారా సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన అధికారులు నిందితుడు బిలాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
విల్లుపురంలో దారుణం
సాక్షి, చెన్నై: పాత కక్షలకు అభంశుభం తెలియని బాలిక సజీవ దహనమైంది. ఆమె తండ్రిపై ఉన్న వ్యక్తిగత కక్షలతో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నాయకులు కిరాతకానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక కాళ్లు చేతులు కట్టి పడేశారు. నోట్లో గుడ్డ కుక్కి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం బాలిక మృతి చెందింది. ఈ ఘటన విల్లుపురంలో చోటుచేసుకుంది. తిరువెన్నై నల్లూరు సమీపంలోని సిరుమదురై గ్రామానికి చెందిన జయపాల్ రాజీ దంపతులకు కుమారులు జయరాజ్ (16), జబరాజ్ (10), కుమార్తెలు జయశ్రీ (15), రాజేశ్వరి (12) ఉన్నారు. వీరికి సిరుమదురైలో రెండు కిరాన షాపులు ఉన్నాయి. జయశ్రీ((15) స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆదివారం జయపాల్ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని స్థానికలు గుర్తించారు. మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయలైన జయశ్రీని విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.. అదే రోజు సాయంత్రం బాలిక స్పృహలోకి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్ రంగంలోకి దిగారు. బాలిక వద్ద వీడియో వాంగ్ములం తీసుకున్నారు. ఇంట్లో తాను ఒంటరిగా ఉండగా మురుగన్, కళియ పెరుమాల్ తన కాళ్లు చేతులు కట్టేశారని..కేకలు పెట్టేలోపు నోటిలో గుడ్డను కుక్కేశారని వాపోయింది. అనంతరం నిప్పు పెట్టారని తెలిపింది. గాయాలు తాళలేక అరుపులతో ఆ బాలిక ఇచ్చిన వాంగ్ములం అక్కడి వారినే కలిచి వేసింది. వాంగ్ములంతో అధికారులు సిరుమదురైకు వెళ్లారు. పాతకక్షలతో.. అజ్ఞాతంలోకి వెళ్లేందుకు యత్నించిన మురుగన్, కళియ పెరుమాల్‌ను పోలీసులు పట్టుకున్నారు. తండ్రి జయపాల్‌పై ఉన్న కోపంతో బాలికను టార్గెట్ చేసినట్టు తేలింది. జయపాల్, మురుగన్ మధ్య పదేళ్లుగా వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం షాపు వద్ద జయశ్రీ సోదరుడు జయరాజ్‌పై మురుగన్ అనుచరులు దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందినానంతరం శనివారం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ కేసు విషయంగా ఆదివారం జయపాల్ కుటుంబం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఇది తెలుసుకున్న మురుగన్, కళియ పెరుమాల్ ఆగ్రహంతో కిరాతకానికి ఒడిగట్టారు. మృత్యువుతో పోరాడి.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో జయశ్రీ నరకాన్ని చవి చూసింది. 95 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను రక్షించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె వద్ద నుంచి న్యాయమూర్తి అరుణ్‌కుమార్ రెండుసార్లు వాంగ్ములం తీసుకున్నారు. సోమవారం మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది. కఠినంగా శిక్షించాలి.. మురుగన్ మాజీ కౌన్సిలర్ కాగా కళియ పెరుమాల్ అన్నాడీఎంకే స్థానిక పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం కాస్త రాజకీయ దుమారానికి దారి తీసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఎంకే నేత రాందాసు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్ అళగిరి, వీసీకే, వామపక్షాల నేతలు ఈ కిరాతకుల చర్యలను ఖండించారు. ఇద్దరికి కఠిన శిక్ష విధించే విధంగా నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని, విచారణను త్వరితగతిన పూర్తి చేసి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనపై జాతీయ బాలల కమిషన్ స్పందించింది. కేసును సుమోటాగా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఇద్దరిని అన్నా డీఎంకే నుంచి సస్పెండ్‌చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. -
తల్లి చర్మంతో చిన్నారికి చికిత్స
శ్రీకాకుళం,ఆమదాలవలస: ఒళ్లంతా గాయాలైన చిన్నారిని చూసి ఆ తల్లి తల్లిడిల్లింది. తనకు ఏమైనా పర్వాలేదు నవ మాసాలు మోసిన బిడ్డ బాగుండాలని తన చర్మంతో వైద్యం చేయించాలని కోరింది. వైద్యమైతే చేయించాలని ఆశపడింది కానీ ఆర్థిక సాయం అందక నిలువునా కుమిలిపోతోంది. దాతలు ఎవరైనా దయతలిస్తే తన కంటి పాపను బతికించుకోవాలని ఆశపడుతోంది. మున్సిపాలిటీలోని రెండోవార్డు కృష్ణాపురం గ్రామానికి చెందిన మెట్ట శ్రీనివాసరావు, పార్వతి దంపతులు విశాఖపట్నం సుజాతానగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు లలిని, ప్రశీలా ఉన్నారు. అయితే మూడు నెలల క్రితం విశాఖపట్నంలో వారి ఇంటివద్ద తల్లి పార్వతి దీపం వెలిగించేటప్పుడు ప్రశీల అగ్ని ప్రమాదానికి గురయ్యింది. తులసి కోటవద్ద తల్లి పెట్టిన దీపం దుస్తులకు అంటుకోవడంతో 60 శాతం గాయపడింది. వెంటనే విమ్స్‌కి తెసుకెళ్లగా ఎవరి చర్మానైనా ఉపయోగించి శస్త్రచికిత్స చేయవచ్చునని తెలియజేశారు. దీంతో బాలిక తల్లి చర్మం ఇచ్చేందుకు సిద్ధం కావడంతో చికిత్స చేశారు. అయితే వైద్యం కోసం ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు అయ్యిందని, మరో మూడు రూ.లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని బాలిక తండ్రి తెలియజేశారు. వైద్య ఖర్చులకు ప్రస్తుతం డబ్బులు లేవని దాతలు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. వీరికి కర్లకో ట గ్రామానికి చెందిన యువ కిరణాలు సేవా సమి తి సభ్యులు రూ.10 వేల ఆర్థిక సాయం సోమవా రం అందజేశారు. ఆర్థిక సాయం అందించాలనుకునేవారు మెట్ట శ్రీనివాసరావు, అకౌంట్ నంబర్ 123810100055034, ఆంధ్రా బ్యాంకు,మధురవాడ బ్రాంచ్, విశాఖపట్టణం, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ 0001238, గోగుల్ పే, ఫోన్ పేకు 7995880331 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
అమ్మ, అమ్మమ్మ కలిసి జిల్లేడి పాలు పోశారు..
చెన్నై, అన్నానగర్: ఆండిపట్టి సమీపంలో గురువారం జిల్లేడి పాలు ఇచ్చి ఆడ శిశువుని హత్య చేసిన తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రామనాథపురానికి చెందిన సురేష్. భార్య కవితా (29). సురేష్ కేరళాలో ఉన్న కోలిక్కోడులో మేస్త్రీ పని చేస్తూంటాడు. వీరికి కుమార్తెలు పాండి మీనా (10), హరిణి (8) ఉన్నారు. ఈ క్రమంలో కవితా మూడోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఫిబ్రవరి 20న క.విలక్కు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అదే నెల 26న ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా ఆడ బిడ్డ పుట్టింది. 2 రోజుల తరువాత ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మార్చి 2న కవితా తల్లిపాలు ఇచ్చినప్పుడు విరోచనాలు ఏర్పడి బిడ్డ మృతి చెందినట్లుగా పలికి ఇంటి సమీపంలో ఉన్న స్థలంలో పాతి పెట్టారు. స్థానికులు దీనిపై అనుమానంతో జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, ఆండిపట్టి తహసీల్దార్ చంద్రశేఖర్‌కి సమాచారం అందించారు. తహసిల్దార్ చంద్రశేఖర్ గ్రామ నిర్వాహక అధికారి దేవి, రాజధాని పోలీసులు కవితా, అత్త చెల్లమ్మాల్ వద్ద తీవ్ర విచారణ చేశారు. గురువారం విచారణలో కవితా, ఆమె అత్త చెల్లమ్మాల్ జిల్లేడి పాలు ఇచ్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బిడ్డ మృతదేహాన్ని గురువారం బయటకి తీసి అక్కడే ప్రభుత్వ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారు. ఇందులో జిల్లేడిపాలు ఇచ్చి బిడ్డని హత్య చేసిన విషయం తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడియత్నం
ప్రకాశం, సంతమాగులూరు: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడియత్నంకు పాల్పడిన సంఘటన సంతమాగులూరు మండలంలో మిన్నెకల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన కోమరగిరి మహాలక్ష్మయ్య ( 20) స్థానిక చెరువు వద్ద కాపాలా ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే చెరువు సమీపంలోనే పల్లెపు నాగరాజు ఆమె భార్య కలిసి జీవిస్తుంటారు. సంఘటన జరిగిన సమయంలో వారు పొలం పనులకు వెళ్లారు. అయితే నాగరాజు, తన తల్లి ఆదిలక్ష్మి వద్ద చిన్నారిని వదిలి వెళ్లారు. చిన్నారితో పాటు ఆదిలక్ష్మి చెరువు పక్కనే పందులు కాసుకుంటున్న సమయంలో ఆమె వద్దకు మహాలక్ష్మయ్య వెళ్లి చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పాప కేకలు వేయడంతో ఆదిలక్ష్మి వెంటనే అక్కడకు వెళ్లి బాలికను రక్షించింది. అనంతరం పొలం నుంచి వచ్చిన చిన్నారి తండ్రి నాగరాజుకు విషయంను చెప్పగావెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మయ్య పరారీలో ఉన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నషీద్ బాషా తెలిపారు. -
కామాంధుడి ‘మత్తు’ ‘దిశ’ యాప్‌తో చిత్తు
సాక్షి, కైకలూరు: రోజూ ఇంటికొచ్చి చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ నమ్మకంగా నటిస్తూ ఆ ఇంటి ఇల్లాలిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధితురాలు సమయస్ఫూర్తితో ‘దిశ’ యాప్‌ను ఆశ్రయించడంతో ఆపద నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిన 8 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని రక్షించారు. కామాంధుడిని కటకటాల్లోకి గెంటేశారు. బస్సులో ఓ మహిళా అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డ ఏయూ ప్రొఫెసర్ బసవయ్యను గత నెలలో దిశ యాప్ ద్వారా అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. కూల్‌డ్రింక్‌లో మత్తు మాత్రలు కలిపి.. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు హాస్టల్లో ఔట్సోర్సింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఓ పాప ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వడ్లమన్నాడ పెద్దిరాజు(21) రోజూ పాపను ఆటోలో స్కూల్‌కి తీసుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న పాప తల్లి వద్దకు వచ్చి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగాలని బలవంతపెట్టాడు. దిశ యాప్ ద్వారా.. ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె 3.19 నిమిషాలకు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దిశ కాల్ సెంటర్ నుంచి సమాచారం అందుకున్న స్థానిక సీఐ వైవీవీఎల్.నాయుడు, రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి సమీపంలోని పెద్దింట్లమ్మ జాతరలో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డ్ వరలక్ష్మీ కుమారి, కానిస్టేబుళ్లు కిషోర్, నాగగణేష్ ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు. ఇది గమనించి పరారైన నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చగా ఈనెల 19 వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
న్యాయం చేయండి
-
మరింత సాయం కోసం...
జియ్యమ్మవలస: అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారి తల్లి చికిత్సకు అవసరమైన సాయం కొంత మొత్తం ఇప్పటికే అందింది. కానీ ఆ మొత్తం సరిపోదని మరింత మొత్తం అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీను, స్వాతి భోగాపురం సమీపంలోని కోళ్ల ఫారంలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండేవారు. తమ 11 నెలల బాబు తన్వీర్‌కు అనారోగ్యం చేయడంతో గత నెల 31న బైక్‌పై విశాఖపట్నం ఆస్పత్రికి బైక్‌పై బయలుదేరి భోగాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై శ్రీను(34) అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్వాతిని విశాఖపట్నం అపోలో ఆస్పత్రికి తరలించగా ఇప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. స్వాతి చికిత్సకు సుమారు రూ.ఏడు లక్షలు ఖర్చవుతుందని అపోలో వైద్యులు తెలిపారు. బాధితురాలి గ్రామానికి చెందిన యువత సామాజిక మాధ్యమాల్లో చిన్నారి తల్లి చికిత్సకు సాయం అందించాలని దాతలను కోరారు. స్పందించిన దాతలు... సామాజిక మాధ్యమాల్లో స్వాతి పరిస్థితి చూసి చలించిన గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన నౌడు నాగరాజు(డీఏఓ, ధవళేశ్వరం) తన సహోద్యోగులు, స్నేహితులు, గ్రామస్తుల సహకారంతో రూ.లక్షా 40వేల 712లను విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులు గంట వెంకటనాయుడు, ముసలినాయుడు చేతుల మీదుగా స్వాతి తల్లిదండ్రులు రేవళ్ల సీతారాం, పద్మలకు అందజేశారు. పెదబుడ్డిడికి చెందిన కర్రి శ్రీనివాసరావు, రేవళ్ల శంకరరావు, మంతిని శ్రీను, తలచింతల తవిటిరాజు, కోట్ని రవి తదితరులు గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.లక్షా 90వేలు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. పలువురు దాతలు సుమారు రూ.70వేలు వితరణగా అందించారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలు సమకూరింది. తమ కుమార్తె చికిత్సకు మరో రూ.3లక్షలు అవసరమవుతుందని తల్లిదండ్రులు వెల్లడించారు. రెక్కాడితేగాని పొట్ట నిండని తమ కుటుంబానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని దాతలు అకౌంట్ నంబరు 139600101008629, ఐఎఫ్ఎస్సీ : సీఓఆర్పీ 0001396, ఫోన్ పే నెంబరు 7893538534కు సాయం పంపాలని కోరారు. -
అదృశ్యమైన బాలికల మృతి
ఒడిశా ,జయపురం: నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో ఓ పాడుబడిన నేలబావిలో ఇద్దరు బాలికల మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతులు గొన గ్రామానికి చెందిన ప్రకాష్ పాండే కూతురు లక్ష్మీ పాండే(9), పకనాపర గ్రామానికి చెందిన సియన్ తివారీ కూతురు పంచవతీ తివారీ(8)లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు బాలికలు కొన్నిరోజుల నుంచి కనిపించకపోగా తమ పిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలికల మృతదేహాలు కనిపించడం గమనార్హం. అయితే వారు ప్రమాదవశాత్తు చనిపోయారా..లేకపోతే వారిని ఎవరైనా చంపి ఉంటారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కస్‌కంగ్ గ్రామంలో జరిగే మండెయి జాతరలో ఏటా ఇద్దరు మైనర్ బాలికలను బలి ఇస్తుంటారు. ఈ క్రమంలో వారిని జాతర బలికోసమే కిడ్నాప్ చేసి, చంపిన తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేసి ఉంటారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బాధిత గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం బాలికల మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, రిపోర్టు వచ్చాక మృతికి గల కారణాలు తెలియస్తాయని నవరంగపూర్ ఎస్పీ నితిన్ తెలిపారు. -
ఎనిమిదేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి
పహాడీషరీఫ్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రిన్సిపాలే గాడి తప్పాడు. 2వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఎర్రకుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జోసెఫ్ (50) ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక 2వ తరగతి చదువుతుంది. గత నెల 28న బాలికను ప్రిన్సిపాల్ తన గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై ఆ బాలిక ఆలస్యంగా తల్లికి తెలిపింది. దీంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
చిన్నారిని చిదిమేసిన వాహనం
దర్శి: గుర్తు తెలియని వాహనం ఢీకొని జిల్లాకు చెందిన రెండేళ్ల బాలిక ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. నూజెండ్ల మండలం బుర్రిపాలేనికి చెందిన పందుల బాబురావు, రూతమ్మ ప్రకాశంలో జిల్లాలోని తూర్పు వీరాయపాలెంలోని రూతమ్మ తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. వారి కుమార్తె కీర్తన(2) ఇంట్లో ఆటలాడుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం బాలికను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తల రోడ్డుకు గుద్దుకోవడంతో బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 108కు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించి కీర్తన మృతి చెందినట్లు నిర్ధారించారు. -
అనాథ బాలికపై లైంగికదాడి
కర్ణాటక , రాయచూరు రూరల్: నగరంలోని బాల మందిరానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఓ జవాన్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆజాద్ నగర్లో ప్రభుత్వ ఆధీనంలో రిమాండ్ హోం నిర్వహిస్తున్నారు. అయితే ఆ రిమాండ్ హోంలో ఎల్బీఎస్ నగర్‌కు చెందిన ఓ అనాథ బాలిక ఉంటోంది. అక్కడే జవాన్‌గా పని చేసే సిద్ధయ్య(26) అనే వ్యక్తి ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి గత నవంబర్ 11న బీఆర్బీ సర్కిల్ వద్ద గల తన ఇంటికి పిలుచుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఇటీవల తరచు ఆమెను వేధిస్తుండడంతో విసిగి పోయిన ఆ బాలిక ఫిర్యాదు మేరకు మేల్కొన్న జిల్లాధికారి వెంకటేష్ కుమార్ శుక్రవారం నగరంలోని బాల మందిరాన్ని జిల్లా ఎస్పీ వేదమూర్తి తదితరులతో కలిసి పరిశీలించారు. నిందితునిపై కేసు నమోదు చేసి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రిమాండ్ హోం అధికారులు సయ్యద్ పాషా, గురు ప్రసాద్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
పెంపుడు తల్లి దాష్టీకం
కర్ణాటక ,తుమకూరు : పెంపుడు తల్లి దాష్టీకానికి చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కుణిగల్ పట్ట ణంలో చోటు చేసుకుంది.సుమారు తొమ్మిదేళ్ల క్రితం బాధిత బాలిక(11)ను తల్లితండ్రులు బ స్టాండులో వదిలేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో బస్టాండులో బజ్జీలు విక్రయించుకుంటూ జీ వించే రత్నమ్మ ఆబాలికను తనతో పాటు ఇంటికి తీసుకువచ్చి పెంచసాగింది. కొద్దిరోజులు బాలిక ను బాగానే చూసుకుంటుండగా నాలుగేళ్ల క్రితం రత్నమ్మ భర్త మృతి చెందారు. అప్పటినుంచి రత్నమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది. బొండాలు, బజ్జీలకు పిండి కలపాలని వేధించడంతో పాటు బస్టాండులో తోపుడిబండిపై విక్రయించాలని వేధింపులకు పాల్పడేది.ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా బాలికతో వెట్టిచాకిరీ చేయించగా బాలిక నిరాకరించడంతో చెలాకీతో బాలిక తొ డలపై వాతలు పెట్టింది. గమనించిన ఉపాధ్యాయులు బాలికను విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.దీంతో బాలికను ఆసుపత్రికి తరలించి విషయాన్ని సీడీపీఓ అధికారిణి అనుషా దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి బాలికను బాలికల బాలభవన్‌కు తరలించారు. కుణిగల్ పోలీసులు రత్నమ్మను అరెస్ట్ చేశారు. -
ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు..చిన్నారిని సాకలేం..
షాద్‌నగర్ రూరల్: కూలీపని చేసుకుకే తమకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో సాకడం కష్టంగా మారిందని ఆ తల్లిదండ్రులు పాపను శిశువిహార్‌లో అప్పగించారు. అధికారులు వారికి సర్దిచెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డ తండాలో సోమవారం జరిగింది. వివరాలు.. తండాకు చెందిన రవి, మమత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం మమత గర్భం దాల్చింది. నాలుగో కాన్పులో అబ్బాయి పుడుతాడని ఆశించారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఆమె పాపకు జన్మనిచ్చింది. దీంతో తాము సాకలేమని, అమ్మాయిని ఎవరికైనా ఇస్తామని అంగన్వాడీ టీచర్ అంజమ్మను దంపతులు సంప్రదించారు. ఈ విషయాన్ని అంజమ్మ సీడీపీఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. సీడీపీఓ నాగమణి గ్రామానికి వెళ్లి చిన్నారి తల్లిండ్రులతో మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు తేడా లేదని, బాలికలను బాగా చదివిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పాప తల్లిదండ్రులు ఎంతకూ అంగీకరించలేదు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, దివ్యాసిని ఆధ్వర్యంలో తల్లితండ్రుల సమక్షంలో చిన్నారిని నగరంలోని శిశువిహార్‌లో అప్పగించారు. -
గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని
శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
లైంగికదాడి కేసులో యువకుడి అరెస్ట్
నెల్లూరు,తోటపల్లిగూడూరు: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో యువకుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా కృష్ణపట్నం పోర్ట్ సీఐ ఖాజావలీ తెలిపారు. తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లూరు మనుమసిద్ధినగర్‌కు చెందిన రాచగిరి విఘ్నేష్ ఓ బాలిక (14)తో పరిచయం పెంచుకున్నాడు. గత నెల 20వ తేదీన అతను ఆమెకు మాయమాటలు చెప్పి తోటపల్లిగూడూరు మండంలోని మండలంలోని తన అక్క ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో తోటపల్లిగూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు విఘ్నేష్‌ను గురువారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
కన్నతల్లి దాష్టీకం.. మత్తులో
కర్ణాటక, హోసూరు: ఓ మహిళ ప్రియుడితో కలిసి మద్యం సేవిస్తూ కుమార్తెకు కూడా మద్యం తాపించగా ఆ చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటన హొసూరులో చోటు చేసుకుంది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెళ్తూరు జీవానగర్‌కు చెందిన నందిని(27) భర్తను వదలి ఒంటరి జీవితం గడుపుతుంది. ఈమెకు నయనశ్రీ(4) అనే కుమార్తె ఉంది. నందినికి అదే ప్రాంతానికి చెందిన కూలి కార్మికుడు అశోక్(29)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఇద్దరూ మద్యం సేవించేవారు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు మద్యం సేవిస్తూ నయనశ్రీనికి కూడా గ్లాసులో మందు పోసి ఇచ్చారు. దానిని సేవించిన చిన్నారి స్పృహ కోల్పోయింది. స్థానికులు గమనించి చిన్నారిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నందిని, ఆమెప్రియుడు అశోక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక,శివమొగ్గ: బాలిక ఉరేసుకున్న స్థితిలో మరణించిన సంఘటన సోమవారం నగరంలోని ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. శికారిపురకు చెందిన కావ్య (15) నగరంలోని మేరి ఇమ్యాక్యులేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటూ అదే పాఠశాలకు చెందిన హాస్టల్లో ఉండేది. ఈ క్రమంలో సోమవారం హాస్టల్ స్టోర్‌రూమ్‌లో కావ్య ఉరేసుకొన్న స్థితిలో శవమై తేలింది. గమనించిన పాఠశాల సిబ్బంది హాస్టల్లో ఉంటున్న మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న కోటా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కావ్య ఆత్మహత్యపై తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గతనెలలో జరిగిన పరీక్షల్లో కన్నడలో తక్కువ మార్కులు రావడంతో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులు కూడా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
ఆ బాలికను దత్తత తీసుకుంటా.. ఎమ్మెల్యే
రంగారెడ్డి, పరిగి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం అర్ధరాత్రి పరిగిలోని బీసీ కాలనీలో ఈ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీసీ కాలనీలో నివసించే సాయి (24) అదే కాలనీలో నివసించే బాలిక (11)పై కన్నేసి శనివారం రాత్రి 10 గంబాలికను తన వెంట తీసుకెళ్లాడు. బాలికను ఇంటికి కొంతదూరంలో ఉన్న ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయం చెప్పింది. వెంటనే చుట్టుపక్కల వారితో కలిసి కుటుంబసభ్యులు ఆ యువకుడిని వెతికి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మొగులయ్య, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు కృషి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ సాయంతో జిల్లా జడ్జితో మాట్లాడించి ఫాస్ట్రుటాక్ కోర్టు ఏర్పాటుచేసి త్వరితగతిన శిక్షపడేలా చేస్తామని పరిగి సీఐ మొగులయ్య తెలిపారు. బాలికను దత్తత తీసుకుంటా: ఎమ్మెల్యే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఇలాంటి ఘటనలు జరగడ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికను దత్తత తీసుకుని పెద్దయ్యే వరకు ఆమెను చదివిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వికారాబాద్‌లోని సఖి కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బాలికను పరామర్శించారు. అయితే ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరా తీశారు. -
డీవీసత్రంలో బాలిక కిడ్నాప్
నెల్లూరు, దొరవారిసత్రం: గుర్తుతెలియని వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటన శుక్రవారం రాత్రి స్థానిక వీఎస్‌ఆర్‌నగర్ ఎస్టీకాలనీలో చోటుచేసుకుంది. కాలనీవాసులు, పోలీసుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బూదూరు అశోక్, కృష్ణమ్మ దంపతులకు కుమార్తె సంధ్య, కుమారుడు సంతోష్ సంతానం. అశోక్ తండ్రి ముత్యాలుతో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఉదయం నుంచి ఉన్నాడు. ఇద్దరూ సాయంత్రం వరకు ఫూటుగా మద్యం తాగారు. అప్పటివరకు ఇంటి వద్దనే ఉన్న సంధ్య సాయంత్రం 8 గంటల నుంచి కనిపించలేదు. దీంతోపాటు గుర్తుతెలియని వ్యక్తి కూడా కనిపించలేదు. చుట్టుపక్కల గాలించారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కిడ్నాప్‌కు గురైందని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. బాలిక టపాయిండ్లు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదుతోంది. -
నయవంచకుడికి పదేళ్ల జైలు
తూర్పుగోదావరి, కాకినాడ లీగల్: బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడి పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేసిన నయవంచకుడికి పదేళ్ల జైలు, రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి జి.గోపిచంద్ గురువారం తీర్చు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్‌సిటీ రాజీవ్ గృహకల్పకు చెందిన గుల్లిపల్లి హరికృష్ణ బంధువుల ఇంటికి తరచూ వెళ్లేవాడు. 2011లో బంధువుల ఇంటి పక్కన ఉన్న బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వంచించాడు. బాలిక కుటుంబ సభ్యులు లేని సమయంలో తరచూ ఆమె ఇంటికి వెళ్లి, పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. దీంతో బాలిక 2012లో గర్భం దాల్చగా అది పోవడానికి టాబ్లెట్లు ఇచ్చాడు. ఇలా పలుమార్లు చేయడంతో హరికృష్ణను పెళ్లి చేసుకోవాలని బాలిక నిలదీయగా అతడు నిరాకరించాడు. దీంతో బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పడంతో వారు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెళ్లి చేసుకోవాలంటే రూ.రెండు లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో 2014లో బొమ్మూరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా లైంగికదాడికి పాల్పడినందుకు ఐపీసీ 417, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో హరికృష్ణపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఏపీపీ వై.ప్రశాంతి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. బాధితురాలికి రూ. మూడు లక్షలు ప్రభుత్వం నుంచి పరిహారం కల్పించాలని తీర్పులో పేర్కొన్నారు. -
ముగ్గురు ఆడపిల్లలను కనడమే నేరమైంది..
బొమ్మలసత్రం: ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వటమే ఆమె పాలిట శాపమైంది.. మూడు రోజులుగా ఆమెకు అన్నం, నీళ్లు ఇవ్వకుండా భర్త గృహ నిర్బంధంలో ఉంచాడు. చివరికి బంధువుల రాకతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలుకు చెందిన మీసమ్మకు, బేతంచర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన సుధాకర్‌తో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురూ ఆడపిల్లలు పుట్టడంతో భార్యను భర్త వేధింపసాగాడు. పదేళ్ల కిందట సుధాకర్.. భార్య, పిల్లలతో కాపురాన్ని నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి మార్చి ఓ టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. పిల్లలకు, తనకు మాత్రమే భోజనం వండుకుని భార్యను పస్తులుంచేవాడు. విషయం తెలుసుకున్న మీసమ్మ తండ్రి.. సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఆమెను పనిలో పెట్టాడు. మీసమ్మ కూడా తన అన్నం తానే వండుకు తినేది. ఈ క్రమంలో మీసమ్మ మానసిక పరిస్థితి దెబ్బతింది. ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని ఆమె తల్లిదండ్రులను వేధించసాగాడు. మంగళవారం భార్యను ఇంట్లో నిర్బంధించి పిల్లలను బడికి పంపి తానూ టైలర్‌షాప్‌నకు వెళ్లిపోయాడు. మీసమ్మ గట్టిగా కేకలు వేసినా తలుపులు తీయకుండా అలాగే ఉంచాడు. గురువారం మీసమ్మ బంధువులు ఇంటికి రావడంతో విషయం వెలుగులోకొచ్చింది. కూడూనీళ్లూ లేకుండా పడి ఉన్న మీసమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వేధించడంలో పెద్ద పోకిరీ..
సాక్షి, చంద్రగిరి: ఇంటి నుంచి అలిగి తిరుపతికి చేరుకున్న ప్రకాశం జిల్లా బాలికపై లైంగికదాడి చేసిన ఆ ఇద్దరు మృగాళ్లు మొదటి నుంచి నేర చరిత్ర కలిగిన వారే. ఒకడు హత్య కేసులో నిందితుడైతే, మరొకడు మహిళలను వేధించడంలో పెద్ద పోకిరీగా పేరు తెచ్చుకున్నాడు. ‘దిశ’ ఘటన జరిగి దేశ వ్యాప్తంగా అట్టుడుకిపోతున్న తరుణంలోనే బాలికపై లైంగికదాడి జరగడంతో అధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇందులో మొదటి నిందితుడైన తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టుకు చెందిన చిత్తూరు వెంకటేష్ (31) గ్రామంలోని యువతులు, వివాహితులను టార్గెట్ చేస్తూ, వారిని వెంబడిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతిని ప్రేమ వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. అనంతరం నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే అతనిలో ఏ మాత్రం మార్పు రాలేదు. విద్యార్థినులు, మహిళలను వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెబుతున్నా రు. వెంకటేష్ ఆగడాలు శృతిమించడంతో గతంలోతిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు సైతం చేసినట్లు సమాచారం. రెండో నిందితుడిపై గతంలో హత్య కేసుతో పాటు పలు కేసులు బాలికపై లైంగికదాడి కేసులో రెండో నిందితుడైన బుక్కే రాజమోహన్ నాయక్ (28) తిరుపతిలోని ఐఎస్ మహల్ వద్ద గతంలో భార్గవ్ అనే యువకుడి హత్య కేసులో ఏ–6 నిందితుడిగా ఉన్నాడు. 2017 డిసెంబర్ 3న భార్గవ్‌ను కిరాతకంగా అంతమొందించారు. హత్య కేసు (167/2017 అండర్ సెక్షన్ 147, 148, 341, 302, 201, ఆర్/డబ్లు్య149 ఐపీసీ) నమోదు చేశారు. అప్పట్లో వెస్ట్ పోలీసులు రాజమోహన్‌నాయక్‌పై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. అంతకుముందు కూడా కళాశాల విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ, పలు అసాంఘిక కార్యకలాపాలను చేస్తుండేవాడని తెలిసింది. మొదటి నుంచి నేర చరిత్ర కలిగి, సెటిల్మెంట్లు చేస్తూ తరచూ గొడవలకు పాల్పడేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో భార్యను వరకట్న వేధింపులకు గురిచేయడంతో మహిళా పోలీసు స్టేషన్లో అతనిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. వీటితో పాటు తిరుపతి పరిధిలోని పోలీసు స్టేషన్లలో అతనిపై పలు కేసులు నమోదై ఉండటం గమనార్హం! ఇంతటి నేర చరిత్ర కలిగిన వారిపై తిరుచానూరు పోలీసులు నిఘా ఉంచకపోవడంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు విమర్శలొస్తున్నాయి. లిఫ్ట్ అడిగిన పుణ్యానికి బాలికను వంచించి, లైంగికదాడి చేసిన నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలంటూ పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, బాలికను తీసుకెళ్లేందుకు నిందితులు ఉపయోగించిన టీఎన్ 73 ఎస్ 2469 నలుపు రంగు బజాజ్ పల్సర్ బైక్, సీబీఆర్ 250 సీసీ ఏపీ 03సీఎక్స్ 5503 మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి) -
బాలికపై అత్యాచారయత్నం చిన్నాన్న అరెస్ట్
చిత్తూరు, చౌడేపల్లె : తొమ్మిదేళ్ల బాలికపై వరుసకు చిన్నాన్న అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో జి.మునిరాజ (28) అరెస్ట్ చేసినట్లు సీఐ మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరులకు సీఐ తెలిపిన వివరాలు..ఈనెల 1న కోటూరు సమీపంలోని చింతతోపులో మునిరా జ తన అన్న కుమార్తె అయిన తొమ్మిదేళ్ల బాలికను ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతంలోని పశువుల కాపరులు గుర్తించి అతడిని చితకబాదారు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితునిపై ఫోక్సో యాక్ట్ కింద ఐపీసీ 376, 511/,5,7 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించారు. అత్యాచారయత్న నిందితుడికి రిమాండ్ వాల్మీకిపురం : బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలో నిందితుడు లారీ డ్రైవర్ గంగాధర్ (38)పై కేసు నమోదు చేశామని ఎస్ఐ మోహన్‌కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. అతడిని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించినట్లు చెప్పారు. -
ఏటా ప్రసవం.. అమ్మకు శాపం
వాళ్లకి ఆడ పిల్లలంటే చిన్నచూపు. మగబిడ్డ కోసం ఎంతమంది ఆడపిల్లల్ని అయినా కనేలా ఒత్తిడి చేస్తుంటారు. తొమ్మిది కాన్పుల వరకు మగబిడ్డ కోసం చూడటం.. అప్పటికీ పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమవడం మగవారికి సర్వసాధారణం. ప్రసవం కోసం గర్భిణుల్ని ఆస్పత్రి గడప తొక్కనివ్వవు వారి కట్టుబాట్లు. గత్యంతరం లేక ఇంట్లోనే ప్రసవాలతో మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా వెనుకబాటు తనం.. నిరక్షరాస్యత.. అధిక సంతానం.. అవగాహనా రాహిత్యం.. మూఢ నమ్మకాలు వెరసి ఆ పల్లెల బతుకు చిత్రాన్ని దయనీయంగా మార్చింది. దీనివల్ల ఎన్నెన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడున్నాయి. బుక్కెడు బువ్వ కోసం వలస బాట పడుతున్నాయి. ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల తీర్చే జల వనరుల రాజధాని.. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి పుణ్య క్షేత్రాలు గల ఆధ్యాత్మిక భూమి కర్నూలు పల్లెల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కౌతాళం మండలం హల్వి గ్రామానికి చెందిన ఈమె పేరు లలితమ్మ (వృత్తంలో). ముత్తన్న అనే వ్యక్తిని వివాహమాడింది. ఈమెకు 8 మంది ఆడపిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదని ప్రశ్నించగా.. ‘మగబిడ్డ కోసమయ్యా!’ అని బదులిచ్చింది. మద్యానికి బానిసైన ముత్తన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భారం లలితమ్మపైనే పడింది. అంతమంది పిల్లల్ని కంటే కుటుంబాన్ని పోషించడం కష్టం కాదా అని అడిగితే.. ‘ఏమో అయ్యా! సెప్పేవారెవరూ లేకపోతిరి. మాకు సదువు రాదు. అంతే!’ అంది. ఇదే మండలంలోని మరిలి గ్రామానికి చెందిన మరియమ్మకు ఏడుగురు ఆడ పిల్లలు. జమ్మాలదిన్నెకు చెందిన హైమవతికి నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అదే గ్రామంలోని శ్రీదేవికి ఐదుగురు ఆడబిడ్డలు, ముచ్చుగిరికి చెందిన మంగమ్మకు ఏకంగా 10 మంది సంతానం. వారిలో 9 మంది ఆడబిడ్డలే. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి కుటుంబాలు భారీగానే ఉన్నాయి. సాక్షి ప్రతినిధి/కర్నూలు : తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం సార్వసాధారణం. కానీ.. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు మండలాలతో పాటు సమీపంలోని చాలా గ్రామాల్లో మహిళలు తొలి కాన్పు, బిడ్డ జననం పుట్టింట్లోనే జరగాలి. ఆస్పత్రికి వెళ్లకూడదనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉండవు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. లేదా, గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేవి పట్టించుకోరు. దీంతో బలహీనంగా, అనారోగ్య సమస్యలతో పుట్టే పిల్లలు కూడా ఎక్కువే. కాన్పు సమయంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఇబ్బందిపడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇదేంటని ఆరా తీస్తే ‘ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ చేస్తారు. ఒకసారి ఆపరేషన్ అయితే సాధారణ కాన్పు జరగదు. పైగా ఒక బిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది. తొలి ఇద్దరు ఆడపిల్లలైతే మళ్లీ కాన్పునకు అవకాశం ఉండదు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేసుకుంటాం’ అని చెబుతున్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకంగా, అనాగరికంగా అవగతం చేసుకోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడి ప్రజలను కలిసి.. వారికి ఆస్పత్రి, చికిత్స, ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. ఆస్పత్రులకు రప్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. నిరక్షరాస్యతలో మొదటి స్థానం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం నిరక్షరాస్యతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యతలో మొదటి 10 స్థానాల్లో ఉన్న మండలాలివీ.. సుగ్గికెళితే కొంచెం ఎక్కువ బిడ్డల చదువు విషయమై కొందరి తల్లులను అడగ్గా.. ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా. కూలికి పోతే నూట యాభై వస్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బెంగళూరు వలస (సుగ్గి) పోతున్నారు. అక్కడ ఇళ్లు, వీధుల్లో స్వీపర్లుగా.. భవన నిర్మాణ కూలీలుగా.. వృద్ధులైతే ఇళ్లు, దుకాణాల వద్ద వాచ్మన్లుగా పని చేస్తున్నారు. కొందరు మహిళలు వేరుశనగ, శనగ గుగ్గిళ్లను రైళ్లలో విక్రయిస్తున్నారు. కొందరు పిల్లలు భిక్షాటన కూడా చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్లో ఇలాంటి వారు కనీసం 600 మంది రైలు దిగుతుంటారు. ఆస్పత్రికి పోదామంటే డబ్బుల్లేవు నాకు నలుగురు బిడ్డలు. 3, 4వ సంతానమైన షర్మిల (7), దివ్య (5)మూగవారు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే డబ్బుల్లేవు. ఏం సేస్తాం. మా బతుకులు ఇంతే. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. అందుకే ఇలా ఉండిపోయినాం. – ప్రమీల, జమ్మాలదిన్నె, కోసిగి మండలం చెల్లి కోసం బడికెళ్ల లేదు ఊయల ఊపుతున్న ఈ చిన్నారి పేరు దీపిక. తలారి రామంజనేయులు, లక్ష్మీదేవి ఈమె తల్లిదండ్రులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. దీపిక పెద్దమ్మాయి. మధ్యాహ్యం 12.50 గంటలకు ఇంటివద్ద ఇలా కన్పించింది. ‘బడికి వెళ్లలేదా తల్లీ’ అని అడిగితే.. ‘సెల్లిని సూసుండేందుకు ఇంటికాడే ఉంటన్నా’ అని సమాధానమిచ్చింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్ద పిల్లలు బడి వదిలేసి ఇంటి వద్దే ఉంటారు. ఇలా దీపిక మాత్రమే కాదు.. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా చెల్లెళ్ల ఆలనా పాలన కోసం అక్షరాలకు దూరంగా భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. రైళ్లలోనూ ఇబ్బందులే నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడ బిడ్డలు. రెండెకరాల సేనుంది. వానల్లేక, పంటలు పండక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలికి పోదామన్నా పని ఉండదు. రైళ్లలో పండ్లు అమ్ముకుంటాం. రైలులో శానా ఇబ్బంది. పరిమిషన్ లేదని టీసీలు దించేస్తారు. కిందమీద పడతా బతుకుతాండాం. – రాగమ్మ, కోసిగి తిండిలేక.. ఎదుగదల లేక పెండ్లయిన ఏడాదికే భర్త శీను ఇడిసిపెట్టి పోయినాడు. ఇల్లు లేదు. పొలం లేదు. బెంగళూరుకు సుగ్గి పోతాం. బిడ్డను చూసుకునేటోళ్లు లేక నాతోపాటు తీసుకుపోతా. దీంతో పాపకు సదువు పోయినాది. 11 ఏళ్ల బిడ్డయినా తిండిలేక ఎదుగుదల ఆగిపోయినాది. – భీమక్క, కర్నూలు పశ్చిమ ప్రాంతం చదువుకోవాలని ఉంది..కానీ నేను ఒకటో తరగతి సదివినా. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అమ్మవాళ్లు సుగ్గికి పోతే బువ్వ ఒండేటోళ్లుండరు. అందుకే నేనూ వాళ్లతో సుగ్గికి పోతా. బడికి పోవాలి, మందితో సదువుకోవాలని ఉంటాది కానీ.. ఆ అవకాశం లేదు. – లక్ష్మి, దేవకోసిగి, కోసిగి మండలం నేనూ షాకయ్యాను నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టాక వైఎస్సార్ బడిబాట కోసం రిపోర్ట్ రప్పించుకుని చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, వలసలు, మూఢ నమ్మకాలు, మగబిడ్డ కోసం వరుస కాన్పులు చూసి షాక్ అయ్యాను. మంత్రాలయం నియోజకవర్గమే కాదు హాలహర్వి, హోళగంద, చిప్పగిరితో పాటు చాలా మండలాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం. అందుకే ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణాలిచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. – వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు -
బాలికపై లైంగికదాడికి ప్రిన్సిపాల్ యత్నం
బహదూర్‌పురా: ఓ బాలికపై సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌బాగ్ అసద్‌బాబానగర్‌లో ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (11) సదరు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో సదరు బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేకపోయారు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీ చెప్పాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. స్కూల్లో కంప్యూటర్ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్ బాలికను స్కూల్లోనే ఉంచుకున్నాడు. సాయంత్రం ఆధార్‌కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు గురువారం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్సై నర్సింహ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. మండల డిప్యూటీ ఈవో విచారణ దీనిపై సమాచారం అందడంతో బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాల చారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను విచారించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసులు నమోదు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్ చేశారు. -
టాయిలెట్స్ వద్ద పసికందును వదిలి..
సంతానలేమితో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గర్భం దాల్చికు బిడ్డజన్మనిస్తే తమ ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ మురిసిపోయే వారు కోకొల్లలు. అయితే ఆరోగ్యంగా ఉన్నా ఓ పసికందును రైల్లో వదిలేశారు. ఆడ శిశువనో.. తమకు భారమని తలచి వదిలేశారో..లేదా ఏడుకొండల వాడే పసికందుకు దారి చూపుతాడోనని తెలియదుగానీ..అదృష్టం బావుండి ఆ పసికందు రుయా ఒడికి చేరింది. సాక్షి, తిరుపతి అర్బన్ : రైలులోని టాయిలెట్స్ వద్ద పసికందును వదిలిపెట్టిన ఘటన శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. వివరాలు..తిరుపతి రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 1.30గంటలకు కోయంబత్తూరు రైలులో వచ్చింది. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లాక పారిశుధ్య కార్మికులు బోగీలను శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ బోగీలోని టాయిలెట్స్ వద్ద పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. నెలరోజుల వయస్సు ఉన్న ఓ ఆడశిశువును గుర్తించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అక్కడ పడుకోబెట్టి వదిలేసి వెళ్లారని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ పసికందును ఎత్తుకుని లాలించారు. వెంట నే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రగతి ట్రస్ట్ చైల్డ్‌లైన్–1098 పోలీసుల సహకారంతో ఆ బిడ్డను అందుకుంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం చేర్పించింది. మరోవైపు పోలీసులు ఆ పసికందు తల్లిదండ్రులున్నారేమోనని రైల్లోనే కాకుండా స్టేషన్ ప్రాంతంలో గాలించారు. మైక్‌లో కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఈలోపు పాపకు పాలు సైతం పట్టించారు. అయితే ఎవరూ ఆ పసికందు కోసం వారిని సంప్రదించలేదు. ఇక చేసేదేమీ లేక చిత్తూరులోని బాల ల సంరక్షణ సమితి నిర్వాహకులను సంప్రదించారు. శనివారం రుయా ఆస్పత్రి అధికారులు పాపకు సంబం ధించి వైద్యపరీక్షల ప్రక్రియ పూర్తి చేసి చిత్తూరు బాలల సంరక్షణ సమితికి అప్పగించనున్నారు. వైద్యపరీక్షల్లో ఆ పసికందు ఏమైనా అనారోగ్యంతో బాధపడుతోందా? అనేది తేలాల్సి ఉంది. ఇక బోసినవ్వులతో పసికందు అందరినీ ఆకర్షిస్తోంది. ఇదలా ఉంచితే, రైలు కోయంబత్తూరు నుంచి తిరుపతికి చేరేలోపు పలు స్టాపింగ్స్ ఉన్నాయి.ఈ పసికందును తీసుకుని ఏ రైల్వేస్టేషన్లో ఎక్కి ఉంటారో తెలుసుకునే ప్రయత్నాల్లో రైల్వే పోలీసులు పడ్డారు. ఆయా రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ ఏదేని క్లూ లభిస్తోందేమోననే దిశగా యోచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ దిగిన తర్వాతే పసికందును టాయిలెట్ వద్ద వదలి వెళ్లి ఉంటారని, ఒకవేళ పసికందును అపహరించి తీసుకెళ్లేందుకు వీలుకాక ఇక్కడ వదిలేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలేమిటో తేలాల్సి ఉంది. -
విధి ఆడిన ఆట
హస్తినాపురం: ఓ చిన్నారితో విధి ఆటాడింది. అభం శుభం తెలియని పాపను పొట్టన పెట్టుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసముంటున్న చంద్రశేఖర్ కుమార్తె లాస్య(8) సరూర్‌నగర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఇంటి కింద ఆడుకుంది. పైకి వెళ్లేందుకు లిఫ్టులోకి వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయింది. తీవ్రంగాగాయపడిన పాప కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన తండ్రి కష్టపడి బాలికను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. నాసిరకం లిఫ్టులతోనే ప్రమాదాలు.. చిన్నారి మృతిపై బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టు›లు ఏర్పాటు చేస్తుండడంతోనే తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అపార్ట్మెంట్లలో బ్రాండెడ్ లిఫ్టులనే అమర్చాలని, నాణ్యమైన వాటినే ఏర్పాటు చేసేలా మున్సిపల్ అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి లిఫ్టు బిగించిన నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బాలికపై లైంగికదాడికి యత్నం
పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్: ఓ బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన సంఘటన కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. నిందితుడికి బాధిత కుటుంబసభ్యులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి, తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ మస్తాన్‌వలీ తెలిపారు. -
పొదల్లో పసిపాప
సాక్షి, చిత్తూరు(కొత్తకోట) : తల్లిపొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు రోడ్డుపాలైంది. నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లయినా తనివితీరా చూసుకుందో లేదో పుట్టిన క్షణాల్లోనే ముళ్లపొదలకు చేరింది. కన్నతల్లికి ఏ కష్టమొచ్చిందో, ఆ బిడ్డ ఎందుకు భారమైందో కాని ఈ సంఘటన మంగళవారం బి.కొత్తకోటలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బి.కొత్తకోట పంజూరమ్మగుడివీధి, హడ్కోకాలనీ మధ్యలోని పొదల్లో తెల్లవారుజాము 3గంటల సమయంలో తల్లిరక్తం మరకలు ఆరకనే పుట్టిన ఆడబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పొదల్లో వదిలి వెళ్లిపోయారు. ముళ్లకారణంగా గాయాలయ్యాయి. పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఉదయం అక్కడి బంకు దగ్గరకు సరుకుల కోసం ఫకృన్నీసా అనే మహిళ చెవికి ఏడుపులు వినపించడంతో అప్రమత్తమైంది. ఏడుపులు వస్తున్న చోటకు వెళ్లగా కళ్లు తెరవని ఆడశిశువును గుర్తించింది. ఈ విషయం తెలుసుకొన్న అంగన్వాడీ కార్యకర్త అనసూయ శిశువును స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. సంఘటనా స్థలంచేరుకొన్న ఎస్ఐ సుమన్ స్థానికులను విచారించారు. అనంతరం ఆడశిశువును మదనపల్లెకు తీసుకెళ్లి ఐసీడీఎస్ సీడీపీఓ సుజాతకు అప్పగించారు. ఆమె శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం శిశువును చిత్తూరులోని శిశువిహార్‌కు తరలిస్తామని సుజాత చెప్పారు. -
బాలిక అపహరణ..సామూహిక లైంగిక దాడి
చిత్తూరు ,పుంగనూరు : పేద దళిత కుటుంబానికి చెందిన ఓ బాలికను ముగ్గురు యువకులు అపహరించారు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డారు. మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా.. మండలంలోని జట్టిగుండ్లపల్లెకు చెందిన ఓ దళిత బాలిక పదో తరగతి చదివి ఆపి వేసింది. చండ్రమాకులపల్లె గ్రామానికి చెందిన శ్రీహరి, రాజు బాలిక చిన్నాన్న కుమారులు. ఈ నెల 10న మధ్యాహ్నం అరుణ్‌తో కలసి కారులో జెట్టిగుండ్లపల్లె గ్రామానికి వచ్చారు. మార్గం మధ్యలో బాలిక తల్లికి, తాతకు ఫోన్‌చేసి ఆమె ఎక్కడుందన్న విషయం తెలుసుకున్నారు. నేరుగా బాలిక ఇంటికి వెళ్లి బాలికను కారులో బలవంతంగా గ్రామ పొలిమేర్లలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప డ్డారు. వెంటనే ఇంటికి వచ్చిన బాలిక విషయం చెప్పకుండా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తాత, కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను కాపాడారు. వెంటనే కర్ణాటక కోలారులోని ఆసుపత్రికి బాలికను తరలించారు. అప్పటి నుంచి ఆ బాలిక ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విషయం సోమవారం బయటపడింది. ఫిర్యాదు అందుకున్న సీఐ మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి, తాత వాంగ్మూలం మేరకు నిందితులపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ మాట్లాడుతూ, లైంగిక దాడి ఘటనపై పూర్తి వివరాలు బాధితురాలు తెలపాల్సి ఉందన్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకోవడానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాలిక కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. -
కాటేసిన ప్రలోభం.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు
సాక్షి, జయపురం(ఒడిశా): తెలిసీ తెలియని వయసు.. చెంగుచెంగున గెంతుతూ తోటి పిల్లలతో ఆటలాడుకునే బాలిక (12) ఏడు నెలల గర్భిణి అని తెలిసి బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ సంఘటన నవరంగపూర్ జిల్లా పపడహండి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బాలిక గర్భవతి కావడానికి కారకుడైన యువకుడిపై బాధిత కుటుంబసభ్యులు పపడహండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ప్రతి రోజూ తమ ఇంటికి కొంత దూరంలోగల పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లేది. ఆమె పాఠశాలకు ఒంటరిగా వెళ్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న ఘుషురగుడ గ్రామానికి చెందిన రాజీవ్ మఝి అనే యువకుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అమాయకురాలైన ఆ బాలిక యువకుడితో మాట్లాడుతూ ఉండేది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టిన ఆ యువకుడు బాలికతో శారీరక సంబంధం కొనసాగించాడు. తన శరీరంలో వస్తున్న మార్పులపై ఆ బాలికకు అవగాహన లేదు. రానురాను శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అప్పటికే ఆమెకు 7 నెలలు గడిచాయి. గర్భిణిగా ధ్రువీకరించిన వైద్యులు 15 రోజుల కిందట కుటుంబసభ్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలలో ఆ బాలిక 7 నెలల గర్భిణి అని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలియడంతో ఆమెను పాఠశాలకు వెళ్లకుండా చేశారు. ఆ బాలిక నుంచి విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు పపడహండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తమ బిడ్డ గర్భిణి కావడానికి కారకుడైన రాజీవ్ మఝిపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమో దు చేసి రాజీవ్‌ను అరెస్టు చేశారు. ప్రాపంచిక విషయాలు, భార్యభర్తల సంబంధాలపై ఎటువంటి అవగాహన లేని తమ బిడ్డ నేడు 7 నెలల గర్భిణి అయిందన్న చింత ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. పరువుగా బతికే తాము సభ్య సమాజంలో ఏ విధంగా తలెత్తుకుని తిరగగలమని వారు వాపోతున్నారు. తమ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏమిటి? బిడ్డను ఎలా సాకాలి అన్న చింత వారిని వేధిస్తోంది. రాజీవ్ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసినా చట్ట ప్రకారం చెల్లదు. ఇంకా ఆమెకు ఆరేళ్లు గడిస్తే కానీ వివాహానికి అర్హురాలు కాదు. అంతవరకు పుట్టబోయే బిడ్డతో ఆమె జీవితం ఎలా సాగుతుంది. పుట్టబోయే బిడ్డను రాజీవ్ కుబుంబం అంగీకరిస్తుందా? అన్నది చర్చనీ యాంశమైంది. -
మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం
కర్ణాటక ,హొసూరు: డెంకణీకోట సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని డెంకణీకోట మహిళా పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. డెంకణీకోట తాలూకా సాకరపల్లి సమీపంలోని కొడియాళం గ్రామానికి చెందిన గణేష్ (23) నిందితుడు. సోమవారం ఉదయం మదగొండపల్లికెళ్లిన అతను ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిని తాగడానికి నీరు అడిగాడు. బాలిక నీరు తీసుకొచ్చేందుకు ఇంటి లోపలికెళ్లగానే గణేషన్ ఇంట్లోకి చొరబడి వాకిలికి గెడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగానే గణేష్ పరారయ్యాడు. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి గణేష్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
ఒక ఆటో..70 సీసీ కెమెరాలు
బంజారాహిల్స్: సీసీ ఫుటేజీ ఆధారంగా అదృశ్యమైన ఓ బాలికను జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించి తల్లికి క్షేమంగా అప్పగించారు. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్‌కు చెందిన వైష్ణవి(12) యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని నారాయణ స్కూల్లో ఆయాగా పనిచేసేది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన వైష్ణవి తన తమ్ముడితో కలిసి స్కూల్ అయిపోయిన తర్వాత తల్లి వద్దకు వచ్చి ఆడుకుంటుండగా సరిగ్గా చదవడం లేదంటూ అనురాధ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఓ పేపర్‌పై తాను చనిపోయిన తండ్రి వద్దకు వెళుతున్నానని, నువ్వు అక్కర్లేదంటూ తల్లికి లేఖ రాసి తమ్ముడి చేతికి ఇచ్చి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైష్ణవి కోసం గాలింపు చేపట్టారు. బాలికను తల్లికి అప్పగిస్తున్నజూబ్లీహిల్స్ పోలీసులు బాలిక నడుచుకుంటూ యూసుఫ్‌గూడ వైపు వెళుతూ శ్రీకృష్ణానగర్ మోర్ సూపర్‌మార్కెట్ వద్ద ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో ముందు గ్రీన్‌కలర్ బోర్డు ఉండటంతో దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆటోను గుర్తించి ఫిలింనగర్‌కు చెందినదిగా చెప్పడంతో ఫిలింనగర్ వైపు నుంచే వచ్చే ఆటోలపై నిఘా వేశారు. మరో 8 గంటలు కష్టపడితే ఎట్టకేలకు ఆ ఆటో కనిపించింది. ఆ రోజు సాయంత్రం మోర్ సూపర్‌మార్కెట్ వద్ద ఓ బాలిక ఆటో ఎక్కి సారథి స్టూడియో వద్ద దిగి సందులోంచి నడుచుకుంటూ వెళ్లిందని చెప్పాడు. అటు వైపు ఎవరున్నట్లు తల్లిని ప్రశ్నించగా తన అత్త ఉంటుందని చెప్పింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా ఆమె అక్కడికి రాలేదని ఫతేనగర్‌లో ఉంటున్న ఆమె బాబాయి ఇంటికి వెళ్లి ఉండవచ్చునని చెప్పింది. పోలీసులు శనివారం రాత్రి ఫతేనగర్ వెళ్లి వైష్ణవి బాబాయిని కలిసి విషయం చెప్పగా శుక్రవారం రాత్రి తమ వద్దకే వచ్చిందని చెప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. శ్రీకృష్ణానగర్ నుంచి సారథి స్టూడియో వరకు, ఇటు ఫిలింనగర్ వైపు 70కిపైగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ ఆటో చాలా చోట్ల కనిపించిందని దీంతో మిస్టరీ ఛేదించినట్లు పోలీసులు వివరించారు. -
అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...
కర్ణాటక, యశవంతపుర: సోషల్ మీడియా ప్రేమలు ముక్కుపచ్చలారని బాలలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో మరోసారి వెల్లడైంది. సిలికాన్ సిటిలో 10వ తరగతి బాలిక ఒకరు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితున్ని వెతుకుతూ విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది. అతడు కూడా మైనర్ దాటని బాలుడే కావడం గమనార్హం. చివరకు శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలికకు నచ్చజెప్పి బెంగళూరుకు తీసుకురావడంతో సుఖాంతమైంది. ఏం జరిగిందంటే వివరాలు.. బెంగళూరులో ఓ ధనవంతుని కుమార్తె కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లో తరచూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఒక కుర్రవానితో ఫేస్బుక్లో పరిచయం కుదిరింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకుని తరచూ మాట్లాడేవారు. ప్రేమలో పడినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియటంతో బాలికను మందలించారు. ఒకవైపు తల్లిదండ్రు లు ఆగ్రహించడం, మరోవైపు ప్రియున్ని కలవాలన్న భావనలో ఆ బాలిక బెంగళూరు విమానశ్రయం నుండి విమానంలో భోపాల్‌కు వెళ్లిపోయింది. భోపాల్‌లోని ప్రేమికుని ఇంటికి వెళ్లింది. ఇంట్లో వారు చూస్తే గొడవ అవుతుందని ఆ అబ్బాయి బాలికను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇంతదూరం ఎందుకు వచ్చావంటూ బుద్ధిమాటలు చెప్పి బెంగళూరుకు వెళ్లాలని సూచించాడు. ఇందుకు బాలిక ససేమిరా అంది. తాను ఇక్కడే ఉంటానని బాలిక మారాం చేయడంతో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. బాలికకు కౌన్సెలింగ్ ఇంతలో బాలిక మిస్సయిన సంగతి తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ జరిపి భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గాలించి మైనర్ ప్రేమజంటను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలల సంరక్షణ సమితి ఆ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఫేస్బుక్ స్నేహితున్ని కసిసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. తండ్రితో గొడవపడిన బాలిక కొద్దిరోజుల పాటు కాల్ సెంటర్లో పని చేసి వచ్చిన డబ్బులతో భోపాల్‌కు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి బాలికను క్షేమంగా బెంగళూరుకు తీసుకొచ్చారు. -
అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!
దంపతులిద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ధనవంతులు కూడా. కానీ సంతానమే లేదు. ఇక పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చాక దత్తత తీసుకోవడమే మంచిదని భావించారు. శిశు సంక్షేమ శాఖ వద్ద నియమ నిబంధనలన్నీ పూర్తి చేసి చిన్నారి పాపను దత్తత తీసుకున్నారు. ఇలా రాష్ట్రంలో మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువమంది దంపతులు తమ బిడ్డగా చేసుకుంటున్నారు. మరో చేదు నిజం ఏమిటంటే వీధుల్లో, చెత్తకుప్పల్లో అనాథలుగా దర్శనమిస్తున్నవారిలో బాలికలు, ఆడశిశువులే అధికంగా ఉండడం గమనార్హం. సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో దంపతులు దత్తత తీసుకుంటున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2018– 19 ఏడాదికి సంబంధించి మొత్తం 237 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారిలో 130 మంది బాలికలు, 107 మంది బాలురు ఉన్నారు. అంతేకాకుండా శిశుసంక్షేమ శాఖకు అప్పజెబుతున్న అనాథ పిల్లల్లో కూడా ఎక్కువ మంది బాలికలే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 3,374 మందిని దత్తత తీసుకోగా అందులో 1,977 మంది బాలికలు, 1,397 మంది బాలురు ఉన్నారు. కాగా కర్ణాటకలో గత 2017 – 18లో 294 మంది శిశువులను, బాలలను దంపతులు దత్తత తీసుకోగా, మరుసటి ఏడాది 237 మందికి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 19 శాతం తక్కువ దత్తతలు నమోదయ్యాయి. దత్తతల్లో దేశంలో రెండవస్థానం చిన్నారులను దత్తత తీసుకోవడంలో జాతీయస్థాయిలో కర్ణాటక రెండోస్థానంలో ఉంది. కాగా మహారాష్ట్ర 695 మందితో ప్రథమ స్థానం ఆక్రమించింది. ఆడపిల్లలైతే బుద్ధిగా చదువుకుంటారని, చెప్పినట్లు వింటారనే భావనతో ఎక్కువమంది దత్తత తీసుకొంటున్నారని తెలుస్తోంది. మలివయసులో తమ ఆలనాపాలనా చూస్తారని దత్త తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఆస్తుల పంపకాల గొడవలు, కోపతాపాలు ఉండవనేది మరో కారణం. అనాథల్లో బాలికలే ఎక్కువ అనాథ ఆశ్రమాలకు, శిశు సంక్షేమ శాఖకు అప్పజెబుతున్న చిన్నారుల్లో ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. రోడ్లపై దొరికే పిల్లల్లో.. బాల కార్మికులుగా పట్టుబడుతున్న వారిలో బాలికలే ఉండటం గమనార్హం. శిశు సంక్షేమ శాఖ అధికారులు రోడ్లపై, రైల్వేస్టేషన్లలో, బస్స్టేషన్లలో పనులు చేసుకుంటే తిరిగే వారిని గుర్తించి రక్షిస్తున్నారు. అంతేకాకుండా అప్పుడే పుట్టిన పిల్లలు చెత్తకుండీల పాలవుతున్నారు. వీరిలోనే ఆడ శిశువులే ఎక్కువగా ఉండటం దారుణమని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు పోలీసుల ద్వారా శిశు మందిరాలకు సుమారు 576 మందిని అనాథ శిశువులను అప్పగించగా, వారిలో 478 మంది బాలికలు ఉన్నారు. అంతేకాకుండా ఆడపిల్ల పుట్టిందని కూడా కొందరు తల్లిదండ్రులు పోషించలేమంటూ శిశు మందిరాలకు అప్పజెబుతున్నారు. మరోవైపు ఆడపిల్లలైతే పెద్దయ్యాక ఆప్యాయత పంచుతారని ఆశిస్తూ ఎంతోమంది దత్త తల్లిదండ్రులు వారిని అక్కునచేర్చుకుంటున్నారు. కర్ణాటకలో బాలబాలికల దత్తత వివరాలు ఏడాది దత్తత 2018-19 237 2017-18 294 2016-17 252 2015-16 277 -
కీచక తండ్రికి కటకటాలు
రంగారెడ్డిజిల్లాకోర్టులు: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు ప్రాసిక్యూషన్ రాజిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ అంబేద్కర్ కాలనీకి చెందిన లింగం కుమార్ భార్య మృతి చెందడంతో కుమార్తె, కుమారుడితో కలిసి ఉండేవాడు. లింగంకుమార్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని 5వ తరగతి చదివే బాలికపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన నాన్నమ్మ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె మనవరాలిని తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొన్నాళ్లకు లింగం కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కుమార్తెను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు 2014 జులై 12న అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నర్సింగ్‌రావు లింగంకుమార్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ 5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నుంచి రూ .1లక్షను బాధితురాలికి అందజేయాలని ఆదేశించారు. -
ఆడపిల్లలు లేనందున చిన్నారి కిడ్నాప్..
రాంగోపాల్‌పేట్: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పరిచయస్తుడని పాపను చూసుకోమని అప్పగించి వెళ్లితే ఆమెను ఎత్తుకెళ్లిన విషయం విదితమే. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పాపను రక్షించారు. రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో సైఫాబాద్ ఇన్చార్జి ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్స్పెక్టర్ టీసీహెచ్ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. యాప్రాల్ భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజు, హజీరా దంపతులు ఈ నెల11న తమ కుమర్తె ఫాతిమాను తీసుకుని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా బాలానగర్ బస్టాప్ సమీపంలో రాజుకు పరియస్తుడైన షేక్ సలీం కనిపించాడు. అందరూ కలిసి ప్యారడైజ్ ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నిద్రకు ఉపక్రమించారు. ఉదయం బక్రీద్ నేపథ్యంలో యాచించేందుకు మసీదు వద్దకు వెళ్లారు. అనంతరం పాపకు పాలు తెచ్చేందుకు ఫాతిమను సలీంకు అప్పగించి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి సలీం పాపతో సహా పరారయ్యాడు. పట్టించిన సీసీ కెమెరాలు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 20 ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశారు. వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు కిషన్‌బాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆడబిడ్డను పెంచుకోవాలనే నిందితుడు సలీంకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తనకు ఆడపిల్లలు అంటే ఇష్టమని పెంచుకోవాలనే తీసుకుని వెళ్లినట్లు తెలిపాడు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో అదనపు ఇన్స్పెక్టర్ గడ్డం కాశీ, డీఎస్ఐ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాలిక కిడ్నాప్
రాంగోపాల్‌పేట్: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సంఘటన మంగళవారం రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్ భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజు బాలంరాయిలోని ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య హజీరా, కుమార్తె ఫాతిమా(5), కుమారుడు రమేష్ (4) కుమార్తె మౌనిక(3) ఉన్నారు. మంగళవారం ఫాతిమకు జ్వరం రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి ళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి యాప్రాల్ నుంచి వచ్చిన అతను ప్యాట్నీ సెంటర్లో బస్సు దిగాడు. మరో బస్సు ఎక్కేందుకు జేమ్స్ స్ట్రీట్‌కు నడిచి వెళుతుండగా పార్క్‌లేన్ సమీపంలో గతంలో రాజుతో పాటు పేపర్లు ఏరుకునే వ్యక్తి అతడిని గుర్తుపట్టి పలకరించాడు. అందరూ కలిసి టీ తాగారు. చిన్న పాపకు పాల కోసం నల్లగుట్టకు వెళుతుండగా అతను కూడా వారితో పాటు వెళ్లాడు. నల్లగుట్ట సూరత్ ట్రాన్స్‌ఫోర్ట్ సమీపంలో బ్యాగులు పెట్టిన రాజు,హజీరా పాపకు పాలు తీసుకుని వస్తామని ఫాతిమాను చూస్తూ ఉండమని చెప్పి వెళ్లారు. వారు వెళ్లి తిరిగి వచ్చేలోగా సదరు యువకుడు పాపతో పాటు ఉడాయించాడు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
పెద్దేముల్: ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన దంపతులు దినసరి కూలీలు. వీరికి ఐదేళ్ల కూతురు, కుమారుడు ఉన్నారు. బాలిక స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుతోంది. ఈ నెల 9న వరలక్ష్మివ్రతం సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి సెలవు ఉండటంతో తల్లిదండ్రులు బాలికను ఇంటివద్ద ఉంచి పనులకు వెళ్లారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నగేష్(22) బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు అస్వస్థతగా ఉంది. జ్వరం వచ్చిందేమోనని మందులు వేశారు. తగ్గకపోవడంతో మరుసటి రోజు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో తల్లి ఆరా తీస్తే అత్యాచార విషయం చెప్పింది. బంధువుల వద్ద తలదాచుకున్న నిందితుడిని గ్రామానికి తెచ్చి సోమవారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, సీఐ రవికుమార్ పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ చేరుకొని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నగేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తెలిసిన వాడే కాటేశాడు
ఉప్పల్: బంధువే ఓ బాలికపై లైంగికదాడికి పల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన దంపతులు నగరానికి వలస వచ్చి రామంతాపూర్ ఇందిరానగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె (14) స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి చికెన్ తీసుకు వచ్చేందుకు బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఎదురైన ఆమె బంధువు మహేష్(25) బాలికకు మాయ మాటలు చెప్పి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కేసీఆర్ నగర్‌లోని నిర్మాణంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికకు నీళ్లలో ఏదో కలిపి బలవంతగా తాగించాడు. స్పృహకోల్పోయిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించి ఏడుస్తున్న బాలికను వారి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. తమ కూతురు తిరిగి రాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు కాలనీల్లో గాలిస్తుండగా ఏడ్చుకుంటూ వస్తున్న ఆమెను గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రవిబాబు తెలిపారు. కఠినంగా శిక్షించాలి బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు అన్నారు. నగరంలో బాలికలపై తరచూ లైంగికదాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బాధితులకు ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్ అంశాల్లో రెవెన్యూ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. -
మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..
ఉత్తరకాశీ: గత మూడు నెలల కాలంలో ఆ 132 గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదట. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. ఒక పక్క ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారిక గణంకాల ప్రకారం.. ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో గత మూడు నెలల్లో 216 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఒక్క ఆడ శిశువు కూడా లేదని ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి. దీని వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చూసేందుకు నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కాకతాళీయం కాదు, కుట్ర మూడు నెలల కాలంలో వందకు పైగా గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించకపోవడం కాకతాళీయంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్ ఆరోపించారు. ఉత్తర కాశీలో ఆడపిల్లలు పుట్టకుండా చేసేందుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నాయని మండిపడ్డారు. గట్టి చర్యలు తీసుకోండి భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీనియర్ జర్నలిస్ట్ శివసింగ్ థన్‌వాల్ డిమాండ్ చేశారు. ‘లింగ నిష్పత్తిపై ప్రభుత్వ గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉత్తరకాశీలో పరిస్థితి ఉంది. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని అధికారిక లెక్కలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి అనాగరిక చర్యలకు అడ్డుకట్టవేయాల’ని అన్నారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
సైదాబాద్: అభం శుభం తెలియని బాలికపై ఇద్దరు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. సినిమా చూపిస్తానని తీసుకెళ్లి పాడుపడిన సాడుబడిన బంగ్లాలో ఒకరి తర్వాత మరొకరు ఘాతుకానికి ఒడిగట్టారు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు నిందితులిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి చంపాపేట పరిధిలోని సింగరేణి కాలనీలో ఉంటోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె (11) తుర్కయంజాల్‌లోని హాస్టల్లో ఉంటూ 4వ తరగతి చదువుతుంది. మరో బాలిక(06) మూడో తరగతి చదువుతోంది. బాధితురాలి తండ్రి ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా, భర్త మరణాన్ని తట్టుకోలేక ఆమె తల్లి మతిస్థిమితం కోల్పోయింది. అదే ప్రాంతానికి చెందిన కేతవత్ మోతిలాల్ చిత్తు కాగితాలు ఎరుకునే వ్యాపారం చేస్తుండగా, దస్రు ఓ ప్రయివేట్ ఆన్లైన్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రావడంతో ఇంటికి వచ్చిన బాలిక స్నేహితులతో కలిసి ఆడుకుంటుండటాన్ని గుర్తించిన మోతిలాల్, దస్రులు ఇద్దరు బాలికలను సినిమా చూపిస్తామని బైక్‌పై ఎక్కించుకుని గడ్డిఅన్నారం రోడ్డులోని గంగా థియేటర్ వద్దకు తీసుకొచ్చారు. థియేటర్ ఎదురుగా ఉంటున్న పాడుబడిన బంగ్లాలోకి బాలిక(11)ను తీసుకెళ్లి మోతిలాల్ మొదట అత్యాచారానికి పాల్పడగా, అనంతరం దస్రు దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు నొప్పి భరించలేక కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో ఇద్దరు బాలికలు ఉండగా ఒకరిపై మాత్రమే అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
చికెన్ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య
చెన్నై, తిరువళ్లూరు: మద్యం మత్తులో ఉన్న యువకుడి వద్ద చికెన్ పకోడా అడిగినందుకు ఆవేశంతో చిన్నారిని బ్రిడ్జి నుండి కిందకు తోసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంతరం బాలిక తీవ్రంగా గాయపడడంతో హత్య చేసి చిన్నారి ఇంటి సమీపంలో పడేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పకున్నాడు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితం వెళ్లవేడు ఇటుక చాంబర్ వద్ద తీవ్ర గాయాలతో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వెళ్లవేడు పోలీసులు చాంబర్లో పని చేసే విక్రమ్, నిలక్కర్‌తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నిలక్కర్‌కు మాత్రమే చిన్నారి హత్యలో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. పోలీసుల సమాచారం మేరకు, సంఘటన జరిగిన రోజు ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని నిలక్కర్ అనే యువకుడు వెళ్లవేడు బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నారికి మిఠాయిలు తీసి ఇవ్వడంతో పాటు మద్యం, చికెన్ పకోడా కూడా తీసుకున్నాడు. తిరిగి వస్తూ ద్విచక్ర వాహనాన్ని బ్రిడ్జి వద్ద ఆపి మద్యం సేవించడం ప్రారంబించాడు. ఈ సమయంలో చికెన్ పకోడా తింటుడగా, తనకు కావాలని బాలిక పదేపదే అడిగింది. దీంతో విసుగు చెందిన నిలక్కర్ బ్రిడ్జిపై నుండి చిన్నారిని కిందకు తోసేశాడు. తీవ్ర గాయాల పాలయిన బాలికను హత్య చేసి చిన్నారి ఇంటికి సమీపంలో పడేసినట్టు నిలక్కర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిలక్కర్‌ను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. కాగా చికెన్ పకోడ అడిగిన పాపానీకి అభం శుభం తెలియనీ చిన్నారిని దారుణంగా హత్య చేసిన సంఘటన తల్లిదండ్రులను తీవ్ర శోకంలో ముంచింది. -
ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..
అశ్వారావుపేటరూరల్: అభం శుభం తెలియని చిన్నారిని.. కన్న తల్లే కసాయిగా మారిపోయి, తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. వైర్లతో కొట్టి, ఒంటిపై కాల్చి, కాళ్లు, చేతులపై వాతలు పెట్టింది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ అమానుష చర్యలు సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. బాధిత చిన్నారి, గ్రామస్తుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం గాండ్లగూడేనికి చెందిన భూక్యా మంగకు గణేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఇందు(11), ఆశ్విత(6) ఉన్నారు. రెండేళ్ల క్రితం గణేష్ చనిపోయాడు. అప్పటి నుంచి మంగ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం తాడువాయి గ్రామానికి చెందిన భూపతిరాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తాడువాయిలోనే ఉంటున్న మంగ.. తన పెద్ద కూతురు ఇందును అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలోగల ఐటీడీఏ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించింది. ఐదో తరగతి చదువుతున్న ఇందు గడిచిన దసరా సెలవుల సమయంలో తల్లి వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న చిన్నారిని అ కారణంగా తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చిత్రహింసలు భరించలేక చిన్నారి మూడు రోజుల క్రితం అమ్మమ్మ నివాసమైన గాండ్లగూడేనికి పారిపోయి వచ్చింది. అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న ఇందును ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కృష్ణకుమారి పాఠశాలకు తీసుకొచ్చి, ఆశ్రమ పాఠశాలలో ఉంచారు. సోమవారం మధ్యాహ్న సమయంలో ఇందు తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి వచ్చి టీసీ ఇవ్వాలని హెచ్ఎంపై ఒత్తిడి చేశారు. టీసీ ఇచ్చేందుకు హెచ్ఎం సిద్ధం కాగా.. వారితో వెళ్లేందుకు చిన్నారి ఒప్పుకోలేదు. వారు పెడుతున్న చిత్రహింసల గురించి తోటి విద్యార్థినులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషయాన్ని విద్యార్థినులు హెచ్ఎం దృష్టికి తేగా.. ఆమె చిన్నారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, భూపతిరాజు అనే వ్యక్తి పెడుతున్న చిత్రహింసలను గురించి చెబుతూ చిన్నారి బోరున విలపించింది. ఆ తర్వాత హెచ్ఎం, గ్రామస్తులు ఇందును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సమస్యను వివరించారు. కేసు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తుందని, అక్కడి ఠాణాలోనే ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు చెప్పారు. -
ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం
అభం శుభం తెలియని చిన్నారికి ఆశ మాటలు చెప్పారు.. మిఠాయిలు ఇప్పిస్తామని తీపి మాటలు చెప్పి నమ్మించారు.. ఆ మానవ మృగాలు చెప్పిన మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టలేని చిన్నారి వారితో వెళ్లింది. చిన్నారిపై అత్యాచారానికి ఒడిæగట్టి ఆపై హత్య చేసి ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. చెన్నై, తిరువళ్లూరు: ఇటుకబట్టి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఇంటి సమీపంలో పడేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రం కొలడై జిల్లా కలియగుండలం గ్రామానికి చెందిన అమిత్ (34). ఇతను భార్య అవంతి, వీరికి ఈశాని అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. దంపతులు తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడులోని ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం యథావిధిగా పనికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన అమిత్, అతని భార్య అవంతి నిద్రకు ఉపక్రమించారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఈశాని సాయంత్రం కనిపించలేదు. భార్యభర్తలిద్దరూ తమ కుమార్తె కోసం గాలింపు చేపట్టారు. రాత్రంతా గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈశానీ మృతదేహం ఇంటికి సమీపంలో కనిపించింది. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో పాటు జననాంగం వద్ద రక్తస్రావంతో చిన్నారి అచేతనంగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బోరున రోదించారు. చిన్నారి హత్యకు సంబంధించి ఇటుకబట్టీలోని కొందరు వెళ్లవేడు పోలీసులకు సమాచారం అందించారు. వెళ్లవేడు ఇన్స్పెక్టర్ వెంకటేషన్‌తో పాటు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రాంబో డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. పోలీసుల అదుపులో నలుగురు: చిన్నారి దారుణహత్యకు గురైనట్టు నిర్ధారించిన పోలీసులు ఆమెపై అత్యాచారం చేసి ఉండొచ్చన్న అనుమానంతో విచారణ ముమ్మరం చేశారు. అక్కడ పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన విక్రమ్, చంద్రవానన్, నిలక్కర్‌తో పాటు 56 ఏళ్ల వృద్ధుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో విక్రమ్, చంద్రవానన్, నిలక్కర్‌లు చిన్నారిని తరచూ చాక్లెట్లు తీసి ఇస్తామని చెప్పి బజారుకు తీసుకెళ్లేవారని తెలిసింది. వీరే ఆదివారం సాయంత్రం బజారుకు తీసుకెళ్లారని, ఆపై మద్యం మత్తులో రాత్రి ఇంటికి వచ్చారని నిర్ధారించిన పోలీసులు, చిన్నారికి చాక్లెట్ ఆశచూపి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసి ఇంటికి సమీపంలో పడేసి ఉంటారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణనూ ముమ్మరం చేశారు. -
ఆడపిల్లలు మా కొద్దు... వారసులే కావాలి
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఆ గిరిజన దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు.. వారసుడి కోసం మహిళ మరోమారు గర్భం దాల్చింది. మూడో కాన్పులో కూడా ఆ దంపతులకు ఆడపిల్లలు పుట్టడంతో ఇక సాకే స్థోమత లేదని 10 రోజుల శిశువును శిశుగృహకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన గురువారం తిరుమలగిరి మండలంలో చోటు చేసుకుంది. ఐసీడీఎస్ సీడీపీఓ గంధం పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ శ్రీను, విజయ దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. వారసుడి కోసం విజయ మూడో సారి గర్భం దాల్చింది. ఈనెల 2వ తేదీన మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఇక ఆడపిల్లలను సాకే స్థోమత తమకు లేదని శిశువును శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని స్ధానిక అంగన్వాడీ టీచర్‌కు చెప్పడంతో సదరు టీచర్ విషయాన్ని సీడీపీఓ, సూపర్వైజర్లకు చేరవేయంతో గురువారం అధికారులు తండాకు చేరుకొని శ్రీను, విజయ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఆడపిల్లలకు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు. ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆడపిల్లల రక్షణకు షీటీంలు, ఉచిత నాణ్యమైన విద్య, గిరిజనులకు ఉచితంగా రూ. లక్ష తో పాటు తదితర పథకాలు అందజేస్తుందని వివరించడంతో ఆ తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గర్కనేట్‌తండాలో.. మండలంలోని గర్కనేట్‌తండాకు చెందిన సఫావత్ ధాను, స్వామి దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చారు. మరోమారు ధాను రెండో సారి గర్భం దాల్చడంతో ఈనెల 2వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమది నిరుపేద కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలను సాకే స్థోమత తమకులేదని ఆడపిల్లలను శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు మనస్సు మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు సీడీపీఓ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి, యాదమ్మ, మోతీలాల్, వెంకటేశ్వర్లు, సరిత ఉన్నారు. -
బావిలో చిన్నారి మృతదేహం
చెన్నై,టీ.నగర్: కోయంబత్తూరు విలాంకురిచ్చిలో సోమవారం రెండున్నరేళ్ల బాలిక బావిలో శవమై తేలింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. కోయంబత్తూరు అన్నూరు కరియ గౌండనూర్‌కు చెందిన కనకరాజ్, కాంచన దంపతులు విలాంగురిచ్చిలో గల కుప్పురాజ్ గార్డెన్లో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కనకరాజ్ జేసీబీ వాహనం అద్దెకు ఇస్తుంటారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె అమృత ఉంది. ఆదివారం వీరి ఇంటికి బంధువులు వచ్చి ఉన్నారు. రాత్రి అందరు భోజనం చేసిన తర్వాత బిడ్డతో పాటు కాంచన, కనకరాజ్ ఇంట్లో నిద్రించేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చిన బంధువులు కొందరు ఆరుబయట మంచాలపై నిద్రించారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బిడ్డ ఏడవడంతో పాలిచ్చి పడుకోబెట్టింది. ఇలా ఉండగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాంచన లేచి చూడగా బిడ్డ కనిపించక పోవడంతో దిగ్భ్రాంతి చెందింది. ఆ తర్వాత బిడ్డ కోసం బంధువులు, భర్త కనకరాజ్ తీవ్రంగా గాలించారు. అయితే బిడ్డ ఆచూకీ తెలియలేదు. ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో కరువేలంకాడు ప్రాంతంలో వెతికి చూడగా, అక్కడ ఉన్న పాడుబడిన బావిలో బిడ్డ కనిపించింది. వెంటనే బావిలోకి తాడు సాయంతో దిగి బిడ్డను వెలికి తీశారు. బిడ్డ స్పృహతప్పి ఉండవచ్చని భావించి వెంటనే సమీపాన గల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే పరిక్షీంచిన వైద్యులు పాప మృతి చెందినట్లు తెలిపారు. దీని గురించి సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. -
బాలికపై లైంగికదాడి.. పరారీలో నిందితుడు
ఉప్పల్: తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ టీవీ కాలనీలో రోడ్ నంబర్–9లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కుటుంబం నాలుగునెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చింది. రామంతాపూర్ టీవీ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం ప్రాంగణంలోనే గుడిసె వేసుకుని ఉంటూ అక్కడే పని చేస్తున్నారు. వారికి ఒక కుమార్తె(9) అదే భవనంలో తాపీమేస్త్రీగా పని చేస్తున్న లక్ష్మణ్ అనే యువకుడు గురువారం ఉదయం గుడిసెలో ఎవరూ లేని సమయంలో చిన్నారిని సమీపంలోని మరో భవనంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి విషయం చెప్పింది. స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అతడిని వదిలేశారు. ఈ సంఘటన దావానంలా వ్యాపించడంతో బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హోం మంత్రి బాధ్యత వహించాలి: బాలల హక్కుల సంఘం రాష్ట్రంలో పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు హోంశాఖ మంత్రి బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గురువారం డిమాండ్ చేసింది. లేని పక్షంలో బంగారు తెలంగాణకు మచ్చ వచ్చే ప్రమాదం ఉందన్నారు. తొమ్మిదేళ్ల బాలిక బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న విషయాన్ని ఆపరేషన్ ముస్కాన్ టీమ్ గుర్తించకపోవడం దారుణమన్నారు. -
చికిత్స కోసం వస్తే వికలాంగురాలిని చేశారు..
సనత్‌నగర్: కాలికి గాయమైన తమ కుమార్తెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె శాశ్వతంగా కాలును కోల్పోవాలి వచ్చిందని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఎస్ఆర్నగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, పావని దంపతుల కుమార్తె అక్షర (5) గత నెల 13న ఇంట్లో ఆడుకుంటుండగా కబోర్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పాప కాలిని ఎక్స్‌రే తీయించిన వైద్యులు.. పాపకు ఎలాంటి ప్రమాదం లేదు..కాలికి ఫ్రాక్చర్ అయినందున ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటికి తాత్కాలికంగా సిమెంట్ పట్టీ వేసి మరుసటి రోజు మే 14న ఉదయం ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మర్నాడు ఉదయం పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్లోకి అక్షరను తీసుకువెళ్లిన వైద్యులు రెండు గంటల తర్వాత పాపను బయటికి తీసుకువచ్చి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. సీటీస్కాన్ చేయగా కాలికి రక్తప్రసరణ జరగడం లేదని, సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతెఓ వారు పాపను తీసుకుని యశోద ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి పాప కాలికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆరు గంటల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగినందున కాలు తీసేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో పాప ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు. దీంతో వారు సెకండ్ ఒపీనియన్ కోసం సన్‌షైన్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ చిన్న పిల్లలను చేర్చుకోరని చెప్పడంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా. అక్కడి వైద్యులు కూడా కాలు తీయాల్సిందేనని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఆపరేషన్‌కు అంగీకరించడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాలును తొలగించారు. నీలిమ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె కాలిని కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే పోలీసులు నీలిమ ఆస్పత్రి యాజమాన్యానికే కొమ్ము కాస్తున్నారని, తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు చిన్నారి అక్షర కేసులో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు. చిన్నారిని తీసుకువచ్చినప్పుడు తగిన చికిత్స అందించాం. అయితే పాప తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం, వారితో చర్చలు జరుపుతున్నాం...–నీలిమ ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాస్ -
అయ్యో! పాపం
మదనపల్లె టౌన్: అప్పుడే పుట్టిన పసికందు. ఇంకా కళ్లు కూడా తెరవలేదు. తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్శను అనుభవిస్తూ ఉండాల్సిన ఆ పసికందు ను కొందరు యువకులు హంద్రీ–నీవా కాలువ వద్ద పడేసిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిం చి మదనపల్లె సీడీపీఓ లక్ష్మీదేవి కథనం..కురబలకోట మండలం పూసావారిపల్లెకు చెందిన సోమశేఖర్ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం మేకలు మేపడానికి అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లా డు. అక్కడి హంద్రీ–నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బొడ్డుకూడా ఊడని, అప్పుడే పుట్టిన ఓ పసికందును హంద్రీ–నీవా కాలువ వద్ద వదలి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న మేకల కాపరి స్థానికుల సాయంతో ఆటోలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న సీడీపీఓ, ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందును అంగన్వాడీ ఆయాల సంరక్షణలో ఉంచారు. పసికందుకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలుసుకోవాలని కురబలకోట, అంగ ళ్లు సూపర్వైజర్లను ఆదేశించారు. జన్మనిచ్చిన తల్లికి ఏం సమస్య వచ్చిందోగానీ పసికందును హతమార్చడం ఇష్టం లేక వదలి వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తల్లిదండ్రులు మందలించారని..
అల్వాల్: ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాసానికిలోనైన ఓ బాలిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భీమవర ప్రాంతానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లో ఉంటూ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె రామలక్ష్మి(17) బీమవరంలో ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికిలోనైన రామలక్ష్మి బుధవారం తల్లితోపాటు ఇంటిపై పనులు చేస్తూ రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. -
ఆడబిడ్డ పుట్టిందని .. తండ్రి ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపెట పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆంజనేయులు(24) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని భార్య శుక్రవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనోవేదనతో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. -
తండ్రి మందలించాడని..
డబీర్‌పురా: తండ్రి మందలించాడని మనస్తాపానికిలోనైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ కుమార్తె హుదా ఖాతూన్ (13) ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమె అతడి యాక్టివా తీసుకుని బయటికి వెళ్లేది. గురువారం కుమార్తె బైక్ నడుపుతుండటాన్ని చూసిన ఇమ్రాన్ ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన హుదాఖాతూన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య... చాదర్‌ఘాట్: ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీదర్‌కు చెందిన అమ్రీన్ (20) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తండ్రి తో కలిసి ఆజంపురా చమన్‌లో నివాసం ఉంటోంది. గురువారం తండ్రి బీదర్‌కు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్రీన్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికను కిడ్నాప్ చేసి వివాహం
టీ.నగర్: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న ఆంధ్రా యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పులియాంతోపునకు చెందిన కూలి కార్మికుడు ఒకరు తన 14 ఏళ్ల కుమార్తె కనిపించలేదని ఈనెల 8న పులియాంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తూ వచ్చారు. విచారణలో బాలికను తిరుపతి నుంచి వచ్చిన వారి బంధువు ఒకరు మాయమాటలు చెప్పి ఆంధ్రాకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. పులియాంతోపు పోలీసులు ఆంధ్రాకు వెళ్లి బాలికను రక్షించి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పేరు బాలకృష్ణన్ అని తెలిసింది. పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
స్కేటింగ్ చిన్నారి ఘనత
చెన్నై ,టీ.నగర్: మహాబలిపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కమలిమూర్తి స్కేటింగ్‌లో అసాధారణ ప్రతిభ చూపించింది. గౌను ధరించి స్కేటింగ్బోర్డ్ను ఉపయోగించిన సమయంలో తీసిన ఫోటో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్కేట్ బోర్డరైన డోనీ హాకిన్స్ కళ్లలో పడింది. పాదరక్షలు కూడా లేకుండా ఒక బాలిక అసాధ్యమైన స్కేటింగ్ బోర్డును ఉపయోగించడం గమనించిన డోని ఈ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేయగా ప్రపంచస్థాయిలో పేరుపొందింది. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన షషా రెయిన్బో అనే డైరెక్టర్ తమిళనాడు చేరుకుని కమలి పేరుతోనే 24 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ గత నెల జరిగిన అట్లాంటా చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. గత ఏడాది డిసెంబర్లో ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుని అవార్డును చేజిక్కించుకుంది. కమలి, ఆమె తల్లి సుగంధి, అవ్వ గురించి వివరిస్తూ ఉన్న ఈ చిత్రం 2020 ఆస్కార్ అవార్డు సిఫార్సుల జాబితాలో చోటు సంపాదించుకుంది. కమలి తల్లి సుగంధి సోమవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కుమార్తె తర్వాత తమకు లభించిన పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. -
కదిలించిన కథనం.. స్పందించిన హృదయం
ఈ ఫొటోలో రామక్కకు రూ.10వేల నగదును అందజేస్తున్న వ్యక్తి ఓ రైతు. పేరు జూగప్ప గారి శివకుమార్. గుమ్మఘట్ట మండలం కేపీ.దొడ్డి గ్రామానికి చెందిన ఇతను ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి చలించిపోయారు. కరువు జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది తనకు ఉన్నదాంట్లో ఆ తల్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తన కుమారుడు సంతోష్‌తో కలిసి పరుగున కలుగోడు గ్రామానికి చేరుకున్నాడు. ఓ అన్నగా ఆమెకు ధైర్యం చెప్పి చిరు సహాయం ఆమె చేతికందించాడు. అంతటితో ఆయన మనసు కుదుట పడలేదు.. తన పొలంలో పండిన ధాన్యం గింజలతో పిల్లల ఆకలి తీరుస్తానంటూ కొండంత భరోసానివ్వడం విశేషం. ఈ రైతన్నకు ‘సాక్షి’ సలాం. రామక్క వేదనాభరిత జీవనం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. చిన్న వయస్సులో సంసార సాగరాన్ని ఒంటి చేత్తో ఈదుతున్న ఒంటరి మహిళకు మానవత్వం అండగా నిలుస్తోంది. భర్తను పోగొట్టుకొని.. ఆరుగురు ఆడపిల్లలతో పాటు అత్త పోషణ భారాన్ని భుజానికెత్తుకున్న ఆ తల్లికి జగమంత కుటుంబం భరోసానిస్తోంది. ‘సాక్షి’లో ఈనెల 13న ‘రామా.. కనవేమిరా!’ శీర్షికన ప్రచురితమైన కథనం మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపింది. ఓ అక్కగా.. చెల్లిగా.. కుటుంబ సభ్యురాలిగా ఓదార్చడంతో పాటు ఆమెను కష్టాల సాగరం నుంచి బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. గుమ్మఘట్ట: భర్త చాటున పదమూడేళ్లు క్షణాల్లా గడిచిపోయాయి. ‘ఆయన’ అడిగిన ఒకే ఒక్క కోరిక తీర్చడంలో భాగంగా ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలనే ఆశ తీరకుండానే ఆ ఇంటి పెద్దదిక్కు కష్టాల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరై కాలం చేశాడు. ఏడాది కాలంగా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలను చూస్తే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయి. గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హనుమంతు భార్య రామక్క దీనగాథను ‘సాక్షి’ అక్షరీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి ఆమె వివరాలు సేకరించారు. కొందరు పత్రికలో ప్రచురితమైన ఆమె బ్యాంకు ఖాతా వివరాలు చూసి రూ. 40వేల నగదు సహాయం చేశారు. మరికొందరు స్వయంగా పరామర్శించి సాయమందించారు. వైఎస్సార్సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్య.. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఎస్ఆర్ఐటీ అధినేత ఆలూరి సాంబశివారెడ్డి.. జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, రాయదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, మునిరత్నం ట్రావెల్స్ యజమాని శ్రీనివాసులు తదితరులు రామక్క కష్టాలపై ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో స్వయంగా కలిసి కష్టాల నుంచి గట్టెక్కిస్తామని భరోసానిచ్చారు. ‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది.. ఏడాది కాలంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నా. కూలి దొరికితే తప్ప పిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఎవరినీ నోరు తెరిచి అడగలేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. ‘సాక్షి’ కథనం నాకు కొండంత అండగా నిలుస్తోంది. బంధుత్వం లేకపోయినా, ఎంతో మంది నాకు ధైర్యం చెబుతుండటం చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ‘సాక్షి’ రుణం తీర్చుకోలేనిది. – రామక్క బ్యాంకు ఖాతా వివరాలు పేరు: రామక్క మాదిగ ఊరు: కలుగోడు గ్రామం, గుమ్మఘట్ట మండలం బ్యాంక్ అకౌంట్ నెం. : 91029588843, ఏపీజీబీ గుమ్మఘట్ట బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ :ఏపీజీబీ 0001018 -
ఆరుగురు కంటిపాపల ఆడ..బిడ్డ రామక్క
ఆమె పేరులో రాముడు.. ఆ తల్లి జీవితంలో ఆయనను మించిన కష్టాలు.పురుషోత్తమునికి పద్నాలుగేళ్ల వనవాసం..ఈ ఇల్లాలి జీవితమే కష్టాల సుడిగుండం.వారసుడు కావాలనే భర్త కోరికనిత్య ప్రసవ వేదనను మిగిల్చింది. ఆరుగురు ఆడ..బిడ్డల జన్మకు కారణమైంది. ‘ఆయన’ ఉన్నాడనే ధైర్యంతో..కన్నీళ్లను దిగమింగింది.ఈ ప్రయాణం ఎంతోదూరం సాగకనే..ఆ ‘తోడు’ ఒంటరిని చేసింది.కష్టాలకు ఎదురొడ్డి నిలవలేని భర్తలోకం వీడగా..కంటి పాపల తోడుగా ఆమె..ఒంటరి పోరాటం చేస్తోంది. అనంతపురం, గుమ్మఘట్ట : నాపేరు హెచ్.రామక్క. బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తికి చెందిన సవారప్పగారి కొల్లప్ప, రామాంజినమ్మలకు నేను రెండో సంతానం. 6వ తరగతి వరకు చదువుకున్నా. పదమూడేళ్ల కిందట గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన హరిజన హనుమంతుతో వివాహమైంది. అప్పటికి నా వయస్సు 18 ఏళ్లు. మొదట ఒక బాబు, పాప చాలని అనుకున్నాం. పెళ్లయిన ఏడాదిన్నరకే మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. లక్ష్మీదేవి అని అందరూ సంతోషించారు. ఆ తర్వాత మళ్లీ పాపే. మూడో కాన్పులో కచ్చితంగా కొడుకు పుడతాడని అందరూ చెప్పడంతో మరో కాన్పుకు సిద్ధపడగా అప్పుడూ ఆడపిల్లే. ఇక చాలని.. వీళ్లనే బాగా చూసుకుందామని నెత్తీనోరు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ‘తాతకు మా నాన్న ఒక్కడే.. మా నాన్నకు నేను ఒక్కడినే. వారసత్వం నాతోనే ఆగిపోతే ఎలా? నాకు కొడుకు కావాల్సిందే’ అని ఆయన పోరు పెట్టాడు. అలా నాలుగో కాన్పులోనూ ఆడబిడ్డే. అప్పటికి ససేమిరా అనడంతో మరో కాన్పుకు వెళ్లగా మళ్లీ అమ్మాయే. ఇక ఆపరేషన్ చేయించుకుంటానని కాళ్లావేళ్లా పడినా.. ఐదుగురి తర్వాత పుట్టేది మగబిడ్డేనని శాస్త్రాలు కూడా చెబుతున్నాయంటూ నమ్మబలికారు. చివరకు ఆరో కాన్పులోనూ ఆడపిల్లే కలిగింది. చిన్న కుటుంబంతో జీవితాన్ని సాఫీగా గడుపుదామని అనుకుంటే.. గంపెడు పిల్లలతో పోషణ భారమైంది. విధి వెన్నుపోటు ఉన్నంతలో మా ఆయన ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. స్థానికంగా పనుల్లేక మా అత్త లక్ష్మీదేవిని ఇంటి వద్ద తోడుగా పెట్టి బెంగళూరు, మంగళూరు, తుమకూరు, దావణగెర తదితర పట్టణాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. నెలకు రూ.12వేల నుంచి రూ.14 వేల వరకు వచ్చేది. సంసారం ఇలా సాగిపోతుండగా.. బెంగళూరులో కూలి పనులు చేస్తున్న సమయంలో ఆయనపై సిమెంట్ బస్తాలు మీద పడటంతో నడుము దెబ్బతినింది. ఏడాది పాటు మంచం దిగకూడదని వైద్యులుసలహా ఇవ్వడంతో కుమిలిపోయాడు. ఆ సమయంలో కుటుంబ పోషణ భారమైంది. పిల్లల ఆకలి బాధ చూసి ఆయన కలత చెందాడు. దిక్కుతోచని స్థితిలో 2018 జనవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రలేని రాత్రులు వరుస ప్రసవాలతో అనారోగ్యం పాలయ్యాను. ఇదే సమయంలో భర్త మరణించడంతో దిక్కులేని దాన్నయ్యా. ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వ ఇల్లు మంజూరైనా నిర్మాణ దశలోనే ఆయన మమ్మల్ని వదిలేసి పోయాడు. ఆ తర్వాత సిమెంట్ బస్తా కూడా కొనలేని పరిస్థితి మాది. ఇప్పటికి ఏడాది అవుతోంది. ఆ ఇంటిని అలా వదిలేశాం. బిడ్డల దీనావస్థను తలుచుకొని గడిపిన నిద్రలేని రాత్రిళ్లు ఎన్నో. ఆరుగురూ ఆడపిల్లలే కావడంతో మా జీవితం ఏమవుతుందో తెలియట్లేదు. కూలీ పనులకు వెళ్తూ.. నేను పస్తులుంటూ పిల్లల కడుపు నింపుతున్నా. కూలీ దొరకని రోజుల్లో చుట్టుపక్క ఇళ్లలో బియ్యంలో రాళ్లు ఏరడం, నూకలు నేమడం ఇతరత్రా చిన్నాచితక పనులు చేస్తూ కాలం గడుపుతున్నా. రోజంతా కష్టపడినా రూ.150లు కూడా రాదు. మా అమ్మానాన్న కూడా నిరుపేదలే. వాళ్లను ఇబ్బంది పెట్టలేక నా జీవితం నేను నెట్టుకొస్తున్నా. తోడుగా పెద్ద కూతురు పిల్లల పోషణ భారం కావడంతో అనాథ ఆశ్రమంలో చేర్పిద్దామని తెలిసిన వాళ్లతో మాట్లాడినా. ఈ విషయాన్ని బిడ్డలతో చర్చిస్తే ఆకలినైనా భరిస్తాం కానీ, నిన్ను వదిలి వెళ్లమని ఒకటే ఏడుపు. వాళ్ల కన్నీళ్లు నాలో మరో ఆలోచన లేకుండా చేశాయి. కలుగోడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విజయ 8వ తరగతి, శ్రీలక్ష్మి 5వ తరగతి, అను 3వ తరగతి, బేబి 2వ తరగతి చదువుతున్నారు. అవంతిక(6), స్రవంతిక(2) ఇంటి వద్దే ఉంటారు. పెద్ద పాపకు బీటీపీ వద్దనున్న కేజీబీవీలో సీటు వచ్చింది. ఇంటి వద్ద కష్టాన్ని చూసి తట్టుకోలేక నాతోనే ఉంటానని అవకాశాన్ని వదలుకుంది. ఇప్పుడు నాకు కాస్త చేదోడువాదోడుగా ఉంటోంది. ఓ దారి చూపండి పింఛను తప్పితే మరో ఆసరా లేదు. నా భర్త చేసినా, నేను చేసినా గంపెడు పిల్లలు కనడం తప్పే. ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం కూడా లేదు. పిల్లల జీవితం గాడిన పడితే అదే పదివేలు. వాళ్లకు మంచి బట్టలు కావాల, మిద్దెలు ఉండాలని అనుకోవట్లేదు. పూటకు ముద్ద అన్నం దొరికి, చదువు చెప్పించగలిగితే చాలనుకుంటున్నా. నా ప్రయత్నానికి సహకరించి దారి చూపాలని వేడుకుంటున్నా. పేరు : హెచ్.రామక్క ఊరు : కలుగోడు, గుమ్మఘట్ట మండలం బ్యాంకు అకౌంట్ : 91029588843,ఏపీజీబీ, గుమ్మఘట్ట ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ 00010118 -
బాలికపై లైంగికదాడికి యత్నం
మల్లాపూర్: ఓ బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన కుటుంబం నగరానికి వలసవచ్చి, నాచారం ఎర్రకుంటలో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా వారి రెండో కుమార్తె (06) ఇంట్లో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన జీహెచ్ఎంసీ కార్మికుడు కృష్ణ ఇంట్లోకి వెల్లి బాలికపై లైంగికదాడికి యత్నిచాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని కృష్ణను దేహశుద్ది చేసి నాచారం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతలో ఆకలి చావు
-
బాలిక అపహరణకు యత్నం
బుచ్చినాయుడుకండ్రిగ : ఇంటి ముందు ఆరుబయట తల్లిదండ్రుల పక్కన పడుకుని నిద్రిస్తున్న బాలికను అర్ధరాత్రి అపహరణకు యత్నించిన సంఘటన మండలంలోని తానిగిల్లు గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల కథనం.. తానిగిల్లుకు చెందిన మానికల వెంకటమ్మ, నాగరాజుల కుమార్తె వైష్ణవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాల్లో 4 వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో తల్లిదండ్రులతో కలసి సోమవారం రాత్రి ఇంటి ముందు ఆరుబయట పడుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న వైష్ణవిని అర్ధరాత్రి అనంతరం ఓ ఆగంతకుడు భుజాలపై వేసుకుని ఎత్తుకెళ్లాడు. వెంకటమ్మకు అకస్మాత్తుగా మెలకువ రావడం..కుమార్తె వైష్ణవి కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. గమనించేసరికి తన కుమార్తెను ఎత్తుకుపోతున్న ఆగంతకుడిని గమనించి కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు అతడిని వెంబడించారు. దీంతో ఆగంతకుడు పాపను తీసుకుపోవడం కుదరని గ్రహిం చి, వదిలిపెట్టి, చీకట్లో పరారయ్యాడు. మంగళవా రం వైష్ణవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
పాపకెందుకు శిక్ష ?
శుక్రవారం తెనాలిలో కోర్టు ప్రాంగణం.. ఆరేళ్ల పాప.. ముఖంలో ఆందోళన.. నీళ్లు తిరుగుతున్న కళ్లలో భయం.. ఎటుపోవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు.. అమ్మ వెళ్లిన వైపే చూస్తోంది. ఎంతకీ అమ్మ కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియ లేదు. కొద్ది గంటల ముందు వరకు నాన్న కళ్ల ముందు అలా మెరిసి మాయమైపోయాడు. నా చిట్టి తల్లీ అంటూ దగ్గరకు తీసుకుంటాడేమోనని ఆశ పడింది. నాన్న దూరంగానే వెళ్లిపోయాడు.. బిక్కముఖం వేసుకుని ఉన్న పాపను నల్ల చొక్కాలు పలకరించి ఆరా తీశాయి.. ‘అమ్మ బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి.. ఇంకా రాలేదు.. అందుకే చూస్తున్నాన’ని పాప బదులిచ్చింది. తల్లి గురించి ఆరా తీస్తే.. భార్యాభర్తల విభేదాల కేసు.. తల్లి తనతో పాపను తీసుకొచ్చింది. తండ్రి కనిపించేసరికి పాపను ఆయన ముందు వదిలేసింది.. విభేదాలు నిండిన గొంతుల్లో మాటలు పెగల్లేదు.. పాప గురించి భర్తకు ఆమె చెప్పలేదు.. చట్టాల ఆంక్షలు చుట్టుకుంటాయనే నెపంతో కన్న బిడ్డ చెంతకు తండ్రి రాలేదు.. నాన్న గుండెలపై మమకారం చిందలేదు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అందుకే అమ్మ ఆప్యాయతల ఒడిలో మాధుర్యాన్ని, నాన్న గుండెలపై అనురాగాన్ని అందుకోవాల్సిన బిడ్డ అనాథగా రోడ్డుపై నిలబడింది.. విచ్ఛిమవుతున్న కుటుంబ బాంధ్యవాలకు నిలువెత్తు సాక్ష్యంగా.. తెగిపోతున్న మానవసంబంధాల నడుమ పిల్లలు తెగినగాలిపటాలవుతున్నారు. గాలిపటానికిసూత్రం, దారం ఉంటేనే ఆకసాన ఎగిరేది...పిల్లలకు తల్లిదండ్రుల ఆసరా ఉంటేనే ఉన్నతంగాఎదిగేది...నేటి సమాజంలో చిన్నచిన్న వివాదాలతోదాంపత్యబంధాలను తెగతెంపుకొంటున్న తల్లిదండ్రులు...వారి కడుపున పుట్టిన పాపానికి పిల్లల బతుకులు తెగినగాలిపటాల్లా చిందరవందర అవుతున్నాయి. తెనాలి కోర్టు ఆవరణలో శుక్రవారం తారసిల్లినఈ బాలిక ఉదంతం ఇటువంటి లక్షలాదిఅభాగ్యులకో ఉదాహరణ. గుంటూరు, తెనాలి: అది పట్టణంలోని కొత్తపేటలో రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేటు కోర్టు. కక్షిదారులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు/స్నేహితులు, న్యాయవాదులు, సహాయకులతో బిజీగా ఉంది. న్యాయమూర్తి వచ్చేసరికి కోర్టు హాలంతా నిశ్శబ్దంగా తయారైంది. ప్రతిరోజులాగానే యథావిధిగా కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. గంట గడిచేసరికి కక్షిదారుల దగ్గర కూర్చున్న ఆరేళ్ల పాప ఏడవటం ఆరంభించింది. పక్కనున్న మహిళ, ‘ఎవరమ్మా నువ్వు?...మీ అమ్మ లేదా’ అని ప్రశ్నించింది. ‘లేదాంటీ...బాత్రూమ్కు వెళ్లొస్తానంది...ఇంకా రాలేదు’ అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది. పాప ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ మహిళ మంచినీళ్లు, భోజనం పెట్టి ఓదార్చింది. విషయం న్యాయవాదులకు, వారినుంచి న్యాయమూర్తికి తెలిసింది. సాయంత్రానికి ఎవరూ రాకపోతే చట్టప్రకారం చేద్దామని న్యాయమూర్తి సూచించారు. తీరా విచారిస్తే గృహహింస కేసులో వాయిదాలకు తిరుగుతున్న భార్యాభర్తల నిర్లక్ష్యం, ఆ పాపను ఒంటరిని చేసిందని తెలిసి, అక్కడున్న అందరి మనసులు బరువెక్కాయి. దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీతిరుపతమ్మ, హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలో చేస్తున్న అమృతలూరు మండలం ప్యాపర్రు వాస్తవ్యుడు వెంకటస్వామికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత మోక్షిత జన్మించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. కొన్నేళ్లు విడిగా ఉన్నారు. మళ్లీ కలిశారు. రెండో కుమార్తె కూడా జన్మించింది. భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం తగ్గలేదు. ఫలితంగా స్థానిక కోర్టులో గృహహింస కేసు విచారణ జరుగుతోంది. విడివిడిగా ఉంటున్న ఇద్దరూ వాయిదాలకు వస్తున్నారు. పిల్లలిద్దరూ తల్లి లక్ష్మీతిరుపతమ్మ దగ్గరే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం కోర్టు వాయిదాకు వచ్చిన తిరుపతమ్మ, పెద్ద కుమార్తె మోక్షితను వెంట తీసుకొచ్చింది. అదే కోర్టుకు వచ్చిన భర్త వెంకటస్వామిని చూసింది. మోక్షితను అక్కడే కూర్చోబెట్టి, మూత్రవిసర్జనకు వెళ్లొస్తానని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఎంతకీ తల్లి రాకపోవటంతో ఆ బాలిక బిక్కముఖం వేసి ఏడుపు మొదలెట్టింది. అక్కడ ఉన్న న్యాయవాదులు గమనించి మోక్షితను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడించింది. సాయంత్రానికి తల్లిదండ్రులు వేర్వేరుగా కోర్టు వద్దకు చేరుకున్నారు. నవమి పండక్కి నాన్నతో వెళ్లి రెండురోజులు ఉంటానని పాప అంటే, వదిలేశానని తిరుపతమ్మ చెప్పింది. తన వెంట తీసుకెళితే న్యాయపరంగా చిక్కులొస్తాయని లాయరు చెప్పటంతో తాను తీసుకెళ్లలేదని ఆమె భర్త వెంకటస్వామి చెప్పటం గమనార్హం. విచ్ఛిన్నమవుతున్న వివాహ బంధాల నేపథ్యంలో పసిబిడ్డల జీవితాలు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో? చెప్పేందుకు ఈ ఘటనను పలువురు ఉదహరిస్తున్నారు. తండ్రి దగ్గర వదిలేస్తే బిడ్డను తీసుకెళతాడని తల్లి భావించి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయింది. వెంట తీసుకెళితే కేసులో న్యాయపరంగా ఏదైనా సమస్య వస్తుందేమోనని తండ్రి భయపడి, మానవత్వం లేకుండా వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రికి అప్పగించి వెళ్లొచ్చు కదాని తల్లిని ప్రశ్నిస్తే, మేం మాట్లాడుకోవటం లేదని సమాధానమిచ్చింది. సరే నువ్వు చూశావు కదా ఎందుకు పట్టించుకోలేదని తండ్రిని అడిగితే, ‘ఒకరిని కాదు...ఇద్దరు పిల్లలను తనతోనే తీసుకెళ్లాలని ఉందని, కాని న్యాయపరంగా చిక్కులొస్తాయని’ తీసుకెళ్లలేదని సమాధానమిచ్చాడు. అంతేగానీ, వదిలేస్తే తమ బిడ్డ ఎంతగా తల్లడిల్లుతుందోనని వారిద్దరూ కనీస ఆలోచన చేయలేదని అక్కడివారు మండిపడ్డారు. తెగిపోతున్న వివాహ బంధాల్లో పిల్లల జీవితాలు తెగిన గాలిపటాలవుతున్న ఉదంతాలను ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు బేతాళ ప్రభాకర్, శ్రీనాథ్ రెడ్డి ప్రస్తావించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి, మరోసారి ఇలా జరక్కుండా చట్టప్రకారం చర్యలు కోరతామని చెప్పారు. -
మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి..
పటాన్చెరు టౌన్: కామంతో కళ్లుమూసుకుని మూడేళ్ల చిన్నారిపై ఓ మృగాడు కాటువేసాడు.. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. బుధవారం పటాన్చెరు పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిందితుడిని రిమాండ్‌కు తరలించే ముందు డీఎస్పీ రాజేశ్వర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించి ఘటనా వివరాలను వెల్లడించారు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభయ్‌కుమార్ బతుకుదేరువు కోసం సంగారెడ్డి జిల్లా.. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామం గండిగూడ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీలో అమ్మమ్మ, తల్లితో పాటు బాధిత మూడేళ్ల చిన్నారి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పాప తల్లి అనారోగ్యంతో బాధపడుతుండంతో అమ్మమ్మ నీటికోసం వెళ్తూ పాపను చూసుకోమని పక్కింటికి చెందిన అభయ్‌కుమార్ దగ్గర ఉంచి వెళ్లింది. తిరిగి వచ్చేలోపే అభయ్‌కుమార్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన తల్లి, అమ్మమ్మ నిందితుడు అభయ్కుమార్ను నిలదీయగా ఇద్దరిని తోసివేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అభయ్కుమార్ను అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
మంటగలిసిన మానవత్వం
మల్కాజిగిరి: మానవత్వం మంట గలిసింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు, ఆడపిల్ల కావడం ఆ చిన్నారి పాలిట శాపమైంది. తల్లితండ్రులు లేకపోవడంతో చిన్నమ్మ పంచన చేరిన ఆ చిన్నారి చివరికి ఆమె చేతుల్లోనే హతమైంది. మరో ఘటనలో మారు తండ్రి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.. ఆర్థిక భారంతో.. దమ్మాయిగూడకు చెందిన లక్ష్మి ప్రసన్న భర్త లేకపోవడంతో కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి ఉండేది. నాలుగు నెలల క్రితం లక్ష్మి ప్రసన్న మృతి చెందడంతో జ్ఞానేశ్వరి మౌలాలి గాయత్రినగర్‌లో ఉంటున్న అమ్మమ్మ పెంటమ్మ, చిన్నమ్మ క్రిష్ణకుమారి ఇంటికి చేరింది. పెంటమ్మ స్టేట్‌బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి కాగా. క్రిష్ణకుమారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్‌గా పనిచేసి ఇటీవల మానేసింది. ఆమెకు సరూర్‌నగర్ మార్గదర్శి కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి శివారెడ్డితో పరిచయం ఏర్పడటంతో తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. పెంటమ్మకు వచ్చే పెన్షన్‌తోనే క్రిష్ణకుమారి ఆమె కుమారుడు సురేష్ జీవనం సాగించేవారు. దీనితోడు జ్ఞానేశ్వరి కూడా వారి వద్దకే చేరుకోవడంతో భారంగా భావించిన క్రిష్ణకుమారి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శివారెడ్డికి ఈ విషయం చెప్పి అతడిని ఒప్పించింది. ఈ నెల 22న పెంటమ్మ తన పెన్షన్ డబ్బులు తెచ్చుకునేందుకు పాట్నీలోని బ్యాంక్‌కు వెళ్లింది. దీనిని అదనుగా తీసుకున్న క్రిష్ణకుమారి తన కుమారుడు సురేష్‌ను ఆడుకునేందుకు బయటకు పంపించింది. అనంతరం శివారెడ్డితో కలిసి జ్ఞానేశ్వరిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తలను గోడకేసి బాదారు. కిందపడిన చిన్నారిని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన పెంటమ్మకు జ్ఞానేశ్వరి ఫిట్స్ వచ్చి కిందపడిందని నమ్మించారు. ఆటో తీసుకొచ్చిన శివారెడ్డి, క్రిష్ణకుమారి, పెంటమ్మతో కలిసి జ్ఞానేశ్వరిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లుతున్నట్లు నటించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత జ్ఞానేశ్వరి శరీరం చల్లబడడంతో చనిపోయిందని పెంటమ్మను నమ్మించారు. అనంతరం ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేద్దామని సూచించాడు. మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకువచ్చిన వారు మరోసారి బ్యాంక్‌కు వెళ్లిన అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు డ్రా చేసుకువచ్చారు. చీకటిపడిన అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుషాయిగూడలోని శ్మశానవాటికకు తీసుకెళ్లగా, అక్కడ ఉన్న సిబ్బంది అనుమానంతో 100 ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైనట్లుగా వైద్యులు నిర్దారించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. సోమవారం నిందితులు క్రిష్ణకుమారి, శివారెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికపై మారుతండ్రి లైంగికదాడి గోల్కొండ: ఓ మారు తండ్రి కూతురు వరుసయ్యే బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్కొండకు చెందిన ఆయూబ్‌ఖాన్ కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆమెకు మొదటి భర్త నుంచి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఓ బాలిక(13)నార్సింగిలోని ఏఆర్ రహమాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ఫనేజ్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం అయుబ్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌లో ఉంటోంది. రెండ్రోజుల క్రితం ఆర్ఫనేజ్‌లో ఉంటున్న ఆయుబ్ఖాన్ మొదటి భార్య కుమార్తె ఇంటికి వచ్చింది. సోమవారం ఆయూబ్‌ఖాన్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లితో చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆయుబ్ఖాన్ను సవరించిన ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతారావు డిమాండ్ చేశాడు. బా«లికకు వైద్య పరీక్షలు చేయించి ఆమెకు రక్షణ కల్పించాలని కోరారు. -
అయ్యో పాపం
విజయనగరం ఫోర్ట్: ఆడపిల్లల సంఖ్య జిల్లాలో తగ్గిపోతోంది. ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించే రోజులు పోయి భారమనే రోజులు వచ్చాయి. ఆడపిల్లలను వద్దనుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల కాలంలో శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వేను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ సర్వేలో 1000 మంది బాలురకు 955 మంది బాలికలున్నట్టు తేలింది. ఆరేళ్ల లోపు బాలికల సంఖ్య తగ్గిపోతుండటం గమనార్హం. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఆడ, మగ వివక్ష సమాజంలో పెరుగుతోంది. ప్రస్తుతం పురుషుల కంటే స్త్రీలు ఏరంగంలో తీసిపోవడం లేదు. అన్ని రంగాల్లోనే రాణిస్తున్నారు. కానీ కొడుకు అయితే వారసుడవుతాడని.. కుమార్తె అయితే వివాహం చేసుకుని వెళ్లిపోతుందన్న భావనతో కొందరు తల్లిదండ్రులు వివక్ష చూపుతున్నారు. గర్భంలో పెరిగేది ఆడపిల్లో, మగ పిల్లాడో స్కానింగ్ ద్వారా తెలుసుకుని ఆడపిల్ల అయితే పురిటిలోనే హతమారుస్తున్నారు. ఫలితంగా జిల్లాలో బాలికల సంఖ్య తగ్గిపోతోంది. నమోదు కాని కేసులు జిల్లాలో 62 ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, 13 ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లను వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేసి లింగ నిర్థారణ వెల్లడిస్తున్నారా లేదా పరిశీలించాలి. కానీ తూతు మంత్రంగానే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్ల కాలంలో స్కానింగ్ సెంటర్లపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని బట్టే అధికారుల తనిఖీలు ఏరీతిన జరిగాయో అర్థమవుతుంది. తగ్గుతున్న బాలికల సంఖ్య జిల్లాలో ఆరేళ్ల లోపు బాలురు, బాలికల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని మండలాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట, సాలూరు తదితర మండలాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉంది. నాకు తెలియదు ఏ స్కానింగ్ సెంటర్ లోనైనా లింగ నిర్ధారణ జరుగుతున్నట్టు సమాచారం ఇస్తే డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి తనిఖీలు చేపడతాం. నేను విధుల్లో చేరి ఏడాది కావస్తుంది. పదేళ్లుగా స్కానింగ్ సెంటర్లపై కేసులు నమోదు చేయని విషయం నాకు తెలియదు. లింగ నిర్ధారణ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ జిల్లాలో బాలురు, బాలికల మధ్య వ్యత్యాసం బాలురు ప్రతి 1000 మందికి బాలికలు 955 మంది ఆరేళ్ల లోపు బాలురు ప్రతి 1000 మందికి బాలికలు 955 -
బండెడు చాకిరీలో బాల్యం
బాలకార్మికులుగా మగ్గుతున్న వారిలోనూ, పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న వారిలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తుండగా, వారిలో కనీసం 2.5 లక్షల మంది బడి ఈడు అమ్మాయిలే కావడం గమనార్హం. చాలా కుటుంబాల్లో అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తుండగా, అమ్మాయిలను మాత్రం సర్కారీ బడులకు పంపుతున్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. చదువుతో పాటు పని తప్పనిసరిగా మారుతుంది. కుటుంబ భారాన్ని మోసేందుకు ఇళ్లల్లో పనికి వెళ్తున్న మహిళలతో పాటు వారి కూతుళ్లు కూడా తప్పనిసరిగా పనిబాట పడుతున్నారు. అమ్మకు ఆసరా.. రామంతాపూర్‌నకు చెందిన మౌనిక ఓ స్వచ్ఛంద సంస్థ నడిపే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పేదరికం కారణంగా చదువు మానేసిన సోదరి, బేకరీలో పని చేసే అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే. అయినా స్కూల్కెళ్లి చదువుకుంటున్న మౌనికకు సైతం తల్లితో పాటు ఇళ్లల్లో పని తప్ప లేదు. ఇద్దరూ కలిసి ఐదారు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ‘చదువుకుంటుందని చెప్పి పనికి తీసుకెళ్లకుండా ఉంటే ఇల్లు గడుస్తుందా’ అని అంటోంది మౌనిక తల్లి యాకమ్మ.‘బాగా చదువుకోవాలని ఉంది. కానీ పనికెళ్లకుండా ఎలా సాధ్యం’ అంటోంది మౌనిక. పేదరికం కారణంగా అక్క చదువు ఆగిపోయినట్లు తన చదువు ఆగిపోకూడదని ఆ బాలిక కోరుకుంటోంది. చదువు సాగేదెట్లా.. పద్మకు ఒక్కగానొక్క కూతురు వేదిత. తొమ్మిది చదువుతోంది. పద్మ భర్త ఈశ్వర్ పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో భారమంతా పద్మపైనే పడింది. ఒకప్పుడు బాగానే బతికినా ఆకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇళ్లల్లో పని చేస్తోంది. కానీ తనతో పాటు కూతురి శ్రమ కూడా తప్పనిసరైంది. ‘నా కూతురును బాగా చదివించాలనుకుంటున్నాను. కానీ పేదరికం వల్ల ఎక్కడ ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందోననే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పాటు పనికి రావద్దని కోరుకుంటా. అయినా తప్పడం లేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పద్మ. -
కన్నవారి కళ్ల ఎదుటే ఘోరం
దేవరాపల్లి(మాడుగుల) : మహా శివరాత్రి పర్వదినాన ఓ నిరుపేద కుటుంబంలో ఎనిమిదేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కన్నకూతురు కళ్ల ఎదుటే లారీ చక్రాల కింద పడి మరణించడాన్ని చూసిన కన్నవారు పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో నల్లబిల్లి జంక్షన్లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు జాహ్నవి(8) అనే బాలిక మృతి చెందింది. జాహ్నవి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. భార్య వరలక్ష్మి, కుమార్తె జాహ్నవి, కుమారుడు తనూలతో కలిసి గోపాలపట్నంలోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మమ్మ ఇల్లు అయిన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి సొంత ఆటోలో చేరుకున్నారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గోపాలపట్నం తన ఆటోలోనే తిరుగు పయనమయ్యారు. శివరాత్రి కావడంతో ఈ రోజు ఉండి మరుసటి రోజు వెళ్లాలని అమ్మమ్మ చెప్పగా జాహ్నవి మాత్రం తన పాఠశాలకు సెలవు లేదని స్కూల్ వెళ్లాలని చెప్పడంతో సోమవారం ఉదయం గోపాలపట్నం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ ఇంటి ముందు ఉన్న ఆటో ఎక్కేందుకు ఆటో ముందు నుంచి జాహ్నవి ప్రయత్నించగా అదే సమయంలో విజయనగరం జిల్లా వావిలపాడు సమీపంలోని ఓ స్టోన్ క్రషర్ నుండి ఆనందపురం వైపు వస్తున్న భారీ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలిక లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటనలో తమ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు వరలక్ష్మి, సూర్యనారాయణలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డుపై జరిగిన ఈ ప్రమాద ఘటనను చూసిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కంటతడి పెట్టుకున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వేపాడ పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. -
బాలికకు గర్భం.. యజమాని కొడుకు పనే..?
మచిలీపట్నం టౌన్ : కృష్ణా జిల్లా గిలకలదిండికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. గిలకలదిండిలోని మునిసిపల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక కడుపు నొప్పిగా ఉందని తల్లికి చెప్పటంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయగా గర్భం ధరించినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి అదే ప్రాంతానికి చెందిన సుభద్రమ్మ అనే మహిళ ఇంట్లో రెండేళ్లుగా పనికి వెళుతోంది. ఆమె వెంట బాలిక కూడా తరచూ పనికి వెళ్లేది. అయితే, సుభ్రదమ్మ కుమారుడు స్వామి లైంగిక దాడికి పాల్పడిన కారణంగానే గర్భం దాల్చిందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం.. కాగా, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవటంతో ఆయన ఉద్యోగం కొడుకు స్వామికి వచ్చింది. స్వామికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం కైకలూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి తరచూ గిలకలదిండి వచ్చేవాడని, ఈ సందర్భంలో తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు చేసింది. బాలిక గర్భం ధరించటంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మచిలీపట్నం సీఐ వాసవి, ఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బంది ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. బాలిక, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేశారు. -
ఆరేళ్ల చిన్నారికి సవతి తండ్రి వేధింపులు
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: ఆరేళ్ల పాపను సవతి తండ్రి వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుజాత అనే మహిళ భర్త మృతి చెందడంతో తన ఆరేళ్ల కుమార్తెతో జీవనం సాగిస్తోంది. రాజవొమ్మంగికి చెందిన ఖలీఫ్ బర్కత్ అలీతో కొంత కాలంగా రాజమహేంద్రవరం ఇన్నీసు పేటలో సహజీవనం సాగిస్తోంది. వీరిద్దరి సహజీవనానికి ఆరేళ్ల చిన్నారి అడ్డుగా ఉండడంతో బర్కత్ అలీ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం బర్కత్ అలీ బాలికపై ఆగ్రహంతో అట్లకాడ కాల్చి ఒంటిపై పలుచోట్ల వాతలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు ఛైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలల సంక్షేమ కమిటీ రాష్ట్ర సభ్యుడు వి.గాంధీ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ,, అడిషనల్ డీఅండ్ఎంహెచ్ఓ డాక్టర్ కోమలి బాలికను పరిశీలించారు. పాప శరీరంపై కాలిన గాయాలు, మచ్చలు ఉన్నాయి. సంఘటనపై నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. బర్కత్ అలీపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. టూ టౌన్ సీఐ పవన్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందమైన లోకం.. పుట్టుకే శోకం
మాతా శిశు సంరక్షణ అంటూ ప్రభుత్వాలు గొప్పగా ప్రచారం చేస్తుంటే అమ్మ కడుపులో ఉన్న శిశువులు ఎంతో సంతోషించారు. తమ ఆరోగ్యం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అంటూ ఆశ్చర్యపోయారు. అందమైన లోకాన్ని చూసేందుకు తొమ్మిది నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని వేయి కళ్లతో నిరీక్షించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరు లోకాన్ని చూడకనే అమ్మ గర్భంలోనే కన్నుమూయగా.. మరో చోట పుట్టిన శిశువు అనారోగ్యంతో ఆసుపత్రికి చేరినా బతకలేక పోయింది. బిల్లు కడితేనే మృత శిశువును అందిస్తాన్న ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని చూసి ఇదేం లోకం.. పుట్టుకే శోకం అంటూ ఆ శిశువు ఆత్మ ఘోషించింది. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు అటు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఇటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని తేటతెల్లం చేశాయి. కర్నూలు, బొమ్మలసత్రం: వైద్యం.. వ్యాపారంగా మారిన నేపథ్యంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. ఆదివారం నంద్యాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్ తన భార్య హుసేన్‌బీని ప్రసవం నిమిత్తం గత నెల 28న పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో ఉమ్ము నీరు తాగిన శిశువు అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్న లిటిల్ స్టార్ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగా లేదని ఇక్కడే వారం రోజులు చికిత్స అందించాలని చెప్పారు. ఈనెల 6వ తేదీ వరకు చికిత్స అందించి దాదాపు రూ.1.55 లక్షలు బిల్లు కావడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకొచ్చి వైద్యునికి చెల్లించారు. అదే రోజు శిశువును ఐసీయూ గది నుంచి సాధారణ వార్డుకు మార్చారు. అయితే ఆయాసంతో బాధపడుతుండటంతో మళ్లీ పరీక్షలు చేశారు. కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకిందని, రక్తంలో ప్లేట్లేట్స్ తక్కువగా ఉన్నాయని, వీటన్నింటికీ చికిత్స అందించాలంటే భారీగా ఖర్చువుతుందని చెప్పారు. తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోవటంతో తిరిగి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలోనే మందులు, అడ్వాన్స్ అంటూ డబ్బులు భారీగా వసూలు చేశారు. అయితే శనివారం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని, ఎలాగైనా బతికించాలని శిశువు తల్లిదండ్రులు వేడుకున్నా రు. 20 రోజులకే రూ. 3 లక్షల బిల్లు కాగా రూ. 2.70 లక్షలు చెల్లించారు. అయితే శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే మిగతా రూ.30 వేలు కట్టి మృత శిశువును తీసుకెళ్లాలని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి తమ బిడ్డ చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరినా ఒప్పుకోలేదు. అప్పటికే లక్షలు ఖర్చు చేసినా వారికి పాప దక్కక పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించినా ఆసుపత్రి యాజమాన్యం చలించలేదు. సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, పీడీఎస్టీ, ఆర్‌వైయూ తదితర ప్రజా సంఘాలు నాయకులు రాజు నాయుడు, ధనుంజేయుడు, రఫి తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేçశం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు తెలుసుకొని సంబంధిత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం చిన్నారి మృత దేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో ఆందోళన విరమించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాపను ఎలాగైనా బతికించుకోవాలనే తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసుపత్రి యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసేందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదోని టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకు కడుపుకోత మిగిలింది. ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామానికి చెందిన మహబూబ్ బాషా, ఎస్.మోయిద్దీన్బీ దంపతులకు ముగ్గురు కుమారులు. కుమార్తె కోసం నాలుగో కాన్పునకు మోయిద్దీన్బీని శనివారం సాయంత్రం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవీలతకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి గర్భిణినిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని తేల్చి చెప్పారు. మృత శిశువును బయటకు తీసేందుకు మోహిద్దీన్బీని వార్డులో అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయం కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు నొప్పితో ఆమె తీవ్రంగా బాధపడుతున్నా అటు వైపు సిబ్బంది కూడా రాలేదు. నొప్పిని భరించలేక వార్డు నుంచి ఆసుపత్రి గేట్ వద్దకు రాగానే కింద పడిపోయింది. ఆ సమయంలోనే కడుపులో ఉన్న మృత ఆడ శిశువు బయటపడింది. కాన్పు తర్వాత అస్వస్థతకు గురైన ఆమెకు చికిత్స అందించారు. సకాలంలో వైద్యం చేసి ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదని బాధితురాలు రోదించింది. కుమార్తె కావాలన్న ఆమె కల కరిగిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. -
కుమార్తె చెప్పిన విషయం విని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: కామంతో అతడి కళ్లు మూసుకుపోయాయి. కన్నకూతురనే విచక్షణను కోల్పోయాడు. పదే పదే తన పశువాంఛను తీర్చుకోగా బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘోరం వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లా ఆలందూర్కు చెందిన వ్యక్తి (35). ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.13 ఏళ్ల పెద్ద కుమార్తె అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా బాలిక తల్లి అక్కడికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు స్కాన్ తీసి గర్భిణిగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. కుమార్తెను నిలదీయగా కన్నతండ్రే కొంతకాలంగా ఈ ఆఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు కుమార్తె చెప్పడంతో ఆమె హతాశురాలైంది. ఆమె ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిని పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. -
పిల్లర్ల మధ్య చిక్కుకున్న చిన్నారి
చెన్నై ,తిరుత్తణి: రెండు స్తంభాల మధ్యలో తల చిక్కుకున్న చిన్నారిని ప్రయాణికులు రక్షించారు. ఈ సంఘటన తిరుత్తణిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రం గ్రామానికి చెందిన వేలు కార్మికుడు. అతని భార్య మాలతి, ఐదేళ్ల పాప కృత్తిక సహా గురువారం సాయంత్రం తిరుత్తణి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. చెన్నైకు రైల్లో వెళ్లేందుకు రెండవ ప్లాట్‌ఫాంలో వేచి ఉన్నారు. అక్కడ చిన్నారి ఆడుకుంటోంది. హఠాత్తుగా చిన్నారి తల ఇనుప పిల్లర్ల మధ్యలో చిక్కుకుంది. దీంతో చిన్నారి కేకలు వేసింది. ప్రయాణికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గడ్డపారతో రెండు స్తంభాలను చీల్చి చిన్నారిని క్షేమంగా వెలుపలికి తీశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపరి పీల్చుకున్నారు. -
అప్పుడే పుట్టిన పసిబిడ్డను కాలువలో..
అమ్మా..నేనంటే నీకెంతో ఇష్టమని తెలుసు..నన్ను తొమ్మిది నెలలు అపురూపంగా చూసుకున్నావు..నా ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడావు..నేను కసిగా కడుపులో తంతున్నా సంతోషించావు..అమ్మా..నీకే కష్టమొచ్చిందో తెలియదు..నా ఒంటిపై నీ రక్తపు మరకలు ఆరకముందేబంధాన్ని తెంపేసుకున్నావు..పుట్టిన వెంటనే నీ వెచ్చని పొత్తిళ్లలో సేదదీరాల్సిననేను మురుగు కాల్వ పాలయ్యాను..అమ్మా..నీ ప్రేమే నన్ను కాపాడింది..నేను క్షేమంగా ఉన్నాను..కర్నూలు పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్నాను..అమ్మా..నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది!!..ఆదోని పట్టణం కంచిగారి వీధిలో గురువారంమురుగు కాలువలో దొరికిన పసిపాప మూగ వేదన ఇదీ.. కర్నూలు, ఆదోని: ఆడ బిడ్డనో..మరేదో కారణమో..అప్పుడే పుట్టిన పసిబిడ్డను మురుగు కాలువలో పడేశారు. కాలువలో నీరు లేక పోవడంతో చెత్తలో గుక్క పట్టి ఏడుస్తున్న పసిగుడ్డును గుర్తించిన మున్సిపల్ వర్కర్లు కొందరు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. దీంతో ఆ శిశువు ప్రాణాలతో బయట పడింది. గురువారం ఆదోని పట్టణం నడిబొడ్డున కంచిగారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5.30 గంటల సమయంలో మున్సిపల్ వర్కర్లు లక్ష్మిదేవి, ఈరమ్మ, తిరుమల, రంజనీకాంత్, మారెప్ప, ఈరప్ప మరికొందరు మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు కంచిగారి వీధిగుండా వెళ్లుతున్నారు. ఎక్కడి నుంచో చిన్నగా పసిగుడ్డు ఏడ్పు విని పించడంతో మురుగు కాలువలో తొంగి చూశారు. చెత్తపై పరిచిన ఓ ప్లాస్టిక్ సంచిపై రక్తం తడారని ఓ పసిగుడ్డు కనిపించింది. బలహీనంగా ఉండడంతో ఏడ్పు చిన్నిగా వస్తోంది. ఇంకా బొడ్డు కూడ కోయలేదు. లక్ష్మీదేవి వెంటనే ఆ పసిగుడ్డును ఎత్తుకుంది. మిగిలిన వారితో చర్చించి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంకటస్వామి, ఉషాశ్రీ పసిగుడ్డును ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. బిడ్డ బలహీనంగాను, తక్కువ బరువు ఉందని, కోలుకోడానికి కొంత సమయం పుడతోందని వైద్యురాలు ఉషశ్రీ అన్నారు. స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్ అధికారులు సమాచారాన్ని త్రీ టౌన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సఫరున్నీషాబేగంకు అందించారు. ఇరువురు ఆసుపత్రికి వచ్చి శిశువును పరిశీలించి.. ఆరగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఐసీడీఎస్ అధికారిణి సఫరున్నిసా బేగం..శిశువును స్వాధీనం చేసుకొని కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు సూపర్వైజర్ అంజినమ్మ, అంగన్ వాడీ టీచర్లు ఉన్నారు. పసిగుడ్డును మురుగు కాలువపాలు చేసిందెవరో విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజాకుళ్లాయప్ప తెలిపారు. -
అయ్యో పాపం.. రెండేళ్ల బాలికపై లైంగిక దాడి
69 ఏళ్ల గణతంత్ర భారతం... అయినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు. అమ్మతనాన్ని పంచే ‘ఆమె’కు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రక్షణ కరువైంది. గణతంత్ర దినోత్సవం సాక్షిగా మరో చిన్నారి కామాంధుడి కబంధహస్తాల్లో చిక్కింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి... ఇప్పుడు అచేతనంగా పడి ఉంది. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతోంది. అసలేం జరిగిందో కూడా తెలియని ఆ పసిప్రాణం బాధను భరించలేక రోదిస్తుంటే.. తల్లిదండ్రుల గుండె చెరువైంది. మద్యం మత్తులో ఓ కామాంధుడు రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఈ హృదయవిదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. దుండిగల్: రెండేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, చిన్నారి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోయినుద్దీన్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానం. వారి ఇంటి సమీపంలోనే ఓ పెయింటర్ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం మొయినుద్దీన్ స్నేహితుడు షరీఫ్ కుమారుడి పుట్టిన రోజు కావడంతో మరో స్నేహితుడు యాకూబ్‌తో కలిసి స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుక విందు చేసుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెబుతున్న పోలీసులు అనంతరం వారు అదే రోజు రాత్రి మోయినూద్దీన్ను ఆటోలో అతని ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. అదే సమయంలో వీరి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పెయింటర్ కుమార్తె (02)ను ఎత్తుకుని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన మొయినుద్ధీన్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు చిన్నారిని ఇంటి వద్ద వదిలివెళ్లిపోయాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు లైంగికదాడి జరిగినట్లుగా అనుమానించి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా మోయినుద్దీన్ చిన్నారిని ఎత్తుకెళ్లి, తీసుకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. అతడి కోసం గాలింపు చేపట్టిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో కైసర్‌నగర్‌లోని డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఆందోళన.. చిన్నారి బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో దుండిగల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. బాలానగర్ ఏసీపీ గోవర్ధన్, దుండిగల్ సీఐ శంకరయ్య, ఎస్సై రాందాస్ అక్కడికి వచ్చి ఆందోళన కారులతో మాట్లాడారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి నిందితుడు మోయినుద్దీన్ కు ఉరి శిక్ష విధించాలని, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 24 రోజుల వ్యవధిలో 28 మంది మైనర్లపై లైంగిక దాడులు జరిగాయన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రేమ పేరుతో వంచన
బంజారాహిల్స్: ఓ బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడటమే గాక ఆమె గర్భం దాల్చడానికి కారకుడైన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..బోరబండ శ్రీరాంనగర్ బస్తీకి చెందిన బ్యాగరోళ్ల ప్రశాంత్ స్థాని విజేత టాకీస్‌లో హౌస్ కీపింగ్ పనిచేసేవాడు. 2017, ఏప్రిల్ 28న అతను సినిమా చూసేందుకు వచ్చిన బ్రహ్మశంకరనగర్ బస్తీకి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై అప్పుడు కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 22న సదరు బాలిక గర్భం దాల్చినట్లు గుర్తించిన ఆమె తల్లి నిలదీయడంతో బాధితురలు అసలు విషయం చెప్పింది. ప్రశాంత్ తనను తరచూ బైక్‌పై పార్కులు, సినిమాలు, ఆలయాలకు బైక్‌పై తీసుకెళ్లేవాడని, గతేడాది జూలైలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. పలుమార్లు శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో బాధితురాలితో కలిసి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చిన్న వయసులో పెద్ద కష్టం!
శ్రీకాకుళం, మందస: పేదరికమే శాపమైన ఆ కుటుంబంలో జన్మించిన చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమార్తెకు క్యాన్సర్ ఉందని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. మందస మండలంలోని లొహరిబంద గ్రామానికి చెందిన రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతుల కుమార్తె నవ్య(7) రెండో తరగతి చదువుతోంది. నవ్య మెడపై ఇటీవల చిన్నగా వాపు రావడంతో గగ్గలుగా భావించారు. రెండు నెలలైనా తగ్గకపోవడంతో ఒడిశాలోని బరంపురం, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లగా క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. నవ్య తండ్రి రాజు పొట్టకూటికోసం గుజరాత్‌లోని అహ్మదాబాదులో కూలీగా పని చేస్తున్నారు. తల్లి, అమ్మమ్మలు చిన్నారికి కేన్సర్ సోకినట్టు గుర్తించలేకపోవడం, అప్పటికే స్టేజ్–2కు చేరడంతో వైద్యానికి రూ.1.5 లక్షలు ఖర్చయ్యింది. మరో రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. నవ్య పేరు సాధికార సర్వేలో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించడంలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓ వైపు పేదరికం.. మరో వైపు చికిత్స చేయించలేని ధైన్యం.. దీంతో ఆ తల్లిదండ్రులు ఆదుకునే ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. -
బాలికా.. నువ్వే ఏలిక
గచ్చిబౌలి: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. కార్యకమాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల వికాసానికి తోడ్పాటు అందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కితాబిచ్చారు. ‘బేటీ బచావో..బేటీ పడావో’ నినాదంతో ప్రదాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్ వికాస్ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. తాను పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళతానని, పర్యావరణ పరిరక్షణకు అందరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం రన్లో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్, జయేష్ రంజన్లు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్సాహంగా రన్.. 10కే రన్‌ను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పి.అప్పారావు ప్రారంభించారు. 21కే రన్‌ను ఏఓసీ సెంటర్ కమాండెంట్, బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్, ప్రముఖ జిమ్నాస్ట్ మేఘనారెడ్డి ప్రారంభించారు. రన్లో 400 మంది సైనికులతో పాటు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 8 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఆడ పిల్ల వద్దమ్మా..
బల్మూర్ (అచ్చంపేట): మగ సంతానం కోసం ఆ తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కన్నారు.. అయితే ఐదో కాన్పులోనూ ఆడ శిశువే జన్మించడంతో వదిలించుకోవాలనుకున్నారు. ఈ మేరకు కన్న పేగు బంధాన్ని కూడా కాదనుకుని అంగన్వాడీ టీచర్‌కు సమాచారమిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆ దంపతులు వినకపోవడంతో చివరకు శిశువును శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన రామావత్ దస్లీ–నిరంజన్ దంపతులకు ఇది వరకే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో ఓ కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చిన దస్లీ శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్లీ ఆడ శిశువుకే జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆడ పిల్లలకు తోడు ఈ శిశువు భారం మోయలేమని గ్రామ అంగన్వాడీ టీచర్ అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినా వారు వినలేదు. దీంతో శిశువును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహం అధికారులకు అప్పగించారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిన్నారి
శ్రీకాకుళం, రణస్థలం: కోష్ఠ గ్రామంలోని ఓ చిన్నారి తన ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో నీళ్లతో ఉన్న సిల్వర్ పాత్రలో కూర్చొని ఇరుక్కుపోయింది. బయటకు రాలేక ఆర్తనాదాలు చేయడంతో తల్లిదండ్రులు ఎచ్చెర్ల త్రినాథ్, అనసూయ గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిన్నారి వరలక్ష్మి(4)ని చూసిన స్థానికులు కూడా ఆందోళన చెందారు. అయితే చిన్నారి తండ్రి వడ్రంగి పని చేయడంతో అతని దగ్గర ఉన్న పనిముట్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, తపేలాను జాగ్రత్తగా కత్తిరించారు. చిన్నారి వరలక్ష్మికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చలికి వేడి నీళ్లు కాచి ఇంటి వద్ద పెట్టారు. అయితే ఈ నీరు చల్లారిన తర్వాత చిన్నారి కుర్చోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం 10 గంటల సమయంలో జరిగినా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. -
ఆడపిల్ల పుడితే రూ.5 లక్షలు బహుమానం
కర్ణాటక, బనశంకరి : 2019 న్యూ ఇయర్ తొలిరోజున జన్మించిన 24 మంది ఆడపిల్లలకు బీబీఎంపీ నుంచి రూ.5 లక్షలు బంపర్ బహుమానం అందించనుందని మేయర్ గంగాంబిక తెలిపారు. బుధవారం బీబీఎంపీ సమావేశం వాయిదా పడిన అనంతరం గంగాంబికా విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది నుంచి బీబీఎంపీ పింక్ బేబీ పేరుతో న్యూ ఇయర్ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే పథకం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది కూడా పింక్ బేబి పథకాన్ని కొనసాగిస్తామని మేయర్ తెలిపారు. బీబీఎంపీ పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిల్లో ఏడాది మొదటిరోజు పుట్టిన 24 మంది ఆడపిల్లలకు తలా రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహక ధనం డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఈసారి పింక్‌బేబి ప«థకాన్ని కొనసాగించడంతో పాటు రూ.5 లక్షల నగదు ఆడపిల్ల విద్యాభ్యాసానికి ఎంతో అనుకూలం అవుతుందన్నారు. జనవరి 1 తేదీన జన్మించిన మొదటి మగబిడ్డకు ఈ పథకం వర్తించదని తెలిపారు. ఒక వేళ జనవరి 1 తేదీన ఆడపిల్లలు జన్మించకుండా 2 తేదీ పుట్టినా అలాంటి ఆడపిల్లలకు రూ.5 లక్షల ప్రోత్సాహక ధనం అందిస్తామని మేయర్ తెలిపారు. -
చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై కేసు
కృష్ణాజిల్లా, యనమలకుదురు (పెనమలూరు) : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తింటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్–2 కు చెందిన భిక్షాలు (60) చెప్పుల వ్యాపారం చేస్తాడు. అతను ఆదివారం రాత్రి ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని (3) ఇంట్లోకి పిలిచాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో ఏడవటంతో చిన్నారి తల్లితండ్రులు రావటంతో భిక్షాలు పారిపోయాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
వికటించిన మందులు
విశాఖపట్నం , అగనంపూడి (గాజువాక): ఒక సిరప్ బదులు మరో సిరప్ ఫార్మాసిస్ట్ ఇవ్వడంతో ఆ మందు వికటించి చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది. ఈ సంఘటన అగనంపూడిలో చోటు చేసుకుంది. అగనంపూడి నిర్వాసితకాలనీ కొత్తూరుకు చెందిన సీతిన గణేష్, రూపల మూడేళ్ల పాప హేమచంద్రికకు జ్వరం, జలుబు చేయడంతో అగనంపూడి ఆస్పత్రికి బుధవారం మధ్యాహ్నం తీసుకువెళ్లారు. ఆస్పత్రిలోని పిల్లల వైద్యనిపుణుడు జ్వరానికి, జలుబుకు సిరప్లు మందుల చీటిపై రాశాడు. అయితే పొరపాటున ఫార్మాసిస్ట్ వేరే సిరప్లు ఇవ్వడం, వాటిని పాపకు పట్టడంతో ఒళ్లంతా రంగుమారిపోయి, దద్దుర్లు వచ్చాయి. అంతలోనే స్పృహ తప్పిపోవడంతో వెంటనే అగనంపూడి ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మందులు మారిపోయినట్టు గుర్తించిన సిబ్బంది కేజీహెచ్‌కు పంపించారు. పాప పరిస్థితి విషమంగా మారుతుండడంతో పాప తల్లిదండ్రులు గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదే విషయంపై బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా, పోలీస్ ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చదువుకుంటా సార్.. పని మనిషిగా వెళ్లను !
ప్రకాశం, చీరాల: ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ బాలిక జీవితంపై విధి అక్కసు కక్కింది. 9 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. హాస్టల్లో అయినా చదువుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకుని చీరాల్లోని హాస్టల్‌కు చేరుకుంటే అక్కడా విధి ఆడుకుంది. అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంది. చివరకు ఓ కుటుంబం చేరదీసింది. అదీ స్వార్థంతోనే. అయితే ఆ కుటుంబం బాలికను పని మనిషిగా మార్చింది. చివరకు 5 ఏళ్ల తర్వాత చదువుపై ఆశతో చీరాల మున్సిపల్ స్కూల్లో చేరి చదువుతున్నప్పటికీ దగ్గరకు తీసిన వ్యక్తి మళ్లీ అడ్డు తగిలాడు. హైదారాబాద్‌లోని తన కూతురి ఇంట్లో పనిమనిషిగా ఆ బాలికను మార్చాలని ప్రయత్నం చేశాడు. చివరకు స్థానికుల సహకారంతో చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది బుధవారం ఆ బాలికను ఒంగోలు హోంకు తరలించారు. స్వగ్రామంలో.. ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామానికి చెందిన బాలికకు 9 సంవత్సరాల వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోయారు. బాలిక బంధువులు 9 ఏళ్ల బాలికను పెంచలేక చీరాల్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేర్పించారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆశ్రమం కూడా మూతపడింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికను ఆశ్రమం పక్కనే నివాసం ఉంటున్న మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సూపర్వైజర్ మేడిద కృపావరం చేరదీసింది. అయితే బాలిక చదువుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే హైదబాద్‌లోని తన సొంత కుమార్తె ఇంట్లో పనిమనిషిగా చేర్చింది. 5 ఏళ్ల పాటు వెట్టిచాకిరి, ఎన్నో కష్టాలను అనుభవించిన ఆ బాలిక తాను చదువుకుంటానని, ఇంట్లో పనిమనిషిగా చేయలేనని వేడుకుంది. దీంతో బాలికు 14 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి చీరాలకు తీసుకువచ్చి మున్సిపల్ పాఠశాల్లో చేర్పించారు. సూపర్వైజర్ కృపావరం కూడా కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. దీంతో కృపావరం భర్త మేడిద ప్రభాకరరావు చదువుతున్న బాలికను చదవు మాన్పించేసి హైదబాద్‌లోని తన రెండో కుమార్తె ఇంట్లో పనిమనిషిగా వెళ్లాలని వేధించి ఒత్తిడికి గురిచేశాడు. పలు మార్లు బాలిక తాను చదువుకోవాలి.. నన్ను చదివించండంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడినా అతను మాత్రం ఆలకించలేదు. దీంతో బాలిక స్థానికుల సహకారంతో ఒంగోలు చైల్డ్‌లైన్ 1098కు సమాచారం అందించగా ప్రతినిధి బీవీ సాగర్ చీరాలకు వచ్చి చీరాల ఒన్‌టౌన్ సీఐ సూర్యనారాయణ, పోలీసుల సహకారంతో బాలికను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మతిన్, నాగిరెడ్డి, వేణుబాబు సమక్షంలో ఒంగోలు హోంకు అప్పగించారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
కృష్ణాజిల్లా, వేజండ్ల(చేబ్రోలు): కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికి స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన తాపీ కార్మికుడు తమ్మినేని పెద్దారెడ్డి కొద్ది రోజులు క్రితం అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించి జీజీహెచ్‌కు తరలించారు.గ్రామంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు తెలియటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ జి. సిద్దార్థ మంగళవారం తెలిపారు. బుధవారం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో.. గుంటూరు మెడికల్: స్వైన్ ఫ్లూ లక్షణాలతో గుంటూరు నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇద్దరు పిల్లలకు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు మంగళవారం వైద్య అధికారులు నిర్ధారించారు. నంబూరు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక, తెనాలికి చెందిన ఎనిమిదినెలల మగశిశువు స్వైన్‌ఫ్లూతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆడపిల్లలు పుట్టారని వేధింపులు..
కర్నూలు, వెల్దుర్తి: ఆడపిల్లలు పుట్టారని, పనిచేయడం చేతకాదని భర్త, అత్తమామ నిత్యం వేధిస్తుండడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం యాదరాళ్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వెల్దుర్తి ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల సమీపంలోని బిల్లలాపురానికి చెందిన లీలావతి(25)కి యాదరాళ్లకు చెం దిన బాలసుబ్రహ్మణ్యంతో 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు(కుమార్తెలు) ఉన్నారు. లీలావతి అమ్మా, నా న్నలు జయమ్మ, చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద దిక్కులేని ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన భర్త వేధింపుల పర్వం కొనసాగించాడు. అత్తమామలు కూడా అదే బాట పట్టారు. సూటిపోటి మాటలను తాళలేని లీలావతి.. శుక్రవారం ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి గడియవేసుకుని పురుగులమందు తాగింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తలుపు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె మృతిచెందింది. లీలావతి పెదనాన్న గుర్రం చెన్నయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని డోన్‌కు ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
అయ్యో పాపం
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: ఆడపిల్ల అనే వివక్షో.. లేక అనారోగ్యం కారణమో తెలియదు కానీ.. మూడు రోజుల పసికందును చెత్తకుప్పలో పడేశారు. చలికి గజగజ వణుకుతూ ఏడుస్తున్న ఆ పసికందును చెత్త ఏరుకునే వ్యక్తి గుర్తించగా స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఘటన గురువారం ఉదయం పాలకొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి కాగితాలు ఏరుకోవడానికి తన రిక్షాలో బయలుదేరాడు. పట్టణంలోని ఉండి అప్పారావు ఆసుపత్రి వద్ద కాగితాలు ఏరుకుంటుండగా పాప ఏడుపు వినిపించింది. అక్కడ ఉన్న చెత్త కుండీ వద్దకు వెళ్లి చూడగా పాప ఉండడం గమనించాడు. చలికి గజగజ వణుకుతున్న ఆ పాపను తన రిక్షాలో పెట్టుకుని స్థానిక యడ్లబజారు సెంటర్‌కు తీసుకువచ్చాడు. ఎవరికైనా తెలిస్తే తనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో పాపను అలానే తన రిక్షాలో పెట్టుకుని ఉండగా రిక్షా కార్మికుని యజమాని ఇదేమిటని ప్రశ్నించాడు. ఆ యజమానికి రిక్షా కార్మికుడు వివరాలు తెలిపాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో విషయం తెలుసుకున్న స్థానికులు పాపను చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. వారిలో నక్కాదాసు, కె.రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు పాపను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి అప్పగించారు. వైద్యులు వెంటనే పాపకు చికిత్స చేసి స్నానం చేయించి పాలు పట్టించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ బి.కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది పాపను కాకినాడకు తరలించారు. పోలీసులు పాప ఘటనపై విచారిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం.. పాప జన్మించి సుమారు మూడు రోజులు కావస్తుంది. పాపకు చెవి లేదు, ఒక కన్ను పూర్తిగా తెరవడంలేదు. ఇంకా అవయవలోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ లోపాలకి జన్యులోపాలే కారణం. పాపకు ఇక్కడ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించాం.– సంతోష్‌కుమార్, ఎండీ, (చిన్నపిల్లల వైద్యుడు), పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి -
అపూర్వి విజయం చిన్నారి సొంతం
కుత్బుల్లాపూర్: చిన్న వయసులోనే కరాటేలో పట్టు సాధించింది. మూడేళ్లు శిక్షణలో ఆ క్రీడలో రాటుదేలిందా చిన్నారి. పేరు పూర్వీశర్మ.. ఫతేనగర్‌కు చెందిన సంజయ్‌శర్మ, అమితాశర్మల చిన్న కుమార్తె. సెయింట్ పీటర్ (బోయిన్పల్లి) గ్రామర్ స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. పూర్వీ.. తెలంగాణ ప్రాంతం నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించి గ్రీస్‌లోని ఏథెన్స్ నగరంలో గతనెల 25 నుంచి జరిగిన కరాటే ‘షుటికై’ టోర్నమెంట్లో తనదైన శైలిలో రాణించి సిల్వర్ మెడ ల్ సాధించింది. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో మహ్మద్ మన్సూర్ పాషా శిక్షణతో కెరీర్ ప్రారంభించింది. గ్రీస్‌లో జరిగిన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది చిన్నారులను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో పూర్వీశర్మ అతి చిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆది నుంచి ప్రతిభావనిగా.. పూర్వీశర్మ 2015లో శిక్షణ ప్రారంభించి అదే ఎడాది మండల, జిల్లా స్థాయి పోటీల్లో తొలి విజయం సాధించింది. 2016లో ఇంటర్ స్టేట్, స్కూల్ లెవల్ పోటీల్లోనూ విజయం సొంతం చేసుకుంది. 2017లో మహాబలేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నా అండర్–10 కేటగిరీలో తన ప్రతిభను చాటి ఔరా అనిపించింది. ఈ ఏడాది గ్రీస్ అంతర్జాతీయ పోటీల కోసం జరిగిన ఎంపికలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో అత్యంత కఠినమైన వడపోతలో మేటిగా నిలిచింది పూర్వీశర్మ. ఎంపిక కమిటీ అంచనాలను నిజం చేస్తూ తాజాగా గ్రీస్‌లో సిల్వర్ పతకం సాధించి ‘హైదరాబాద్ కరాటే కిడ్’గా నిలిచింది. చివరి నిమిషంలో చేతులెత్తేసిన స్పాన్సర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వస్తున్న పూర్వీశర్మకు తొలుత ఓ స్పాన్సర్ ముందుకు వచ్చి హడావిడి చేశాడు. ఇది నమ్మిన ఆమె తల్లిదండ్రులు సంజయ్ శర్మ, అమితా శర్మలు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇంకో వారం రోజులలో గ్రీస్‌కు వెళ్లేక్రమంలో అంతవరకు స్పాన్సర్‌గా ఉంటానన్న వ్యక్తి చెతులెత్తేశాడు. దీంతో గత్యంతరం లేక బ్యాంక్‌లో రూ.5 లక్షలు లోన్ తీసుని చిన్నారిని పోటీలకు పంపించారు. ఇప్పుడు కుమార్తె సిల్వర్ మెడల్ సంపాదించడంతో తమ కష్టానికి ఫలితం దక్కిందని ఆమె తల్లిదండ్రులు ‘సాక్షి’తో చెప్పారు. ప్రతిభ గల చిన్నారులకు ప్రభుత్వం చేయుతనందించాలని కోరుతున్నారు. -
ఆడబిడ్డ భారమయ్యిందేమో..!
సింహాచలం(పెందుర్తి)/ గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): అనాగరిక సమాజంలో ఆడపిల్లంటే బరువు అనుకుందో... లేక జీవితాంతం ఎలా పెంచుతానని ఆందోళన చెందిందో... అత్తింటి వారి సూటిపోటి మాట లకు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయి సింహ గిరి అప్పన్న సాక్షిగా నిశ్శబ్దంగా బరువు వదిలించుకుందామనుకుందో తెలియదుకానీ... ఏడాది వయసున్న చిన్నారిని సింహాచలం కొండ దిగువన ఆర్టీసీ బస్టాండ్ పక్కన దేవస్థానం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయింది. అమ్మా... అని పిలుద్దామనుకుంటే నోట మాట రాకపోవడం... మరోవైపు చలితో ఆ చిన్నారి వణికిపోతుండడం చూపరులను కలిచివేసింది. వెంటనే స్థానికులు డయిల్ 100 నంబర్‌కు సమాచారం చేరవేశారు. దీతో గోపాలపట్నం సీఐ పైడియ్య హుటాహుటిన ఎస్ఐ తమ్మినాయుడు, బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఈశ్వరరావుని అప్రమత్తం చేశారు. వారు బస్టాండ్‌కి చేరుకుని ఆ చిన్నారిని గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆర్అండ్బీ వద్ద ఉమెన్ అంyŠ ఛైల్డ్ సంస్థ నిర్వహిస్తున్న శిశుగృహకు ఫోన్ చేశారు. ఆ సంస్థ మేనేజర్ మంజుకి ఆడబిడ్డను అందజేశారు. అయితే ఒక పురుషుడు ఆడ బిడ్డను తీసుకొచ్చి సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై కూర్చోబెట్టి వెళ్లిపోయాడని సాధువులు చెబుతున్నారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన అతను ఎంతసేపటికీ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారనే ప్రచారం జరుగుతోంది. అయితే సింహాచలం బస్టాండ్ సమీపంలో ఆడ బిడ్డను విడిచి వెళ్లిపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమారాల ఫుటేజీ పరిశీలిస్తే... బిడ్డను ఎవరు విడిచిపెట్టి వెళ్లారో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఫుటేజీలు పరిశీలించనున్నారు. -
బాలికను గర్భిణిని చేసిన సూపరింటెండెంట్..
సాక్షి ప్రతినిధి కడప : ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే బాలికల గృహంలో తలదాచుకునే వారికి రక్షణగా నిలవాల్సిన ఆ అధికారి రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భిణిని చేశాడు. ఎట్టకేలకు ఈ ఘటనలో నిందితుడైన బాలికల గృహం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు కాగా ఆ కేసును నీరు గార్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని కాపాడే క్రమంలో బాధితురాలైన బాలికను ఎవరూ ఎవరూ కలవొద్దంటూ కలెక్టర్ కనుసన్నల్లో ఆంక్షలు విధించారు. నిందితుడికి అధికార టీడీపీతో ఉన్న ప్రత్యక్ష సంబంధాలే అందుకు కారణంగా తెలుస్తోంది. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల గృహంలో కడపకు చెందిన ఓ మైనర్ బాలిక తలదాచుకుంటోంది. ఆ బాలికపై సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవహారం బహిర్గతం అవుతుందని భావించి తిరుపతి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నాడు. సీడబ్ల్యూసీ యంత్రాంగం కడప నగరంలోని ఓ వసతి గృహంలో ఆ బాలికను చేర్పించింది. అంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా అర్ధాంతరంగా బాలిక రక్తస్రావానికి గురైంది. ఊహించని పరిణామంతో హోం నిర్వాహకురాలు జిల్లా అత్యున్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆమేరకు రిమ్స్‌లో చికిత్స చేయించారు. కాగా ఈ విషయమై చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతికి బదిలీ చేశారు. సీఎంఓ డైరెక్షన్ మేరకే.. బాలికపై లైంగిక దాడి జరిగిన వ్యవహారా>న్ని జిల్లా యంత్రాంగం తొలుత సీరియస్‌గా తీసుకుంది. వైద్య పరీక్షలతోపాటు, బాలిక కథనాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. వెంటనే తిరుపతి హోంలో విధులు నిర్వర్తిస్తూ అందుకు బాధ్యుడైన బి.నందగోపాల్‌పై కేసు కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అమరావతిలోని సీఎంఓ వర్గాలు రంగప్రవేశం చేశాయి. ఈ వ్యవహారంలో మిన్నకుండిపోవాలని ఉండిపోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాంతో తిరుపతి హోం బాధ్యుడు నందగోపాల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం తిరుపతికి కేసును బదలాయించారు. పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పైగా బాధితురాలైన బాలికను ఎవ్వరూ కలవరాదంటూ ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయం వెనుక బా«ధితురాలికి మద్దతుగా ఎవ్వరూ ఉండకూడదనే భావన అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నందగోపాల్‌కు అధికార పార్టీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం, ఓ మాజీ ఎమ్మెల్సీ సమీప బంధువు కావడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి :మానవహక్కుల వేదిక కన్వీనర్ కెజయశ్రీ బాధితురాలితో మాట్లాడొద్దని 30 ఏళ్ల అనుభవంలో మొదటిసారి వింటున్నా. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నందగోపాల్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా, బాధితురాలితో ఎవ్వరూ మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించడం ఏమిటి? కలెక్టర్ పేరు చెప్పి అడ్డుకోవడం మరీ విడ్డూరం. కలెక్టర్‌కు మెసేజ్‌లు చేసినా స్పందన లేదు, పైగా సీసీ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా నిరుపయోగమే అయింది. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. మర్మమేమిటో అర్థం కావడం లేదు: ఎమ్మెల్యే అంజద్‌బాషా లైంగిక దాడికి గురైన బాలికతో మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంలో మర్మమేమిటో అర్థం కావడం లేదని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. ప్రజాప్రతినిధి అయిన తనను కూడా కలవద్దని ఆంక్షలు విధించారని, సీడబ్ల్యూసీ చైర్మన్ శివకామిని స్టేట్మెంట్ ఆధారంగా తాను మీడియాకు తెలిపానన్నారు. అధికారులు ఈ కేసును ఏం చేయబోతున్నారు? వాస్తవాలను తెలపడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియడం లేదన్నారు. దీని వెనుక ఉన్న వారిని కాపాడి కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయన్నారు. సంబం«ధిత శాఖ మంత్రి పరిటాల సునీతగాని, జిల్లా కలెక్టర్, ఎస్పీల్లో ఎవరైనా ఇందులో దాగి ఉన్న నిజాలను ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏడేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: చిన్నారిని లైంగికంగా వేధించిన అన్నాడీఎంకే నేతను ప్రజలు చితకబాది పోలీసులుకు అప్పగించారు. వివరాలు.. తిరుచ్చి ఆళ్వార్ తోటలో కాయిదేమిల్లత్ మాధ్యమిక ఎయిడెడ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల కరస్పాండెంట్ మీరాన్మైదీన్కి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన పాఠశాల కార్యదర్శి సలీమ్ (50) కరస్పాండెంట్‌గా ఉన్నాడు. ఇతను 49వ మండల అన్నాడీఎంకే కార్యదర్శిగానూ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికను సలీమ్ రోజూ తన గదికి పిలుచుకుని లైంగికంగా వేధించేవాడని తెలిసింది. గురువారం కూడా బాలికను లైంగికంగా వేధించగా ఆ బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రజలు శుక్రవారం పాఠశాలకు వెళ్లి సలీమ్‌కి దేహశుద్ధి చేశారు. సమాచారంతో పోలీసు సహాయ కమిషనర్ రామచంద్రన్, సీఐ శివ సుబ్రమణ్యం సలీమ్‌ను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. -
పసిమొగ్గలపై పంజా!
సాక్షి, సిటీబ్యూరో: బుడిబుడినడకల బంగరు బాల్యాన్ని కామాంధులు చిదిమేస్తున్నారు. హైటెక్ బాటలో దూసుకెళుతున్న మన గ్రేటర్‌లోనూ చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గోల్కొండలోని అజాన్ పాఠశాలల్లో అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన అమానుష ఘటన సభ్య సమాజాన్ని కలచివేసింది. ఇలాంటి దారుణాల విషయంలో దేశంలోని మహానగరాల్లో మన గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఐదోస్థానంలో నిలవడం సిటీజన్లను కలవరపెడుతోంది. ఈ విషయంలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలవగా..ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, చెన్నై, ఢిల్లీ నగరాలున్నాయి. బాలల హక్కులపై పరిశోధన చేస్తున్న చైల్డ్‌రైట్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చిన్నారులపై అమానుషం ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతపాఠశాల స్థాయిలోవిద్యనభ్యసిస్తున్న మైనర్ బాల, బాలికలపై ఇటీవలికాలంలో బడిలో, ఆటోలు, స్కూల్ వ్యాన్లు, బస్సులు, ట్యూషన్ పాయింట్లు, ట్యుటోరియల్స్, బహిరంగ, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతున్న లైంగికదాడులు ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులను కలచివేస్తున్నాయి. ప్రధానంగా బాలికలే అత్యధికంగా ఈ విషయంలో సమిధలుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నవయస్సులో వారిపై జరుగుతోన్న అకృత్యాలతో వారి బంగరు భవితపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మన గ్రేటర్ సిటీలో ఇలాంటి ఆకృత్యాలు 74 చోటు చేసుకోవడం గమనార్హం. మెట్రోనగరాల్లో ఇలా...జాగ్రత్తలివే.. ♦ పాఠశాలకు, ట్యూషన్లకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ఇలాంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చైల్డ్సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ♦ బడికివెళ్లే బాలబాలికలకు పాఠశాల ఆటోలు, వ్యాన్లు, బడిలో డ్రైవర్లు, లేదా టీచర్లు, ఆయాలు, వాచ్మెన్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తున్నారో తరచూ అడిగి తెలుసుకోవాలి. వీలైతే స్వయంగా వారి ప్రవర్తనను గమనించాలి. ♦ అధిక మార్కులు, ర్యాంకుల కోసం అంతగా సురక్షితం కాని ప్రదేశాల్లోని ట్యూషన్పాయింట్లు, ట్యుటోరియల్స్కి బలవంతంగా పంపించరాదు. ♦ అపరిచితులైన అధ్యాపకులపై కన్నేసి ఉంచాలి. ♦ ఇళ్లలో ట్యూషన్ పెట్టించే తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించాలి. పిల్లలను ఇళ్లలో ఒంటరిగా వదిలివేయకూడదు. ♦ చిన్నారులు ఇలాంటి అంశాలపై చేసిన ఫిర్యాదులను తేలికగా తీసుకోరాదు. పరువుపోతుందని బాధపడకుండా..తప్పనిసరిగా పాఠశాల యాజమాన్యం, పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ♦ చిన్నారులు అధికంగా వీడియోగేమ్స్, సోషల్‌మీడియా, స్మార్ట్ఫోన్లు, టీవీలతో గంటల తరబడి కుస్తీపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ చిన్నారుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. వారిపై ర్యాంకులు, మార్కులంటూ వత్తిడి పెంచకుండా వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. ♦ అపరిచితులు చిన్నారులకు ఆఫర్ చేసే చాక్లెట్స్, బహుమతులు వంటి వాటిని తిరస్కరించమని సూచించాలి.