కామాంధుడిని కర్రతో బాదిన తొమిదేళ్ల అమ్మాయి.. | 9 Years Girl Attack On Man Who Attempt To Molested Girl At Film Nagar | Sakshi
Sakshi News home page

కామాంధుడిని కర్రతో బాదిన తొమిదేళ్ల అమ్మాయి..

Published Mon, Apr 18 2022 7:58 AM | Last Updated on Mon, Apr 18 2022 8:03 AM

9 Years Girl Attack On Man Who Attempt To Molested Girl At Film Nagar - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: కామాంధుడిని కర్రతో బాది తోటి బాలికను లైంగిక దాడి నుంచి కాపాడింది ఓ తొమ్మిదేళ్ల చిన్నారి. తాము అమాయకులమే కాదు సమయమొస్తే అపర వీరనారులమవుతామని చాటిచెప్పిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఫిలింనగర్‌లోని బద్ధం బాల్‌రెడ్డినగర్‌ బస్తీలో నివసించే కైసర్‌ దినసరి కూలీ. శనివారం సాయంత్రం తన ఇంటి ఎదుట ఆడుకుంటున్న నలుగురు బాలికలకు చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచాడు. వీరిలో ఇద్దరు తమకు దాహం వేస్తోందని బయటికి వచ్చేశారు. మరో ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలు గదిలోనే ఉండిపోయారు. వీరిలో ఓ బాలికపై కైసర్‌ లైంగిక దాడికి యత్నిస్తుండగా మరో బాలిక కర్రతో అతనిపై దాడి చేసింది.

ఈ క్రమంలో కైసర్‌ను విడిపించుకున్న బాధిత బాలిక బయటికి పరుగులు తీసింది. ఆమె వెంబడే కైసర్‌ను కొట్టిన బాలిక కూడా ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. అప్పటికే తన కూతుళ్లు కనిపించడం లేదంటూ వారి తల్లి ఆ ప్రాంతంలో వెతుకుతుండగా ఆ ఇంట్లో నుంచి పిల్లలు బయటికి రావడం కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయాన్ని తల్లికి చెప్పారు. అసభ్యంగా ప్రవర్తించారని వివరించారు. శనివారం రాత్రి బాధిత బాలిక తల్లితో పాటు ఆమె ఆడబిడ్డ ఇద్దరూ వెళ్లి కైసర్‌ను ప్రశ్నించగా వారిని కిందకు తోసిపడేసి బైక్‌పై ఉడాయించాడు. ఘటనపై బాలిక తల్లి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కైసర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement