
సాక్షి, సూర్యాపేట: హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటన మరువకముందే సూర్యాపేట పట్టణంలో మరో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూ సుకుపోయిన ఓ మారుతండ్రి కూతురులాంటి బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. చివ్వెంల మండలం మున్యానాయక్‌తండాకు చెందిన లారీ డ్రైవర్ బానోతు శ్రీను పేటలోని గొల్లబజారుకు చెందిన వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 ఏళ్ల కూతురు, ఇద్దరు కుమారుడు ఉన్నారు. బాలికపై అతడి కన్నుపడింది. ఇంకేముంది భార్య కూలిపనులకు పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే బాలికను లొంగదీసుకున్నాడు. రెండేళ్లుగా లైంగికదాడికి పాల్ప డుతున్నాడు. విషయం బయటికి చెబితే తల్లితో పాటు తమ్ముళ్లను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఫిర్యాదుమేరకు గురువారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment