మైనర్‌పై లైంగిక దాడి.. ఆరు నెలల గర్భం.. ఆపై  | Minor Girl Molested And Six Months Pregnant In Prakasam | Sakshi
Sakshi News home page

మైనర్‌పై లైంగిక దాడి.. ఆరు నెలల గర్భం.. ఆపై 

Published Wed, Apr 7 2021 8:46 AM | Last Updated on Wed, Apr 7 2021 10:40 AM

Minor Girl Molested And Six Months Pregnant In Prakasam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒంగోలు: మైనర్‌కు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి ఆనక ఆరు నెలల గర్భాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీయించారు. బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కొమరోలు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక అక్కడి కేజీబీవీలో చదువుతోంది. కరోనా నేపథ్యంలో బడికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన కాశీరావు అనే వ్యక్తి మరో మహిళ ద్వారా ఇంటికి రప్పించుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది.

నిందితుడు విశ్వరూపం అనే వ్యక్తిని ఆశ్రయించి అతడి ద్వారా సుభానీ అనే ఆర్‌ఎంపీ వద్ద గర్భం తీసేయించారు. కుమార్తె అనారోగ్యంగా ఉంటుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఓ ఆస్పత్రిలో బాలికకు గర్భం తీసేసిన విషయం గుర్తించారు. బాధిత బాలికను బంధువులు గట్టిగా నిలదీయడంతో ఆమె విషయం చెప్పింది. నిందితులు  తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అదనపు ఎస్పీ రవిచంద్ర స్పందిస్తూ ఫిర్యాదుపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్కాపురం డీఎస్పీని ఆదేశించారు.

చదవండి: పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement