
ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ,చిట్యాల : చిట్యాల పరిధిలో శుక్రవారం ఇద్దరు వ్వక్తులు క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని సుందరయ్యనగర్, సంజీవయ్యనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టణ శివారులోని సుందరయ్యనగర్ సమీపంలో రావి చెట్టు వద్ద క్షుద్రపూజలు నిర్వహిస్తుండగా స్థానికులు చూసి వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.