Step father
-
కీచక మారుతండ్రికి రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ఓ మారుతండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలు స్తూ రెండు జీవితఖైదులు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్రావు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అక్కడ భర్తను విడిచిపెట్టి ఐదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న ఓ మహిళ పరిచ యం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వారు వివాహం చేసుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో ఓ వ్యవసాయదారుని వద్ద జీతానికి పనిచేస్తున్నారు. అయితే గతేడాది పెద్ద బాలి క కాలికి గాయం కావడంతో గోవింద్రావు 2022 అక్టోబర్ 20న అదే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం బాలికను నేరుగా ఇంటికి తీసుకురాకుండా మెంట్రాజ్‌పల్లి వెళ్లే దారిలోని పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిన బాలిక అపస్మారకస్థితిలో ఉండటంతో ఏం జరిగిందో చెప్పాలని బాలిక తల్లి నిలదీసింది. దీంతో గోవింద్రావు అసలు విషయం చెప్పడంతో బాలికను తల్లి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి న నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. న్యాయ విచారణలో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల కింద గోవింద్రావుపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ అత్యాచారం నేరానికిగాను జీవిత ఖైదు, దాడి చేసి బాధితురాలి మృతికి కారణమైనందున హత్యా నేరానికిగాను మరో జీవితఖైదును జడ్జి విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తీర్పులో సూచించారు. -
Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని శ్రీ వేంకటేశ్వరకాలనీలో అద్దెకుంటున్న 15 సంవత్సరాల బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీ వేంకటేశ్వరకాలనీలో నివసించే బాధితురాలు తల్లి (32) హౌస్ కీపింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు కొడుకు (17), కూతురు (15) ఉన్నారు. 2008లో భర్త నుంచి విడిపోయి మహబూబాబాద్ జిల్లా బొజ్జన్నపేట గ్రామానికి చెందిన బెతమాల కృష్ణ (35)తో సహజీవనం చేస్తోంది. ఈ నెల 10న బాలిక బోనాల పండుగ సందర్భంగా తన అమ్మమ్మ వద్దకు వెళ్ళింది. తిరిగి రానని చెప్పడంతో తల్లి గట్టిగా ప్రశ్నించింది. ఈ నెల 7న బెతమాల కృష్ణ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించడంతో తాను ఎవరికీ చెప్పలేదని తెలిపింది. ఈ విషయంపై నిలదీసేందుకు తల్లీకూతుర్లు బొజ్జంపేట గ్రామానికి వెళ్ళగా నిందితుడు అక్కడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (2)(ఎఫ్), 506, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చదవండి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం.. -
‘తండ్రి’ పెదాలను తాడుతో కుట్టి, ఆపై.. వీడసలు మనిషేనా?
జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. 65 ఏళ్ల వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు సవతి కొడుకు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రైల్వే ట్రాక్ నుంచి వృద్ధుడిని రక్షించారు. పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్‌లోని భీతిహర గ్రామంలో భోలా రామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిపై రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోలా రామ్ మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా.. అదే సమయంలో కొడుకు మరో ఇద్దరితో కలిసి వృద్ధ తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్ళను కట్టి, సమీపంలోని రైల్వే ట్రాక్‌కు తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో భోలా రామ్‌ను రైల్వే ట్రాక్‌తో కట్టేసి వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయాన్నే గ్రామస్తులు ట్రాక్‌పై కట్టి పడేసిన వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వృద్ధుడి పెదాలను కలిపి కుట్టుడానికి ఉపయోగించిన తాడును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో రెండో భార్య హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ‘‘వీడసలు మనిషేనా. తండ్రి అన్న గౌరవం లేకపోయినా, సాటి మనిషి అన్న కనికరం అయినా ఉండాలి కదా’’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి..
విజయనగరం క్రైమ్: వరసకు కుమార్తె అయిన బాలికపై సవతి తండ్రి కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడిన దురాగతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ బాలిక విశాఖ వెళ్లినప్పుడు పక్కింటి పిన్నితో చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో తల్లి ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగి న ‘దిశ’ డీఎస్పీ టి.త్రినాథ్ కేసు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై సవతి తండ్రి కొద్ది నెలలుగా రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవలికాలంలో భార్య, భర్తల మధ్య తగాదా రావడంతో పిల్లలను పట్టు కుని తల్లి విశాఖలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ పక్కనే నివాసముంటున్న మహిళతో బా లిక తన గోడును వెళ్లబోసుకుంది. భర్తతో తగా దా మంచిది కాదని సోదరుడు సర్దిచెప్పడంతో రెండురోజుల కిందటే తిరిగి తన ఇంటికి వచ్చేసింది. ఇంటికివచ్చిన తర్వాత కూడా అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక ఫోన్లో తన పిన్నికి విషయం చెప్పింది. ఆమె వెంటనే స్పందించి తల్లికి వివరించడంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ టి.త్రినాథ్ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో యాక్ట్ కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు.. -
దారుణం: 4 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై మారుతండ్రి (స్టెప్ ఫాదర్) లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై బాలిక మామయ్య రతన్పూరి స్టేషన్ హౌజ్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వింధ్యచల్ తివారి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక తల్లి రెండేళ్ల క్రితం నిందితుడు(50)ని రెండో పెళ్లి చేసుకుంది. బాధిత బాలిక ఆమె మొదటి భర్త కూతురు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నిందితుడు బాలికను సమీపంలో పొలాల్లోకి తీసుకేళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలియగానే గ్రామస్తులంతా నిందితుడి ఇంటి ఎదుట గుమికూడి అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పొక్సో చట్టం, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. -
బాలికపై మారు తండ్రి లైంగికదాడి
సాక్షి, సూర్యాపేట: హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటన మరువకముందే సూర్యాపేట పట్టణంలో మరో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూ సుకుపోయిన ఓ మారుతండ్రి కూతురులాంటి బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. చివ్వెంల మండలం మున్యానాయక్‌తండాకు చెందిన లారీ డ్రైవర్ బానోతు శ్రీను పేటలోని గొల్లబజారుకు చెందిన వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 ఏళ్ల కూతురు, ఇద్దరు కుమారుడు ఉన్నారు. బాలికపై అతడి కన్నుపడింది. ఇంకేముంది భార్య కూలిపనులకు పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే బాలికను లొంగదీసుకున్నాడు. రెండేళ్లుగా లైంగికదాడికి పాల్ప డుతున్నాడు. విషయం బయటికి చెబితే తల్లితో పాటు తమ్ముళ్లను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఫిర్యాదుమేరకు గురువారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు. -
పిల్లలతో మారు తండ్రి అనుచిత ప్రవర్తన..
తమిళనాడు, తిరువళ్లూరు: వరుసకు తండ్రి అయిన వ్యక్తి నుంచి ఎదురైన లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని పుళల్ ఇన్స్పెక్టర్ను ఆశ్రయిస్తే, కేసు నమోదు చేయడానికి నిరాకరించి తనపై లైంగిక దాడులకు యత్నించారని ఆరోపిస్తూ బాలిక తన తల్లితో కలిసి తిరువళ్లూరు మహిళ కోర్టును ఆశ్రయించారు. తిరువళ్లూరు జిల్లా పుళల్ సూరపట్కు చెందిన మహిళ (43)కు వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి నివశిస్తున్నారు. 2017లో అంబత్తూరులోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరారు. సంస్థ యజమాని వాసుదేవ జయకరన్తో సన్నిహితం ఏర్పడి ప్రేమగా మారింది. 2017 నవంబర్‌లో వాసుదేవను రాధిక రెండో వివాహం చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా రాధిక వాసుదేవ జయకరన్తో కలిసి ఉంటోంది. పిల్లలతో అనుచిత ప్రవర్తన: మొదట్లో మారు తండ్రి వాసుదేవ్ బాగానే ఉండేవారని తదనంతరం బాత్రూమ్లో తొంగిచూడడం, సెల్ఫోన్లో నీలిచిత్రాలను చూపిస్తూ లైంగింక వేధింపులకు గురి చేసేవాడని వాపోయిన 17 ఏళ్ల బాలిక తల్లితో కలిసి 2018 నవంబర్ 28న పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన ఇన్స్పెక్టర్ నటరాజన్, తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు ఆరోపించింది. దీనిపై అంబత్తూరు డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి భరణీధరన్ ఎదుట హాజరై తమకు న్యాయం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయం చేయండి: వరుసకు తండ్రి అయిన వ్యక్తి లైంగింక వేధింపులకు గురి చేస్తున్నాడు. పోలీసులను ఆశ్రయిస్తే ఇన్స్పెక్టర్ సైతం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బెదిరింపులకు దిగుతూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని న్యాయమూర్తి భరణీధరన్ ఎదుట బాలిక కంటతడి పెట్టింది. తమను ప్రశాంతంగా బతకనిస్తే చాలన్న బాధితులు, ఇన్స్పెక్టర్ నటరాజన్, మారుతండ్రి వాసుదేవ జయకరన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి భరణీధరన్ ఇన్స్పెక్టర్ను శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరేళ్ల చిన్నారికి సవతి తండ్రి వేధింపులు
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: ఆరేళ్ల పాపను సవతి తండ్రి వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుజాత అనే మహిళ భర్త మృతి చెందడంతో తన ఆరేళ్ల కుమార్తెతో జీవనం సాగిస్తోంది. రాజవొమ్మంగికి చెందిన ఖలీఫ్ బర్కత్ అలీతో కొంత కాలంగా రాజమహేంద్రవరం ఇన్నీసు పేటలో సహజీవనం సాగిస్తోంది. వీరిద్దరి సహజీవనానికి ఆరేళ్ల చిన్నారి అడ్డుగా ఉండడంతో బర్కత్ అలీ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం బర్కత్ అలీ బాలికపై ఆగ్రహంతో అట్లకాడ కాల్చి ఒంటిపై పలుచోట్ల వాతలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు ఛైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలల సంక్షేమ కమిటీ రాష్ట్ర సభ్యుడు వి.గాంధీ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ,, అడిషనల్ డీఅండ్ఎంహెచ్ఓ డాక్టర్ కోమలి బాలికను పరిశీలించారు. పాప శరీరంపై కాలిన గాయాలు, మచ్చలు ఉన్నాయి. సంఘటనపై నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. బర్కత్ అలీపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. టూ టౌన్ సీఐ పవన్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై సవతి తండ్రి దారుణం
భోపాల్ : పద్నాలుగేళ్ల బాలికపై కన్నేసిన సవతి తండ్రి ఐదు నెలలకు పైగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. దెవాస్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా గర్భం దాల్చినట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఐదు నెలలుగా సవతి తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వెల్లడించిందని కటేగావ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విశ్వదీప్ సింగ్ పరిహర్ చెప్పారు. సవతి తండ్రి లైంగిక వేధింపుల గురించి తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్ట్ చేసి పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
బాలుడితో నేరాలు చేయించిన మారుటి తండ్రి
విజయవాడ : బడికి పంపాల్సిన వయస్సులో బాలుడితో నేరాలు చేయించిన కేసులో మారుటి తండ్రిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 12 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఏడీసీపీ షరీన్ బేగం విలేకరులకు వివరాలను వెల్లడించారు. గవర్నర్‌పేట రాజగోపాలాచారి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని, ఓ మహిళను అదుపులోకి తీసుకుని తమ సిబ్బంది విచారించారని ఆమె తెలిపారు. వారిద్దరు 13 ఏళ్ల బాలుడిని దొంగతనాలకు ప్రేరేపించి నేరాలు చేయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలిందన్నారు. 13 ఏళ్ల బాలుడు భవానీపురం స్టేషన్ ఏరియాలో 4, కొత్తపేట పరిధిలో 2, అజిత్‌సింగ్‌నగర్ ఏరియాలో 1.. మొత్తం 7 చోరీలకు పాల్పడ్డాడని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన తానెం యేసుపాదం కొబ్బరి బొండాల వ్యాపారంతో విజయవాడకు వస్తూ విద్యాధరపురానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. భర్త చనిపోయిన ఆమెను కొద్దికాలానికి వివాహం చేసుకున్నాడన్నారు. ఈ క్రమంలో తన రెండో భార్య కుమారుడు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నట్లు యేసుపాదం గుర్తించినట్లు ఏడీసీ తెలిపారు. బొండాల వ్యాపారంలో నష్టం రావటంతో రెండు కుటుంబాలను పోషించటం ఇబ్బందికరంగా మారిందని, దీంతో యేసుపాదం తన మారుటి కొడుకుతో దొంగతనాలు చేయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు. -
సవతి తండ్రే కామాంధుడై..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, నేరాలు మరింత తీవ్రం కావడం ఆందోళన పుట్టిస్తోంది. ముఖ్యంగా బాలికలు, యువతులపై అత్యాచారాల సంఘటనల్లో బాధితులకు తెలిసినవారు, సమీప బంధువులే ఎక్కువగా లైంగికంగా హింసిస్తున్నారనేది ఒక చేదు నిజం. తాజాగా హైదరాబాదులో ఇలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి లైంగికంగా దాడిచేశాడో సవతి తండ్రి. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తీవ్రంగా హింసించాడు. చివరకు ధైర్యం చేసి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. వివరాల్లోకి వెళితే ఎనిమిది సంవత్సరాల క్రితం వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు నిందితుడు. ఈమెకు మొదటి భర్తతో సృజన( పేరు మార్చాం) అనే కూతురు ఉంది. భార్య ఇంట్లోలేని సమయంలో సవతి కూతురుపై లైంగిక దాడి చేయడంతోపాటు తల్లితో చెప్పవద్దని బెదిరించాడు. భయంతో బాధితురాలు మౌనం వహించింది. కానీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత, ఆమె తల్లి పని కోసం బయలుదేరబోతుండగా భయంతో వణికి పోయింది. తనను విడిచి వెళ్లొద్దంటూ భోరున విలపించింది. కూతురు ద్వారా విషయం తెలుసుకున్న మహిళ భర్తను నిలదీసింది. అయితే.. ముందు బుకాయించినా, గట్టిగా నిలేయడంతో మద్యం మత్తులో తప్పు చేశాననీ, క్షమించమంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ ఆ కామంధుడిని క్షమించేశారు. కానీ నెల రోజుల తరువాత మళ్లీ లైంగిక దాడికి తెగబడ్డాడు. తప్పించుకుని బాత్ రూంలోకి పారిపోయి తలుపు వేసుకుంది. తలుపు పగల గొట్టి మరీ ఆమెపై దాడిచేశాడు. బెల్ట్‌తో చితకబాదాడు. భర్త క్రూరత్వం గురించి తెలిసిన ఆమె కూతురి స్థితిని గమనించి విషయాన్ని అర్థం చేసుకుంది. నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే కేసు నమోదు చేయడానికి వారు మూడు పోలీస్స్టేషన్లు తిరగాల్సి రావడం.. సంఘటన తరువాత పారిపోయిన నిందితుడు, మళ్లీ రాజీకోసం ప్రయత్నించాడు. కేసు ఉపసంహరించుకోవాలని, అమ్మాయి పేరుతో డబ్బులు డిపాజిట్ చేస్తానని, చదువుకు సాయం చేస్తానంటూ బేరసారాలు మొదలు పెట్టాడు. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వద్దు డాడీ.. మొత్తుకున్నా.. ఆ కామాంధుడు కనికరించలేదని, తాను గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టినా.. చుట్టుపక్కల వారు ఎవరూ ముందుకురాలేదని బాధితురాలు వాపోయింది. అసలు ఆయన తన తండ్రి కాదనే విషయం ఎవరికీ తెలియదనీ, చివరికి తన తమ్ముడికి కూడా తెలియదని చెప్పింది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్లనని స్పష్టం చేసింది. ఇంట్లో తనకు రక్షణలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే తాను హాస్టల్లో ఉండి చదువుకుని పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెప్పింది. ఇంటా, బయట ఆడబిడ్డలపై జరిగే అఘాయిత్యాలపై మొదటినుంచీ తన తల్లి హెచ్చరిస్తూ వుండేదని బాధిత బాలిక చెప్పింది. అదే తనకు ఈ ధైర్యాన్నిచ్చిందని పేర్కొంది. -
దారుణం
కాచిగూడ: మారుతండ్రే ఓ యువతికి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మహిళా దినోత్సవం రోజే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే డిఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్, కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ దాసరి విజయ్‌లాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బాలానగర్ ఐడిపిఎల్ కాలనికి చెందిన మాధవికి, బెల్లంపల్లికి చెందిన మల్లేష్‌తో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. చదువు పేరుతో రెండేళ్ల క్రితం మాధవి కూతురు (17)ను బెల్లంపల్లికి రప్పించుకున్న మల్లేష్, ఆమెకు మద్యం తాగించి, నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంతటితో ఆగకుండా ఓ ఆటో డ్రైవర్ వద్దకు పంపగాచ అతనితో పాటు మరో ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే గత కొద్ది రోజులుగా బాధితురాలు జ్వరంతో బాధపడుతుండటంతో మల్లేష్ భార్య లక్ష్మి ఆమెను బెల్లంపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మల్లేష్ తన కూతురు కనిపించడంలేదని బెల్లంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ కాచిగూడలో సమోసాలు విక్రయించే వ్యక్తితో పాటు మరికొందరు ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బెల్లంపల్లి పోలీసులు కేసును కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సమోసాల విక్రయం కాచిగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్నందున కాచిగూడ పోలీసులు కేసును రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైల్వే డిఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు ఐడీపీఎల్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితురాలు మారు తండ్రే తనకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అనంతరం ఓ ఆటో డ్రైవర్ వద్దకు పంపడంతో అతనితో పాటు మరో ముగ్గురు ఆత్యాచారం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను గత నెల 14న న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఘటన బెల్లంపల్లిలో జరిగినందున కేసును బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఇన్స్పెక్టర్ విజయ్‌లాల్ వివరించారు. -
హైదరాబాద్‌లో మారు తండ్రి పైశాచికం
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన తండ్రి కాల్చి వాతలు పెట్టి శాడిస్టు అనిపించుకున్నాడు. అడ్డగుట్టలో నివాసముంటున్న నాలుగేళ్ల చిన్నారిపై మారు తండ్రి ప్రవీణ్ తన పైశాచికత్వాన్ని చూపాడు. అభంశుభం తెలియని చిన్నారి అని చూడకుండా శరీరంపై ప్రతిచోటా వాతలు పెట్టడమేగాక ఆమె గోళ్లు కూడా తీసేశాడు ఆమెకు నరకం చూపించాడు. ప్రవీణ్ గత కొంతకాలంగా చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం ప్రతినిధులు నార్త్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెంపుడు తండ్రిని కడతేర్చిన కొడుకు
వరంగల్, పలిమెల(మంథని): మద్యం మత్తులో వ్యక్తి తల్లిదండ్రులపైనే దాడి దిగాడు. ఈ దాడిలో పెంపుడు తండ్రిని హతమవగా.. తల్లి గాయాలపాలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పంకెన గ్రామ శివారులోని మోదేడు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మహదేవ్పూర్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సావిత్రికి ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త అనారోగ్యంతో మరణించడంతో అదే గ్రామానికి చెందిన మల్లెల నాగయ్య (55)ను 15 సంవత్సరాల క్రితం రెండో వివహం చేసుకుంది. సావిత్రి పెద్ద కుమారుడు ప్రభాకర్‌కు, నాగయ్యకు మధ్య విబేధాలుండేవి. ప్రభాకర్ విపరీతంగా మద్యంసేవించి తల్లి సావిత్రి, తండ్రి నాగయ్యలపై ఇంటి వద్దే గొడ్డలితో దాడి చేశాడు. నాగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థాని కులు మహదేవ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నాగయ్య మృతదేహానికి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిం దితుడిని అదుపులోకి తీసుకోని విచా రిస్తున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. -
చిన్నారిని హింసించిన మారుతండ్రికి రిమాండ్
జవహర్‌నగర్: నిన్న ప్రత్యూష.. నేడు భవాని.. అంతలోనే సంధ్య..! తల్లిదండ్రులు, బంధువుల చేతుల్లో హింసకు గురవుతున్న చిన్నారుల ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాలుగేళ్ల చిన్నారి సంధ్యను హింసిస్తోన్న మారుతండ్రిని రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివాసముండే ప్రమీల కుమార్తె సంధ్య(04)ను మారుతండ్రి ప్రశాంత్‌కుమార్ కొన్ని రోజులుగా చిత్రహింసలకు గురిచేశాడు. ఇంట్లో అల్లరి చేస్తోందని, సరిగా చదవడం లేదనే నెపంతో ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రమీల, ప్రశాంత్ కుమార్ల ఇంటిపై దాడిచేసి చిన్నారిని కాపాడారు. వేధింపులు, హింస విషయంలో ప్రమీల, ప్రశాంత్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ప్రశాంత్‌కుమార్‌ను రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
చిన్నారిని చంపేసిన పెంపుడు తండ్రి
హైదరాబాద్ : ఉగాది పర్వదినాన అభం శుభం తెలియని ఓ రెండేళ్ల చిన్నారిని ఆమె తండ్రే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన సీతయ్య అనే వ్యక్తి ఓ రెండేళ్ల చిన్నారికి పెంపుడు తండ్రి. చిన్నారి తనకు అడ్డుగా ఉందనుకున్నాడో లేక భారం అనుకున్నాడో గానీ ... పసిపాప అని కూడా చూడకుండా చంపేశాడు ఆ కసాయి పెంపుడు తండ్రి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కన్నకూతురిని గ్యాంగ్‌రేప్ చేయించిన తల్లి!!
తల్లి అనే పదానికే అర్థం లేకుండా చేసిందా మహాతల్లి. 18 ఏళ్ల వయసులో ఉన్న తన కూతురిని 1800 మంది పక్కన పడుకోబెట్టింది! జాక్వెలిన్ మార్లింగ్, ఆమె భర్త కలిసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాధితురాలు దాదాపు 30 ఏళ్ల తర్వాత వెల్లడించింది. ఏడేళ్ల వయసు నుంచే తనమీద అఘాయిత్యాలు మొదలయ్యాయని, 11 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. మూడేళ్ల తర్వాత వేల్స్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఒకేసారి సామూహిక సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా తన తల్లి బెదిరించిందని తెలిపింది. అందులో తన తల్లి కూడా ఉందని చెప్పింది. ఇప్పుడు సొంత కుటుంబంతో స్థిరపడటంతో అన్ని విషయాలనూ ఆమె ధైర్యంగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు 11, 12 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించారు. తన తల్లి కంటే ఎక్కువగా ఎవరూ తనను బాధించలేదని, అలాంటి క్రూరమైన మహిళను తాను ఎప్పటికీ క్షమించలేనని తెలిపింది. తన 18వ పుట్టినరోజు చేసుకునేసరికే దాదాపు 2వేల మంది తనపై అత్యాచారాలు చేశారని చెప్పి వాపోయింది. 14 ఏళ్ల వయసులో ఓసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, ఆ తర్వాత ఈ నరకం నుంచి ఎలా బయటపడతానా అని ఎదురు చూశానని తెలిపింది. తాను పగటిపూట స్కూలుకు వెళ్లే అమ్మాయిగా.. రాత్రిపూట సెక్స్ బానిసగా రోజులు గడిపానంది. 17 ఏళ్ల వయసులో తన సవతి తండ్రి తనను గర్భవతిని చేశాడని కూడా ఆమె చెప్పింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
మైనర్‌పై సవతి తండ్రి అత్యాచారం
ముంబై: మలాడ్ పట్టణ ప్రాంతంలో మైనర్ బాలికపై సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని బుధవారం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న అజీమ్ షేక్(35), సవతి కుమార్తె(14)పై గత ఫిబ్రవరి నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆమె తల్లికి అతడు రెండో భర్త.. తల్లి పనికి బయటకు వెళ్లిన ప్రతిసారీ బాలికపై షేక్ లైంగిక దాడికి పాల్పడుతుండటంతో భరించలేక ఆమె అదే ప్రాంతంలో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. కాగా, మంగళవారం సాయంత్రం పని నుంచి తిరిగి వచ్చిన తల్లికి కూతురు ఇంటి వద్ద కనిపించకపోవడంతో షేక్‌ను ప్రశ్నించింది. ఆమె మేనమామ ఇంటికి వెళ్లిపోయిందని చెప్పడంతో షేక్‌ను వెంటబెట్టుకుని ఆమె తన అన్న ఇంటికి వెళ్లింది. కూతురిని ఇంటికి రమ్మని పిలిస్తే నిరాకరించడంతో ఆమె తన అన్నతో గొడవకు దిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. తనపై షేక్ గత నాలుగు నెలలుగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాలిక తెలి పింది. బాలిక ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీ సులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.