Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం | Step Father Molestation On Daughter In Banjara Hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం

Published Tue, Aug 31 2021 9:54 AM | Last Updated on Tue, Aug 31 2021 12:39 PM

Step Father Molestation On Daughter In Banjara Hills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని శ్రీ వేంకటేశ్వరకాలనీలో అద్దెకుంటున్న 15 సంవత్సరాల బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు తల్లి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీ వేంకటేశ్వరకాలనీలో నివసించే బాధితురాలు తల్లి (32) హౌస్‌ కీపింగ్‌ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు కొడుకు (17), కూతురు (15) ఉన్నారు. 2008లో భర్త నుంచి విడిపోయి మహబూబాబాద్‌ జిల్లా బొజ్జన్నపేట గ్రామానికి చెందిన బెతమాల కృష్ణ (35)తో సహజీవనం చేస్తోంది. 

ఈ నెల 10న బాలిక బోనాల పండుగ సందర్భంగా తన అమ్మమ్మ వద్దకు వెళ్ళింది. తిరిగి రానని చెప్పడంతో తల్లి గట్టిగా ప్రశ్నించింది. ఈ నెల 7న బెతమాల కృష్ణ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించడంతో తాను ఎవరికీ చెప్పలేదని తెలిపింది. ఈ విషయంపై నిలదీసేందుకు తల్లీకూతుర్లు బొజ్జంపేట గ్రామానికి వెళ్ళగా నిందితుడు అక్కడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376 (2)(ఎఫ్‌), 506, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.  
చదవండి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement