
ఉదయ్‌కిరణ్ (ఫైల్)
యాదాద్రి భువనగిరి, రాజాపేట (ఆలేరు) : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జెల్ల పెద్దోళ్లశ్రీనివాస్, వసంతకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు ఉదయ్‌కిరణ్ (19) రాజాపేటలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.
ఈ తరుణంలో తమ వ్యవసాయ బావివద్ద ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇతరుల సాయంతో కిందికి దించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఉదయ్‌కిరణ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment