సాక్షి, న్యూఢిల్లీ : భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16ను భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను కూల్చివేసినట్టు భారత అధికారులు ప్రకటించగా తాజాగా వీటి శకలాలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో గుర్తించారు. పీఓకేలో కూలిన పాకిస్తాన్ ఎఫ్ 16 శకలాలను పాకిస్తాన్ ఏడవ నార్తర్న్ లైట్ ఇన్‌ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర పాక్ వాయుసేన సిబ్బంది పరిశీలిస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు భారత యుద్ధవిమానాన్ని కూల్చివేసి పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత సమసిపోగానే తమ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పాక్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంలో భారత నావికా దళంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. సముద్రాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పెట్రోలింగ్ చేస్తూ మత్స్యకారుల కదలికలనూ గమనిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment