
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల కోసం ఓ 3 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి పూడ్చి పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. చంబల్ నది సమీపంలో ఓ అడవి ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అప్రమత్తం కావడంతో శనివారం అర్థరాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా ఈ ఘటన పినాహాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. కొంతమంది క్షుద్రపూజల కోసం బాలుడిని కిడ్నాప్ చేసి ఖననం చేసినట్లు సమాచారం అందడంతో.. గ్రామస్తులు అక్కడికి చేరుకుని భూమిలో నుంచి బాలుడిని వెలికి తీశారు. అయితే ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి పంపారు.
దర్యాప్తు తర్వాతనే పూర్తి వాస్తవాలు
స్థానిక అధికారుల ప్రకారం.. బాలుడిని ఖననం చేసిన చోట ధూపం, కర్రలు, క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు ఉండటంలో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత మాత్రమే వాస్తవాలను తెలిస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక మహిళతో సహా నలుగురు నిందితులను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇక ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో ఏడేళ్ల బాలికను 2020 నవంబర్‌లో క్షుద్ర పూజల కోసం కిడ్నాప్ చేయడంతో దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment