
ప్రకాశం, సంతమాగులూరు: అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడియత్నంకు పాల్పడిన సంఘటన సంతమాగులూరు మండలంలో మిన్నెకల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన కోమరగిరి మహాలక్ష్మయ్య ( 20) స్థానిక చెరువు వద్ద కాపాలా ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే చెరువు సమీపంలోనే పల్లెపు నాగరాజు ఆమె భార్య కలిసి జీవిస్తుంటారు. సంఘటన జరిగిన సమయంలో వారు పొలం పనులకు వెళ్లారు. అయితే నాగరాజు, తన తల్లి ఆదిలక్ష్మి వద్ద చిన్నారిని వదిలి వెళ్లారు. చిన్నారితో పాటు ఆదిలక్ష్మి చెరువు పక్కనే పందులు కాసుకుంటున్న సమయంలో ఆమె వద్దకు మహాలక్ష్మయ్య వెళ్లి చిన్నారిని ఆడిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పాప కేకలు వేయడంతో ఆదిలక్ష్మి వెంటనే అక్కడకు వెళ్లి బాలికను రక్షించింది. అనంతరం పొలం నుంచి వచ్చిన చిన్నారి తండ్రి నాగరాజుకు విషయంను చెప్పగావెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మయ్య పరారీలో ఉన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నషీద్ బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment