Nalgonda Crime News
-
Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో వెలువడిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ తీర్పు కూడా అంతే పంచలనంగా మారింది. సుదీర్ఘ వాదనల అనంతరం నేడు (మార్చి10) తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు స్పందించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతకు న్యాయం కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారులు ఈ తీర్పును ఆహ్వనించారు. ముఖ్యంగా ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ కన్వీనర్ సంధ్య తాజా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుపై వీ సంధ్య స్పందిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె భర్తను కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇది అని గుర్తు చేశారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష సరైనదేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాఉద్యమాలు, ప్రజా పోరాటాల గెలుపు అని పేర్కొన్నారు. అలాగే అత్యంత క్రూరమైన హత్యలు, దౌర్జన్యాల పట్ల, పోలీసులు కోర్టులు స్పందించాల్సిన ఇలాంటి వైఖరి ఇదేనని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిగా పనిచేస్తే వచ్చే ఫలితాలకు, తీర్పులకు ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు. ఈ కేసులో నిర్వహించినట్టుగానే అన్ని కేసుల్లోనూ పకడ్బందీ విచారణలు అవసర మన్నారు. దిశ కేసులో జరిగినట్టుగా ఎలాంటి విచారణలు, సాక్ష్యాలు లేకుండా ఎన్కౌంటర్లు కాదు పరిష్కారం, రుజువులు, సాక్ష్యాలతో టెక్నికల్ ఎవిడెన్స్‌తో జరిగే తీర్పులు ఈ సమాజానికి కావాలని సంధ్య పిలుపునిచ్చారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. అయితే ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సుభాష్‌శర్మ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ప్రణయ్ హత్యనాటికి గర్భవతిగా ఉన్న అమృత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ప్రణయ్ తల్లితండ్రులే కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే తండ్రి మరణం తరువాత అమృత క్రమంగా తల్లికి దగ్గరైంది. అట అత్తమామలు, ఇటు తల్లితోనూ సన్నిహితంగా ఉంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌కు ప్రతిరూపమైన తన కొడుకును అంతే ప్రాణంగా పెంచుకుంటోంది. -
విచారణ పేరుతో ఎస్ఐ వేధింపులు
-
తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు
హైదరాబాద్, సాక్షి: పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చోరీ చేసి పారిపోతున్న దోపిడీ ముఠాను పట్టుకునే నల్లగొండ పోలీసులు ఛేజింగ్‌కు దిగారు. ఈ క్రమంలో ఆ దొంగలు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. నల్లగొండలో చోరీలు చేసిన ఓ ముఠా పారిపోతుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాళ్లను వెంబడి అడ్డగించారు. ఆ టైంలో పోలీసులపై దుండగులు కత్తులు దూశారు. దీంతో వాళ్లను అదుపు చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వీళ్లను పార్థీ(పార్థ) గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్య వరుసగా పోలీస్ ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే తాజా ఘటన మాత్రం నగర శివారులో చోటు చేసుకుంది. -
ఉరేసుకుని యువతి బలవన్మరణం
పాలకవీడు: ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మీనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ(27)కు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఉమ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా తన భర్తకు జాబ్ లేదనే మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట): పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్, అదే గ్రామానికి చెందిన సల్లగుండ్ల నాగజ్యోతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంజయ్ సూర్యాపేటలో ఉంటూ వాటర్ ప్లాంట్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా.. నాగజ్యోతి బీ–ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లోని నాగోల్ క్రాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఎం–ఫార్మసీ చదువుతోంది. తాను నాగజ్యోతిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు గతంలోనే సంజయ్ తెలియజేయగా వారు వివాహానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ మూడేళ్లుగా వారు ప్రేమలోనే ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు నాగజ్యోతి తల్లిదండ్రులకు లేనిపోని విషయాలు చెప్పడంతో ఆమెను తండ్రి మందలించాడు. ఉగాది పండుగ తర్వాత నుంచి ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటి దగ్గరే ఉంచాడు.కలిసి ఉండలేమని భావించి..తమ ప్రేమ విషయమై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో, ఇకపై తాము కలిసి ఉండలేమని భావించి వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సంజయ్, నాగజ్యోతి తమ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగారు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లేవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. అంత్యక్రియలు పూర్తిచేశారు.సూసైడ్ నోట్ లభ్యం..తమ ప్రేమకు అడ్డంకిగా మారి ఇబ్బందులకు గురిచేసిన గ్రామానికి చెందిన బెల్లంకొండ నారాయణ, ఆరె లతారెడ్డితో పాటు నాగజ్యోతి బంధువులైన సల్లగుండ్ల అజయ్, సల్లగుండ్ల మల్లయ్య, సల్లగుండ్ల శ్రీను, సల్లగుండ్ల ఉప్పలయ్యతో పాటు నాగజ్యోతి తండ్రి సల్లగుండ్ల శ్రీనుపై చర్యలు తీసుకోవాలని వారు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి దుర్గమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాçప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
Crime: అతను డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్!
నల్లగొండ: చైన్ స్నాచింగ్‌లు మగాళ్లే చేస్తారని భ్రమలో ఉన్నవాళ్లకు ఈ వార్త ఓ కనువిప్పు. ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్లిద్దరూ పలాయనం చిత్తగించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పడు వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చారు. అక్కడ ఓ మహిళ మెడలో గొలుసును వెనక ఉండే యువతి లాగే యత్నం చేసింది. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు బైక్‌పై ఉన్నవాళ్లను వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఛేజ్ చేస్తూ వాళ్లను వీడియో తీశారు.అయితే వాళ్లు దొరకలేదు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్రిగూడ పోలీసులు.. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. -
మామను హత్య చేసిన అల్లుడు.. తేడాలు రావడమే కారణం..!
నల్గొండ: భూ తగాదాలు, డబ్బు పంపకంలో తేడాలు రావడంతో మామను అల్లుడు హత్య చేసిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి ఆదివారం వివరాలు తెలియజేశారు. పోల్కంపల్లి గ్రామానికి చెందిన జక్కల చినమారయ్య(60), మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మారయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి తనకున్న భూమిలో ఒక్కొక్కరికి 3.20 ఎకరాల చొప్పున పంచి ఇచ్చాడు. కుమార్తెలకు పంచగా మిగిలిన భూమిలో ఇటీవల కొంత విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరు కుమార్తెలకు పంచి ఇచ్చాడు. కాగా పెద్దకుమార్తెకు కొంత ఎక్కవ మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో చిన్న కుమార్తె భర్త అయిన పెద్దవూర మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన బొబ్బల నారాయణ తరచూ అత్తమామలతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం పోల్కంపల్లికి వచ్చిన చిన్న అల్లుడు నారాయణ అత్తతో గొడవపడి అప్పటికే గొర్రెలను మేపడానికి పొలం వద్దకు వెళ్లిన మామ చినమారయ్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. ఈ క్రమంలో నారాయణ బండరాయితో చినమారయ్య తలపై మోదాడు. దీంతో మారయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా.. నారాయణ అక్కడి నుంచి పరారయ్యాడు. చినమారయ్య మృతిచెందడంతో గొర్రెలు గ్రామంలోని పలువురి పొలాల్లో మేత మేస్తుండగా గ్రామస్తులు మారయ్య ఇంట్లో సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు చినమారయ్య కోసం శనివారం రాత్రి మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో చినమారయ్య గ్రామస్తులకు విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ పరశురాం, ఎస్ఐ రంజిత్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మాటు వేసి బైక్‌పై తీసుకెళ్లి... బాలికపై అత్యాచారం
సాక్షిప్రతినిధి నల్లగొండ : ఓ కామాంధుడు గిరిజన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీఏపల్లి మండలానికి చెందిన ఓ గిరిజన బాలిక ఈ నెల 3న బైక్‌పై పాఠశాలకు వెళ్తోంది. గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు రవితేజ మాటు వేసి బైక్‌ను అడ్డగించాడు. అనంతరం బాలికను కత్తితో బెదిరించి పెనుగులాడుతుంటే కొట్టడంతో స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాధిత బాలికను బైక్‌పై గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు స్పృహ వచ్చే సరికి కొండమల్లేపల్లిలో ఉంది. విషయం తల్లిదండ్రులకు చెబితే చంపివేస్తానని నారాయణదాసు బాలికను బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. బాధిత బాలిక దాడి నుంచి తేరుకుని ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించి బోరుమంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం పెద్దమనుషుల సహకారంతో బాధితురాలి తల్లిదండ్రులు శనివారం నల్లగొండ ఎస్పీ అపూర్వరావును ఆశ్రయించి గోడు వెల్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని వేడుకున్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో ఆరోపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై 323, 341, 506, 366–అ, 376(2)N)సెక్షన్ల కింద కేసు నమో దు చేసి గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, లైంగికదాడి ఘటనపై బాధితురాలు రెండు ఫిర్యాదులు ఇచ్చారని, ఒకే పిటిషన్ ఇవ్వాలని కోరడంతో కొంత ఆలస్యం జరిగిందని గుడిపలి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రంజిత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. -
వైశాలి కేసులో మరో ట్విస్ట్? సంచలనం రేపుతున్న నవీన్ రెడ్డి వీడియో
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడ కిడ్నాప్ కేసు మొదటి నుంచి సంచలనం రేపుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుడు నవీన్ రెడ్డి వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు నవీన్. ఈ వీడియో ప్రకారం.. వైశాలికి నవీన్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉందా? వారి వివాహం జరిగిందా? నవీన్ రెడ్డి చెబుతున్న సంచలన విషయాలేంటి? నవీన్ రెడ్డితో పోలీసులు బలవంతంగా వీడియో చేయించారా? నిందితుడు చెప్పినట్లు పోలీసులు వీడియోను కొంత భాగం మాత్రమే విడుదల చేశారా? అసలు ఏం జరిగింది, నవీన్ పూర్తి వీడియోలో ఏముంది? తాజాగా నవీన్ రెడ్డి సన్నిహితులు గంట నిడివి గల పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తల్లిదండ్రులకు భయపడే వైశాలి ఈ విధంగా చేసిందంటూ పేర్కొన్నాడు. చివరి సారిగా వైశాలిని ఒప్పిస్తానని మాత్రమే తీసుకెళ్లాను తప్పా మరో విధంగా కాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం తాను చేయలేదని వీడియోలో నవీన్ పేర్కొన్నాడు. అప్పటికీ ఒప్పుకోకపోవటంతో వారి స్నేహితులకు అప్పగించే అక్కడి నుంచి బళ్లారికి వెళ్లి ఆ తర్వాత గోవాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తన వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు నిజమేనా? ఆ దిశగా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందా? అనేది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు.. నవీన్ రెడ్డి తల్లి సైతం ఇరువురు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లిదాకా వెళ్ళింది కానీ..
-
ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ యువతిని సినీ ఫక్కీలో వంద మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆరు గంటల్లోనే ఛేదించారు పోలీసులు. శుక్రవారం రాత్రి యువతిని రక్షించారు. అయితే.. ఆమెను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు సమాచారం. తండ్రికి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా యువతి నల్లగొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేశారు. వైశాలిని రహస్య ప్రదేశంలో ఉంచిన పోలీసులు.. ఆమె తండ్రిని మాత్రమే చూడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెకు ఓ పరీక్ష ఉండడం, ఆ పరీక్షకు తండ్రే దగ్గరుండి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 28 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడంతో కనిపెడ్డడానికి ఇబ్బందులు ఎదురైనట్లు వెల్లడించారు. ‘ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్. అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత భయపెట్టారు. వైశాలి షాక్‌లో ఉంది. నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతని కోసం టీమ్స్ వెతుకుతున్నాయి. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వాళ్లను పట్టుకుంటాం.’ అని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: డాడీ నేను క్షేమంగానే ఉన్నాను.. కానీ, తీవ్ర గాయాలతో.. -
కారు చక్రం కింద నలిగిన చిరుప్రాయం
సాక్షి, సూర్యాపేట : కారు చక్రం కింద ఓ చిరుప్రాయం నలిగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ్‌శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, విజయ్‌శేఖర్ ఇంటికి మధ్యాహ్న సమయంలో బంధువులు కారులో వచ్చారు. వారు ఇంట్లోకి వెళ్లగానే డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టుకింద కారును రివర్స్‌లో పార్క్ చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత పని నిమిత్తం శిరీష ఎదురింట్లోకి వెళ్లగా తల్లిని చిన్నకూతురు షణ్ముఖ (18నెలలు) కూడా అనుసరించింది. ఆ ఇంటి ఎదురుగానే నిలిపిన కారు వెనుక డోరు పక్కన షణ్ముక ఆడుకుంటోంది. గమనించని తల్లి శిరీష ఒక్కతే ఇంట్లోకి వెళ్లింది. ఇంతలోనే కారు డ్రైవర్ అక్కడకు వచ్చి చిన్నారిని గమనించకుండా వాహనాన్ని ముందుకు కదిలించాడు. అయితే, ఈ సమయంలో షణ్ముక వెనుక చక్రం వద్ద ఆడుకుంటూ దానికింద పడిపోయింది. దీంతో టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. షణ్ముక కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి వచ్చి కోదాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. -
పోలీసులే లక్ష్యంగా మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్
సాక్షి, నల్గొండ: పోలీసుల పేరుతో నకిలి పేస్బుక్ ఖాతాలతో ఘరాన మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు నల్గొండ పోలీసులకు చెక్ పెట్టారు. రాజస్థాన్ కేంద్రంగా ఫేస్ బుక్ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 8 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 30 సిమ్ కార్డు, ఆధార్ కార్డులతో పాటుపలు డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముఠా సభ్యులంతా రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ గ్రామానికి చెందివారుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పోలీసు అధికారుల ఖాతాలే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. అధికారుల పేర్లతో ఫేస్బుక్ ఖాతాను క్రియోట్ చేసి పలువురికి డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు.. బ్యాంక్, రైల్వే, సీఆర్పీఎఫ్ అధికారుల పేరుతో ఫేస్బుక్ ఖాతాను సృష్టించి రిక్వెస్ట్ పెట్టినట్లు చెప్పారు. అంతేగాక ఈ ముఠా ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ అప్లికేషన్ అడ్డాగా చేసుకుని ఆర్మీ పేరుతో కూడా సైబర్ నేరాలకు పాల్పడ్డారని, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పేరిట కూడా నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించి పలువురికి డబ్బులు పంపించాలంటూ రిక్వెస్ట్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం
సాక్షి, నల్గొండ: టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రికుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేగాక తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలను పంపిణీ చేశారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. (చదవండి: నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించెందుకు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో ఈ రోజు బయలుదేరారు. ఈ క్రమంలో అంబులెన్స్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ
గుండాల : చోరీ చేస్తుండగా దొంగను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు పట్టణానికి చెందిన పల్లపు ఉపేందర్ గ్రామంలోని తాటిచెట్టు మల్లిఖార్జున్ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్ చోరీ చేసి అనంతరం కిరాణం షాపులో డబ్బులు తీస్తుండగా శబ్దం అయింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఉపేందర్ని పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. -
ఏడాదిగా బాలికపై లైంగికదాడి
సాక్షి, రామగిరి(నల్గొండ) : ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న నలుగురు యువకులను తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగదుర్గాప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బొబ్బలి నవీన్ ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇది గమనించిన నవీన్ స్నేహితుడు గజ్జి రమేష్ ఆ బాలికపై కన్నేశాడు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని అందరికీ చెబుతానంటూ ఆ బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతున్న బాతుక శంకర్, సింగం అనిల్ కూడా ఆ బాలికను బెదిరించి లోబర్చుకున్నారు. ఇలా ఆ బాలికపై ఏడాది కాలంగా నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడుతూనే ఉన్నారు. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం ) ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. కొంతకాలంగా బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో ఇందుకు కారకులెవరని నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రికి వివరించి బోరుమంది. వెంటనే బాలిక తల్లి గత 21వ తేదీన తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు వద్ద నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం రావడంతో వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వీరిపై ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ జి.సత్యనారాయణ, రైటర్ రమేష్, మీరా సాహెబ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.(వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..) -
చిన్నారిని మింగిన వాగు
ఆ పేదింటి చిరుదీపం ఆరిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో చివరకు తీరని శోకమే మిగిలింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తల్లిదండ్రుల కళ్లముందే ఆడుకున్న ఇద్దరు పిల్లల్లో సాయంత్రానికి ఒకరు విగతజీవిగా మారడం.. మరో చిన్నారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ధన్సింగ్తండాలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్): తిరుమలగిరి మండలం ధన్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీకి చెందిన మెగావత్ నాగు, సుశీల దంపతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు మెగావత్ హరిలాల్(5), మెగావత్ సాయి, కూతురు సంతానం. హరిలాల్, సాయితో పాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మెగావత్ సైదా కలిసి గ్రామంలోని పాఠశాల వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. స్కూల్ పక్కనే వాగు ప్రవహిస్తుండటంతో అందులో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వాగు మధ్యలో గుంతలు ఉండటంతో నీటిలో ఆడుకుంటూ వెళ్లిన సాయి, హరిలాల్ మునిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన మెగావత్ సైదా గ్రామంలోకి వెళ్లి వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులకు తెలిపాడు. వారు వచ్చి వాగులో గాలించగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో హరిలాల్ మృతిచెందాడు. మరో బాలుడు సాయి పరిస్థితి విషమంగా మారడంతో మొదటగా మిర్యాలగూడ, అక్కడినుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెసింది. సొమ్మసిల్లిన తల్లిదండ్రులు అప్పటివరకు తమ కళ్ల ముందే ఆటలాడుకున్న ఇద్దరు కుమారుల్లో ఒకరు మృత్యుఒడికి చేరగా.. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలు బాదుకుని రోదిస్తూ సోమ్మసిల్లి పడిపోయారు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఈ విషయం తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. వాగుకు రిటర్నింగ్ వాల్ కట్టి ఉంటే.. ఊరు మధ్య నుంచే ప్రవహిస్తున్న ఇదే వాగులో గతంలో అదే గ్రామానికి చెందిన చిన్నారులు ఇద్దరు మృతిచెందారు. ఈ గ్రామ పంచాయతీని స్థానిక జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ దత్తత తీసుకుని వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రిటర్నింగ్ వాల్‌తో పాటు, వంతెన నిర్మాణానికి రూ.2.70 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అధికారులు పంపిన నివేదికకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాగుకు రిటర్నింగ్ వాల్, వంతెన నిర్మించి ఉంటే ఇలాంటి విషాదకర సంఘటన జరిగి ఉండేది కాదని తండావాసులు పేర్కొంటున్నారు. -
ట్రాక్టర్లనే టార్గెట్‌గా..
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గుంటురు జిల్లా పిడుగురాళ్లలోని మారుతినగర్‌కు చెందిన వేముల శంకర్, కాకుమాను మండలం వల్లూరుకు చెందిన పత్తిపాటి గోపికృష్ణ, పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్‌కు చెందిన నేలటూరి ప్రకాష్, దారివేముల ఏసుబాబు, ప్రకాశం జిల్లా ముల్లమూర్ మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన బాలకోటిరెడ్డి స్నేహితులు. వీరంతా జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. పగలు రెక్కీ.. రాత్రి వేళ చోరీలు ఈ ముఠా సభ్యులు కేవలం ట్రాక్టర్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. జనావా సాలు తక్కువగా ఉన్న పదేశాలను ఎంచుకుని పగలు రెక్కీ నిర్వహించారు. రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి ట్రాక్టర్లను అపహరించుకుని వెళ్తున్నాంటారు. ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో విక్రయించుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు. ఈ ముఠాపై ఉమ్మడి రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. పట్టుబడ్డారు ఇలా.. పెద్దఅడిశర్లపల్లి మండలం దుబ్బాతండాకు చెందిన రమావత్ మోహన్ గత మార్చి 21న తన ట్రాక్టర్‌ను ఇంటిఎదుట నిలిపి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ ట్రాక్టర్‌ను అపహరించుకుపోయారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం మండలంలోని రంగారెడ్డిగూడెం స్టేజి వద్ద ఎస్ఐ గోపాల్‌రావు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి నాలుగు ట్రాక్టర్లు, నాలుగు ట్రాలీలు, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన కొండమల్లేపల్లి సీఐ పరుశురాం, గుడిపల్లి ఎస్ఐ గోపాల్‌రావు, కొండమల్లేపల్లి ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది అన్నిమల్ల శ్రీను, హేమునాయక్, గణేశ్‌లను డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అభినందించారు. -
క్షుద్రపూజల కలకలం..
నల్లగొండ,చిట్యాల : చిట్యాల పరిధిలో శుక్రవారం ఇద్దరు వ్వక్తులు క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని సుందరయ్యనగర్, సంజీవయ్యనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టణ శివారులోని సుందరయ్యనగర్ సమీపంలో రావి చెట్టు వద్ద క్షుద్రపూజలు నిర్వహిస్తుండగా స్థానికులు చూసి వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై..
మూడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలకు స్థానికులు రావడంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఏమీ తెలియనట్టు దొంగలు దాడి చేశారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు.. అతడి ప్రవర్తనలో మార్పును గమనించి పోలీసులు లోతుగా విచారించడంతో అసలు గుట్టు బయటపడగా.. చివరకు కటకటాల పాలయ్యాడు. నల్లగొండ ,చౌటుప్పల్ (మునుగోడు) : వలిగొండ మండలం కమ్మగూడెం ప్రాంతంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మహిళపై జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని బుధవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 09వ వార్డుకు చెందిన నర్సింగోజు వీరాచారి(35), అదే వార్డుకు చెందిన బైరు రాణి(35)లు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రాణికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. కుమార్తె మేడ్చల్ జిల్లా కీసరలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతోంది. ఈ నెల 07న కూతురు వద్దకు వెళ్లింది. 8న గురుకులంలో జరిగే పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉందని ప్రియుడైన వీరాచారికి హైదరాబాద్ నుంచి ఫోన్లో సమాచారం ఇవ్వగా అంగీకరించాడు. తాను బైకుపై సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లికి వస్తాను, నీవు హైదరాబాద్ నుంచి బస్సులో అక్కడికి రావాలని సూచించాడు. ఆ ప్రకారంగా రాణి 07న రాత్రి 10గంటలకు నార్కట్‌పల్లిలో బస్సు దిగింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన వీరాచారి ఆమెను బైకుపై తీసుకెళ్లాడు. చిట్యాల వద్ద ఆగి టిఫిన్ చేసి బయలుదేరారు. మార్గమధ్యలో హత్య చేసేందుకు కుట్ర రాణి ఇతరులతోనూ సఖ్యతగా మెలుగుతోందని వీరాచారి అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా కీసరకు వెళ్లే ప్రయాణాన్ని ఆసరగా చేసుకున్నాడు. ముందస్తుగానే పతకం వేసుకున్న వీరాచారి తన వెంట చిన్నపాటి కత్తులు తెచ్చుకున్నాడు. చిట్యాల నుంచి బయలుదేరాక అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కమ్మగూడెం వద్ద రోడ్డు పక్కన బైకు ఆపి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ఘర్షణ తలెత్తింది. అదే కోపంలో తన వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతులో, కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంత మంది వ్యక్తులు అక్కడికి చేరుకునే లోపే పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రాణిని ఆస్పత్రికి తరలించారు. దొంగలు దాడి చేశారని.. వీరాచారి తెల్లవారుజామున పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు తమ బైకును ఆపి కత్తులతో దాడి చేసి తన భార్య బంగారు నగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటన, వీరాచారి ఫిర్యాదుకు తేడా ఉండడంతో అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో బుధవారం నిందితుడు నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద సంచరిస్తుండగా ఏసీపీ సత్తయ్య అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రిమాండ్ నిమిత్తం అతన్ని రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ ఏవీరంగ, వలిగొండ ఎస్సై శివనాగప్రసాద్ ఉన్నారు. -
ప్రియుడికి పెళ్లి కావడంతో ఎడబాటు..
పెళ్లి కాని యువకుడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరేళ్లుగా ఇద్దరు సహజీవనం చేశారు. రెండేళ్ల క్రితం ఆ యువకుడికి మరో యువతితో వివాహం కావడంతో వీరి బంధానికి తెరపడింది. అలా కొంత కాలంగా ఇద్దరూ దూరంగానే ఉన్నారు. కానీ గతంలో ఉన్న సంబంధాన్ని తిరిగి కొనసాగించాలనే ఆలోచనతో ఆ ప్రియుడు కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆవేశానికి లోనై చివరకు ఆమెను మట్టుబెట్టాడు. నల్లగొండ,చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో ఈ నెల 9వ తేదీన చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీనిఇ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మీసాల జయసుధ(34) టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. మల్కాపురం గ్రామానికి చెంది ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న మీసాల శేఖర్‌ను 12ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. శేఖర్‌కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమెతోనూ కాపురం చేశాడు. వీరికి చరణ్, సిద్దు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరి నడుమ మనస్పర్థలు రావడంతో 9ఏళ్ల క్రితం విడిపోయారు. దీంతో జయసుధ సొంత ఊరైన కొయ్యలగూడెంలో ఇంటిని అద్దెకు తీసుకొని టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆరేళ్లపాటు సఖ్యతగా.. జయసుధ కొయ్యలగూడెంలో ఊదరి రామచంద్రం ఇంట్లో అద్దెకు ఉంటున్న సమయంలో పక్కింట్లో ఉండే ఊదరి రమేష్ పరిచయమయ్యాడు. అవివాహితుడైన అతనితో ఆరు సంవత్సరాల పాటు వివాహేతర సంబంధం కొనసాగించింది. తాపి మేస్త్రీగా పని చేసే రమేష్ తాను పెళ్లి చేసుకునేంత వరకు జయసుధతో వివాహేతర సంబంధాన్ని యథావిథిగా కొనసాగించాడు. ప్రియుడికి వివాహం కావడంతో.. జయసుధతో వివాహేతర బంధం కొనసాగుతుండగానే రమేష్ రెండేళ్ల క్రితం చండూరు మండలం తేరట్పల్లి గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనతో సహజీవనం చేస్తున్న సమయంలో తాను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నీతోనే జీవిస్తానంటూ రమేష్ చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకోవడంతో జయసుధ ఆగ్రహించింది. అంతటితో ఆగకుండా ఇంటికి వెళ్లి అతని భార్యకు విషయం చెప్పి గొడవపడింది. అప్పటి నుంచి ఇద్దరి నడుమ వివాహేతర సంబంధం తెగిపోయింది. ఇదే సమయంలో రమేష్, అతని భార్య నడుమ గొడవ జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిందని.. అటు భార్య, ఇటు ప్రియురాలు రమేష్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో జయసుధతో తిరిగి సఖ్యతగా మెలిగగేందుకు రమేష్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల జయసుధ కొయ్యలగూడెం నుంచి పక్కనే ఉన్న ఎల్లంబావి గ్రామానికి ఇంటిని మార్చింది. అందులో భాగంగా రమేష్ ఈ నెల 05, 06, 07 తేదీల్లో జయసుధ ఇంటికి వెళ్లాడు. మాట్లాడే క్రమంలో ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. అదే క్రమంలో 9న సైతం అదే మాదిరిగా ఇంట్లోకి వెళ్లాడు. పాత విషయాలు మాట్లాడుకునే సమయంలో ఇద్దరి నడుమ ఘర్షణ జరిగింది. ఆ క్రమంలోనే పక్కనే ఉన్న ఫైజామాతో మెడకు బిగించి జయసుధను హత్య చేశాడు. నిందితుడు ఎలా చిక్కాడంటే... జయసుధ ఎల్లంబావిలోని మాచర్ల సుధాకర్ ఇంట్లో అద్దెకు ఉంటుంది. సుధాకర్ తన ఇంటి వెనుకనే మరో ఇంటిని నిర్మించుకుంటున్నాడు. తాపి మేస్త్రీగా ఊదరి రమేష్ ఇక్కడ పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ నెల 9న మరో ఐదుగురితో కలిసి ఇంటి పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 1గంటలకు భోజన సమయంలో మద్యం సేవించి జయసుధ ఇంటికి వెళ్లాడు. ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడే చిరిగిపడి ఉన్న ఫైజామాతో మెడకు బిగించి హత్య చేశాడు. ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇంటి యజమాని అక్కడికి రావడంతో జారుకుని మేస్త్రీ పనిలో నిమగ్నమయ్యాడు. కొద్ది సేపటి తర్వాత జయసుధ కుమారుడు చరణ్ ఇంట్లోకి వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే రమేష్ ఇంట్లోకి వెళ్లిపోవడం, మధ్యాహ్నం ఇంటి నిర్మాణ పనుల్లో కొంత సేపు లేకపోవడం, సాయంత్రం 4 తర్వాత పని నుంచి పరారవ్వడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆ ప్రకారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించాడు. అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ పులిజాల వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వర్రావు, ఉన్నారు. -
ఎంజీ యూనివర్శిటీ కీచక వైస్ ప్రిన్సిపల్!
సాక్షి, నల్గొండ: మహత్మగాంధీ యూనివర్శిటీ.. దేవాలయంలాంటి ఈ విద్యాలయంలో బాధ్యతగా పర్యవేక్షణ చేయాల్సిన కళాశాల వైస్ ప్రిన్సిపల్.. స్థాయి మరచి ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. అతగాడి వేధింపులు భరించలేని విద్యార్థినులు ఎస్పీకి ఫిర్యాధు చేయడంతో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ వై. పునీత్‌కుమార్.. విద్యార్థినులకు ఫోన్లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని మూడు రోజుల క్రితం బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని యూనివర్శిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకేళ్లారు. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు వైస్ ప్రిన్సిపాల్ మళ్లీ విద్యార్థినులకు అసభ్యకర మెసెజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. దీంతో భరించలేక విద్యార్థులు స్థానిక ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో బాధితు విద్యార్థినులు వైస్ ప్రిన్సిపల్‌ను విచారణ జరిపి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ఫోన్‌డేటా, మెసెజ్‌ల పరిశీలన విద్యార్థినుల ఫిర్యాధు మేరకు ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌డేటా, అతను పంపిన మెసెజ్‌లను పరిశీలించడంతో రుజువైంది. ఇక అప్పటికే నిందితుడు పరారీ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో రెండు రోజుల క్రితం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కవలలపై కీచక తండ్రి, మేనమామ అఘాయిత్యం కమిటీ ఏర్పాటు ఇంజనీరింగ్ వైఎస్ ప్రిన్సిపాల్ పునీత్ కుమార్ విద్యార్థినులను వేధిస్తున్న విషయమై యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించినట్లు ఏస్పీ రంగానాథ్ తెలిపారు. కమిటీ సభ్యుల విచారణలో తనకు అనుకూలంగా చెప్పాలని పలువురు విద్యార్థులకు ఫోన్ చేయడంతో పాటు మెసెజ్‌లు పంపినట్లు కమిటీ వెల్లడించింది. దీంతో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయమై యూనివర్శిటీ రిజీస్టార్ యాదగిరిని ఫోన్లో విచారణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందిచలేదని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఓ అధ్యాపకుడికి దేహశుద్ధి యూనివర్శిటీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గతంలో కూడా ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సదరు కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేసినట్లు వెల్లడించారు. పిల్లల బంగారు భవిష్యత్తుపై కలలు కంటున్న తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం యూనివర్శిటీలకు పంపిస్తే.. మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు అనుసరిస్తున్న తీరు బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సదరు నిందితుడు కీచక వైస్ ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి!
సాక్షి, చిట్యాల(నల్గొండ): పీఏసీఎస్ డైరెక్టర్ అభ్యర్థిపై దాడి జరిగిన ఘటన మంగళవారం రాత్రి చిట్యాలలో జరిగింది. చిట్యాల ఎస్ఐ ఎ.రాములు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పీఏసీఏస్ మూడో వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుతో డైరెక్టర్‌గా పోటీ చేస్తున్న గోధుమగడ్డ జలందర్‌రెడ్డి చిట్యాల కాంగ్రెస్ నాయకుడు చెందిన వెల్పూరి నాగిరెడ్డి తండ్రి బీంరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఐదో రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. అనంతరం భోజనం చేసిన తర్వాత రాత్రి 11గంటల సమయంలో తన ఇంటికి బైక్‌పై మరో యువకుడితో కలిసి బయలు దేరారు. స్థానిక కెనారా బ్యాంకు సమీపంలోకి రాగానే సర్వీస్ రోడ్డులో దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరో వ్యక్తి బైక్‌పై వచ్చి జలందర్‌రెడ్డి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. కింద పడడంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన జలందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య అనుచరుడైన దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరికొందరు కలిసి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరామర్శ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు గొధుమగడ్డ జలందర్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బాధితుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకుడు కంచర్ల వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. -
దారుణం: కర్రలతో కొట్టి.. బండరాయితో మోది!
సాక్షి, మునుగోడు(నల్గొండ) : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఓ యువతిపై తల్లిదండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎల్గలగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరిపారి బుచ్చయ్య లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమారైలు, కుమారుడు సంతానం. అయితే ముగ్గురు కుమార్తెలతోపాటు కుమారుడి వివాహాలు చేశారు. చిన్న కుమారై కవిత రెండేళ్ల క్రితం ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యను పూర్తి చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని, లేదంటే ప్రధాన రహదారి వెంట ఉన్న భూమిని తన పేర పట్టా చేయాలని ఏడాది కాలంగా తల్లితండ్రులను ఒత్తిడి చేస్తోంది. అయినా ఆ కుటుంబ సభ్యులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పలుమార్లు కుటుంబ సభ్యులకు కౌన్సింగ్ ఇచ్చారు. దీంతో కవితను మట్టుబెట్టాలని తల్లిదండ్రులతో పాటు సోదరుడు గోవర్ధన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కవిత గాఢ నిద్రలో ఉండగా కర్రలతో దాడి చేసి బండరాయితో బలంగా మోదారు. దీంతో కవిత చనిపోయిందని భావించి ఇంటి పక్కనే ఉన్న బాట ముళ్ల పొదలల్లో పడేశారు. దానిని గమనించిన పక్కంటి వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన కవితను న ల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రజినీకర్ తెలిపారు. -
ఠాణాలోనే బావ గొంతు కోశాడు
చివ్వెంల/సూర్యాపేట క్రైం: కుటుంబ తగాదా కేసులో కౌన్సెలింగ్ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బావపై బావమరిది దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మండల పరిధిలోని జగన్నాయక్ తండాకు చెందిన రమావత్ దేవేందర్, శ్వేత దంపతులు. రెండు నెలల క్రితం భర్తతో గొడవ పడిన శ్వేత.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భగత్‌సింగ్ నగర్లో ఉంటున్న శ్వేత వద్దకు వచ్చిన దేవేందర్, పెద్దలకు నచ్చజెప్పి ఆమెను జగన్నాయక్ తండాకు తీసుకెళ్లాడు. కాగా, ఆదివారం సాయంత్రం మళ్లీ భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో శ్వేత డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత శ్వేతను బంధువులు వచ్చి తిరిగి తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం వారు దేవేందర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు దేవేందర్‌ను కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు రమ్మనడంతో వచ్చాడు. ఆ సమయంలో ఎస్ఐ, సిబ్బందితో కలసి తనిఖీల నిమిత్తం బయటకు వెళ్లారు. స్టేషన్లో ఉన్న శ్వేత, దేవేందర్ల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా దేవేందర్‌పై అతని బావమరిది రఘురాం దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు దేవేందర్‌ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
రాత్రి ఫోన్ రావడంతో వెళ్లాడు.. తిరిగి రాలేదు
యాదాద్రి భువనగిరి, రాజాపేట (ఆలేరు) : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జెల్ల పెద్దోళ్లశ్రీనివాస్, వసంతకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు ఉదయ్‌కిరణ్ (19) రాజాపేటలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ తరుణంలో తమ వ్యవసాయ బావివద్ద ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇతరుల సాయంతో కిందికి దించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఉదయ్‌కిరణ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హాజీపూర్ కేసు: ‘పోలీసులే అలా సృష్టించారు’
సాక్షి, నల్లగొండ :ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో హాజీపూర్ కేసు విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ కేసులోని నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 26న మనీషా కేసులో నిందితుడి వాదన నమోదు చేయగా. ఈ రోజు ఉదయం శ్రావణి, మధ్యాహ్నం కల్పన కేసులో నిందితుడి వాదన న్యాయస్థానం వినగా.. శ్రావణి కేసులో 44 మంది, కల్పన కేసులో 30 మంది సాక్షుల వాదనను నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. అనంతరం అనంతరం న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడగ్గా.. సెక్షన్ 313 కింద నిందితుడు తన వాదనను వినిపించాడు. తనకేం తెలియదని.. అంత అబద్ధమంటూ నిందితుడు పదే పదే చెప్పాడు. బైక్ పైన శ్రావణిని ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారని ప్రశ్నించగా తనకు అసలు బైక్ డ్రైవింగ్ రాదని చెప్పాడు. శ్రావణి దుస్తులపై తన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారని అడగ్గా.. పోలీసులే అలా సృష్టించారని నిందితుడు సమాధానమిచ్చాడు. అసలు కల్పన ఏవరో కూడా తెలియదని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని వాదించాడు. ఇంతక ముందు ఏ పని చేశావు.. ఎక్కడ పనిచేశావు.. యజమాని ఎవరు అని న్యాయమూర్తి అడగ్గా నిందితుడు వివరాలు చెప్పలేకపోయాడు. (హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’) అలాగే ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై తన వేలి ముద్రలు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పోలీసులే బలవంతంగా పట్టించారని పేర్కొన్నాడు. తనను కొట్టి ఒప్పించారని, తన అమ్మ, నాన్నలను తీసుకు రావాలనిన్యాయమూర్తిని కోరాడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. మరి కోర్టుకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరికి తదుపరి విచారణ 6వ తేదికి వాయిదా వేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిననట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా కల్పన కేసులో ఇంకా వాదన కొనసాగుతుంది. చదవండి : లేదు.. తెలియదు.. కాదు! -
పగలే దోపిడీకి యత్నం..!
సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : పట్టపగలే ఇద్దరు యువకులు దారి దోపిడీకి యత్నించారు. బైక్ ను వెంబడించి మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించేందుకు ప్రయత్నించారు. బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు పారిపోతుండగా వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బాలగోని మల్లేష్, అనిత దంపతులు ఉదయం పని నిమిత్తం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వెళ్లారు. అక్కడ పని ముగగిసిన అనంతరం తిరిగి బైక్‌పై కొత్తగూడెం గ్రామానికి వస్తున్నారు. వీరిని ఇద్దరు యువకులు చిమిర్యాల గ్రామం నుంచి బైక్‌పై వెంబడించారు. మూలమలుపు వద్దకు రాగానే.. మల్లేష్, అనిత దంపతులు సంస్థాన్ నారాయణపురం శివారు దాటి కొత్తగూడెం గ్రామ పరిధిలోని మూలమలుపు వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారినే వెంబడిస్తున్న యువకుల్లో ఒకరు అనిత మెడలో ఉన్న పుస్తలతాడును లాగాడు. అది తెగి అనిత దుస్తుల్లో పడింది. వెంటనే మల్లేష్, అనిత కేకలు వేస్తూ దుండగుల బైక్‌ను వెంబడించారు. వీరి కేకలు విన్న కొత్తగూడెం గ్రామానికి చెందిన యువకులు మారగోని శేఖర్, కొడూరి శ్రీశైలంలు దుండగులు బైక్‌ను వెంబడించారు. పుట్టపాక గ్రామా చౌరస్తాలో మరో వాహనం ఎదురుగా రావడంతో దుండగులు అదుపుతప్పి కిందపడిపోయారు. వెంటనే, శేఖర్, మల్లేష్లు వారిని పట్టుకున్నారు. దుండగుల బైక్ నుంచి కత్తి పడటంతో అక్కడే ఉన్న కొంత మంది గ్రామాస్తులు వారిని చితకబాదారు. అనంతరం సమాచారమిచ్చి పోలీసులకు అప్పగించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు చౌటుప్పుల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన శంకర్, వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన వెంకటనర్సింహగా అనుమానిస్తున్నారు. చిమిర్యాలలో చైన్ స్నాచింగ్‌కు వీరే పాల్పడ్డారని అనుమానిస్తూన్నారు. బైక్ కూడా చోరీ చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నక్సలైట్లమంటూ బెదిరించి మాజీ కౌన్సిలర్ ఇంట్లో...
సాక్షి, మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు. ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లోకి చొరబడి మారణా యుధాలతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఈదులగూడ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి దంపతులు రాత్రి ఇంటి తలుపులు పెట్టి బెడ్రూంలో నిద్రపోయారు. రాత్రి 12:30 గంటల సమయంలో నలుగురు దుండగులు హాల్ తలుపుల తాళాన్ని ఇనుపరాడ్డు, జాకీ సహాయంతో తొలగించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూంలోకి చొరబడ్డారు. బెడ్రూం తలుపు తీసిన వెంటనే చప్పుడు కావడంతో నర్సిరెడ్డి నిద్రలేచాడు. దండగులు కత్తులతో బెది రిస్తూ నర్సిరెడ్డిని లుంగీతో కట్టేశారు. మాజీ కౌన్సిలర్ మెడపై కత్తిపెట్టి.. ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్న మాజీ కౌన్సిలర్ సందీప మెడపై దుండగులు కత్తిపెట్టారు. ‘‘ చెల్లెమ్మా మేము నక్సలైట్లం.. మిమ్ములను ఏమీ చేయం.. వెంటనే మీ వద్ద ఉన్న బంగారం డబ్బులు ఇవ్వండి.. లేదంటే మిమ్ములను చంపేస్తా’’ అంటూ బెదిరించారు. దంపతుల రెండు సెల్ఫోన్లు తీసుకుని స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన ముదిరెడ్డి సందీప కబ్ బోర్డులోని నగదు, బంగారం దుండగులకు చూపించింది. అందులో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదుతో పాటు ఆమె మెడలోని తాళిబొట్టు, చెవికమ్మలను తీసుకున్నారు. అరగంట తర్వాతే బయటికి రావాలని లేకుంటే మా వాళ్లు మిమ్ములను చంపేస్తారని బెదిరిస్తూ దుండగులు అక్కడినుంచి ఉడాయించారు. కాసేపటికి తేరుకున్న సందీప తన భర్త నర్సిరెడ్డి చేతి కట్లను విప్పేసింది. వెంటనే బయటికి వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న వారిని లేపి దోపిడీ విషయాన్ని వివరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పోలీసులకు, బంధువులకు సమాచారం చేరవేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దోపిడీ విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు, టూటౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ పరమేష్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు. నర్సి రెడ్డి ఇంటి నుంచి పరుగెత్తిన డాగ్‌స్క్వాడ్ గుంటూరురోడ్డు వెపునకు వెళ్లి ఆగింది. కాగా ఈ దోపిడీలో సుమారు ఎనిమిది మంది పాల్గొని ఉంటారని పోలీ సులు అనుమానిస్తున్నారు. ఇంటిలోపలికి వచ్చిన నలుగురు దుండగుల్లో ముగ్గురు వ్యక్తులు లూజర్స్ పాయింట్, టీషర్టులు ధరించి ఉండగా ఒకరు లుంగీ షర్టు ధరించి మాస్కులు వేసుకుని, తెలుగులోనే మాట్లాడారని బాధితులు తెలిపారు. దుండగులు కరుడు కట్టిన నేరస్తులుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇంటి డోరు తొలగించిన రాడ్డును పూలచెట్లల్లో వదిలి వెళ్లారు. మాజీ కౌన్సిలర్ ఇంట్లో దోపిడీ విషయం తెలుసుకుని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయాలని కోరారు. దుండగులను పట్టుకుంటాం : ఎస్పీ మాజీ కౌన్సిలర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన దుండగులకు త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీప, నర్సిరెడ్డి ఇంటిని పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
వారిపై రాచకొండ సీపీ శాఖ పరమైన చర్యలు
సాక్షి, యాదాద్రి: విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కొరడా ఝుళిపించారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్లను నిందితులకు సహకరించారని.. భూ వివాదాలు, వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే వివిధ కారణాలు, సాధారణ బదిలీల్లో పలువురికి శుక్రవారం స్థానచలనం కలిగింది. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారని.. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్న పేలుడు పదార్థాల కేసులో నిందితుల పేర్లు మార్చేందుకు, మరో నిందితుడు సోమ రామకృష్ణకు ముందస్తు బెయిల్ రావడానికి సహకరించేందుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి మండలం కూనూరు వద్ద ఈ నెల 18న రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్లను ఎస్ఓటీ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీస్‌లు పట్టుకున్నారు. ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం, బొలేరో వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఆలేరుకు చెందిన రాంపల్లి విక్రం, బొందుగులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి, భువనగిరికి చెందిన సోమ రామకృష్ణలతోపాటు మరో ఆరుగురిని కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పేలుడు పదార్థాల వాహనాలతోపాటు నిందితులను ఎస్ఓటీ పోలీసులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం వాహనాల్లోని సామగ్రిని సీఐ పరిశీలించగా జిలిటిన్‌స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు తేలింది. లారీలో పేలుడు సామగ్రిని తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరిని సీఐ అదుపులోకి తీసుకున్నారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సీఐ అంతకు ముందే లారీ పట్టుబడ్డ విషయం ట్రాన్స్‌ఫోర్టు యాజమానికి ఓహెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర వేశారు. దీంతో సంబంధిత ముగ్గురు ఓనర్లు సీఐతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కేసులో యాజమాన్యానికి సహకరించేందుకు సీఐ నిబంధనలకు విరుద్ధంగా భువనగిరి స్టేషన్లో కాకుండా పరిధి దాటి తనకు అనుకూలంగా ఉన్న బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ అధికారి ఫిర్యాదుతో.. పెద్ద ఎత్తున పట్టుబడ్డ పేలుడు పదార్థాల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా, వారికి సహకరిస్తున్నారని ఎస్ఓటీ అధికారి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. భువనగిరిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా బీబీనగర్‌లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమోనియం నైట్రేట్ సరఫరా చేస్తున్న సోమ రామకృష్ణతోపాటు మరికొందరు నిందితుల పేర్లు కేసులో లేకుండా తప్పించాడన్న కోణంలో ఒక వైపు, నాన్‌బెయిలబుల్ కేసులో రామకృష్ణను అరెస్ట్ చేయాల్సి ఉండగా ముందస్తు బెయిల్ తీసుకొమ్మని నిందితునికి సీఐ సలహా ఇచ్చి అరెస్ట్ చేయకుండా జాప్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటిలిజెన్స్ విచారణలో సైతం ముందస్తు బెయిల్ కోసం సీఐ సహకరిస్తున్నాడన్న విషయం విచారణ అధికారులు గుర్తించి సీపీకి నివేదిక ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా ఏడాది క్రితం సీఐగా ఇక్కడికి వచ్చిన సురేందర్‌రెడ్డి గతంలో భువనగిరి రూరల్ ఎస్ఐగా పని చేస్తూ వివాదాల నేపధ్యంతో బదిలీపై వెళ్లారు. మరోవైపు సురేందర్‌రెడ్డికి హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్ సన్నిహితుడిగా ఉన్నాడు. దఫేదార్‌గా కరుణాకర్ చేసిన వసూళ్లపై ఫిర్యాదు అందడంతో సీపీకి అటాచ్ చేయగా 6నెలల క్రితం ఇదే స్టేషన్లో విధుల్లో చేరాడు. కాగా ఇదే సంవత్సరం మార్చి 10న అప్పటి భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నలు సిట్ పరి«ధిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెందిన భూముల రిజిస్ట్రేషన్ కేసు నీరుగార్చారని అటాచ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆలేరు ఎస్ఐపై.. భూ వివాదాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ స్పందిస్తూ శుక్రవారం ఆయనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారుల బదిలీ శుక్రవారం జిల్లాలో పలువురు పోలీసులు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు బదిలీ కాగా ఇ క్కడికి మహబూబ్‌నగర్ జిల్లానుంచి పాండురంగారెడ్డి వచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్ఐ తుర్కపల్లికి, తుర్కపల్లి ఎస్ఐ వెంకటయ్య ఆత్మకూర్(ఎం)కు, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌ను ఆలేరుకు బదిలీ చేశారు. నిందితులకు సహకరించారనే చర్యలు పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారనే సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశాం. జిలెటిన్ స్టిక్, డిటోనేటర్లు, అమోనియం అక్రమ రవాణాలో నిందితులకు ముందస్తు బెయిల్‌కు సహకరించారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది. –నారాయణరెడ్డి, డీసీపీ -
‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్’
సాక్షి, బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలికలపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. అక్టోబర్ నుంచి హాజీపూర్ కేసు కోర్టులో విచారణ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే.. నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది. – దాసరి జంగారెడ్డి, హాజీపూర్ బతకనివ్వొద్దు జైలుకు వెళ్లయినా సరే శ్రీనివాస్ రెడ్డిని చంపాలనే కసి ఉంది. ముగ్గురు పిల్లలను పాడు చేసిన వాళ్ల పానాలు తిన్న శ్రీనివాస్ రెడ్డిని జైలుకు వెళ్లిన సరే చంపేయాలన్నా కసిగా ఉంది. ఇలాంటి రాక్షసులను భూమి మీద బతకనివ్వొద్దు. శ్రీని వాస్ రెడ్డి దారుణాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. వారికి ఉన్న ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించాలి. – గోండ్రు జయమ్మ హాజీపూర్ రక్షణ కరువైంది.. హాజీపూర్‌లో జరిగిన ఘోరాలు మరవలేకపోతున్నాం. తప్పు చేసినోన్ని ఎన్ని రోజులు మేపుతారు. నెలలు గడుస్తున్నా నేటికీ భయంగానే ఉంది. ఎక్కడ చూసినా ఆడోళ్లకు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాస్ రెడ్డికి శిక్ష పడితేనే కొంత ఉపశమనం కలుగుతుంది. సర్కారోళ్లు నేరస్తుల పట్ల కఠినంగా ఉండకనే కొత్తోళ్లు తయారవుతున్నారు. – పరిధ దుర్గమ్మ, హాజీపూర్ ప్రజలకు అప్పగిస్తే బాగుండు.. ఆడ పిల్లల ఉసురు తీసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని సంఘటన జరిగినప్పడే ప్రజలకు అప్పగిస్తే బాగుండే. ఊరోళ్లే సరైన శిక్ష వేసేటోళ్లు. జైళ్లలో కూసపెట్టి సాదుడు ఎందుకు ఇదివరకే సావ కొడితే ఆడోళ్ల దిక్కు చూసేటోళ్లు ఉండకపోదురు. ప్రజలందరికీ ఎప్పటికి గుర్తుండే శిక్షపడితే తప్పు చేసేటోళ్లకు సిగ్గొస్తది. – దాసరి చంద్రారెడ్డి, హాజీపూర్ ఉరిశిక్షే సరైంది నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షే సరైంది. అతని పేరు వింటేనే ఆడపిల్లలు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. గ్రామంతో పాటు మండల ప్రజలందరూ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించాలని కోరుతున్నారు. అతనికి పడిన శిక్షతోనే చిన్నారుల ఆత్మలు శాంతిస్తాయి. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ విచారణలో వేగం పెరిగింది హాజీపూర్ బాలి కల వరుస హత్య ల కేసులో విచారణలో వేగం పెరి గింది. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరి గింది. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఏసీపీ భుజంగరావు, హాజీపూర్ బాలికల హత్య కేసుల విచారణ అధికారి -
బాలికపై మారు తండ్రి లైంగికదాడి
సాక్షి, సూర్యాపేట: హైదరాబాద్‌లో దిశ హత్యాచార ఘటన మరువకముందే సూర్యాపేట పట్టణంలో మరో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూ సుకుపోయిన ఓ మారుతండ్రి కూతురులాంటి బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. చివ్వెంల మండలం మున్యానాయక్‌తండాకు చెందిన లారీ డ్రైవర్ బానోతు శ్రీను పేటలోని గొల్లబజారుకు చెందిన వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 ఏళ్ల కూతురు, ఇద్దరు కుమారుడు ఉన్నారు. బాలికపై అతడి కన్నుపడింది. ఇంకేముంది భార్య కూలిపనులకు పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే బాలికను లొంగదీసుకున్నాడు. రెండేళ్లుగా లైంగికదాడికి పాల్ప డుతున్నాడు. విషయం బయటికి చెబితే తల్లితో పాటు తమ్ముళ్లను చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఫిర్యాదుమేరకు గురువారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
నల్లగొండ క్రైం: నల్లగొండ సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపాడు. అనంతరం బస్సు ఇంజెన్ వైర్ల షార్ట్ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు యత్నించాడు. ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా వస్తుండటంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక అధికారులు మంటలను చల్లార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
సాక్షి, నకిరేకల్: ఆ.. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు.. బాల్యం నుంచి యుక్త వయసు వరకు కలిసే పెరిగారు.. ఎంతో కలివిడిగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు.. వారిని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. చివరకు ఇద్దరినీ ఒకేసారి మృత్యుఒడికి చేర్చింది. ఈ విషాదకర ఘటన చిట్యాల వాసులను ఎంతో కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమార్తి శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన దేవిరెడ్డి మహేందర్‌రెడ్డి(31), ఊట్కూరి శ్రవణ్‌కుమార్‌రెడ్డి(27)లు స్నేహితులు. వీరిలో మహేందర్‌రెడ్డి చిట్యాలలోనే ఎయిర్‌టేల్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్‌గా, శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఐడియా డిస్ట్రిబ్యూటర్ వద్ద కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ తమ పనుల నిమిత్తం బైక్‌పై శనివారం నల్లగొండకు వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని రాత్రి తిరుగుప్రయానమయ్యారు. మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాలు మార్గమధ్యలో మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన గల కేఎంసీఎల్ పరిశ్రమ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను సిమెంటు లోడుతో వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలు ఆ లారీ చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ అవివాహితులు. సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ రవి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇద్దరు యువకుడు మృత్యువాత పడడంతో చిట్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కి‘లేడి’ అరెస్టు
సాక్షి భువనగిరిఅర్బన్(నల్గొండ) : బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా భూదవారిపేటకు చెందిన అక్షింతల సంధ్య అలియాస్ దివ్య టైలరింగ్ పనిచేస్తు జీవనం సాగిచేంది. టైలరింగ్‌లో డబ్బులు అనుకున్నంతగా రాకోపోవడంతో సంతృప్తి చెందలేదు. అనంతపూర్ జిల్లాకు చెందిన గంట రామస్వామి బ్యాచ్‌లో చేరి 2010 నుంచి 2016 వరకు చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికురాలిగా నటిస్తు అసలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు అభరణాలను అపహరించేది. ఆమె తన ముఠా సభ్యులతో కలిసి భువనగిరిటౌన్, రూరల్, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు ములుగు, దేవరకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడింది. గతంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసి నల్లగొండ జైలు పంపారు. బెయిల్‌పై తిరిగి బయటికి వచ్చింది. తన గ్రామంలో ఉన్న లలితతో స్నేహం చేసింది. ఇద్దరు కలిసి రద్దీగా ఉండే బస్సుల్లో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి హన్మకొండకు వెళ్తున్న రద్దీగా ఉన్న బస్సును ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న జి.సూర్యమ్మ, టి. కృష్ణవేణిల పక్కన ప్రయాణికులుగా కూర్చున్నారు. బస్సు భువనగిరి దాటిన తర్వాత బస్సులో రద్దీగా ఉండటంతో సంధ్య సూర్యమ్మ బ్యాగులో ఉన్న 4 గ్రాముల బంగారు చెవి దిద్దులు, లలిత జి.కృష్ణవేణికి చెందిన బ్యాగులో నుంచి నగదును అపహరించారు. వెంటనే బస్సును రాయగిరి వద్ద హడవీడిగా నిలిపి వేసి దిగారు. గమనించిన సూర్యమ్మ, కృష్ణవేణిలు తమ బ్యాగులను చెక్ చేసుకోగా బంగారం, నగదు కనబడలేదు. వెంటనే వారిని పట్టుకోమని తోటి ప్రయాణికులకు చెప్పడంతో సంధ్యను పట్టుకొగా, లలిత పారిపోయింది. అనంతరం సంధ్యను ప్రయాణికులు రూరల్ పోలీస్‌లకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించింది. ఆమెనుంచి చెవి దిమ్మెలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ సురేందర్‌రెడ్డిని, ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్‌ను, సిబ్బందిని అభినందించారు. -
పెప్పర్ స్ప్రేతో చోరీ చేసే దంపతుల అరెస్ట్
సాక్షి, నల్లగొండ : పెప్పర్ స్ప్రేతో చోరీలకు పాల్పడుతున్న దంపతులను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం రూ. 1.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీ సంఘటన వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి గురువారం నల్లగొండ రూరల్ పోలీస్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని తానే రోడ్డు మజీద్ ఈ ఖహీర్, కేజీ హల్లీం, కడుగొండనహల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మహ్మద్ ఫిరోజ్ అనేక చోరీలకు పాల్పడటంతో బెంగళూరులో జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు పట్టుబడుతున్నానని భావించి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చాంద్రాయణగుట్ట పరిధిలో అనేక చోరీలకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పీడీ యాక్ట్ కేసులో వరంగల్ జైలులో శిక్ష అనుభవించాడు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి లీగల్ ఫంక్షన్ హల్ సుభాన్ కాలనీలో నివాసం ఉంటూ మహ్మద్ సారా ఫాతీమాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు గృహిణిగా ఉన్న ఫాతిమా ఆ తరువాత భర్తతో కలిసి దొంగతనాలకు పాల్పడింది. పీడీ యాక్ట్ కేసులో ఫిరోజ్ చర్లపల్లి జైలు నుంచి 2015 ఏప్రిల్‌లో విడుదలైన తరువాత నుంచి భార్య భర్తలు ఇద్దరు కలిసి చోరీలు చేశారు. చోరీ చేసేది ఇలా... తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు చోరీ చేస్తారు. ద్విచక్రం వాహనంపై చిన్న పిల్లాడితో కలిసి రెక్కీ నిర్వహిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబం అనుకోవాలనే ఉద్దేశంతో రెక్కీ చేసి తాళం వేసిన ఇళ్లలోకి భర్త ఫిరోజ్ వెళ్లి చోరీ చేస్తాడు. భార్య ఫాతిమా చోరీ ఇంటి సమీపంలో ఇంటి వైపు ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ భర్తకు సహకరిస్తుంది. చోరీ ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వారు ఇంట్లోకి వెళ్లకుండా మాటల్లో పెట్టి ఏదో అడ్రెస్ కావాలని పలాన వ్యక్తి గురించి అడుగుతూ వారి ఇళ్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఈలోపు భర్త అంతా సర్దుకొని భార్య వద్దకు వచ్చి బైక్‌పై వెళ్లిపోతారు. చోరీకి వెళ్లినప్పుడు ఇంట్లో సభ్యులు ఎదురు తిరుగుతే వారిపై పెప్పర్ స్ప్రే చేసి బంగారాన్ని దోచుకుంటారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళలపై చోరీ చేసేందుకు అనుకూలంగా చూసుకొని మెడలో ఉన్న బంగారు చైన్ దోచుళ్తారు. డోర్ తాళాన్ని తొలిగించేందుకు టూల్ కిట్‌ను బండి వెంట పెట్టుకుంటారు. నాగర్‌కర్నూల్, జడ్చెర్ల, హైదరాబాద్ ప్రాంతాల్లో చోరీలు చేశారు. ఇప్పటి వరకు నల్లగొండ పట్టణ కేంద్రంలోనే 9 దొంగతనాలు చేశారు. ఇలా చిక్కారు.. పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల మర్రిగూడ ఎల్లమ్మగుడి వెనుకాల నివాసం ఉండే మంచుకొండ సుధీర్ కుమార్ ఇంట్లో ఈనెల 12న చోరీకి పాల్పడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి సుధీర్ కుమార్ గుడికి వెళ్లి ఇంటికి రాగా భార్యభర్తలైన దొంగలు ఇద్దరు బీరువాను సోదిస్తున్నారు. కుటుంబసభ్యులు బిగ్గరగా కేకలు వేయడంతో దొంగలిద్దరు పారిపోయారు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి సమీపంలో దొరికిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారిస్తున్నారు. గురువారం మర్రిగూడ బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వెళ్తూ పోరిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు, చోరీకి సంబంధించిన పనిముట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసులో పురోగతి సాధించిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిని, ఏఎస్సై ఉపేందర్, షరీఫ్, యాదగిరి, శంకర్‌నాగరాజుç,Ü లీం, జ్యోతి, మాధవిలను డీఎస్పీ శాలువ కప్పి సన్మానించారు. ఈసమావేశంలో సీఐ బాషా, సీసీఎస్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి అరెస్ట్
సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎం.సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్‌చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్‌కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని గ్యాంగ్ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్‌రెడ్డి లండన్ టౌన్షిప్ పేరుతో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్‌లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. -
టీవీ మీదపడి నెలల చిన్నారి మృతి
సాక్షి, పెద్దవూర(నల్గొండ) : టీవీ మీద పడి 18నెలల చిన్నారి మరణించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ ఆలియాస్ దుర్గమ్మకు ఆరేళ్లక్రితంకనగల్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన శంకరయ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె స్మైలీ(18నెలలు). కొన్నినెలల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పద్మ తన తల్లిగారు ఊరు అయిన బట్టుగూడెం గ్రామానికి వచ్చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం కావడంతో తన ఇద్దరి పిల్లలను తల్లి మండారి ముత్యాలమ్మ వద్ద ఉంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ముత్యాలమ్మ సోమవారం పెద్ద మనుమరాలిని బడికి పంపించింది. చిన్న మనుమరాలు స్మైలి ని తన వద్దనే ఉంచుకుంది. ము త్యాలమ్మ వంట చేస్తున్న క్రమంలో స్మైలీ ఆడుకుంటూ ఇంట్లోని టీవీ వద్దకు వెళ్లి స్టాండ్‌ను లాగింది. ఆ టీవీ చిన్నారి మీదపడడంతో చెవుల నుంచి రక్తస్రావం కావడంతో చికిత్స నిమి త్తం పెద్దవూరకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందింది. చిన్నారి మరణవార్త విన్న తల్లి పద్మ హుటాహుటిన బట్టుగూడెం గ్రామానికి చేరుకుంది. ఆల్లారుముద్దుగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. -
భర్తను కత్తితో హతమార్చిన భార్య, కుమారుడు
సాక్షి, మునుగోడు: భార్య, భర్తల నడుమ ఘర్షణ ఓ ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలం పరిధిలోని కస్తాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 10వ తేదీన గ్రామంలో ముత్యాలమ్మ పండుగ జరిగింది. గ్రామానికి చెందిన యోహోవా(41) భార్య యాదమ్మ, కుమారుడు మనోజ్, తల్లి లక్ష్మమ్మ కలిసి పండుగ జరుపుకున్నారు. అదే రోజు రాత్రి అత్త లక్ష్మమ్మతో కోడలు యాదమ్మ ఘర్షణకు దిగింది. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరిన భర్త యోహోవా అమ్మ కనిపించడం లేదని భార్యను ప్రశ్నించడంతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య, కుమారుడు కలిసి కత్తితో దాడి చేశారు. దీంతో యోహోవా సృహ కోల్పోయాడు. తల్లి, కుమారుడు రాత్రి ఇంట్లోనే పడుకున్నారు. సోమవారం ఉదయాన్నే లక్ష్మమ్మ పెద్ద మనుషులతో ఇంటికి వచ్చింది. రాత్రి జరిగిన విషయంపై ఆరా తీస్తూనే, కుమారుడి గురించి అడిగింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి యోహోవా అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. స్టేషన్ ఎదుట ఆందోళన.. ఆదివారం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతుని బంధువులు మృతదేహాన్ని స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. యోహోను భార్యపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్పీ వస్తేనే ఆందోళన విరమిస్తామని సీఐ సురేష్‌కుమార్‌తో వాదనకు దిగారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని సీ ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిక్షపడేలా చర్యలు : సీఐ సురేష్ కుమార్ యోహోవా మృతికి సంబంధించిన సంఘటనపై విచారణ చేసి, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఏం జరిగిందో.. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఆందోళన చెందనవసరం లేదు. నిందితులను త్వరలో కోర్టుకు రిమాండ్ చేస్తాం. -
సహజీవనం: మరొకరితో సన్నిహితంగా ఉందనే నెపంతో..
సాక్షి, మిర్యాలగూడ: కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఓ వ్యక్తి యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగుపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వజ్రం గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒక మిల్క్ సెంటర్లో పని చేసేవాడు. అక్కడ ఓ భర్త లేని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలం తర్వాత వారిద్దరూ మిర్యాలగూడకు వచ్చి టాకారోడ్డులో నివాసముంటూ సహజీవనం చేస్తున్నారు. వజ్రం పట్టణంలోని ఎన్నెస్పీ క్యాంపులో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారు అద్దెకు ఉండే ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న నకిరేకల్‌కు చెందిన తాండు రాజు ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వజ్రం గమనించాడు. అప్పటి నుంచి ఆమె అనుమానం పెంచుకుని తరుచూ కొట్టసాగాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆ మహిళ ఇక్కడి నుంచి తన తల్లి గారి ఊరు భూదాన్‌పోచంపల్లికి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజు కారణంగానే తాను సఖ్యతగా మెలుగుతున్న మహిళ తనను విడిచి వెళ్లిపోయిందని ఇటీవల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ చేసిన సీఐ ఆ మహిళను మూడు రోజుల క్రితం పిలిపించి వివరాలు సేకరించారు. ఆ మహిళ తాను ఎవరిని వివాహం చేసుకోలేదని, ఎవరితోనూ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి తిరిగి వెళ్లిపోయింది. దీంతో తాండు రాజుపై కక్ష పెంచుకున్న బొల్లెపల్లి వజ్రం పథకం ప్రకారం రోడ్డుపై నడిచి వెళుతున్న రాజుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో వెనుకనుంచి నరికాడు. మరో సారి మరో వేటు వేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గయపడిన రాజును స్థానికులు పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండు రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు వజ్రం పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా రాజు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పోలీస్ రక్షణతో రోడ్డెక్కిన బస్సులు
నల్లగొండ రూరల్ : ఆర్టీసీ కార్మికుల నిరసన కొనసాగడంతో మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు డిపో దాటలేదు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌గా పనిచేసేందుకు వచ్చి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పూలు అందజేసి బతిమిలాడారు. వినని వారిపై దాడి చేసినట్లు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో చర్చించుకున్నారు. పోలీసులు బలవంతంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను నియమించి పోలీస్ పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించారు. దాడులు చేస్తున్నారన్న విషయం గుప్పుమనడంతో తాత్కాలికంగా పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్లు జంకారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చేవారిని అడ్డుకున్నారు. ప్రయాణికులు కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, మధ్యలోనే బస్సు నిలిపి వెళ్తే గమ్యానికి ఎలా చేరాలి అని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. డిపో నుంచి బస్సు తీసే క్రమంలో తాత్కాలిక డ్రైవర్ ఆర్టీసీ డీఎం సురేశ్‌బాబు కారును ఢీకొట్టాడు. ఆర్టీసీ కార్మికులతో కలిసిరావాలి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీ కార్మికులతో కలిసి రావాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ద్రోహం చేయకుండా వారికి మద్దతుగా సమ్మెలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సలీం, బకరం శ్రీనివాస్, గురువయ్య, పందుల సైదులు, దుడుకు లక్ష్మీనారాయణ, అద్దంకి రవీందర్, ఇండ్లూరు సాగర్, దండెంపల్లి సత్తయ్య, ఐతగోని జనార్దన్‌గౌడ్, వీరా నాయక్, లింగయ్య, మానుపాటి భిక్షం, రాజు పాల్గొన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని తీర్మానం ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. స్థానిక పీఆర్టీయూ భవన్లో ఆర్టీసీ కార్మికులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బండారు ప్రసాద్, సీపీఎం నాయకులు పాలడుగు నాగార్జున, తుమ్మల వీరారెడ్డి, సలీం, సీపీఐ నేతలు కాంతయ్య, వీరస్వామి, టీడీపీ నాయకులు రఫీ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, న్యూ డెమోక్రసీ నేతలు ఇందూరు సాగర్, టీజేఎస్ నాయకుడు గోపాల్‌రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ తరపున పర్వతాలు, జనసేనా నుంచి మల్లేశ్, ఐఎన్టీయూసీ తరపున వెంకన్న, సీఐటీయూ నుంచి సత్తయ్య, టీవీవీ నుంచి పందుల సైదులు, విజయ్‌కుమార్, కాశయ్య, ఐద్వా నుంచి ప్రభావతి, మానవ హక్కుల వేదిక తరపున గురువయ్య, ఉపాధ్యాయ సంఘాల నుంచి సైదులు, బకరం శ్రీనివాస్, ప్రమీల, లింగయ్య, మానుపాటి భిక్షం, లక్ష్మీనారాయణ, జనార్దన్‌గౌడ్, రవి, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులకు కార్మిక సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కార్మికుల పక్షాన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత వారి నివాసాల వద్ద నిరసన కొనసాగించాలని నిర్ణయించారు. -
కత్తులతో పొడిచి.. రాయితో మోది
నాగారం (తుంగతుర్తి) : ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. ఈ ఘటన ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధులువు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన కొమ్ము యాకయ్య అలియాస్ రమేశ్ (33) హైదరాబాద్‌లోని వారసిగూడలో పశువుల వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. పదిరోజుల క్రితం యాకయ్య తన స్వగ్రామమైన జలాల్‌పురానికి వచ్చి ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. ఫణిగిరి గ్రామానికి చెందిన తన రెండో భార్య కొమ్ము మమత మేనమామ వివాహానికి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ మూరగుండ్ల సురేష్‌తో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం కొమ్ము యాకయ్య తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి ఫణిగిరి గ్రామానికి కారులో వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. మాటేసి.. వేటేసి.. రాత్రి 8గంటల సమయంలో ఇంటినుంచి కారులో బయటికి వెళ్లిన కొమ్ము యాకయ్య గ్రామశివారులో బంధం మైసమ్మ ఆలయం వద్ద గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కారులో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఫణిగిరికి చెందిన మూరగుండ్ల సురేష్, జలాల్‌పురానికి చెందిన కొమ్ము చింతయ్య వచ్చి మద్యం సేవిస్తున్న యాకయ్య కుడివైపు చాతిపై కత్తితో పొడిచారు వెంటనే యాకయ్య వారినుంచి తప్పించుకునేందుకు కారు అద్దాలను బిగించుకుని 100 ఫోన్ చేశాడు. దుండగులు వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి మరోమారు కత్తితో యాకయ్యపై దాడిచేశారు. వెంటనే యాకయ్యను కారు నుంచి కిందికి లాగి బండరాయితో తలపై మోదడంతో ప్రాణా లు విడిచాడు. 100 కాల్ నుంచి సమాచారం అందుకున్న స్థాని క పోలీసులు వర్షం పడుతుండటంతో పరిసర ప్రాంతాలను గాలించి రాత్రి 11.30సమయంలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాకయ్య తల్లీ కొమ్ము సో మలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పాత కక్షలతోనే.. యాకయ్య, మూరగుండ్ల సురేష్‌లు గతంలో ఇద్దరు కలిసి పశువుల వ్యాపారం చేసే వారు. ఇద్దరి మధ్య లావాదేవీల్లో తేడా రావడంతో ఐదు నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ చో టు చేసుకుంది. దీంతో సురేష్ ఎలాగైన యాకయ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుని అదునుకోసం వేచి చూస్తున్నాడు. యాకయ్య ఐదు నెలల అనంతరం బం«ధువు వివాహ నిమిత్తం ఫణిగిరికి రావడంతో సురేష్ ఇదే అదునుగా భావించాడు. తొలుత శుభకార్యం జరుగుతున్న సూర్యాపేటలోనే యాకయ్యతో ఘర్షణ పడ్డాడు. అక్కడ పలువురు సముదాయించడంతో మిన్నకుండి పోయాడు. ఆ తర్వాత గ్రామంలో పథకం ప్రకారం కాపుకాసి మరికొందరితో కలిసి ఘాతుకానికి తెగబడ్డాడు. నలుగురు కలిసి హత్యచేశారా? మద్యం తాపించాలంటూ రాత్రి 8గంటల సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌చేసి యాకయ్యను గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడే సురేష్, చింతయ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, చింతయ్యలతో పాటు బయటికి తీసుకెళ్లిన వ్యక్తి, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి పథకం ప్రకారం యాకయ్యను హత్యచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ప్రధాన నిందితులు సురేష్, చింతయ్యలు పరారీలో ఉండగా...మరో ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
హుజూర్నగర్: భారీగా మద్యం పట్టివేత
సాక్షి, మఠంపల్లి(హుజూర్నగర్): మండలకేంద్రం లోని ప్రధానరహదారి పక్కనగల హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుకగల ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.11లక్షల 52వేల విలువగల 9,600 మద్యం బాటిళ్లను శుక్రవారం సాయంత్రం అధికారులు దాడులు నిర్వహించి స్వాధీ నం చేసుకుని సీజ్ చేశారు. ఈవిషయమై ఎక్సైజ్ సీఐ శ్రీనివాసు స్థానికంగా మాట్లాడారు. అక్రమంగా మద్యం బాటిళ్లను నిల్వ ఉచిన పక్కా సమాచారం మేరకు ఫ్లయింగ్‌స్వా్కడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఈదాడుల్లో ఎంసీ, ఐబీబ్లూ కంపెనీలకు చెందిన 200ల కాటన్లలో 9వేల 600ల బాటిళ్లను కనుగొని స్వాధీనం చేసుకుని సంబంధిత గృహ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో ఫ్లయింగ్‌స్క్వాడ్, ఎంసీసీ బృందం, ఎక్సైజ్ సిబ్బంది తదితరులున్నారు. కల్తీమద్యం స్థావరంపై పోలీసుల దాడులు మేళ్లచెర్వు(హుజూర్నగర్): కల్తీ మద్యం తయారు చేస్తున్న స్థావరంపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే నర్సిరెడ్డి అనే వ్యక్తి మండలంలోని హేమ్లా తండా పరిధిలో ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లుగా గుర్తించి శుక్రవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 2 లీటర్ల స్పిరిట్, 100 క్వాటర్ బాటిళ్లు, 30 ఫుల్ బాటిళ్లు, 30 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల్లో దాడులు నిర్వహించి 4 బెల్టు షాపులు సీజ్ చేయడంతో పాటు ఐదుగురిపై ఎక్సైజ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాడుల్లో కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, అనంతగిరి ఎస్ఐ రామంజనేయులు, మేళ్లచెర్వు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. రూ.రెండు లక్షల నగదు స్వాధీనం మోతె(కోదాడ): హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం చెక్‌పోస్టు వద్ద పోలీ సులు, ఎన్నికల సిబ్బంది వాహనాల తనిఖీల్లో రూ. రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోతె మండల పరిధిలో ఖమ్మం– సూర్యాపేట రహదారిలో మామిళ్లగూడెం చెక్ పోస్టు వద్ద ఎస్ఎస్టీ టీం వాహనాల తనిఖీ చేపట్టారు. ఖమ్మం నుంచి సూర్యాపేటకు స్కూ టీపై వెళ్తున్న వసంతరావు స్కూటీని తనిఖీ చేయగా రెండు లక్షల ఇరువై వేల రూపాయల నగదును ఎస్ఎస్టీ టీం లీడర్ బాలునాయక్, సీఐ శివశంకర్,ఎస్ఐ గోవర్ధన్ స్వాధీనం చేసుకొని స్థానిక తహసీల్దార్ సరస్వతికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకన్న, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..
సాక్షి, భువనగిరి: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బండసోమవారం గ్రామశివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన సుధీర్‌కుమార్(22) మండల పరిధిలోని బండసోమవారం గ్రామంలో ఓ కోళ్లపారంలో ఏడాదినుంచి పని చేస్తున్నాడు. ఇదే కోళ్లఫారంలో బీహార్‌కు చెందిన డోలి కుమారి, జ్యోతి, రాజులు బతుకు దెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థా నికంగా నివాసం ఉన్నారు. ఒకే కుటుం బానికి చెందిన డోలి కుమార్, జ్యోతి, వారి సొదరుడు రాజు ఒకే గదిలో ఉంటున్నారు. అ గదికి సమీపంలోనే సుధీర్‌కుమార్ నివా సం ఉండే వాడు. సుధీర్‌కుమార్, జ్యోతిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా జ్యోతి, ఆమె సొదరుడు రాజు 25 రోజుల క్రితం సొంత గ్రామం ఉన్న బీహార్‌కు బయాలుదేరి వెళ్లారు. డోలి మాత్రం ఇక్కడే ఉండి పోయింది. బీహర్‌కు వెళ్లిన జ్యోతికి 10 రోజుల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఇ వివాహానికి సంబంధించిన ఫొటోలను డోలికుమారికి పంపింది. అ ఫొటోలను చూసిన సుధీర్‌కుమార్ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడు. తను ప్రేమించిన యువ తి మారొకరితో వివాహం చేసుకోవాడాన్ని భరించలేక మానస్తాపం చెంది తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోళ్లఫారం సూపర్ వైజర్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. -
హాజీపూర్ కేసు నేడు కోర్టులో విచారణ
సాక్షి, బొమ్మలరామారం: పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు సోమవారం నల్లగొండ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు కోర్టునుంచి సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసుల్లో వరంగల్ సెం ట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జులై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఎలాంటి శిక్షలు ఖరారు చేస్తుందోనని మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చదవండి: సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు -
పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
వామ్మో – 163
ఆ రహదారిపై ప్రయాణం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..! ప్రమాదం ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియని పరి స్థితి. అదే ఎన్‌హెచ్ – 163. ఈ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి రోజూ ఒక్కరినైనా బలి తీసుకుంటోందంటే అతిశయోక్తి కాదు. గడిచిన రెండు నెలల్లోనే 47 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. ఒక్క తాళ్లగూడెం, బాహుపేట స్టేజీల సమీపంలోనే 15 మంది వరకు దుర్మరణం చెందారు. విస్తరణ పనులు జరగుతున్న ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. యాక్సిడెంట్లకు అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నప్పటికీ డేంజరస్ స్పాట్లతో సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు లేకపోలేదు. సాక్షి, ఆలేరు: 163 జాతీయ రహదారి అంటే వాహనదారులు.. ప్రయాణికులు హడలిపోతున్నారు. ఈ జాతీయ రహదారి గుండా వెళ్లాలన్నా.. రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలన్నా భయాం దోళన చెందుతున్నారు. హైదరాబాద్ – వరంగల్ 163 జాతీయ రహదారి యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్తుంది. ప్రధానంగా ఈ రహదారిపై బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాలు ఉంటాయి. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుం టాయి. వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో ఈ రహదారిపై ఏదో ఒక చోటా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో నెలలో పదుల సంఖ్యలో మృతిచెందుతుండగా.. వందల సం ఖ్యలో గాయాలపాలవుతున్నారు. ప్రస్తుతం రహదారికి ఆనుకుని ఉన్న మండలం వంగపల్లి నుంచి బాహుపేట వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వన్ వేలో వాహనాలు వెళ్తున్నాయి. రాత్రి సమయాల్లో ఈ రూట్లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల డేంజర్ స్పాట్ల గుర్తింపు.. జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రధానంగా కొండమడుగుమెట్టు, కలెక్టరేట్, భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం బైపాస్, నల్లగొండ క్రాసింగ్ , రామాచంద్రాపురం క్రాస్‌రోడ్డు, రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే కనెక్టివిటీ రోడ్డు, రాయగిరి కమాన్, జమ్మాపురం, వంగపల్లి, తాళ్లగూడెం బిడ్జి, బాహుపేట స్టేజీల వద్ద ప్రమాదాలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు వీటిని డేంజర్ స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడ ప్రమాదాల ని వారణకు అధికారులు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నివారణ చర్యలు తీసుకున్నా... డేంజర్ స్పాట్ల దగ్గర జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడం లేదు. ఎక్కువ ప్రమాదాలు అతివేగం వల్లే అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా జాతీయ రహదారులపై సూచిక బోర్డులు, ఇతర ఏర్పాట్లు చేయడం లేదని వాహనదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వేగ నియంత్రణకు భువనగిరి బైపాస్‌లోనే స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విస్తరణ పనులు పూర్తయితేనే... ప్రస్తుతం వంగపల్లి నుంచి బాహుపేట స్టేజీ వరకు నేషనల్ హైవే 163 రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మూడు నుంచి నాలుగేళ్లుగా పనులు చేస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక వైపు రోడ్డు పనులు చేస్తుండటంతో మరో రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రామాజీపేట, పెద్దకందుకూర్, చిన్నకందుకూర్, తాళ్లగూడెం బ్రిడ్జి, బాహుపేట స్టేజీల వద్ద వాహనాలను క్రాసింగ్ చేస్తున్నప్పటికీ అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు తికమకై ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు అంటున్నారు. నిద్ర మత్తు.. క్రాసింగ్‌ల వద్ద... ఈ జాతీయ రహదారిపైనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా టర్నింగ్‌ల వద్ద పెద్దపెద్ద వాహనాలు బోల్తా కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. వరంగల్ – హైదరాబాద్, గజ్వేల్– చిట్యాల మధ్య ఉన్న జాతీయ రహదారుల గుండా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటా యి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్టు రూపంలో పెద్ద లారీలు వస్తుంటాయి. రాత్రి సమయాల్లో డ్రైవర్లు వాహనాలను నడిపి నిద్ర సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా తెలుస్తోంది. ఉదయం డ్రైవర్ల కళ్లు మూతపడుతుంటే వాహనం నడిపి ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి, క్రాసింగ్‌ల వద్ద అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు వాహనదారులు కొందరు రాత్రి సమయాల్లో దాబాలు ఉన్న ప్రాంతాల్లో ఇష్టానూసారంగా రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగమే ప్రమాదాలకు కారణం... జాతీయ రహదారిపై ప్రయాణం అంటే వాహనదారులు తమ ప్రా ణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు వెళ్లాలంటేనే జంకుతున్నారు. జాతీయ రహదారి కావడంతో ఈ రోడ్డుపై వాహనాలు కార్లు 120 నుంచి 160 స్పీడ్‌తో దూసుకెళ్తాయి. ఇక బస్సులు, లారీలు వందకు పైగానే స్పీడ్‌లో ఉంటాయి. ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయడానికి వాహనదారులు అధికంగా పోటీ పడుతుంటారు. బీబీనగర్ నుంచి రాయగిరి వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉంటుంది.. జమ్మాపురం నుంచి బాహుపేట వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో ఒక వైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. ఈ మార్గంలో వాహనాలు ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నారు. అతి వేగంతోనే ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న యాదగిరిగుట్ట మండలం వంగపల్లి నుంచి బాహుపేట స్టేజీ వరకు బ్లాక్స్ స్పాట్స్‌ను గుర్తించాం. అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి ప్రమాద హెచ్చరికలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేస్తాం. అంతే కాకుండా ప్రమాదాలను సూచించే సిగ్నల్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగిన ప్రమాదాలు అతివేగం, ఓవర్టేక్ చేయడంతోనే చోటు చేసుకున్నాయి. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న దృష్ట్యా వాహనదారులు నెమ్మదిగా వాహనాలను నడపాలి. – నర్సింహారావు, పట్టణ ఇన్స్పెక్టర్, యాదగిరిగుట్ట గడిచిన మూడు నెలల్లో 108 ప్రమాదాలు మాసం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు జూలై 48 25 36 ఆగస్టు 45 14 38 సెప్టెంబర్ 15 8 10 మొత్తం 108 47 84 -
దారుణం: మూడు నెలల చిన్నారిని బండకేసి..
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెలలు నిండని ఓ చిన్నారిపై తాగుడు బానిసైన సొంత మేనమామే కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో చిన్నారిని నేలకేసి కొట్టి.. చంపాడు ఆ దుర్మార్గుడు. జిల్లాలోని పెద్దవూర మండలం చిన్నగూడెంలో జరిగిన ఈ ఘటన అందరి మనసులను ద్రవింపజేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. మరోసారి గర్భవతి అయిన లక్ష్మీ మూడు నెలల క్రితం డెలివరీ కోసం నల్లగొండలోని తన స్వగ్రామానికి వచ్చింది. డెలివరీ అనంతరం తల్లిగారి ఇంటి వద్ద ఆమె ఉండగా.. శుక్రవారం పెద్ద కూతురు పుట్టినరోజు కావడంతో తండ్రి వెంకటేశ్వర్లు అత్తవారింటికి వచ్చాడు. ఈ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మీ సోదరుడు ఉపేందర్ తన తండ్రితో డబ్బులు కావాలని గొడవ పడ్డారు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో.. కోపంతో తాగిన మత్తులో అక్క కుమార్తె అయిన మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. భయంతో చిన్నారి తల్లి లక్ష్మీ, అమ్మమ్మ కూడా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా ఉపేందర్ తన తండ్రిపై , అక్కలపై కత్తితో దాడి చేశారని, ఊరులోని ఆడవాళ్లతో దురుసుగా ప్రవర్తించే వాడని గ్రామస్తులు పోలీసుల ముందు వాపోయారు. భార్య, పిల్లలను తీసుకొని సొంత ఊరికి వెళ్లడానికి వచ్చానని, ఆ లోపే తన బిడ్డను చంపాడని చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు. -
రామడుగులో విషాదఛాయలు
సాక్షి, హాలియా: రామడుగు గ్రామం ఒక్కసారిగా కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. గోదావరి లాంచీ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారనే వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలై కంటిమీద కునుకులేకుండా పోయింది. తమ కుమారుడి ఆచూకీ లభించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశపడ్డ కుటుంబ సభ్యులకు పాశం తరుణ్‌రెడ్డి(27) విగతజీవిగా మారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రామడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుచ్చులూరు సమీపంలో గోదావరి నదిఒడ్డుకు చేరిన తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వారి బంధువులకు తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని అప్పగించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకుని మంగళవారం రాత్రి 12 గంటలకు గ్రామానికి తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. విగతజీవిగా మారిన తరుణ్‌రెడ్డిని చూసి రామడుగు వాసులు ఘోల్లుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నకుమారుడు తరుణ్‌రెడ్డి ఇక తిరిగిరానిలోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు గుం డెలవిసెలా రోదించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రంలో చుట్టి తీసుకురావడంతో వారు చూసి తట్టుకోలేక పోయారు. తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం రామడుగులో కుటుంబ సభ్యులు తరుణ్‌రెడ్డికి అశ్రనయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌రెడ్డి కడసారి చూపుకోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రామడుగు శోకసంద్రంగా మారిపోయింది. నాలుగు రోజులైనా లభించని సురభి రవీందర్ ఆచూకీ.. పాపికొండల పర్యటనకు వెళ్లి లాంచీ ప్రమాదంలో గోదావరిలో గల్లంతయిన హాలియా పట్టణానికి చెందిన సురబి రవీందర్ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజులు గడిచినా రవీం దర్ ఆచూకీ తెలియకపోవడంతో.. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కచ్చలూరులోనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో హాలియాలో వారి తల్లితండ్రులు సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు నేతల పరామర్శ.. రామడుగు గ్రామానికి తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు గ్రామానికి చేరుకుని తరుణ్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్ మజ్జిగపు వెంకట్రామ్రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, సైదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. -
అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..
సాక్షి, మిర్యాలగూడ: తమ ఆరాధ్య దైవాన్ని ప్రతి యేడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆ.. గిరిజనులకు ఆనవాయితీ.. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు గిరిజనులు తమ బంధువులతో కలిసి శనివారం ఇష్ట దైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపారు. మరుసటిరోజు మధ్యాహ్నం తిరిగి తమ స్వగ్రామాలకు టాటాఏస్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో వృద్ధ దంపతులు మృత్యుఒడికి చేరుకోగా.. టాటాఏస్ డ్రైవర్‌తో సహా పదిమందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్‌పై ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్ లక్పతి(75), ధీరావత్ దోర్జన్ (64), ధీరావత్ గున్య, ధీరావత్ సక్రి, ధీరావత్ రాజు, ధీరావత్ రోహిత్, ధీరావత్ చింటు, తుర్కపల్లి మండలం సంగెం తండాకు చెందిన లకావత్ వస్రాం, లకావత్ సోను, లకావత్ వినోద్‌తో పాటు చికటిమామిడి గ్రామానికి చెందిన ధీరావత్ గణేష్ బంధువులు. వీరు ప్రతియేడు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే వీరందరూ తుర్కపల్లి మండలం సంగెంతండాకు చెందిన లకావత్ వెంకటేశ్ టాటాఏస్ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకుని శనివారం కల్లెపల్లికి వచ్చారు. మైసమ్మ తల్లికి యాటను బలిచ్చి విందు చేసుకుని రాత్రి అక్కడే బసచేశారు. ధీరావత్ దోర్జన్, ధీరావత్ లక్పతి మృతదేహం వరాహాన్ని తప్పించే క్రమంలో.. ఇష్టదైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపిన బంధువులందరూ ఆదివారం మధ్యాహ్నం టాటాఏస్ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో వీరి వాహనానికి మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్ రోడ్డుపైకి ఒక్కసారిగా వరాహం అడ్డుగా వచ్చింది. దీంతో టాటాఏస్ డ్రైవర్ లకావత్ వెంకటేశ్ దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమయంలో అతివేగంతో ఉన్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లో బోల్తాకొట్టింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరింశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. వరాహాన్ని తప్పించే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని టాటాఏస్ డ్రైవర్ పోలీసు అధికారులకు వివరించాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. చెల్లాచెదురుగా.. అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్న వారు అనుకోని హఠాత్పరిణామానికి హతాశులయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే టాటాఏస్ వాహనంలో ఉన్న వారందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొమ్మల రామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్ లక్పతి(75), ధీరావత్ దోర్జన్ (64) అక్కడికక్కడే దుర్మరణం చెందగా డ్రైవర్‌తో సహా మిగిలిన వారందరూ గాయపడ్డారు. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు 108 వాహన సహాయంతో వారిని తొలుత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. -
కూతురు పుస్తకాల కోసం వెళ్లి..
సాక్షి, ఆలేరు: తమ చదువులు అంతంత మాత్రమే అయినా కూతుళ్లు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు ఆ తల్లిదండ్రులు. పెద్ద కూతురుకి అవసరమైన డిగ్రీ పుస్తకాల కోసం ద్విచక్ర వాహనంపై భువనగిరికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యురూపంలో వచ్చిన కారు ఢీ కొనడంతో తల్లిదండ్రులు చనిపోగా, వారి కూతురు తీవ్ర గాయాలతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. హైదరాబాదు–వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపంలో శనివారం రాత్రి కారు ఢీకొన్న సంఘటనలో ఆలేరు ఎస్సీ కాలనీకి చెందిన భార్యాభర్తలు జంగిటి రాములు, విజయ చనిపోగా, వారి కూతురు స్వప్న తీవ్ర గాయాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధి తమే. జనగామ జిల్లా నారాయణపురానికి చెందిన పెద్ద నర్సయ్య కుటుంబం 45 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఆలేరుకు వలసవచ్చారు. వారి కుమారుడైన జంగిటి రాములు స్థానికంగా తాపీ పని చేస్తుండగా, భార్య విజయ కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు. పెద్ద కూతురు స్వప్న ఆలేరులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా, చిన్న కూతురు కావేరి 10 వ తరగతి చదువుతుంది. అయితే పెద్ద కూతురు స్వప్న డిగ్రీ చదువుకు అవసరమైన పుస్తకాలను అడగడంతో శనివారం సాయంత్రం వరకు భార్యాభర్తలు పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూతురుని తీసుకుని ద్విచక్ర వాహనంపై భువనగిరికి వెళ్లారు. తిరుగు ప్ర యాణంలో మరో పది నిమిషాల వ్యవధిలో ఆ లేరుకు చేరుకుంటామని అనుకుంటున్న క్రమంలో వరంగల్ వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టడంతో భార్య విజయ అక్కడికక్కడే చనిపోగా తీవ్ర గాయాలకు గురైన భర్త రాములు, కూతురు స్వప్నను భవనగిరి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు చనిపోగా కూతురు కాళ్లు విరిగి చికిత్స పొందుతుంది. వరంగల్ వైపు నుంచి వస్తున్న కారు అతి వేగమే బార్యాభర్తల ప్రాణాలు బలిగొన్నట్లు తెలుస్తోం ది. కారు డ్రైవరు మితిమీరిన వేగంతో వస్తూ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంను ఢీ కొనడంతోనే ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు అమ్మాయిలకు దాదాపు 70 ఏళ్ల వయస్సున్న నానమ్మ లక్ష్మియే దిక్కుగా మారింది. రాస్తారోకో... ప్రభుత్వ నుంచి సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ కాలనీ వాసులతో పాటు స్థానికులు వందలాది మంది ఆలేరు రైల్వే గేటు వద్ద మృతదేహాలతో రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎమ్మార్పీస్ రాష్ట్ర కార్యదర్శి కందుల శంకర్ మాదిగ, టీఆర్ఎస్ నాయకులు చింతకింది మురళి, సీపీఎం నాయకులు మంగ నర్సింహులు, ఎంఎ ఇక్బాల్, సత్యరా జయ్య, ఎంఎల్ నాయకులు అడవయ్య, కేమిడి ఉప్పలయ్య, బాబు, చంద్రయ్య తదితరులు రా స్తారోకోలో పాల్గొన్నారు. విషయాన్ని పోలీసులు ఫోన్ ద్వారా ఆర్డీఓ వెంకటేశ్వర్లు దృష్టికి తీ సుకు రాగా కారు డ్రైవరును వెంటనే అరెస్టు చేస్తామని, చికిత్స పొందుతున్న స్వప్నకు మం చి వైద్యం అందేలా చూస్తామని, ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హమీ ఇచ్చారు. అంత్యక్రియలకు ఆలేరు తహసీల్దారు కార్యాలయం నుంచి రూ.5వేలు అందజేశారు. -
నల్లగొండలో గోదా'వర్రీ'
సాక్షి, హాలియా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి నదిలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇతని వివరాలు తెలియరాలేదు. అలాగే హాలియాకు చెందిన సురభి రవీందర్ ఉన్నాడు. చిట్యాల మండలం వనిపాకలకు చెందిన కిరణ్‌కుమార్, చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్ సురక్షితంగా బయటపడ్డారు. వీరిద్దరు రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా వీరంతా హైదరాబాద్‌లో పోలీస్‌శాఖలోని హౌసింగ్ కార్పొరేషన్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలసి పాపికొండలు వెళ్లారు. కాగా లాంచీ నీట మునగడంతో వీరి విహారయాత్ర విషాదాంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదంలో ఉమ్మడి జిల్లా వాసులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ఉమ్మడి జిల్లా వాసులు ఉండగా ఇద్దరు గల్లంతు కాగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద ఆదివారం జరిగిన లాంచి ప్రమాదంలో హాలియా పట్టణానికి చెందిన సురభి రవీందర్(22) గల్లంతైనట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు సురభి రవీందర్ గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వరుసగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితులు రాజేష్, తరుణ్‌తో పాటు వరంగల్‌కు చెందిన సురేష్, రాజేందర్‌తో కలిసి టూరిస్టు బస్సులో భద్రాచలానికి బయలు దేరారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న అనంతరం గోదావరిలో లాంచీలో విహారయాత్ర చేసేం దుకు బస్సులో రాజమండ్రికి వెళ్లారు. అక్కడే సురభి రవీందర్ తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలో లాంచీ ఎక్కారు. తన స్నేహితులతో కలిసి రాజమండ్రి నుంచి భద్రాచలం వస్తుండగా మార్గ మధ్యలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ప్రమాదశాత్తు నదిలో మునిగిపోయింది. దాంతో రవీందర్‌తో పాటు తన వెంట వచ్చిన హైదరాబాద్, వరంగల్‌కు చెందిన ఆయన స్నేహితులు గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలిసిన రవీందర్ తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలా నికి బయలు దేరారు. అలాగే ఈ ప్రమాదంలో నల్లగొండకు చెందిన తరుణ్‌రెడ్డి కూడా గల్లం తైనట్లు సమాచారం. బయటపడిన గల్లా శివశంకర్ చింతలపాలెం: దేవీపట్నం వద్ద పర్యాటక లాంచీ నీట మునిగిన ప్రమాదం నుంచి ప్రాణా లతో బయటపడిన గల్లా శివశంకర్ చింతల పాలెం మండలం గుడి మల్కాపురం వాసి. శివశంకర్ గల్లా పెదలక్ష్మయ్య, ధనలక్ష్మి కుమారుడు. ఈ యన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు అదే డిపార్ట్మెంట్లో పని చేస్తున్న మరో ఏడుగురు స్నేహితులు కూడా అక్కడకు వెళ్లినట్లు సమాచారం. చిట్యాలవాసి సురక్షితం చిట్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పర్యాటక శాఖకు చెందిన లాంచీ మునిగిన ప్రమాదం నుంచి నల్లగొండ జిల్లా చిట్యాల మండలవాసి సురక్షితంగా బయటపడ్డాడు. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన మేడి కిరణ్ కుమార్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివా సం ఉంటూ సరూర్‌నగర్‌లోని పోలీస్‌శాఖ హౌ సింగ్ ప్లానింగ్ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన స్నేహితులతో కలిసి పాపికొండల విహారయాత్రకు వెళ్లాడు. కాగా అక్కడ పడవ మునక ప్రమాదం నుంచి ఆయన ప్రా ణాలతో బయటపడి రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తు తం క్షేమంగానే ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: నిండు గోదారిలో మృత్యు ఘోష -
ఉలిక్కిపడిన ‘పేట’..!
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వెంకటసాయి పాత సామగ్రి గోదాములో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. కానీ పాత సామగ్రి గోదాములో కటింగ్ మిషన్‌తోనే ఈ పేలుడు తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. పట్టణంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పక్కన జీవీవీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు మూడు సంవత్సరాల క్రితం వెంకటసాయి పాత ఇనుప సామగ్రి దుకాణం నెలకొల్పాడు. ఈ దుకాణంలో సుమారు 30 మందికి పైగా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంత మంంది, స్థానిక పరిసర గ్రామాలకు చెందిన కొంత మంది దీంట్లో పనిచేస్తుంటారు. రోజుమాదిరిగానే ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ షెడ్ లోపల రాంచందర్ సాహో మిషన్‌తో డబ్బాలను ముక్కలుముక్కలుగా చేస్తున్నాడు. సుమారు 20 ప్లాస్టిక్ డబ్బాలకు పైగా కట్ చేశాడు. గాయపడిన బుజ్జి, సల్మాన్‌ఖాన్ కుప్పలుతెప్పలుగా ఉన్న డబ్బాలను కట్‌చేస్తుండగా..ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ రేకుల షెడ్లో రాంచందర్ సాహోతో పాటు కటింగ్ మిషన్ వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సల్మాన్‌ఖాన్, చివ్వెంల మండలం రాంకోటి తండాకు చెందిన బుజ్జిలు పనిచేస్తున్నారు. కొద్ది దూరంలోనే చిలుకమ్మతో పాటు మరో నలుగురైదురుగు పనిచేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి రాంచందర్‌సాహో(45) మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో పడిపోయింది. అంతేకాకుండా ఆయన శరీరం చిధ్రమై అవయవాలు బయటపడ్డాయి. మిషన్‌లోని భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. సాహో పక్కనే పనిచేస్తున్న సల్మాన్ ఖాన్, బుజ్జిలకు తీవ్ర .. చిలకమ్మకు స్వల్ప గాయాలతో బయటపడింది. వారిని స్థానిక ఏరియాస్పత్రికి తరలించారు. వీరిలో సల్మాన్‌ఖాన్‌కు విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి.. రాంచందర్‌సాహో ప్లాస్టిక్ డబ్బాలు కట్ చేస్తుండగా అధిక లోడుతో కట్టర్ మిషన్ బ్లాస్ట్ అయిందని తొలుత పోలీసులు భావించారు. కానీ మిషన్‌లోని భాగాలు దెబ్బతిన్నట్లుగా కన్పించడం లేదు. కేవలం పైభాగాలు మాత్రమే పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే సాహో కట్ చేసే ప్లాస్టిక్ డబ్బాలో జిలెటిన్‌స్టిక్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమమయ్యాయి. ఏదీఏమైనా ఘటనా స్థలంలోని పేలుడు ధాటిని చూస్తే మాత్రం బాంబు పేలిందన్న రీతిలో ఉంది. సాహో మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అంతేకాకుండా షెడ్ రేకులు లేచిపోయాయి. కటింగ్ మిషన్ పక్కనే ఉన్న గోడ పూర్తిగా పగిలిపోయింది. పేలుడు ఇలా జరిగిందని.. రసాయన డబ్బాను కోస్తుండగా పేలుడు సంభవించిందని చివరకు పోలీసులు నిర్ధారించారు. స్పేర్ పంపులు, రసయనాలు వాడిన ఖాళీగా ఉన్న డబ్బాలు గోదాములో భారీగా ఉన్నాయి. కొన్ని డబ్బాలు మూత పెట్టి ఉండగా మరికొన్ని రంధ్రాలు పడి ఉన్నాయి. కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్లు ప్రత్యేక పరిస్థితుల్లో పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. పెయింట్లలో కలిపే థిన్నర్లు ఈ కోవకు చెందుతాయి. కొంత రసాయనం డబ్బాకు అంటుకొని ఉండి, దానికి ఎక్కడ రంధ్రం లేకుండా ఉండి మూత పెడితే అందులో మంట స్వభావాన్ని కలిగి ఉండే వాయువులు ఏర్పడత్తాయి. అలాంటి డబ్బాలను తెరిచినప్పుడు ఒక్కసారిగా శబ్దం వస్తుంది. ఇలానే మూత పెట్టిన రసాయన డబ్బాను మిషన్ కట్టర్‌తో కోయడం లేదా, రసాయనం అంటుకుని ఉన్న డబ్బాను కట్టర్‌తో కోస్తున్నప్పుడు వేడికి స్పార్క్స్ ఒక్కసారిగా లోపటి రసాయన వాయువలకు తగడలడంతో మంటలతో కూడిన భారీ పేలుడు జరుగుతుంది. ఇదే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో రసాయన డబ్బా మూత తీస్తుండగా అది పేలి ఒక వ్యక్తి మృతిచెందాడని పేర్కొన్నారు. నెల రోజులు కాకముందే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాంచందర్‌సాహో ఇంత కాలం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఓ ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడి ప్లాస్టిక్ యజమానికి అక్కడ ప్లాస్టిక్ యజమానికి పరిచయంతో సాహోను సరిగ్గా నెల ఆఖరి తేదీన వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో పనిలో కుదిరాడు. కేవలం ప్లాస్టిక్ డబ్బాలను కటింగ్ చేసే పనిలో మాత్రమే కుదిరాడు. పనెల రోజులు కాకముందే ప్రమా దం సంభవించి కన్నుమూయడంతో తోటి కార్మికులు.. కన్నీరుమున్నీరయ్యారు. నివాసాల మధ్యే .. పట్టణంలో 17 పాత సామాను గోదాములున్నాయి. పాత సామాను సేకరించిన వారు ఈ గోదాముల దగ్గరకు వచ్చి వీటి నిర్వాహకులకు అమ్ముతారు. ఇనుము, ప్లాస్టిక్, గాజు, పాలిథిన్‌తో పాటు పలు రకాలవి ఈ గోదాముల్లో రోజుల తరబడి ఉంటాయి. పెద్దపెద్ద ప్లాస్టిక్ డబ్బాలను చిన్న కట్టర్ మిషన్లతో కోయించి ముక్కలు ముక్కలుగా చేయిస్తారు. వీటిని మళ్లీ బస్తాలో నింపి హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ మిక్సింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. జిల్లా కేంద్రంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. పెద్ద గోదాములను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని పట్టణానికి సమీపంలో ఉంటే మరికొన్నిజనావాసాల మధ్యే ఉన్నాయి. జీవీవీ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన పేలుడు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేవు. అయినా భారీ పేలుడు జరగడంతో శబ్దం కిలోమీటరు వరకు వెళ్లింది. రసాయన వాడకం చేసిన ఖాళీ డబ్బాలు కూడా భారీగా పాత సామాను గోదాములకు వస్తాయి. ఈ రసాయన డబ్బాలు మూత పెట్టినవి తీయడం ప్రమాదకరం కావడంతో పేలుడు సంభవిస్తున్నాయి. భయాందోళనలో ప్రజలు రోదిస్తున్న తోటి కార్మికులు వెంకటసాయి ప్లాస్టిక్ దుకా ణంలో సంభవించిన పేలుడుతో పేట ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యా రు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్లాస్టిక్ దుకాణానికి సమీపంలోని భగత్‌సింగ్, తిరుమలానగర్, జమ్మిగడ్డ, ఖమ్మం క్రాస్‌రోడ్డు, విజయకాలనీ, మారుతినగర్, దాసాయిగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద బాంబు పేలుడు మాదిరిగా శబ్దం వచ్చిందంటూ ఒకరికొకరు చర్చించుకుంటుండగానే.. ప్లాస్టిక్ దుకాణంలో ఏదో పేలుడు సంభవించిందన్న వార్తలు దావానంలా వ్యాపించింది. అయితే దుకాణంలో మాత్రం కటింగ్ మిషన్ పేలితే ఇంత శబ్దం ఎలా వస్తుంది.. కాదు అది తప్పకుండా బాంబు పేలుడేనని ప్రజలు జోరుగా చర్చించుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ, డీఎస్పీ ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ఏఎస్పీ, డీఎస్పీ వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో జరిగిన పేలుడు విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట ఏఎస్పీ పూజిత నీలం, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివశంకర్‌లు ఘటనా స్థలా నికి చేరుకున్నారు. దుకాణంలోని పాత ఇనుము సామాగ్రితో పాటు సాహో కట్ చేసిన డబ్బాలను పరిశీలించారు. అయినా క్లూజ్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తామని తెలిపారు. పేలుడు జరిగిన ఘట నను వెంటనే పోలీసులు క్లూజ్ టీంకు వివరించి రప్పించారు. దుకాణంలో రసాయనాల లేక.. మిషన్‌లో సాంకేతిక సమస్య.. ఎవరైనా వ్యక్తులు బాంబులు, జిలిటెన్‌స్టిక్స్ పెట్టారా అన్న కోణంలో క్లూజ్ టీం వివరాలు సేకరించారు. దీంతో ఘటన స్థలంలోని వివరాలను టీం సేకరించింది. క్షణాల్లో జరిగిపోయింది.. దుకాణంలో అందరం పనిలో నిమగ్నమైపోయాం. 20 మీటర్ల దూరంలో ఉండి ప్లాస్టిక్ డబ్బాలను వేరు చేసే పనిలో ఉన్నా. ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాకుండా.. భయాందోళనకు గురయ్యా. వెంటనే తేరుకుని చూడగా.. పక్కనే పనిచేస్తున్న సాహో విగతజీవిగా మారిపోయాడు. – పద్మ, రాంకోటితండా, కార్మికురాలు మూడేళ్లుగా పనిచేస్తున్నా .. ప్లాస్టిక్ దుకాణంలో మూడేళ్లుగా పనిచేస్తున్నా. గతంలో ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేసేం దుకు ఇద్దరుముగ్గురు పనిచేసేవారు. కానీ ఏ రోజు కూడా డబ్బాలు కట్ చేస్తుండగా.. ప్రమాదం సంభవించలేదు. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఇప్పటికీ ఘటననుంచి తేరుకోలేకపోతున్నాం. – విజయ, కార్మికురాలు బాంబు పేలుడు కాదు పట్టణంలోని జాతీయ రహదారిలో జక్వీవీ ఫంక్షన్‌హాల్ వద్ద ఉన్న పాత సామాను గోదాములో ప్లాస్టిక్ టిన్లను చిన్ని ముక్కలుగా కట్ చేయడానికి మిషన్ఫై ప్రాసెస్చేస్తుండగా రసయనాలు వేడిమికి గురై పేలుడు జరిగింది. అంతే కాని ఇక్కడ ఎలాంటి బాంబు పేలుడు జరగలేదు. ప్రజలు ఇలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నాం. – రావిరాల వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ -
మహిళ ప్రాణం తీసిన భూ తగాదా
సాక్షి, మిర్యాలగూడ: భూ తగాదాలతో ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన మారెపల్లి అమృతారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అన్నదమ్ములు. వీరి స్వస్థలం నారాయణపురం. వీరు 20 ఏళ్ల నుంచి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి అమృతారెడ్డికి, వాసుదేవరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి అతడి భార్య మంజులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గురువారం ప్రొక్లెయిన్‌తో చెట్లు తొలగించారు. దాంతో అమృతారెడ్డి అతడి కుమారుడితో కలిసి అక్కడికి చేరుకొని భూమి విషయంలో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మారెపల్లి మంజుల, ఆమె భర్త వాసు దేవరెడ్డిపై అమృతారెడ్డి, అతడి కుమారుడు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మంజుల తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వాసుదేవరెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్‌బాబు, మాడ్గులపల్లి ఎస్ఐ రావుల నాగరాజు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మంజుల -
మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..!
సాక్షి, మిర్యాలగూడ: ఓ రైస్‌మిల్లు వ్యాపారి సుమారు రూ.5కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెం దిన కోటగిరి వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా చేరి వ్యాపారంలో అనుభవం గడిం చాడు. దీంతో ఆరేళ్ల క్రితం కుక్కడం సమీ పంలో ఓ రైస్‌మి ల్లును నెలకొల్పి వ్యాపారం ప్రారంభించాడు. సహచర వ్యాపారుల వద్ద జీరో విధానంలో వరిపొట్టు, తవుడు, బియ్యం, కొనుగోలు చేశాడు. ఎంతో కాలంగా ఉన్న తన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి సహచర వ్యాపారుల వద్ద రూ. కోట్లలో అప్పులు చేశాడు. కారణాలైతే తెలియవు కానీ రెండు నెలల క్రితమే పట్టణంలో ఉన్న తన స్థిర ఆస్తులలన్నింటినీ విక్రయించాడు. అనంతరం వారం రోజుల క్రితం భార్యాబిడ్డలను తీసుకుని కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అతడి ఆచూకీ లేక పోవడంతో రూ. లక్షల్లో వెంకటేశ్వర్లుకు అప్పులిచ్చిన వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. -
కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!
సాక్షి, కోదాడ: సామాన్యుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కోదాడలో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలువురు ప్రముఖులు దీనిలో భాగస్వాములు కావడంతో సామాన్యులు సులువుగా మోసపోతున్నారు. రూ.12 వేలు చెల్లిస్తే సభ్యత్వంతో పాటు అంతే విలువైన ఉత్పత్తులను (వివిధ రకాలైన వస్తువులు) ఇస్తామని వీటి అమ్మకం వల్ల రూ.2వేల లాభం వస్తుందని, మరో ఇద్దరిని చేర్పిస్తే మరో రూ.3 వేల లాభం వస్తుందని ఇలా సభ్యులు చేరినా కొద్దీ రూ.లక్షలు మీ జేబుల్లో వచ్చి పడతాయని చెపుతుండడంతో పలువురు వీరి వలకు చిక్కుతున్నారు. దీని వ్యవహారం ఏమిటంటే.. ఇప్పటికే అనేక మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టి నిండా ముంచుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుండగా తాజాగా మరో కంపెనీ కోదాడ ప్రాంతంలో గుటుచ్చప్పుడు కాకుండా తన కార్యకలాపాలు సాగిస్తోంది .‘ఇండుస్ వివా’ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ వ్యాపారం ముందుగా నాలుగు రకాల వస్తువులైనా ఐస్లిమ్, ఐకాఫీ, ఐ పల్స్, ఐ చార్జీలను అంటగడుతున్నారు. వీటి కోసం 12,400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని అమ్ముకోవడం వల్ల రూ.2 వేల కమీషన్ వస్తుందని, దీంతో పాటు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా మరో రూ.5 వేలు, వారు మరో ఇద్దరిని చేర్చడం ద్వారా చైన్ పెరిగి మీ ఖాతాల్లో రూ.లక్షలు జమ అవుతాయని నమ్మబలుకుతూ తేలిగ్గా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ వ్యాపారం అంతా రహస్యంగా కొంత మంది తమ ఇళ్లలో సాగిస్తున్నారని సమాచారం. అబ్బో.. కేన్సర్ కూడా తగ్గుతుందట...! ఎక్కడ తయారు అవుతున్నాయో, వాటిలో ఏముంటాయో తెలియకుండా వీరు నాలుగు రకాల ఉత్పత్తులను అంటగడుతున్నారు.. వీటిలో ఐ స్లిమ్ వాడితే ఎంత లావు ఉన్నా ఒక్క నెలలోనే స్లిమ్‌గా తయారవుతారట. ఇక ఐ ఫల్స్ తాగితే ప్రాణాంతకమైన కేన్సర్ కూడా తగ్గుతుందట. దీనిలో అసైబెర్రీ అనే ఫలరసం ఉంటుందని, ఇది అమెజాన్ అడవుల్లోనే ఉంటుందని మాయమాటలు చెబుతూ అంటగడుతున్నారు. ఇక ఐ చార్జీ వాడితే వెంటనే బాడీలో శక్తి వచ్చి పరుగులు పెట్టవచ్చట. ఇలా ఈ ఉత్పత్తుల్లో ఉన్న బ్రహ్మపదార్థం ఏమిటో అర్థం కాక వైద్యులే తలపట్టుకుంటున్నారు. వీరు మాత్రం సులువుగా మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులు వీరి వలకు చిక్కుతున్నారు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు సామాన్యులను బురిడీ కొట్టించడానికి వీరు ఖరీదైన రిసార్టుల్లో సమావేశాలు పెడతారు. సూటు, బూటు వేసుకుని కనికట్టు మాటలతో మభ్యపెడుతుంటారు. అరచేతిలో స్వర్గం చూపిస్తుంటారు. అంతేకాక కొంత మందిని తీసుకొచ్చి ఇప్పటికే రూ.లక్షలు తమ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నట్లు చెప్పిస్తుంటారు. దీంతో పలువురు యువకులు తమ తల్లిదండ్రులు వద్దంటున్నా వీరికి సొమ్ముచెల్లించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బెల్టుషాపులు కేంద్రంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న అనుమానం మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేసి పలురకాల బ్రాండ్లతో విక్రయించిన తీరు మద్యంప్రియులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఎన్నికల సీజన్లో కల్తీ మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల ద్వారా, బెల్టుదుకాణాల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయదారులను పోచంపల్లితోపాటు, బాలాపూర్, వికారాబాద్‌లలో అరెస్టు చేశారు. మరో నెలరోజుల్లో మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్‌లు పట్టుకున్న మద్యంతో చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదిమంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీస్‌లు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఒరిజనల్‌గా నమ్మిస్తూ: అక్రమ మద్యం వ్యాపారులు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తమ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి పాత సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నింపి వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్ లిక్విడ్‌ను కలిపారు. మద్యం కొనుగోలుదారునికి ఎలాంటి అనుమానం రాకుండా ప్యాక్ చేసి ప్రభుత్వ సరఫరా లేబుళ్లను అంటించి అన్ని రకాల మద్యాన్ని డూప్లికేట్ సీసాల్లో ఒరిజినల్ ధరకే విక్రయించారు. బయటబడిన బండారం.. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో గత నెల 14న రెక్టిఫైడ్ స్పిరిట్‌తో క్యారామిల్ కలిపి మద్యాన్ని తయారు చేస్తున్న మద్ది అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువ చేసే రెక్టిఫైడ్ స్పిరిట్, క్యారామిల్ మద్యం సీసాల మూతలను పలు బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు 10మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్ శివారులో గత నెల 19న పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో నలుగురి కోసం వెతుకుతున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్, సామగ్రి, మద్యం సీసాల మూతలు (ఫైల్) మూడు నెలలుగా జిల్లాలో నకిలీ మద్యం ఛాయలు గుర్తించినట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతుండగా అంతకంటే ముందు ఏడాది కాలంనుంచే కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో తాజాగా మద్యం సీసాల నకిలీ మూతలను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన లాయిఖ్అలీ, స్టిక్కర్స్‌ను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన సుదీర్‌లను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా స్పిరిట్‌ను సరఫరా చేసే తాండూరుకు చెందిన మొగులప్ప స్టిక్కర్స్‌ను కొనుగోలు చేసిన మహబూబాబాద్‌కు చెందిన శశాంక్గౌడ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఢిల్లీలో హోలోగ్రామ్స్ తయారు చేసే కంపెనీపై దృష్టిసారించిన పోలీసులు అక్కడి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ మద్యం కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున నిందితుల వేటలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెల్టుషాపుల ద్వారా విక్రయం.. నకిలీ మద్యం కొన్ని మద్యం షాపులతోపాటు బె ల్టుషాపుల్లో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నారా యణపూర్, చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో మద్యం దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులై న అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మంది తమ కు తెలిసిన వారి ద్వారా జిల్లాతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌జిల్లాల్లో విక్రయించినట్లు ఇప్పటికే బయటపడింది. నకిలీ మద్యం కేసును ఛేదించడం ద్వారా జిల్లాలో భారీ రాకెట్‌కు తెరదించినట్లైందని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. నిందితులందరినీ పట్టుకుం టామని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. -
సెల్ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!
సాక్షి, యాదగిరిగుట్ట: చాకచక్యంగా సెల్ఫోన్లను కొట్టేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జిల్లా పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న ఓ ముఠా జిల్లాలోని యాదగిరిగుట్టలో తలదాచుకుంది. ఇటీవల ఈ ముఠాలోని ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు ముఠా సభ్యుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యాదగిరిగుట్టలో ఉన్నట్టు గుర్తించారు. మూడు బృందాలుగా వచ్చిన హన్మకొండ పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిపై దాడి చేయగా అప్పటికే మఫ్టీలో వచ్చింది ఖాకీలని గుర్తించిన ఆ ముఠా సభ్యులు పారిపోయారు. సినీఫక్కీలో ఛేజింగ్ చేసి ఆ ముఠాలోని మరో బాలుడిని అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారయ్యారు. ఆ ముఠా సభ్యులను ఎలగైనా పట్టుకోవాలని హన్మకొండ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో యాదగిరిగుట్టలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ పోలీసుల కథనం మేరకు.. హన్మకొండలో నివాముంటున్న ఓ న్యాయవాదికి చెందిన సెల్‌ఫోన్ పోయిందని అక్కడి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఫోన్లు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రద్దీ ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనపించాడు. అతడి వెంట ఉన్న ఓ బాలుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కర్నూల్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఎనిమిది మంది (ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, మరో ఇద్దరు చిన్నారులు) ఉన్నారు. ముగ్గురు మహిళల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట: సెల్‌ఫోన్ అపహరిస్తూ పట్టుబడిన దొంగ (ఫైల్) సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా... పోలీసుల అదుపులో ఉన్న బాలుడు తమకు చెందిన ముఠా సభ్యుడి ఫోన్ నంబర్ చెప్పాడు. దీంతో హన్మకొండ పోలీసులు ఆ నంబర్ లొకేషన్, సిగ్నల్స్ ఆధారంగా సోమవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టకు హన్మకొండ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా పోలీసులు వచ్చారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీకి మకాం మార్చారు. పాతగుట్టలో టెక్నాలజీ లొకేషన్ టీమ్ తిరుతున్న క్రమంలో ఓ ప్రైవేట్ లాడ్జీ వద్దకు రాగానే సిగ్నల్ ట్రేస్ అయ్యింది. దీంతో అప్పటికే అప్రమత్తమైన దుండగులు మఫ్టీలో ఉన్న ఖాకీలతో వచ్చిన తమ ముఠాలోని బాలుడిని చూసి లాడ్జికి వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి పాతగుట్టకు వెనుక భాగంలో ఉన్న పెద్దగుట్టపైకి పరుగెత్తారు. ఇందులో మహిళలు దాతారుపల్లి వైపునకు వెళ్లి, అక్కడి నుంచి పెద్దగుట్టపైకి, మరో ఇద్దరు పురుషులు గుట్టల్లో రాళ్ల మధ్యలో నుంచి పెద్దగుట్టపైకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. వీరితో ఉన్న మరో బాలుడిని, హన్మకొండలో పట్టుబడిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు అడిగితే సరిగా చెప్పడం లేదని, వారి వద్ద ఆధార్ కార్డులు లేనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన హన్మకొండ పోలీస్ టీంలు, యాదగిరిగుట్ట పోలీసులకు స మాచారం ఇచ్చారు. హన్మకొండ, యాదగిరిగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి ముఠా సభ్యులను పట్టుకునేందుకు యాదగిరిగుట్టను జల్లెడ పడుతున్నారు. అయితే లాడ్జిలో పార్కిం గ్ చేసిన ముఠాకు చెందిన కారును పరిశీలించగా అందులో దాదాపు 80కి పైగా ఉన్న సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రంగుల చొక్కాలు ధరించి.. ఒక్కో సెల్‌ఫోన్ దొంగ ఒంటిపై రెండు రంగులు కనిపించే చొక్కా (బయటకి ఒక రంగు, లోపల నుంచి మరో రంగు).. దాని లోపల కాలర్ ఉన్న టీషర్ట్, దాని కింద రింగ్‌గా ఉండే టీషర్టు ధరించారని, పట్టుబడే క్రమంలో వెంట వెంటనే చొక్కా, టీషర్టు మార్చి దృష్టి మళ్లించడానికి ముఠా సభ్యులు పకడ్బందీగా చేశారని పోలీసులు అంటున్నారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని.. సెల్ఫోన్ల చోరీ ముఠా సభ్యులు కర్నూల్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే వీ రు రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని ప్రజల వద్దనుంచి చాకచక్యంగా సెల్ఫోన్లను తస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హన్మకొండలో పట్టుబడిన బాలుడికి చెందిన అక్క, బావ, వారి కుమారుడు వచ్చారని, పండుగలు జరిగినప్పుడు, రద్దీ గా ఉండే ప్రాంతాలు, కూరగాయల దుకా ణాల్లో, కూడళ్లు, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో సెల్ఫోన్లు కొట్టేసినట్లు సమాచారం. హన్మకొండలో బాలుడితో కలిపి నలుగురు అనుకున్న పోలీసులకు పాతగుట్టకు రాగానే మరో నలుగురు ఎక్కువ కనిపించడంతో కంగుతిన్నారు. అసలు ఈ ముఠా సభ్యులు ఎంత మంది..? వీరు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తునట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులు లేకుండానే.. లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చిన వివిధ ప్రాంతాల్లో భక్తులు యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్టలో ఉన్న పలు ప్రైవేట్ లాడ్జీల్లో బస చేస్తుంటారు. అయితే ఇదే తరుణంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసిన దొంగలు సైతం భక్తి ముసుగులో ఇక్కడికి వచ్చి ప్రైవేట్ లాడ్జీల్లో తలదాచుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే లాడ్జీల నిర్వహకులు, వాటిని కాంట్రాక్టు తీసుకున్న వారు బస చేయాలనుకునే వారి గుర్తింపు కార్డులు, ఎలాంటి ఆధారాలు లేకుండానే గదులను అద్దెకు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు గతంలోనే సూచిం చినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. హన్మకొండలో సెల్ఫోన్లు దొంగతనం చేసిన ముఠా సభ్యులకు చెందిన ఐడీ ఫ్రూఫ్, సీసీ కెమెరాలు ఉంటే మరింత సులువుగా కేసు ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా లాడ్జీ సమీ పంలో ప్రస్తుతం కర్నూల్ ముఠాకు చెందిన రెండు చొప్పున కార్లు, బైక్‌లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కచ్చితంగా మఠా సభ్యులు తమ విలువైన వాహనాల కోసం రావాలి కాబట్టి పోలీసులు అక్కడే మకాం వేశారు. వీరితో పాటు యాదగిరిగుట్ట పోలీసులు సైతం ముఠా సభ్యులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ‘గుట్ట’లో పట్టుబడిన దొంగతో సంబంధాలున్నాయా..? మూడ్రోజుల క్రితం యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తుల వద్ద సెల్ఫోన్లు అపహరిస్తూ స్థానికులకు ఓ దొంగ చిక్కాడు. చితకబాదిన అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగకు, హన్మకొండ నుంచి వచ్చిన సెల్ఫోన్ల చోరీ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదగిరిగుట్టలో దొంగ దొరికిన మూడు రోజులకే ఇక్కడ ఓ ప్రైవేట్ లాడ్జిలో దొంగల ముఠా తలదాచుకోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో పట్టుబడిన దొంగ అడ్రస్ తప్పుగా చెప్పి ఉంటాడని, అతడు కూడా కర్నూల్‌కు చెందిన ఈ ముఠాలోని సభ్యుడై ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. -
భార్యను కాపురానికి పంపలేదని..
హుజూర్నగర్ రూరల్ : అల్లుడి చేతితో ఓ అత్త దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హుజూర్నగర్ మండల పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామపంచాయతీ పరిధి మిట్టగూడెం గ్రామానికి చెందిన నాశబోయిన వెంకన్న, కాశమ్మ (46) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకన్న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటినుంచి కుటుం బ భారం కాశమ్మపైనే పడింది. కాయకష్టం చేసి తొలుత ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిపించింది. నాలుగేళ్ల క్రితం చిన్నకూమార్తెకు.. కుటుంబ పెద్ద మరణించినా కాశమ్మ కూలిపనులు చేస్తూ కడుపుకట్టుకుని చిన్న కుమార్తె లలితకు నాలుగేళ్ల క్రితం చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడేనికి చెందిన బొడ్డు అఖిల్‌కు ఇచ్చి వివాహం జరిపించింది. వీరికి ఓ మూడేళ్ల పాప కూడా ఉంది. అఖిల్ మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఓ బైక్ సర్వీసింగ్ పాయింట్లో వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాపురానికి పంపించడం లేదని.. ఒకటి రెండు రోజుల తర్వాత అఖిల్ భార్యను కాపురానికి పంపించాలని అత్త కాశమ్మకు ఫోన్లో బతిలాడాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తరచూ ఇదే తంతుగా మారిందని తన కూతురిని పంపించలేని తెగేసి చెప్పేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా అఖిల్ శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్తగారి ఊరైన మిట్టగూడేనికి చేరుకున్నాడు. అప్పుడే నిద్రపోయిన అత్తతో తన భార్యను కాపురానికి పంపించాలని వాగ్వాదానికి దిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘర్షణపడ్డాడు. అనంతరం పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త కాశమ్మపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. కత్తిదాడిలో కూప్పకూలిన తల్లిని చూసి లలిత హతాశురాలైంది. లబోదిబోమని మొత్తుకోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కాశమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కాగా, అత్తను దారుణంగా పొడిచి హత్య చేసిన అఖిల్ ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి రెండో కుమార్తె కన్నెబోయిన సుజాత భర్త సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హుజూర్నగర్ సీఐ రాఘవరావు తెలిపారు. మద్యానికి బానిసై.. సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చురేపింది. అఖిల్ సర్వీసింగ్ పాయింట్లో వర్కర్‌గా పనిచేయగా వచ్చి డబ్బులతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అఖిల్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య లలితతో నిత్యం ఘర్షణ పడుతుండేవాడు. భర్త దెబ్బలకు తాళలేక లలిత పుట్టింటికి వెళ్లిపోయేది. రెండుమూడు రోజుల తర్వాత అఖిల్ అత్తగారింటికి వెళ్లి నచ్చజెప్పుకుని ఇంటికి తీసుకొచ్చుకునేవాడు. మళ్లీ గొడవలు జరుగుతుండడంతో.. కొద్ది రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న అఖిల్ మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో గత నెల 25వ తేదీన పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన అఖిల్ భార్యతో మళ్లీ గొడవపడి చావబాదాడు. దీంతో భయాందోళన చెందిన లలిత అదే రోజు రాత్రి తల్లిగారి ఊరైన మిట్టగూడేనికి కూతురిని తీసుకుని వచ్చేసింది. -
అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!
సాక్షి, హుజూర్నగర్(నల్గొండ) : అల్లుడి చేతితో ఓ అత్త దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హుజూర్నగర్ మండల పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామపంచాయతీ పరిధి మిట్టగూడెం గ్రామానికి చెందిన నాశబోయిన వెంకన్న, కాశమ్మ (46) దంపతులకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకన్న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటినుంచి కుటుం బ భారం కాశమ్మపైనే పడింది. కాయకష్టం చేసి తొలుత ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిపించింది. నాలుగేళ్ల క్రితం చిన్నకూమార్తెకు.. కుటుంబ పెద్ద మరణించినా కాశమ్మ కూలిపనులు చేస్తూ కడుపుకట్టుకుని చిన్న కుమార్తె లలితకు నాలుగేళ్ల క్రితం చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడేనికి చెందిన బొడ్డు అఖిల్‌కు ఇచ్చి వివాహం జరిపించింది. వీరికి ఓ మూడేళ్ల పాప కూడా ఉంది. అఖిల్ మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఓ బైక్ సర్వీసింగ్ పాయింట్లో వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాపురానికి పంపించడం లేదని.. ఒకటి రెండు రోజుల తర్వాత అఖిల్ భార్యను కాపురానికి పంపించాలని అత్త కాశమ్మకు ఫోన్లో బతిలాడాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తరచూ ఇదే తంతుగా మారిందని తన కూతురిని పంపించలేని తెగేసి చెప్పేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా అఖిల్ శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్తగారి ఊరైన మిట్టగూడేనికి చేరుకున్నాడు. అప్పుడే నిద్రపోయిన అత్తతో తన భార్యను కాపురానికి పంపించాలని వాగ్వాదానికి దిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘర్షణపడ్డాడు. అనంతరం పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త కాశమ్మపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. కత్తిదాడిలో కూప్పకూలిన తల్లిని చూసి లలిత హతాశురాలైంది. లబోదిబోమని మొత్తుకోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కాశమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కాగా, అత్తను దారుణంగా పొడిచి హత్య చేసిన అఖిల్ ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి రెండో కుమార్తె కన్నెబోయిన సుజాత భర్త సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హుజూర్నగర్ సీఐ రాఘవరావు తెలిపారు. మద్యానికి బానిసై.. సాఫీగా సాగిపోతున్న వారి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చురేపింది. అఖిల్ సర్వీసింగ్ పాయింట్లో వర్కర్‌గా పనిచేయగా వచ్చి డబ్బులతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అఖిల్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్య లలితతో నిత్యం ఘర్షణ పడుతుండేవాడు. భర్త దెబ్బలకు తాళలేక లలిత పుట్టింటికి వెళ్లిపోయేది. రెండుమూడు రోజుల తర్వాత అఖిల్ అత్తగారింటికి వెళ్లి నచ్చజెప్పుకుని ఇంటికి తీసుకొచ్చుకునేవాడు. మళ్లీ గొడవలు జరుగుతుండడంతో.. కొద్ది రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న అఖిల్ మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో గత నెల 25వ తేదీన పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన అఖిల్ భార్యతో మళ్లీ గొడవపడి చావబాదాడు. దీంతో భయాందోళన చెందిన లలిత అదే రోజు రాత్రి తల్లిగారి ఊరైన మిట్టగూడేనికి కూతురిని తీసుకుని వచ్చేసింది. -
ప్రేమ పేరుతో విద్యార్థిని, ఆకతాయి చేష్టలకు వివాహిత బలి
సాక్షి, రామన్నపేట: ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని.. ఓ వ్యక్తి వేధింపులకు వివాహిత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్‌నారాయణపురం మండలకేంద్రానికి చెందిన పొట్ట వెంకటయ్య హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతని కూతురు (14) పదవ తరగతి చదువుకుం టోంది. వెంకటయ్య ఇంటికి సమీపంలో ఉండే సుక్క గిరిబాబు చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. వెంకటయ్య కుమార్తెకు సెల్‌కు ప్రేమ సందేశాలు పంపించడం, వెళ్లేదారిలో అడ్డుకుంటూ ప్రేమించాలని వేధించసాగాడు. ఇలా రెండు నెలలుగా ప్రేమ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం బయటకు పొక్కింది. ఇటీవల వెంకటయ్య చేతివేళ్లు విరగడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. గురువారం బోనాల పండుగ కావడంతో కుటుంబ సభ్యులు గుడి దగ్గరికి వెళ్లగా ఆ విద్యార్థిని ఇంట్లో ఒక్కతే ఉంది. ప్రేమ వేధింపుల విషయం తండ్రికి తెలిసిపోతుందనా లేక గిరిబాబు ఏమైనా వేధింపులు గురిచేశాడో తెలియదు కానీ ఆమె సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిం చింది. శుక్రవారం వెంకటయ్య బంధువులు రావడంతో సంఘటనపై ఆరా తీయగా విష యం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని చౌటుప్పల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు సందర్శించి వివరాలు సేకరించారు. తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిబాబు మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు. ప్రస్తు తం అతను పరారీలో ఉన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లింద్రండులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆకతాయి వేధింపులకు వివాహిత.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మా ని గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి లింగారెడ్డి–రాణిల మూడవ కుమార్తె శృతి(24)ని, గత మే 15న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ఇట్టె మహిపాల్‌రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. దంపతుద్దరూ హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో నివాముంటున్నారు. ఈ నెల ఆగస్టు 11,12,13 తేదీల్లో నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన ముడిదొడ్డి గణేశ్ అనే యువకుడు శృతికి ఆమె భర్త ఫోన్లకు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లు పెట్టడంతో పాటు ఫోన్‌చేసి వేధించాడు. గణేశ్ వేధింపులను శృతి తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లగా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దంపతులిద్దరూ ఈనెల 27న దుబ్బాక గ్రామానికి వచ్చారు. తిరిగి గణేశ్ అసభ్యపదజాలంతో ఇద్దరి ఫోన్లకు మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. దీంతో శృతి తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం 8.30గంటల సమయంలో స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానానికి వెళ్లిన శృతి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మహిపాల్‌రెడ్డి బాత్రూం వద్దకు వెళ్లి చూడగా ఊరివేసుకొని ఉంది. తలుపులు పగులగొట్టి బయటకు తీసుకువచ్చి చూడగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి బొమ్మిరెడ్డి లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చిల్లా సాయిలు తెలిపారు. వివాహానికంటే ముందు తన కూతురు శృతి బీఫార్మసీ చేసే సమయంలోనూ గణేశ్ ప్రేమ పేరుతో వేధించగా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బొమ్మరెడ్డి లింగారెడ్డి తెలిపారు. తన కూతురు మరణానికి గణేశ్ వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహసీల్దార్ వి.బ్రహ్మయ్య ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో పంచనామా నిర్వహించారు. రామాన్నపేట : శృతి మృతదేహం -
అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!
సాక్షి, భువనగిరి: నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లో మునిగితేలుతోంది. ఎంతలా అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతలా అందులో లీనం అవుతున్నారు. నిత్యం ఫేస్బుక్, వాట్సాప్ తదితర వాటిల్లో మునిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేసి మోసపోతున్నారు. కొంత మంది దుండగులు అమాయక యువతులనే ఆసరా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ బాలిక ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం పెంచుకొని, చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాల్సి న అవసరం ఉంది. పిల్ల్లలు ఫోన్లను మితిమీరిగా వినియోగించకుండా తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫేస్బుక్, వాట్సాప్, షేర్‌చాట్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, తదితర వాటిపై మునిగిపోతుంది నేటి యువత. సమయం తెలియకుండానే కాలాన్ని గడుపుతున్నారు. తాము చేసే పని వల్ల ఇతరులకి ఇబ్బందులు పెట్టడంతోపాటు, పరువు పోగొట్టుకోవడంతో చివరికి చావుకు దారితీసే పరిస్థితి వరకు వెళ్తున్నాయి. ఇంటర్నెట్ అపరిమితంగా అందుబాటులోకి రావడంతో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. టిక్‌టాక్ మోజులో పడి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఒకరకంగా ప్రస్తుతం నేరాల సంఖ్య పెరగడానికి సోషల్ మీడియానే కారణంగా చెప్పవచ్చు. ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లను ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకోవడంతోపాటు ప్రాణాలు సైతం హరింపజేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలను నిజమా, అబద్దమా గుర్తించకుండా అపరిచితులను పరిచయాలను చేసుకుంటూ అనర్థాలకు దారి తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫేస్బుక్లో పుట్టినతేదీ, తదితర తమ పర్సనల్ వివరాలు పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా తనకు దగ్గర ఫ్రెండ్స్ ఉన్నవారికి మాత్రమే వివరాలు కనిపించే విధంగా జాగ్రత్త పడాలి. లోకేషన్ హాలీడే ఫొటోలు ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల తాము ఎక్కడ ఉన్నదనేది గమనించి వారి ఇళ్లల్లో చోరీకి పాల్ప డే అవకాశం ఉంటుంది. ఆఫీస్ కార్యాలయాల్లో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఫొటోలను ఫేస్‌బుక్‌లలో పోస్టు చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పోస్టు చేయడం వల్ల కార్యాలయ వాసులు తెలుసుకుని వారిని చులకనగా చూడడంతోపాటు అవమానపర్చే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫోన్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లో ఫేస్బు క్లో పెట్టకూడదు. ఫోన్ నంబర్లు ప్రైవసీ సిట్టింగ్‌లలో మాత్రమే పెట్టాలి. మద్యం తాగే ఫొటోలు పెట్టడం వల్ల యువత ఉద్యోగాలను పొందే సమయంలోగాని, వివాహం చేసుకునే సమయంలోగాని వారి జీవితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫేస్‌బుక్‌లలో మాజీ ప్రియుడు, ప్రియురాళ్లతో ఫొటోలు అప్లోడ్ చేయకూడదు. ఇలాంటి ఫొటోలు పెట్టడం వల్ల వివాహ జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఫేస్‘బుక్’ నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా మంచిని తెలుసుకోవాల్సిన యువత పెడదోవపడుతూ ఫేస్‘బుక్’ అవుతుతోంది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను తెరిచి ఫేస్బుక్ డీపీగా అమ్మాయిల ఫొటోలు పెట్టి ఇతర అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకొని ఆతర్వాత ఫోటోలు షేర్ చేసుకొని ఇద్దరి మధ్య స్నేహ సంబంధం బలంగా ఏర్పడిన తర్వాత తాను అమ్మాయిని కాదని, అబ్బాయిని అని చెప్పి స్నేహాన్ని కొనసాగించి ప్రేమ పేరుతో వంచనకు గురి చేస్తున్నారు. మరికొందరు ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి ముఖం చాటేస్తున్నారు. పొరపాటున వచ్చిన ఫోన్‌కాల్‌తో మరికొందరు మోసగాళ్ల చేతిలో పడి విలువైన జీవితాన్ని కోల్పోతున్న సంఘటనలు అనేకం. అమ్మాయి పేరిట.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి నాగరాజు అమ్మాయి పేరిట ఫేస్బుక్ అకౌంట్‌ను ప్రారంభించి నల్లగొండకు చెందిన డిగ్రీ విద్యార్థితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. డిగ్రీ విద్యార్థిని వివరాలను సేకరించి నేను కూడా మీ పాఠశాల, మీ కళాశాలలోనే చదివానని, అమ్మాయి ఫొటోతో వివరాలు ఫేస్బుక్లో పెట్టాడు. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. చూడాలనిపిస్తుందని, నిన్ను చూసి చాలా ఏళ్లు గడిచాయని మధురమైన మాటలు చెప్పాడు. ఫుల్ ఫొటో పంపించాలని కోరడంతో మోపోయిన ఆ అమ్మాయి ఫొటోలను పంపించింది. ఆ తర్వాత నాగరాజు తాను అమ్మాయిని కాదని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అందుకు నిరాకరించిన ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. ఇద్దరు కలిసి ఉన్నట్లుగా, ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫేస్బుక్లో పెడతానని, పరువు పోతుందని బెదిరించడంతో పరువుపోతుందని రూ.3వేలు నాగరాజు ఖాతాలో వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పూల వ్యాపారి వలలో... వరంగల్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని నల్లగొండలోని పూలు అమ్ముకునే ఒక వ్యాపారికి పొరపాటున ఫోన్ టచ్ అయి వచ్చింది. ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ, మీ ఫ్రెండ్‌ను అంటూ మాటల్లో పెట్టి స్నేహం పెంచుకున్నాడు. 10వ తరగతి కూడా చదవని పూల వ్యాపారి వరంగల్‌కు చెందిన ఆ విద్యార్థినిని వలలో వేసుకున్నాడు. ఆ విద్యార్థిని పెళ్లి చేసుకుందామని నల్లగొండకు రావడంతో పూల వ్యాపారి భయపడి మైనార్టీ తీరలేదని, పెళ్లి చేసుకుంటామని పోలీసులను ఆశ్రయించాడు. 2ఏళ్ల క్రితం పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నేటి యువత స్మార్ట్‌ఫోన్ దొరికితే చాలు సమయం తెలియకుండా గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌లలో వ్యక్తుల గురించి తెలుసుకోకుండా పరిచయం చేసుకుని చాటింగ్‌లు చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టే ఫొటోలకు, కామెంట్లకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వ్యక్తుల మధ్య ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా పరిచయం పెంచుకుని అనర్థాలకు దారితీసుకుంటున్నారు. కొన్ని పరిచయాలు మరణాలకు సైతం దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని గాని పరిమితికి మించి వాడకూడదు. వ్యక్తిగత సమాచారాలను ఫేస్బుక్లో పెట్టకూడదు. ఫేస్బుక్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి. – భుజంగరావు, ఏసీపీ భువనగిరి నిబంధనలు అమలు చేయాలి ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలు లేకపోవడం వల్ల స్మార్ట్ఫోన్లను విరివిగా వాడుతున్నారు. చాటింగ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో కాలం గడుపుతున్నారు. ఫేస్బుక్ పరిచయాల వల్ల అనర్థాలకు దారితీస్తోంది. యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయాలతో ప్రాణాలు సైతం పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో నూతన చట్టాలను తీసుకువచ్చి మూడు నెలల్లో శిక్ష అమయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. – గొట్టిపాముల బాబురావు, అడ్వకేట్ యువత సోషల్ మీడియాతో చిత్తవుతోంది నేటి యువత సోషల్ మీడియా మత్తులో చిత్తయిపోతుంది. సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటుంది. టిక్‌టాక్ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూశాం. నేరాలకు ఒకరకంగా సోషల్ మీడియానే కారణం అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కనిపించని మనుషులతో కబుర్లు ఆడుతూ విలువైన కాలాన్ని హరింపజేసుకుంటున్నారు. కొంతమంది ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మాయిలను స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహం చేసేటప్పుడు అవతలి వ్యక్తి నిజమా, అబద్దమా తెలియకుండా గుడ్డిగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మోసపోవడం అనేది పరిపాటిగా మారింది. వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం, ఫొటోలను షేర్ చేయడం ద్వారా కూడా ఎదుటి వారి ఉచ్చులోకి పడిపోతున్నారు. ముఖ్యంగా యువతనే కాకుండా ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని లక్ష్య సాధనలో ప్రతి క్షణం కష్టపడాలి. – గంజి భాగ్యలక్ష్మి, మోటివేషనల్ స్పీకర్, నల్లగొండ -
చెట్టుకు కట్టేసి.. చితకబాది..
సాక్షి, నల్లగొండ: వివాహితను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన నల్లగొండ శివారులోని ఆర్జాలబావి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన వజ్జ శ్రీశైలం ఇంటర్ వరకు చదివి మద్యానికి బానిసౌ జులాయిగా తిరుగుతున్నాడు. రెండు నెలలుగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటి ఎదుట నుంచి బైక్‌పై చక్కర్లు కొడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో సదరు వివాహిత భర్త ఇంటి ఎదుట సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. వీడియో పుటేజీ ఆధారంగా గుర్తించి బుధవారం శ్రీశైలాన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అనంతరం ఇబ్బందులకు గురిచేస్తున్న వివాహితతోనే అతడిని చెప్పుతో చితకబాదించారు. ఆ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా హల్చల్ సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
కార్మిక శాఖలో వసూల్ రాజా
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): లంచం అడిగితే అధికారిని నిలదీయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నా అధికారుల తీరు మారడం లేదు. లంచం మహమ్మారి ఏదో ఒకే శాఖకు పరిమితం కాకుండా అన్నీ శాఖలకు అంటుకుంది. జిల్లా కార్మిక శాఖలో పైసలిస్తేనే ఫైలు కదులుతుందని గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు నేడు నిజమని తేలింది. కార్మికశాఖ డివిజన్ అధికారి ఓ మహిళ నుంచి రూ.500 లంచంగా తీసుకుని ఇవేం సరిపోతాయని అడుగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకుంటే.. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి భవన నిర్మాణ రంగం లేదా ఇతర రంగాల్లో కార్మికులుగా పనిచేస్తూ రూ.110 బ్యాంకుల్లో చెల్లించి కార్మిక శాఖలో సభ్యత్వ నమోదు చేసుకున్న కార్మికుడికి ప్రమాదం, డెలివరీ, వివాహ కానుకలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించే పథకం అమలులో ఉంది. కార్మిక శాఖలో నమోదైన కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. అదే విధంగా మహిళా కార్మికురాలు లేదా కార్మికుడికి కుమార్తెల వివాహాలకు వివాహ కానుకగా రూ.60వేలు ప్రసూతి సహాయంగా రూ.30వేల చొప్పున రెండు కాన్పులకు అందనున్నాయి. డబ్బులివ్వకుంటే కదలని ఫైలు ! జిల్లా కార్మికశాఖలో పైసలేనిదే ఫైలు కదలడం లేదని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా పెన్‌పహాడ్ మండల మహ్మదాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ నుంచి కార్మిక శాఖ డివిజన్ అధికారి లంచం తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం కలిగి ఉన్న తన భర్త ఇటీవల మరణించాడని ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయాన్ని ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా విచారణకు వెళ్లిన అధికారి కార్యాలయంలో తనను సంప్రదించాలని తెలిపినట్లు సమాచారం. కార్యాలయానికి వచ్చిన ఆమె నుంచి ఆన్లైన్ పేరుతో డబ్బులు ఇవ్వాలని అధికారి స్వయంగా అడిగినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆమె రూ.500 ఇచ్చి నేను పేదరాలినని ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని అధికారి వద్ద మొరపెట్టుకుంది. ఇవేం సరిపోతాయని అధికారి స్వయంగా అన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ విషయంపై సదరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అధికారి లంచం తీసుకుంటున్న వీడియోను జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు సైతం పంపినట్లు సమాచారం. కార్మికశాఖ అధికారి లంచాలకు కక్కుర్తి పడి గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన పేరుతో లబ్ధిదారులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరి నుంచి లంచం తీసుకోలేదు లేబర్ కార్డు ఉన్న లబ్ధిదారుల్లో ఎవరి నుంచి నేను లంచం తీసుకోలేదు. ప్రభుత్వం మార్చిన నిబంధనల మేరకు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచవలసి ఉన్నందున ఆన్లైన్ ఖర్చుల నిమిత్తం మాత్రమే డబ్బులు తీసుకున్నాను. కావాలనే కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. – వాల్యానాయక్, కార్మికశాఖ డివిజన్ అధికారి ఉన్నతాధికారులకు నివేదించాం కార్మిక శాఖ డివిజన్ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ నల్లగొండ, జాయింట్ కమిషనర్ హైదరాబాద్ వారికి చర్యల నిమిత్తం నివేదికలు అందించాం. విచారించి ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – శివశంకర్, సహాయ కమిషనర్, సూర్యాపేట -
ఆత్మహత్యలకు కేరాఫ్‌గా.. రైల్వేట్రాక్స్
సాక్షి, నల్లగొండ/ భువనగిరి: ప్రేమ విఫలమైందని.. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఆరోగ్య సమస్యలు కుదుటపడడం లేదని.. సంతాన భాగ్యం కలగలేదని.. ఉద్యోగం రావడం లేదనే ఆత్మన్యూనతా భావంతో ఎందరో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. కారణాలు ఏమైతేనేం క్షణికావేశంలో తమ నిండు ప్రాణాలను చేజేతులా బలితీసుకుంటున్నారు. అందుకు రైల్వేట్రాక్‌లు కేరాఫ్‌లుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైళ్ల కిందపడి 166మంది అఘాయిత్యాలకు ఒడిగట్టారని రైల్వేపోలీసుల రికార్డులు పేర్కొంటున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు క్షణికావేశంలో రైలు పట్టాలను కేరాఫ్‌గా మార్చుకుని అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అయితే ఇందులో ఎక్కువగా యువకులే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. క్షణికావేశంలో వెంటనే తీసుకుని సమీపంలో ఉన్న రైలు పట్టాలపైకి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతినెలా 6 నుంచి 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రైల్వేపోలీస్ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. మృతుల్లో అధికమంది 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎదిగివచ్చిన పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. అధికంగా ఎక్కడెక్కడంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వేస్టేషన్ల పరిధిలో అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైల్వే లైన్ పగిడిపల్లి నుంచి విష్ణుపురం వరకు 134.5 కిలోమీటర్లు, బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆలేరు వరకు 45 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. నల్లగొండకు అప్ అండ్ డౌన్ 32రైళ్లు, భువనగిరి–ఆలేరు మధ్య 37 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నార్కట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామానికి చెందిన వ్యక్తితో భారతికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు సంతానం. తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనారోగ్య కారణాలతో ఆ కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారం భారతిపై పడింది. తాను నార్కట్‌పల్లిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తూ బతుకుబండిని లాగిస్తోంది. అయితే డిగ్రీ చదువుతున్న భారతి కుమారుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆ యువతి తిరస్కరించడంతో గత ఏడాది అక్టోబర్‌లో సీతారాంపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మన్యూనతతో.. అధికంగా నల్లగొండ–రాయినిగూడెం, మిర్యాలగూడ–కొండ్రపోలు , బీబీనగర్–వంగపల్లి మధ్య, బీబీనగర్ పగిడిపల్లి మధ్య ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీస్ రికార్డుల పరిశీలనలో తేలింది. క్షణికావేశం, ప్రేమవిఫలం, ఉద్యోగాలులేవని అనేక రకాలుగా కలత చెందిన యువత ఆత్మన్యూనతా భావానికి లోనై ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తూ అఘాయిత్యానికి ఒడిగడుతున్నారని రైల్వేపోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య పిట్టల నర్సింహ మృతదేహం భువనగిరి అర్బన్: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తారకరామానగర్‌కు చెందిన పిట్టల నర్సింహ(41) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. భువనగిరి–పగిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న కిలోమీటర్ నంబర్ 245/11–13 వద్ద సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి వెంటనే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ టి.అచ్చుతం తెలిపారు. దంపతుల బలవన్మరణం ఆర్థిక ఇబ్బందులా..? సంతానం లేకనా..? నల్లగొండ క్రైం: పట్టణంలోని పాతబస్తీలోని మాల్బౌలికి చెందిన ఆటో డ్రైవర్ మురారిశెట్టి నగేశ్(36), భార్య చరిత(21) సోమవారం రాత్రి 9గంటలకు విజయవాడ నుంచి సికిం ద్రాబాద్ వైపు వెళ్తున్న అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా.. పిల్లలు లేరన్న కారణమా అన్నది తెలియరాలేదు. రైల్వే ఎస్సై అచ్యుత్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా జీవనంసాగిస్తున్న నగేశ్, భా ర్య చరితలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రైలుకు అడ్డంగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఎయిర్ పైప్‌కు అడ్డంగా మృతదేహాలు ఇరుక్కుపోవడంతో అర కిలోమీటర్ దూరం ఈ డ్చుకెళ్లింది. ఈ సంఘటనతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 8నిమిషాలు ఆగింది. ఎయిర్ పైప్‌కు అడ్డంగా ఉన్న మృతదేహం అవయవాలను తొలగించారు. ఆ తర్వాతనే రైలు సికింద్రాబాద్ వైపు నకు వెళ్లింది. లోకో పైలెట్ నల్లగొండ రైల్వేస్టేషన్ మేనేజర్ రవికుమార్‌కు సమాచా రం అందించారు. వెంటనే ఆయన పోలీసుల కు సమాచారం ఇవ్వడంతో మృతదేహాల అవయవాలను మంగళవారం మార్చురీకి తరలిం చి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగేష్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతోపాటు సంతానం లేదని మదన పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం నగేశ్‌తో చరితకు వివాహమైంది. వీరి స్వగ్రామం హాలియా మండలం యాచారం. అక్కడినుంచి వచ్చి నల్లగొండలో స్థిరపడ్డాడు. క్షణికావేశంలోనే.. క్షణికావేశంలోనే యువకులు ఆత్మహత్యే శరణ్యంగా భావించి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వస్తున్నారు. రైలు తాకిడికి వారి శరీరం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోతుండడంతో వాటిని తొలగించేందుకు మనస్సు గగుర్పొడుస్తుంది. అన్నం కూడా తినలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. – రైల్వే ఎస్సై, అచ్యుత్‌రామ్ -
దాయాదులే నిందితులు..!
సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదునుచూసి వెంబడించి వేటాడి ఘాతుకానికి ఒడిగట్టాడు. వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్యను దాయాదులే మట్టుబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ శివా రులో ఈ నెల 23న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోదంతా నికి పాల్పడిన నలుగురు నిందితులను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వలిగొండ గ్రా మానికి చెందిన బోయిన ఎట్టయ్య కుమారుడు శంకరయ్య(62) ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఎట్టయ్య పాలివారైన బోయిని బుచ్చయ్య కుమారుడు శంకరయ్య 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి చికెన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బంధువు చనిపోతే.. రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన బోయిన ఎట్టయ్య, బుచ్చయ్య బంధువు చనిపోయాడు. అంత్యక్రియలకు హైదరాబాద్‌లో ఉంటున్న శంకరయ్య కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆ సందర్భంలో శంకరయ్య వరుసకు కుమారుడైన శంకరయ్య భార్య చెవులను పట్టుకుని మాట్లాడాడు. అప్పటినుంచి శంకరయ్య భార్యకు చెవులు లాగడం, కడుపులో నొప్పిగా ఉండడం ఇతరత్ర అనారోగ్యాల బారిన పడింది. అయితే తన భార్య అనారోగానికి వరుసకు బాబాయి అయిన శంకరయ్య చేతబడి చేయడమే కారణమని భావించాడు. కక్ష పెంచుకుని.. తన భార్య అనారోగ్యం భారిన పడడానికి బాబాయి శంకరయ్యే కారణమని శంకరయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని శంకరయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు అదునుకోసం వేచి చూస్తున్నాడు. కొ ద్దిరోజులుగా శంకరయ్య కదలికలపై నిఘా పెట్టించాడు. ఒక్కడి వల్ల కాదని.. అయితే, బాబాయి శంకరయ్యను హత్య చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన శంకరయ్య తన చికెన్ దుకాణంలో పనిచేసే టేచౌత సాయికిరణ్, సంగెం గ్రామానికే చెందిన బోయిని ప్రభాకర్, బోయిని యాదయ్యలను ఆశ్రయించాడు. వరుసకు బాబాయి అయ్యే శంకరయ్యను హత్య చేసేందుకు సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటాడి.. వేటాడి.. సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 23(శుక్రవారం)న చౌటుప్పల్ మండలం వాయిళ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఒగ్గుకథ చెప్పేం దుకు ఉదయం వెళ్లాడు. అప్పటికే సమాచారం ఉన్న శంకరయ్య హైదరాబాద్ నుంచి స్కార్పియో వాహనంలో తన దుకారణంలో పనిచేసే సాయికిరణతో కలిసి చౌటుప్పల్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సంగెం గ్రామానికి చెందిన ప్రభాకర్, యాదయ్యలను కలుసుకున్నాడు. శంకరయ్య వాయిళ్లపల్లికి కథ చెప్పడానికి వెళ్లాడని తెలుసుకుని అక్కడే మాటేశారు. ఒగ్గుకథ పూర్తయిన తర్వాత శంకరయ్య ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అదే దారిలో స్కార్పియో వాహనంలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు శంకరయ్యను వెంబడించారు. సరిగ్గా సంగెం గ్రామ శివారులోకి రాగానే శంకరయ్య బైక్‌ను స్కార్పియోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య బైక్‌పైనుంచి ఎగిరి కిందపడడంతో వెంటనే స్కార్పియో నుంచి దిగిన శంకరయ్య, సాయికిరణ్ కత్తులతో అతడి గొంతు కోసేశారు. అనంతరం చెవులను కోసుకుని అక్కడినుంచి అదే వాహనంలో పరారయ్యారు. కాసేపు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన శంకరయ్య ప్రాణాలు విడిచాడు. అనుమానంతో అదుపులోకి తీసుకోగా.. శంకరయ్య తండ్రి ఎట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మొదట శంకరయ్య ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే హత్య చేసిన అనంతరం బుచ్చయ్య కుమారుడు శంకరయ్యపై పోలీసులకు అనుమానం కలిగింది. స్కార్పియో వాహనంలో ఆదివారం అతడు సాయికిరణ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళుతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. హత్యోదంతంలో పాల్గొన్న బోయిని ప్రభాకర్, యాదయ్యలను కూడా అరెస్ట్ చేసి కేసు నమో దు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు . -
భార్యకు వీడియో కాల్.. వెంటనే ఆత్మహత్య
సాక్షి, మిర్యాలగూడ: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాబునగర్ మాజీ కౌన్సిలర్ బంటు రామచంద్రు కుమారుడు బంటు రాజశేఖర్( 35) హైదరాబాద్‌లో నివాసముంటూ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. అంతే కాకుండా చిట్యాల సమీపంలో ఓ పరిశ్రమకు డైరక్టర్‌గా ఉంటూనే తన వ్యాపారాలు చూసుకునేవాడు. కాగా బంటు రాజశేఖర్ పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఏమైందో తెలియదు కానీ భార్య లక్ష్మి కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. రాజశేఖర్ రెండు రోజుల క్రితం మిర్యాలగూడలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో తన భార్య లక్ష్మికి వీడియో కాల్ చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో లక్ష్మి వెంటనే తన అత్తగారు బంటు కాత్యాయినికి ఫోన్ చేసి రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని చెప్పింది. వెంటనే రాజశేఖర్ నిద్రిస్తున్న గది తలుపులు తెరిచి అతడిని పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రోదిస్తున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో శాబునగర్ కాలనీ.. మాజీ కౌన్సిలర్ బంటు రామచంద్రు కుమారుడు రాజశేఖర్ మృతిచెందాడన్న వార్త తెలియడంతో కాలనీ ప్రజలు, పట్టణ వాసులు అతడి నివాసానికి భారీగా చేరుకున్నారు. స్నేహితులు రాజశేఖర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో బంటు రామచంద్రు, తల్లి కాత్యాయిని రోదించిన తీరు అక్కడి వారిని కలిచి వేసింది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు రాజశేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ బంటు రాజశేఖర్ అంతిమయాత్ర సాగింది. -
కాటేసిన కరెంట్: పండగపూట పరలోకాలకు..
సాక్షి, రాజాపేట (ఆలేరు): కరెంట్ కాటుకు మరో రైతు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన రాజా పేట మండలం మల్లగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని సాయిలు, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు రామచంద్రం, ఆంజనేయులు, నాగేష్‌లు. వీరిది వ్యవసాయ కుటుంబం, వీరంతా ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా ఆంజనేయులు (28)కు భార్య స్వప్న, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరికి రెండు ఎకరాలపైన భూమి ఉండగా పత్తి, మొక్కజొన్న, వరి సేద్యం చేశాడు. గురువారం రాఖీ పండుగ రోజు కావడం, ఉదయమే వరిపొలంలో ట్రాక్టర్ ద్వారా మడి దున్నిస్తున్నాడు. ట్రాక్టరుకు అడ్డుగా కిందికి వేలాడుతున్న విద్యుత్ సర్వీస్ వైరును కర్రసాయంతో పైకిలేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆంజనేయులు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నవయస్సులో ఆంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఆస్పత్రికి తరలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపారు. -
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. నేర నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. -
బాలుడి మృతి: తండ్రే హత్య చేశాడని అనుమానం
సాక్షి, నకిరేకల్: నాలుగు సంవత్సరాల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మండల పరిధిలో కలకలం రేపుతోంది. రాత్రి వరకు బాగానే ఉన్న బాలుడు తండ్రి వద్ద పడుకొని తెల్లవారే సరికి శవంగా మారడం పలు అనుమానాలకు దారితీస్తుంది. కన్న కొడుకును పెంచి పెద్దచేసి భవిష్యత్‌లో ప్రయోజకుడిగా తీర్చిదిద్దాల్సిన తండ్రి కసాయిగా మారాడా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయవిదారక సంఘటన మండలంలోని తిరుమలరాయినిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెంకు చెందిన చింతల కనకయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంనకు చెందిన ఓ యువతితో మొదట వివాహం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా ఆమె కనకయ్యతో విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. అనంతరం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య ఎల్బీనగర్లో నివాపం ఉంటూ రోజువారి కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జనగాం జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపధ్యంలో స్వప్నతో కనకయ్యకు పరిచయం ఏర్పడింది. అనంతరం కొంత కాలం క్రితం వారికి పెళ్లి అయింది. ప్రస్తుతం కనకయ్య–స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు అక్షయ్(4) ఉన్నారు. అనంతరం కొంత కాలంగా వీరు హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసం ఉంటూ రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు అధికం కావడంతో కొన్ని రోజులుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు. కొడుకుని తీసుకొని పెదనాన్న ఇంటికి వచ్చిన కనకయ్య భార్యాభర్తల గొడవలతో దూరంగా ఉంటున్న కనకయ్య బిడ్డను తల్లిదగ్గర ఉంచి కొడుకు అక్షయ్‌ను తీసుకొని నెలన్నర క్రితం తిరుమలరాయినిగూడెంలో ఉంటున్న తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మృతుడు అక్షయ్‌కు తండ్రి కనకయ్య అంటే అనేకమైన ఇష్టం. తండ్రిని విడిచి క్షణం కూడా ఉండేవాడుకాదు. అడపాదడపా కూలి పనులకు వెళ్లే కనకయ్య ఇంటికి రాగానే అక్షయ్ తండ్రి వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలో రోజువారి మాదిరిగానే గురువారం రాత్రి భోజనం అనంతరం కొడుకు అక్షయ్‌ను తనవద్దనే పడుకోబెట్టుకొని నిద్రించాడు. తెల్లవారే సరికి శవంగా... తెల్లవారే సరికి అక్షయ్ ఇంటిముందు మంచంలో పడుకొని ఉన్నాడు. తెల్లవారుజామున నిద్రలేచిన చింతల రాములు కుటుంబ సభ్యులు ఇంటిముందు మంచంలో అక్షయ్ కళ్లు మూసుకొని ఉండటాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నాడు. దీంతో లబోదిబోమనడంతో చుట్టు పక్కలవారు వచ్చి అక్షయ్‌ను పరిశీలించగా చిన్నారి అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఇంట్లో కనకయ్య లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా కనిపించకపోవడంతో అతనే హత్య చేసి పారిపోయాడని పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కనకయ్యే అక్షయ్‌ని హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పెళ్లికి అడ్డుగా ఉన్నాడని... మొదటి నుంచీ గొడవలు పడే లక్షణాలు కలిగిన కనకయ్యకు మొదటి భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోవడం, రెండవ భార్య ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కుటుంబ గొడవలతో దూరంగా ఉండటంతో మూడవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దాంతో పెళ్లికి కుమారుడు అక్షయ్ అడ్డుగా మారడంతో తనకు మరో మహిళతో పెళ్లి కాదని భావించిన కనకయ్య గొంతునులిమి హత్యచేసి పారిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ తిరుమలరాయినిగూడెంలో చిన్నారి చింతల అక్షయ్ హత్యాస్థలాన్ని సీఐ క్యాస్ట్రో పరిశీలించారు. చిన్నారి హత్యకు గల కారణాలను చింతల రాములు కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతల రాములు ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
గుజరాత్ కోర్టుకు ఐఎస్ఐ తీవ్రవాది
సాక్షి, నల్లగొండ: గుజరాత్ హోంమంత్రి హరెన్‌పాండ్య హత్యకేసులో, మిర్యాలగూడ ప్రణయ్ కేసులో నిందితుడిగా ఉన్న ఐఎస్ఐ తీవ్రవాది అస్గర్ అలీని గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ జిల్లా పోలీసులు గుజరాత్‌కు తరలించారు. హోంమంత్రి హరెన్‌పాండ్య హత్య కేసులో అస్గర్ కీలక నిందితుడు. గుజరాత్లో కేసు నమోదు కావడంతో అక్కడి కోర్టులో విచారణ సాగుతోంది. కాగా, ప్రణయ్ హత్యకేసులో పీడీ యాక్ట్ కింద వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్గర్ అలీ ఇటీవల విడుదలయ్యా డు. వరంగల్ జైలునుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రణయ్ హత్యకేసులో మరో నింది తుడు అబ్దుల్ బారీ, మారుతీరావులను కలిసి భూ సమస్య సెటిల్మెంట్ని, డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉందని గుర్తించిన పోలీ సులు అతని కదలికలపై నిఘాఉంచారు. గంజాయి కేసులో పోలీసులకు చిక్కడంతో జిల్లా జైలుకు పంపించారు. కేసు విచారణ కొనసాగుతుండగానే అస్గర్‌అలీని గుజరాత్ కోర్టు జిల్లా పోలీసులను స్థానిక కోర్టులో హాజ రుపరచాలని ఆదేశించింది. దీంతో పటి ష్ట భద్రత మధ్య గుజరాత్‌కు తరలించినట్లు జి ల్లా ఇన్చార్జ్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరైనా సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని కోరారు. -
మాకేదీ న్యాయం? :హాజీపూర్ వాసులు
సాక్షి, యాదాద్రి: పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఇచ్చే తీర్పు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరంగల్‌లో 9నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంతో మరోసారి హజీపూర్ ఘటన తెరపైకి వచ్చింది. తమ పిల్ల ఉసురు తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో మరెవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కోర్టు ఇచ్చే తీర్పు కఠినంగా ఉండాలని వారు కోరుతున్నా రు. హన్మకొండ కోర్టులో తీర్పు వచ్చినంత తొం దరంగా హజీపూర్ కేసులో ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరిజోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30వ తేదీన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. చార్జి్జషీట్ దాఖలుతో.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కçస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాం గం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండుసార్లు పోలీస్ కస్టడీకి హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని మూడు హత్య కేసులపై పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటిసారి మే 8నుంచి 13వరకు, రెండోసారి జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సత్వరమే తీర్పు ఇవ్వాలి అపహరణ, లైంగికదాడి, హత్యలు లాంటి కేసుల్లో సత్వరమే తీర్పు ఇవ్వాలి. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలి. వరంగల్ నిం దితుడు ప్రవీణ్ కేసులో న్యాయం జరిగిందని, అలాగే శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేస్తే ప్రజలకు మనోధైర్యం కలుగుతుంది. ప్రజ లకు కోర్టుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారికి కోర్టు తీర్పులు చెంపపెట్టుకావాలి. హజీపూర్ బాధితులకు న్యా యం జరగాలి. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలి. – కొడారి వెంకటేశ్, సామాజిక ఉద్యమకారుడు ఉరిశిక్ష విధించాలి 9నెలల చిన్నారి శ్రీహిత కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడం సరైందే. ముగ్గురు ఆడపిల్లలపై కిరాతకంగా వ్యవహరించిన మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్షే విధించాలి. కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిందితుడి తరఫున అడ్వకేట్‌ను నియమించడం సరికాదు. –పాముల నర్సింహ, శ్రావణి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు ఆడ పిల్లలపై మృగంలా ప్రవర్తించిన సైకో శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు. ఇలాంటి మనుషులు బతికుంటే భూమిపైన ఆడోళ్లకు భద్రత లేదు. సర్కారోళ్లు ఇంకా శ్రీనివాస్‌రెడ్డిని చంపకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుస్తలేదు. శ్రీనివాస్‌రెడ్డి చస్తనే మా పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి బహిరంగంగా ఉరి తీయాలి మా బిడ్డలపై దారుణాలకు ఒడగట్టిన శ్రీనివాస్‌రెడ్డి బ హిరంగంగా అందురు చూస్తుండగానే ఉరి తీయాలి. శ్రీనివాస్‌రెడ్డి చావును చూసి పాపం చేయాలనుకునే వాళ్లకు భయం పుట్టాలి. ఆడపిల్లలను కనడమే పాపమైంది. ప్రభుత్వం శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష అమలు చేసి నేరస్తులకు భయం పెట్టాలి. లేకుండా సర్కారుపై నమ్మకం లేకుంటాపొతది. – తిప్రబోయిన మల్లేష్, మనీషాతండ్రి అక్టోబర్‌లో తుది తీర్పు హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో అక్టోబర్‌లో తుది తీర్పు వస్తుంది. సెషన్స్ కోర్టు నల్లగొండలో వచ్చే నెల మొదటి వారంలో విచారణ ప్రారంభంకానుంది. నిందితుడిపై మూడు కేసులు ఒకేసారి నమోదు చేయడం, డీఎన్ఏ నివేదిక, విచారణలో భాగంగా పలు ఆధారాల సేకరించి చార్జిషీట్ దాఖలు చేశాం. – నారాయణరెడ్డి, భువనగిరిజోన్ డీసీపీ -
కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనవాసనగర్లోని తిపిరిశెట్టి రాజు ఇంట్లో కింది పోర్షన్లో తాటిపల్లి రమాదేవి (55) కొంత కాలంగా అద్దెకు నివాసం ఉంటుంది. భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని గమనించి పై అంతస్తులో ఉన్న రాజు కుమారుడు ఆమెను కాపాడేందుకు పై అంతస్తు నుంచి కిందకు దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒకేసారి దూకడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. రమాదేవి అప్పటికే 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పవన్‌ను కోదాడలో ఓ పైవేట్ వైద్యశాలకు తరలించి విరిగిన రెండు కాళ్లకు కట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాయింట్’ దోపిడీ..!
సాక్షి, దేవరకొండ: హడావుడిగా ఆఫీస్‌కు బయల్దేరుతూ దారిలో ఏ బంక్ వద్ద అయినా ఓ రూ.100 పెట్రోల్ పోయించుకుంటే తెలియకుండానే ఓ పాయింట్ ఎగిరిపోతోంది. దీనికి తోడు ఓ రూ.10పైసల నుంచి రూ.20 పైసలు తక్కువ పోసినా తొందరలో ఉన్న కస్టమర్లు గట్టిగా అడగలేరు. ఇది పెట్రోల్ బంకుల్లో నిత్యం జరుగుతున్న తంతు. ఇలా రోజు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. హైవే వెంట ఉన్న పెట్రోల్ బంకుల్లో ప్రతి నిత్యం పైస పైస పక్కపెడుతూ రూ. లక్షలు దోచుకుంటున్నారు. బంకుల్లో పెట్రోల్ పోయించే సమయంలో పాయింట్లలో గోల్మాల్ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టమర్లకు కొందరు రూ.10పైసలు, రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాయింట్లకు కోత పాయింట్లలో కోతతో వినియోగదారులు తెలియకుండానే నష్టపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో ధరల పట్టికలు ఉంచడం లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.75 ఉంది. కంపెనీని బట్టి ధరల్లో తేడా ఉంటుంది. రోజు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడున్న ధరకు లీటర్‌పై రూ.10పైసలు, రూ.20పైసలు పెరిగినప్పుడు యూనిట్ లెక్కించరు. లీటర్‌కు 10 పాయింట్లుగా లెక్కిస్తారు. కనీసం రూ.35పైసలకు పైగా పెరిగితేనే యూనిట్ వస్తుంది. చాలా మంది వాహనదారులు లీటర్ చొప్పున కాకుండా రూ.50, రూ.100 ఇలా పెట్రోల్ పోయించుకుంటుంటారు. ఇక్కడే అసలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లీటర్ ధర రూ.75 ఉంటే ఒక పాయింట్ విలువ 7.5యూనిట్ లెక్కన చూయిస్తుంది. అయితే వినియోగదారులు ఎవరూ ఎన్ని పాయింట్లు పోస్తున్నారనేది సరిగా గమనించలేకపోతున్నారు. చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. దీన్ని అవకాశంగా భావించి కొందరు బంకుల్లో అరపాయింట్ తగ్గించి పెట్రోల్పోస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అరపాయింట్కు రూ.3.50 వినియోగదారుడు నష్టపోతున్నట్లే. ఈ రూ.3 నష్టపోవడంతో పాటు పెట్రోల్ బంక్ యజమానులకు పెట్రోల్ ఆదా అవుతుంది. ఈ లెక్కన రోజుకు వేల లీటర్లు అరపాయింట్ చొప్పున తగ్గించినా వేలలో ఆదాయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు వదిలేస్తున్న సదరు యజమానులకు లక్షలు మిగుల్చుతున్నాయి. ఈ మోసాన్ని వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. అప్పుడప్పుడు తని ఖీలు చేస్తున్నా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. రూ.10పైసలు, రూ.20పైసలు తక్కువగానే చాలా మంది బంకుల్లో పని చేసే సిబ్బంది రూ.10 పైసల నుంచి రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మనం ఇచ్చే డబ్బులకు పూర్తి స్థాయిలో పెట్రోల్ పోయకుండానే చేతిలో ఉన్న క్లచ్‌ను ఆపివేస్తున్నారు. చిన్న మొత్తమైనా పరిశీలిస్తే లక్షల్లో జరుగుతున్న మోసం బయటపడుతుంది. ఇది ప్రతి బంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు పాయింట్ల కోతతో పాటు ఇలా కూడా వినియోగదారుడు మోసపోతున్నాడు. బంకులో అన్ని మోసాలే మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకులో రూ.వంద పెట్రోల్ పోసుకుంటే రూ.99 మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారితో గొడవకు దిగుతున్నారు. ప్రతి వాహనదారుడికి ఇదే సమస్య ఉంది. వాహనదారులు పాయింట్ దోపిడీకి గురికాక తప్పడం లేదు. అధికారులు ఈ దిశగా తనిఖీలు చేపట్టి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలి. –బొడ్డు మహేశ్, చింతపల్లి అన్నీ అవకతవకలే.. పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జ రుగుతున్నాయి. సంబంధిత తూనికల కొలతల శాఖ అధికారులు కా కుండా పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన అధికారులు సక్రమంగా లేకపోవడంతో ఈ అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం పెట్రోల్ బంక్ యజమానులకు వరంగా మారుతోంది. లీటర్ పెట్రోల్‌కు అరపాయింట్ వరకు తక్కువగా పోస్తున్నారు. ఇలాగే లీటర్ ధరలోనూ తేడాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలి. –వింజమూరి రవి, సర్పంచ్, వర్కాల -
డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు
సాక్షి, సూర్యాపేట: వైద్యుడు దేవుడితో సమానమంటారు.. కానీ కొందరు వైద్యులు డబ్బులకు కక్కుర్తిపడి వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు.. చనిపోయిన విషయం చెప్పకుండా.. ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తీసిన ఓ తెలుగు సినిమాలోని సీన్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పునరావృతమైంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..జనగాం జిల్లా కొడకండ్ల మండలం హక్యతండాకు చెందిన గుగులోతు సరిత(28)కు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో వైద్యులు ఆపరేషన్ చేయడంతో సరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది ఆపరేన్ గది నుంచి శిశువును బయటికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సరితను బయటికి తీసుకరాకపోవడంతో వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని బంధువులు నిలదీశారు. వైద్యులు మాత్రం ఎవరికేం కాలేదంటూ గంటల తరబడి మృతి చెందిన సరితను చూపకుండా ఠాగూర్ మూవి సీన్‌ను తలపించే విధంగా వ్యవహరించారు. మొత్తం డబ్బులు కడితేనే సరితను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆ మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత సరిత మృతిచెందిందని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆపరేషన్ వికటించే చనిపోయిన సరితను ఆపరేషన్ థియేటర్లో ఉంచి డబ్బులు చెల్లించాక మృతి చెం దిందని చెప్పడమేం టని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను సద్దు మణిగింపచేశారు. అయితే ఇదే ఆస్పత్రిలో ఇటీవల బాలింతల మృతిచెందుతుండడంతో గర్భిణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా ఆసుపత్రిలో వైద్యురాలి అందుబాటులో లేకున్నా అడ్మిట్ చేయించుకొని గర్భిణి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
సాక్షి, నల్గొండ : గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని బెట్టెగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ అచ్చయ్య తనకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళంవేసి పొలానికి వెళ్లారు. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించగా బీరువాలో ఉన్న రూ. 3వేలు తులంన్నర బంగారు మాటీలు, చెవి దిద్దులు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. బాధితుడు కొండ అచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. -
నెత్తురోడిన రహదారులు
సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలోని రహదారులు మరోమారు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ, గరిడేపల్లి, మునగాల, వేములపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. గరిడేపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పోలె రాంబాబు (32) చిన్నపంగ చిన్నస్వామి(55) బైక్‌పై మండల కేంద్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి నుంచి గరిడేపల్లి వైపు వస్తున్న బొలేరో గడ్డిపల్లి శివరులో ఎదురుగా వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పోలె రాంబాబు, చిన్నపంగ చిన్నస్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. బ్యాంక్ పని నిమిత్తం వెళ్లిన మామా అల్లుడు కాసేపటికే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్ఐ వై.సైదులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి.. మునగాల(కోదాడ): మండలంలోని తాడువాయి గ్రామానికి చెందిన వీరమళ్ల ఉపేందర్(30) తన ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా విజయవాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్లే స్కార్పియో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఐదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఉపేందర్ మృతదేహంపై పడి భార్య తిరుమల రోదిస్తున్న తీరును చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. కారు, బైక్ ఢీ.. ఒకరు.. వేములపల్లి (మిర్యాలగూడ) : మండలంలోని బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన పుట్ట శ్రీను(34) బైక్‌పై శెట్టిపాలెం శివారులోని ఆదిత్యా రైస్ మిల్లు వైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు అన్నపురెడ్డిగూడెం స్టేజి వద్ద రోడ్డును దాటుతున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి నల్లగొండ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పంచనామా నిర్వహిం చారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోçస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి మృతుడు పుట్ట శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్‌నాయక్ కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీను మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు అయిన శ్రీను మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పరామర్శించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, నాయకులు రావు ఎల్లారెడ్డి, రొండి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కారు బోల్తా.. ఇద్దరు.. నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన బొప్పని నరేశ్ (32), పల్లపు అనిల్‌రాజు(37) స్నేహితులు. పని ఉందని సోమవారం రాత్రి పదిగంటలకు ఇంటినుంచి కారులో బయటికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వస్తుండగా పట్టణ శివారులో లెప్రసీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బొప్పని నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అనిల్‌రాజు తీవ్రంగా గాయపడ్డాడు. స్థాని కులు అతడిని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనిల్‌రాజు స్థానిక హుందాయ్ షోరూంలో పనిచేస్తుండగా, నరేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.సమాచారం మేరకు ఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్ఐ నర్సింహులు పరిశీలించారు. నరేశ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, తిప్పర్తి (నల్లగొండ) : మండల పరిధిలోని జొన్నగడ్డలగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు భూ తగాదాలే కారణమని తెలిసింది. సోదరుడు, అతడి భార్య కలిసి ఘా తుకానికి ఒడిగట్టినట్టు సమాచారం. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ముదిగొండ శంకర్ అతని సోదరుడు రమేష్‌ల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. పలుమార్లు గ్రామంలోనే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రెండెళ్ల క్రితం శంకర్‌పై అతని తమ్ముడు మరి కొందరితో కలిసి దాడి చేసి గాయపర్చారు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. భూమి కొనుగోలు విషయంలో.. గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి అన్నదమ్ములిద్దరూ భూమి కొనేందుకు ఒకరికి తెలియకుండా ఒకరు అడ్వాన్స్ ఇచ్చారు. దీంతో మొదలైన వివాదం దాడులు చేసుకునే వరకు వచ్చింది. అయితే పెద్ద మనుషుల సమక్షంలో చెరి సగం చేసుకోవాలని సూచించగా ఒకరు ఒప్పు కోలేదు. దీంతో కొన్ని రోజులు ఆ కొనుగోలు చేసిన భూమి ఎవరూ సాగు చేయకుండా అలాగే ఉంది. అయితే ఇటీవల శంకర్ మొత్తం ఎకరన్నర భూమిని దున్నుకున్నాడు. దీంతో వివాదం ముదిరింది. తాటిచెట్టు ఎక్కేందుకు రాగా.. తాను కొనుగోలు చేయాలనుకున్న భూమికి శంకర్ కూడా అడ్వాన్స్ ఇవ్వడాన్ని రమేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా శంకర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం శంక ర్ తాటి చెట్టు ఎక్కే ప్రాంతంలో భార్యతో కలిసి మాటు వేశాడు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న శంకర్ తలపై వేప కట్టెతో ఒక్కసారిగా దాడి చేయడంతో కిందపడిపోయాడు. దీంతో అదే కర్రతో తలపై మోదడంతో అక్కడికక్కడే శంకర్ మృతిచెందాడు. వెంటనే రమేష్ అక్కడి నుంచి తన భార్యతో కలిసి పరారయ్యాడు. శంకర్ భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమేష్ అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. దంపతులిద్దరే ఘాతుకానికి ఒడిగట్టారా..? హత్యోదంతంలో మరికొందరు భాగ్వాములయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు
బొమ్మలరామారం (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామారం మండలం పాత రంగాపూర్‌లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హైమావతిని ఆమె భర్త శ్యామ్‌కుమార్‌రెడ్డి, అత్తామామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పెద్దపర్వతాపూర్ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మూడు గంటల పాటు పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. నిందితులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. సహనం కోల్పోయిన బాధితులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, స్ధానిక ఎస్ఐ మధుబాబుతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యేక పోలీసు, అదనపు బలగాల తోపులాటలు, బాధితుల రోదనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మృతురాలి భర్త శ్యామ్ కుమార్‌రెడ్డికి చెందిన కారును తన గేదెలషెడ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. శాంతింపజేసిన ఏసీపీ ఈనేపథ్యంలో ఘటనస్థలానికి చేరుకున్న ఏసీపీ భుజం గరావు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. తాత్కాలికంగా నిరసన విరమించిన తరుణంలో రోడ్డు క్లియరెన్స్‌కు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి పెద్దపర్వతాపూర్‌కు వెళ్లే రోడ్డు దాకా వెళ్లారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించాలని కొందరి యువకులను గద్దిస్తూ చేసు చేసుకున్నారు. యువకులపై సీఐ దాడి చేశారని తెలుసుకున్న పలువురు మహిళలు పోలీసులపై తిరగబడి దాడికి యత్నించారు. సహనం కోల్పోయిన పోలీసులు సైతం రోడ్డుపక్కనున్న చెట్ల కొమ్మలను విరిచి లాఠీచార్జ్‌కు ప్రయత్నించారు. కొద్ది సమయం పోలీసులకు.. మహిళలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఏసీపీ భుజంగరావు మరోసారి రంగప్రవేశం చేసి గ్రామస్తులను, మహిళలను సముదాయించారు. దీంతో హైమావతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భునవగిరి జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. బాధితులకు న్యాయం చేస్తాం అనుమానాస్పదస్థితిలో హైమావతి, ఆమె కూతురు నందిక మృతిచెందిన ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామని ఏసీపీ భుజంగరావు మరోసారి హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైమావతి భర్త శ్యామ్‌కుమార్‌రెడ్డితో పాటు అతని తల్లిదండ్రులపై అదనపు కట్నం వేధింపులు, హత్య కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. కాగా, నిందితులైన మర్రి శ్యామ్ కుమార్‌రెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
మ‘రుణ’ శాసనం
ఉన్నత చదువులు చదివిన అతను మొదట్లో ఓ ప్రైవేట్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.. ఉన్నట్టుండి ఆ పవర్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడంతో కొందరు ఉద్యోగులపై వేటు తప్పలేదు. దీంతో అతను కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ రైస్‌మిల్లులో గుమాస్తాగా కుదిరాడు. చాలీచాలని వేతనం.. అది కూడా సమయానుకూలంగా ఇవ్వకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాడు. దీంతో పూట గడవడమే కష్టంగా మారడంతో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. కాలం గడిచిపోతున్నా.. చేసుకునేందుకు పని లేక ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోయాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబంలో ముగ్గురు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని మరణ శాసనం లిఖించుకున్నారు. మిర్యాలగూడలో చోటు చేసుకున్న విషాదకర ఘటన వివరాలు.. మిర్యాలగూడ అర్బన్ : పట్టణంలోని సంతోనగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పారేపల్లి సురేందర్‌కు ఇద్దరు కుమారులు.వారిలో చిన్న కుమారుడు పారేపల్లి లోకేశ్వర్(45) బీకాం, ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. లోకేశ్వర్‌కు నల్లగొండకు చెందిన చిత్రకళ(36)తో 11ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి లోహిత్కుమార్(12 ), విగ్నేష్ ఇద్దరు కుమారులున్నారు. లోకేశ్వర్ ఎనిమిదేళ్లుగా వాడపల్లిలోని పవర్‌ప్లాంట్‌లో పనిచేశాడు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో జీతాలు చెల్లించలేని స్థితిలో ఏడాది క్రితం కొందరు ఉద్యోగులను తొలగించింది. అందులో లోకేశ్వర్ కూడా ఉన్నాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న జీవనగమ నం ఒక్కసారిగా అతలాకుతలమైంది. తన చదువుకు సరికాకపోయిన కుటుంబాన్ని పోషించుకునేందుకు లోకేశ్వర్ పట్టణంలోని ఓ రైస్ మిల్లులో గుమాస్తాగా మారాడు. చాలీచాలని వేతనంతో ఇంటి అద్దె కూడా భారం కావడం, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానన్న బాధతో కుమిలిపోయాడు. కుటుంబ పోషణ నిమిత్తం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. కుమారుడి ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన తండ్రి పారేపల్లి సురేందర్ కుమారుడి కుటుంబాన్ని తీసుకువచ్చి తన వద్దే ఉంచుకుంటున్నాడు. తల్లిదండ్రి పెద్దకుమారుడి ఇంటికి వెళ్లగా.. పారేపల్లి సురేందర్ పెద్దకుమారుడు గురుప్రసాద్ నల్లగొండలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా, పారేపల్లి సురేందర్ తన భార్యతో కలిసి మంగళవారం పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఎక్కడ ఉద్యోగం లేక ఇళ్లు గడవక, అప్పులు తీర్చలేక కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న లోకేశ్వర్ రాత్రి 11గంటల సమయంలో పురుగుల మందుతో పాటు కూల్‌డ్రింక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే చిన్న కుమారుడు విగ్నేష్ నిద్రపోగా భార్య చిత్రకళ, పెద్దకుమారుడు లోహిత్‌తో కలిసి తనూ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగారు. సోదరికి ఫోన్ చేసి.. అనంతరం అర్ధరాత్రి 2గంటల సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరికి ఫోన్‌చేసిన లోకేశ్వర్ తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కంగారుపడిన లోకేశ్ అక్క నల్లగొండలో ఉన్న సోదరుడికి ఫోన్‌చేసి విషయం చెప్పింది. వెంటనే 100కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే చిత్రకళ, లోహిత్‌లు మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న లోకేశ్వర్‌ను 108 సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేశ్వర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తెలుసుకున్న పారేపల్లి సురేందర్ సహా అతడి కుటుంబ సభ్యులు ఉదయం ఇంటికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ సదానాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పి.శ్రీనివాస్ ఏరియా ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతుల ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు గత కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మమ్మల్ని క్షమించండి ‘‘తాము ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మమ్మల్ని క్షమించండి.. నాన్నా స్నేహితుల వద్ద అప్పు చేశాను. వారికి ఆ డబ్బు చెల్లించండి’’ అంటూ లోకేశ్వర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మైసమ్మతల్లి విగ్రహం అపహరణ
యాదగిరిగుట్ట (ఆలేరు) : దండగులు ఆలయంలోని మైమ్మ అమ్మవారి విగ్రహాన్ని అపహరించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పెద్దిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన భక్తులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దిరెడిగూడెంలో కొన్ని సంవత్సరాల క్రితం మైసమ్మ వేప చెట్టు కింద వెలసింది. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం అమ్మవారిని పూజించేందుకు స్థానికంగా ఉన్న రైతులు వెళ్లారు. దీంతో గుడిలో అమ్మవారు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురైన రైతు, పాతగుట్టలో ఉంటున్న పెద్దిరెడ్డిగూడెం గ్రామస్తులకు తెలిపారు. అక్కడ పరిశీలించిన గ్రామస్తులు ఆలయం వద్ద క్షుద్ర పూజలు చేసి ఉంటారని, చంద్రగ్రహనం రోజున పూజలు చేసి అమ్మవారిని, అమ్మవారిపై ఉన్న బంగారు పుస్తె, మెట్టెలను తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆలయానికి ఉన్న గేట్ వద్ద, చెట్ల పొదల్లో కంకణాలు, చిన్న చిన్న గురుగులు పడేయంతో పాటు కుంకుమ, పసుపు చల్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటివి కాలేదని, ప్రస్తుతం ఈ పూజలు చేసి అమ్మవారిని గుడిలో నుంచి తీసుకెళ్లడంతో భయం వేస్తుందని మహిళలు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమైంది. -
బావిలో పడిన దుస్తులు తీయబోయి..
నార్కట్‌పల్లి (నకిరేకల్) : చేతబావిలో పడిన దుస్తులను తీసేందుకు అందులోకి దిగిన ఓ వ్యక్తి ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం చిన్నతుమ్మలగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ బీమార్జున్‌రెడ్డి (38) వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన ఇంటి ఆవరణలో 50 ఫీట్ల లోతు ఉన్న చేత బావిలో పిల్లలు పడేసిన స్కూల్ యూనిఫాం (దుస్తులను) తీయడానికి తాడు సహాయంతో అందులోకి దిగాడు. గంట సమయం గడిచినా.. బీమార్జున్‌రెడ్డి గంట సమయం గడిచినా బావిలోంచి బయటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందజేశారు. అక్కడికి వచ్చిన కొందరు బావిలోకి దిగేందుకు ప్రయత్నించారు. కొద్దిగా బావిలోపలికి వెళ్లాక ఊపిరి ఆడడం లేదని బయటికి వచ్చారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కామినేని ఆస్పత్రి నుంచి ఆక్సీజన్ తెప్పించి బావి లోకి పంపించారు. బావిలోంచి బీమార్జున్‌రెడ్డి ఉలుకుపలుకు లేకపోవడంతో చివరకు అగ్ని మాపక ఇబ్బంది అందులోకి దిగారు. 5 గం టల గడిచిన తర్వాత బీమార్జున్‌రెడ్డిని బయటికి తీశారు. తక్షణమే అతడిని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. బావిలో ఊపిరాడకనే బీమార్జున్‌రెడ్డి మృతి చెందాడని డాక్టర్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటన స్థలాన్ని తహసీ ల్దార్ శ్రీదేవి, ఎస్ఐ విజయ్‌కుమార్, ఆర్ఐ మంగ , అగ్నిమాపక, 108 సిబ్బంది, ఎంపీటీసీ ఉండ్ర భాగ్యమ్మ లింగరెడ్డి, సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ కోల్లు రాంరెడ్డి పరిశీలించారు. బావిలో విషవాయువుల మూ లంగా శ్వాసఆడక మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. -
యాసిడ్, ఫినాయిల్ కలిపి తాగి ఆత్మహత్యాయత్నం
భువనగిరిఅర్బన్ : అనార్యోగంతో బాధపడుతున్న ఓ మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువా రం తెల్లవారుజామున మృతిచెందింది. వివాహిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన జక్కుల అం జనేయులు భార్య జక్కుల పద్మ(35) కొంతకా లంగా అనారోగ్యంతో బాదపడుతోంది. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలి తం కానరాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ బుధవారం రాత్రి టాయిలెట్ క్లీనర్ (ఫినాయిల్) తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ పరీక్షించి చికిత్స ప్రారంభించారు. అయితే ఓ గంట తర్వాత పద్మ పరిస్థితి విషమంగా ఉం దని బంధువులు డాక్టర్‌కు చూపించారు. ఓ సిరబ్ తీసుకురావాలని సూచించారు. అయితే పద్మ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెం దింది. రోడ్డుపై రాస్తారోకో.. పద్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పద్మ మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఉన్న భువనగిరి–హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రి ముందు కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఆస్పత్రి వైద్యులు, పోలీసులు బంధువులతో మాట్లాడుతూ పోస్టుమార్టం చేసిన తర్వాత రిపోర్టు ప్రకారం డాక్టర్ల నిర్లక్ష్యం అని తెలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ కె.రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. మా నిర్లక్ష్యం లేదు పద్మ అనే మహిళ ఫినాయిల్ సేవించిందని రాత్రి 2.30 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమెను పరిక్షించి వైద్యం చేశారు. ఆ మహిళ ఫినాయిల్, యాసిడ్ రెండు కలిసి తాగినట్లు తెలిసింది. ఇది చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి తాగడం వలన మనిషిలో అవయావాలన్ని మెల్లగా దెబ్బతింటుంటాయి. ఒక్కసారిగా మరణిస్తారు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం ఏమి లేదు. – చందులాల్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, భువనగిరి -
సెల్‌టవర్ బ్యాటరీ దొంగల అరెస్ట్
విలాసాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు దొంగలుగా మారారు. పగటి పూట సెల్టవర్ల వద్ద రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉండదో వాటిని గుర్తిస్తారు..రాత్రి వేళ ఆటోలో వచ్చి సెల్ టవర్ల వద్ద ఉన్న బ్యాటరీలను అపహరిస్తారు. పలు చోట్ల చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇదీ హాలియా పోలీసులకు చిక్కిన దొంగల ముఠా చోరీల తీరు. మంగళవారం హాలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి ఈ ముఠా వివరాలను వెల్లడించారు. త్రిపురారం (నాగార్జునసాగర్) : అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్ రాజశేఖర్ సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా హైదరాబాద్‌లోని ఇ.సీ.ఐ.ఎల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లోనే సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా పనిచేసే సమయంలోనే రమావత్ రాజశేఖర్ తన సైట్లో తీసివేసిన వైర్లు, ఇనుప సామగ్రిని దొంగిలించి తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు విక్రయించే వాడు. సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా పనిచేస్తే వచ్చే డబ్బులు అవసరాలకే సరిపోవడం లేదని భావించిన రమావత్ రాజశేఖర్ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తనకు తెలిసిన దగ్గరి బంధువులు అయిన తిరుమలగిరి(సాగర్) మండలంలోని సుంకిశాలతండాకు చెందిన పాల్తీ అశోక్, అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లికి చెందిన రమావత్ బాలు, తిరుమలగిరి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ నాగరాజు, అడవిదేవులపల్లి మండలం ఏనెమీదితండాకు చెందిన మేరావత్ బాలు, మిర్యాలగూడ మండలంలోని పొట్టిగానితండాకు చెందిన మాలోతు బాలాజీలను కలుపుకుని సెల్ టవర్ బ్యాటరీలనే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇలా ఆరుగురు కలిసి దొంగల ముఠాగా మారి కొంత కాలంగా పలు ప్రాంతాల్లో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారు. పట్టుబడింది ఇలా.. హాలియా సమీపంలో సెల్ టవర్ బ్యాటరీలు చోరీ అయిన విషయాన్ని గుర్తించి జేటీఓ టెలికం శాఖ అధికారి గొట్టిపాటి రామారావు 21 ఏప్రిల్ 2019న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు హాలియా సీఐ ధనుంజయగౌడ్ తన సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈనెల 15వ తేదీన హాలి యా సెంటర్లో పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు వచ్చిన ఆటో వాహనంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆటోలో ఉన్న బ్యాటరీల విషయంపై విచారించగా సరై న సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీ సుకుని విచారించడంతో నిందితులు నేరం అంగీకరించారు. పలు ప్రాంతాల్లో చేసిన సెల్ టవర్ బ్యా టరీల చోరీ నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద సుమారు రూ. 19.61లక్షలు, మూడు ఆటోలు, బ జాబ్ పల్సర్‌తో పాటు 72 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నా రు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
దామరచర్ల/ మిర్యాలగూడ టౌన్ : మండల కేంద్రం లోని గిరిజన గురకుల పాఠశాలలో పదవతరగతి చదువుతున్న జి. అనూష ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. సోమవారం పాఠశాల మ ధ్యాహ్న భోజన సమయంలో జింకోవిట్–5, పా రాసెటిమాల్–7 మాత్రలు మింగింది. దీనిని గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వడంతో సదరు విద్యార్థినిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి మెరుగైన చికిత్సకై తరలించారు. కాగా ఈ విద్యార్థినిది సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్. తమ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆదివారం తన తండ్రితో వెళ్లి సోమవారమే పాఠశాలకు తిరిగి వచ్చింది. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తండ్రి బాలు ఆరోపించాడు. కాగా తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి తెలిపాడు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు, మాత్రలు ఎలా వచ్చాయనేది తెలియదన్నారు. వేధింపులు భరించలేకే.. తాను ఈ గురుకుల పాఠశాలలో 7వ తరగతి నుంచి హాస్టల్లో ఉంటూ చదువుతున్నా. తనను పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్‌నారాయణ 8వ తరగతిలో వేధింపులకు గురిచేయడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశాను. ఆ తరువాత 9వ తరగతిలో కూడా అనేక వేధింపులకు గురిచేశారు. ఇటీవల ఓ యువకుడు పాఠశాల వద్దకు రాగా ఇతను ఎవరు..నీ కోసం వచ్చాడా.. అంటూ ప్రిన్సిఫాల్తో పాటు అధ్యాపకురాలు అడిగారు. తనకు ఎవరో తెలియదని కూడా చెప్పాను. అప్పటి నుంచి అనేక సార్లు కూడా ఇబ్బందులకు గురి చేశారని కన్నీటి పర్యంతం అయింది. నీవు ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నావు.. ఎవరితో మాట్లాడుతున్నావు.. ఆ యువకుడు నీ కోసమే వచ్చాడంటూ అనడంతో తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని అనూష పేర్కొంది. ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేస్తున్నాడు తన కుతూరును పాఠశాల ప్రిన్సిపాల్ చాల కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రిన్సిపాల్ తన కుతూరుపై అసభ్యకరంగా కూడా మాట్లాడటంపై తాను నిలదీశాం. తరుచూ నీ కుతూరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది వెంటనే నీ కుతూరుకి పెళ్లి చేయి అని అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు తన కుతూరు తీసుకువచ్చేందుకు పాఠశాల వద్దకు వస్తే మేము పంపమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తన కుతూరుపై అసభ్యకరంగా మాట్లాడాడని ఆరోపించారు. కనీసం పిల్లల మరుగుదోడ్లు కూడా శుభ్రంగా లేవని, మంచినీళ్లు కూడా సరిగా ఉండవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. –అనూష తల్లిదండ్రులు పిల్లలందరూ డాడీ అంటారు తాను ఎవరిని కూడా వేధింపులకు గురి చేయలేదు. తాను ప్రిన్సిపాల్ అయినప్పటికీ అందరూ డాడీ అంటారు. 10వ తరగతి విద్యార్థిని అయినందున ఇంటికి ఎవరినీ కూడా పంపించడం లేదని, తాను కూడా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అనూష అన్న వచ్చి టీచరును దుర్భషలాడాడని ఏడ్చింది. అనూష తండ్రి బాలు ఆదివారం సాయంత్రం వచ్చి మా ఇంట్లో పండుగ ఉందని చెప్పి ఆమ్మాయిని తీసుకెళ్లే ముందు పర్మిషన్ లెటరును రాయించుకొని పంపించా. – సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్, దామరచర్ల వేధింపులకు గురి చేయలేదు తాను ఎవరిని కూడా వేధింపులకు గురిచేయలేదు. ప్రస్తుతం 10వ తరగతి క్లాసులు నడుస్తున్నందున వాళ్ల సోదరుడు వస్తే పంపించనని చెప్పానని పేర్కొంది. ఒక సారి మా బంధువులు చనిపోయారని చెప్పింది. వాళ్ల తమ్ముడే తనను దుర్భశలాడడని అంటుంది. తన చెల్లెలు మాదిరిగానే చూసుకుంటున్నాను కానీ ఎవరిని కూడా వేధించలేదు. ఆరోపణలు అవాస్తవం. – పుష్పలత, ఉపా«ధ్యాయురాలు -
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
శాలిగౌరారం(తుంగతుర్తి) : మండలంలోని చిత్తలూరు గ్రామంలో ఈనెల 10న వెలుగుచూసిన గుండెబోయిన మల్లేష్ హత్య కేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. కట్టుకున్న భార్యే తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. చిత్తలూరు గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్(29)కు భార్య మమతతో పాటు చిన్నారులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్‌కు గ్రామంలో 4ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంతో పాటు గ్రామానికి చెందిన తరాల పద్మమ్మ వద్ద మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంటను సాగుచేసేవాడు. పంటసాగులో భాగంగా దుక్కి దున్నడం మొదలుకుని పత్తిని ఇంటికి చేర్చేవరకు చిత్తలూరు గ్రా మానికి చెందిన పూల సోమయ్య అలియాస్ సో మన్నకు సంబంధించిన ట్రాక్టర్‌ను మల్లేష్ కిరా యికి వినయోగించుకునేవాడు. ఈ క్రమంలో తరు చూ ఇంటికి వచ్చిపోతున్న సోమయ్యతో మల్లేష్ భార్య మమతకు పరిచయం ఏర్పడింది. అది కా స్తా ఎక్కువై అతి చనువుగా మారడంతో వివాహేతన సంబంధానికి దారి తీసిం ది. ఈ నేపథ్యంలో మల్లేష్‌కు భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్మవహారశైలిపై అనుమానం వచ్చింది. దీంతో మల్లేష్ తన స్నేహితుడైన సోమయ్యను భార్య మమతను తీవ్రస్థాయిలో మందలించా డు. అయినా భార్య మమత, స్నేహితుడు సోమయ్యల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో భార్య మమతను కొట్టేవాడు. ఈ క్రమంలో తాగుడుకు అలవాటుపడిన మల్లేష్ తాగివచ్చినప్పుడు భార్య మమతను వేధింపులకు గురిచేయడంతో పాటు చంపుతానని బెదిరించేవాడు. దీంతో ఇం ట్లో జరుగుతున్న విషయాన్ని మమత ఆమె ప్రి యుడు సోమయ్యకు వివరించింది. నేను ఇబ్బందులతో బతకలేనని, నన్ను నా భర్త మల్లేష్ చంపుతానంటున్నాడని, నేను చచ్చిపోతానని చెప్పింది. దీంతో సోమయ్య మమతకు ధైర్యం చెప్పి నీవు చావడమెందుకు ఇద్దరం కలిసి నీ భర్త మల్లేష్‌ను చంపుదామని చెప్పాడు. అందుకు మల్లేష్ భార్య మమత కూడా ఒప్పుకోవడంతో ఎలాగైనా మల్లేష్‌ను హత్య చేద్దామని నిర్ణయించుకున్నారు. పూటుగా మద్యం సేవించాడని.. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రాత్రి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన మల్లేష్ స్పృహ కోల్పోయి ఇంట్లోని హాలులో బెడ్‌పై నిద్రించాడు. ఈ విషయాన్ని అతని భార్య మమత ప్రియుడు సోమయ్యకు ఫోన్‌ద్వారా చేరవేసింది. దీంతో మల్లేష్‌ను హత్య చేసేందుకు ఇదే అదునుగా భావించిన సోమయ్య తన స్నేహితులైన అదే గ్రామానికి చెందిన తరాల రాములు అలియాస్ రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లకు మద్యం తాపి విషయాన్ని వివరించాడు. మద్యం మత్తులో ఉన్న రాము, వినోద్‌కుమార్, మహేశ్‌లు రెండు ద్విచక్రవాహనాలపై సోమయ్యతో కలిసి అర్ధరాత్రి సమయంలో మల్లేష్ ఇంటకి వెళ్లారు. ఇంటి వెనుకభాగం నుంచి గోడదూకి మల్లేష్ ఇంట్లోకి ప్రవేశించి మమతను కలుసుకున్నారు. మద్యం మత్తులో స్పృహతప్పి నిద్రిస్తున్న మల్లేష్ ఛాతిపై సోమయ్య కూర్చొని ముఖంపై తలదిండుపెట్టి అదిమిపట్టాడు. స్పృహలోకి వచ్చిన మల్లేష్ వెంటనే సోమయ్య తలను పట్టుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మమత, తరాల రాము, తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మల్లేష్ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టి ఎటూ కదలకుండా చేశారు. దీంతో సోమయ్య మహేశ్ తలను పక్కనే ఉన్న బెడ్ అంచుకు బలంగా బాదడంతో తల వెనుకభాగం పగిలి రక్తస్రావం జరిగింది. వెంటనే బెడ్‌పై ఉన్న టవల్‌ను మల్లేశ్ నోట్లో కుక్కి ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనుమానం రాకుండా చేసేందుకు అప్పటికే థమ్సప్బాటిలో సిద్ధంగా ఉంచుకున్న పురుగుల మందును మృతిచెంది ఉన్న మల్లేశ్ నోట్లో పోయడంతో పాటు అతని బట్టలు, నేలపై పోసి వెళ్లిపోయారు. మృతుడు గుండెబోయిన మల్లేశ్ తండ్రి శంభయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఐదు రోజుల్లోనే కేసును ఛేదించి మల్లేశ్‌ను హత్య చేసిన గుండెబోయిన మమత, పూల సోమయ్య అలియాస్ సోమన్న, తరాల రాములు అలియాస్ రాము, తరాల వినో ద్‌కుమార్, బండారు మహేశ్‌లను సోమవారం అరెస్ట్ చేసి విచారించారు. హత్యానేరాన్ని వారు అంగీకరించడంతో వారిపై సెక్షన్ 448, 302, 120(బి), 201 రెడ్‌విత్ 34 ఐపిసి కింద కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ పద్మనాభరెడ్డి తెలి పారు. మల్లేశ్ హత్యకు పాల్పడినవారిలో తరాల వినోద్‌కుమార్, బండారు మహేశ్‌లు మైన ర్లు కావడంతో వారిని బాలనేరస్తులుగా గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు. విచారణ అనంతరం మమత, సోమయ్య, రాములును నకిరేకల్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఆదేశానుసారం మమతను హైదరాబాద్‌లోని చెంచల్‌గూడ జైలు కు, సోములు, రాములును నల్లగొండలోని జిల్లా జైలుకు తరలించారు. తరాల వినోద్‌కుమార్, బం డారు మహేశ్‌లు మైనర్లు కావడంతో నల్లగొండలోని డీపీఓ ముందు హాజరు పరచడంతో జిల్లా కేంద్రంలోని జువైనల్‌హోంకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ క్యాస్ట్రో, ఎస్ఐ రాజు, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
అనైతిక బంధం :చెల్లెలిపై అన్న కత్తితో దాడి
చందంపేట (దేవరకొండ) : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని హంక్యతండాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకుచెందిన కేతావత్ చిట్టి నాగర్కర్నూల్జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహంకాగా ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌తో కొంతకాలంగా సఖ్యతతో మెలుగుతోంది. దీంతో ఆ డ్రైవర్‌ను స్థానికులు నిలదీశారు. సుమారు రూ.లక్ష, ఎకరం పొలం చిట్టికి ఇస్తానని ఆ డ్రైవర్ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ అవే వీ ఇవ్వలేదు. కాగా సోమవారం రాత్రి ఆ వ్యక్తితో చిట్టి సన్నిహితంగా ఉండడంతో ఆమె మూడో అన్న కేతావత్ వంగ్లా నిలదీశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకోగా ఆగ్రహంతో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో చిట్టికి తీవ్ర రక్తస్రావం కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచిం చారు. తమవద్ద డబ్బులు లేవని, హైదరాబాద్‌కు తరలించలేమని బంధువులు తెలుపడంతో పోలీసుల సమక్షంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భగ్గుమన్న పాతకక్షలు..!
నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బంధువుల శుభకార్యానికి వెళ్లొస్తున్న ఓ యువకుడిని ప్రత్యర్థులు దారికాచి కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా అన్నారం బ్రిడ్జి పంచాయతీ శివారులో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. పెన్‌పహాడ్(సూర్యాపేట): మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి వెంకటేశ్వర్లు (27) సీపీఎం గ్రామ కార్యదర్శిగా కొనసాగుతూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు ఆదివారం తమ బంధువుల వ్యవసాయ భూమిలో జరుగుతున్న ఉప్పలమ్మ పండుగకు హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రత్యర్థులు అన్నారం బ్రిడ్జి శివారులో దారికాచి వేటేశారు. కత్తిపీటతో వెంకటేశ్వర్లు తల, పొట్టభాగంలో దాడి చేయడంతో అక్కడికక్కడే నెలకొరిగాడు. దుండగులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నారాయణగూడెం గ్రామ శివారులో వదిలేసి వెళ్లారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అన్నారం బ్రిడ్జి శివారులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డి, లవకుమార్, మల్లేశంలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిన్నంటిన రోదనలు నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి భిక్షానికి వెంకటేశ్వర్లు ఒక్కడే కుమారుడు. ఇతనికి అక్కా, చెల్లి కూడా ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు దారుణహత్యకు గురయ్యాడనే వియాన్ని తెలుసుకున్న తల్లిదండ్రి కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహంపై పడి గుండలవిసేలా రోదించారు. ప్రత్యర్థులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యర్థుల పనేనా..? మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి రమేశ్ కుటుంబ తగాదాల నేపథ్యంలో గత ఏడాది మార్చి 30వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడు. కాగా, వెంకటేశ్వర్లు మూడు మాసాల క్రితమే బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చాడు. అయితే వెంకటేశ్వర్లును ప్రత్యర్థులే మాటేసి ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
‘మహర్షి’ సినిమా చూసి వస్తుండగా..
ఇద్దరిదీ ఒకే ఊరు.. పక్క పక్క నివాసాలు కావడంతో చిన్నప్పటి నుంచే వారిలో స్నేహబంధం చిగురించింది. ఎక్కడికి వెళ్లినా.. ఏ పనిచేసినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు.. అదే తరహాలో ఇద్దరూ కలిసి తమ అభిమాన సినీ హీరో మహేశ్ బాబు నటించిన ‘మహర్షీ’ సినిమా చూసి ఇంటికి వెళుతూ అనుకోని ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మిర్యాలగూడ టౌన్ : దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాకు చెందిన కేతావత్ రూప్సింగ్(20), కేతావత్ గోపాల్‌నాయక్(20) పట్టణంలోని ఓ సెల్ షాపులో పని చేస్తుంటారు. రోజూ మాదిరిగానే విధులకు హాజరై ఈ ఇద్దరు స్నేహితులు కొత్త సినిమా రావడంతో రెండవ ఆట చూసి మిర్యాలగూడ నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో ముత్తిరెడ్డికుంట సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ ఖలీల్ దాబా వద్ద రోడ్డు దాటుతున్న గేదెను రాత్రి 12:30గంటల సమయంలో వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో కేతావత్ రూప్సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా కేతావత్ గోపాల్‌నాయక్ తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి గోపాల్‌నాయక్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. సెల్ షాపుల బంద్ ఇద్దరు యువకులు పట్టణంలోని సెల్ షాపుల్లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ దుకాణాల నిర్వాహకులు సంతాప సూచకంగా శుక్రవారం బంద్ పాటించారు. ఈ సందర్భంగా మోబైల్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ నిత్యం నవ్వుకుంటూ ఉండే ఈ ఇద్దరు యువకులు ఆకాల మృతి తీరనిలోటన్నారు. వారి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెల్ ఫోన్ దుకాణాల నిర్వాహకులు హనుమయ్య, దేవిరెడ్డి నరేష్‌రెడ్డి, రాజశేఖర్, నాగరాజు, మసూద్ తదితరులున్నారు. -
లైంగికదాడి చేసి.. ఆపై గొంతుకోసి..
తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యగానే తేల్చారు. మహిళపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కర్రె అనురాధ (46)కు భిక్షపతితో 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో అనురాధ గ్రామంలో ఒంటరిగానే బెల్ట్‌షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం.. మంగళవారం రాత్రి 10 గంటలకు అనురాధ పొరుగింటి వారితో మాట్లాడిందని స్థానికులు చెబుతున్నా రు. ఇంటి ముందు ఉన్న తలుపు గడియపెట్టి ఉండిఫ్యాన్ నడుస్తుండడంతో నిత్యం మద్యానికి వచ్చే వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో ఇంటి వెనుక తలపును పరిశీలించారు. ఇంటి వెనక కూడా గడియపెట్టి ఉండడంతో ప్రహరీ దూకి కిటికిలోంచి తొంగి చూశారు. అనురాధ ఒంటి పైన బట్టలు లేకుండా గొంతు నుంచి రక్తం కారినట్టు విగతజీవిగా ఉండడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలిసిన వారి పనేనా..? ఇంట్లో చాపలు దప్పుట్లు పరిచి ఉండడంతో పాటు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడంతో తెలిసిన వారే వచ్చి ఉంటారని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో నిరోద్ ప్యాకెట్ కవర్ మాత్రమే దొరికిం ది. 8 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారని బంధులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..సంఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, రాచకొండ క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులుతో పాటుగా ఎస్ఐ వెంకటయ్య పర్యవేక్షించారు. ఉదయం క్లూస్ టీమ్‌తో పాటుగా డాగ్ స్కాడ్‌తో ఇంటిని పరిసరాలను పరిశీలించగా పోలీసు జాగీలాలు వెంకటాపూర్ ఎరువుల కర్మగారం వరకు వెళ్లి అగిపోయాయి. పోలీసులు కేసును నమోదు చేసుకుని నిందుల కోసం గాలిస్తున్నారు.ఈ çఘటనతో వెంకటాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
శ్రావణి హత్య కేసులో విచారణ వేగవంతం
బొమ్మలరామారం (ఆలేరు) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సంచలనంగా మారిన మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంత కొంత మంది యువత గంజాయి, కొకైన్లాంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. మత్తు ప్రభావంతోనే నేరాలకు పాల్ప డుతున్నారనే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసుల అదుపులో.. అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రావణి కే సులో సైతం డ్రగ్స్‌కు బానిసైన యువత పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆదివారం మండల కేంద్రంలో ఇద్దరు, హాజీ పూర్ గ్రామంలో ఆరుగురు యువకులను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో మండలంలోని మల్యాల గ్రామ శివారులోని ఓ ఫాలీ హౌస్‌లోని ఆంధ్రా మహిళ అనుమానాస్పద మృతిపైనా పోలీ సులు దృష్టిసారించారు. ఈ కేసులో సైతం డగ్స్‌కు అలవాటు పడిన పలువురు యువకుల ప్రమేయం ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కోణంలోనే పో లీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మండల యువతకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతోందని అం తుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మీస్టరీగా మారిన ఈ హత్య కేసుల్లో నేరస్తులు ఎవరోనని మండల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల మరమ్మతులు దర్యాప్తులో కీలకంగా మారిన సీసీ కెమెరా పనితీ రు అధ్వానంగా మారడంతో పోలీసులకు ఈ హత్య కేసు విచారణ జటిలంగా మారింది. గతంలో మండలంలో 13 గ్రామాల్లో 61 కెమెరాలు ‡ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయడడం లేదు. ఈ నేపథ్యంలో శ్రావణి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనేæ తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఆందోళనలు జరిగాయి. సీపీ మహేష్ భగవత్ సైతం మండలంలో సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో మండలంలో గల సీసీ కెమెరాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి
సాక్షి, నల్గొండ : నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (ఆరెంజ్ ట్రావెల్స్) బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన వీరు.. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్‌పై గడ్డి కోసం వెళ్లారు. అదేసమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న వారు మరో బస్సెక్కి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కృష్ణపట్టెలో బాంబుల మోత
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : బాంబుల మోతతో కృష్ణపట్టె ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆదివారం అర్ధరాత్రి తిరుమలగిరి మండలం నాయకునితండాలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులు(చేపల వేటకు ఉపయోగించేవి), బీరు సీసాలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు 40 ఇళ్లు ధ్వంసం కాగా కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు తదితర సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆధిపత్య పోరుకోసం తండాలో తామంటే తామే పై చేయి సాధించాలనే భావనతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంతకాలంగా పోటీపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రావడంతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందాడు. ఈనెల 13వ తేదీన శనివారం సఫావత్ తండాలో ఓ శుభకార్యానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరావత్ భిక్షాలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన మేరావత్ స్వామి వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భిక్షాలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వామితో మీకు ఇంత సహాయం చేసినా రాజకీయంగా మాకు ఎందుకు సపోర్టు చేయడం లేదు అని స్వామిని భిక్షాలు నిలదీశారు. దీంతో తండాకు చేరుకున్న స్వామి తన కుమారుడు మేరావత్ దస్రూకు ఆదివారం రాత్రి చెప్పడంతో తన తండ్రిని తిడతావా అని భిక్షాలును దస్రూ నిలదీయడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలు వేసుకుంటూ దాడికి పాల్పడడంతో ఇళ్లలోని సామగ్రి కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు, సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో భయాందోళన సృష్టించేం దుకు బాంబులు (చేపల వేటకు ఉపయోగించేవి) రువ్వుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. కృష్ణపట్టెలో బాంబుల సంస్కృతి కృష్ణా పరీవాహక గ్రామాలు కావడం, అటవీ ప్రాంతానికి సమీపాన ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా చేపల వేట కోసం తమ పొలాల్లోని అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి బాంబులను ఉపయోగిస్తారు. వీటిని సమీపంలో ఉన్న ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచి బాంబుల ముడిసరుకులను తీసుకువచ్చి నిల్వచేస్తారు. అయితే గ్రామాల్లో పార్టీల మధ్య, గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగే క్రమంలో అందుబాటులో ఉన్న బాంబులను ఒకరిపై ఒకరు విసురుకొని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారు. తండాలో పోలీసుల పహారా తండాలో చోటుచేసుకున్న ఘర్షణలతో చుట్టుపక్కల తండాల ప్రజలు, గ్రామస్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్గౌల ఆధ్వర్యంలో భారీగా పోలీసు పహారా నిర్వహించారు. తిరుమలగిరి, నిడ్మనూరు, హాలియా ఎస్ఐలు కుర్మయ్య, యాదయ్య, వీరరాఘవులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. కృష్ణపట్టెలో ఫ్యాక్షన్...యాక్షన్ చందంపేట(దేవరకొండ) : జిల్లాలో నాటు బాంబుదాడుల సంస్కృతి ఎప్పటినుంచో ఉంది. కొన్ని సంవత్సరాలుగా దాడుల సంస్కృతి తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడూ జిల్లా సరిహద్దు గ్రామాల్లో జరిగిన ఘర్షణల్లో వీటిని వాడుతున్నారు. తాజాగా తిరుమలగిరి మండలం నాయకునితండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య బాంబులదాడి జరగడంతో మరోసారి కంబాలపల్లి బాంబుల దాడులు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కంబాలపల్లి గ్రామంలో మాజీఎంపీపీ ముత్యాల సర్వయ్యకు నక్సలైట్ల చేతిలో హతమైన మేకల మల్లయ్యకు ఆధిపత్య పోరు ఉండేది. అప్పుడు టీడీపీ–కాంగ్రెస్‌ల మధ్య ఉన్న పోరు కాస్త ఇప్పుడు తెలంగాణ పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య సాగుతోంది. అప్పట్లో మేకల మల్లయ్య, సర్వయ్యల మధ్య ఎన్నోసార్లు బాంబు, రాళ్లదాడులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఇరువర్గాలు రాళ్లదాడులు చేసుకున్నారు. మేకల మల్లయ్య హత్యకు గురైన అనంతరం ఆ గ్రామంలో జెడ్పీటీసీగా ఉన్న కిషన్‌రెడ్డి, సర్వయ్యల మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు నడిచి పరసర్పర దాడులకు దారితీసింది. వారి మధ్య నాటుబాంబుల దాడి జరిగి ఆ గ్రామం సంచనాలకు కేంద్రబిందువైంది. అయితే కిషన్‌రెడ్డి గ్రామాన్ని విడిచి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడంతో ఆ వర్గాల మధ్య గొడవలు సద్దుమణిగాయి. అనంతరం సర్వయ్య వర్గంలోనే ఉండి సర్పంచ్‌గా గెలుపొందిన సర్వయ్యకు గోవిందుకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీపీ రేసులో ఉండి దాదాపు ఎంపీపీ అవుతాడనుకున్న ముత్యాల సర్వయ్య అనుహ్యంగా ఓటమి పాలవ్వడంతో అదే సమయంలో గోవిందుభార్య ఎంపీటీసీగా గెలుపొం దడంతో సర్వయ్యకు దక్కాల్సిన ఆపదవి కాస్త గోవిందు భార్యకు దక్కింది. అప్పటి నుంచి ఈ గొడవలు మరింత తార స్థాయికి చేరాయి. ఎక్కడ బాంబులు పేలినా కంబాలపల్లి గ్రామం ఒక్కసారిగా ఉలికి పడుతుంటుంది. ఆడమనిషని కూడా చూడలే.. ఆడమనిషి అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది వచ్చి మా ఇంటిపై బాంబులతో దాడి చేసి నన్ను చితకబాదారు. ఇంటిపై దాడి చేయడంతో ఇంట్లో సామాను మొత్తం పాడైపోయింది. బాణావత్ దర్సి పార్టీ మారామనే.. మేము ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారమనే కక్షతోనే మా ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ఓట్లు మాత్రమే వేశాము కాని అసలు పార్టీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కక్షపూరితంగా మా ఇంటిపై రాళ్లు, బాంబులు, బీరు సీసాలతో దాడి చేశారు. – మేరావత్ నేజా కళ్లల్లో కారంచల్లి కొట్టారు మేం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని, గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశామని కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లు నాపై దాడి చేశారు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి కళ్లల్లో కారం చల్లి నన్ను కొట్టారు. ఆడమనిషి అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. – మేరావత్ బుజ్జి -
సీతారామా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
సీతారాముల కల్యాణ రమణీయ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు.. తమ జీవితాలు సాఫీగా సాగిపోవాలని భక్తిశ్రద్ధలతో ఏక పత్నీవ్రతుడిని వేడుకున్నారు.. అప్పటి వరకు భక్తిపారవశ్యంలో మునిగితేలిన ఆ భక్తులు.. ఆటోలో స్వస్థలానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారనే లోపలే ఘోరం జరిగిపోయింది. విధి వైపరిత్యమో.. మరో కారణమో తెలియదు కానీ ..ఆటో వారి పాలిట మృత్యుశకటంగా మారింది. మితిమీరిన వేగం.. ఆపై డ్రైవర్ నిర్లక్ష్యం వెరసి.. ముందుగా వెళుతున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు... కోదాడరూరల్ : కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామాదేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కోదాడకు చెందిన పలువురు భక్తులు అక్కడ జరిగే వేడుకలకు వెళ్లివస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని సిరి అపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు మహిళలు కల్యాణానికి వెళ్లారు. కల్యాణం అనంతరం అక్కడి నుంచి ఆటోలో కోదాడకు బయలుదేరారు. వీరితో పాటు పట్టణానికి చెందిన మరో ఐదుగురు ఆటోలోకి ఎక్కారు. డ్రైవర్‌తోపాటు మొత్తం ఆటోలో పది మంది ఉన్నారు. తమ్మర నుంచి ఆటో బయలుదేరి కోదాడ–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా కోదాడకు వస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో ముందు ఉన్న బస్సును ఆటో ఓవర్‌టెక్ చేస్తూ అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి రోడ్డు కుడివైపునకు వచ్చాడు. అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మం పట్టణానికి సిమెంట్ లోడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఆటో వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (60) ఆయన భార్య బేతు నాగసులోచన (57), తమ్మరకు చెందిన ఆటోడ్రైవర్ అబ్బాస్ (48), పట్టణంలోని మాతానగర్‌కు చెందిన నరిమినేని సుగుణమ్మ (45), రెడ్చిల్లి వెనుక నివాసముంటున్న గుండపనేని పద్మ (56) అక్కడికక్కడే మృతిచెందారు. సిరి అపార్టుమెంట్‌కు చెందిన అంబటి సైదమ్మ (38), వట్టికొండ శైలజ (40)లు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. అక్కడికి చేరుకొనే లోపే ఈ ఇద్దరు కూడా మార్గమధ్యలో మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు మహిళలు లక్ష్మి, రేణుక, మంగతాయారుకు గాయాలయ్యాయి. రేణుక పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను ఖమ్మం నుంచి హైదరబాద్‌కు తరలించారు. లక్ష్మీ విజయవాడలో చికిత్స పొందుతుండగా మంగతాయారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలు... ప్రమాద ఘటనలో లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోను ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు, క్షతగాత్రులు కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయారు. స్థానికులు వాహనదారులు అక్కడకు చేరుకుని దాదాపుగా 20 నిమిషాలు శ్రమించి ముందుగా గాయాలపాలైన వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించి , మృతదేహాలను బయటకు తీసారు. ప్రభుత్వాస్పత్రిలో మిన్నంటిన రోదనలు కోదాడకు చెందిన ఏడుగురు ఒక్కసారే మృతిచెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారి కుటుంబాలన్ని దాదాపుగా పట్టణంలో అందరికి పరిచయాలు ఉండటంతో మృతదేహాలను చూసేందుకు వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. వైద్యశాల ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆటోడ్రైవర్ తొందరపాటే కారణమా...? ఘోర రోడ్డు ప్రమాదానికి ఆటో డ్రైవర్ తొందరపాటే కారణమని తెలుస్తోంది. శ్రీరామ నవమి కావడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉం డటంతో మరిన్ని ట్రిప్పులు తోలుకోవచ్చనే ఆశతో ఎదురుగా బస్సు ఆగి ఉన్న ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఆటో డ్రైవర్ తొందరపాటుతో ఎదురుగా వాహనాలు వస్తున్నాయో లేదో చూసుకోకుం డా ఒక్కసారే పక్కకు మలపడంతో లారీ ఢీకొ ట్టింది. ఇక్కనిమిషం ఆగితే అందరు క్షేమంగా ఇళ కు చేరేవారు. మరణించిన వారిలో నలుగురు కూ డా రెండు నిమిషాలు ఆగితే ఖమ్మం క్రాస్‌రోడ్, బీ ఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద దిగేవారే ఉన్నారు. మృతుల వివరాలు రాసుకోవడానికి వెళితే... తమ్మర నుంచి కోదాడకు వస్తున్న ఆటో లారీని ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో ఏడుగురు మతి చెందారనే సమాచారం కోదాడ పట్టణ పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి బయలుదేరారు. పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డితో పాటు రైటర్ వట్టికొండ రామారావు కూడా పెన్ను పేపర్లు తీసుకుని సంఘటన స్థలానికి బయలుదేరారు. ఘటనాస్థలిలో మృతుల , గాయపడిన వారి వివరాలు రాసుకోవడానికి రైటర్ రామారావు సిద్ధమవుతున్నాడు. కానీ అక్కడ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ తన భార్య వట్టికొండ శైలజ పడి ఉండడంతో రామారావుకు దిక్కుతోచలేదు. అపార్టుమెంట్ వాసులతో కలిసి ఆమె తమ్మర దేవాలయానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైంది. వెంటనే తేరుకున్న ఆయన ఆమెను హుటాహూటిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించాడు. కాని ఖమ్మం చేరుకొనే లోపే ఆమె మృతిచెందింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముగ్గురి వివాహాలు చేసి.. తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఎస్కె. అబ్బాస్ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు వివాహాలు చేయగా మరో కుమారుడు వివాహానికి ఉన్నాడు. ఒంటరిని చేసి వెళ్లిపోయావా.. సైదమ్మ భర్త వీరారెడ్డి పట్టణంలో వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదమ్మ మృతితో వారి కుటుంబం దిక్కుతోని స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలను, నన్ను ఒంటరిని చేసి వేళ్లిపోయావా అంటూ ఆమె భర్త బోరున విలపించాడు. కోదాడకు చేరుకున్న ఎస్పీ... ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కోదాడకు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబాలతో మాట్లాడారు. కార్యక్రమాలు వెంటనే జరిగే విధంగా చూడాలని స్థానిక పోలీసులకు తెలిపారు. ఆయన వెంట పట్టణ, రూరల్ సీఐలు, స్థానిక ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ప్రశాంతంగా జీవించే సమయంలో... గుండపనేని పద్మ ,భర్త సత్యనారాయణ పట్టణంలో కిరణాషాపు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నత చదువులు చదివించారు. వీరిలో చిన్నకొడుకు, కుతూరు అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలోనే రెడ్‌చిల్లీ వెనుక బజారులో ఇంటిని కొనుగోలు చేసి నెలరోజుల క్రితం చిన్నకుమారుడి వివాహం చేశారు. పిల్లలు ఉన్నతంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటిలో ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో పద్మ దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఒక్క దేవుడూ కాపాడలేక పోయాడా.. మృతుల్లో ఇద్దరు బేతులక్ష్మయ్య నాగసులోచన దంపతులు. వీరు బీఎస్ఎన్ కార్యాలయం ఎదురుగా గల వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహాలు చేసిన లక్ష్మయ్య ఓ కిరణాషాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గృహిణిగా ఉంటున్న నాగసులోచనకు దైవభక్తి ఎక్కువ. ‘‘నువ్వు దేవుడికి రోజు పూజ చేస్తున్నా ఒక్క దేవుడన్నా మిమ్మల్ని కాపడలేదా అమ్మా.. ఇద్దరూ ఒక్కసారే మమ్మల్ని వదిలిపోయరా’’ అంటూ వారి కూతుళ్లు, కుమారుడు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే... ప్రమాద జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. ఆతర్వాత వైద్యశాలో చికిత్స పొందుతున్న పలువురుని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న వారిని ఖమ్మం, విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ.. మాతానగర్‌కు చెందిన సుగుణకు భర్త, కొడుకుతో ఉంటూ బస్టాండ్ ఎదురుగా ఉన్న కూరగాయాల మార్కెట్లో పనిచేస్తోంది. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె మృతితో కొడుకు, భర్త, తీవ్రంగా రోదిస్తున్నారు. -
పెళ్లి రోజే ఎస్ఐ మృత్యు ఒడిలోకి..
నల్లగొండ క్రైం : పెళ్లిరోజే చివరి రోజు అయ్యింది. మంగళవారం తాను నడుపుతున్న వాహనం అదుపుతప్పి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు భూదాన్‌పోచంపల్లి ఎస్ఐ కోన మధుసూదన్(33). నల్లగొండలో నిర్వహిస్తున్న పోలీస్ దేహదారుఢ్య పరీక్షల విధులు నిర్వహించేందుకు భూదాన్‌పోచంపల్లి నుంచి స్వయంగా పోలీస్ సుమో వాహనం నడుపుతూ ఇంటి నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదకరమైన కల్వర్టు రోడ్డుకు సమాంతరంగా ఉండడంతో పోలీస్ వాహనం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి కంప చెట్లలోకి పల్టీకొట్టింది. వెంటనే బెటాలియన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌ను రప్పించేలోపే అటు వైపుగా వెళ్తున్న 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 5.30 గంటలకు తరలించారు. గంటకు పైగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మధుసూదన్ మృతి చెందాడు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది... ఎస్ఐ మధుసూదన్, భార్య జ్యోతి, కుమారుడు దుర్గాదీక్షిత్, కుమార్తె శ్రీవైష్ణవిలు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రాచకొండ ఉత్సవాల్లో కూడా విధులు నిర్వహించారు. సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరడంతో రెండు రోజులు సెలవు ఇచ్చిన అధికారులు రాత్రి సెలవు రద్దు చేస్తున్నామని ఈవెంట్స్ విధులకు వెళ్లాలని ఆదేశించడంతో డ్రైవర్ లేకుండానే విధులకు సిద్ధమయ్యాడు. తన కుమార్తె అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పడంతో మధుసూదన్ అతడికి సెలవు ఇచ్చాడు. స్వయంగా వాహనం నడపడం, అనారోగ్యం, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సెలవు ఇచ్చినట్టే ఇచ్చి గంటల వ్యవధిలోనే రద్దు చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న ఎస్ఐ తిప్పర్తి మండలం తానేదారిపల్లి గ్రామానికి చెందిన కోన కొండయ్య, అంజమ్మ రెండో కుమారుడు మధుసూదన్. కలెక్టర్ విజయానంద్ బాధ్యతలు నిర్వహించిన సమయంలో తన బంగళాలో మధు చిరు ఉద్యోగిగా పనిచేశాడు. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన జంజిరాల జ్యోతి కలెక్టరేట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేయడంతో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయంతో 2011 మార్చి 05న ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012 ఎస్ఐగా ఉద్యోగం సాధించాడు. భార్య జ్యోతి ఎంటెక్ పూర్తి చేసింది. మధు సోదరుడు నాగరాజు కరెంట్ మెకానిక్‌గా, మరో సోదరుడు రమేష్ మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా పని చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి తల్లిదండ్రులకు అండగా ఉన్నాడు. సౌమ్యుడిగా మంచి పేరున్న మధు పెళ్లి రోజే మృతి చెందడంతో గ్రామస్తులంతా బోరున విలపించారు. ఎవరికి ఏ ఆపద ఉన్న ఆదుకునే వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటాం : సీపీ మహేష్ భగవత్ మధుసూదన్ కుటుంబానికి పోలీస్‌శాఖ పరంగా అండగా ఉంటామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. విధి నిర్వహణలో మంచి ఎస్ఐని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖలో మంచి గుర్తింపు పొందాడన్నారు. డ్రైవర్ ఉన్నప్పటికీ వాహనం స్వయంగా నడుపుకుంటూ రావడం అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారమన్నారు. సెలవులు అడిగిన విషయమై తమకు సమాచారం లేదన్నారు. సెలవు ఇచ్చి రద్దు చేశారని కుటుంబసభ్యుల ప్రస్తావనను సీపీ దృష్టికి తీసుకెళ్లగా విచారిస్తామన్నారు. వాహనం బోల్తా పడినప్పడు స్టీరింగ్ గుండెకు బలంగా తగిలిందని, చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. భార్య జ్యోతి ఎంటెక్ పూర్తి చేసిందని ప్రభుత్వ ఉద్యోగం, ఇతర అలవెన్స్‌లు అందిస్తామన్నారు. నివాళులర్పించిన సీపీ, ఎస్పీ పోస్టుమార్టం వద్ద మధు మృతదేహంపై సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, జిల్లా ఎస్పీ రంగనాథ్‌లు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మధు కుమారుడిని ఎత్తుకొని సీపీ తండ్రి మృతదేహన్ని చూపించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దహన సంస్కారాల నిమిత్తం సీపీ, పోలీస్ సంక్షేమ సంఘం ఆర్థిక సాయాన్ని అందజేసింది. నివాళులర్పించిన పలువురుప్రముఖులు.. తిప్పర్తి(నల్లగొండ) : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మధుసూదన్ మృతదేహనికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం తిప్పర్తి మండలం తానేదార్పల్లి గ్రామంలో నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు. యాదాద్రి డీసీపీ రాంచంద్రారెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి, డీఎస్పీ గంగారాం, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రజాప్రతినిధులు.. మధుసూదన్ కుటుంబాన్ని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, పలు గ్రామాల సర్పంచ్‌లు పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాస్తుదోషం ఉందా..? భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు మొదటి నుంచి వాస్తు దోషం వెంటాడుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇద్దరు పోలీసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో గతంలో పనిచేసిన ఎస్ఐ రామకృష్ణారెడ్డి స్టేషన్ పడమర వైపు ప్రధాన ద్వారం మూయించి, ఉత్తరం వైపు చేశారు. ఆ తరువాత వచ్చిన ఎస్ఐలు మరికొన్ని మార్పులు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు వివిధ కారణాల వల్ల భువనగిరి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ అయ్యారు. సోమవారం హెడ్‌కానిస్టేబుల్ శంకర్‌నాయక్ కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. వాస్తు దోషం ఉందని భావించిన ఎస్ఐ మధుసూదన్ 15 రోజుల క్రితమే స్టేషన్ సమీపంలో ఉప్పలమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. -
మృత్యువులోనూ వీడని బంధం
చివ్వెంల (సూర్యాపేట) : మృత్యువులోను వారి బంధం వీడలేదు. వరుసకు సోదరులైనప్పటికీ స్నేహితులలాగే కలిసి మెలిసి తిరుగు తూ ఉండేవారు. వారిని బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. మండల పరిధిలోని కుడకుడ గ్రా మానికి చెందిన చీమకండ్ల కాశయ్య, దీవెనమ్మ పెద్ద కుమారుడు చీమకండ్ల ఉదయ్ (22) వృత్తిరీత్యా జనగాం క్రాస్‌రోడ్డులో ఓ హో టల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చీమకండ్ల ఎల్లయ్య, జయమ్మల మూడవ కుమారుడు మన్మథ (24) వృత్తిరీత్యా సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆత్మకూర్. ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి సొంత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా మా ర్గమధ్యలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై కుడకుడ గ్రామ శివారులో జీఎంఆర్ టౌన్షిప్ వద్ద వరంగల్ నుంచి సూర్యాపేట వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మన్మథ, ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను అరగంట సేపు వరకు ఎవరూ చూడలేదు. అనంతరం మండల పరిధిలోని గాయంవారిగూడెం గ్రామం వైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి చివ్వెంల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్.నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. వారి వద్ద ఉన్న కొన్ని గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మన్మథ గత పదిహేను రోజుల క్రితం బైక్‌ను కొనుగోలు చేశారు. మృతులు ఇద్దరూ అవివాహితులు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. -
అంతర్ రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల అరెస్ట్
త్రిపురారం (నాగార్జునసాగర్) : ఏడాది కాలంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా ట్రాక్టర్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కారు. శుక్రవారం హాలియా సర్కిల్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంగనాథ్ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండల పరిధిలోని అమ్మిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజి వెంకట కృష్ణ, బత్తుల హన్మంతరావు, బత్తుల గోపరాజు జల్సాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బులు సంపాధించాలని ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఎక్కడైతే దొంగతనం చేయాలనుకుంటారో అక్కడ ముందుగా ముగ్గురు రెక్కి నిర్వహిస్తారు. ఆ తరువాత ఇద్దరు నేరస్తులు ఒక మోటర్ బైక్‌పై, మరో నేరస్తుడు ట్రాక్టర్ ఇంజన్‌తో వచ్చి ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ట్రాక్టర్లను చూసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో ట్రాక్టర్ ట్రాలీలు ఉంటే నేరస్తులు తమ వెంట తీసుకవచ్చిన ట్రాక్టర్‌కి తగిలించుకొని తీసుకొని పోవడం, ట్రాక్టర్ ఇంజన్ ఉంటే దానిని తీసుకుని పోవడంలాంటి దొంగతనాలకు పాల్పడి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దొంగిలించిన ట్రాక్టర్ ఇంజన్లు, ట్రాలీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 చోట్ల, ఇతర జిల్లాలో 5 చోట్ల ట్రాక్టర్, ట్రాలీల దొంగతనాలకు పాల్పడ్డారు. 24 చోట్ల కేసులు .. అంతర్రాష్ట్ర ట్రాక్టర్ నేరస్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 24 చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలను చోరీ చేయడంతో పలు పోలీస్స్టేషన్లలో నేరస్తులపై కేసులు నమోదైయ్యాయి. 2017 నవంబర్‌లో నేరేడుచర్ల పీఎస్, 2018 జూన్‌లో వేములపల్లి పీఎస్, 2018 జులైలో నిడమనూరు పీఎస్, కోదాడ టౌన్ పీఎస్‌లో, అదే విధంగా పద్నాలుగు రోజుల వ్యవధిలో కోదాడ టౌన్ పీఎస్‌లో మరో కేసు, 2018 ఆగస్టులో వట్సావై పీఎస్‌లో, 2019లో అనంతగిరి పీఎస్‌లో, 2018 సెప్టెంబర్‌లో కోదాడ టౌన్ పీఎస్‌లో, 2018 అక్టోబర్‌లో వేములపల్లి పీఎస్‌లో, 2018 నవంబర్‌లో తిప్పర్తి పీఎస్‌లో, అదే విధంగా మరో వారం రోజుల వ్యవధిలో అదే పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్ చోరీ జరిగినట్లు మరో కేసు నమోదు అయ్యింది. 2018లో కోదాడ టౌన్ పీఎస్‌లో ట్రాక్టర్ చోరీ జరిగినట్లు కేసు నమోదు అయ్యింది. 2018 డిసెంబర్లో హాలియా పీఎస్‌లో, 2019లో గురజాల పీఎస్‌లో, 2018, 2019లో త్రిపురారం పీఎస్‌లో రెండు కేసులు నమోదు కాగా, 2019లో నిడమనూరు పీఎస్‌లో, 2019లో కుసుమంచి పీఎస్‌లో, మరో మూడు రోజుల వ్యవధిలోనే అదే పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. 2019లో గరిడేపల్లి పీఎస్‌లో, 2019 ఫిబ్రవరి 14వ తేదీ, 15వ తేదీల్లో హాలియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాక్టర్లు చోరీ జరిగినట్లు కేసులు నమోదు అయ్యియి. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 కేసులు, ఇతర జిల్లాలో 5 కేసులు నేరస్తులపై కేసులు నమోదు చేశారు. పట్టుబడింది ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోట్ల ట్రాక్టర్లు, ట్రాలీలు దొంగతనాలు జరగడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీ ఎస్సీ, హాలియా సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు పోలీసుల బృం దాలను నియమించారు. ఈ నిఘా విభాగం నేర పరిశోధనపై దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 21న కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో గల అహ్మద్ ఇంజనీరింగ్ వర్క్ షాపు వద్ద అనుమానాస్పందంగా ఉన్న నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీసులు విచారించగా తాము చేసిన నేరాలను ఒప్పుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరస్తుల నుంచి 8లక్షల 90వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్, 7 ట్రాక్టర్ ఇంజన్లు, 17 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 61లక్షల 90 వేలు ఉంటుందన్నారు. అంతరాష్ట్ర నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ధను ంజగౌడ్, హాలియా, నిడమనూరు, త్రిపురారం ఎస్ఐలు సతీష్‌కుమార్, యాదయ్య, ఆరీఫ్, పీసీలు విజయశేఖర్, మాదాసు రామారా వు, హోంగార్డు వెంకట్రాంరెడ్డి, శేఖర్, గంగాధర్, మున్యా, నర్సిరెడ్డి, సైదులు జిల్లా ఎస్సీ అభినందించి సీఐ ధనుంజయ్గౌడ్తో పాటు పోలీస్ సిబ్బందికి రూ. 10 వేల నగదు రివార్డును అందజేశారు. -
గంజాయి విలువ రూ.15 లక్షలు
చౌటుప్పల్ (మునుగోడు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి సోమవారం అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ రూ. 15 లక్షల విలువైనదిగా పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీలు నిర్వహించగా ఇద్దరు నింది తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన అసలు సూత్రధారి పోలీసుల కన్నుగప్పి పరారయ్యాడు. నిందితులపై పీడీయాక్టు నమోదు చేసేందుకు సిఫారసు చేశారు. ఈ కేసుకు సంబం ధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం నుంచి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా గోలుగొండ మండలం ఏటిగరిమిపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి గణేష్(22) వృత్తి రీత్యా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకి ఆ ప్రాంతంలోని గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి లభిస్తుంది. ఇక్కడ తక్కువ ధరలో లభించే గంజాయిని హైదరాబాద్‌లో విక్రయిస్తే అధికంగా డబ్బులు వస్తాయని ఇతర వ్యాపారుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తమ గ్రా మానికి చెందిన పోతల సాయి (19) అనే విద్యార్థికి ఇదే విషయాన్ని చెప్పాడు. కొద్ది పెట్టుబడితో భారీగా లాభాలు వస్తుండడంతో తాను కూడా సరే అన్నాడు. దీంతో ఇద్దరూ కలిసి వ్యాపారం చేయాలని సిద్ధమయ్యారు. అలా మూడు సంవత్సరాలుగా వ్యాపారం సాగిస్తున్నారు. సూత్రధారి రాంప్రసాద్ వద్ద ఏజెంట్లుగా చేరి... విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం గణేష్, సాయి ప్రధాన సూత్రధారైన రాంప్రసాద్‌ను కలిశారు. తాము కూడా వ్యాపారం చేస్తామని చెప్పారు. దీంతో సరేనన్న ఆయన వీరిద్దరికీ గంజాయిని విక్రయించేవాడు. అలా వీరు ముగ్గురు కలిసి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయిని తరలించి సొమ్ము చేసుకునేవారు. పక్కా సమాచారంతో రంగంలోకి పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయి వస్తున్న విషయం ముందుగా మాల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు అందింది. వెంటనే స్థానిక సివిల్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి మండల పరిధిలో 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయి. కారులోని ముగ్గురిని సోదాలు చేసే క్రమంలో ప్రధాన సూత్రధారి రాంప్రసాద్ పరారయ్యాడు. మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోదా చేయగా ఇద్దరి జేబుల్లోంచి రెండు కత్తులు లభించాయి. వెంటనే వారిద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వీరిపై పీడీ యాక్టుకు సిఫారసు చేశారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు నగదు రివార్డులను అందించారు. పరారీలో ఉన్న సూత్రధారిని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ జె.సురేందర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, సివిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ పార్ధసారథి, ఎస్ఐలు నవీన్‌బాబు, నాగేశ్వర్రావు, అవినాష్‌బాబు, కేఎస్ రత్నం సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ రూ.మూడు వేలు...ఇక్కడ రూ.15 వేలు రాంప్రసాద్ ముందుగా గంజాయి కొనుగోలు, రవాణాకు ప్రత్యేక ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆ ప్రకారంగా విశాఖపట్టణం, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో మూడు నుంచి నా లుగు వేలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసేవాడు. దాన్ని గణేష్, సాయిలకు కిలో రూ. 10వేలకు అమ్మేవాడు. ఆ తర్వాత వీరి ద్దరు, ఒక్కోసారి ముగ్గురు కలిసి హైదరాబా ద్‌కు వెళ్లి అక్కడి వ్యక్తులకు కిలో గంజాయిని కిలో రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. చాక్లెట్ ప్యాకెట్లుగా తయారు చేసి.. ఏజెన్సీ ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి 106 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. యథావిధిగా గంజాయిని తరలిస్తే పట్టుబడతామని గ్రహించిన వీరు దాన్ని రెండు కిలోలకు ఒక ప్యాకెట్‌గా మార్చారు. ఈ ప్యాకెట్‌కు పైనుంచి చాక్లెట్ కవర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం ఎవరికీ కనిపించకుండా తమ స్విఫ్ట్ కారు డిక్కీ కింద పెట్టుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. -
హత్యా.. ఆత్మహత్యా..?
నల్లగొండ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘటన దేవరకొండ మండల పరిధిలోని గన్యనాయక్‌తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన సుగుణ(30)కు పాల్త్యతండాకు చెందిన శ్రీనుతో పదిహేడేళ్ల ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆరు సంవత్సరాల క్రితం సుగుణ భర్త మృతి చెందాడు. దీంతో సుగుణ తండాలోనే చిన్న కిరాణ దుకాణం నడుపుతూ కుమార్తె, కుమారుడితో జీవనం సాగిస్తోంది. కాగా, సుగుణకు ఆరేళ్ల క్రితం కొండమల్లేపల్లికి చెందిన వెంకటపతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో గురువారం తండాకు వచ్చిన వెంకటపతి శుక్రవారం మధ్యాహ్నం సుగుణ(30) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండాలోనే నివాసం ఉంటున్న సుగుణ తల్లి అస్లి ఇంట్లోకి వెళ్లి చూడగా సుగుణ మృతిచెంది ఉంది. సమాచారం అందుకున్న దేవరకొండ సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి అస్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సుగుణది హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య
చింతలపాలెం (హుజూర్నగర్) : వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన ్ఠ్జ్జ్జ్జకతారి నవ్య (18) తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా తన మానసిక స్థితి సరిగా లేక ఉరివేసుకుందని అన్న లింగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. చీమలకొండూర్లో యువకుడు భువనగిరిఅర్బన్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని చీమలకొండూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన వడ్డెమాన్ బొందయ్య కుమారుడు వడ్డెమాన్ ప్రమోద్‌కుమార్(26) కూలి పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అనంతారం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరి గింది. కుటుంబ కలహాల కారణంతో మనస్తాపానికి గురై మధ్యాహ్న సమయంలో చీమలకొండూరు గ్రామశివారులోని డాంబర్ కంపెనీ పక్కన ఉన్న వెంచర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. వెంచర్లో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నాగారంబంగ్లాలో వ్యక్తి.. నాగారం (తుంగతుర్తి) : మండల పరిధిలోని నాగారంబంగ్లా గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల శ్రీనివాస్‌రెడ్డి (45) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆరు నెలల క్రితం శ్రీనివాస్‌రెడ్డి తనభార్య మాధవిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె మృతిచెందింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలై లారీడ్రైవర్‌గా పనిచేస్తూ తల్లి్లతో కలిసి నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. తల్లి గమనించేలోపే మృతిచెందాడు. -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
పెద్దవూర (నాగార్జునసాగర్) : దైవదర్శనానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పర్వేదుల గ్రామానికి చెందిన వల్లెపు గురుమూర్తి(29), మోహన్, శివలు కలిసి మూడు రోజుల క్రితం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. దర్శనం చేసుకుని సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రైలులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో గురుమూర్తి తన భార్యకు ఫోన్ చేసి మార్గమధ్యలో ముగ్గురి మధ్య గొడవ చోటుచేసుకుందని తెలిపాడు. తదనంతరం అతడి ఫోన్ పనిచేయలేదు. ఏమైందో ఎమో తెలియదు కానీ తాడేపల్లిగూడెం సమీపంలోని రైలుపట్టాలపై గురుముర్తి విగతజీవిగా మారాడు. తెల్లవారుజామున అక్కడి రైల్వేపోలీసులు గురుమూర్తి మృతదేహాన్ని గుర్తించారు. అతడి సెల్ లాస్ట్‌నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? మరో కారణం ఏమైనా ఉందా అనే విషయం తెలియరాలేదు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బందువులు తాడేపల్లిగూడెంకు బయలు దేరారు. మృతుడుకి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.కాగా, గురుమూర్తి వెంట వెల్లిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి చేరుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
భువనగిరిఅర్బన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దు ర్మరణం చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని కూనూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.వివరాలు.. గుండాల మండలం సుద్దాలకు చెందిన బుర్ర దశరథ(48), అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆత్మకూరు(ఎం) మండలంలో తమ బంధువుల ఇళ్లలో జరిగే వేడుకకు కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వెళ్లారు. సాయంత్రం దశరథ తన కుమారుడు అనిల్(27) తో కలిసి బైక్‌పై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ శివారులో ఉన్న యాదాద్రి ఫంక్షన్‌హాల్ వద్దకు రాగానే వీరి బైక్‌ను గుర్తు తెలియని ఆటో ఢీకొ ట్టింది. దీంతో అనిల్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన దశరథను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. -
వివాహమైన నెలరోజులకే...
ఆలేరు, నల్గొండ : పెళ్లయి నెల రోజులైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బు తేవాలని భర్తతోపాటు అత్తామామ వేధించసాగారు. సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కొల్లూరుకు చెందిన బుసిగంపల నర్సయ్య, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను వృత్తిరీత్యా గీతకార్మికుడు. ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురైన మానస(22)ను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, గుల్కాపూర్‌కు చెందిన నోముల జ్ఞానేశ్వర్, జ్యోతిల కుమారుడు నోముల విక్రం అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. డిసెంబర్ 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద లక్ష రూపాయలు ఇచ్చారు. మరికొంత తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లి అయిన ఐదు రోజులకే విక్రం తన భార్య మానసను దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. మిగతా కట్నం కోసం మానసను అత్తామామలు వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టిల్లు కొల్లూరుకు చేరుకుంది. నెల రోజులుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మానసను తీసుకెళ్లేందుకు అత్తామామ, భర్త విక్రం మంగళవారం కొల్లూరుకు చేరుకున్నారు. మానసను సూటిపోటీ మాటలు అనడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మానస ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మానసను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ మేరకు మానస తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అత్తామామలు, భర్త, ఆడపడుచులు వేధించడం వల్లే తన కుమార్తె ఉరేసుకొని చనిపోయిందని మానస తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. -
మృత్యువులోనూ వీడని బంధం
మునగాల (కోదాడ) : తమ సమీప బంధువు మృతి చెందడంతో చూసేందుకు వెళ్తున్న దంపతులను మార్గమధ్యంలోనే మృత్యువు వెంటాది. రోడ్డు దాటుతున్న వారిని కారు రూపంలో మృత్యువు కభళించింది. గుర్తు తెలియన కారు ఢీకొని భార్య, భర్త దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన సూరేపల్లి చిన ముత్తయ్య(55), సూరేపల్లి కమలమ్మ(50) దంపతులు. వీరు వ్యవసాయ కూలీలు. ఇరువురు శుక్రవారం రాత్రి ముకుందాపురంలో సమీప బంధువు ఆత్మహత్యకు పాల్పడడంతో చూసేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరారు. ముకుందాపురం వద్ద బస్సు దిగి ముకుందాపురం పాత ఊరు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ముత్తయ్యను స్థానికులు ఓ ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఈ ప్రమాదంతో రోడ్డున పడినట్లయ్యింది. దంపతులు ఇరువురు ప్రమాదంలో మృతిచెందడంతో వీరి స్వగ్రామమైన గణపవరంలో విషాధం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. -
ప్రాణం తీసిన పంచాయతీ పోరు
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన తొలిరోజే యాదాద్రి భువనగిరి జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. వార్డుమెంబర్ల పోటీ విషయంలో దాయాదుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో తుర్కపల్లి మండలం ధర్మారం పంచాయతీ పరిధి పెద్దతండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని ధర్మా రం పంచాయతీ పరిధి పెద్దతండాకు చెందిన బిక్షా, చాల్యా దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో చిన్నకుమారుడైన అజ్మీరా రవినాయక్ (28) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవా డు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఇటీవల ఆరుగుంటల భూమిని విక్రయించుకున్నాడు. వా తావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యవసాయం మానేసి ఊరూరా తిరుగుతూ అ ల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ విక్రయించుకుంటూ జీవ నం గడుపుతున్నాడు. తన సోదరుడి కుమారుడిని పోటీకి నిలబెట్టాలని.. పంచాయతీ పరిధి పెద్దతండాలో 7,8 వార్డులు ఉన్నాయి. అయితే 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని రవినాయ క్ నిర్ణయించుకున్నా డు. అందుకు గ్రామ ఓటర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు. రాజకీయ కక్షలు భగ్గుమని.. దాయాదుల కుటుంబాల కన్ను ఒకే వార్డుపై పడడంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి లక్ష్మణ్ నా యక్, అతడి భార్య రాములమ్మ, కూతురు పావ ని, శ్రీనివాస్ నాయ క్, అతడి భార్య శా రద, నరేశ్‌లు కలిసి రవినాయక్ ఇంటికి వెళ్లి గొడవకు దిగా రు. పూటకు గతిలేకున్నా ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటూ సూటిపోటి మాటలు అనడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో రవి నాయక్ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్ తలపై కొట్టడంతో కిందపడిపోయాడు. కాసేపటికి నరేశ్ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో.. ఘర్షణ వాతావరణం సద్దుమణిగాక రవినాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడిని మాధాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో రస్తాపూర్ వద్ద 108 వాహన సిబ్బంది ఎదురై రవిని పరిశీలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని ధ్రువీకరించడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సబిత, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీస్ పహారాలో ధర్మారం పెద్దతండా పంచాయతీ పోరులో ఒకరి ప్రాణం బలైపోయింద న్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ధర్మారం పెద్దతండాకు చేరుకున్న ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు, ఎస్ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. తండాలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఏసీపీ సిబ్బందిని ఆదేశించారు. పోస్టుమార్టం నిమిత్తం రవినాయక్ మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సబిత ఫి ర్యాదు మేరకు ఆజ్మీరాలక్ష్మణ్, రాములమ్మ, శ్రీని వాస్నా యక్, నరేశ్‌నాయక్, పావని, శారదలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవార్డుపై దాయాదుల కన్ను ఇదే వార్డుపై రవినా యక్ దాయాదులైన అజ్మీరా లక్ష్మణ్, రాములమ్మ దంపతుల కుమారులు శ్రీనివాస్‌నాయక్, నరేశ్‌ల కన్ను పడింది. దీంతో నరేశ్ వార్డుసభ్యుడిగా తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో పోటీ చేయిం చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
చండూరు : మండలంలోని బంగారిగడ్డ గ్రామ కృష్ణా నీటి సంపులో పడి మృతి చెందిన చిలుకూరి చంద్రశేఖర్ (చందు)ది హత్యా..ఆత్మహత్యానా అనేది మిస్టరీగానే మిగిలింది. చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి చంద్రశేఖర్ (26)(చందు)మిషన్ భగీరథలో వర్క్ ఇన్స్పెక్టర్ ( కాంట్రాక్టు)గా పనిచేస్తున్నాడు. ఇతను డిసెంబర్ 31 తేదీన మునుగోడు మండల కేంద్రంలో మీటింగ్‌కని వెళ్లి అక్కడి నుంచే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. తిరిగి 2 తేదీన ( బుధవారం) మునుగోడు మండల కేంద్రానికి చేరుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. అప్పటి నుంచే కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. గురువారం ఉదయం బంగారిగడ్డ కృష్ణా నీటి సంపులో శవమై కనిపించాడు. మృతుడి స్కూటీని గుర్తించిన గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. ఒత్తిడికి లోనై.. మృతుడు చంద్రశేఖర్‌కు సంబంధించిన వాహనంలో సుసైడ్ నోట్ లభించింది. ఇందులో వదినలు, అన్నలు క్షమించాలని, అమ్మను బాగు చూసుకోవాలని రాసి ఉంది. అమ్మకు తన ముఖం చూయించకుండా వెళ్తున్నందుకు తనను క్షమించాలని ఉంది. ఇదంతా ఓ భాగమైతే... తను డిప్రెషన్‌కులోనై చనిపోతున్నా అని రాసి ఉంది. మృతుడికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆనందంగా ఉండే వాడని బంధువులు చెప్తున్నారు. అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్లాడు.. అసలు ఆ మూడు రోజులు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడు... ఫోన్ లో ఎవరితో మాట్లాడాడు...ఏం మాట్లాడాడు అనే కోణంలో ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అసలు కారణాలు రాయకుండా డిప్రెషన్‌కు లోనై అనే ఒకే కారణం చూపించడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంపై ఎస్ఐ సైదులు వివరణ ఇస్తూ మృతదేహం పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాత అసలు విషయం బయటకు వస్తుందన్నారు. అనేక విధాలుగా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. చంద్రశేఖర్(ఫైల్), నీటి సంపు ఇదే.. -
అతడు మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు: అమృత
మిర్యాలగూడ అర్బన్ : సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన పెరుమాళ్ల ప్రణయ్ ఇంటికి వచ్చిన వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్తిక్ టెక్స్టైల్స్ దుకాణం నిర్వాహకుడు గుండా వినోద్‌కుమార్ ప్రణయ్ కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రణయ్ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది. వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అమృత తమ అత్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తరువాత పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు. -
ఆశలు.. బుగ్గిపాలు
చందంపేట (దేవరకొండ) : జిల్లాలోని గుర్రపుతాండాకు చెందిన కేతావత్ శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె సాత్విక(18) ఇం టర్ మొదటి సంవత్సరం, సుహాస్ నాయక్(16) 10వ తరగతి, జై సుచిత(14) 9వ తరగతిని అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని కొలిర్ విల్లేలో విద్యనభ్యసిస్తున్నారు. తండ్రి స్వగ్రామంలోనే పాస్టర్‌గా వ్యవహరిస్తూనే గుర్రపుతండాలో ఓట్రస్ట్ ఆధ్వర్యంలో అలేత్య బంజార పాఠశాలను నిర్వహిస్తూ సుమారు 450 మందికి విద్యనందిస్తున్నాడు. 20నెలల క్రితం వరకు శ్రీనివాస్‌నాయక్ సంతానం హైదరాబాద్‌లోనే ఓ పాఠశాలలో విద్యనభ్యసించారు. తదనంతరం ఉన్నత విద్య నిమిత్తం అమెరికాకు పంపించారు. అక్కడ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో.. సాత్విక, సుహాస్‌నాయక్, జై సుచిత అభ్యసిస్తున్న విద్యాసంస్థలకు ఈ నెల 20 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. అయితే, అమెరికాలోని ఐయోవా రాష్ట్రం లోనికొలిర్ విల్లేలో నివాసముంటున్న ఓపాస్టర్తో గుర్రపుతండా పాస్టర్ శ్రీనివాస్ నాయక్‌కు పరిచయముంది. కాగా, సదరు పాస్టర్ శ్రీనివాస్‌నాయక్ ముగ్గురు పిల్లలను తండ్రి అనుమతితో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చారు. షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అమెరికాలో ఉంటున్న పాస్టర్ ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అందరూ గాఢనిద్రలో ఉండగా షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇల్లు పూర్తిగా కాలి పోగా అందులో ఉన్న పాస్టర్ శ్రీనివాస్ నాయక్ ముగ్గురు పిల్లలతో పాటు స్నేహితుడు పాస్టర్ భార్య ఖేలి కూడా సజీవ దహనమైంది. తమ సంతానానికి బంగారు భవిష్యత్ ఇవ్వాలనేది.. ఆ దంపతులు కల. అందుకు ఎన్ని వ్యయప్రయాసాలకోర్చైనా వారిని ఉన్నత విద్య అందించాలని నిర్ణయించుకున్నారు. కష్టనష్టాలు ఎదురైనా పిల్లలను అమెరికా పంపించి చదివిస్తున్నారు. కుటుంబ పెద్ద ఓ వైపు పాస్టర్‌గా వ్యవహరిస్తూనే...మరో వైపు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. విధి వైపరిత్యమో.. ప్రభువు ఆగ్రహమో తెలియదు కానీ.. అమెరికాలో క్రిస్మస్ వేడుకల్లో చోటు చేసుకున్న అపశ్రుతిలో ఆ దంపతుల ఆశలు సజీవ దహనమయ్యాయి. దీంతో నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండ లం గుర్రపుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్రపుతండాలో విషాదఛాయలు అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్నిప్రమాదంలో మృత్యువాతపడడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాస్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌నాయక్‌కు బంధువులు అధికమే. అయితే స్వగ్రామంలో ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్‌గా శ్రీనివాస్‌నాయక్ స్వయంగా అన్ని తానై నిర్వహించారు. ఎప్పటికప్పుడు పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండే శ్రీనివాస్‌నాయక్‌కు పిల్లలు అంటే చాలా ఇష్టం. అగ్నిప్రమాద ఘటనలో పిల్లలు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న బంధువులు, పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు గ్రామానికి చేరుకున్నారు. కాగా పిల్లల మరణవార్త విన్న తండ్రి శ్రీనివాస్నా యక్, తల్లి సుజాతలు హుటాహుటిన అమెరికా పయనమయ్యారు. ఎమ్మెల్యే పరామర్శ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు మృతిచెందిన పిల్లల తండ్రి శ్రీనివాస్‌నాయక్ స్నేహితుడు. అగ్నిప్రమాద ఘటనలో గుర్రపుతండాకు చెందిన ముగ్గురు మృత్యువాతపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ స్వగ్రామానికి చేరుకున్నారు. మృతుల బంధువులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మండలంలోని గుర్రపుతండాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృత్యువాతపడిన విషయమై దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు విషయాన్ని తెలియజేశారు. మృతదేహాలు స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు దౌత్యపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
శాలిగౌరారం(తుంగతుర్తి) : బతుకుదెరువు కోసం కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ మత్స్యకార్మికుడు చేపలవేటకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన నీలం వెంకటేశ్(56) 30 సంవత్సరాలుగా కులవృత్తి అయిన చేపలవేటపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రోజువారి మాదిరిగానే గురువారం తన సన్నిహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న మూసీ ప్రాజెక్టులోకి చేపలవేటకు వెళ్లాడు. దీంతో ప్రాజెక్టులోకి దిగి కొన్ని చేపలను పట్టిన ఆయన అదే రీతిలో చేపలను పట్టుకుంటూ వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఆయన వల విసిరిన ప్రదేశంలో ఇసుకను తవ్విన గొయ్యి ఉండడంతో కాలుజారి గోతిలో పడడంతో అదేగోతిలో ఉన్న చేపలవల కాళ్లకు చుట్టుకుంది. తప్పించుకునే క్రమంలో వలలోనే చిక్కుకున్నాడు. చేపల వల నుంచి బయటపడేందుకు వీలుకాకపోవడంతో నీటమునిగిన వెంకటేశం ఊపిరాడక ప్రాజెక్టునీటిలోనే మృతిచెందాడు. కొంత సమయం తర్వాత అతనితో పాటు చేపలవేటకు వెళ్లిన అతని సన్నిహితులు తమ పనిని ముగించుకొని ఒడ్డుకు చేరుకోగా వెంకటేశం మాత్రం కనిపించలేదు. కానీ ప్రాజెక్టు ఒడ్డున వెంకటేశానికి సంబంధించిన సైకిల్, చెప్పులు ఉండడంతో ప్రాజెక్టులో ఎక్కడో ఓ చోట ఉన్నాడనుకున్న అతని సన్నిహితులు ప్రాజెక్టు ఒడ్డున మరికొంత సేపు వేచిచూశారు. ఎంత సేపటికి వెం కటేశం రాకపోవడం, ప్రాజెక్టులో ఎక్కడా కని పించకపోవడంతో ఆందోళనకు గురైన సన్నిహితులు ప్రాజెక్టులో కొంతమేర వెతకసాగారు. ఈ క్రమంలో ఓ లోతట్టు ప్రాంతంలో చేపల వలకు సంబంధించిన దిండు(థర్మకోల్) కనిపించడంతో వారు దానిని పైకి లాగడంతో వెంకటేశం మృతదేహం కనిపించింది. దీంతో వారు లబోదిబోమం టూ చెరువు ఒడ్డుకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంకటేశం మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో తరలివచ్చారు. వెంటనే మరికొంతమంది మత్స్యకారులతో పాటు గ్రామస్తులు కలిసి తెప్పపడవలో వెంకటేశం మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తండ్రి మృతదేహంపై పడి ఆయన కుమార్తె రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా వెంకటేశం భార్య ఇటీవల కొంత అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమెను బంధువులు, గ్రామస్తులు రాత్రి ఇటుకులపహాడ్‌కు తీసుకువచ్చారు. ప్రమాద సంఘటనపై బాధిత కుటుంబీకులు శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇటుకులపహాడ్‌లో విషాదఛాయలు చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ప్రాజెక్టులో నీటమునిగి నీలం వెంకటేశం మృతిచెందడంతో ఇటుకులపహాడ్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటుకులపహాడ్‌లో అత్యధికంగా మత్స్యకారుల కుటుంబాలు ఉండడం, వారంతా చేపలవేటపైనే ఆధారపడి జీవనోపాధి పొందడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు, మత్స్యకారులు, రాజకీయపార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. -
అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి
యాదాద్రి భువనగిరి,మఠంపల్లి (హుజూర్‌నగరర్) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవా రిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేం దుకు బాత్రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్రూం వెంటిలేటర్‌కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్‌కుమార్ ఘటన స్థలా న్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. నీరజ మృతిపై అనుమానాలు నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. రఘునాథపాలెంలో విషాదఛాయలు .. ఇంటర్ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. -
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ క్రైం : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం శివారు గిరకబాయిగూడెం రోడ్డు రైల్వేట్రాక్ పక్కన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం మద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధి చింతల్‌తండాకు చెందిన ఝాన్సీ దివ్యాంగురాలు. ఝాన్సీ స్థానిక కెనరా బ్యాంక్‌లో ఉగ్యోగిగా పనిచేస్తోంది. ఈమెకు సహాయకుడిగా సోదరుడైన రమావత్ బాలా (35) ఐదేళ్లుగా ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి తులసీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బాలాకు ఐదేళ్ల క్రితమే వివాహం కాగా విభేదాలు రావడంతో నెలరోజులకే విడిపోయారు. అప్పటినుంచి బాలా మరో వివాహం చేసుకోకుండా సోదరికి సహాయకుడిగా ఉంటున్నాడు. సాయంత్రం ఇంటినుంచి వెళ్లి.. బాలా మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో సోదరి ఝాన్సీ అర్ధరాత్రి అవుతున్నా సోదరుడు తిరిగిరాకపోవడంతో ఫోన్ చేయగా స్వచ్ ఆప్ వచ్చింది. దీంతో కంగారుపడి స్థానిక తిరుమలనగర్‌లో నివాసముంటున్న సోదరి నీలాకు ఫోన్‌చేసి వాకబు చేసినా అక్కడకు రాలేదని చెప్పింది. ఆమె సమీపంలోనే నివాసముంటున్న బంధువులకు ఫోన్ చేసినా బాలా ఆచూకీ తెలియలేదు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు డీఎస్పీ గంగారాం, టూటౌన్ సీఐ బాషా ఇతర సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీశారు. అనంతరం జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. పలువురు అనుమానితుల గుర్తించి వారికోసం ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ బాషా తెలిపారు. రైల్వేట్రాక్ సమీపంలో విగతజీవుడై.. రైల్వేట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి విగతజీవుడిగా పడి ఉన్నాడని చర్చించుకుంటుండడంతో స్థానికంగానే ఉంటున్న నీలా బంధువులు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె ఘటనాస్థలికి వచ్చి బాలాగా గుర్తించింది. అతడి తలపై దుండగులు బలమైన రాడ్‌తో మోదడంతోనే ప్రాణాలు విడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. -
కాటేసిన మైనర్ల ప్రేమ..!
రెండు కుటుంబాలవి పక్క పక్క ఇళ్లే.. తెలిసీ తెలియని వయసులో ఇద్దరు మైనర్లలో ఆకర్షణ మొదలైంది. అది పరిచయానికి దారితీసి ఇద్దరి మనసులు కలిశాయి..కొంతకాలంగా సాగుతున్న వారి ప్రేమ హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటికి పొక్కడంతో పెద్దల మధ్య విభేదాలు పొడచూపాయి. తమ ప్రేమను ఒప్పుకోరనో..? విడిచి ఉండలేనని నిర్ణయించుకుందో..? మరో కారణమో తెలియదు కానీ ఆ బాలిక బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి (మనుగోడు) : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఇద్దరు మైనర్ల కుటుంబాలు పక్కపక్కనే నివాసముంటున్నాయి. బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి కూలి పనులకు వెళ్తుండగా బాలుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఆటో నడుపుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక పత్తికూలికి ఆ బాలుడి తండ్రి ఆటోలోనే వెళ్లేది. అలా తండ్రి లేని సమయంలో బాలుడు ఆటో నడుపుతుండగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. హద్దులు దాటి.. గర్భందాల్చి.. ఇద్దరు మైనర్లే కావడం.. జీవితంపై అవగాహన లేకపోవడం.. సినిమాల ప్రభావం వెరసి వారి ప్రేమ కాలక్రమేణా హద్దులు దాటింది. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ తమను వేరు చేస్తారో అన్న భయాందోళనతో బాలిక మిన్నకుండిపోయింది. బాలిక ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో కుటుంబ సభ్యులు నిలదీయడంతో తమ ప్రేమాయణం బయటపెట్టింది. ప్రేమికుల మధ్య వాగ్వాదం అయితే, శుక్రవారం సాయంత్రం బాలిక కుటుంబాలు ఇంట్లోనే మంతనాలు జరుపుతున్నారు. ఈ సమయంలో బాలుడు వారి ఇంటి ఎదురుగా నుంచి వెళ్తుండగా బాలిక గమనించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సదరు బాలుడు కోపోద్రిక్తుడై బాలికపై చేయి చేసుకున్నాడు. బాలుడి ఇంటి ఎదుట ధర్నా.. బాలిక మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు మధ్యాహ్నం బాలుడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక మృతికి కారణమైన సదరు బాలుడితో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు నాంపల్లి ఎస్ఐ శివకుమార్ తెలిపారు. అబార్షన్ చేయించమని.. విషయం తెలుసుకుని కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం సదరు ప్రేమికుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రిని నిలదీశారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విషయం తర్వాత చర్చిద్దామని తొలుత బాలికకు అబార్షన్ చేయించమని బాలుడి తండ్రి సూచిం చాడు. అందుకు రూ.5వేలు కూడా ముట్టజెప్పాడు. అయితే ఆస్పత్రికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు ఏడు నెలల గర్భానికి అబార్షన్ చేయాలంటే రూ. 25వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ రావడం, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగివచ్చారు. పురుగుల మందు తాగి.. వారిద్దరి మధ్య ఏం విషయంలో వాగ్వాదం జరిగిందో, ప్రేమికుడు చేయిచేసుకున్నాడనో.. పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిందో తెలియదు కానీ వెంటనే ఇంట్లోకి వెళ్లిన బాలిక పురగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు సదరు బాలికను నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. -
ఆస్తి కోసం మామను మట్టుబెట్టిన అల్లుడి
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : ఆస్తికోసం మామను మట్టుబెట్టిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ బాపూరెడ్డి, సీఐ పార్థసారథి, ఎస్ఐ మధుసూదన్ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని చెట్లకుంట్ల తండాకు చెందిన మేరావత్ లాలూనాయక్(60), సోని దంపతులకు నలుగురు కుమార్తెలు. ఈయన పేర 3 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. కాగా లాలూనాయక్ చిన్న కుమార్తె మమతకు దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామపరిధిలోని పత్లావత్ తండాకు చెందిన వడ్త్య శంకర్‌నాయక్‌తో ఏడాది క్రితం వివాహం చేశారు. కుమారులు లేకపోవడంతో శంకర్‌నాయక్ ఇల్లరికం తెచ్చుకున్నాడు. లారీడ్రైవర్‌గా పనిచేసే శంకర్‌నాయక్ ప్రతిరోజు మద్యం తాగివచ్చి ఆస్తినంతా తనపేరిట రాయాలని భా ర్య, అత్తామామలను వేధింపులకు గురిచేస్తున్నా డు. అల్లుని వేధింపులు తట్టుకోలేక లాలూనాయక్ బతుకుదెరువు కోసం భార్య సోనితో కలిసి ఐదు నెలల క్రితం మండలంలోని జూలూరు గ్రామానికి వచ్చి, స్థానిక అంబికా గార్డెన్స్ ఫంక్షన్‌హాలులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న, రాత్రి శంకర్‌నాయక్ తన భార్యకు ఫోన్ చేసి మీ నాన్నను చంపేస్తానని చెప్పాడు. అదే రోజు రాత్రి బైక్‌పై జూలూరుకు చేరుకొన్న అతను ఫంక్షన్‌హాలులో పడుకున్న మామ లాలూనాయక్‌పై గ్రైండర్రాయిని తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేసిన సీసీ పుటేజీని పరిశీలించగా శంకర్‌నాయక్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పత్లావత్ తండాలో తలదాచుకున్నాడని తెలుసుకొన్న పోలీసులు అతనిని పట్టుకొని అరెస్ట్ చేసి శుక్రవారం భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఆస్తికోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించిన హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ, సత్యం, హోమ్‌గార్డ్ సుధాకర్‌ను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అభినందించారని చెప్పారు. -
భగ్గుమన్న పాతకక్షలు
మోతె (కోదాడ) : నివురు గప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు భగ్గుమన్నాయి. బోరుబావి విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ తగాదాలు తండ్రి ప్రాణాలను బలిగొనగా తనయుడిని ఆస్పత్రి పాల్జేశాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాం పురం తండాకు చెందిన ఆంగోతు సైదులు, ఆంగోతు హేమ్లా (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తండా శివారులోనే పక్కపక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఏడాదిగా తగాదాలు ఆంగోతు సైదులు తన వ్యవసాయ భూమిలో ఏడాది క్రితం బోరు వేసుకున్నాడు. నీరు పుష్కలంగా ఉండడంతో అతడి భూమి పక్కనే వ్యవసాయ భూమి కలిగిన హేమ్లా కూడా ఆ బోరుకు సమీపంలోనే మరో బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పటినుంచే రెండు కుటుంబాల మధ్య తగాదాలు సాగుతున్నాయి. అర్ధరాత్రి బోరు వేయాలని.. ఎలాగైనా సైదులు బోరుకు సమీపంలోనే మరో బోరు వేయాలని హేమ్లా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే గురువారం సాయంత్రం కొబ్బరికాయతో బోరు వేసే పాయింట్‌ను గుర్తించారు. అది గమనించిన సైదులు అతడి కుమారులు రాములు, సురేష్ దానిని అడ్డుకునేందుకు అప్రమత్తమయ్యారు. అయితే హేమ్లా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తన కుమారుడు ఉపేందర్‌తో కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ అప్పటికే వ్యవసాయ భూమి వద్ద సైదులు అతడి కుమారులు మాటువేసి ఉన్నారు. బోరు వేసేందుకు ప్రయత్నిస్తున్న హేమ్లా అతడి కుమారుడు ఉపేందర్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే సైదులు అతడి కుమారులు కలిసి రాడ్‌తో హేమ్లా తలపై బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో అడ్డువచ్చిన ఉపేందర్‌కు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి ఉపేందర్‌ను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రాంపురంతండాలో వ్యక్తి దారుణ హత్య విషయం తెలుసుకున్న డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ఐ సంతోష్ ఇతర సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యోదంతానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వివాదానికి కారణమైన వ్యవసాయ భూములను పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు హేమ్లా కుమారుడు రమేష్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఆంగోతు సైదులు, అతడి కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆమె.. బీటెక్... అతడు ఇంటర్మీడియట్
చౌటుప్పల్ (మునుగోడు) : భార్యపై అనుమానంతో కూతురుని కడతేర్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల ను బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ బాపురెడ్డి వెల్లడిం చారు. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకుమార్‌కు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షర అలియాస్ స్వప్నతో గత ఏడాది ఆగస్టు 16న వివాహం జరి గింది. శివకుమార్ కుటుంబం జీవనోపాధి నిమి త్తం సమీపంలోని ఎల్లగిరి గ్రామం వద్ద కిరాణం షాపు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి సంసారం రానురాను గొడవలకు దారితీసింది. శివకుమార్ తరుచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో అక్షర గర్భం దాల్చింది. మొదటి కాన్పుకావడంతో ప్రసవం కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అక్కడే ఈ ఏడాది ఆగస్టు 1న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు బారసాల చేసి నిహారిక అనే పేరు పెట్టారు. మూడు నెలల అనంతరం దీపావళి పండుగకు అక్షర చంటిబిడ్డతో కలిసి అత్తగారి ఇంటికి వచ్చింది. నిత్యం భార్యపై అనుమానమే.. శివకుమార్ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు. తన భార్య అక్షర బీటెక్ పూర్తి చేసింది. తనకంటే ఎక్కువగా చదువుకుందని భార్యను అనుమానించేవాడు. ఇంటి వద్ద ఖాళీ సమయంలో అక్ష ర ఫోన్ మాట్లాడేది. తనను కాకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో దంపతుల నడుమ నిత్యం గొడవలు జరిగేవి. బిడ్డ తనకు పుట్టలేదని.. ఇప్పటికే భార్యతో నిత్యం గొడవ పడుతున్న శివకుమార్ బిడ్డ జన్మించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైన కూతురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సరైన సమయం కోసం వేచివున్నాడు. ఈ క్రమంలోనే శివకుమార్ తల్లిదండ్రులు ఈనెల 11న దీపావళి నోముల కోసం తమ సొంత గ్రామమైన నాగారం వెళ్లారు. ఆరోజు తమ తల్లిదండ్రులు కొయ్యలగూడెం రారని గ్రహించిన శివకుమార్ ఇదే అదునుగా భావించాడు. ఎలాగైన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో భార్యతో గొడవపడ్డాడు. కొంత సేపటికి భార్య బయట ఉన్న బాత్రూంకు వెళ్లింది. వెంటనే మంచంపై నిద్రిస్తున్న బిడ్డను గొంతు నులిమి తలను మంచానికి కొట్టాడు. ఈ శబ్దానికి బయట ఉన్న అక్షర పరుగున లోనికి వెళ్లింది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అక్షర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం అరెస్టు చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై చిల్లా సాయిలు ఉన్నారు. -
కోరిక తీరాక.. పెళ్లి వద్దన్నాడు
సాక్షి, సూర్యాపేట క్రైం : ప్రియుడు మోసం చేశాడని.. ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కక్కిరేణి సత్తయ్య కుమార్తె ఉమారాణి డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. ఇదే క్రమంలో దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన సుద్దబావి శ్రీకాంత్ చండూరు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉమారాణి చెర్వుగట్టుకు వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకాంత్ చిన్నమ్మ జయ ద్వారా ఉమకు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం తాళ్లవీరప్పగూడేనికి ఉమారాణిని జయ రప్పించింది. ఓ గదిలో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఉమారాణికి ఇచ్చింది. అనంతరం శ్రీకాంత్ గదిలోకి వెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఉమారాణి మత్తునుంచి తేరుకున్న శ్రీకాంత్, జయను నిలదీయగా ఇద్దరం ఒకే కులానికి చెందిన వారం కావడంతో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. రెండేళ్లనుంచి శారీరకంగా అనుభవిస్తూ కాలం వెల్లదీస్తూవచ్చా డు. శ్రీకాంత్ తన చెల్లి వివాహం జరిగాక వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇటీవల శ్రీకాంత్ చెల్లి వివాహం జరగగా.. శ్రీకాంత్ తమ మేనత్త కూతురితో వివాహ నిశ్చయం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని జయ ఉమారాణికి ఫోన్ ద్వారా నెల రోజుల క్రితం చేరవేసింది. ఉమారాణి మాట్లాడేందుకు శ్రీకాంత్‌కు ఫోన్ చేయగా.. లిఫ్టు చేయ లేదు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం సూర్యాపే ట డీఎస్పీ నాగేశ్వరరావును కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. శ్రీకాంత్‌ను డీఎస్పీ నాగేశ్వరరావు పిలిపించాడు. ఇరువర్గాలు మాట్లాడుకోవాలని చెప్పి కొంతకాలం గడిచాక సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి.. కేసు పెట్టలేమని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు పెట్టిన కొంతకాలం సమయం గడిపి వారి ప్రేమాయణం ఇక్కడ సాగలేదంటూ ఎక్కడ సాగిందో అక్కడే కేసు పెట్టుకోవాలన్నారని.. ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతూ ఉందని వాపోయారు. దీంతో ఉమారాణి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసేందుకు మంగళవారం పోలీసు కార్యాలయానికి చేరుకుంది. సమయానికి ఎస్పీ ఇతర సమావేశాల్లో ఉండగా.. ఎదురుచూసి చేసేదేమిలేక వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఏరియాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఉమారాణికి ఏరియాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలిచి..
అనంతగిరి (కోదాడ) : భూ వివాదంపై ఓ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐ చితకబాదాడు. ఈ ఘటన అనంతగిరిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీనుకు తన తల్లి, చెల్లెలుతో జరుగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించాలని ఎస్పీ అనంతగిరి ఎస్ఐని ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఐ రామాంజనేయులు గంధం శ్రీనుని ఫోన్లో సంప్రదించి స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించాడు. దీంతో శ్రీను న కొడుకు మనోహర్‌తో కలిసి మంగళవారం రాత్రి ఎడున్నర గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లగానే.. స్టేషన్ లోపలికి వెళ్లగానే ఎస్ఐ తనపై దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. దుర్భాషలాడుతూ సిబ్బందితో కలిసి చిత్రహింసలు పెట్టారని తెలిపా డు. చివరకు బూటుకాలిని నాకించి అవమానానికి గురిచేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం చేయాలని.. తనపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకుని న్యా యం చేయాలని కోరుతూ బాధితుడు శ్రీను కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిం చాడు. సివిల్ కేసును కో ర్టుకు పంపకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించాడు. ఎస్ఐ రామాంజనేయులు తీరుతో తనకు ప్రాణ హాని ఉన్నదని పై న్యాయం చేయాలని వేడుకున్నారు. దాడి చేయలేదు : ఎస్ఐ గంధం శ్రీనుపై తాము దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ రామాంజనేయు తెలిపారు.శ్రీనుపై విచారణ చేపట్టాలంటూ ఎస్పీ ఆదేశాల మేరకు అతడిని పిలిపించామని తెలి పా రు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచా రించామని, ఆకేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆనోపణలు చేస్తున్నాడన్నారు. అనుమతి లేకుండా స్టేషన్ ఎదుట ఆందోళన చేసినందుకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
హత్యా.. ఆత్మహత్యా?
పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అనుమానాస్పదస్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం పీఏపల్లి మండలం గడ్డమీదితండాలో జరిగింది. మృతురాలి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డమీదితండాకు చెందిన మూనావత్ శ్రీనుకు, తిరుమలగిరి సాగర్ మండలం కీచ్యా తండాకు చెందిన మూనావత్ మంగికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పన్నెండేళ్లలోపు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే శ్రీను తరచూ మద్యం సేవిస్తూ మంగితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య ఘర్షణ కూడా తలెత్తేది. శనివారం పిల్లలను పాఠశాలకు పంపిన తర్వాత మంగి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. పొలం వద్ద సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెం దింది. పొలం వద్దకు వెళ్లిన మంగిని భర్త, అత్తామామలు కలిసి గొంతు నులిమి చంపారని మృ తురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు గుడిపల్లి ఎస్ఐ వీరరాఘవులు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన డీఎస్పీ గడ్డమీదితండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మంగి మృతదేహాన్ని దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్ పరిశీలించారు. మృతి కారణాలను అడి గి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షంచాలని మృతురాలి బంధువులు కోరారు. డీఎస్పీ వెంట కొండమల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ వీరరాఘవరెడ్డి, శ్రీని వాస్‌నాయక్, ఏఎస్ఐ యల్లయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
వెంటాడిన మృత్యువు
భువనగిరిఅర్బన్ : ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. వైద్య పరీక్షలు అనంతరం ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో మహిళ, ఓ చిన్నారి దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం భువనగిరిలోని పోస్టాఫీస్ కార్యాలయం వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన దేవరకొండ ప్రసాద్, రవళి(35) దంపతులు. ప్రసాద్ చెల్లెలు స్వాతి కుమా ర్తె అక్షర(4) అనారోగ్యంగా ఉండడంతో రవళి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. క్రమంలో పోస్టాఫీసు కార్యాలయం ఎదుట రోడ్డును దాటుతున్నారు. ఈ క్రమంలో పాతబస్టాండ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవళి, అక్షర ఇద్దరు ట్రాక్టర్ కిందపడ్డారు. గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంతో వా రిపై నుంచి ట్రాక్టర్ వెళ్లిపోయింది. దీంతో అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన ర వళిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్టు అక్కడ వైద్యులు చెప్పారు. అక్షర తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పరామర్శ రవళి, అక్షర కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతుల కు టుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని చెప్పారు. పరామర్శించిన వారిలో వార్డు కౌన్సిలర్ ఎలిగె నరేశ్, సత్యనారాయణ, సు ధాకర్, నర్సింహ, అంకర్ల సత్తమ్మలు ఉన్నారు. -
ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా..
మిర్యాలగూడరూరల్ : బంధువుల ఇంట్లో నిర్వహించిన ఫంక్షన్ హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా కారు నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో మంగళవారం రాత్రి జరి గింది. రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కు చెందిన మామఅల్లుడు ఎండీ.ఖమృల్లా (57), షాబ్నగర్కు చెందిన షేక్ .రఫీ కలిసి ఇండికా కారులో మంగళవారం సాయంత్రం మాడ్గులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో నిర్వహిస్తున్న ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి రాత్రి 10:30 గంటలకు కారులో మిర్యాలగూడకు వస్తుండగా ఐలాపురం గ్రామ శివారులో ఎడమ కాల్వ కట్టపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి కాల్వ లోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో కారు నీటిలో మునిగింది. డ్రైవింగ్ చేస్తున్న రఫీ తప్పించుకోగా, కారులో ఉన్న ఖమృల్లా కారుతో సహా నీటిలో మునిగిపోయాడు. రఫీ అతనిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సంఘటన జరిగిన వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చినా రాత్రి వేళ కావడంతో బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహానికి ప్రమాదం జరిగిన స్థలం నుంచి కారు సుమారు 200 మీటర్ల దూరం వెళ్లి ఒడ్డుకు చేరిం ది. స్థానికులు, క్రేన్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమిం చి కారును బయటకు తీశారు. కారులో ఉన్న మృతదేహాన్ని తొలుత వెలికి తీసి, అనంతరం కారును బయటకు తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఖమృల్లా జిల్లా కేంద్రం లోని కోఆపరేటివ్ ఆడిట్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు. మృతుడి కుమారుడు జహంగీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుచున్నట్లు తెలిపారు. అండర్ పాస్‌లో నీరు ఉండడంతో ... ఐలాపురం వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే క్రాసింగ్ తొలగించి ఇటీవల అండర్ పాస్ మార్గం ఏర్పాటు చేశారు. కాగా అండర్ ప్రాస్‌లో నీరు నిల్వ ఉండడంతో అందులో నుంచి కారు వెళ్తే కారు సైలెన్సర్లోకి నీరు వెళ్తుందనే ఉద్దేశంతో అండర్ పాస్ పక్కన గల కాల్వ కట్టపైనుంచి వెళ్లడం వల్లే కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అండర్ ప్రాస్‌లో నీరు ఉండడం వల్ల ఐలాపురం, రెడ్డిల్యాబ్ ఉద్యోగులు నిత్యం ఈ మార్గం నుంచే వెళ్తుంటారు. తరచు ఇక్కడ ప్రమాదాలు సంభవి స్తాయని, ఇప్పటికే 4 బైకులు కాలువలో పడి పో యాయని స్థానికులు తెలిపారు. -
సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు.. విటుల్లో ప్రముఖులు?
కోదాడలో వెలుగుచూసిన సెక్స్‌రాకెట్ కలకలం సృష్టిస్తోంది. ఆన్లైన్లో అమ్మాయిల ఫొటోలను అప్లోడ్ చేసి విటులను ఆకర్షిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వ్యభిచార నిర్వాహకుల వద్ద రెగ్యులర్ కస్టమర్స్ పేరుతో ప్రముఖుల ఫోన్‌నంబర్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం కోదాడలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, కోదాడ : పట్టణ కేంద్రంగా ఆన్లైన్ వ్యభిచారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో ఈ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అందివచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘాపెట్టి .. కోదాడ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఉప్పందింది. దీనిపై నిఘా పెట్టిన ఖాకీలు శనివారం దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు రిమాండ్ చెయ్యడంతో పాటు బాలికలను నల్లగొండ రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను పోలీసులు తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడినట్లు కోదాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిలో వాస్తవం లేదని కొందరు కొట్టిపారేస్తుండగా మరికొందరు నిప్పులేనిదే పొగరాదని ముక్తాయింపునిస్తున్నారు. విటుల్లో పలువురు ప్రముఖులు? నిందితుల వద్ద లభించిన సెల్ఫోన్లే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దానిలో ఉన్న నంబర్లు, వారితో తరచూ మాట్లాడిన వారి నంబర్లు పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేపనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన కొందరు ప్రభ్వుత ఉద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికావిలేకరులు, వ్యాపారులు ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. తమ పేరు బయటకు రాకుండా పోలీసులను కాకా పడుతున్నారని, వారిపై పెద్దల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఇక్కడ ప్రచారం సాగుతుంది. పోలీసు కస్టడీలో నిందితులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన నిందితులను కోదాడ పోలీసులు తిరిగి తమ కస్టడీకి తీసుకున్నారని సమాచారం. వారి నుంచి పూర్తి వివరాలను రాబట్టి ఈ రాకెట్‌కు చెక్‌పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మా దృష్టికి కూడా వచ్చింది కట్టకొమ్ముగూడెం రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాము. కానీ మా వద్ద వాట్సప్‌లో కొంత మంది ప్రముఖుల వివరాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ వాస్తవంగా మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. జరుగుతున్న ప్రచారంపై విచారణ చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తాం. – శ్రీనివాసులరెడ్డి, పట్టణ సీఐ -
వివాహేతర సంబంధం..పెట్రోల్ పోసి...
అతనో ఆర్ఎంపీ వైద్యుడు. పెళ్లి కూడా అయింది. క్లినిక్‌కు తరుచుగా వచ్చే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. చేసేది లేక ఆమెను రెండో భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో కుటుంబకలహాలు మొదలయ్యాయి. దీంతో అప్పుడప్పుడు కలుసుకుంటున్న మాదిరిగానే ఆదివారం కూడా రెండో భార్యను కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. యువతి ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెడుతుండగా కర్రతో తలపై మోది అతికిరాతంగా చంపాడు. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం ఉదయం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో జరిగింది. రామన్నపేట(నకిరేకల్) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షుకూర్ అనే వ్యక్తి రామన్నపేటకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం కొండమల్లేపల్లిలోనే గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్ఎంపీగా ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో గుంటూరుకు చెందిన షమీనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తరచుగా క్లినిక్‌కు వస్తుండంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం షమీన బంధువులకు తెలియడంతో పెళ్లిచేసుకోవాలని షుకూర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో షుకూర్ ఆమెను 2017 ఏప్రిల్‌లో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం మొదటి భార్యకు, ఆమె తల్లిదండ్రులకు తెలవడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి.మొదటి భార్య తరఫు బంధువుల ఒత్తిడి మేరకు షుకూర్ 5నెలల క్రితం తన మకాంను రామన్నపేటకు మార్చాడు. రామన్నపేట పాతబస్టాండ్ ఆవరణలో ఆయూస్ క్లినిక్‌ను తెరిచి వైద్య సేవలు అందిస్తున్నాడు. షుకూర్ రామన్నపేటకు వచ్చిన తర్వాత కూడా రెండో భార్యతో ఫోన్లో టచ్‌లో ఉన్నాడు. రెండు పర్యాయాలు ఆమె రామన్నపేటకు వచ్చి అతనిని కలిసి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో షమీనా మండలంలోని ఇంద్రపాలనగరం శివారులోకి రాగా, షుకూర్ బైక్‌పై అక్కడికి వెళ్లాడు. రోడ్డుకు కొద్దిదూరంలో వ్యవసాయ బావి భూమిలోని చింతచెట్టుకు కింద కలుసుకున్నారు. ఆ సమయంలో వారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. షుకూర్ తనవెంట తీసుకువచ్చిన బాటిల్లోని పెట్రోల్‌ను ఆమెపై చల్లి లైటర్‌తో నిప్పంటించాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కల రైతులు గమనించి మంటలను చూసి అరుపులను విని పరుగెత్తుకుంటూ వచ్చి 108కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమచికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షమీనా మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ బి.నాగన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అమానుషం..కొత్తమలుపు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రెండు నెలల క్రితం వెలుగుచూసిన బాలికల అక్రమ రవాణా కేసు కొత్తమలుపు తిరుగుతోంది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో మరెన్నో కోణాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా చర్చజరుగుతోంది. నిజాలు నిగ్గుతేలేనా..? నాలుగు దశాబ్దాలుగా పవిత్ర పుణ్యక్షేత్రంలో వ్యభిచారం జరుగుతున్నా.. పోలీస్, ఇంటెలిజె న్స్ వర్గాలు కళ్లు మూసుకున్నాయా..? అమానవీయ దందాలో రాజకీయ ప్రమేయం ఉందా..? బాలికల అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరు వైద్యులు ఎక్కడ..?. హర్మోన్ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పోలీసులు కాపాడిన బాలికలకు ఇప్పటి వరకు అందని పరిహారం. చిన్నారులు ఎవరో ఇంకా తేలని వైనం ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తు న్న అంశం సంచలనంగా మారింది. ఈ అంశాలన్నీ చర్చకు వచ్చి నిజాలు నిగ్గుతేలుతాయా అన్ని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారులకు ఆదేశాలందడంతో.. పవిత్ర పుణ్యక్షేత్రంలో గత జూలై 30వ తేదీన వెలుగు చూసిన అమానవీయ బాలికల బలవంతపు వ్యభిచార దారుణాలపై విచారణ జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీసు, ఇతర శాఖల అధికారులను కోర్టు విచారణకు హాజరుకావా లని ఆదేశాలు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజులుగా హైకోర్టులో ఈపాç ³ కూపంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో కంసాని కళ్యాణి అనే వ్యభిచార గృహనిర్వాహకురాలు బాలికను చిత్రహింసలకు గురిచేయడంతో పొరుగింటి వారు ఇచ్చిన సమాచారంతో విషయం మొత్తం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బాలికల అక్రమ రవాణా ఇలా.. వ్యభిచార గృహ నిర్వాహకులు కొందరు బాలకలను కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు. ఇంకొందరిని రూ.లక్షలు పోసికొంటారు. మరికొందరిని మా యమాటలతో పట్టుకొస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఆడపిల్లలు తమ పిల్లలే అని చెప్పి స్కూళ్లలో చేర్పిస్తారు.ఎవరడిగినా తామే తల్లిదండ్రులని చెప్పాలంటూ చిత్రహింసలు పెడతారు. శరీర అవయవాలు పెంచేందుకు, యుక్త వయస్కులుగా కనిపించేందుకు ఇంజెక్షన్ల ద్వారా హార్మోన్లు ఎక్కిస్తారు.14ఏళ్లు రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు. చిన్నారులను రక్షించడానికి ఎవరైనా వస్తున్నారన్న అనుమానం వస్తే నేలమాళిగల్లో దాచిపెడుతారు. విపరీతమైన చిత్రహింసలకు గురిచేస్తూ వారిని వ్యభిచార కూపంలోకి దించుతారు. చిన్నారులను కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ఇచ్చే వ్యాపారులు ఉన్నారు.చిన్నారుల ఎదుగుదల కోసం హార్మోన్ల ఇంజక్షన్లు ఇస్తున్న డాక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతిగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపిన ఈహార్మోన్ల ఇంజక్షన్లు ఎక్కడినుంచి వచ్చాయో తేలలేదు. సరఫరా చేసిన మెడికల్ షాపులు యాజమానులను ఇంతవరకు గుర్తించలేదు.దీంతోపాటు వ్య భిచార గృహాల నుంచి రక్షించిన చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించారు తప్ప వారి తల్లిదండ్రులను ఇంతవరకు గుర్తించలేదు. 36మంది బాలికలకు విముక్తి యాదగిరిగుట్టలో వ్యభిచార ముఠా దారుణాల పై రాచకొండ పోలీసులు 36మంది బాలికలకు విముక్తి కల్పించారు. ఈ వృత్తితో సంబంధం ఉ న్న 21మందిపై పీడీయాక్టు నమోదు చేశారు. 19వ్యభిచార గృహాలను సీజ్ చే సి 34మందిని అరెస్టు చేశారు. విముక్తి కల్పించిన బాలికలను సంరక్షణకేంద్రాలకు తరలించారు. -
హైకోర్టుకు యాదాద్రి వ్యభిచార గృహాల వ్యవహారం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. వార్త పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు.. నేడు (సోమవారం) విచారణ చేపట్టింది. మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలుపాలని పోలీస్ శాఖకు సూచించింది. యాదాద్రి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి మంగళవారం (రేపు) స్వయంగా కోర్ట్‌కు హాజరై ఈ కేసుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పొక్సో చట్టంతో బాధితులను రక్షించడానికి స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక్కడ 52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దందాలోకి చిన్నపిల్లలను దింపుతున్న వ్యవహారం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. బాలికల శారీరక ఎదుగుదలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఉపయోగించడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ముమ్మరం చేసి ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పించారు. చదవండి: ‘తల్లి’డిల్లుతున్నారు.. 1966లో పడుపు వృత్తి ప్రారంభం -
నెత్తురోడిన రహదారులు
కట్టంగూర్(నకిరేకల్) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. గురు, శుక్ర వారాల్లో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమా దాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన చెరుకు శేఖర్ (25) స్నేహితులతో కలిసి విజయవాడలో జరిగిన ఓ శుభకార్యంలో ఫొటోలు, వీడియో తీసిన అనంత రం కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలోని అయిటిపాముల గ్రామశివారులో డ్రైవర్ అతివేగంగా కారును నడపడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అమర్రాజు, ప్రశాంత్‌లకు గాయాలయ్యాయి. దుగినవెల్లి గ్రామానికి చెందిన నాగోజు లక్ష్మణాచారి(35) ముత్యాలమ్మగూడెం లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గ్రామ శివా రులో డివైడర్‌ను దాటుతుండగా హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్లే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణాచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మృతి అయిటిపాముల గ్రామ శివారులో గురువారం కారు బోల్తా పడడంతో సంఘటనలో గాయాలపాలైన విడిగోజు ప్రశాంత్ (23) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడిది హైదరాబాదులోని కర్మన్‌ఘాట్. అంబులెన్స్ ఢీకొని వృద్ధురాలు.. కోదాడరూరల్ : రోడ్డు దాటుతున్న మహిళను అంబులెన్స్ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ సంఘటన కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబండగూడెం గ్రామానికి చెందిన చల్లా వీరమ్మ(68) చిమిర్యాల క్రాస్‌రోడ్‌లో టిఫిన్ చేసి జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఎం.దశరథ తెలిపాడు. కూతురి ఇంటికి వెళ్తుండగా ఒకరు.. సంస్థాన్‌నారాయణపురం(మునుగోడు) : సంస్థాన్‌నారాయణపురం మండలం మూడు గుడిసెల తండా శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోతు సీతారాం(46)అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీస్‌లు, తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. వాచ్యాతండాకు సీతా రాం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ కావడంతో సంస్థాన్ నారాయణపురం కూతురు ఇంటికి గురువారం ఉదయం కుంటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ దసరా పండుగ జరుపుకున్నాడు. శుక్రవా రం ఉదయం ఇంటి దగ్గర ఆవుకు నీళ్లు తాపించి, మేత వేసి వస్తానని బైక్‌పై ఇంటికి వెళ్లాడు. పనిచేసుకుని అనంతరం అక్కడి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో ఉన్న గంగమూలతండాలో అత్తామామల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి సంస్థాన్‌నారాయణపురానికి బయలుదేరాడు. మూడు గుడిసెల తండా దాటిన తర్వాత రోడ్డు అంచువద్ద బైక్ జారి కిందపడడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. సీతారాం మృతి పట్ల పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీధర్‌రెడ్డి, గడ్డం యాదయ్యలు సంతాపం వ్యక్తం చేశారు. బైక్ అదుపు తప్పి యువకుడు.. యాదగిరిగుట్ట(ఆలేరు) : బైక్ అదుపు తప్పి బోల్తాపడడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లి శివారులో గల పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాచారం గ్రామానికి చెం దిన తిరుపతి (28) ద్విచక్రవాహనంపై యాదగిరిగుట్ట వైపు వస్తున్నాడు. యాదగిరిపల్లి శివారులో ఉన్న పాలిటెక్నిక్ కళా శాల వద్దకు రాగానే అక్కడ రోడ్డుపై ఉన్న కందకాన్ని గమనించక అందులో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తిరుపతి తలకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
‘ప్రణయ్ ఆత్మ మాతో మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం’
మిర్యాలగూడ అర్బన్ : ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఆత్మ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెళ్లడించారు. హైదరాబాద్ పటాన్‌చెర్వుకు చెందిన నాగారావు, సత్యప్రియ, నర్సిం హ్మ అనే ముగ్గురు వ్యక్తుల ఆదివారం ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్ నివాసాసికి వ చ్చారు. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుం దని, మీతో కూడా మాట్లాడిస్తామని నమ్మబలి కారు. అనుమానం వచ్చిన ప్రణయ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి వారిపై పిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలి పారు. ఆత్మ ఉందనే పేరుతో ప్రణయ్ కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారు వచ్చారని సీఐ పేర్కొన్నారు. బెదిరింపు కేసులో కోర్టులో నిందితుల హాజరు మిర్యాలగూడ టౌన్ : బెదిరింపుల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం మిర్యాలగూడ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. శోభారాణి ఎదుట హాజరుపరిచారు. వివరాలు.. ప్రణయ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న తిరునగరు మారుతీరావు, శ్రవణ్, ఖరీంలు కొంతకాలం క్రితం ప్రణయ్, అమృత వివాహ రిసెప్షన్‌ను నిలిపివేయాలని పట్టణానికి చెందిన దినేశ్, అశోక్‌ను బెదిరించారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పీటీవారెంట్‌పై కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్న ట్టు తెలుసుకున్న మారుతీరావు అనుచరగణం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. భారీ బందోబస్తుతో పోలీసులు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
త్రిపురారం(నాగార్జునసాగర్) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. గత మార్చి 17న జరిగిన ధార శ్రీనయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం హలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, çహాలి యా సీఐ ధనుంజయగౌడ్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన ధార శ్రీనయ్య, భార్య వాణితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం హాలియాకు వచ్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో మరో పక్క పోర్షన్లో మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన బచ్చు వెంకట్‌రెడ్డి ఉంటున్నాడు. ఈయన హాలియాలో ఫొటోస్టూ డియో నిర్వహిస్తున్నాడు. ధార శ్రీనయ్య లారీడ్రైవర్ కావడంతో నెలలో ఎక్కువ రోజుల పాటు ఇతర ప్రాంతాలకు తిరుగుతూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఒకే ఇంట్లో పక్కపక్కనే నివాసం ఉంటున్న ధార వాణి, బచ్చు వెంకట్‌రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ధార శ్రీనయ్యకు తెలియడంతో భార్య వాణిని పలుమార్లు మందలించాడు. అయినా తనలో ఏ మార్పు రాకపోవడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి ధార శ్రీనయ్య అడ్డుగా వస్తున్నాడని భావించిన వాణి, వెంకట్‌రెడ్డి అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. వెంకట్‌రెడ్డి నందిపాడు గ్రామానికి చెందిన తన స్నేహితులు జోగు వినోద్‌రెడ్డి, నేరేళ్ల మహేష్‌తో కలిసి పథకాన్ని అమలు చేశారు. ఈక్రమంలో గత మార్చి 17వ తేదీన భార్య వాణి, వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేష్ కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనయ్యను గొంతు నులిమి, ఎదురొమ్ముపై బాగా కొట్టారు. బలమైన దెబ్బలకు శ్రీనయ్య స్పృహ కొల్పోయాడు. నిందితులు శ్రీనయ్యను ఓ మోటార్‌బైక్‌పై కూర్చొబెట్టుకుని హాలియా సమీపంలో ఉన్న ఎడమకాల్వలో పడేశారు. వెలుగులోకి వచ్చిందిలా.. శ్రీనయ్య తమ్ముడు ధార రమేశ్ ఈనెల 10న తన సొంత పనినిమిత్తం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రమేశ్‌కి పోలీస్‌స్టేషన్‌లో నోటీస్ బోర్డుపై ఉన్న గుర్తుతెలియని మృతదేహం అని ఓ ఫొటో కనిపించింది. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, ముఖ కవలికలను గుర్తించి రమేశ్ తన సోదరుడి మృతదేహం గా భావించాడు. ఈ విషయంపై మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయగా డీఎస్పీ హాలియా సీఐ ధనుంజయగౌడ్‌కు కేసుకు సంబం ధించిన బాధ్యతలను అప్పగించాడు. సీఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో ప్రత్యేక బృందం పోలీసులకు ఫొటో స్టూడియో నడుపుతున్న వెంకట్‌రెడ్డిపై అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంకట్‌రెడ్డి వనపర్తి జిల్లా కొత్తపేటలో ఉంటున్నాడని తెలిసి పోలీస్ బృందం అక్కడకు వెళ్లి వెంకట్‌రెడ్డిని అతనితో పాటు ఉంటున్న ధార వాణిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనయ్య భార్య వాణితో పాటు వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేశ్‌లను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కూలిన బతుకులు
రెక్కాడితేనే గాని డొక్కాడని జీవితాలు వారివి. రోజూ పొట్ట చేతపట్టుకుని కూలికి వెళ్తేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. రోజూమాదిరిగానే ఉదయం ట్రాక్టర్లో కూలికి బయలు దేరి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులో శుక్రవారం ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రత్యక్షసాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల (సూర్యాపేట) : ఆత్మకూర్.ఎస్ మండలం కందగట్ల సమీపంలో ఉన్న మంగళితండాకు చెందిన లకావత్ సుందర్(35), లకావత్ సంగు (50), లకావత్ అమర్‌సింగ్, జాటోత్ గోగ్యా, లునావత్ గణేశ్, లునావత్ నాగు, బోడ శ్రీను, జాటోత్ మల్సూర్, మరొకరు నెల రోజులుగా విద్యుత్‌శాఖలో ఓ ప్రైవేట్ ఏజెన్సీలో విద్యుత్‌స్తంభాలు పాతేందుకు రోజు కూలీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రోజూమాదిరిగానే చివ్వెం ల మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ రైతు వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు పాతేం దుకుగాను బయలుదేరారు. మంగళితండా గ్రా మానికి చెందిన రామ్మూర్తి ట్రాక్టర్లో తొమ్మిది మంది కూలీలు బయలుదేరారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పది విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లో లోడ్‌చేసి తిరుమలగిరికి బయలుదేరారు. ట్రాక్టర్‌ను రామ్మూర్తి నడపాల్సి ఉండగా సూపర్వైజర్గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డి తాను ట్రాక్టర్ నడుపుతానని తన బైక్ రామ్మూర్తిని తీసుకుని రమ్మని చెప్పి ట్రాక్టర్‌ను తొలుకుంటూ వెళ్లాడు. మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో విజ యవాడ–హైదరాబాద్ రహదారిపై ట్రాక్టర్ అటుఇటు కదలడంతో ఒక్కసారిగా రోడ్డుకింది వైపునకు ట్రాక్టర్ మలిపేందుకు ప్రయత్నించగా స్తంభాలు ఒరగడంతో వెనుక ట్రక్కు బోల్తా పడింది. దీంతో స్తంభాలపై కూర్చున్న తొమ్మిది మంది కిందపడడంతో వారిపై నుంచి విద్యుత్ స్తంభాలు పడ్డాయి. దీంతో లునావత్ సుందర్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108వాహనంలో సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ లునావత్ సంగు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కాగా వీరిలో అమర్‌సింగ్ నడుములు విరిగి కడుపులో తీవ్ర రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి పూర్తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ సీహెచ్.నరేష్‌లు సం ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. స్థానికుల సహాయంతో ట్రాక్టర్, విద్యుత్ స్తంభాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బాధితుడు లునావత్ గణేశ్ ఫిర్యాదు మేరకు డీఎస్పీ నాగేశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సీహెచ్.నరేష్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. క్షతగాత్రులకు ఎంపీ, కలెక్టర్ పరామర్శ సూర్యాపేట ఏరియాస్పత్రిలో ప్రమాద బాధితులను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌లు పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించే క్రమంలో దగ్గరుండి 108 వాహనంలో హైదరాబాద్‌కు తరలింపజేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో క్షతగాత్రులకు మంత్రి పరామర్శ సూర్యాపేట క్రైం : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను శుక్రవారం హైదరా బాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన లునావత్ సంగు, లకావత్ సుందర్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడి సూర్యాపేట ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను టీఆర్ఎస్ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. -
విహహేతర సంబంధమే కారణమా?
నాంపల్లి(మునుగోడు) : అనుమానం పెనుభూత మై కట్టుకున్న భార్యనే గొడలితో నరికి దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ సంఘటన మంగళవా రం రాత్రి మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడెం గ్రామాని కి చెందిన భూతం నర్సమ్మ(42), యాదయ్య దం పతులు. యాదయ్య గ్రామంలో ఫంక్చర్ దుకా ణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. తాగుడికి బానిసైన యాదయ్య నిత్యం నర్సమ్మను వేధించేవాడు. నర్సమ్మకు వివాహేతర సంబంధం అంట గడుతూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యభర్తల నడుమ గొడ వ జరిగింది. అందరూ నిద్రపోయాక రాత్రి 11:30 గంటల సమయంలో యాదయ్య గొడ్డలితో నర్సమ్మ మెడపై నరికాడు. మెడ భాగం తెగడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. చప్పుడు విన్న పిల్లలిద్దరూ లేచే సరికి యాదయ్య చంపుతానని వారిని కూడా భయపెట్టాడు. అనంరతం యాద య్య సంఘటన స్థలం నుంచి పరారీ కావడంతో పిల్లలు అరుస్తుండడంతో ఇంటి చుట్టుపక్కల వా రు వచ్చారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్ఐ మంజునాథరెడ్డి తెలిపారు. బంధువుల ఆందోళన విషయం తెలుసుకున్న నర్సమ్మ బంధువులు పెద్దఎత్తున యాదయ్య ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నర్సమ్మను అన్యాయంగా చంపి పిల్లలను అనాథులు శారని దావేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే...
వలిగొండ(భువనగిరి) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత మామనే ప్రియుడు, తమ్ముడితో కలిసి కోడలు హత్య చేయించింది. హత్యలో పాలుపంచుకున్న ముగ్గురు నిందితుల ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వలి గొండ మండలం నెమిలెకాల్వలో గత నెల 10న జరిగిన గడ్డం ముత్యాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి వెల్లడించారు. గ్రామానికి చెందిన గడ్డం ముత్యాలు కుమారుడు రమేశ్. ఇతని భార్య సంతోష. ఉపాధి హామీ పథకంలో కూలి పనికి వెళ్లేది. ఇదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం శ్రీమన్నారాయణతో సంతోషకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన సంతోష మామ గడ్డం ముత్యాలు కోడలిని మందలించాడు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టాడు. సంతోష ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను తల్లి గారింటింకి పంపించారు. పోయిన నెలలో గ్రామదేవతల పండగ ఉండడంతో రమేశ్ భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న మామను అంతమొందించాలని పథకం వేసింది. గత నెల 10న ముత్యాలు సైకిల్‌పై సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఈ సమాచారాన్ని ప్రియుడు శ్రీమన్నారాయణ, చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సొంత తమ్ముడు నీల వెంకటేశానికి చేరవేసింది. వీరిద్దరు కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి ముత్యాలుపై దాడి చేసి హత్య చేశారు. పొలం వద్దకు వెళ్లి రాత్రి అయిన ముత్యాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు. ఆ రోజున ముత్యాలు రెండో కుమారుడు శేఖర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ ఇద్రిస్‌అలీ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు విచారణ ప్రారంభించి కేసును చేధించారు. హత్యకు కారణమైన సంతోషతోపాటు శ్రీమన్నారాయణ, వెంకటేశంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఇద్రిస్ అలీ ఉన్నారు. -
చీటింగ్ తహసీల్దార్
సాక్షి, సిటీబ్యూరో : చిట్టీల పేరుతో చీటింగ్ చేసినందుకు యాదాద్రిభువనగిరి కలెక్టరేట్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలోని తహసీల్దార్ లింగాల సుధను బుధవారం హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేశారు. ఈమె సమీప బంధువులు, స్నేహితులతో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతోపాటు రూ.2 కోట్లు స్వా హా చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. విధులకు సైతం హాజరుకాకుండా ఆరు నెలలుగా పరారీలో ఉన్న సుధను ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది. అధికారం అండతో... లింగాల సుధ గతంలో నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. ఈమెతో పా టు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త మల్లేశం, ఆమె సోదరి డాక్టర్ శ్రావ్య, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీ సర్ మనోహర్‌రావు, హెడ్–మాస్టర్ విజయమ్మ తదితరులతో కలిసి సనత్‌నగర్ కేంద్రంగా చిట్టీల దందా ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులై ఉండి నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ దందా నిర్వహించారు. వీరంతా ప్రభుత్వ ఉ ద్యోగులు, కీలక వ్యక్తులు కావడంతో ఆయా విభా గాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు వీరి వద్ద చిట్టీలు కట్టారు. ఖాతాదారులు చిట్టీ పాడుకున్నప్పటికీ నగదు వారికి ఇవ్వకుండా రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే ఉంచుకునేవారు. కాగా మనో హర్‌రావు, విజయమ్మ కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. చెక్కులు బౌన్స్ కావడంతో.. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు చిట్టీలు నిర్వహించారు. కొందరు ఖా తాదారులకు సుధ తదితరులు తమ పేర్లతో ఏర్పాటు చేసిన ఉమ్మడి బ్యాంకు ఖాతా ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు చేశారు. అత్యధికుల నుంచి మాత్రం అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు స్వీకరించారు. వీరి చిట్టీల దందా కొన్నాళ్ల పాటు సజావుగానే సాగినా... ఆపై కథ అడ్డం తిరిగింది. వీరిచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. దీనికి సంబంధించి నమోదైన రెండు కేసులను దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతంలో మనోహర్‌రావు, విజయమ్మలను అరెస్టు చేయగా... మల్లేశం, శ్రావ్య న్యాయస్థానం నుంచి ముం దస్తు బెయిల్ పొందారు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో తహసీల్దార్ సుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏడాదిగా విధులకు దూరం పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించిన తహశీల్దార్ సుధ విధులకు దూరంగా ఉన్నారు. గతేడాది జూలైలో ఆరు నెలల పాటు ప్రత్యేక సెలవు పెట్టారు. ఆపై సెలవులను పొడిగిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలు కావడంతో ఏసీపీ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం ఆమె కోసం వేట ముమ్మరం చేసింది. సు ధ కదలికలపై కీలక ఆధారాలు సేకరించి మంగళవారం అర్ధరాత్రి ఆమె షెల్టర్ తీసుకున్న ప్రాం తంపై దాడి చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌కు తరలించి విచారించగా, సుధ నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టు కు తరలించారు. చిట్టీల ద్వారా సంపాదించిన సొమ్ముతో నిందితులు తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు కూడ బెట్టుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. వీరి వలలో పడి సర్వం పోగొట్టుకున్న బాధితుల్లో అనేక మంది ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన వారు కావడం గమనార్హం. -
అందరు చూస్తుండగానే గొంతు కోసేశాడు
గుర్రంపోడు(నాగార్జునసాగర్) : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఆది వారం సాయంత్రం ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు చూస్తుండగానే ఓ యు వకుడు వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన శివార్ల లింగయ్య(65) అనే వృ ద్ధుడు గ్రామ సెంటర్లో నడుచుకుంటూ వస్తున్నా డు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన కొట్ర అనిల్ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచి కింద పడిపోగానే కత్తితో గొంతుకోసి కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడు. గమనించిన పక్కనే ఉన్న కొందరు దగ్గరకు చేరుకునేలోపే దారుణం జరి గింది. తీవ్ర రక్తస్రావంతో వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనుమానంతో.. కోట్ర అనిల్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. లింగయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానం అనిల్ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. గతంలో ఇదే విషయమై లింగయ్యపై దాడి చేయగా గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వివాదం అంతటిలో ముగిసింది. ఇటీవల అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. తన అనారోగ్యానికి లింగయ్య చేతబడే కారణమనే అనుమానంతో యువకుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. హతుడు లింగయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని మల్లేపల్లి సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్‌లు పరిశీలించారు. నింది తుడు పరారీలో ఉన్నాడు. మండలంలో నాలుగో ఘటన ! గుర్రంపోడు మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27 మండలంలోని తెరాటిగూడెం గ్రామంలో చేతబడి నెపంతో గ్రామం నడిబొడ్డున ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో తేనెపల్లిలోనే గ్రామంలో వృద్ధురాలు, తానేదార్పల్లి గ్రామంలో వృద్ధుడు హత్యకు గురయ్యారు. తాజాగా లిం గయ్య.. ఈ హత్యలన్నీ మంత్రాల నెపంతోనే జరిగినవే. బాగా అభివృద్ధి చెందిన గ్రామాల్లోనూ మంత్రాలు అనే మూఢనమ్మకాలతో దారుణాలు జరుగుతుండడం గమనార్హం. పోలీసులు కళా జాతా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో అవగాహక కల్పిస్తునే ఉన్నా గ్రామాల్లో మూఢనమ్మకాల జాడ్యం వీడడం లేదు. -
‘ప్రణయ్’ నిందితులను ఉరితీయాలి
మిర్యాలగూడ : పరువు కోసం పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను ఉరితీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. ప్రణయ్ హత్యను సీబీఐచే విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. మారుతీరావు అక్రమంగా సంపాదించిన సొమ్ముతను ప్రభుత్వం జప్తు చేయాలన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుండా మల్లేష్, పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 19 మంది దళితులు హత్యలకు గురయ్యారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షడు రమణ విమర్శించారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రణయ్, అమృతలు ప్రేమిం చుకున్న పాపానికి ప్రణయ్‌ని హత్య చేశారని అన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం అమృతకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం కాలిపోతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండీ. యూసుఫ్, రాష్ట్ర కార్యనిర్వహాక కా ర్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీని వాస్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పెద్దిరెడ్డి రాజా, బీఎన్‌రెడ్డి, అంజయ్య, కాసుల సత్యం, పతూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అదేవిధంగా ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని రాత్రి కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్‌ని హత్య చేయడం దారుణమైన సంఘటన అని అన్నారు. హంతకులను సమాజం క్షమించదన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పురుషోత్తం, గాదె ఇన్నయ్య, రతన్‌రావు, పరుశురామ్, జిల్లా కన్వీనర్ గవ్వా విద్యాధర్‌రెడ్డి, నాయకులు శ్రీధర్, క్రాంతికుమార్, లింగస్వామి, అంజయ్య, పరందాములు, ప్రేమ్‌కుమార్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు. కులహంకార హత్య : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ప్రణయ్‌ను కులహంకారంతో హత్య చేశారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. బుధవారం ప్రణయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లితదండ్రులను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రేమించినందుకు కిరాయి హంతకులతో హత్య చేయిం చడం దారుణమన్నారు. అమృతకు అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆ యన వెంట మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, మాలమహానాడు జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, నాయకులు అన్నవరపు కిషోర్, డాక్టర్ ప్రవీణ్, నర్సింహ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అమృతకు అండగా నిలుస్తాం : సినీ దర్శకుడు పీసీ ఆదిత్య అమృతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని సినీ దర్శకుడు పీసీ ఆదిత్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృతను తల్లిదండ్రులను పరామర్శించారు. దేశంలోనే సంచలనం కలిగించి ఈ హత్యలో నిందితులు తప్పించుకోవడానికి వీలులేదన్నారు. ఆయన వెంట లఘుచిత్ర దర్శకులు కలీం తదితరులు ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కావొద్దు : జనసేన రాష్ట్ర నాయకుడు జగడం సుధాకర్ పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జగడం సుధాకర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్య హేయమైన చర్యఅని, నిందితులందరికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు రుషికేశ్వర్‌రాజు, ప్రవీణ్, నిమ్మల వెంకన్న, వేణు, శివ, శ్రీనివాస్‌నాయుడు, శ్రీనునాయక్, అశోక్ తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ హత్య కేసు : హత్య చేసిన శర్మ అరెస్ట్
-
ప్రణయ్ హత్య కేసులో.. సుపారీ కిల్లర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ను రియల్టర్ తిరునగరు మారుతీరావు హత్య చేయించాడు. ఈ హత్యకు మాజీ ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ బారీతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా బారీ తన గురువు అస్గర్ అలీతో ప్లాన్ చేసి బిహార్‌లోని సంస్థాన్ పూర్ జిల్లాకు చెందిన శర్మను ఈ ఆపరేషన్‌కు వినియోగించాడు. బిహార్‌లో అదుపులోకి తీసుకున్న శర్మను పోలీసులు నల్గొండ తరలిస్తున్నారు. హత్య జరిగిన రోజు శర్మతో పాటే అస్గర్ ఆసుపత్రికి వచ్చినట్టుతెలుస్తోంది. తన కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అస్గర్ డబ్బు కోసం ఈ డీల్ ఒప్పుకున్నట్టు సమాచారం. -
కులం తక్కువ కావడంతోనే ప్రణయ్ హత్య
మిర్యాలగూడ (నల్గొండ): కుల దురహంకారంతోనే ప్రణయ్‌ని హత్య చేయించారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అద్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కులం కంటే గుణం చాలా గొప్పదన్నారు. కులాంతర వివాహం చేసుకున్న కూతురును ఆ తండ్రికి మనసుంటే ఆశ్వీరదించాలి కానీ కులదురంహకారంతో హత్య చేయించే హక్కు అయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సమాజం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నప్పటికీ కుల వివక్షలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు. ప్రణయ్ హత్యతో ఆ కుటుంబం కొడుకును కోల్పోవడంతో పాటు అమృత భర్తను ఆమె కడుపులో ఉన్న బిడ్డ తండ్రిని కోల్పోయిందన్నారు. ఇలాంటి హత్యలు చేయడం సరైంది కాదన్నారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ప్రణయ్ హత్యపై ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు సుబ్బారావు, తెలంగాణా మట్టి మనుషుల వేదిక కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, సాగర్, రాములు, సౌమ్య, శిరీష పలువరు నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ డైరీలో ఏముంది?
మిర్యాలగూడ(నల్గొండ) : ‘‘అంకుల్ నేను మిస్టర్ ఫర్ఫెక్ట్.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్ఫెక్ట్ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి’’. అని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రణయ్‌కి డైరీ రాసే అలవాటు ఉండడం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలు రాసుకున్నట్లు తెలుస్తోంది. కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్ డైరీలో రాసుకున్నాడు. మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లు ఉన్న వారిని రిజక్ట్ చేయాలని, చెడు అలవాట్లు ఉంటే ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడా డైరీలో రాసుకున్నట్లు తెలు స్తోంది. ఆస్తిపాస్తులు లేకున్నా మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని డైరీలో రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బేబీ పుట్టేలోపు ఉరితీయాలి: అమృత ప్రణయ్ భార్య ‘ఎస్పీ గారు నాకు బేబీ పుట్టే వరకు రక్షణ కల్పిస్తామని చెప్పారు’ అని ప్రణయ్ భార్య అమృత పేర్కొంటున్నారు. సోమవారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ఆమె ‘సాక్షి’తో మా ట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రణయ్‌ని చంపిన వాళ్లు నా బిడ్డను కూడా చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్‌ని చంపినవాళ్లను ఉరి తీస్తే బెటర్. మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికి తెలుసు కానీ. మా డాడీ, బాబాయి ప్రణయ్‌ని బెది రించారు. నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్‌లో వేస్తామని కూడా చెప్పారు. ప్రణయ్‌ని హత్య చేసి న సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈ రోజే సీసీ ఫుటేజీ చూశాను. ప్రణయ్‌ని కళ్లముందే చంపి వెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీ లాంటి సైకో లు చాలామంది ఉంటారు. 60 ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే కూడా ఎంతో బాధ ఉం టుంది. కానీ నాకు 21 ఏళ్లు. నాకు ఎంత బాధ ఉంటుందో..’’ అని కంట నీరు పెట్టుకున్నారు. -
ప్రణయ్..ఇక సెలవ్
మిర్యాలగూడ పట్టణం కన్నీటి సంద్రమైంది. పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కు ఆదివారం మిర్యాలగూడ పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు అంతిమ వీడ్కోలు పలికారు. కుల దురహంకారానికి బలైన ‘బలి ప్రేమ’గా అభివర్ణించారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. మిర్యాలగూడ (నల్గొండ) : పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి ఆదివారం మిర్యాలగూడ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడలోని వినోభానగర్‌లోని ప్రణయ్ ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిర్వహించారు. యాత్రలో పాల్గొనడానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరా వును ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. అంతిమయాత్రలో పాల్గొన్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, టీడీ పీ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, దామరచర్ల జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతావత్ శంకర్నా యక్, పీసీసీ సభ్యుడు స్కైలాబానాయక్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంవీఆర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, నాయకులు తాళ్లపల్లి రవి, కేవీపీఎస్ నాయకులు రెమడాల పరుశురాములు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు దైద సత్యం, పోకల కిరణ్‌కుమార్, చిలుముల నర్సింహ, కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పాటలతో కళాకారుల కన్నీటి వీడ్కోలు మిర్యాలగూడ అర్బన్ : ప్రణయ్ అంతిమయాత్ర సందర్భంగా భారత నాస్తిక సమాజ కళాకారుల ఆధ్వర్యంలో పాడి న పాటలు పలువురిని కంటనీరు పెట్టించాయి. కుల దురహంకారంతో మారుతీరావు కన్నకూతురి తాళి తెంపాడని, మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కళాకారులు పాల్గొన్నారు. -
భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత
-
భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత
సాక్షి, నల్గొండ : పరువు హత్యకు గురైన ప్రణయ్ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాగా, ప్రణయ్ సోదరుడు ఉక్రెయిన్ నుంచి ఉదయం 11గంటకు మిర్యాలగూడ చేరుకోనున్నారు. అనంతరం ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే? ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి నయీం గ్యాంగ్‌తో బెదిరించారు -
అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే?
మిర్యాలగూడ(నల్గొండ) : మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితుడు మారుతీరావుది మొదటి నుంచి నేర చరిత్రగా చెప్పవచ్చు. సొంత కూతురు ప్రేమ వివాహం చేసుకుంటేనే పరువు హత్య చేయించిన అతనికి సెటిల్మెంట్లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు. తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాల సమయంలో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 25ఏళ్ల క్రితమే మిర్యాలగూడ పట్టణంలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తిరునగరు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా మున్సి పాలిటీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ అండదండలు ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు. ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇటీవల తనకంటూ ఒక వర్గం ఉండాలని కొంతమందిని కూడగట్టాడు. -
భార్యకళ్లముందే.. భర్త దారుణ హత్య
-
భార్యాభర్తను బలిగొన్న కారు
చౌటుప్పల్(మునుగోడు) : అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కల్లు అమ్ముకుని జీవిస్తున్న భార్యాభర్తపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే భార్య .. చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ శివారులో జీఎమ్మార్ టోల్‌ప్లాజా సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లబావి గ్రామానికి చెందిన చీకూరి బాలయ్య(62), ఆయ న భార్య యాదమ్మ(55)లు గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట గుడిసె ఏర్పాటు చేసుకుని కల్లు విక్రయిస్తుంటారు. ఉదయం ఇద్దరు కలిసి గుడిసె వద్దకు వెళ్లారు. కల్లు కొనుగోలుదారుల కోసం రహదారిపై నిల్చున్నారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అజాగ్రత్త, అతివేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. కారును ని యంత్రించడంలో విఫలమైన డ్రైవర్ శీలం కృష్ణారావు రోడ్డు పక్కన నిల్చున్న భార్యాభర్తపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న బాలయ్యను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ నవీన్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్త ఇద్దరూ ఒకేసారి మరణించడంలో గుండ్లబావి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఘర్షణను అడ్డుకున్నాడని..
మునగాల(నల్గొండ) : ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నిం చిన ఓ వ్యక్తిపై నిందితులు దాడి చేసి తీవ్రంగా పరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మునగాల మండలం బరాఖత్‌గూడెంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్‌గూడెం గ్రా మానికి చెందిన షేక్ బంటుసాహెబ్(45) వృతి ్తరీత్యా వ్యవసాయ కూలీ. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. రెండో అన్న షేక్ దస్తగిరి పెద్ద కుమారుడు షేక్ షరీఫ్, పెద్ద అన్న షేక్ మన్సూర్ అలీతో ఆదివారం రాత్రి ఓ విషయంలో ఘర్షణకు ది గాడు. షరీఫ్ సాయంత్రం 7గంటల సమయంలో మన్సూర్ అలీ ఇంటివద్దకు వచ్చి ఘర్షణ పడుతుండగా అటుగా వస్తున్న బంటు సాహెబ్ ఘర్షణ వద్దని షరీఫ్‌ను అడ్డుకోబోయాడు. దీంతో ఆగ్రహించిన షరీఫ్ బంటు సాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో గాయపడిన బం టు సాహెబ్ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య జాన్‌బీ, కూతురు, అల్లుడికి వివరిస్తుండగా పక్కఇంటిలో ఉన్న షరీఫ్ తండ్రి దస్తగిరి, సోదరుడు మీరా మరోసారి బంటుసాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బంటు సాహెబ్‌ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోదాడకు తరలించగా చికిత్స పొం దు తూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కో దాడ డీఎస్పీ బి.సుదర్శన్‌రెడ్డి, స్థానిక సీఐ ఎస్.శివశంకర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘర్ష ణకు దారితీసిన విషయాలను స్థానికులు, కుటుం బసభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుని భా ర్య జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు షేక్ షకీర్, షేక్ దస్తగరి, షేక్ మీరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ తెలిపారు. బంటు సాహెబ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సీఐ శివశంకర్ గౌడ్ తెలిపారు. -
కట్నం తేకపోతే రెండో పెళ్ళి చేసుకుంటా...
మాడుగులపల్లి(నల్గొండ) : అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెంలో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం కుక్కడం ఆవాసం చింతలగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి కవిత(25)ను గండ్రవానిగూడెం గ్రామానికి చెందిన రామలింగంకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కొంతకాలంగా కవితను భర్త రామలింగం, మామ వెంకటయ్య, అత్త అంజమ్మ అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. కవితకు, రామలింగంకు పలుమార్లు గొడవలు జరిగాయి. వీటిని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకున్నారు. మళ్లీ తిరిగి నెల రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని, లేనియడల రామలింగం రెండో పెళ్లి చేసుకుంటాని కవి తను బెదిరిస్తున్నాడని, మానసికంగా హింసిస్తుండడంతో కవిత శనివారం రాత్రి పురుగుల మందు తాగినట్టు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి పక్కన వారు కవిత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కవిత తండ్రి కొమ్ము వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నర్సరీ వ్యాపారి పై కత్తులతో దాడి
సూర్యాపేటక్రైం : పూటుగా మద్యం సేవించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని అమ్మగార్డెన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెరుమాళ్ల శ్రీనివాస్‌గుప్తా గుజరాత్లో నర్సరీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని పని పూర్తిచేసుకుని, ఆదివారం రాత్రి గుజరాత్‌కు తన సొంత కారు (ఏపీ 37సీవీ 2444)లో బయలుదేరాడు. ఖమ్మం మీదుగా సూర్యాపేటలోని అమ్మగార్డెన్ సమీపంలోకి అర్ధరాత్రి చేరుకున్నాడు. అక్కడ కారు ఆపి మూత్రవిసర్జన చేస్తుండగా రెడ్ పల్సర్ బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్‌గుప్తా వద్దకు వచ్చా రు. ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదని దబాయించి దాడిచేశారు. అంతేకాకుండా.. నీ వద్ద ఎంత నగదు ఉందంటూ.. ఆ నగదు మొత్తం ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద డబ్బులు లేవని బాధితుడు చెప్పినా వినకుండా కిందపడేసి పైజేబులో ఉన్న రూ.5 వేల నగదును అపహరించుకెళ్లారు. అంతటితో ఆగకుండా కత్తులతో రెండు చోట్ల పొడిచారు. తేరుకున్న శ్రీనివాస్ వెంటనే 100కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ముప్పు
చౌటుప్పల్(మునుగోడు) : చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ వద్ద 65వ నంబరు జా తీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల వేగం తక్కువ ఉండడంతో త్రుటిలో పెద్ద ముప్పు తప్పినట్టయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోకు చెందిన టీఎస్05 యూఏ 2192 నంబరు గల బస్సు ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లింది. తిరిగి 10:30 గంటల ప్రాం తంలో దిల్సుఖ్నగర్ నుంచి నార్కట్‌పల్లికి బయలుదేరింది. డ్రైవర్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్‌గా కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డిలు డ్యూటీలో ఉన్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్లో మరికొంత మంది ప్రయాణికులు ఎక్కారు. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో బస్సులో 60 ప్రయాణికులు ఉన్నారు. వివిధ గ్రామాల స్టేజీల వద్ద ప్రయాణికులు ఎక్కగా మొత్తం 89 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. లారీ యూటర్న్ తీసుకోవడంతో.. బస్సు నిండా ప్రయాణికులు ఉండడంతో డ్రైవర్ బస్సును నెమ్మదిగా నడుపుతున్నాడు. ఇంతలో దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద చౌటుప్పల్ వైపునకు వెళ్లేందుకుగాను ఓ టిప్పర్ లారీ వ స్తుంది. హైదరాబాద్ వైపు నుంచి బస్సు వస్తుండడాన్ని గుర్తించిన టిప్పర్ డ్రైవర్ లారీని రోడ్డు నడుమనే ఆపాడు. లారీ ఆగిన విషయాన్ని కనిపెట్టిన బస్సు డ్రైవర్ తన దారిలో వెళ్తున్నాడు. ఈ సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వచ్చిన మరో లారీ మళ్లీ చౌటుప్పల్ వైపుకే వెళ్లేందుకు యూ టర్న్ తీసుకోగా ఒక్కసారిగా లారీ బస్సు ముం దుకు వచ్చింది. తన దారిలో తాను వెళ్తుండడం, ప్రమాదకరంగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి బ్రేక్ వేయలేదు. దీంతో లారీని బస్సు వెనుక నుంచి ఢీకొ ట్టింది. ఆ కుదుపునకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. సీట్లు విరిగి పడడం, గాజు ముక్కలు తగలడంతో ప్రయాణికులకు గా యాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బ తింది. చాలామంది ప్రయాణికులకు శరీర లోపలి భాగాలు ఎక్కువయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను హుటాహుటిన అంబులెన్స్‌ల్లో చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో ఆరుగురికి బలమైన గాయాలుకావడంతో మెరుగైన చికి త్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. లారీ, బస్సు వేగంగా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బస్సు నూటల్లో ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, అధికారులు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఏసీపీ రమేష్, ఆర్టీసీ డీఎం చం ద్రకాంత్, సీఐ వెంకటయ్య, ట్రాఫిక్ సీఐ గోపాల్, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భిక్షమమ్మలు సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన ప్రయాణికులు వీరే... పుట్టోజు శిరీష–హయత్‌నగర్, లోడె యాదమ్మ–చౌటుప్పల్, జొన్నకంటి ముత్తమ్మ–చౌటుప్పల్ మండలం మల్కాపురం, ఆవుల ఐలమ్మ–చి ట్యాల మండలం సుంకెనపల్లి, రాచమల్ల పద్మ– హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, నందగిరి భిక్షపతి–హయత్‌నగర్ మండలం కొయ్హెడ, ముప్పిడి నర్సింహ్మ–చౌటుప్పల్ మండలం తంగడపల్లి, మ ద్ది ప్రేమ్‌చంద్‌రెడ్డి– మునుగోడు మండలం వెల్మ కన్నె, కొత్త శ్రీనివాస్‌రెడ్డి (బస్సు డ్రైవర్)– నల్లగొండ జిల్లా నకిరేకల్, నారి లక్ష్మమ్మ–పోచంపల్లి మండలం , వెల్వర్తి దేవమ్మ– చౌటుప్పల్ మండలం మల్కాపురం, మిట్టపల్లి సుజాత–సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, జ్యోతి, దొడ్డి చంద్రమ్మ– చిట్యాల మండలం ఆరెగూడెం, ముర్సు లక్ష్మ మ్మ– దేవరకొండ మండలం గుమ్మడవెల్లి, నూనె లింగమ్మ, నల్లగొండ మండలం ధర్మాపురం, పానుగోతు రంగమ్మ–రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, ఎడ్ల ముత్తమ్మ–చౌటుప్పల్ మండలం మ ల్కాపురం, కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి(బస్సు కండక్టర్) – చౌటుప్పల్ మండలం పంతంగి, జొన్నకం టి యాదయ్యలు గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సులో మూడొంతులకుపైగా ప్రయాణికులు మహిళలే ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ సడన్‌గా వచ్చింది దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద యూ టర్న్ కోసం ఓ టిప్పర్ లారీ ఆగి ఉంది. దాన్ని గమనించాను. కానీ ఆ టిప్పర్ పక్క నుంచి మరో లారీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేందుకు బస్సు ముందుకు వచ్చింది. దీంతో అప్పటికప్పుడు కంట్రోల్ చేసినా ఆగకుండా బస్సు లారీకి తగిలింది. – శ్రీనివాస్‌రెడ్డి, బస్సు డ్రైవర్డ్రైవర్ బ్రేకు వేయలేదు నేను కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీనగర్లో బస్సు ఎక్కాను. బ స్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. చౌరస్తా వద్దకు రాగానే పక్క నుంచి లారీ వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు బ్రేకులు వేయలేదు. దీంతో ప్రమాదం జరిగింది. వైద్యఖర్చులను ప్రభుత్వం, ఆర్టీసీ భరించాలి. – మాధవి, ప్రయాణికురాలు, మిర్యాలగూడ -
హత్యా..? ఆత్మహత్యా..?
శాలిగౌరారం (తుంగతుర్తి) : అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని రామాంజాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుంకుంది. ఎస్ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాలి ప్రకారం.. రామాంజా పురం గ్రామానికి చెందిన యల్లంల సాలమ్మ(65) గ్రామంలోని తన సొంతింట్లో ఒంటరిగానే ఉంటుంది. సాలమ్మకు పిల్లలు లేకపోవడంతో పాటు భర్త మల్లయ్య కూడా మూడు సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. సోమవారం రాత్రి ఇంట్లో నింద్రించిన సాలమ్మ మంగళవారం ఉదయం తలుపులు తెరువకపోవడంతో ఆమె అత్త పూలమ్మ వెళ్లి చూడగా తలుపుల రాకపోవడంతో తన మనుమలకు చెప్పింది. దీంతో సాలమ్మ మరిది కుమారులు వెళ్లి తలుపులు తెరిచిచూడగా అప్పటికే సాలమ్మ మంటల్లో పూర్తిగా కాలి మృతిచెంది ఉంది. దీంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చిచూసి పోలీసులకు సమాచారమందించారు. సాలమ్మ మృతిపై అనుమానాలు.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సాలమ్మ మంటల్లో కాలి మృతిచెందడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్చయ్య-పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో సాలమ్మ భర్త మల్లయ్య పెద్దవాడు కాగా యలమంద చిన్నవాడు. మల్లయ్య-సాలమ్మ దంపతులకు పిల్లలు లేరు. యలమందకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరందికి వివాహాలు కూడా జరిగాయి. పిచ్చయ్య-పూలమ్మ సంపాధించిన 20 ఎకరాల వ్యవసాయ భూమిని వారు తన ఇద్దరు కుమారులు మల్లయ్య, యలమందలకు 10 ఎకరాల చొప్పున భాగపంపిణీ చేసి ఇచ్చారు. మల్లయ్య భాగంగా వచ్చిన 10 ఎకరాల భూమిలో తన పేరుమీద 5 ఎకరాలు, భార్య సాలమ్మ పేరుమీద మరో 5 ఎకరాల భూమిని రికార్డుల ప్రకారంగా నమోదు చేయించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మల్లయ్య మృతిచెందడంతో మల్లయ్య పేరున ఉన్న భూమిని యలమంద తన పేరున మార్చుకున్నారు. ప్రస్తుతం సాలమ్మ పేరున ఉన్న భూమిని కూడా యలమంద కుటుంబీకుల ఆదీనంలోనే ఉంది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాలమ్మ బాగోగులను యలమంద కుటుంబీకులే చూసుకుంటున్నారు. వారం రోజులక్రితం సాలమ్మ తనవద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను దాచిపెట్టమని అదే గ్రామానికి చెందిన అన్న కత్తుల మల్లయ్యకు ఇచ్చింది. బంగారు ఆభరణాలను దాచిపెట్టిన విషయం తెలుసుకున్న యలమంద కుటుంబీకులు సాలమ్మను బాగోగులు చూసుకోకుండా బంగారు ఆభరణాలు తీసుకురావాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే సాలమ్మ ఇంట్లో మంట ల్లో కాలిపోయి చనిపోవడం అనేక అనుమానాల కు తావిస్తోంది. పెద్దగా ఉన్న ఒకే ఇంటిలో ఒక భాగంలో యలమంద కుటింబీకులు, రెండో భాగంలో సాలమ్మ, మూడో భాగంలో సాలమ్మ అత్తమామలు ఉంటున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో సాధారణంగా వ్యక్తులు కేకలు వేస్తారు. లేదా అటుఇటు పరుగులు పెడతారు. ఒకవేళ కేకలు వేస్తే పక్కన ఉన్న యలమంద కుటింబీకులకుగానీ, అత్తమామలకుగానీ వినపడలేదా..? సాలమ్మ ఇంట్లో ఓ మూలన పూర్తిగా కాలిపోయి మృతిచెంది ఉంది. ఒకపక్క అనారోగ్య సమస్యలు.. మరోపక్క ఆలనాపాలనా చూసేవారు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఆస్తికోసం ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా..? అనే అనుమానాలకు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాలమ్మ అన్న కత్తుల మల్లయ్య పోలీసులకు యలమంద కుటుంబీకులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. మల్లయ్య పిర్యాదు మేరకు ఎస్ఐ గోపాల్‌రావు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ మండలంలోని రామాంజాపురంలో అనుమానస్పద స్థితిలో వృద్ధురాలు మంటల్లోకాలి మృతిచెందిన విషయం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సాలమ్మ మృతదేహన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాలమ్మ మృతిపై గ్రామస్తులను కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. -
నెత్తురోడిన రహదారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. పోతు నూ రు స్టేజీ వద్ద కారు ఢీకొని బాలుడు.. వల్లభాపురం వద్ద బైక్ అదుపు తప్పి ఒకరు.. ఏపీలింగోటం సమీపంలో ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో మరొకరు మృతిచెందారు. కారు ఢీకొని బాలుడి దుర్మరణం పెద్దవూర(నాగార్జునసాగర్) : కారు ఢీకొని ఓ బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం పెద్దవూర మండలం పోతునూరు గ్రామ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పో తునూరు గ్రామానికి చెందిన రొయ్య మల్లయ్య కూతురు నాగమ్మను చందంపేట మండలం గుంటిపల్లికి చెందిన బయ్య మల్లయ్యకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. రాఖీ పండుగకు తన సోదరులకు రాఖీలు కట్టడానికి గాను బయ్య నాగమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలి సి ఆదివారం తన పుట్టిల్లు పోతునూరు గ్రామానికి వచ్చింది. వీరితో పాటు తన అక్కాచెల్లెళ్లు సైతం రాఖీలు కట్టడానికి రావడంతో ఆదివా రం అంతా ఉత్సాహంగా గడిపారు. సోమవా రం తన సోదరుడు డబ్బులు ఇవ్వడంతో పిల్లలను తల్లిగారింటి వద్ద ఉంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు తన భర్త మల్లయ్యను వెంట తీసుకుని పెద్దవూరకు షాపింగ్ చేయడానికి వచ్చా రు. పిల్లందరూ రోడ్డు దాటి సమీపంలో ఉన్న ఏఎమ్మార్పీ మైనర్ కాలువకు స్నానాలు చేయటానికి వెళ్లారు. ఈ క్రమంలో మిగిలిన పిల్లలు కాలువలో స్నానాలు చేస్తుండగా బయ్య శివకుమార్(8) ఇంటికి రావడానికి రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో శివ అంతెత్తున ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కారు డ్రైవర్ బాలుడిని తన కారులో చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించడంతో వారు బోరున విలపించారు. మృతుడు గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దూది రాజు తెలిపారు. బైక్ డివైడర్‌ను ఢీకొని ఒకరు.. చివ్వెంల (సూర్యాపేట) : అదుపు తప్పి బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం వల్ల భాపురం గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంపుల గ్రామానికి చెందిన పేరెల్లి నాగ య్య (34) బైక్‌పై సూర్యాపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వల్లభాపురం గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు, ప్రైవేట్ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలుచివ్వెంల (సూర్యాపేట) : మండల పరిధిలో సో మవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదా ల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడడంతో భార్యాభర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. విజయవాడకు చెందిన భార్గవ్ తన భార్య లక్ష్మితో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గుంజ లూరు గ్రామ స్టే జీ వద్దకు రాగానే హైదరాబాద్–విజయవాడ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికులు సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. తిర్మలగిరి శివారులో ప్రైవేట్ బస్సు.. జి.తిర్మలగిరి గ్రామ శివారులో జాతీయ రహదా రిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడిం ది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజుతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి హాని జరుగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ బస్సు ఢీకొని లారీ డ్రైవర్ దుర్మరణం నార్కట్‌పల్లి(నకిరేకల్) : నార్కట్‌పల్లి మం డలం ఏపీలింగోటం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మం డలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కా రింగ్ కృష్ణయ్య (45) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడ నుంచి హైదరాబా ద్‌కు బొగ్గు లోడుతో ఒక్కడే వెళ్తూ మార్గమధ్యలో ఏపీలింగోటం గ్రామ శివారులో టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేయిస్తున్నాడు. ఆదేదారిలో వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొనడంతో లారీడ్రైవర్ అక్కడికక్కడే మృ తి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కృష్ణయ్య మరణంతో కుటుం బం వీధిన పడనుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎస్ఐ గోవర్ధన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు కేతేపల్లి(నకిరేకల్) : 65 నంబరు జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ వద్ద సోమవారం సా యంత్రం ఆటోను కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కేతేపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాల ముగిసిన అనంతరం కొర్లపహాడ్ గ్రామం వెళ్లేందుకు ఆరుగురు విద్యార్థులు కేతేపల్లిలో ఆటో ఎక్కారు. ఈక్రమంలో ఆటో కొర్లపహాడ్ బస్‌స్టేజీ సమీపంలోకి చేరుకోగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కా రు ఆటోను వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ కొప్పుల ఉమేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎడ్ల కర్ణాకర్, సూరారపు ప్రగతి, వం టెపాక నవ్యలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి ఎస్ఐ రజనీకర్ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీ సుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.