ల్యాబ్‌ టెక్నీషియన్‌ కీచక బుద్ది.. ఎల్‌కేజీ విద్యార్థికి చిక్లెట్‌ ఆశచూపి.. | Lab Technician Attempts To Molest 5 Year Old Girl At Film Nagar | Sakshi
Sakshi News home page

Hyderabad: ల్యాబ్‌ టెక్నీషియన్‌ కీచక బుద్ది.. ఎల్‌కేజీ విద్యార్థికి చిక్లెట్‌ ఆశచూపి..

Published Sat, Feb 25 2023 10:43 AM | Last Updated on Sat, Feb 25 2023 11:04 AM

Lab Technician Attempts To Molest 5 Year Old Girl At Film Nagar - Sakshi

 నిందితుడు మోహన్‌ 

సాక్షి, బంజారాహిల్స్‌: ఐదేళ్ల చిన్నారిపై లైంగికి దాడికి యత్నించిన నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడం గ్రామానికి చెందిన బామిని మోహన్‌ (29) పంజగుట్టలో అద్దెకుంటూ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

ఈ నెల 22న మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివసించే స్నేహితుడు ప్రసాద్‌ ఇంటికి వచ్చి మోహన్‌ పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న అతను సాయంత్రం అదే ఇంటి కింది భాగంలో ఉంటున్న ఎల్‌కేజీ చిన్నారికి చాక్లెట్‌ ఇస్తానని గదిలోకి తీసుకెళ్లాడు. దుస్తులు విప్పేసిన మోహన్‌ ఆ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు.రోదిస్తూ బయటికి వచ్చిన చిన్నారిని ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది.

స్థానికులు నిందితుడు మోహన్‌తో పాటు విందుకు పిలిచిన స్నేహితుడు ప్రసాద్‌ను చితకబాదారు. అక్కడి నుంచి మోహన్‌ పరారు కాగా చిన్నారి తల్లి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement