
యూపీలో కూలిన యుద్ధ విమానం
లక్నో : భారత వాయుసేనకు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం సోమవారం యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్ ప్రాంతం వద్ద కూలిపోయింది. విమాన ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
కాగా గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జాగ్వర్ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌గా ఉన్న వాయుసేన పతక గ్రహీత, జామ్‌నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఎయిర్‌ఆఫీసర్ కమాండింగ్ సంజయ్ చౌహాన్ మరణించారు.