Occult worship
-
క్షుద్ర పూజలు అవాస్తవం
గోపాలపట్నం: విమాన్‌నగర్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఎయిర్‌పోర్టు సీఐ చక్రధరరావు స్పష్టం చేశారు. స్థానికంగా నివసిస్తున్న బోర రాజేష్ 10 రోజులుగా పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నాడన్న ఆరోపణతో గురువారం రాత్రి స్థానికులు అతనిపై దాడులు చేశారు. అతని ఇంటి అద్దాలు పగలగొట్టారు. దీన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు రాజేష్ ఇంటిని తనిఖీ చేశారు. ఎక్కడా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. ఎవరో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సీఐ తెలిపారు. అయితే స్థానికులు మాట్లాడుతూ రాజేష్ 10 రోజులుగా అర్ధరాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ పూజలు చేస్తున్నాడని, అడిగితే తాను అమ్మవారికి పూజలు చేసుకుంటున్నానని చెబుతున్నాడని భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాజేష్ మాట్లాడుతూ తన అన్న బోర అప్పరావురెడ్డి ఓ రోడ్డు వివాదంలో తనపై కక్ష పెట్టుకుని ఈ విధంగా దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
సూర్యాపేట జిల్లా అమీనాబాద్ లో క్షుద్రపూజల కలకలం
-
కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. -
వామ్మో..! క్షుద్ర పూజల కోసం 'కస్తూరి పిల్లి' అవయవాలు.. అంతలోనే..
హైదరాబాద్: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. లగేజీ స్క్రీనింగ్‌లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళుతున్నట్లు తెలిపారు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్లి అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్ నగర్లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్బీనగర్లోని సిరీస్ రోడ్‌లోని సిరినగర్ కాలనీలో ఉన్న జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే నకిలీ డాక్టర్ కార్తీక్‌రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ హస్పిటల్‌పై దాడి చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామ మాంత్రికుడికి టీడీపీ నేతల పరామర్శ
రేణిగుంట(తిరుపతి జిల్లా): రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల పేరుతో ఓ మహిళపై బలాత్కారానికి యత్నించిన కామ మాంత్రికుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ నేతలు తిరుపతి సబ్ జైల్లో పరామర్శించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న సుబ్బయ్య శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటలో భూత మాంత్రికుడి అవతారం ఎత్తి దాదాపు పదేళ్ల నుంచి మంత్రాలు, తాయత్తులు కడుతూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ముచేసుకునే వాడు. తాంత్రిక పూజల ముసుగులో అతని అకృత్యాలు నిత్యకృత్యమైనా.. ఎవ్వరూ అతనిని ఎదిరించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ఈ నెల 14న రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల నెపంతో ఓ మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని బలవంతం చేసి ఆమె నిరాకరించడంతో బలాత్కారం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కాగా, సబ్ జైల్లో ఉన్న నిందితుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతిబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయక్, అమాస శివకుమార్‌లు కలిసి అరగంటకు పైగా అతనితో మంతనాలు జరిపారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు. మహిళపై అకృత్యానికి పాల్పడి అరెస్టయిన సుబ్బయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని టీడీపీ వర్గాలే భావించాయి. అయితే అనూహ్యంగా జైల్లో ఉన్న అతన్ని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి బలహీనతలు సుబ్బయ్యకు బాగా తెలుసని, అవెక్కడ బయటపడతాయోనని పార్టీ వర్గాలు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. -
భర్తను చంపేందుకు స్వామిజీతో కలిసి భార్య స్కెచ్
-
హైదరాబాద్: స్కూల్లో క్షుద్రపూజల కలకలం!
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా.. క్షుద్ర పూజల కలకలం రేగింది. అదీ ఏకంగా ఒక పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ స్కూల్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. స్కూల్లోని సైన్స్ ల్యాబ్‌తోపాటు స్టోర్ రూమ్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్లో సీసీ ఫుటేజ్‌లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఉప్పల్ జంట హత్య కేసులు: కక్షతోనే అంతం..ఎనిమిది మంది నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: క్షుద్ర పూజలు చేసినా పోలీసు ఉద్యోగం రాలేదు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులూ వెంటాడటంతో కక్షగట్టి ప్రాణాలు తీశాడని రాచకొండ పోలీసులు తేల్చేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఉప్పల్ జంట హత్యల కేసును ఎట్టకేలకు ఛేదించారు. ప్రధాన నిందితుడు లక్కీ వినయ్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. మంగళవారం ఆయన మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 1991లో బాలాపూర్‌లోని మామిడిపల్లికి చెందిన లక్కీ వినయ్ తండ్రి పర్మ యోగేందర్ రెడ్డి రాజకీయ కక్షల నేపథ్యంలో తుకారాంగేట వద్ద హత్యకు గురయ్యారు. అనంతరం లక్కీ, అతడి అన్న, సోదరితో కలిసి ఉప్పల్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఇక్కడి హనుమాన్సాయినగర్కు చెందిన పురోహితుడు నర్సింహ శర్మతో లక్కీకి పరిచయమైంది. ఈ క్రమంలో నర్సింహకు అతీత శక్తులున్నాయని, పూజలతో ఏదైనా సాధించగలడని అతడు నమ్మకం పెంచుకున్నాడు. 2016లో ఎస్ఐ పరీక్షకు లక్కీ హాజరయ్యాడు. ఆ సమయంలో నర్సింహా పూజలు చేసి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానంటూ కిస్మత్‌పురాకు చెందిన వాలి, రాజ్యలక్ష్మీలకు రూ.12.50 లక్షలు ఇప్పించాడు. ఈ నేపథ్యంలో పూజలు చేసినా ఎస్ఐ ఉద్యోగం రాకపోవటంతో తాను ఇచి్చన డబ్బులు తిరిగి ఇవ్వాలని నర్సింహపై లక్కీ ఒత్తిడి పెంచాడు. నర్సింహ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరిగేవాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం, అనారోగ్యం క్షీణించడం, ఆర్థిక ఇబ్బందులకు లోనుకావటంతో.. పూజారి నర్సింహ క్షుద్ర పూజల కారణంగానే తాను దీన స్థితికి వచ్చానని లక్కీ భావించాడు. నర్సింహను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. రక్తం మరకలు.. దుస్తులను శుభ్రం చేసిన తల్లి.. జంట హత్యల అనంతరం నిందితులు లక్కీ, బాలకృష్ణలు తప్పించుకునేందుకు జల్పల్లికి చెందిన గడ్డి కార్తీక్, ఎల్బీనగర్కు చెందిన వాకిటి సుధాకర్ రెడ్డిలు రూ.35 వేలు కమీషన్ తీసుకొని రెండు ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. హత్యల అనంతరం రక్తం మరకలున్న దుస్తులు, కత్తి, కొడవలిని మామిడిపల్లిలోని లక్కీ ఇంట్లో వదిలేసి పారిపోయారు. లక్కీ తల్లి సావిత్రి రక్తపు మరకలు కనిపించకుండా దుస్తులను శుభ్రం చేసింది. నర్సింహ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రక్తం మరకులున్న దుస్తులు, కత్తి, కొడవలి, రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్లో నక్కి.. రెక్కీ లక్కీ తన స్నేహితుడైన చంపాపేటకు చెందిన యెళ్ల బాలకృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. నర్సింహ కదలికలను పసిగట్టేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్ గదిని అద్దెకు తీసుకున్న మామిడిపల్లికి చెందిన లాల్ జగదీష్ గౌడ్, కార్వాన్కు చెందిన గన్వయ రామ్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన గైక్వాడ్ శ్యాం సుందర్‌లు రెక్కీ చేసి సమాచారాన్ని లక్కీకి చేరవేసేవారు. సరైన సమయం కోసం వేచి ఉన్న లక్కీ, బాలకృష్ణలు శుక్రవారం తెల్లవారుజామున కొడవలి, కత్తులతో నర్సింహ ఇంట్లోకి ప్రవేశించి అతడిని హత్య చేశారు. తిరిగి వెళ్లిపోతుండగా నర్సింహ చిన్న కుమారుడు శ్రీనివాస్ అడ్డుకోవటానికి ప్రయతి్నంచగా.. అతడినీ బాలకృష్ణ కత్తితో పొడిచి చంపేశాడు. (చదవండి: 'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితాన్ని చాలిస్తున్నా') -
ఉప్పల్ జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, సిటీబ్యూరో: సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు!. ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్‌కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78), ఆయన కుమారుడు నర్సింహుల శ్రీనివాస్ (45)లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణమని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు క్షుద్ర పూజల కోణంలో దొరికిన ఆధారాలతో కేసును ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో లభ్యమైన బ్యాగులో పసుపు, కుంకుమ పొట్లాలు లభ్యం కావడమే అందుకు కారణంగా తేలింది. హత్య జరిగిన అనంతరం నర్సింహశర్మ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు రావటంతో ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. ప్రత్యక్ష సాక్షి నర్సింహ శర్మ ఇంటి పని మనిషి, స్థానికులను విచారించగా.. నర్సింహ శర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసేవారని, ఈ వ్యవహారంలోనే నిందితులు ఆయనపై కక్షగట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా హత్య అనంతరం దుండగులు విశాఖకు పారిపోయినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందంతో వెళ్లిన పోలీసులు మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, అతని స్నేహితుడు సంతోష్ నగర్‌కు చెందిన బాలకృష్ణా రెడ్డిలను అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. క్షుద్ర పూజలతో చెడు జరిగిందని.. క్షుద్ర పూజల నేపథ్యంలో హతుడు నర్సింహ శర్మతో వినాయక్‌రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లిందని వినాయక్ రెడ్డి భావించి, ఎలాగైనా పురోహితుడిని అంతమొందించాలని పగపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్నేహితుడు బాలకృష్ణారెడ్డితో కలిసి హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. నర్సింహ శర్మ కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్లో అద్దెకు దిగారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, శుక్రవారం ఉదయం బ్యాగులలో కత్తులు పెట్టుకొని నర్సింహ శర్మ ఇంట్లోకి ప్రవేశించి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తండ్రిని హత్య చేసి తిరిగి వెళ్లిపోతున్న నిందితులను అడ్డుకోవటానికి ప్రయత్నించిన శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీనివాస్ మృతదేహంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. స్పష్టత లేని సీసీటీవీ ఫుటేజీ మృతుడి ఇంటిలో సీసీటీవీ కెమెరా ఉందని, కానీ కొన్ని రోజులుగా అది పనిచేయడం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కెమెరా పనిచేయడం లేదన్న విషయం నర్సింహ శర్మకు, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు తెలియదని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఉన్న హాస్టల్, సమీప ప్రాంతంలోని సుమారు 200– 250 సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. వీటిలో నిందితుల ముఖాలు స్పష్టంగా రికార్డు కాలేదని, దీంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలిపారు. పూర్తి వివరాలను రాబట్టేందుకు నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కేసు పూర్తి వివరాలను ఒకట్రెండు రోజులలో పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. సంబంధిత వార్త: తండ్రి కొడుకుల హత్య కేసు.. నేత్ర దానం -
టీఆర్ఎస్.. బీఆర్ఎస్ ఎందుకైంది.. పేరు మార్చమని తాంత్రికులు చెప్పారా?
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు కేసీఆర్. అయితే ఈ పేరు మార్పు వెనుక కచ్చితమైన కారణం ఏంటన్నది చాలా మందికి అంతుపట్టడం లేదు. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలో పోటీ చేసినా గెలవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఎంపీ, ఎమ్మెల్యే పదవి కాదు కదా.. ఎంపీటీసీ పదవి అయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోటీ చేస్తే సవాళ్లు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ పేరు మార్పు వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పేరు మార్పు తాంత్రికుడి సూచనే : బండి సంజయ్ కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్ఎస్గా పేరు మార్చారని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ విమర్శించాడు. గతంలోనూ పూజలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ పద్ధతి గతంలో కూడా ఉందని, సచివాలయానికి వెళ్తే ఓటమి తప్పదని చెప్పడంతో అక్కడికి కూడా కేసీఆర్ వెళ్లలేదన్నారు బండి సంజయ్. ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. ఆ అస్తికలను కలపడానికి కాళేశ్వరానికి సకుటుంబ సమేతంగా వెళ్లాడని తప్పుబట్టారు బండి సంజయ్. నల్ల పిల్లితో ఫాంహౌజ్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తాడని, అయితే ఆయన క్షుద్ర పూజలు ఫలించకుండా పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చిందని తెలిపారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలవడానికి కూడా క్షుద్ర పూజలు చేశారని.. అయినా అక్కడ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు మునుగోడులో కూడా అదే పరిస్థితి వస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కేసులు తప్పించుకోవడానికే పార్టీ మార్పు: రేవంత్ తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని.. సీబీఐ, ఈడీ తమను వేధిస్తున్నాయని కేటీఆర్ కూడా చెప్పారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ దోపీడిని ప్రస్తావిస్తున్నారని రేవంత్ అన్నారు. అయితే, అసలు విషయం ఇది కాదని, ఢిల్లీ హైకోర్టులో పూర్తి వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని, 2018లో ఎలక్షన్ కమిషన్‌కు ఢిల్లీ హైకోర్టు అదేశాలిచ్చిందని రేవంత్ తెలిపారు. కూలీ పేరిట వసూళ్లు.. గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారని, రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానం. కేంద్ర ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు. కాగా, గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదు కాబట్టి.. టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని రేవంత్ చెప్పారు. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్‌కు ఈసీ ఇప్పటికే లేఖ రాసిందని, సరైన చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ రద్దు అవుతుంది కాబట్టే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుంటున్నారని రేవంత్ వెల్లడించారు. కేవలం కేసుల భయంతో వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారని, అంతే తప్ప జాతీయ పార్టీగా ఎదిగే అవకాశమే లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక ఒప్పందం చేసుకున్నారని.. త్వరలోనే ఇది బహిర్గతమయ్యే అవకాశముంది. నలుగురు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో కలుస్తారని, ఇంకొకరు కలిస్తే రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయినట్టువుతుందని రేవంత్ తెలిపారు. -
వరంగల్ నగరంలో క్షుద్రపూజల కలకలం
-
హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం
-
పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేశాడో భర్త. రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న భార్యపై క్షుద్రపూజలు చేయించాడు. అయితే స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పూజల స్థావరంపై దాడిచేసి దొంగ బాబాను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
అస్సాంలో అమానుషం.. క్షుద్రపూజల నెపంతో.. అందరూ చూస్తుండగా..
గువాహటి/మోరిగావ్: అస్సాంలో క్షుద్రపూజలతో మహిళను హత్యచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనంచేశారు. నాగోవ్ జిల్లాలోని సమగురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సరస్సులో విగతజీవిగా పడిఉన్న 22 ఏళ్ల మహిళను 35 ఏళ్ల రంజిత్ బొర్డోలోయ్ హతమార్చాడని బోర్లాలుంగో, బర్హామ్‌పూర్ బముని ప్రాంతంలోని గ్రామసభలో ఒక బహిరంగ విచారణ చేపట్టారు. ఆమెను రంజితే హతమార్చాడని తీర్మానించి పట్టపగలే అందరూ చూస్తుండగా సజీవదహనం చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా గ్రామంలోని పురుషులంతా పారిపోయారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. సజీవదహనం కేసులో ముగ్గురు మహిళలుసహా ఐదుగురిని అరెస్ట్‌చేసినట్లు జిల్లా ఎస్పీ లీనా డోలే చెప్పారు. -
క్షుద్ర పూజల కోసం బాలుడి కిడ్నాప్.. ఊరంతా ఏకమైనా దక్కని ప్రాణం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల కోసం ఓ 3 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి పూడ్చి పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. చంబల్ నది సమీపంలో ఓ అడవి ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అప్రమత్తం కావడంతో శనివారం అర్థరాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటన పినాహాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. కొంతమంది క్షుద్రపూజల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి ఖననం చేసినట్లు సమాచారం అందడంతో.. గ్రామస్తులు అక్కడికి చేరుకుని భూమిలో నుంచి బాలుడిని వెలికి తీశారు. అయితే ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి పంపారు. దర్యాప్తు తర్వాతనే పూర్తి వాస్తవాలు స్థానిక అధికారుల ప్రకారం.. బాలుడిని ఖననం చేసిన చోట ధూపం, కర్రలు, క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు ఉండటంలో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత మాత్రమే వాస్తవాలను తెలిస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక మహిళతో సహా నలుగురు నిందితులను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇక ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో ఏడేళ్ల బాలికను 2020 నవంబర్‌లో క్షుద్ర పూజల కోసం కిడ్నాప్ చేయడంతో దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. -
ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
సాక్షి, మహబూబ్‌నగర్: ఇంట్లో మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు.. క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం నయమవుతుందని మాయమాటలు చెప్పి నగదు, బంగారుతో పరారయ్యారు. దీనిపై మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో జీఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు బిజినపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం.. బిజినపల్లి మండలం మంగనూర్‌కి చెందిన పుష్ప తల్లి మాణిక్యమ్మకు రెండు నెలల నుంచి ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఈ క్రమంలో 15రోజుల కిందట ఇద్దరు గుర్తు తెలియని మహిళలు అదే గ్రామంలో కొందరికి జాతకం చెప్పారు. అలాగే సదరు మహిళలు పుష్ప ఇంటికి వచ్చి మీ ఇంట్లో ధనం ఉంది. దీంతోనే మీ అమ్మకి ఆరోగ్యం క్షీణిస్తోందని, నయం చేసేందుకు మీ ఇంట్లో క్షుద్రపూజలు చేసి ధనం తీస్తే ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. దీనికి ఆ కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో మూడు రోజుల పాటు ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించి ధనం తీసేందుకు పూజ సామాన్లు అవసరమన్నారు. దీనికోసం రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం తీసుకున్నారు. పూజ సామాన్లు మహబూబ్‌నగర్‌లో లభిస్తాయని ఈనెల 14న వచ్చి పరిశీలించారు. ఇక్కడ లభించడం లేదని హైదరాబాద్‌లో ఉంటాయని అక్కడికి వెళ్లి తీసుకువస్తామని చెప్పి సదరు మహిళలు వెళ్లిపోయారు. రెండు రోజుల నుంచి వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో బాధితురాలు మోసపోయినట్లు గ్రహించి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం! -
క్షుద్ర పూజలు; ఇంతకీ రాజశ్రీ ఎక్కడ?
సాక్షి, ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో సంచలనం సృష్టించిన వెల్లంకి రాజశ్రీ (16) అదృశ్యం కేసులో ఎలాంటి పురోగతి కనిపిం చడంలేదు. రాజశ్రీ సమీప బంధువైన గద్దె నర్సిం హారావు తన ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయనే అనుమానంతో 30 అడుగుల లోతు గొయ్యి తవ్విం చి క్షుద్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక పూజారులు మాత్రం తాము హోమాలే చేశామని, క్షుద్ర పూజల సంగతి తెలియదని చెబుతున్నారు. కాగా, ఈ పూజల్లో కీలకంగా భావిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మరో పూజారి ప్రకాశ్ శర్మ వెంటే రాజశ్రీ ఉందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం! ఆయన భార్య బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆశ్రమాన్ని ని ర్వహిస్తుండడంతో అక్కడికే ఆ బాలికను తీసుకెళ్లి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నప్పటికీ ప్రకాశ్ శ ర్మ, రాజశ్రీ ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు కనుగొనలేకపోతున్నారు. ఈ విషయమై ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోరగా కేసులో కీలకమైన పూజారి ప్రకాశ్ శర్మ, రాజశ్రీ ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు. ముగ్గురిని మింగిన ‘పులిగుండాల’ పెనుబల్లి: వానాకాలం పంట సీజన్ ముగియడంతో సరదాగా విహార యాత్ర కోసం వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తూ పులిగుండాల ప్రాజెక్ట్ నీటిలో మునిగి చనిపోయారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన 9 మంది యువకులు పెనుబల్లి మండలం తాళ్లపెంట అటవీ ప్రాంతంలోని పులిగుండాల ప్రాజెక్ట్‌కు విహారయాత్రకోసం వెళ్లారు. వెంట తెచ్చుకున్న సామగ్రితో అక్కడే వంట చేసుకుని, స్నానాలు చేద్దామని ముందుగా ఐదుగురు యువకులు వెళ్లారు. వారు తిరిగొచ్చాక జంగ రామకృష్ణారెడ్డి (24), వేమిరెడ్డి సైదిరెడ్డి (18), శీలం చలపతి (25) అనే మరో ముగ్గురు యువకులు నీళ్లలోకి దిగారు. వీరిలో ఒకరు కాలు జారి నీటిలో మునిగిపోగా, ఆ యువకుడిని రక్షించే క్రమంలో మరో ఇద్దరు నీటిలో మునిగి గల్లంతయ్యారు. దీంతో అక్కడే ఉన్న తోటి మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, ఎస్ఐ తోట నాగారాజు, కల్లురు ఎస్ఐ రఫీ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్, ఆర్డీఓ సూర్యనారాయణ సందర్శించారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు యువకుల మృత దేహాలను వెలికితీశారు. అనంతరం మృదేహాలను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుల దుర్మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం!
ఎర్రుపాలెం: ఒకవైపు గుప్తనిధుల కోసం ఇంట్లో తవ్వకాలు.. మరోవైపు ఆ ఇంటికే చెందిన బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో చోటుచేసుకుంది. రేమిడిచర్లకి చెందిన వెల్లంకి వెంకట్రావు,రాణి దంపతుల కుమార్తె రాజశ్రీ (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబా యి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది. ఆ ఊర్లోనే నివసిస్తున్న గద్దె నర్సింహారావు(నాగేశ్వరరావు మామ) ఇంట్లో లంకె బిందెలున్నా యని క్షుద్రపూజారులు చెప్పడంతో ఇంట్లో సొరంగంలా పెద్దగొయ్యి తీశారు. ఓ బాలికను నరబలి ఇస్తే ఫలితం ఉంటుందని పూజారులు చెప్పడంతో రాజశ్రీతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలుసనే ప్రచారం జరుగుతోంది. రాజశ్రీ తల్లిదండ్రులు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. రాజశ్రీకి జ్వరం వస్తోందని ఆమెను ఇంటి వద్దే ఉంచారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పైచదువుల నిమిత్తం ఇల్లు విడిచి వెళ్తున్నానని బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో పోలీసులకు దొరికింది. విషయం తన స్నేహితురాలు శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో పేర్కొంది. ఈ లేఖ రాజశ్రీనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని రాజశ్రీ చెప్పినట్లు వివరించింది. రాజశ్రీ మొబైల్‌ను లొకేషన్ ట్రేసింగ్ చేస్తున్నారు. రాజశ్రీని నర బలి ఇచ్చారా లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తమ వెంట తీసుకెళ్లారా..అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
క్షుద్రపూజల కలకలం..
నల్లగొండ,చిట్యాల : చిట్యాల పరిధిలో శుక్రవారం ఇద్దరు వ్వక్తులు క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని సుందరయ్యనగర్, సంజీవయ్యనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టణ శివారులోని సుందరయ్యనగర్ సమీపంలో రావి చెట్టు వద్ద క్షుద్రపూజలు నిర్వహిస్తుండగా స్థానికులు చూసి వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
అర్థరాతి వేళ క్షుద్ర పూజల కలకలం
సాక్షి, కాకినాడ : అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక్క సారిగా అరుపులు వినిపించాయి. ఏదో తెలియని శబ్దాలు, కేకలు పెద్ద ఎత్తున వినిపించాయి.. అంతే చుట్టు పక్కల వారంత ఒక్కసారి నిద్ర లేచారు. మంత్రాలు, అరుపులు ఇంకా ఎక్కువవడంతో హడలిపోయారు. అంతా ఒక్క చోటికి చేరుకొని శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించారు. పక్కనే ఉన్న ఇంట్లో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయని గుర్తించారు. గుంపుగా కలిసి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా గది అంతా పసుపు, నిమ్మకాయలతో నిండిపోయింది. ఇంటి యజమానియే క్షుద్రపూజలు చేశాడు. స్థానికులు అంతా దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెంలో జరిగింది. క్షుద్రపూలకు పాల్పడిన వ్యక్తిని షేక్ మహ్మద్‌గా గుర్తించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేక్ మహ్మద్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
‘నీ ఒంట్లో దెయ్యం ఉంది.. నేను చెప్పినట్లు చెయ్!
-
‘నీ ఒంట్లో దెయ్యం ఉంది.. చెప్పినట్లు చెయ్!’
జైపూర్ : మాంత్రికుడు చెప్పినట్లు చెయ్యలేదన్న కోపంతో ఊరి ప్రజలందరూ చూస్తుండగా భార్యను విచక్షణా రహితంగా చితకబాదాడో భర్త. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బార్మర్ జిల్లాలోని మందాపుర గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నిరోజులుగా కడుపునొప్పి వస్తోందని మంగళవారం భర్తకు చెప్పింది. దీంతో అతడు ఆమెను ఆసుపత్రికి తీసుకుపోకుండా మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెకు దెయ్యం పట్టిందని, దీని కోసం కొన్ని పూజలు చేస్తే సరిపోతుందని మాంత్రికుడు చెప్పాడు. పూజలో భాగంగా ఆమెను ఊరి చుట్టూ తిప్పి ఓ చోట ప్రజల ముందు ఉంచాడు. అప్పుడు ‘నీ ఒంట్లో దెయ్యం ఉంది.. చెప్పినట్లు చెయ్!’ అని ఆ మాంత్రికుడు ఆమెకు సూచించాడు. అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ భర్త అందరి ముందు ఆమెను బెల్టుతో చితకబాదాడు. కొట్టవద్దని ఆ మహిళ భర్తను ఎంత బ్రతిమాలినా అతడు వదల్లేదు. ఆమె అలసిపోయినా వదలకుండా చెప్పుతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీశారు. అయితే భర్త తనపై చేయి చేసుకోలేదని, గుడికి రానందుకు తిట్టాడని సదరు మహిళ చెప్పటం గమనార్హం. దీనిపై ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
క్షుద్ర పూజల్లో కొత్తకోణం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కంచిక చర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో జరిగిన క్షుద్ర పూజల్లో కొత్తకోణం వెలుగు చూసింది. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిధులు ఉన్నాయంటూ పాస్టరే క్షుద్ర పూజలకు పురిగొల్పినట్లు విచారణలో తేలింది. ప్రస్తుం పూజలు నిర్వహించటానికి కారకుడైన పాస్టర్ పరారిలో ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోవటానికి గాలింపు చర్యలు వేగవంతం చేశారు -
క్షుద్రపూజలకు ఆరడుగుల మహిళ
పోలీసుల అదుపులో డబ్బు ఎర చూపిన నలుగురు నిందితులు బోనకల్ : క్షుద్ర పూజలకోసం ఓ మహిళకు డబ్బులు ఎరచూపి తీసుకువెళ్లే ప్రయత్నంచేసిన వ్యక్తులను బోనకల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజల కోసం ఆరు అడుగుల ఎత్తుఉన్న మహిళ కావాలని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన ఓర్స్ బాలకృష్ణ బోనకల్‌కు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా సైదాకు తెలిపాడు. బోనకల్ కస్తూర్బా పాఠశాలలో వంటమనిషి వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్న శ్యామల రేణుక ఆరు అడుగులు ఉంటుందని చెప్పడంతో..కృష్ణాజిల్లా వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన పెరుగు వెంకటరమణ, కొణిజర్ల మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన పుట్టా లక్ష్మిలతో కలిసి ఓర్స్ బాలకృష్ణ శ్యామల రేణుక వద్దకు వచ్చి..పూజకు రావాలని, అలా చేస్తే రూ.2లక్షలు ఇస్తామని, భయమనిపిస్తే భర్తతో కలిసి రావొచ్చని నమ్మబలికారు. దీంతో రేణుకకు అనుమానం వచ్చి కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌కు విషయాన్ని వివరించగా..ఆమె బోనకల్ ఎస్సై కుమారస్వామికి విషయం తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి రేణుక ఇంట్లో ఉన్న పెరుగు వెంకటరమణ, పుట్టా లక్ష్మి, భూక్యా సైదా, ఓర్స్ బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారులకోసం విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.