ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ విమానం సోమవారం కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు
అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment