Fighter jet
-
ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 విమానం..
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ విమానం సోమవారం కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారుఅయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. -
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ‘తరంగ్ శక్తి’
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ‘తరంగ్ శక్తి 2024’ మొదటిదశ యుద్ధవిన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు ‘తరంగ్ శక్తి’ మంచి వేదికని మంగళవారం డీఆర్డీఓ ఛైర్పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్(స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్) డిజైన్ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్‌ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి’ అని అన్నారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్‌లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్‌తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
అబ్బురపరిచే విజువల్స్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా కనిపించనున్నారు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా మెప్పించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ట్రైలర్ చూస్తే హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్‌తో హృతిక్ రోషన్ నటన ఆకట్టుకుంటోంది. ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్‌లో బాలీవుడ్ హీరో లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఫైటర్ జెట్ పైలెట్‌గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సరికొత్త అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. दिल आसमान के नाम, और जान देश के नाम । जय हिन्द! 🇮🇳#FighterTrailer OUT NOW. https://t.co/8b4COYyiWy#Fighter Forever. #FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/ANMv5FreCv — Hrithik Roshan (@iHrithik) January 15, 2024 -
తేజస్‌లో మోదీ
సాక్షి బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు చెందిన తయారీయూనిట్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. పైలట్ యూనిఫామ్ ధరించి తేజస్ యుద్ధ విమానంలో సుమారు 10 నిమిషాల పాటు ప్రయాణించారు. తన యుద్దవిమాన ప్రయాణం తాలూకు ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తేజస్‌లో ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణ అనుభవం భారతదేశ దేశీయ సామర్థ్యాలపై నా నమ్మకాన్ని మరింతగా పెంచింది. దేశీయ టెక్నాలజీ, వైమానిక సత్తా, కృషి, అంకితభావం చూస్తే గర్వంగా ఉంది. స్వావలంబనలో ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్ తీసిపోదు. భారతీయులుగా మనందరం ఈ విషయంలో భారత వాయుసేన, డీఆర్డీవో, హాల్‌ను అభినందించాల్సిందే’’ అని మోదీ ట్వీట్‌చేశారు. విమాన ప్రయాణం తర్వాత హాల్లోని తయారీ కేంద్రం పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
Droupadi Murmu: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 ఎంకేఐ విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె శనివారం ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానికి స్థావరానికి చేరుకున్నారు. తొలుత అక్కడ ఆమె భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తదనంతరం ఆమె యుద్ధ విమానంలో పర్యటించేందుకు యాంటీ గ్రావిటీ సూట్ ధరించి..సుఖోయ్ 30లో కొద్దిసేపు ప్రయాణించారు. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. దీంతో ఈ సుఖోయ్‌లో పర్యటించిన భారత రెండోవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. కాగా 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ సుఖోయ్ 30 ఎంకేఐ అనేది రెండు సీట్లతో కూడిన ఫైటర్ జెట్. దీన్ని రష్యాకి చెందిన సుఖోయ్ సంస్థ అభివృద్ధి చేయగా..భారత ఏరోస్పేస్ దిగ్గజం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జెట్‌ని నిర్మించింది. #WATCH | President Droupadi Murmu lands at Tezpur Air Force Station, Assam after taking a sortie in the Sukhoi 30 MKI fighter aircraft pic.twitter.com/xRnjERbEnv — ANI (@ANI) April 8, 2023 (చదవండి: హనీ ట్రాప్‌లో అనుకోకుండా జరిగిన హత్య..ఐతే ఆ 'సారీ నోట్'..) -
INS Vikrant : తూర్పు నౌకా దళం చారిత్రాత్మక ముందడుగు
ఆత్మ నిర్భర భారత్ దిశ గా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ద నౌక విక్రాంత్. ఐఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకా పై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో పాటవ ప్రదర్శనలో భారత నౌకాదళం మరో కీలక అడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనకు వేదికగా మారింది. భారత సముద్రజలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా లైట్ కాంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్స్(ఎల్సీఏ)ని నేవీ పైలట్లు సోమవారం వేర్వేరు ట్రయల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం శుభపరిణామమని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అభినందనలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధనౌక పై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఈ ప్రక్రియ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధనౌకలపై విమానాలు దిగే సాంకేతిక పరిజ్ఞానం భారత్ వినియోగిస్తుంది. ఇప్పుడు భారతదేశ తొలిసారిగా విమాన వాహక యుద్ధనౌకను సిద్ధం చేసుకోవడంపై భారతీయులు గర్వపడుతున్నారు. విక్రాంత్‌పై మిగ్–29కే రయ్..రయ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా మిగ్–29కే యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పరీక్షల్ని సముద్ర జలాల్లో సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 2.5 సెకన్లలో 240 నుండి 0 కి.మీ సముద్ర ట్రయల్స్‌లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం తేజస్.. విజయవంతంగా బయలుదేరి విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్‌పై ల్యాండ్ అయింది. ఈ నేవల్ వేరియెంట్ జెట్ మిషన్కి నేతృత్వం వహించారు కామ్రేడ్ జైదీప్ మావోలంకర్(రిటైర్డ్). చిన్న నౌక మీద ల్యాండ్ కావడం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 240 కిలోమీటర్ల నుంచి సున్నాకు జెట్‌ను అదుపు చేయడం పైలట్లకు ఛాలెంజ్‌తో కూడిన వ్యవహారం. ఆ టైంలో ల్యాండింగ్‌పై నియంత్రణ కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను.. ₹ 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో యుద్ధ విమానాల అనుసంధానం 2023 మే లేదంటే జూన్ నాటికి పూర్తవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గతంలో వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్యా డెక్ మీద తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రొటోటైప్‌ను కామ్రేడ్ మావోలంకర్ స్వయంగా ల్యాండ్ చేయడం గమనార్హం. తద్వారా అలాంటి ఘనత సాధించిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లయ్యింది. -
ఎల్ఏసీకి అతి సమీపంలో చైనా యుద్ధ విమానాలు.. భయంతోనే అలా!
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో యుద్ధ విమానాలలో చక్కర్లు కొడుతోంది. గత మూడ్నాలుగు వారాల్లో భారత సైన్యాన్ని కవ్వించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. భారత రక్షణ యంత్రాంగం గుట్టును తెలుసుకునేందుకే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాకు భారత సైన్యం దీటుగా బదులిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్ దేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, భద్రతా ముప్పు వాటిల్లేలా చేసినా క్షణాల్లో తిప్పికొట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నాయి. సరిహద్దుకు అతి సమీపంలో మిగ్ 29, మిరాజ్ 2000 యుద్ధ విమానాలకు మోహరించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉద్రిక్తతలు పెరగకుండా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. భయంతోనే.. అయితే డ్రాగన్ దేశ సైన్యం భయంతోనే యుద్ధ విమానాలతో చక్కర్లు కొడుతున్నట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లద్దాక్ సెక్టార్లో భారత సైన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేసిందని, చైనా సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను అత్యంత సమీపం నుంచి పసిగడుతోందని చెప్పాయి. ఆ భయంతో చైనా యుద్ధ విమానాలతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొన్నాయి. జూన్ 24-25 మధ్య చైనా కవ్వింపు చర్యలు మొదలయ్యాయని, జులై 17న ఇరు దేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ కూడా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు సమాచారం. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
ఫైటర్ జెట్‌తో ప్రధాని విన్యాసాలు.. సెల్ఫీ వీడియో.. నెటిజన్ల ఫైర్!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ దృశ్యాలు సోమవారం విడుదల చేసింది డౌనింగ్ స్ట్రీట్. తన మాస్క్ ధరించి ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. 'ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్షైర్లోని ఆర్ఏఎఫ్ కానింగ్స్బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో ఎగురుతున్నారు.' అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఐటీవీ ప్రకారం.. గత వారం లింకన్షైర్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బేస్‌లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్‌లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్‌రైడ్‌లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు. విశ్వాస పరీక్షలో విజయం.. మరోవైపు.. ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు బోరిస్ జాన్సన్. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. భారత సంతతి వ్యక్తి, ఆ దేశా మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. ఇదీ చదవండి: Rishi Sunak.. పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! -
45 రోజుల్లో ఏడంతస్తుల భవనం
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డీఆర్డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు. -
Purvanchal Expressway: విమానాలకు రన్‌వేగా..
లక్నో: దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని భారత ప్రధాని నరేంద్రమోది నవంబర్ 16న ప్రారంభించనున్నారు. పైగా లక్నోలోని చాంద్ సరాయ్లో మొదలుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌వే 340 కిలోమీటర్ల పొడవుతో ఘాజీపూర్ జిల్లాలోని హైదరియా గ్రామంలో ముగుస్తుంది. అంతేకాదు ఇది అజంగఢ్, బారాబంకి, అమేథి, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్‌నగర్, ఘాజీపూర్, మౌ గుండా తదితరప్రాంతాలను కలుపుతూ వెళుతుంది. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే భారత వైమానిక దళానికి చెందిన విమానాలకు అత్యవసర రన్‌వేగా కూడా ఉపయోగించటమే కాక అత్యవసర పరిస్థితుల్లో ఐఏఎఫ్‌కి చెందిన ఫైటర్ జెట్లకు కూడా ఎయిర్‌స్ట్రిప్( అత్యవసర ల్యాండింగ్ కోసం తాత్కాలిక స్టేషన్)గా కూడా ఉపయోగడనుంది. (చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు) -
పారిస్‌లో భారీ పేలుడు
పారిస్: ఫ్రాన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. దేశ రాజధానిలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పారిస్, దాని చుట్టు పక్కల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరం అంతటా ఈ శబ్దం వినిపించింది అంటే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే పేలుడు మూలం మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియ లేదు. ఓ టీవీ న్యూస్ చానెల్ రిపోర్టు ప్రకారం యుద్ధ విమానం కూలి పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి మిగ్-23 విమానం
లక్నో: ఓఎల్ఎక్స్లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్ విగ్రహం..!) ఇంతటి చరిత్ర కలిగిన ఈ మిగ్-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్ఎక్స్లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్సైట్ నుంచి తీసేశామని తెలిపారు. -
కూలిన పాక్ విమానం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్ చేస్తున్న ఎయిర్‌ఫోర్స్ ఎఫ్-16 యుద్ధవిమానం బుధవారం ఇస్లామాబాద్‌లో కుప్పకూలిందని ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి వెల్లడించారు. మార్చి 23న జరిగే పరేడ్, ఎయిర్ షో కోసం అమెరికన్ తయారీ ఎఫ్-16 విమానం రిహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ ప్రతినిధి తెలిపారు. విమానం కుప్పకూలడంతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని పాక్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ సిబ్బంది వెళ్లాయని, ప్రమాద కారణాన్ని గుర్తించేందుకు విచారణకు ఆదేశించామని తెలిపింది. చదవండి :పాక్ ఉగ్రవాదులపై దొరబాబు వీరత్వం -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కూలిన పాక్ యుద్ధ విమాన శకలాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16ను భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను కూల్చివేసినట్టు భారత అధికారులు ప్రకటించగా తాజాగా వీటి శకలాలను పాక్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తించారు. పీఓకేలో కూలిన పాకిస్తాన్ ఎఫ్ 16 శకలాలను పాకిస్తాన్ ఏడవ నార్తర్న్ లైట్ ఇన్ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర పాక్ వాయుసేన సిబ్బంది పరిశీలిస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు భారత యుద్ధవిమానాన్ని కూల్చివేసి పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాగా భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత సమసిపోగానే తమ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పాక్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంలో భారత నావికా దళంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. సముద్రాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పెట్రోలింగ్ చేస్తూ మత్స్యకారుల కదలికలనూ గమనిస్తున్నారు. -
సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు
-
భారత గగనతలంలోకి పాక్ విమానాలు!
శ్రీనగర్ : పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులతో తీవ్ర అసహనానికి లోనైన పాకిస్తాన్ బుధవారం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ సెక్టార్‌లోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. కాగా, భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చివేసిందని అధికారులు చెబుతున్నారు. భారత్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో తోకముడిచిన పాకిస్తాన్ తన యుద్ధ విమానాలను తిరిగి తమ గగనతలంలోకి మళ్లించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలను వైమానిక దాడులతో భారత్ నేలమట్టం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అసహనానికి లోనవుతున్న సంగతి తెలిసిందే. భారత్‌కు తమ సత్తా చాటుతామని, సరైన సమయంలో దాడులకు తెగబడతామని పాక్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాటువేసి దొంగ దెబ్బ తీసేందుకూ పాక్ దుర్నీతిని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఎప్పటికప్పుడు పాక్ కుయుక్తులను తిప్పికొడుతూ ఎలాంటి పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విమానాశ్రయాల్లో హైఅలర్ట్ భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లీ, జమ్మూ, శ్రీనగర్, పఠాన్‌కోట్ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఆయా గగనతలాల పరిధిలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకుల విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. పలు కమర్షియల్ విమానాల సర్వీసులను కూడా పెండింగ్‌లో ఉంచారు. మరోవైపు ఉడీ, పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పలువురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి. -
యూపీలో కుప్పకూలిన యుద్ధవిమానం
లక్నో : భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం సోమవారం యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్ ప్రాంతం వద్ద కూలిపోయింది. విమాన ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జాగ్వర్ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఎయిర్‌ఆఫీసర్ కమాండింగ్ సంజయ్ చౌహాన్ మరణించారు. -
గాల్లోనే ఇంధనం నింపుకున్న తేజస్
బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ‘ఎఫ్–16’ రెక్కల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరం మరో రికార్డును నమోదు చేయబోతోంది. అమెరికాకు చెందిన రక్షణ , ఏరోస్పేస్, టెక్నాలజీ దిగ్గజం లాఖీడ్ మార్టిన్... ఎఫ్–16 ఫైటర్ జెట్ల రెక్కల తయారీని హైదరాబాద్‌లో చేపట్టబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారు. 2020 చివరి నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో (టీఏఎస్ఎల్) భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు లాఖీడ్ వెల్లడించింది. టీఏఎస్‌ఎల్‌కు హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం దగ్గరి ఏరోస్పేస్ హార్డ్‌వేర్ పార్క్‌లో తయారీ కేంద్రం ఉంది. ప్రస్తుతం ఎఫ్–16 విమాన రెక్కలు ఇజ్రాయెల్‌లో రూపొందుతున్నాయి. ఎఫ్–16 వింగ్స్‌ను ఇకపై పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని లాఖీడ్ నిర్ణయించడం విశేషం. జేవీ ఆధ్వర్యంలో..: లాఖీడ్ మార్టిన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇప్పటికే సంయుక్త భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. టాటా లాఖీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ పేరుతో ఏర్పాటైన ఈ కంపెనీ టర్బోప్రాప్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సి–130 విడిభాగాలను రూపొందిస్తోంది. ఎస్–92 హెలికాప్టర్ల క్యాబిన్లు సైతం హైదరాబాద్ ప్లాంటులో తయారవుతున్నాయి. ఎఫ్–16 ఫైటర్ జెట్స్ రెక్కల తయారీ గురించి లాఖీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ స్పందిస్తూ... అడ్వాన్స్డ్ డిఫెన్స్ రంగంలో టాటాల సామర్థ్యంపై తమకున్న నమ్మకానికిది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు యూఎస్ ఎయిర్ఫోర్స్సహా 28 దేశాలు ఎఫ్–16 రకం 4,604 విమానాలను కొనుగోలు చేశాయి. -
హిమాచల్‌లో కుప్పకూలిన యుద్ధవిమానం
సిమ్లా : భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం కూలిపోయింది. పంజాబ్‌లోని పటాన్‌కోట్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా జిల్లాలోని జవాలి సబ్ డివిజన్ పట్టా జతియన్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదం నేపథ్యంలో పైలట్ గల్లంతయ్యారని ప్రాథమిక వివరాలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. కాగా భారత వాయుసేన యుద్ధవిమానం కూలిన ఘటన ఇటీవల ఇది మూడవది కావడం గమనార్హం. గత నెలలో గుజరాత్, మహారాష్ట్రలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. జూన్ 5న జామ్‌నగర్ ఎయిర్ బేస్‌లో బయలుదేరిన జాగ్వర్ యుద్ధ విమానం కచ్ జిల్లాలో కూలిపోవడంతో సీనియర్ అధికారి మరణించారు. ఇక జూన్ 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ద్రాక్ష తోటలో సుఖోయ్-30 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. -
విమానాన్ని వెంటాడిన ఏలియన్స్..!!
న్యూ హ్యాంప్‌షైర్ : యుద్ధవిమానాన్ని ఏలియన్స్ వెంటాడాయా?. సోషల్‌మీడియాలో షేర్ అవుతోన్న కొన్ని ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. యూఎఫ్ఓ జెట్ ప్లేన్‌ను వెంటాడినట్లు కాన్స్పిరసీ థియరిస్టులు చెబుతున్నారు. కొద్దిసేపు యుద్ధ విమానాన్ని వెంబడించిన యూఎఫ్ఓ తర్వాత దాన్ని ఓవర్టేక్ చేసింది. న్యూ హ్యాంప్‌షైర్‌లో ఆకాశ అందాలను చిత్రిస్తున్న ఫొటోగ్రాఫర్ కెమెరాకు ఈ ఫొటోలు చిక్కాయి. 10 సెకన్ల పాటు ఈ దృశ్యం కనిపించిందని అనంతరం చెట్లు అడ్డు వచ్చాయని కెమెరామెన్ పేర్కొన్నారు.