agra
-
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్‌తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య
ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ఆయోధ్య రామ మందిరం వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి వచ్చిoది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా ఆయోధ్య రికార్డులకు ఎక్కింది. ఈ 9 నెలల్లో ఆగ్రాను 12.51 కోట్ల మంది సందర్శించగా.. అయోధ్యను 13.55 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 22న ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమై అయోధ్య రామ మందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేరింది. విదేశీయులు 3,153 మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతోందని ట్రావెల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకుల్లో 70 శాతం మంది రామమందిరం, సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
ఆగ్రా: ప్రపంచ అద్భుతాలతో ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారా? కాదు.. కాదు.. ఇది నిజం.. ఇటీవలికాలంలో తాజ్ మహల్ మాయమైపోతోంది. ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది. దీనివెనకగల కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశరాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రావాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదయ్యింది. ఈ నేపధ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్‌ను కప్పేస్తోంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిపోయింది. ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ -
ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 విమానం..
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ విమానం సోమవారం కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారుఅయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. -
స్వీటుతో చేటే!
సాక్షి,హైదరాబాద్: చిన్నాచితకా వాటి నుంచి పేరున్న బడా షాపుల దాకా ఒకటే తీరు. సాధారణ హోటల్ నుంచి స్టార్ హాటళ్ల వరకూ అదే వరస. ప్రజలు తినే తిండితో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చివరకు ప్రజలు శుభకార్యాల్లో, సంతోష సమయాల్లో తినే.. దీపావళి పండగ సందర్భంగా బంధుమిత్రులకు పంపిణీ చేసే స్వీట్స్ దాకా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ప్రజలు ఎగబడి క్యూలు కట్టే దుకాణాల్లోనూ అదే పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా, ఆయా దుకాణాల నిర్వాకాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఒకసారి తనిఖీ చేసిన వాటిల్లోనూ తిరిగి అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయంటే చర్యలపై వాటికి ఎంతటి లెక్కలేనితనం ఉందో అంచనా వేసుకోవచ్చు. డొల్లతనం వెల్లడైంది ఇలా.. 👉 జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగరంలోని అమీర్‌పేటలో కొన్ని స్వీటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో డొల్లతనం వెల్లడైంది. నిబంధనలు బేఖాతరు చేయడం దృష్టికొచ్చింది. కనీసం ట్రేడ్ లైసెన్సులు లేకుండా రిజి్రస్టేషన్లతోనే దర్జాగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం తెలిసింది. ఆయా వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 👉 నిబంధనల మేరకు ఆహార విక్రయ దుకాణాల్లో ప్రజలకు కనిపించేలా ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)సరి్టఫికెట్ ప్రదర్శించాల్సి ఉండగా, ‘ఆగ్రా స్వీట్స్’లో అది కనిపించలేదు. లైసెన్సు లేకుండానే కేవలం రిజి్రస్టేషన్ మాత్రం చేయించుకొని వ్యాపారం చేస్తుండటం దృష్టికొచ్చింది. డస్ట్బిన్లకు ఎలాంటి మూతలు లేకుండా కనిపించాయి. సిబ్బంది తలలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేవు. 👉 సగం తయారైన వంటకాలు ఫ్రిజ్‌లో సవ్యంగా ఉంచకపోవడం, లేబుల్ లేకపోవడం కనిపించాయి. కొన్ని సరుకులు ఎక్స్పైర్ డేట్వి ఉండటం అధికారుల దృష్టికొచి్చంది. ‘ఢిల్లీ మిఠాయి వాలా’ దుకాణంలో సిబ్బంది మెడికల్ ఫిట్నెస్ సరి్టఫికెట్లు, నీటి విశ్లేషణ నివేదికలు లేవు. శిక్షణ పొందిన సూపర్వైజర్ లేకపోవడం గుర్తించారు. క్రిమి కీటకాలు చొరబడకుండా తలుపులు, కిటికీలకు ప్రూఫ్ స్క్రీన్స్ లేవు. నేలపై అడ్డదిడ్డంగా చక్కెర బ్యాగ్స్, స్టోర్‌రూమ్ ర్యాక్స్‌లో ఎలుక పెంటికలు, మూతలు లేని డస్ట్బిన్లు కనిపించాయి. హోమ్ ఫుడ్స్‌లోనూ అదే తంతు.. వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌లో కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కనిపించలేదు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నట్లు గుర్తించారు. స్టోర్‌రూమ్‌లోని సిబ్బంది తలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేకుండానే ఉండటాన్ని, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సరి్టఫికెట్స్ కానీ, పెస్ట్ కంట్రోల్రికార్డులు కానీ లేకపోవడం అధికారుల దృష్టికొచి్చంది. తినడానికి సిద్ధంగా ఉన్న సేవరీలు, పచ్చళ్లకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాటికి లేబుళ్లు లేకపోవడాన్ని గుర్తించారు. ‘వినూత్న ఫుడ్స్’లోనూ దాదాపుగా అవే పరిస్థితులు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్ సైతం గడువు ముగిసిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో రికార్డులు లేవు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తగిన స్టోరేజీ సదుపాయం కూడా లేకపోవడం గుర్తించారు. ఇలా.. ఎక్కడ తనిఖీలు జరిగినా లోపాలు బట్టబయలవుతున్నాయి. చర్యలు లేకే.. తగిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట తినే బదులు ఇంట్లో చేసుకునే చిక్కీ అయినా మేలని అంటున్నవారూ ఉన్నారు. ‘అయ్యో.. నేనెప్పుడు అక్కడే కొంటుంటాను. ఇకనుంచి మానేస్తాను’ అని సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్న వారూ ఉన్నారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో తల్లి మృతి
లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్‌గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..
ఆమె ఆగ్రా ఏసిపి అర్ధరాత్రి 12 తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర నిలబడి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ‘ఒంటరి ప్రయాణికురాలిని.. హెల్ప్ చేస్తారా?’ అని పోలీసులు ఎలా స్పందించారు? మహిళల రక్షణ విషయంలో పోలీసు అధికారుల ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి హెచ్చరికలు పంపుతాయి? రెండు మూడు రోజుల క్రితం. ఆగ్రాలోని రైల్వేస్టేషన్ దగ్గర ఒక మహిళ నిలుచుని ఉంది. తెల్ల షర్టు, బ్లాక్ జీన్స్ ధరించి ఉంది. చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. అప్పటికి రాత్రి ఒంటి గంట. ఉత్తర ప్రదేశ్ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసింది. ‘నేను ఒంటరి ప్రయాణికురాలిని. ట్రైన్ మిస్ అయ్యాను. నాకు సాయం చేయగలరా?’ అని అడిగింది. అవతలి వైపు పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూసింది. ఆ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి లేదా ఏదైనా జనం ఉండే చోట ఉండండి. మా వాళ్లు మీ కాంటాక్ట్‌లోకి వస్తారు’ అని చెప్పారు. మరికొన్ని క్షణాల్లోనే మరో ఫోన్. ‘మేం బయలుదేరాం. మీ లైవ్ లొకేషన్ పెట్టండి’ అని. ‘భేష్. మీరు రానక్కర్లేదు. నేను ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మను’ అని ఫోన్ పెట్టేసింది.ఆ తర్వాత ఆటోను పిలిచింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కింది. ‘డ్రైవర్ భయ్యా... ఒంటరి మహిళలు ఈ టైమ్‌లో ఆటో ఎక్కడం సేఫేనా’ అని అడిగింది. ఆటోడ్రైవర్ ‘ఏం పర్లేదమ్మా. పోలీసులు ఆటోడ్రైవర్ల అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఖాకీ షర్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు’ అని ఆమె కోరిన చోట దించాడు. అప్పుడు ఆమె తనెవరో చెప్పి ‘స్త్రీలు మెచ్చే విధంగా ఉన్నావు. ఇలాగే అందరూ వ్యవహరించాలి’ అని అభినందించింది. పూర్వం ఎలా పాలన జరిగేదో చూడటానికి రాజులు మారు వేషాలు వేసేవారు. ఇలా అధికారులు కూడా సామాన్యుల్లా వ్యవహరించి తిరిగితే లోపాలు తెలిసి సమస్యలు దృష్టికి వచ్చి స్త్రీలకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు. భేష్ సుకన్య మేడమ్.(చదవండి: పెప్పికో మాజీ సీఈవో ఇంద్రా నూయి పేరెంటింగ్ టిప్స్) -
స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!
భార్యా భర్తలమధ్య విభేదాలు వచ్చినపుడు విడిపోవడం సహజం. ఇక ఇద్దరి మధ్యా సంబంధాలు ఒక కొనసాగలేవు అనుకున్నపుడు విడాకులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వ్యవహారం ఒక్కోసారి పరస్పర అంగీకారంతో ఈజీగా అయిపోతుంది కూడా. అయితే విడాకులకు సంబంధించి కొన్ని విస్తుపోయే కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విడాకుల కేసు పలువురిని ఆలోచనలో పడేసింది. విషయం ఏమిటంటే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. తన భర్త రాజేష్ 40 రోజుల్లో ఆరు సార్లు మాత్రమే స్నానం చేశాడనీ, దీంతో అతని శరీరం నుంచే ఆ దుర్వాసనను భరించలేక పోతోంది. పైగా వారానికోసారి పవిత్రంగా భావించే గంగాజలాన్ని చల్లుకుంటాడట. ఇక అతనితో జీవించడం తన వల్ల కాదని కోర్టును ఆశ్రయించింది. పెళ్లయినప్పటి నుంచీ అదీ తాను బలవంతంగా చేయగా కేవలం ఆరు సార్లుమాత్రమే స్నానం చేశాడు. దీంతో రాజేష్ భార్య మహిళ కుటుంబ సభ్యులు భర్త రాజేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది విడాకులు కావాలని కోరింది.అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తరువాత డైలీ స్నానం చేసేందుకు పరిశుభ్రంగా ఉండేందుకు రాజేష్ ఒప్పుకున్నాడు. కానీ ఆ మహిళ అతడితో ఉండడానికి ఇష్టం పడటం లేదు. దీంతో మరోసారి సెప్టెంబర్ 22న కౌన్సిలింగ్ కు రావాలని వెల్లడించారు అధికారులు.కాగా ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కాదు. భర్త కుర్ కురే ప్యాకెట్ ఇవ్వలేదని విడాకులు కోరిన ఘటన ఇటీవల ఆగ్రాలో వచ్చిన సంగతి తెలిసిందే. -
‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’
Viral Story: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథనాలకు తలాతోక ఉండదు. నిజనిర్ధారణ(Fact Check) చేసుకోకుండా పోస్టులు పెడుతుంటారు కొందరు. అలాగే.. ఆ పోస్టుల ఆధారంగా మీమ్స్ సైతం వస్తున్న రోజులివి. తాజాగా సిసింద్రీ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోందంటూ ఓ ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది.వైరల్ వీడియోలో ఏముందంటే..పోలీస్ స్టేషన్లో.. ఓ వ్యక్తి చెర నుంచి రెండేళ్ల ఓ చిన్నారిని విడదీస్తారు పోలీసులు. ఆ టైంలో ఆ చిన్నారి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటాడు. అయినా పోలీసులు బలవంతంగా లాక్కుంటారు. ఆ చిన్నారి ఏడుపుతో పాటు కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లాక.. ఓ మహిళకు అప్పగిస్తారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి, వృద్ధజంటను ఆ బాలుడి గురించి ఆరా తీస్తారు. అయినా ఆ చిన్నారి లోపల ఉన్న కిడ్నాపర్ కోసం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు.Jaipur- A #child who was #kidnapped at 11 months old and kept with the kidnappers for 14 months, hugged the kidnapper, Tanuj, and began crying loudly when he was finally #rescued.This emotional moment even brought tears to the eyes of the accused."pic.twitter.com/UUpAAspTfG— Chaudhary Parvez (@ChaudharyParvez) August 30, 2024అయితే ఆ బిడ్డకు అతనే తండ్రి అని, విడిపోయిన నేపథ్యంలో భార్య అతనిపై కేసు పెట్టిందని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే.. కిడ్నాపర్ మీద మమకారం పెంచుకుని అలా ఆ చిన్నారి ఏడ్చాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏది నిజమంటే..అసలు విషయం ఏంటంటే..ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు తనూజ్ చాహర్(33).ఆ వీడియోలో ఉన్న చిన్నారి పేరు పృథ్వీ. ఆగ్రాకు చెందిన తనూజ్ గతంలో అలీఘడ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కారణం తెలియదుగానీ.. అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. అయితే.. ఆ చిన్నారి తల్లి పూనమ్ చౌదరితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడతను. ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపం పెంచుకుని ఆమె 11 నెలల కొడుకును ఎత్తుకెళ్లాడు.అలా సుమారు 14 నెలలపాటు ఆ బిడ్డతో ఎవరికీ దొరక్కుండా తిరిగాడు తనూజ్. పోలీసుగా తనకు ఉన్న అనుభవం ఉపయోగించడంతో పాటు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ చెప్పుకుంటూ.. మధుర, ఆగ్రా, బృందావన్.. అన్నిచోట్లా తిరిగాడు. యమునా నది తీరాన ఓ గుడిసె వేసుకుని తనను తాను ఓ సాధువుగా అందరినీ నమ్మించే యత్నం చేశాడు. చివరకు ఈ మధ్య అలీగఢ్‌లో అతని జాడను గుర్తించిన జైపూర్ పోలీసులు.. 8 కిలోమీటర్లపాటు ఛేజ్ చేసి పట్టుకున్నాడు.తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తితో ఏడాది పాటు ఉన్న పృథ్వీ.. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకుని రోదిస్తుండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. -
బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ
'చిలసౌ' అనే తెలుగు సినిమాతో రుహానీ శర్మ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. దీని తర్వాత టాలీవుడ్లో అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. అయితే ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ఆగ్రా' అనే హిందీ సినిమా.. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది.'ఆగ్రా' సినిమాలో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటంతో మన దగ్గర స్ట్రీమింగ్‌లోకి రాలేదు. కానీ పైరసీ సైట్లలో కనిపించింది. దీంతో కొందరు ప్రేక్షకులు ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు చూసి షాకయ్యారు. రుహానీ శర్మ ఇలా చేసిందేంటి అని ఆమెని విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఈమె వరకు వెళ్లడంతో స్పందించింది. పెద్ద నోట్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)'అందరికీ హాయ్. నేను నటించిన 'ఆగ్రా' సినిమా లీక్ అయింది. నెలల తరబడి మేం పడ్డ కష్టం ఇలా వృథా అవుతుందనుకోలేదు. అప్పటి నుంచి ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా అసంతృప్తికి గురయ్యాను. ఆర్ట్ ఫిల్మ్ తీయడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు ఉంటాయి. ఇవేవి చూడకుండా నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం, నన్ను జడ్జ్ చేయడం నిజంగా దారుణం'''ఆగ్రా' అనే రోజూ చేసే మరో సినిమా కాదు. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. నటిగా ఇది నాకెంతో గర్వ కారణమైన విషయం. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని, అవార్డులు పొందిన ఈ చిత్రం విషమయై నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ గురించి మీకేం తెలియకపోతే ఏది పడితే అనొద్దు. కాస్త గౌరవమిచ్చి మాట్లాడండి. అవసరమైతే ప్రోత్సాహించండి కానీ మేం పడ్డ శ్రమని తక్కువ చేసి చూడొచ్చు' అని రుహానీ శర్మ భావోద్వేగానికి లోనైంది.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
సజీవంగా పూడ్చేశారు.. వీధి కుక్కలే కాపాడాయి
ఉత్తరప్రదేశ్: ఒక యువకుడి ప్రాణాలను వీధి శునకాలు కాపాడిన విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్‌పై జూలై 18న అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.రూప్ కిశోర్ మృతి చెందాడని భావించిన నిందితులు ఒక ప్రాంతంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తవ్వాయి.. ఆ యువకుడి శరీరాన్ని కొరకడంతో స్పృహ వచ్చింది. దీంతో అతడు స్థానికుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.రూప్ కిశోర్ తల్లి స్పందిస్తూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. -
తాజ్ మహల్‌ను తేజో మహల్ అంటూ కావడియాత్రకు మహిళ
‘అది తాజ్ మహల్ కాదు.. తేజో మహల్.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్‌మహల్ దగ్గరకు చేరుకుని నానా హంగామా చేసింది.తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన జనం ఆ మహిళను చూసేందుకు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను తాజ్ మహల్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది.ఈ ఘటన నేటి ఉదయం(సోమవారం) ఉదయం తాజ్ మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు మీనా రాథోడ్. ఆమె.. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని మీడియాకు తెలిపింది. ఆ మహిళ తన భుజాలపై కావడి పెట్టుకుని తాజ్‌మహల్ చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు తాజ్‌లోనికి కావడి తీసుకువెళ్లకూడదంటూ అడ్డుకున్నారు.అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది. రెండు రోజుల క్రితం భోలేనాథుడు తనకు కలలో కనిపించాడని, తేజోమహల్ ఒక దేవాలయం అని, అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. అమె తాజ్‌మహల్ లోనికి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు.. సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె మరో మార్గంలేక కావడితో సహా ఇంటిదారి పట్టింది. -
చంబల్ నదిలో 900 చిరు మొసళ్ల సందడి
మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా బాహ్‌లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్గావాన్, హత్కాంత్ ఘాట్ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి. -
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్‌మహల్
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్‌ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్‌మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్‌కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.వారు తాజ్‌మహల్‌ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్‌మహల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్‌ను నిర్మించారు. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు. 2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. -
ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే..
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసేందుకు వెళ్లేవారు ఇకపై అక్కడి మెట్రోలో సిటీనంతా చుట్టేయచ్చు. ఆగ్రాలో మెట్రో సేవలు గురువారం(2024, మార్చి, 7) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజిటల్ మాధ్యమం ద్వారా ఆగ్రా మెట్రోను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆగ్రా మెట్రో రైలు తాజ్ ఈస్ట్ గేట్ నుండి మంకమేశ్వర్ మెట్రో స్టేషన్ వరకు నడుస్తుంది. దీని దూరం ఆరు కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఆరు స్టేషన్లలో మెట్రో నడుస్తుంది. మార్చి 7 నుంచి సామాన్య ప్రజలు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఆగ్రా మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాకపోకలు సాగించనుంది. ఆగ్రా మెట్రో ప్రత్యేకతలివే.. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi flags off metro railway services from Kavi Subhash Metro, Majerhat Metro, Kochi Metro, Agra Metro, Meerut-RRTS section, Pune Metro, Esplanade Metro- Kolkata. pic.twitter.com/2s8mNCjUiX — ANI (@ANI) March 6, 2024 ఆగ్రా మెట్రో గంటకు 90 కి.మీ వేగంతో నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో స్టేషన్లను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులెవరైనా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు స్టేషన్లో నిలబడితే అలారం మోగుతుంది. మొదటి దశ 6 మెట్రో స్టేషన్లు.. తాజ్ ఈస్ట్ గేట్, కెప్టెన్ శుభమ్ గుప్తా మెట్రో స్టేషన్, ఫతేబాద్ రోడ్, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ మంకమేశ్వర్ టెంపుల్ ఒక మెట్రో స్టేషన్ మధ్య ప్రయాణానికి రూ.10, చివరి స్టేషన్‌ను రూ.60గా చార్జీలను నిర్ణయించారు. ఒక కోచ్‌లో 60 సీట్లు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు. -
ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం!
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్‌ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)న్ని అస్సలు మిస్సవ్వరు. తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఏర్పాటు చేయడం విశేషం. ఎన్ని రోజులు జరుగుతుందంటే.. ఈ ఏడాది తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం.సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈసారి ప్రత్యేకతలు... ఈ ఏడాది తాజ్ మహోత్సవ్‌లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్‌లో కనిపించనుంది. యమునా నది ఘాట్లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు.. తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్ మహోత్సవ్‌లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్, సబ్-క్లాసికల్ గానం, భోజ్‌పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్, తబలా, పఖావాజ్, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు. తాజ్ మహోత్సవ్‌లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, తదితర ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు. Glimpses of Taj Mahotsav: A Cultural Extravaganza in the Heart of Agra. Celebrating 33 years in 2024 Experience India's rich arts, crafts, music, cuisine. With 400 artisans showcasing woodwork, stone carving, mesmerizing performances, delicious food. 17th to 27th Feb, 2024. pic.twitter.com/TU4yAvWB9C — Taj Mahal (@TajMahal) February 15, 2024 (చదవండి: తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?
ఆ గ్రామంలోనివారికి శ్రీరాముడు మామ అవుతాడు. దీని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. ఆగ్రాలోని రుంకటా పరిధిలోని సింగనా గ్రామంలో శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. అయోధ్యలో 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. శృంగి మహర్షి అలనాడు దశరథ మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లి పుత్రకామేష్టి యాగం చేశాడు. సింగనా గ్రామ ప్రజలు శ్రీరాముడిని ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. శ్రీరాముడిని వారు మామగా పిలవడానికి కారణం ఉంది. దశరథ మహారాజు కుమార్తె శాంతకుమారికి శృంగిమహర్షితో వివాహం జరిగింది. శ్రీరాముని సోదరి శాంతకుమారి వివాహానంతరం ఈ ప్రాంతానికి వచ్చినందున వారు శ్రీరామునితో బంధుత్వం ఏర్పరుచుకుని, మామా అని సంబోధిస్తుంటారు. సింగన గ్రామంలో యమునా నది ఒడ్డున శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. కుమారుడు పుట్టాలనే కోరికతో శృంగి ఋషి ఆశ్రమానికి ఎవరైనా వస్తే వారి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. శృంగి మహర్షి అయోధ్యకు వెళ్లి, పుత్రకామేష్టి కోసం యాగం చేసిన దరిమిలా రామలక్షణ భరత శత్రుఘ్నలు జన్మించారు. శృంగి మహర్షి ఆశ్రమానికి చెందిన మహంత్ నిరంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ ఆశ్రమంలో శృంగి మహర్షి తపస్సు చేశారని, ఈ శృంగి మహర్షి తపోభూమి ఎంతో శక్తివంతమైనదని అన్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోనివారంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించనున్నారు. -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్‌లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
దట్టమైన పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఉన్నావ్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగమంచు కారణంగా డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వస్తున్న వాహనాలు ఒకదాకొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 25మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పొగమంచుతో దారి సరిగా కనిపించని కారణంగానే బస్సు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌లలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత(విజిబిలిటీ) పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0 కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో వాహనాలను అధిక వేగంతో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు